18-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 02.02.2012


‘‘ఇప్పుడు స్మృతి స్వరూపులుగా అయ్యి అనుభవం యొక్క అథారిటీలుగా అవ్వండి, జ్వాలాముఖి యోగము ద్వారా అందరికీ లైట్ మైట్ కిరణాల సహయోగాన్ని ఇవ్వండి’’

ఈ రోజు బాప్ దాదా తమ ఎదురుగా మరియు నలువైపులా ఉన్న తమ చిన్నని ప్రపంచాన్ని చూసి హర్షిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రపంచము చిన్నదే కానీ అతి ప్రియమైనది ఎందుకంటే ఈ ప్రపంచములోని ఒక్కొక్క ఆత్మ శ్రేష్ఠ ఆత్మ. కోట్లలో కొద్దిమందిగా ఉన్న ఆత్మలు. బాబా వారసత్వానికి అధికారీ ఆత్మలు. ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ అని బాప్ దాదా ప్రతి బిడ్డను చూసి సంతోషిస్తున్నారు. బాప్ దాదా ప్రతి బిడ్డను స్వరాజ్యాధికారిగా మరియు విశ్వ రాజ్యాధికారిగా చేసారు. ఈ సమయములో అందరూ స్వరాజ్యాధికారులుగా ఉన్నారు అనగా మనసు, బుద్ధి, సంస్కారాలకు, కర్మేంద్రియాలకు రాజులు. కర్మేంద్రియాలకు వశమైనవారు కారు. మనసుకు కూడా యజమానులు. మరి అలానే మీలోని ప్రతి బిడ్డ స్వయాన్ని మనసుకు యజమానిగా, సంస్కారాలకు కూడా యజమానిగా భావిస్తున్నారా? అలా కాకుండా, ఒక్కోసారి మీరు మనసుకు యజమానిగా, మరోసారి మనసు మీకు యజమానిగా అయితే అవ్వడము లేదు కదా? ఎందుకంటే అనడము కూడా ‘నా మనసు’ అనే అంటారు, అంతేకానీ ‘నేను మనసును’ అని అనరు. మరి ‘నాది’ అన్నదానికి మీరు యజమానులు కదా. చెక్ చేసుకోండి - ఒక్కోసారి మనసు యజమానిగా అయితే అవ్వడము లేదు కదా? ఎందుకంటే ఈ సమయములో బాప్ దాదా ప్రతి ఒక్కరినీ స్వరాజ్య అధికారి అనే సీట్ పై కూర్చోబెట్టారు. మీరు వర్తమానములో స్వరాజ్య అధికారులు మరియు భవిష్యత్తులో రాజ్యమైతే ఎలాగూ మీదే. డబల్ రాజ్య అధికారులు. ప్రతి బిడ్డ స్వరాజ్య అధికారిగా ఉండటముతో పాటుగా స్వమానధారిగా కూడా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ‘నేను స్వమానధారి ఆత్మను’, ఈ స్మృతిలో కూర్చుంటే ఎన్ని స్వమానాల లిస్టు మీ ఎదురుగా వస్తుందో చూడండి. అనేక స్వమానాల మాల ఎదురుగా వస్తుంది కదా!

బాప్ దాదా పిల్లల స్వమానాల మాలను ప్రతి బిడ్డ మెడలో వేసారు. స్వమానము అని వినగానే మీ ఎదురుగా కూడా మీ స్వమానాలు గుర్తుకువచ్చాయి! గుర్తు తెచ్చుకోండి. అనాది స్వరూపములో మీ స్వమానము ఎంత పెద్దది! అనాది స్వరూపములోకి వెళ్ళిపోయారా? ప్రతి ఒక్కరి స్వమానము - ఒకటి, బాబాతోపాటు నేను మెరుస్తూ ఉన్న ఆత్మను. బాబాతోపాటు ఉన్న కారణముగా విశేషముగా మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. చూస్తున్నారా? ఎలా అయితే ఇక్కడ ఆకాశములో కూడా కొన్ని-కొన్ని నక్షత్రాలు విశేషముగా మెరుస్తూ ఉంటాయో, అలాగే అక్కడ బాబాతోపాటు ఉన్న కారణముగా మెరుస్తూ ఉన్న ఆత్మ వలె ఉన్నారు. మీ అనాది స్వరూపము గుర్తుకువచ్చిందా? సెకెండులో మీ అనాది స్వరూపములో స్థితులవ్వగలరా? ఇప్పుడు ఒక్క క్షణములో ఆ అనాది స్వరూపములో ఒక్క క్షణము కోసం స్థితులవ్వండి. ఎంత నషా పెరుగుతుంది! ముందుకు పదండి! ఈ సృష్టి చక్రము యొక్క ఆదిలోకి వచ్చేశారా! ఈ డ్రిల్ చేయండి. సత్యయుగ ఆదిలోని మీ స్వరూపాన్ని చూడండి. ఎంతటి శ్రేష్ఠమైన, సుఖ స్వరూపము. ఎంతటి సర్వ ప్రాప్తి స్వరూపము. దుఃఖము యొక్క నామ-రూపాలు కూడా లేవు. ప్రకృతి ఎంత సుందరముగా, సతోగుణీగా ఉంది. మీ దేవతా స్వరూపాన్ని అనుభవం చేయండి. మీ స్వరూపాన్ని చూస్తున్నారా? ఏ రాజులనైనా, మహాత్ములనైనా, నేతలనైనా ఇంతటి సర్వ ప్రాప్తి స్వరూపులుగా చూసారా? ఇప్పుడు ఒక్క క్షణము కోసం మీ దేవతా స్వరూపములో స్థితులవ్వండి. మీ స్వమానములో ఉంటే మజా వస్తుంది కదా! హమ్ సో దేవతా... బాప్ దాదా ఈ డ్రిల్ చేయిస్తున్నారు. ఇప్పుడు కిందకు రండి, ఏ యుగము వచ్చింది? ద్వాపరములో కూడా మీ స్వమానము పూజ్యనీయమైనది. మీది పూజ్య స్వరూపము. మీ పూజ్య స్వరూపాన్ని చూస్తున్నారా? అందరూ ఎంత భావనతో నియమపూర్వకముగా పూజలు చేస్తారు. ఇంతటి నియమపూర్వకమైన పూజ ఇంకెవ్వరికీ జరగదు. ధర్మపితలు వచ్చినా, ఎవరైనా గురువులుగా, నేతలుగా, యాక్టర్లుగా అయినా కానీ ఇటువంటి నియమపూర్వకమైన పూజ ఎవ్వరికీ జరగదు. మరి మీ స్వమానాన్ని చూసుకున్నారా, అనుభవం చేసారా? ఇప్పుడు సంగమములోకి రండి. అందరూ చక్రములో తిరుగుతున్నారా? వెనుక ఉన్నవారు తిరుగుతున్నారా? చేతులెత్తండి. మీ స్వమానాన్ని చూసుకోండి, ఎందుకంటే మీరు స్వరాజ్య అధికారులు కదా! సంగమములో స్వయంగా భగవంతుడు మీ జీవితములో, స్వయంగా యజమాని పిల్లలైన మీలో పవిత్రతా విశేషతను నింపుతారు. ఈ పవిత్రత మీ సర్వ అవినాశీ సుఖాలకు గని. మరి అలా తయారుచేసేది ఎవరు? స్వయంగా భగవంతుడు. ఇప్పుడు కూడా ప్రత్యక్ష ప్రమాణముగా మీకు పవిత్రత అనే ఆస్తి బాబా ద్వారా ప్రాప్తించింది. ఇప్పుడు చెక్ చేసుకోండి - పవిత్రత సర్వ ప్రాప్తులకు ఆధారము, పవిత్రతతో మీరందరూ మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారు. కావున చెక్ చేసుకోండి, సర్వ శక్తులు ప్రాప్తించాయా? కొంతమంది పిల్లలు ఏమంటారంటే, బాబా అయితే సర్వ శక్తులూ ఇచ్చారు కానీ ఒక్కోసారి ఏ శక్తి యొక్క అవసరముంటుందో అది కొంత ఆలస్యముగా వస్తుంది. విషయము పూర్తయిపోయాక శక్తి వస్తుంది అని అంటారు. దీనికి కారణము ఏమిటి? వరదానముగా బాబా అయితే ఇచ్చారు, అయినా కానీ అది సమయానికి రావడము లేదు, దానికి కారణము ఏమిటి? మీ మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతి యొక్క సీట్ పై సెట్ అయ్యి ఉండరు. ఎవరైనా ఎవరి ఆర్డర్ ను వింటారు, సీట్ పై ఉన్నవారి ఆర్డర్ ను వింటారు. కావున ఎప్పుడైనా మీరు ఏదైనా శక్తిని ఆర్డర్ చేసినప్పుడు ముందుగా ఇది చూసుకోండి - నేను స్మృతి అనే సీట్ పై ఉన్నానా? స్వమానమనే సీట్ పై ఉన్నానా? స్మృతి అనే సీట్ పై సెట్ అయినట్లయితే సర్వ శక్తులు మీ వద్ద సమయానికి రావడానికి బంధింపబడి ఉంటాయి, ఎందుకంటే సర్వశక్తివంతుడైన బాబా మిమ్మల్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా చేసారు. మరి అంతటి పవర్ఫుల్ స్వమానధారులుగా అయ్యి నడుచుకుంటున్నారు కదా? మీ స్వమానాలను చూసుకున్నారా? సంగమము తర్వాత ఎక్కడికి వెళ్తారు? రిటర్న్ జర్నీ చేస్తారు కదా! అందుకే బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ప్రతి ఒక్కరూ రోజంతటిలో ఈ ఎక్సర్ సైజ్ ను చేస్తూ ఉండాలి. సమయాన్ని కేటాయించండి, పదే-పదే ఈ స్వమానాల మాలను ధరించడము ద్వారా, అనుభవం చేయడము ద్వారా, బాప్ దాదా స్వరాజ్యాధికారులుగా చేసారు కదా, ఇక స్వమానాలు మీ ఆర్డర్ అనుసారముగా నడవకపోవడము అనేది జరగదు. కేవలం సీట్ పై సెట్ అయ్యి ఉండండి.

బాప్ దాదా ఏమి చూసారంటే, అందరూ అటెన్షన్ పెడుతున్నారు కానీ నియమిత రూపములో మీ దినచర్యను సెట్ చేసుకోండి. మధ్యమధ్యలో మీ ఈ స్వమానాలనే స్మృతి స్వరూపములో స్థితులవ్వండి. ఎలా అయితే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారో, అలా ఆది కాలం నుండి రిటర్న్ జర్నీ వరకు ఉన్న స్వమానాలను స్మృతి చేయడానికి మధ్యమధ్యలో సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. నడుస్తూ-తిరుగుతూ కూడా ఇది చేయవచ్చు, ఎందుకంటే మనసును సీట్ పై కూర్చోబెట్టాలి. బాప్ దాదా చూసారు, ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నారు, యోగము అందరూ చేస్తున్నారు కానీ ఇప్పుడు దేని అవసరముంది? సమయము యొక్క పరిస్థితులను చూస్తూ - ఇప్పుడు జ్వాలాముఖి యోగము అవసరమని ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నారు, దీనితో రెండు పనులు అవుతాయి. ఒకటి, తమలోని పాత సంస్కారాల అంతిమ సంస్కారము జరుగుతుంది. ప్రస్తుతము సంస్కారాలను హతమారుస్తున్నారు కానీ కాల్చడము లేదు. హతమార్చిన తర్వాత కూడా అప్పుడప్పుడూ అవి మేలుకుంటాయి. ఎలా అయితే రావణుడిని కేవలం హతమార్చలేదు, కాల్చారు, అలాగే మీరు కూడా మీ పాత సంస్కారాలను, ఏవైతే మధ్యమధ్యలో తీవ్ర పురుషార్థములో లోటును తీసుకువస్తాయో, ఆ పాత సంస్కారాలను కాల్చి వేయడానికి జ్వాలాముఖి యోగము అవసరము. ఒకటి, స్వయం కోసం అవసరము మరియు రెండు, జ్వాలాముఖి యోగము ద్వారా, లైట్ రూపము ఉన్న కారణముగా, మైట్ రూపము ఉన్న కారణముగా ఇతరులకు కూడా మీ కిరణాల ద్వారా సహయోగాన్ని ఇవ్వగలరు. మరి ఇప్పుడు అందరూ యోగాన్ని జ్వాలాముఖి యోగములోకి పరివర్తన చేసారా? సమయమనుసారముగా ఇప్పుడు ఆత్మలకు మీ సహయోగము చాలా అవసరము. బాప్ దాదా అయితే అమృతవేళలో ప్రతి బిడ్డకు స్నేహాన్ని ఇస్తారు.

బాప్ దాదా ఏమి చూసారంటే, లక్ష్యము చాలా బాగా పెట్టుకుంటున్నారు, ధైర్యము కూడా పెడుతున్నారు, కానీ రోజంతా అదే అటెన్షన్ లో ఉండాలి. అమృతవేళలో ఎలా అయితే ఉంటుందో, అది తగ్గిపోతుంది. కారణము ఏమిటి? కర్మల్లోకి వచ్చిన తర్వాత కర్మయోగిగా అయ్యి కర్మలు చెయ్యడములో తేడా వచ్చేస్తుంది. మీరు కేవలం యోగము జోడించేవారు కాదు, మీరు యోగీ జీవితము కలవారు. మరి జీవితమనేది సదా ఉంటుంది, అప్పుడప్పుడూ కాదు. కనుక బాప్ దాదా కూడా ఏమి కోరుకుంటున్నారు? ప్రేమలో అయితే చాలావరకు పాస్ అయి ఉన్నారు. బాబా ఏం చూసారంటే, ప్రేమ అనే సబ్జెక్టులో మెజారిటీ బాబాతో ‘నా బాబా, నా బాబా’ అని అంటూ ప్రేమను అనుభవం చేస్తున్నారు. ప్రేమలో అయితే మెజారిటీ పాస్ అయ్యారు, ఇప్పుడు ఎందులో పాస్ అవ్వాలి? బాబా సమానముగా అవ్వడములో. అందరూ ఏమి కోరుకుంటున్నారు? బాబా సమానముగా అవ్వాలా లేక బాబా బాబాగానే, మీరు పిల్లలుగానే ఉంటారా. కనుక బాబా సమానముగా అవ్వాల్సి ఉంటుంది. ప్రేమ అంటే ఏమిటి? ఎవరి పట్ల అయితే ప్రేమ ఉంటుందో, వారు ఏది చెప్తే అది చేయాల్సిందే. మరి అందరూ బాబాకు ప్రియమైనవారు, బాబా ప్రేమ మీతో ఉందా? ఇందులో చేతులెత్తండి. ప్రేమ ఉందా, మంచిది, ప్రేమ ఉందా? ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే, ఎలా అయితే ప్రేమ ఉందో, అలా - నేను బాబా సమానముగా అవ్వాల్సిందే అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి, ఇందులో చేతులెత్తండి. నిశ్చయము పెట్టుకుంటారు, చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. బాప్ దాదా చూస్తున్నారు.

బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే, ఒకొక్క బిడ్డ ముఖము ద్వారా, నడవడిక ద్వారా అంత సంతోషముగా ఉన్నవారిలా, అదృష్టవంతులుగా కనిపించాలి ఎందుకంటే సమయమనుసారముగా ఇప్పుడు మీ ముఖము చాలా సేవ చేస్తుంది. ఆ అవసరము వస్తుంది. దాని కోసం బాప్ దాదా ఏం కోరుకుంటున్నారంటే, ఇప్పటినుండే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎలా అయితే ఇప్పుడు ఈ 75 సంవత్సరాల సందర్భముగా అందరికీ సేవ చేయాలి అనే ఉల్లాసము ఉందో, అలా ముఖముతో సేవ చేయాలి అనే ఉల్లాసము ఉండాలి ఎందుకంటే రోజురోజుకు నాజుకైన సమయము వచ్చేదే ఉంది. అటువంటి సమయములో మీ ముఖము ఆత్మలను సంతోషపరచాలి.

బాప్ దాదా ఈ రోజు అమృతవేళలో అంతటా తిరిగారు, అప్పుడు ఏం చూసారు? అందరూ తమ ఇష్టముతోనే కూర్చుంటారు కానీ అన్నింటికంటే పెద్ద అథారిటీ అనుభవము. కూర్చోవడాన్ని చూస్తున్నాము కానీ అనుభవం యొక్క అథారిటీగా అయ్యి కూర్చోవాలి. స్మృతిలో కూర్చుంటున్నారు కానీ స్మృతి స్వరూపము అనుభవమవ్వాలి. అనుభవం యొక్క అథారిటీలోని ఆనందము ఆ కొద్ది సమయములో ఉంటుంది. నేను బాప్ దాదా హృదయ సింహాసనాధికారిని అని అనుకుంటారు, కానీ స్వరూపము యొక్క స్మృతి స్వరూపముగా, అనుభవీమూర్తిగా అయ్యి అనుభవములో నిమగ్నమైపోవాలి, ఇది ఇంకా పెంచాలి, ఎందుకంటే అనుభవము యొక్క అథారిటీ అన్నింటికన్నా పెద్దది. స్మృతి స్వరూపములో ఉండటాన్ని అనుభవము అని అంటారు. అనుభవములో మైమరచిపోండి, ఎవరైతే స్వరూపము యొక్క స్మృతిలో ఉంటారో, వారు ఆ స్వరూపము యొక్క అనుభూతిలో ఉండటము, ఇప్పుడు ఇది మరింత అవసరము ఎందుకంటే అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోరు. ఎవరికైనా మీరు ఎవరి అనుభవము ద్వారానైనా వినిపించేందుకు ప్రయత్నిస్తే ఆ అనుభవము యొక్క ప్రభావము పడుతుంది. కావున స్వయాన్ని ఏ స్మృతి స్వరూపములో అయితే ఉంచుకుంటున్నారో, ఆ స్వరూపము యొక్క అనుభూతిలో మైమరచిపోండి. అనుభవము మీ పురుషార్థములో కూడా చాలా సహాయపడుతుంది. బాప్ దాదా ఏమి చూసారంటే, అనుభవము యొక్క అథారిటీలో నంబరువారుగా ఉన్నారు. ఇప్పుడు ఈ అనుభవము యొక్క అథారిటీని అభ్యాసము చేయడము పట్ల మరింత అటెన్షన్ ను పెట్టండి. అనుభవ స్వరూప స్థితి సదా ఇమిడి ఉంటుంది. వారి ముఖము, నడవడిక సేవ చేస్తాయి.

ఈ రోజు బాప్ దాదా పిల్లల రికార్డును చూస్తున్నారు. ఒకటి, జ్వాలాముఖి యోగము పట్ల మరింత అటెన్షన్ పెట్టండి, దానితో స్వభావ-సంస్కారాల పరివర్తనలో సహయోగము లభిస్తుంది. సంస్కారాలు, దేనినైతే మీరు నేచర్ అని అంటారో, అవి ఇప్పటికీ కూడా మధ్యమధ్యలో వాటి పని చేస్తున్నాయి. ఇకపోతే బాప్ దాదా సంతోషముగా ఉన్నారు. ఏ విషయములో? తెలుసా, బాప్ దాదా ఏ విషయములో సంతోషముగా ఉన్నారో తెలుసా? ఈ మధ్య మురళీలను వింటూ తమ దినచర్య పట్ల పిల్లలకు ఎక్కువ అటెన్షన్ కలగడాన్ని బాప్ దాదా చూసారు. అటెన్షన్ పెరిగింది కావున సంస్కారాల టెన్షన్ తగ్గుతూ ఉంటుంది. బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నారు. ఎప్పుడైనా టెన్షన్ వస్తే, దాని ముందు ‘ఎ’ (ఇంగ్లీష్ లోని మొదటి అక్షరమైన ఎ) పెట్టండి, అది అటెన్షన్ అయిపోతుంది. అందరూ వెళ్ళాల్సిందే. ఇది పక్కా ప్రతిజ్ఞ. కలిసి వెళ్తాము, కలిసి రాజ్యము చేస్తాము. మరి అందరూ సంతోషముగా ఉన్నారా లేక అప్పుడప్పుడూ సంతోషముగా ఉంటున్నారా? ఎవరైతే, మేము సదా సంతోషముగా ఉంటున్నాము, అప్పుడప్పుడు కాదు, సదా సంతోషముగా ఉంటున్నాము అని అంటారో, చూడండి, ఆలోచించి చేతులెత్తండి. అచ్ఛా. చేతులు కూడా ఆలోచించి ఎత్తుతున్నారు. సంతోషమనేది మీ వస్తువు కదా. మీ వస్తువు మీ నుండి ఎందుకు వెళ్ళాలి? మరిప్పుడు ఏం చేస్తారు? ముందుకైతే వెళ్ళాల్సిందే. మరి ఇప్పుడు మున్ముందు ఏం చేస్తారు? ప్రతి సెంటరు నిర్విఘ్నముగా, వ్యర్థ సంకల్పాల రహితముగా ఉండాలి, వీలవుతుందా? వీలవుతుందా లేక దీని కోసం సమయము కావాలా? మా సెంటరు సదా నిర్విఘ్నముగా ఉంది, మా తోటివారి కూడా నిర్విఘ్నముగా ఉన్నారు అని ఇప్పటివరకూ ఎవ్వరూ బాప్ దాదాకు రిపోర్టు ఇవ్వలేదు. కేవలం స్వయమే కాదు, తోటివారు కూడా నిర్విఘ్నముగా ఉండాలి. ఆ సమయము కూడా రానున్నది. అయిపోతుంది ఎందుకంటే తయారవ్వాల్సింది పిల్లలే కదా. కొంతమంది ఉదాహరణలా వస్తారు, వారు వెనుక వచ్చి తీవ్ర పురుషార్థము చేసి ముందుకు వెళ్తారు కానీ మెజారిటీ అయితే మీరే ముందుకు వెళ్ళాలి. బాప్ దాదా ఏం చూసారంటే, మురళి పట్ల మెజారిటీకి ప్రేమ ఉంది. కానీ జగదాంబ అయితే, బాబా చెప్పింది చెయ్యవలసిందే అన్నది ప్రత్యక్షముగా తమ జీవితములో చూపించారు. వారు లక్ష్యము పెట్టుకున్నారు మరియు పురుషార్థము వైపు అటెన్షన్ కూడా పెట్టారు. మీ దీదీ, దాదీలు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలో ఉన్నారో వారు కూడా అటెన్షన్ పెట్టారు, ఇప్పుడు మీ కోసం ఎదురుచూస్తున్నారు. సమాప్తి గేట్ ను ఎప్పుడు తెరుస్తారు అని వారు అడుగుతున్నారు. ఒకరిద్దరైతే తెరవరు కదా! కావున ఇప్పుడు పురుషార్థము చేసి గేట్లను తెరిచే సమయాన్ని సమీపముగా తీసుకురండి. సంపన్నముగా అవ్వడము అనగా సమీపముగా తీసుకురావటము.

నలువైపులా ఉన్న పిల్లలందరికీ బాప్ దాదా హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తున్నారు. దానితో పాటు బాప్ దాదా ఏదైతే రెండు నెలల కోసం హోమ్ వర్కు ఇచ్చారో, దానిని కూడా గుర్తు చేయిస్తున్నారు, ఎందుకని? చాలావరకు ఈ వ్యర్థ సంకల్పాలే పురుషార్థాన్ని తీవ్రముగా కాకుండా సాధారణముగా చేసేస్తాయి. అందుకే నలువైపులా ఉన్న పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులు ఇవ్వడముతో పాటు ఇప్పుడు ఈ సంగమ సమయము ఎంత శ్రేష్ఠమైనదో, మనోహరమైనదో గుర్తు తెప్పిస్తున్నారు. ఈ సంగమ సమయములోనే సర్వ ఖజానాలు బాబా ద్వారా ప్రాప్తిస్తాయి. సంగమములోని ఒక్కొక్క క్షణము గొప్పది, అందుకే సంగమ సమయము యొక్క విలువను సదా మీ బుద్ధిలో ఉంచుకోండి. సంగమములోని ఒక్క క్షణము ఎంత ప్రాప్తిని కలిగిస్తుంది? మీకు ఏమి లభించింది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేమి జవాబిస్తారు! బ్రాహ్మణులైన మా మనసులో అప్రాప్తి అనే వస్తువేదీ లేదు, పొందాల్సినదంతా పొందేసాము. ఇప్పుడు దీనిని కార్యములో పెడుతూ తీవ్ర పురుషార్థులుగా అయ్యి సమయాన్ని సమీపముగా తీసుకురండి. అచ్ఛా. అందరికీ ఉల్లాసము కూడా కలుగుతుంది అన్నదానిని బాప్ దాదా చూస్తున్నారు, ఈ ఉల్లాసాన్ని సదా పెంచుతూ వెళ్ళండి. అచ్ఛా!

వరదానము:-
మీ స్వరూపము ద్వారా భక్తులకు ప్రకాశ కిరీటాన్ని సాక్షాత్కారము చేయించే ఇష్టదేవ భవ

ఎప్పటినుండైతే మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారో, పవిత్రతా ప్రతిజ్ఞను చేసారో, దానికి రిటర్న్ లో మీకు ప్రకాశ కిరీటము ప్రాప్తించింది. ఈ ప్రకాశ కిరీటము ఎదురుగా రత్నజడిత కిరీటము అసలేమీ కాదు. ఎంతెంతగా సంకల్పము, మాట మరియు కర్మలో పవిత్రతను ధారణ చేస్తూ ఉంటారో, అంతగా ఈ ప్రకాశ కిరీటము స్పష్టమవుతూ ఉంటుంది మరియు ఇష్టదేవుని రూపములో భక్తుల ఎదురుగా ప్రత్యక్షమవుతూ ఉంటారు.

స్లోగన్:-
సదా బాప్ దాదా ఛత్రఛాయ లోపల ఉన్నట్లయితే విఘ్న-వినాశకులుగా అవుతారు.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

ఏ విధముగా బాప్ దాదా సదా పిల్లలకు ప్రతి అడుగులోనూ సహయోగులుగా ఉన్నారు మరియు అంతిమము వరకు ఉంటారో, బాబాకు ఎవరి పట్ల ద్వేషము ఉండదో, వారు సదా అపకారుల పట్ల కూడా శుభ చింతకులుగా ఉంటారో, అలా ఫాలో ఫాదర్ చేయండి. ప్రతి ఆత్మ పట్ల సదా శుభ భావాన్ని మరియు భావనను పెట్టుకోండి. వీరు ఇలా ఎందుకు చేసారు అని ఆలోచించేందుకు బదులుగా ఈ ఆత్మ యొక్క కళ్యాణము ఎలా జరగాలి అన్నది ఆలోచించండి, అప్పుడు శుభ చింతకులు మరియు విశ్వ కళ్యాణకారీ ఆత్మలు అని అంటారు.

విశేష సూచన:- నెలలోని మూడవ ఆదివారము యొక్క యోగాభ్యాసము

ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము, సోదర-సోదరీలందరూ సంగఠిత రూపములో కలిసి సాయంత్రము 6.30 నుండి 7.30 గం.ల వరకు తమ శాంత స్వరూప స్థితిలో స్థితులై, శాంతి సాగరుని లోతుల్లోకి వెళ్తూ ఆ పరమ సుఖము మరియు శీతలత యొక్క లోతైన అనుభూతి చెయ్యాలి మరియు సర్వాత్మలకు శాంతి దానాన్ని ఇచ్చే సేవ చెయ్యాలి.