18-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పతిత-పావనుడైన తండ్రి శ్రీమతాన్ని
అనుసరిస్తూ మీరు పావనముగా అవుతారు, అందుకే, మీకు పావన ప్రపంచము యొక్క రాజ్యాధికారము
లభిస్తుంది, తమ సొంత మతాన్ని అనుసరిస్తూ పావనముగా అయ్యేవారికి ఎటువంటి ప్రాప్తి
ఉండదు’’
ప్రశ్న:-
పిల్లలు సేవ
చేసేటప్పుడు విశేషముగా ఏ విషయము పట్ల అటెన్షన్ పెట్టాలి?
జవాబు:-
సేవ చేయడానికి
వెళ్ళినప్పుడు, పరస్పరములో ఎప్పుడూ చిన్న-చిన్న విషయాలలో అలగకండి అనగా
కోపగించుకోకండి. ఒకవేళ పరస్పరములో ఉప్పునీరులా అయితే, మాట్లాడుకోకపోతే డిస్సర్వీసుకు
నిమిత్తులు అవుతారు. కొంతమంది పిల్లలైతే తండ్రిపై కూడా అలుగుతారు. తప్పుడు కర్మలు
చేయడము మొదలుపెడతారు. అప్పుడిక అటువంటి పిల్లల యొక్క దత్తతే రద్దు చేయబడుతుంది.
ఓంశాంతి
పతిత-పావనుడైన తండ్రి కూర్చుని పావనముగా అయ్యే పిల్లలకు అర్థం చేయిస్తారు. పతితులైన
పిల్లలే పావనముగా తయారుచేసే తండ్రిని పిలుస్తారు. దీనిని డ్రామా ప్లాన్ అని కూడా
అంటారు. ఇది రావణ రాజ్యము అయిన కారణముగా మనుష్యులందరూ పతితముగా ఉన్నారు. ఎవరైతే
వికారాల్లోకి వెళ్తారో, వారిని పతితులని అంటారు. వికారాల్లోకి వెళ్ళనివారు చాలామంది
ఉన్నారు. వారు బ్రహ్మచారులుగా ఉంటారు. మేము నిర్వికారులమని భావిస్తారు. ఉదాహరణకు
ఫాదర్లు, ముల్లాలు (ముస్లిమ్ ప్రవక్తలు), కొందరు బౌద్ధులు కూడా, ఇలా పవిత్రముగా
ఉండేవారు ఉంటారు. వారిని పవిత్రముగా ఎవరు తయారుచేసారు? స్వయము వారే తయారయ్యారు.
వికారాల్లోకి వెళ్ళనివారు ప్రపంచములో ఇతర ధర్మాలలో కూడా చాలామంది ఉన్నారు. కానీ
వారిని పతిత-పావనుడైన తండ్రి పావనముగా చేయరు కదా. అందుకే వారు పావన ప్రపంచానికి
యజమానులుగా అవ్వలేరు, వారు పావన ప్రపంచములోకి వెళ్ళలేరు. సన్యాసులు కూడా పంచ
వికారాలను వదిలేస్తారు. కానీ వారి చేత సన్యాసము చేయించింది ఎవరు? పతిత-పావనుడైన
పరమపిత పరమాత్మ అయితే సన్యాసము చేయించలేదు కదా. పతిత-పావనుడైన తండ్రి లేకుండా సఫలత
ఉండదు, పావన ప్రపంచమైన శాంతిధామానికి వెళ్ళలేరు. ఇక్కడైతే తండ్రి వచ్చి మీకు
పావనముగా అయ్యేందుకు శ్రీమతాన్ని ఇస్తారు. సత్యయుగాన్ని నిర్వికారీ ప్రపంచమని అంటారు.
అంటే, సత్యయుగములోకి వచ్చేవారు తప్పకుండా పవిత్రముగా ఉంటారని దీనితో ఋజువవుతుంది.
సత్యయుగములో కూడా పవిత్రముగా ఉండేవారు. శాంతిధామములో కూడా ఆత్మలు పవిత్రముగా ఉంటారు.
ఈ రావణ రాజ్యములో అందరూ పతితముగానే ఉన్నారు. పునర్జన్మలనైతే తీసుకోవాల్సిందే.
సత్యయుగములో కూడా పునర్జన్మలు తీసుకుంటారు కానీ వికారాల ద్వారా కాదు. అది ఉన్నదే
సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. త్రేతాలో 2 కళలు తగ్గిపోతాయి కానీ వారిని వికారులు అని
అనరు. భగవాన్ శ్రీ రామ, భగవతి శ్రీ సీత అని అంటారు కదా. ముందు 16 కళలు ఉంటాయి, ఆ
తర్వాత 14 కళలు అని అంటారు. చంద్రుని విషయములో కూడా ఇలాగే జరుగుతుంది కదా.
పతిత-పావనుడైన తండ్రి వచ్చి పావనముగా చేయనంతవరకు ఎవరూ ముక్తి-జీవన్ముక్తులలోకి
వెళ్ళలేరని దీనితో ఋజువవుతుంది. తండ్రియే గైడ్. ఈ ప్రపంచములో పవిత్రముగా ఉండేవారైతే
చాలామంది ఉన్నారు. సన్యాసులకు కూడా పవిత్రత కారణముగా గౌరవముంటుంది. కానీ వారు తండ్రి
ద్వారా పవిత్రముగా అవ్వరు. మనల్ని పావనముగా తయారుచేసేవారు నిరాకార పరమపిత పరమాత్మ
అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మిగతా వారు తమ సొంత మతమనుసారముగా పవిత్రముగా
అవుతారు. మీరు తండ్రి ద్వారా పవిత్రముగా అవుతారు. పతిత-పావనుడైన తండ్రి ద్వారానే
పావన ప్రపంచము యొక్క వారసత్వము లభిస్తుంది.
తండ్రి అంటారు
- ఓ పిల్లలూ, కామము మీకు మహాశత్రువు, దీనిని జయించండి, పడిపోవడము కూడా ఇందులోనే
పడిపోతారు. మేము క్రోధము చేసాము కనుక నల్ల ముఖము చేసుకున్నాము అని ఇలా ఎప్పుడూ
వ్రాయరు. మేము నల్ల ముఖము చేసుకున్నాము, పడిపోయాము అని కామము గురించే వ్రాస్తారు. ఈ
విషయాల గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి తెలియదు. డ్రామానుసారముగా
ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యేది ఉంటుందో, వారు వస్తూ ఉంటారు. ఇతర సత్సంగాలలోనైతే అసలు
ఎటువంటి లక్ష్యము-ఉద్దేశ్యము ఉండదు. శివానందుడు మొదలైనవారికి ఫాలోవర్స్ అయితే
చాలామంది ఉన్నారు కానీ వారిలో కూడా ఎవరో కొంతమంది మాత్రమే సన్యాసము తీసుకుంటూ
ఉండవచ్చు. గృహస్థులైతే అసలు సన్యాసము తీసుకోనే తీసుకోరు. ఇకపోతే ఇళ్ళు-వాకిళ్ళను
వదిలేవారు చాలా కొద్దిమంది మాత్రమే వెలువడుతారు. సన్యాసులుగా అవుతారు కానీ ఎంతైనా
పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని శివానందుని
గురించి అనరు. సర్వుల సద్గతిదాత తండ్రియేనని మీరు అర్థం చేసుకున్నారు, వారే గైడ్.
గైడ్ లేకుండా ఎవరూ వెళ్ళలేరు. మన తండ్రి, తండ్రి కూడా, నాలెడ్జ్ ఫుల్ కూడా అని
పిల్లలైన మీకు తెలుసు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు. మొత్తం మనుష్య సృష్టి యొక్క
ఆదిమధ్యాంతాల జ్ఞానమైతే బీజములోనే ఉంటుంది కదా. ఫాదర్ అనైతే అందరూ అంటారు కదా. మన
గాడ్ ఫాదర్ ఒక్కరేనని పిల్లలకైతే తెలుసు. కావున అందరిపై దయ కూడా ఆ ఫాదర్ కే
కలుగుతుంది కదా. ఎంతమంది మనుష్యులు ఉన్నారు, ఎన్ని జీవ-జంతువులు ఉన్నాయి. అక్కడ
మనుష్యులు తక్కువమంది ఉంటారు కనుక జీవ జంతువులు కూడా కొన్నే ఉంటాయి. సత్యయుగములో
ఇక్కడి లాంటి అశుద్ధత ఉండదు. ఇక్కడైతే అనేక రకాల అనారోగ్యాలు మొదలైనవి ఎన్ని
వెలువడుతూ ఉంటాయి, వాటి కోసం మళ్ళీ కొత్త మందులను కనుగొంటూ ఉంటారు. డ్రామా ప్లాన్
అనుసారముగా అనేక రకాల నైపుణ్యాలు వెలువడుతూ ఉంటాయి. అవన్నీ మనుష్యుల నైపుణ్యాలు.
పారలౌకిక తండ్రి నైపుణ్యమేమిటి? ఓ పతిత-పావనా, మీరు వచ్చి మా ఆత్మలను పావనముగా
తయారుచేయండి అని తండ్రి కోసమే అంటారు, అప్పుడు శరీరము కూడా పావనముగా ఉంటుంది.
పతిత-పావనా, దుఃఖహర్త, సుఖకర్త అని ఒక్కరినే పిలుస్తారు కదా. తమ-తమ భాషలలో తప్పకుండా
తలచుకుంటారు. మనుష్యులు మరణించేటప్పుడు కూడా భగవంతుడిని తలచుకుంటారు. ఆ సమయములో
ఇంకెవ్వరూ ఆధారాన్ని అందించలేరని భావిస్తారు. అందుకే గాడ్ ఫాదర్ ను స్మృతి చేయండి
అని అంటారు. క్రిస్టియన్లు కూడా గాడ్ ఫాదర్ ను స్మృతి చేయండి అని అంటారు. క్రైస్టును
స్మృతి చేయండి అని అనరు. క్రైస్టు కంటే గాడ్ గొప్పవారని వారికి తెలుసు. గాడ్ అయితే
అందరికీ ఒక్కరే ఉంటారు కదా. మృత్యులోకమంటే ఏమిటి, అమరలోకమంటే ఏమిటి అనేది ఇప్పుడు
పిల్లలైన మీకు తెలుసు! ఈ విషయము ప్రపంచములో ఇంకెవ్వరికీ తెలియదు. వారు స్వర్గము,
నరకము అన్నీ ఇక్కడే ఉన్నాయని అంటారు. సత్యయుగము ఉండేదని, దేవతల రాజ్యముండేదని
కొంతమంది అనుకుంటారు. ఇప్పటికీ ఎన్ని కొత్త-కొత్త మందిరాలను నిర్మిస్తూ ఉంటారు.
ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ మనల్ని పావనముగా తయారుచేసి తిరిగి మన ఇంటికి
తీసుకువెళ్ళలేరని పిల్లలైన మీకు తెలుసు. మనము మన మధురమైన ఇంటికి వెళ్తున్నామని మీ
బుద్ధిలో ఉంది. తండ్రి మనల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు యోగ్యులుగా చేస్తున్నారు. ఈ
విషయము స్మృతిలో ఉండాలి.
తండ్రి అర్థం
చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు ఇన్ని-ఇన్ని జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మనము
శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము. తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వాలి,
స్వర్గములోకి వెళ్ళాలి. ఇప్పుడిది సంగమము. విరాట రూపములో బ్రాహ్మణుల పిలక స్థానము
ప్రసిద్ధమైనది. హిందువులకు కూడా పిలక గుర్తుగా ఉంటుంది. మనుష్యులైతే మనుష్యులే.
సిక్కులు, ముసల్మానులు మొదలైనవారు ఎలా ఉంటారంటే వారివురి మధ్యన మీకు తేడా తెలియదు.
ఇకపోతే, చైనీయులు, ఆఫ్రికన్ల మధ్యన తేడా తెలుస్తుంది. వారి ముఖ కవళికలు వేరుగా
ఉంటాయి. క్రిస్టియన్లకు భారత్ తో కనెక్షన్ ఉంది కనుక వారు నేర్చుకున్నారు. ధర్మాలలో
ఎన్ని వెరైటీలు ఉన్నాయి. వారి ఆచారాలు-పద్ధతులు, వస్త్రధారణ అన్నీ వేర్వేరుగా ఉంటాయి.
ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది, మనము సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నాము.
అక్కడ ఇంకే ధర్మము ఉండేది కాదు. ఇప్పుడైతే అన్ని వెరైటీ ధర్మాలవారు హాజరై ఉన్నారు.
ఇప్పుడు అంతిమములో ఇంకే ధర్మాన్ని స్థాపన చేస్తారు. కొత్త ఆత్మలు పావనముగా ఉంటారు,
అందుకే కొత్త ఆత్మలు ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఆత్మకు ఎంతోకొంత మహిమ జరుగుతూ ఉంటుంది.
ఎవరైతే చివరిలో వస్తారో, వారికి తప్పకుండా ముందు సుఖము లభిస్తుందని వివేకము
చెప్తుంది. వారి మహిమ జరుగుతుంది, తర్వాత దుఃఖము కూడా ఉంటుంది. వారికి ఒక్క జన్మయే
ఉంటుంది. ఎలాగైతే మీరు సుఖధామములో చాలా కాలం ఉంటారో, అలా వారు శాంతిధామములో చాలా
కాలం ఉంటారు. అంతిమము వరకు చాలా వృద్ధి జరుగుతుంది. వృక్షము పెద్దది కదా. ఈ సమయములో
మనుష్యుల సంఖ్య ఎంతగానో వృద్ధి అవుతూ ఉంటుంది. అందుకే దీనిని ఆపడానికి ఉపాయాలను
వెతుకుతూ ఉంటారు. కానీ వీటి వలన ఏమీ ఆగదు. డ్రామా ప్లాన్ అనుసారముగా తప్పకుండా
వృద్ధి జరగనున్నదని మీకు తెలుసు. కొత్త ఆకులు వస్తూ ఉంటాయి, తర్వాత కొమ్మలు మొదలైనవి
వెలువడుతూ ఉంటాయి. ఎన్ని వెరైటీలు ఉన్నాయి. మనకు ఇంకే కనెక్షన్ లేదని ఇప్పుడు
పిల్లలకు తెలుసు. తండ్రియే మనల్ని పావనముగా తయారుచేస్తారు మరియు సృష్టి
ఆదిమధ్యాంతాల సమాచారాన్ని వినిపిస్తారు. మీరు కూడా - ఓ పతిత-పావనా, మీరు వచ్చి
మమ్మల్ని పావనముగా చేయండి అని వారినే పిలుస్తారు. తప్పకుండా పతిత ప్రపంచము
వినాశనమవుతుంది. ఇది కూడా లెక్కే. సత్యయుగములో కొద్దిమంది మనుష్యులే ఉంటారు.
కలియుగములో ఎంతమంది మనుష్యులు ఉన్నారు. పిల్లలైన మీరు వివరణ కూడా వినిపించాలి.
తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ పాత ప్రపంచము ఇప్పుడు వినాశనమవుతుంది. స్థాపనను
తండ్రియే చేస్తారు. భగవానువాచ - నేను స్థాపన చేయిస్తాను. వినాశనమైతే డ్రామానుసారముగా
జరుగుతుంది. భారత్ లోనే చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మా ద్వారా రచించబడిన
బ్రాహ్మణులు అనగా బ్రహ్మా ముఖవంశావళి ఎంతమంది ఉన్నారో చూడండి. ఆ బ్రాహ్మణులు గర్భము
ద్వారా రచించబడినవారు. వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు. మీకిప్పుడు ఉత్సాహము
కలిగింది. ఇప్పుడు కలియుగము వినాశనమై సత్యయుగము రానున్నదని మీకు తెలుసు. ఇది ఉన్నదే
రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇందులో పాత ప్రపంచము ఆహుతి అవ్వనున్నది.
ఇక వేరే ఆహుతి ఏమీ ఉండదు. తండ్రి అంటారు - నేను మొత్తం సృష్టి అంతటిపై ఈ రాజస్వ
అశ్వమేధ యజ్ఞాన్ని రచించాను. ఇది మొత్తం భూమిపై రచించబడింది. యజ్ఞ కుండము ఉంటుంది
కదా. ఇందులో మొత్తం ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. యజ్ఞ కుండాన్ని తయారుచేస్తారు. ఈ
సృష్టి అంతా ఒక యజ్ఞ కుండము వలె ఉంది. ఈ యజ్ఞ కుండములో ఏమి జరుగుతుంది? ఇందులో అంతా
సమాప్తమైపోతుంది. ఈ కుండము పవిత్రముగా, కొత్తదిగా అయిపోతుంది. ఇందులోకి తర్వాత
దేవతలు వస్తారు. సముద్రమైతే నలువైపులా ఎలాగూ ఉంది. మొత్తం ప్రపంచమంతా కొత్తదిగా
అయిపోతుంది. చాలా అతలాకుతలమవుతుంది. ఎవ్వరికీ చెందని స్థానమంటూ ఏదీ లేదు. అందరూ
‘ఇది నాది’ అని అంటూ ఉంటారు. ఇప్పుడిక నాది-నాది అనే మనుష్యులందరూ సమాప్తమైపోతారు.
ఇక మిగిలినవారు, ఎవరినైతే నేను పవిత్రముగా తయారుచేస్తానో, మొత్తం ప్రపంచములో ఆ
కొద్దిమంది మాత్రమే ఉంటారు. మొట్టమొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముంటుంది. యమునా నదీ
తీరములో వారి రాజ్యముంటుంది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో కూర్చోవాలి, సంతోషముండాలి.
మనుష్యులు పరస్పరములో కూర్చుని కథలను వినిపిస్తూ ఉంటారు కదా. ఇది కూడా సత్యనారాయణుడి
కథ. ఇది అనంతమైన కథ. మీ బుద్ధిలో మాత్రమే ఈ విషయాలు ఉన్నాయి. అందులోనూ ఎవరైతే మంచి
సర్వీసబుల్ గా ఉన్నవారు ఉంటారో, వారి బుద్ధిలో ధారణ జరుగుతుంది, వారి జోలి
నిండుతుంది, దానమిస్తూ ఉంటారు. అందుకే ధనమిచ్చినా ధనము తరగదు అని అంటారు. దానమిస్తే
వృద్ధి జరుగుతుందని భావిస్తారు. మీదైతే అవినాశీ ధనము. ఇప్పుడు ధనమిచ్చినా ధనము తరగదు.
ఎంతగా దానమిస్తారో, అంతగా సంతోషము కలుగుతుంది. వినే సమయములో కొంతమంది తల ఊపుతూ
ఉంటారు, కొంతమందైతే వెర్రివారి వలె కూర్చుని ఉంటారు. తండ్రి ఇంత మంచి-మంచి
పాయింట్లను వినిపిస్తారు కనుక వినే సమయములో స్వతహాగానే తల ఊపుతారు. ఇక్కడకు పిల్లలు,
సమ్ముఖముగా తండ్రి నుండి రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. తండ్రి కూర్చుని ఎంత యుక్తిగా
పాయింట్లు వినిపిస్తారు.
భారత్ లో
దేవీ-దేవతల రాజ్యముండేదని మీకు తెలుసు. భారత్ ను స్వర్గము అని అంటారు, ఇప్పుడిది
నరకము. నరకము మారి స్వర్గముగా అవుతుంది. ఇకపోతే, అందరి వినాశనము జరుగుతుంది. మీకైతే
స్వర్గము అనేది నిన్నటి మాట వలె ఉంటుంది. నిన్న రాజ్యము చేసేవారు. ఇంకెవ్వరూ ఇలా
చెప్పలేరు. క్రైస్టుకు ఇన్ని సంవత్సరాల క్రితం స్వర్గముండేదని, అప్పుడు ఇంకే ధర్మము
ఉండేది కాదని అంటారు కూడా. ద్వాపరము నుండి అన్ని ధర్మాలు వస్తాయి. ఇది చాలా సహజమైన
విషయము కానీ ఇది అర్థం చేసుకోవడానికి అసలు మనుష్యుల బుద్ధి ఇటు వైపు లేనే లేదు.
పతిత-పావనా రండి, అని పిలుస్తారు కూడా. కావున వారు వచ్చి తప్పకుండా పతితము నుండి
పావనముగా తయారుచేస్తారు కదా! ఇక్కడైతే పావనులెవ్వరూ ఉండరు. సత్యయుగాన్ని నిర్వికారీ
ప్రపంచమని అంటారు. ఇప్పుడిది వికారీ ప్రపంచము. ముఖ్యమైన విషయము పవిత్రతకు
సంబంధించినది. దీని కోసం మీకు ఎంత శ్రమించాల్సి ఉంటుంది. ఈ రోజు వరకు ఏదైతే
గతించిందో, అదంతా డ్రామానుసారముగానే జరిగిందని అంటారని మీకు తెలుసు. ఇందులో ఎవరికో
మంచి జరిగిందనో లేక చెడు జరిగిందనో మనము చెప్పలేము. ఏదైతే జరుగుతుందో అది డ్రామాలో
నిశ్చితమై ఉంది. బాబా భవిష్యత్తు కోసం ఇలా అర్థం చేయిస్తారు - సేవలో ఇలాంటి కర్మలు
చేయకండి లేదంటే డిస్సర్వీస్ జరుగుతుంది. మీరు పరస్పరములో ఉప్పునీరులా అయిపోయారని
తండ్రియే తెలియజేస్తారు కదా. మేము ఉప్పునీరులా అయ్యామని, పరస్పరములో కలుసుకున్నా
మాట్లాడుకోవడము లేదని వారికి తెలుసు. మళ్ళీ ఎవరినైనా ఏమైనా అంటే చాలా డిస్టర్బ్
అయిపోతారు. శివబాబాను మర్చిపోతారు. అందుకే, ఎల్లప్పుడూ శివబాబాను స్మృతి చేయండి అని
అర్థం చేయించడము జరుగుతుంది. ఇలాంటి-ఇలాంటి పనులు చేస్తే దుర్గతి పాలవుతారని తండ్రి
పిల్లలను సావధానపరుస్తూ ఉంటారు. కానీ భాగ్యములో లేకపోతే అసలు అర్థమే చేసుకోరు. ఏ
శివబాబా నుండైతే వారసత్వము లభిస్తుందో, వారిపై కూడా అలుగుతారు. బ్రాహ్మణిపై కూడా
అలుగుతారు. వీరిపై (బ్రహ్మాపై) కూడా అలుగుతారు. ఇక ఎప్పుడూ క్లాసుకు రారు. శివబాబాపై
ఎప్పుడూ అలగకూడదు కదా. వారి మురళిని చదువుకోవాలి, స్మృతి కూడా వారినే చేయాలి. బాబా
అంటారు కదా - పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే సద్గతి
కలుగుతుంది. దేహాభిమానములోకి రావడముతో దేహధారులపై అలుగుతారు. వారసత్వమైతే తాతగారి
నుండి లభిస్తుంది. తండ్రికి చెందినవారిగా అయినప్పుడే తాతగారి వారసత్వము లభిస్తుంది.
తండ్రినే వదిలి వెళ్ళిపోతే ఇక వారసత్వమెలా లభిస్తుంది. బ్రాహ్మణ కులము నుండి బయటకు
వచ్చి శూద్ర కులములోకి వెళ్ళిపోతే ఇక వారసత్వము సమాప్తమైపోతుంది. దత్తత రద్దు
అయిపోతుంది. అయినా అర్థం చేసుకోరు. మాయ ఎలాంటిదంటే పూర్తిగా వెర్రివారి వలె
చేసేస్తుంది. తండ్రినైతే ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. కానీ అసలు స్మృతియే చేయరు. నేను
శివబాబా సంతానాన్ని, వారే నన్ను విశ్వానికి యజమానిగా చేస్తారు. తప్పకుండా వారు భారత్
లోనే జన్మ తీసుకుంటారు. శివజయంతిని జరుపుకుంటారు కదా. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు
రిపీట్ అవుతాయి. మొట్టమొదట శివబాబాయే వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. మనకు స్వర్గ
రాజ్యాధికారము లభిస్తోందని మీకు తెలుసు. తండ్రియే వచ్చి స్వర్గవాసులుగా చేస్తారు.
కొత్త ప్రపంచము కోసం రాజయోగాన్ని నేర్పిస్తారు. మీరు వెళ్ళి కొత్త ప్రపంచములో
రాజ్యము చేస్తారు. అచ్ఛా!
మధురాతి
మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బుద్ధి రూపీ జోలిలో అవినాశీ జ్ఞాన రత్నాలను నింపుకుని దానము చేయాలి. దానము
చేసినట్లయితేనే సంతోషము కలుగుతుంది, జ్ఞాన ధనము పెరుగుతూ ఉంటుంది.
2. ఎప్పుడూ కూడా పరస్పరములో డిస్టర్బ్ అయి ఉప్పునీరులా అవ్వకూడదు. చాలా ప్రేమగా
తండ్రిని స్మృతి చేయాలి మరియు మురళిని వినాలి. వెర్రివారి వలె అవ్వకూడదు.
వరదానము:-
ఒక్క తండ్రితో యోగాన్ని జోడించి సర్వుల సహయోగాన్ని ప్రాప్తి
చేసుకునే సత్యమైన యోగి మరియు సహయోగీ భవ
ఎవరు ఎంతగా యోగి అయి ఉంటారో, అంతగా వారికి సర్వుల సహయోగము
తప్పకుండా ప్రాప్తిస్తుంది. యోగి యొక్క కనెక్షన్ మరియు స్నేహము బీజముతో ఉన్న
కారణముగా స్నేహానికి రిటర్న్ లో అందరి సహయోగము ప్రాప్తిస్తుంది. అందుకే బీజముతో
యోగము జోడించేవారు, బీజానికి స్నేహమనే నీటిని ఇచ్చేవారు సర్వాత్మల ద్వారా సహయోగము
రూపీ ఫలాన్ని ప్రాప్తి చేసుకుంటారు ఎందుకంటే బీజముతో యోగమున్న కారణముగా పూర్తి
వృక్షముతో కనెక్షన్ ఏర్పడుతుంది.
స్లోగన్:-
పాత
సంస్కారాలను నావి అని అనడమంటే పురుషార్థాన్ని ఢీలా చేసుకోవడము.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
ఎప్పుడైనా ఎవరికైనా ఏ
విధమైన సహయోగము కావాలన్నా దాత పిల్లలైన మీరు వారికి సహయోగాన్ని ఇవ్వండి. కానీ
సర్వులకు సహయోగులుగా ఎప్పుడు అవుతారంటే, సర్వులకు స్నేహీలుగా అయినప్పుడు. స్నేహీలుగా
అవ్వకపోతే సర్వులకు సహయోగులుగా కూడా అవ్వలేరు. అందుకే మనసా, వాచా, కర్మణా మరియు
సంబంధాలలో కూడా సహయోగులుగా మరియు సఫలతామూర్తులుగా అవ్వండి.