18-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు చెప్పుడు మాటలను విశ్వసించకండి,
ఒకవేళ ఎవరైనా తప్పుడు మాటలను వినిపించినట్లయితే, ఒక చెవితో విని ఇంకొక చెవితో
వదిలేయండి’’
ప్రశ్న:-
ఏ పిల్లలైతే
జ్ఞానము యొక్క సంతోషములో ఉంటారో, వారి గుర్తులేమిటి?
జవాబు:-
వారు పాత కర్మ
భోగము యొక్క లెక్కాచారాలను ఆ సంతోషములో మర్జ్ చేస్తూ (ఇముడ్చుకుంటూ) వెళ్తారు.
జ్ఞానము యొక్క సంతోషములో తమ దుఃఖాన్ని, బాధను మరియు దుఃఖపు ప్రపంచాన్నే మర్చిపోతారు.
వారి బుద్ధిలో ఉంటుంది - ఇప్పుడైతే మేము సంతోషమయమైన ప్రపంచములోకి వెళ్తున్నాము,
రావణుడు శపించి దుఃఖితులుగా చేసాడు, ఇప్పుడు తండ్రి ఆ దుఃఖమయమైన, బాధ యొక్క ప్రపంచము
నుండి బయటకు తీసి సంతోషమయమైన ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు.
పాట:-
మిమ్మల్ని
పొంది మేము సర్వస్వాన్ని పొందాము...
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. తప్పకుండా పిల్లల రోమాలు
నిక్కబొడుచుకోవాలి ఎందుకంటే సంతోషానికి మించిన ఔషధము లేదని అంటూ ఉంటారు. ఇప్పుడు
ఆత్మిక పిల్లలైన మీ అందరికీ అనంతమైన తండ్రి లభించారు. అనంతమైన తండ్రి అయితే ఒక్కరే
ఉంటారు. వేరే పిల్లలు తయారైనప్పుడు, వారికి కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయని
పిల్లలకు తెలుసు. మన రాజ్యముండేదని, తర్వాత రాజ్యాన్ని పోగొట్టుకున్నామని, ఇప్పుడు
మళ్ళీ రాజ్యాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. భారతవాసులకు ఇది శుభవార్త కదా. కానీ ఈ
విషయాలను బాగా విని, అర్థం చేసుకున్నప్పుడే అది శుభవార్తగా అవుతుంది. నిజంగా ఇది
సంతోషము కలిగించే విషయము కదా, కల్ప-కల్పము తండ్రి వస్తారు. తండ్రి జన్మ గురించి కూడా
ఇక్కడే తలచుకుంటూ ఉంటారు. పండుగలన్నీ కూడా ఈ సమయానికి చెందినవే. తండ్రి వచ్చి మీకు
చాలా సహజమైన మార్గాన్ని తెలియజేశారు. మనుష్యులకైతే అనేక రకాల బాధలు ఉన్నాయి, ఇక్కడ
ఈ జ్ఞానము యొక్క సంతోషములో ఆ బాధ, దుఃఖము మొదలైనవన్నీ మర్జ్ అయిపోతాయి. ఉదాహరణకు
అనారోగ్యము కలవారు ఎవరికైనా నయమవుతూ ఉంటే, అందరికీ సంతోషము కలుగుతుంది, అనారోగ్యము
మొదలైన దుఃఖపు విషయాలన్నింటినీ మర్చిపోతారు. పుట్టింటివారు, మెట్టినింటివారు,
మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరూ సంతోషపడతారు. మనమంతా విశ్వానికి యజమానులుగా
ఉండేవారమని, తర్వాత రావణుడు శపించాడని పిల్లలైన మీకు తెలుసు. ఇది బాధ మరియు దుఃఖము
యొక్క ప్రపంచము. రేపు మళ్ళీ సంతోషమయమైన ప్రపంచము ఉంటుంది. సంతోషమయమైన ప్రపంచము
గుర్తుంటే, బాధ, దుఃఖము మొదలైనవన్నీ మర్చిపోవాలి. ఇది తమోప్రధాన ప్రపంచము. ఇక్కడ
రకరకాల కర్మభోగాలు ఉన్నాయి. అబలలపై కూడా ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. అనేక రకాల
విఘ్నాలు వస్తాయి. ఈ విఘ్నాలు మరియు కర్మభోగపు రోజులు ఇంకా కొంత సమయమే ఉంటాయి. ఇంకా
కొన్ని రోజులే ఉన్నాయని తండ్రి ఓదార్పును ఇస్తున్నారు. కల్పక్రితం కూడా ఇలాగే
జరిగింది. కర్మభోగపు లెక్కాచారాలు సమాప్తమవ్వాలి. సంతోషములో వీటన్నింటినీ మర్జ్
చేస్తూ వెళ్ళండి. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. తప్పుడు
పనులేవీ చేయకండి లేదంటే ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది, పదవి భ్రష్టమైపోతుంది. పిల్లల
పని ఒక్క తండ్రినే స్మృతి చేయడము. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ
వికర్మలు వినాశనమైపోతాయి, లెక్కాచారాలు సమాప్తమైపోతాయి. ఇంకా కొంత సమయమే ఉంది.
లెక్కాచారాలను సమాప్తము చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే మీరు అంధులకు చేతికర్ర వంటివారు.
మీరు కూడా స్మృతి చేయండి, ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయండి. విఘ్నాలైతే చాలా
వస్తాయి. తండ్రిని స్మృతి చేయండి అని ఎంత వీలైతే అంత అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి.
ఈ పదాలు కూడా ప్రసిద్ధి గాంచినవే. మన్మనాభవ అనగా - ఓ ఆత్మలు, నన్నొక్కరినే స్మృతి
చేసినట్లయితే మీ గతం యొక్క వికర్మలు భస్మమైపోతాయి. ఇందులో తికమకపడే విషయమేమీ లేదు.
కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు.
మనము 84 జన్మల చక్రములో తిరిగామని మీకు తెలుసు. చక్రములో తిరుగుతూ వచ్చారు, అలా
తిరుగుతూనే ఉంటారు. ఇది పాత ప్రపంచము, పాత వస్త్రము... వీటిని మర్చిపోవాలి. ఇది
ఆత్మల అనంతమైన సన్యాసము, వారిది హద్దు సన్యాసము. వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి
వెళ్ళిపోతారు. వారిది కూడా డ్రామాలో పాత్ర ఉంది. మళ్ళీ ఇలానే జరుగుతుంది. ప్రతి
సెకండు ఏదైతే గతించిందో, అది డ్రామా, మళ్ళీ అదే డ్రామా రిపీట్ అవుతుంది.
శాస్త్రాలన్నీ భక్తి మార్గపు పుస్తకాలు. భక్తి తర్వాత జ్ఞానము ఉంటుంది. ఈ మెట్ల
వరుస చిత్రముపై ఎవరికైనా అర్థం చేయించడము చాలా సహజము. ముఖ్యమైన చిత్రాలను మీ ఇంటిలో
కూడా పెట్టుకోవచ్చు. త్రిమూర్తి చిత్రము కూడా చాలా స్పష్టముగా ఉంది. పైన శివుడు కూడా
ఉన్నారు, బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా ఉన్నారు, వారు సూక్ష్మవతన వాసులు, ఆ తర్వాత
ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. తండ్రి నివసించే స్థానమే ఆత్మలమైన మనము కూడా నివసించే
స్థానము అని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు, దానిని నిర్వాణధామము అన్నా లేక
శాంతిధామము అన్నా విషయము ఒక్కటే. శాంతిధామము అనే పేరు సరైనదే. నిర్వాణధామము అనగా
వాణి నుండి అతీతమైన ధామము అనగా అది శాంతిధామము అయినట్లే కదా. అది శాంతిధామము, దాని
తర్వాత సుఖము, శాంతి మరియు సంపదల ధామము ఉంటుంది. ఆ తర్వాత దుఃఖము మరియు అశాంతుల
ధామము ఉంటుంది. సుఖధామములోనైతే అపారమైన ఖజానాలు ఉంటాయి. ఈ రోజు ఏముంది, రేపు
ఏముంటుంది. ఈ రోజు కలియుగాంతము, రేపు సత్యయుగ ఆది. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది
కదా. బ్రహ్మా మరియు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణుల యొక్క పగలు మరియు రాత్రి అని
అంటారు కూడా. పగలులో దేవతలు ఉంటారు. రాత్రిలో శూద్రులు ఉంటారు. మధ్యలో బ్రాహ్మణులైన
మీరు ఉంటారు. ఈ సంగమయుగము గురించి ఎవరికీ తెలియదు. మనుష్యులైతే పూర్తిగా ఘోర
అంధకారములో ఉన్నారు. వారిని అత్యంత ప్రకాశములోకి తీసుకురావడము పిల్లలైన మీ బాధ్యత.
ఇప్పుడు అదే మహాభారత యుద్ధము ఎదురుగా ఉంది. వినాశ కాలే విపరీత బుద్ధి వినశ్యంతి,
వినాశ కాలే ప్రీతి బుద్ధి విజయంతి అని అంటూ ఉంటారు కూడా.
బాబా మనకు మళ్ళీ అదే రాజ్యాన్ని ఇస్తారని పిల్లలైన మీకు తెలుసు. మన ఆ రాజ్యాన్ని
ఎవ్వరూ లాక్కోలేరు. రావణుడి ప్రవేశము ద్వాపరము నుండి జరుగుతుంది. రావణుడు మన
రాజ్యాన్ని లాక్కున్నాడు, అతడిని శత్రువుగానే భావించండి ఎందుకంటే శత్రువుదే దిష్టి
బొమ్మను తయారుచేసి కాలుస్తారు. ఇతడు చాలా పాత శత్రువు. రావణ రాజ్యము అని అంటారు కూడా,
కానీ ఈ విషయము ఎవరి బుద్ధిలోకి రాదు. మరి ఘోర అంధకారమనే అంటారు కదా. అనంతమైన తండ్రి
నాలెడ్జ్ ఫుల్. వారిని జ్ఞాన దాత, దివ్య చక్షు విధాత అని అంటారు. ఇప్పుడు ఆత్మలైన
మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. ఇంతకుముందైతే మీకు ఏమీ తెలియదు. ఇప్పుడు
అంతా తెలుసుకున్నారు. తండ్రి జ్ఞాన సాగరుడు కనుక తప్పకుండా జ్ఞానాన్ని వినిపిస్తారు
కదా. జ్ఞానమనేది వినిపించకుండా ఎలా ఋజువవుతుంది! తండ్రి జ్ఞానాన్ని వినిపించడాన్ని
మీరు చూస్తారు. ఈ జ్ఞానముతో అర్ధకల్పము సద్గతి లభిస్తుంది. భక్తియే అర్ధకల్పము
నడుస్తుంది. జ్ఞానము ద్వారా సద్గతి సంగమములోనే లభిస్తుంది. పిల్లలకు సంబంధించిన ఏ
విషయమైనా ఎప్పుడు దాగి ఉండలేదు. తండ్రి అంటారు, ఏదైనా చెడు కర్మ జరిగితే చెప్పండి.
చాలామంది ద్వారా చెడు కర్మలు జరుగుతూ ఉంటాయని బాబాకు తెలుసు. ఇది రావణ రాజ్యము కదా.
మాయ చెంపదెబ్బ కొడుతుంది. కానీ చాలామంది దాచిపెడతారు. బాబా అంటారు - ఏదైనా పొరపాటు
జరిగినప్పుడు వెంటనే చెప్తే భవిష్యత్తు కోసం యుక్తి లభిస్తుంది, లేకపోతే వృద్ధి
జరుగుతూ ఉంటుంది. కామము మహాశత్రువు. బాబా, మాయ నుండి చాలా అపోజిషన్ ఉంటుందని బాబాకు
వ్రాస్తారు. మాయ నుండి రక్షించబడేలా ఎవ్వరికీ యోగమైతే సదా ఉండటము లేదు. దేహాభిమానము
చాలా వస్తుంది. చాలామంది మాయతో చెంపదెబ్బను తింటారు. బాబా వద్దకు సమాచారాలైతే అన్ని
వైపుల నుండి వస్తూ ఉంటాయి కదా. వార్తాపత్రికలు మొదలైనవాటిలోనైతే ఎంత తప్పుగా
వ్రాస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనుష్యులు ఎన్ని విషయాలనైనా కల్పించగలరు, తమోప్రధానముగా
ఉన్నారు కదా. వ్యాసుని బుద్ధి రజోగా ఉన్నప్పుడు ఏవేవో విషయాలను వ్రాసేశారు. తండ్రి
పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఎప్పుడూ చెప్పుడు మాటలను విశ్వసించి డిస్టర్బ్
అవ్వకండి. ఫలానావారు ఇలా అన్నారు, ఇలా చేసారు... వీటితో తల తిరిగిపోతుంది. ఇది
తమోప్రధాన ప్రపంచమని అర్థం చేసుకోరు. మాయ పడేసేందుకు ప్రయత్నము చేస్తుంది. ఎవరైనా
అసత్యమైన విషయాలను వినిపించినట్లయితే, వాటిని ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయండి.
ఇతరులకు కూడా ఇదే సందేశాన్ని ఇస్తూ ఉండండి. తండ్రి అంటారు - నేను సందేశాన్ని
తీసుకువస్తాను. ఓ ఆత్మలూ, ఇప్పుడు శ్రీమతముపై నడవండి, నా సందేశాన్ని వినండి, కేవలం
నన్నొక్కరినే స్మృతి చేయండి. ఎవరైతే స్మృతి చేస్తారో, వారు తమ కళ్యాణాన్నే
చేసుకుంటారు. స్మృతి చేయాల్సింది ఆత్మయే, మర్చిపోయింది కూడా ఆత్మయే. ఇప్పుడు తండ్రి
శ్రీమతము లభిస్తుంది. ఇందులో ఆశీర్వాదాలు లేక దయ మొదలైనవేవీ అడగకూడదు. కేవలం
తండ్రిని స్మృతి చేయాలి. ఇంకే విషయాన్ని అడగాల్సిన అవసరము కూడా లేదు. సృష్టి చక్రము
ఎలా తిరుగుతుంది అనేది విన్నారు. ఇందులో వివాదమేమీ లేదు. ఘోర అంధకారములోనే తండ్రి
వస్తారు. అందుకే శివరాత్రిని జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జన్మను కూడా రాత్రివేళ
జరుపుకుంటారు. ఆ రోజు మందిరాలలో ఖీర్-పూరీ మొదలైనవి రాత్రివేళ తయారుచేస్తారు.
ఇప్పుడు శివుని కోసం ఏం తయారుచేస్తారు? వారు ఉన్నదే నిరాకారుడు. బాబా ఏ ఘడియలో
వస్తారు మరియు ఎలా వెళ్ళిపోతారు అనేది ఎవరికీ తెలియదు కూడా. వీరిపై సదా సవారీ చేయరు
కదా. వస్తారు మరియు వెళ్ళిపోతారు. మనము శివబాబాకు మనవలమని ఇప్పుడు మీకు తెలుసు.
వారసత్వము వారి నుండి లభిస్తుంది. బ్రహ్మాకు కూడా వారసత్వము వారి నుండే లభిస్తుంది.
వీరైతే మానవుడే కదా. సద్గతిలో మొదటి నంబరువారు ఈ శ్రీకృష్ణుడు. వీరు అందరికీ
ప్రియమైనవారు ఎందుకంటే సతోప్రధాన బాల్యావస్థలో ఉన్నారు కదా. కొంచెం పెద్దవారైతే
వారిని సతో అని అంటారు. తర్వాత రజో, తమో స్థితులు ఉంటాయి. శ్రీకృష్ణుడు, రాధయే
తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. తండ్రి ఎవరికైతే జ్ఞానాన్ని ఇచ్చారో, వారికే
మళ్ళీ ఇస్తారు. భారత్ లోనే దేవీ-దేవతలు ఉండి వెళ్ళారు కనుక మందిరాలు కూడా భారత్ లోనే
చాలా ఉన్నాయి. క్రిస్టియన్ల చర్చిలలో ఎక్కడ చూసినా క్రైస్టే క్రైస్టు కనిపిస్తూ
ఉంటారు. దేవతలకు ఎన్ని మందిరాలు ఉన్నాయి. తండ్రి మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా
తయారుచేయడానికి మరియు భారత్ ను స్వర్గముగా తయారుచేయడానికి వచ్చారు. మనము తండ్రిని
స్మృతి చేస్తూ పావనముగా అవుతున్నాము. తండ్రితో పాటు మనము కూడా భారత్ ను స్వర్గముగా
తయారుచేస్తున్నాము. మనము తండ్రితో పాటు వచ్చినట్లుగా ఉంది. భక్తి మార్గములో దేవతల
మందిరాలు, మూర్తులు మొదలైనవాటిని ఎంత ఖర్చుపెట్టి తయారుచేస్తారు. వాటిని ఉత్పత్తి
చేసి, పాలన చేసి, ఆ తర్వాత వినాశనము చేసేస్తారు. 9 రోజుల్లోపే నిమజ్జనము చేసేస్తారు.
వాటి పట్ల చాలా ప్రేమ ఉంటుంది. నవరాత్రులను కలకత్తాలో చాలా బాగా జరుపుకుంటారు. ఈ
విషయాలన్నీ చూస్తే ఇప్పుడు విచిత్రముగా అనిపిస్తుంది. ఇంతకుముందైతే మనము కూడా ఆ
పాత్రను అభినయించాము. కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తారు. ఇది ఎంతటి అంధవిశ్వాసము.
రామాయణము పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. ఆ విషయాలను వింటూ కళ్ళ నుండి కన్నీరు వచ్చేస్తుంది.
అదంతా భక్తి మార్గము. వాటి వలన లాభమేమీ ఉండదు. బాబా ఇప్పుడు మనల్ని ఎంత
తెలివైనవారిగా తయారుచేస్తారు. అయితే, బాబా చెప్పిన విషయాలన్నింటినీ విని ఇక్కడి
విషయాలను ఇక్కడే మర్చిపోకండి, అన్ని విషయాలను గుర్తుంచుకోండి. పూర్తిగా రిఫ్రెష్
అయ్యి వెళ్ళండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహ సహితముగా ఏదైతే చూస్తున్నారో, అంతా
మర్చిపోండి. ఇదంతా శ్మశానవాటికగా ఉంది. ఢిల్లీలోని బిర్లా మందిరములో - భారత్
పరిస్తాన్ గా ఉండేది, దానిని ధర్మరాజు స్థాపన చేసారు అని వ్రాసి ఉంది. ఈ ప్రపంచము
శ్మశానవాటికగా అవ్వనున్నదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు.
తండ్రి అంటారు, అందరూ కామ చితిపై కూర్చుని పూర్తిగా కాలి మరణించారు. క్రోధ చితి అని
అనరు. కామ చితి అని అంటారు. అందులో కూడా తేలికపాటి నషా, సెమీ నషా అని కూడా ఉంటాయి.
తండ్రి కూర్చుని పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. ఇంటిలో ఒకవేళ ఎవరైనా కుపుత్రుడు
ఉంటే - తండ్రి పరువును ఎందుకు పోగొడుతున్నావు అని అతడిని అంటారు కదా. తండ్రి పరువు
పోతుంది కదా. అనంతమైన తండ్రి కూడా అంటారు - మీరు నల్ల ముఖము చేసుకుంటే దేవతలుగా
అయ్యే బ్రాహ్మణ కుల భూషణుల పేరును పాడు చేస్తారు. మనము పవిత్రతా శక్తితోనే భారత్ ను
మళ్ళీ శేష్ఠాచారీ దేవతగా తయారుచేస్తామని పిల్లలైన మీకు తెలుసు. మీకైతే ఇది
సామాన్యమైన విషయము. మహాభారత యుద్ధము కూడా నిలబడి ఉండటాన్ని మీరు చూస్తారు, దాని
ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. శాస్త్రాలలో మహాభారత యుద్ధాన్ని అయితే
చూపించారు కానీ దాని తర్వాత ఏమి జరిగింది అనేది చూపించలేదు. ప్రళయము జరిగిందని
అనేస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుని గురించి ఒకవైపు తల్లి గర్భము ద్వారా జన్మ
తీసుకున్నట్లుగా చూపించారు, మరోవైపు రావి ఆకుపై బొటనవేలు నోటిలో పెట్టుకుని
చప్పరిస్తూ వచ్చారని అంటారు. ఏమీ అర్థం చేసుకోరు. అక్కడైతే గర్భ మహలులో చాలా
ప్రశాంతముగా ఉంటారు. ఇకపోతే, సాగరములో ఆకుపై ఉండటమనేది జరగదు. ఇది అసంభవము. ఇదంతా
డ్రామాలో ఈ విధముగా తయారుచేయబడి ఉంది. దీని గురించి మీకు తెలుసు. కల్ప-కల్పము ఇలాగే
జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు తమ కళ్యాణాన్ని చేసుకోవాలి మరియు ఇతరుల
కళ్యాణాన్ని కూడా చేయాలి. ముఖ్యమైన విషయము ఇదే. తండ్రి అయితే స్వర్గ రచయిత. వారిని
హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు కనుక పిల్లలైన మనము స్వర్గానికి యజమానులుగా ఉండాలి
కదా. శివ జయంతిని కూడా భారత్ లోనే జరుపుకుంటారు, అంటే వారు తప్పకుండా భారత్ కు ఏదో
ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు కదా. తండ్రి ఉన్నదే
సద్గతిదాత, జ్ఞానసాగరుడు, జ్ఞానాన్ని తండ్రియే వచ్చి ఇస్తారు. ఇప్పుడు తండ్రి మీకు
జ్ఞానాన్ని ఇస్తున్నారు. 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఎవరెవరైతే
ఈ బ్రాహ్మణ కులానికి చెందినవారిగా ఉంటారో, వారు వస్తూ ఉంటారని పిల్లలకు నిశ్చయముంది.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శ్రీమతాన్ని అనుసరిస్తూ తమ కళ్యాణాన్ని మరియు ఇతరుల కళ్యాణాన్ని చేయాలి.
ఎవరైనా ఏవైనా అసత్యమైన విషయాలను వినిపిస్తే, విని విననట్లుగా వదిలేయాలి. వాటి వల్ల
డిస్టర్బ్ అవ్వకూడదు.
2. ఎప్పుడూ కూడా దేవతలుగా అయ్యే బ్రాహ్మణ కుల భూషణుల పేరు పాడవ్వకూడదు - దీని
పట్ల అటెన్షన్ పెట్టాలి. ఎటువంటి తప్పుడు కర్మలను ఎప్పుడూ చేయకూడదు. పాత
లెక్కాచారాలను సమాప్తము చేసుకోవాలి.
వరదానము:-
నషా మరియు లక్ష్యము యొక్క స్మృతితో సర్వ కర్మేంద్రియాలను
ఆర్డర్ అనుసారముగా నడిపించే కిరీటధారి మరియు సింహాసనాధికారి భవ
సంగమయుగములో బాప్ దాదా ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు
సింహాసనము ప్రాప్తిస్తాయి. పవిత్రతా కిరీటము కూడా ఉంది మరియు బాధ్యతా కిరీటము కూడా
ఉంది, అలాగే అకాల సింహాసనము కూడా ఉంది మరియు మీరు హృదయ సింహాసనాధికారులు కూడా.
ఎప్పుడైతే ఇటువంటి డబల్ కిరీటధారులుగా మరియు డబల్ సింహాసనాధికారులుగా అవుతారో,
అప్పుడు నషా మరియు లక్ష్యము స్వతహాగా గుర్తుంటాయి. అప్పుడు ఈ కర్మేంద్రియాలు జీ
హజూర్ (చిత్తం ప్రభూ) అని అంటాయి. ఎవరైతే కిరీటాన్ని మరియు సింహాసనాన్ని వదిలేస్తారో,
వారి ఆర్డర్ ను కర్మచారులెవరూ పాటించరు.
స్లోగన్:-
బలహీన
సంకల్పాలే ప్రసన్నచిత్తులకు బదులుగా ప్రశ్నచిత్తులుగా చేసేస్తాయి.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
ఈశ్వరీయ సేవలో అతి
పెద్ద పుణ్యము - పవిత్రతను దానము ఇవ్వటము. పవిత్రముగా అవ్వటము మరియు పవిత్రముగా
తయారుచెయ్యటమే పుణ్యాత్మగా అవ్వటము ఎందుకంటే ఏ ఆత్మనైనా ఆత్మహత్య అనే మహాపాపము నుండి
విముక్తులుగా చేస్తారు. అపవిత్రత ఆత్మహత్య వంటిది. పవిత్రత ప్రాణ దానము వంటిది.