19-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ స్వధర్మాన్ని మర్చిపోవడమే అన్నింటికన్నా పెద్ద పొరపాటు, ఇప్పుడు మీరు పొరపాట్లు చేయనివారిగా అవ్వాలి, మీ ఇంటిని మరియు రాజ్యాన్ని స్మృతి చేయాలి’’

ప్రశ్న:-
పిల్లలైన మీ యొక్క ఏ అవస్థయే సమయము యొక్క సమీపతను సూచిస్తుంది?

జవాబు:-
పిల్లలైన మీరు ఎప్పుడైతే స్మృతియాత్రలో నిమగ్నమై ఉంటారో, బుద్ధి భ్రమించడము ఆగిపోతుందో, వాణిలో స్మృతి యొక్క పదును లేక శక్తి వస్తుందో, అపారమైన సంతోషములో ఉంటారో, ఘడియ-ఘడియ మీ సత్యయుగీ ప్రపంచపు దృశ్యాలు ఎదురుగా వస్తూ ఉంటాయో, అప్పుడు సమయము సమీపముగా ఉందని అర్థం చేసుకోండి. వినాశనమయ్యేందుకు పెద్ద సమయము పట్టదు, దీని కొరకు స్మృతి చార్టును పెంచాలి.

పాట:-
నిన్ను పొంది మేము ప్రపంచాన్ని పొందాము...

ఓంశాంతి
ఆత్మిక పిల్లలు ఈ పాట అర్థాన్ని అయితే అర్థం చేసుకుని ఉండవచ్చు. ఇప్పుడు అనంతమైన తండ్రినైతే పొందారు. అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుంది, ఈ వారసత్వాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. ఎప్పుడైతే రావణ రాజ్యము ప్రారంభమవుతుందో అప్పుడు ఆ వారసత్వపు నషా పోతుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పిల్లలకు సృష్టి డ్రామా యొక్క జ్ఞానము కూడా ఉంది. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానము ఉంది. దీనిని నాటకము అని కూడా అనవచ్చు, డ్రామా అని కూడా అనవచ్చు. తప్పకుండా తండ్రి ఇప్పుడు వచ్చి సృష్టిచక్రము గురించి కూడా అర్థం చేయిస్తారని పిల్లలు భావిస్తారు. బ్రాహ్మణ కులానికి చెందినవారు ఎవరైతే ఉన్నారో, వారికే అర్థం చేయిస్తారు. పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను మీకు అర్థం చేయిస్తాను. 84 లక్షల జన్మలు తీసుకున్న తరువాత ఒక్కసారి మనుష్య జన్మ లభిస్తుంది అని మీరు ఇంతకుముందు విన్నారు. కానీ అలా కాదు. ఇప్పుడు ఆత్మలైన మీరందరూ నంబరువారుగా వస్తూ ఉంటారు. ప్రారంభములో మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందిన పూజ్యులుగా ఉండేవారము, ఆ తర్వాత మేమే పూజారులుగా అయ్యామని బుద్ధిలోకి వచ్చింది. తామే పూజ్యులు, తామే పూజారులు అన్న గాయనము కూడా ఉంది. కానీ మనుష్యులు భగవంతుని విషయములో - వారే పూజ్యునిగా, వారే పూజారిగా అవుతారని భావిస్తారు. ఈ రూపాలన్నీ భగవంతుడివే అని భావిస్తారు. అనేక అభిప్రాయాలు మరియు ఆలోచనలు ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు శ్రీమతముపై నడుస్తారు. విద్యార్థులమైన మనకు ముందు ఏమీ తెలియదని, ఆ తరువాత చదువుకుని ఉన్నతమైన పరీక్షలను పాస్ అవుతూ ముందుకు వెళ్తామని మీరు భావిస్తారు. ఆ విద్యార్థులకు కూడా ప్రారంభములో ఏమీ తెలియదు, ఆ తరువాత పరీక్షలు పాస్ అవుతూ, అవుతూ - ఇప్పుడు నేను బ్యారిస్టరీ పాస్ అయ్యాను అని భావిస్తారు. మనము చదువుకుని మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని, అందులోనూ విశ్వానికి యజమానులుగా అవుతున్నామని మీకు కూడా ఇప్పుడు తెలుసు. అక్కడైతే ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటుంది. మీ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. అక్కడ మీకు పవిత్రత, శాంతి, సుఖము, సంపద సర్వస్వమూ ఉంటాయి. పాటలో కూడా ఈ విషయాన్ని విన్నారు కదా. ఇప్పుడు ఈ పాటను మీరైతే తయారుచేయలేదు. అనాయాసముగానే డ్రామానుసారముగా ఈ సమయము కొరకు ఈ పాటలు తయారుచేయబడ్డాయి. మనుష్యులు తయారుచేసిన పాటల అర్థాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ శాంతిగా కూర్చుని తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు, దీనిని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. అర్ధకల్పము సుఖపు వారసత్వము ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, అర్ధకల్పము కన్నా ఎక్కువ సమయము మీరు సుఖాన్ని అనుభవిస్తారు. ఆ తరువాత రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. మందిరాలు కూడా ఎలా ఉన్నాయంటే, వాటిలో దేవతలు వామ మార్గములోకి ఎలా వెళ్తారో చూపించే చిత్రాలు ఉన్నాయి. వస్త్రాలు అవే ఉంటాయి, వస్త్రాలు తరువాత మారుతాయి. ప్రతి ఒక్క రాజుకు తమ-తమ వస్త్రాలు, కిరీటాలు మొదలైనవన్నీ వేరువేరుగా ఉంటాయి.

మనము శివబాబా నుండి బ్రహ్మా ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలకు తెలుసు. తండ్రి అయితే పిల్లలూ-పిల్లలూ అనే సంబోధిస్తారు. పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదు. వినేదైతే ఆత్మయే కదా. మనము ఆత్మ, అంతేకానీ శరీరము కాము. మిగిలిన మనుష్యమాత్రులంతా ఎవరైతే ఉన్నారో, వారికి తమ శారీరక పేరు పట్ల నషా ఉంటుంది ఎందుకంటే దేహాభిమానులుగా ఉన్నారు. నేను ఒక ఆత్మను అన్న విషయమే వారికి తెలియదు. వారైతే ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అంటారు. ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయించారు, ఆత్మలైన అయిన మీరు విశ్వానికి యజమానులుగా, దేవీ-దేవతలుగా అవుతున్నారు. ఈ జ్ఞానము ఇప్పుడే ఉంది. మనమే దేవతలుగా అవుతాము, మళ్ళీ మనమే క్షత్రియ వంశములోకి వస్తాము. 84 జన్మల లెక్క కూడా కావాలి కదా. అందరూ అయితే 84 జన్మలు తీసుకోరు. అందరూ ఒక్కసారిగా కలిసి రారు కదా. ఏ ధర్మము ఎలా వస్తుందో మీకు తెలుసు. చరిత్ర పాతదిగా అవుతుంది, మళ్ళీ కొత్తదిగా మారుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచమే పతిత ప్రపంచము. అది పావన ప్రపంచము. ఆ తరువాత ఇతర ధర్మాలు వస్తాయి. ఈ కర్మక్షేత్రముపై ఈ ఒక్క నాటకమే నడుస్తుంది. ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు. ఈ సంగమములో తండ్రి వచ్చి బ్రాహ్మణ సాంప్రదాయాన్ని స్థాపన చేస్తారు. విరాట రూప చిత్రాన్ని తయారుచేస్తారు, కానీ ఇందులో ఒక పొరపాటు ఉంది. తండ్రి వచ్చి అన్ని విషయాలను అర్థం చేయించి పొరపాట్లు చేయనివారిగా తయారుచేస్తారు. తండ్రి అయితే ఎప్పుడూ శరీరములోకి రారు, అలాగే పొరపాట్లేవీ చేయరు. వారు కొద్ది సమయము కొరకు పిల్లలైన మీకు సుఖధామానికి మరియు ఇంటికి దారిని చూపించేందుకు ఇతని రథములోకి వస్తారు. తండ్రి కేవలము దారిని చూపించడమే కాకుండా వారు జీవితాన్ని కూడా తీర్చిదిద్దుతారు. కల్ప-కల్పము మీరు ఇంటికి వెళ్తారు, ఆ తరువాత సుఖపు పాత్రను కూడా అభినయిస్తారు. ఆత్మలైన మన స్వధర్మమే శాంతి అన్న విషయాన్ని పిల్లలు మర్చిపోయారు. ఈ దుఃఖ ప్రపంచములో శాంతి ఎలా ఉంటుంది - ఈ విషయాలన్నింటినీ మీరు అర్థం చేసుకున్నారు. అలాగే మీరు అందరికీ అర్థం చేయిస్తారు కూడా. మెల్లమెల్లగా అందరూ వస్తూ ఉంటారు. ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది, దీని ఆయువు ఎంత అనేది విదేశీయులకు కూడా తెలుస్తుంది. విదేశీయులు కూడా మీ వద్దకు వస్తారు, అలాగే పిల్లలు కూడా అక్కడకు వెళ్ళి సృష్టిచక్రపు రహస్యాన్ని అర్థం చేయిస్తారు. వారు క్రైస్టు భగవంతుడి వద్దకు వెళ్ళిపోయారని భావిస్తారు. క్రైస్టును భగవంతుని సంతానముగా భావిస్తారు. కొందరేమో క్రైస్టు కూడా పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఇప్పుడు బికారిగా అయిపోయారని భావిస్తారు. ఇప్పుడు మీరు కూడా బికారులుగా ఉన్నారు కదా. బికారి అనగా తమోప్రధానులు అని అర్థము. క్రైస్టు కూడా ఇక్కడే ఉన్నారని భావిస్తారు, కానీ అతను మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేది తెలియదు. మీ ధర్మ స్థాపకుడు మళ్ళీ తన సమయములో ధర్మ స్థాపన చేయడానికి వస్తారు అని మీరు వారికి అర్థం చేయించవచ్చు. ధర్మ స్థాపకుడిని గురువు అని అనలేరు, ఎందుకంటే అతను కేవలం ధర్మాన్ని స్థాపించడానికి మాత్రమే వస్తారు. సద్గతిదాత కేవలం ఒక్కరే. ధర్మ స్థాపన చేయడానికి ఎవరెవరైతే వస్తారో, వారందరూ పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఇప్పుడు తమోప్రధానులుగా అయిపోయారు. అంతిమములో మొత్తము వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మీకు తెలుసు - మొత్తము వృక్షమంతా నిలబడి ఉంది కానీ కేవలం దేవీ-దేవతా ధర్మము అనే కాండము మాత్రము లేదు. మర్రి వృక్షము వలె ఉంటుంది. ఈ విషయాలను తండ్రియే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకైతే ఎంతో సంతోషము ఉండాలి. మనమే ఒకప్పుడు దేవీ-దేవతలుగా ఉండేవారమని, ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నామని మీకు తెలిసింది. ఇక్కడికి మీరు వచ్చేదే సత్యనారాయణ కథను వినడానికి, దీని ద్వారా నరుడి నుండి నారాయణుడిగా తయారవుతారు. నారాయణుడు తయారైతే తప్పకుండా లక్ష్మి కూడా ఉంటుంది. లక్ష్మీ-నారాయణులు ఉంటే మరి తప్పకుండా వారి రాజధాని కూడా ఉంటుంది కదా. కేవలం లక్ష్మీ-నారాయణులు మాత్రమే తయారవ్వరు కదా. లక్ష్మిగా తయారయ్యే కథ వేరుగా ఉండదు. నారాయణుడితోపాటు లక్ష్మి కూడా తయారవుతుంది. లక్ష్మి కూడా ఒక్కోసారి నారాయణుడిగా అవుతుంది, అలాగే నారాయణుడు ఒక్కోసారి లక్ష్మిగా అవుతారు. కొన్ని-కొన్ని పాటలు చాలా బాగున్నాయి. మాయ గుటకలు వచ్చినప్పుడు ఈ పాటలు విన్నట్లయితే మళ్ళీ సంతోషము కలుగుతుంది. ఉదాహరణకు ఈత నేర్చుకునేటప్పుడు ముందు గుటకలు మింగుతారు, అప్పుడు వారిని పట్టుకుంటారు. ఇక్కడ కూడా మాయ గుటకలు చాలా మింగుతూ ఉంటారు. ఈత కొట్టేవారైతే చాలామంది ఉంటారు, వారిలో కూడా రేస్ లు జరుగుతాయి, అలాగే మీలో కూడా ఆవలి తీరానికి వెళ్ళేందుకు రేస్ జరుగుతుంది. నన్నొక్కరినే స్మృతి చేయాలి. స్మృతి చేయకపోతే గుటకలు మింగుతూ ఉంటారు. తండ్రి అంటారు, స్మృతియాత్రతోనే నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. మీరు ఆవలి తీరానికి చేరుకుంటారు. ఈత కొట్టేవారిలో కొందరు చాలా వేగముతో ఈదుతారు, కొందరు తక్కువ వేగముతో ఈదుతారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. బాబా వద్దకు చార్టు పంపిస్తూ ఉంటారు. స్మృతి చార్టును వీరు సరిగ్గా అర్థం చేసుకున్నారా లేక తప్పుగా అర్థం చేసుకున్నారా అని తండ్రి పరిశీలిస్తారు. కొందరైతే - మేము రోజంతటిలో 5 గంటలు స్మృతిలో ఉన్నామని వ్రాస్తారు, నేను విశ్వసించను, తప్పకుండా ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. కొందరు ఏమనుకుంటారంటే - ఇక్కడ ఎంతసేపైతే మేము చదువుకుంటామో అంతసేపూ చార్టు సరిగ్గా ఉంటుంది అని, కానీ అలా జరగదు. ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా, వింటూ ఉన్నా కూడా బుద్ధి బయటకు అటూ-ఇటూ వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. కొందరు పూర్తిగా వినరు కూడా. భక్తి మార్గములో ఇలా-ఇలా జరుగుతూ ఉంటుంది. సన్యాసులు కథ వినిపిస్తూ ఉంటారు, మధ్యమధ్యలో నేనేమి వినిపించాను అని ప్రశ్నిస్తూ ఉంటారు. వీరు వెర్రివారి వలె కూర్చున్నారే అని చూస్తారు, అప్పుడు ప్రశ్నిస్తారు, వారు సమాధానమివ్వలేకపోతారు. బుద్ధి ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్క అక్షరము కూడా వినరు. ఇక్కడ కూడా అలాంటివారు ఉన్నారు. బాబా చూస్తూ ఉంటారు. వీరి బుద్ధి ఎక్కడో బయట భ్రమిస్తూ ఉంటుందని భావించడం జరుగుతుంది. కొందరు కొత్తవాళ్ళు కూడా వస్తూ ఉంటారు, వారు అటూ-ఇటూ చూస్తూ ఉంటారు. వీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు అని బాబాకు అర్థమైపోతుంది, అందుకే బాబా అంటారు, కొత్తవారికి వెంటనే క్లాసులోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వకండి లేకపోతే వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. మంచి-మంచి పిల్లలెవరైతే ఉంటారో, వారు ఇక్కడ కూర్చుంటూ, కూర్చుంటూనే వైకుంఠానికి వెళ్ళిపోతారు, మున్ముందు మీరు ఇలాంటి దృశ్యాలు చూస్తారు. వారికి ఎంతో సంతోషము కలుగుతూ ఉంటుంది. ఘడియ-ఘడియ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు సమయము సమీపముగా వస్తోంది. నంబరువారు పురుషార్థానుసారముగా మీ అవస్థ ఇక ఈ విధముగా తయారవుతుంది. ఘడియ-ఘడియ స్వర్గములో మీ మహళ్ళను చూసుకుంటూ ఉంటారు. ఏదైతే చెప్పవలసి ఉంటుందో, ఏదైతే చేయవలసి ఉంటుందో అదంతా సాక్షాత్కారమవుతూ ఉంటుంది. ఏర్పాట్లు ఏ విధముగా జరుగుతున్నాయి అని మీరు సమయాన్ని చూస్తున్నారు. తండ్రి అంటారు, ఒక్క క్షణములో మొత్తము ప్రపంచములోని మనుష్యులంతా ఏ విధముగా బూడిదైపోతారో చూడండి. బాంబు వేయగానే నాశనమైపోతారు.

ఇప్పుడు మీ రాజ్యము స్థాపన అవుతోందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఇక స్మృతియాత్రలో ఆనందముగా నిమగ్నమై ఉండాలి. దృష్టి ద్వారా ఎటువంటివారికైనా బాణము తగిలే విధముగా మీలో ఆ పదునును లేక శక్తిని నింపుకోవాలి. అంతిమములో భీష్మ పితామహులు వంటివారికి కూడా మీరే జ్ఞాన బాణాలు వేస్తారు. వీరు సత్యము చెప్తున్నారని వారు వెంటనే అర్థం చేసుకుంటారు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు అయితే నిరాకారుడైన భగవంతుడు, శ్రీకృష్ణుడు కారు. శ్రీకృష్ణుడి విషయములో జన్మను చూపిస్తారు. శ్రీకృష్ణుడికి అవే ముఖకవళికలు మళ్ళీ ఇతర జన్మల్లో ఎప్పుడూ లభించవు. మళ్ళీ సత్యయుగములో అవే ముఖకవళికలు లభిస్తాయి. ప్రతి జన్మలోనూ ప్రతి ఒక్కరి ముఖకవళికలు వేరువేరుగా ఉంటాయి. ఈ డ్రామా పాత్ర ఈ విధముగా నిశ్చితమై ఉంది. అక్కడైతే ప్రకృతిసిద్ధమైన సుందరమైన ముఖకవళికలు ఉంటాయి. ఇప్పుడు ఇక రోజురోజుకు శరీరాలు కూడా తమోప్రధానమవుతూ ఉంటాయి. మొట్టమొదట సతోప్రధానముగా ఉంటాయి, ఆ తరువాత సతో, రజో, తమోగా అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి, ఎలాంటి పిల్లలు జన్మ తీసుకుంటారో చూడండి. కొందరికి కాళ్ళు పని చేయవు, కొందరు మరుగుజ్జులుగా ఉంటారు. ఏమేమో అవుతూ ఉంటుంది. సత్యయుగములో అలా జరగదు. అక్కడ దేవతలకు గడ్డము మొదలైనవి కూడా ఉండవు. క్లీన్ షేవ్ గా ఉంటుంది. వారి నయనాలు మరియు నడవడిక ద్వారా - వీరు స్త్రీ మరియు వీరు పురుషుడు అని అర్థమవుతుంది. మున్ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. పిల్లలైన మీకు ఎంత సంతోషము ఉండాలి. బాబా కల్ప-కల్పము వచ్చి మనకు రాజయోగాన్ని నేర్పించి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. ఇతర ధర్మాలవారు ఎవరైతే ఉన్నారో, వారంతా తమ-తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారని కూడా పిల్లలైన మీకు తెలుసు. ఆత్మల వృక్షాన్ని కూడా చూపిస్తారు కదా. చిత్రాలలో ఎన్నో కరెక్షన్లు చేయగా అవి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు బాబా సూక్ష్మవతనము గురించి అర్థం చేయిస్తారు, కానీ సంశయబుద్ధి కలవారైతే - ఇదేమిటి, ఇదివరకు ఇంకోలా చెప్పారు, ఇప్పుడు ఇలా చెప్తున్నారేమిటి అని అంటారు. లక్ష్మీ-నారాయణుల రెండు రూపాలను కలిపి విష్ణువు అని అంటారు. అంతేకానీ నాలుగు భుజాలు కల మనుష్యులు ఎవ్వరూ ఉండరు. రావణుడికి పది తలలు చూపిస్తారు. అటువంటి మనుష్యులు ఎవ్వరూ ఉండరు. ప్రతి సంవత్సరము కూర్చుని కాలుస్తూ ఉంటారు, బొమ్మలాటలా చేస్తారు.

శాస్త్రాలు లేకుండా మేము జీవించలేము, శాస్త్రాలు అయితే మా ప్రాణము వంటివి అని మనుష్యులు అంటారు. గీతకు ఎంత గౌరవము ఉందో చూడండి. ఇక్కడైతే మీ వద్ద ఎన్నో మురళీలు పోగవుతాయి. వాటన్నింటినీ మీరు ఉంచుకుని ఏం చేస్తారు! రోజురోజుకు మీరు కొత్త-కొత్త పాయింట్లు వింటూ ఉంటారు. ఆ, పాయింట్లను నోట్ చేసుకోవడము మంచిది. భాషణ చేసేటప్పుడు - ఈ, ఈ పాయింట్లను అర్థం చేయిస్తాము అని రిహార్సల్ చేసుకుంటారు. ఈ రోజు ఈ టాపిక్ గురించి అర్థం చేయిస్తాము అని టాపిక్ ల లిస్ట్ ఉండాలి. రావణుడు ఎవరు, రాముడు ఎవరు - సత్యము ఏమిటి అనేది మేము మీకు తెలియజేస్తాము. ఈ సమయములో రావణ రాజ్యము మొత్తము ప్రపంచమంతటిలోనూ ఉంది. పంచ వికారాలైతే అందరిలోనూ ఉన్నాయి. తండ్రి వచ్చి మళ్ళీ రామ రాజ్యాన్ని స్థాపన చేస్తారు. ఇది గెలుపు-ఓటముల ఆట. ఓటమి ఎలా జరుగుతుంది! పంచ వికారాలనే రావణుడితో ఓటమి జరుగుతుంది. ప్రారంభములో పవిత్ర గృహస్థ ఆశ్రమము ఉండేది, ఇప్పుడు అది పతిత గృహస్థముగా తయారయ్యింది. లక్ష్మీ-నారాయణులే తరువాత బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. తండ్రి కూడా అంటారు, నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. మీరు అంటారు, మేము కూడా అనేక జన్మల అంతిమములో తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఎవరైనా మందబుద్ధి కలిగి ఉంటే వారు వీటిని అర్థం చేసుకోరు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. ఎంతోమంది వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు, వారు మళ్ళీ వచ్చేస్తారు, కానీ ప్రజలలో సాధారణమైన పదవిని పొందుతారు, అలాంటివారు కూడా కావాలి కదా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా ఇదే నషాలో ఉండాలి - మేము ఇప్పుడు ఈ చదువును పూర్తి చేసి మనుష్యుల నుండి దేవతలుగా, విశ్వానికి యజమానులుగా అవుతాము. మా రాజ్యములో పవిత్రత, సుఖము, శాంతి సర్వస్వమూ ఉంటాయి, దానిని ఎవ్వరూ లాక్కోలేరు.

2. ఈ తీరము నుండి ఆవలి తీరానికి వెళ్ళేందుకు స్మృతియాత్రలో బాగా ఈదేవారిగా అవ్వాలి. మాయ గుటకలు మింగకూడదు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. స్మృతి చార్టును యథార్థముగా అర్థం చేసుకుని వ్రాయాలి.

వరదానము:-
పురుషార్థము మరియు ప్రారబ్ధము యొక్క లెక్కను తెలుసుకుని తీవ్రగతితో ముందుకు వెళ్ళే నాలెడ్జ్ ఫుల్ భవ

పురుషార్థము ద్వారా బహుకాలపు ప్రారబ్ధాన్ని తయారుచేసుకునే సమయము ఇదే, అందుకే జ్ఞానస్వరూపులుగా అయి తీవ్రగతితో ముందుకు వెళ్ళండి. ఈ రోజు కాకపోతే రేపు మారిపోతాములే అని అనుకోకండి, దీనినే నిర్లక్ష్యము అని అంటారు. ఇప్పటివరకు బాప్ దాదా స్నేహసాగరునిగా అయి సర్వ సంబంధాల స్నేహములో పిల్లల నిర్లక్ష్యాన్ని, సాధారణ పురుషార్థాన్ని చూస్తూ, వింటూ కూడా ఎక్స్ ట్రా సహాయాన్ని, ఎక్స్ ట్రా మార్కులను ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. కావున నాలెడ్జ్ ఫుల్ గా అయి ధైర్యము మరియు సహాయము అనే విశేష వరదానము యొక్క లాభాన్ని పొందండి.

స్లోగన్:-
ప్రకృతికి దాసులుగా అయ్యేవారే ఉదాసీనులుగా ఉంటారు, అందుకే ప్రకృతీజీతులుగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

ఎవరైనా సాగరములో మునిగిపోయి ఉన్నప్పుడు ఆ సమయములో వారికి సాగరము తప్ప మరేదీ కనిపించదు. అలా బాబాలో అనగా సర్వ గుణాల సాగరములో మునిగిపోండి, దీనినే లవలీన స్థితి అని అంటారు. బాబాలో కలిసిపోవడము కాదు కానీ బాబా స్మృతిలో, స్నేహములో ఇమిడిపోవాలి.