19-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్ (ఈశ్వరీయ
విద్యార్థులు), మీరు సత్యాతి-సత్యమైన రూప్ బసంత్ లుగా (జ్ఞాని-యోగి) అయ్యి తమ నోటితో
సదా జ్ఞాన రత్నాలే మాట్లాడుతూ ఉండాలి’’
ప్రశ్న:-
బాబా పిల్లలను
మేల్కొలిపేందుకు ఏ సంజీవని మూలికను ఇస్తారు?
జవాబు:-
మన్మనాభవ అనగా
తండ్రిని స్మృతి చేయండి. పరమాత్మ ద్వారా మేము దేవతలుగా అయ్యేందుకు అనగా రాజ్య పదవిని
పొందేందుకు ఈ చదువును చదువుకుంటున్నాము అన్న నషా ఉండాలి. ఈ స్మృతియే సంజీవని మూలిక,
ఇది మేల్కొల్పుతుంది. అటువంటి వారి అవస్థ ఎప్పుడూ వాడిపోలేదు. వారు సదా స్వయాన్ని
చెక్ చేసుకుంటూ ఇతరులను కూడా సావధానపరుస్తూ ఉంటారు.
ఓంశాంతి
ఇది
కాలేజ్ కదా. ఎలాగైతే స్కూలులో విద్యార్థులు కూర్చున్నప్పుడు, మేము టీచరు ఎదురుగా
కూర్చున్నామని భావిస్తారు. ఏ పరీక్ష పాస్ అయ్యేందుకు కూర్చున్నారు అనేది కూడా
బుద్ధిలో ఉంటుంది. సత్సంగాలు మొదలైన చోట్ల ఎక్కడైతే వేద-శాస్త్రాలు మొదలైనవి
వినిపిస్తారో, అక్కడ లక్ష్యమేమీ ఉండదు. ఆ శాస్త్రాలు మొదలైనవి మీ బుద్ధి నుండి
తొలగిపోయాయి. మనము భవిష్య 21 జన్మల కోసం మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు
తెలుసు. విద్యార్థులు ఇంటిలో కూర్చుని ఉన్నా లేక ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఫలానా
పరీక్ష పాస్ అవుతాను అని బుద్ధిలో ఉంటుంది. పిల్లలైన మీరు కూడా క్లాసులో కూర్చుని
ఉన్నారు, మేము దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. మీరు కూడా స్వయాన్ని విద్యార్థిగా
భావిస్తారు కదా. మనము ఆత్మలము, ఈ శరీరము ద్వారా మనము చదువుకుంటున్నాము. ఈ శరీరాన్ని
వదిలి భవిష్యత్తులో మనము కొత్త శరీరాన్ని తీసుకుంటామని, అప్పుడు దేవతలని అంటారని
ఆత్మకు తెలుసు. ఇదైతే వికారీ పతిత శరీరము, మనకు మళ్ళీ కొత్త శరీరము లభిస్తుంది. ఈ
అవగాహన ఇప్పుడు లభించింది. ఆత్మనైన నేను చదువుకుంటున్నాను, జ్ఞాన సాగరుడు
చదివిస్తున్నారు. ఇక్కడ మీకు గృహస్థ వ్యవహారము యొక్క చింత లేదు. మేము భవిష్యత్తులో
మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని బుద్ధిలో ఇదే ఉంటుంది. దేవతలు స్వర్గములో
ఉంటారు. ఈ చింతనను పదే-పదే చేస్తూ ఉన్నట్లయితే పిల్లలకు సంతోషము ఉంటుంది మరియు
పురుషార్థము కూడా చేస్తారు, మనసా-వాచా-కర్మణా పవిత్రముగా కూడా ఉంటారు, అందరికీ
సంతోషము యొక్క సందేశాన్ని వినిపిస్తూ ఉంటారు. బ్రహ్మాకుమారులైతే చాలామంది ఉన్నారు
కదా. అందరూ విద్యార్థి జీవితములో ఉన్నారు. వ్యాపార-వ్యవహారాలలోకి వెళ్ళడముతో ఈ
జీవితాన్ని మర్చిపోవడము కాదు. ఉదాహరణకు ఈ మిఠాయి వ్యాపారి ఉన్నారు, ఇతను కూడా నేను
విద్యార్థిని అనే భావిస్తారు కదా. విద్యార్థులు ఎప్పుడైనా మిఠాయిలు తయారుచేయాల్సి
ఉంటుందా? ఇక్కడైతే మీ విషయమే అతీతమైనది. శరీర నిర్వహణ కోసమని ఉద్యోగ-వ్యాపారాలు కూడా
చేయాలి, దానితో పాటు, నేను పరమపిత పరమాత్ముని ద్వారా చదువుకుంటున్నానని బుద్ధిలో
గుర్తుండాలి. ఈ సమయములో ప్రపంచములో అందరూ నరకవాసులుగా ఉన్నారని మీ బుద్ధిలో ఉంది.
కానీ, భారతవాసులైన మనము నరకవాసులుగా ఉన్నామని, భారతవాసులైన మనమే ఒకప్పుడు
స్వర్గవాసులుగా ఉండేవారమని ఎవరూ అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు కూడా రోజంతా ఈ నషా
ఉండదు. పదే-పదే మర్చిపోతూ ఉంటారు. మీరు బి.కె.లు, టీచర్లు, శిక్షణనిస్తారు.
మనుష్యులను దేవతలుగా, నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేస్తున్నారు, అయినా సరే
మర్చిపోతారు. ఈ సమయములో ప్రపంచమంతా ఆసురీ సాంప్రదాయముగా ఉందని మీకు తెలుసు. ఆత్మ
కూడా పతితముగా ఉంది, శరీరము కూడా పతితముగా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ వికారాల
పట్ల అయిష్టత ఏర్పడుతుంది. కామము, క్రోధము మొదలైనవన్నీ అయిష్టము కలిగే విషయాలు.
అన్నింటికంటే ఎక్కువ అయిష్టము కలిగే విషయము వికారాలు. సన్యాసులలో కూడా కొంచెం
క్రోధముంటుంది, ఎందుకంటే ఎటువంటి భోజనమో, అటువంటి మనసు... వారు గృహస్థులదే తింటారు.
కొంతమంది భోజనము తినరు కానీ ధనమైతే తీసుకుంటారు కదా. దానిపై పతితుల ప్రభావమైతే
ఉంటుంది కదా. పతితుల భోజనము పతితముగానే చేస్తుంది. పవిత్రతకే మీరు విశేషముగా
ప్రాధాన్యతను ఇస్తారు. మీ ఈ ప్రచారము పెరుగుతూ ఉంటుంది. మేము పవిత్రముగా అవ్వాలి అని
అందరూ కోరుకుంటారు, ఈ విషయము మనసుకు హత్తుకుంటుంది, ఎందుకంటే పవిత్రముగా
అవ్వకుండానైతే స్వర్గానికి యజమానులుగా అవ్వలేరు. నెమ్మది-నెమ్మదిగా ఈ విషయాలు అందరి
బుద్ధిలోకి వస్తూ ఉంటాయి. ఎవరైతే స్వర్గవాసులుగా అయ్యేది ఉంటుందో, వారే అవుతారు.
మేము పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా తప్పకుండా అవుతామని అంటారు. ఇది
కళ్యాణకారీ సంగమయుగము, ఈ సమయములో పతిత ప్రపంచము పావనముగా అవుతుంది. అందుకే దీనిని
పురుషోత్తమ యుగమని అంటారు. ఇది కళ్యాణకారీ యుగము. మనుష్య సృష్టి యొక్క కళ్యాణము
జరుగుతుంది. తండ్రి కళ్యాణకారీ కావున పిల్లలను కూడా అలా తయారుచేస్తారు. వారు వచ్చి
యోగము నేర్పించి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు.
ఇది మన హెడ్
స్కూల్ అని మీకు తెలుసు. ఇక్కడ ఎవరికీ ప్రాపంచిక పనులేవీ లేవు. బయటకు వెళ్ళడముతో
వ్యాపార-వ్యవహారాలలో నిమగ్నమైపోతారు, అప్పుడిక మేము విద్యార్థులము, మేము నరకవాసుల
నుండి స్వర్గవాసులుగా అవుతున్నాము అనేది గుర్తుండదు. సమయము ఉన్నప్పుడు మాత్రమే ఈ
ఆలోచనలు బుద్ధిలో నడుస్తాయి. ప్రయత్నము చేసి సమయము తీయాలి. మనము తమోప్రధానము నుండి
సతోప్రధానముగా అవుతున్నామని బుద్ధిలో గుర్తుండాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి.
వ్యాపారములో కూడా తీరిక సమయము లభిస్తుంది. మేము ఈశ్వరీయ విద్యార్థులము అనే స్మృతిని
ప్రయత్నము చేసి అయినా సరే బుద్ధిలోకి తీసుకురావాలి. జీవనోపాధి కోసం ఆ వ్యాపారము
మొదలైనవి చేస్తారు. అది మాయావీ వ్యాపారము. ఇది కూడా మీకు జీవనోపాధి, భవిష్యత్తు కోసం
సత్యమైన సంపాదనైతే ఇదే, దీని కోసం చాలా మంచి బుద్ధి కావాలి. స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ పరమపిత పరమాత్మను స్మృతి చేయాలి. ఇప్పుడు ఆత్మలమైన మనము ఇంటికి వెళ్ళాలి
అని అర్థం చేయించాలి. బాబా మనల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారు. రోజంతా బుద్ధిలో
విచార సాగర మంథనము నడవాలి. ఆవు గడ్డిని నెమరు వేసినట్లుగా మీరు నెమరువేస్తూ ఉండాలి.
పిల్లలకు అవినాశీ ఖజానా లభిస్తుంది. ఇది ఆత్మలకు భోజనము వంటిది. మేము పరమపిత
పరమాత్మ ద్వారా దేవతలుగా తయారయ్యేందుకు మరియు రాజ్య పదవిని పొందేందుకు
చదువుకుంటున్నామని గుర్తు రావాలి. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దీనిని పదే-పదే
మర్చిపోతూ ఉంటారు కావున సంతోషానికి బదులుగా అవస్థ వాడిపోయి ఉంటుంది. ఇది సంజీవని
మూలిక వంటిది. దీనిని మీ వద్ద కూడా ఉంచుకోవాలి మరియు ఇతరులను మేల్కొల్పేందుకు వారికి
కూడా ఇవ్వాలి. శాస్త్రాలలోనైతే చాలా పెద్ద-పెద్ద కథలను వ్రాసేసారు. బాబా కూర్చుని
వీటన్నింటి రహస్యాలను తెలియజేస్తున్నారు. మన్మనాభవ అనగా తండ్రిని స్మృతి
చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారు. మీ హృదయాన్ని ప్రశ్నించుకుంటూ
ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి, ఒకరికొకరు సావధానపర్చుకుంటూ ఉండండి. ఏదైనా గొడవ
జరిగినప్పుడు, బుద్ధి అందులోనే నిమగ్నమైపోయిన కారణముగా, ఎవరు ఏం చెప్పినా, అది
మధురముగా అనిపించదు. బుద్ధి మాయ వైపు నిమగ్నమైపోవడముతో ఇక అదే చింత ఉంటుంది.
పిల్లలైన మీకైతే సంతోషముండాలి. తండ్రిని స్మృతి చేయండి. కానీ మీరు మీ సమస్యల్లోనే
ఉన్నట్లయితే, ఆ మందు పని చేయదు, గుటకలు మింగుతూ ఉంటారు. అలా చేయకూడదు. విద్యార్థులు
చదువును వదిలి వెళ్ళిపోరు కదా. మన ఈ చదువు భవిష్యత్తు కోసమని, ఇందులోనే మన
కళ్యాణముందని పిల్లలైన మీకు తెలుసు. వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ కూడా
కోర్సు తీసుకోవాలి. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, ఈ నాలెడ్జ్ ను కూడా బుద్ధిలో
ఉంచుకోవాలి. స్మృతి అనేది సంజీవని మూలిక వంటిది. పరస్పరములో ఒకరికొకరు
స్మృతినిప్పించుకుంటూ ఉండాలి. పతి-పత్ని ఒకరికొకరు స్మృతినిప్పించుకుంటూ ఉండాలి.
శివబాబా బ్రహ్మా ద్వారా చదివిస్తున్నారు. శివబాబా రథాన్ని అలంకరిస్తున్నారు కనుక
శివబాబా స్మృతి ఉండాలి. రోజంతా స్మృతిలో ఉండడమైతే కష్టము. ఆ అవస్థ అయితే చివరిలోనే
తయారవ్వనున్నది. కర్మాతీత అవస్థ ఏర్పడనంతవరకు రుస్తుంతో మాయ యుద్ధము చేస్తూనే
ఉంటుంది. పరస్పరములో ఒకరినొకరు సావధానపర్చుకుంటూ ఉన్నతిని పొందండి అని అంటూ ఉంటారు
కూడా. ఆఫీసర్లు నౌకర్లకు కూడా చెప్తూ ఉంటారు - నాకు ఈ విషయాలను గుర్తు చేయండి అని.
మీరు కూడా పరస్పరములో ఒకరికొకరు స్మృతినిప్పించుకోండి. గమ్యము చాలా ఉన్నతమైనది.
తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా అయిపోతారు. తండ్రి కొత్త
విషయాలేవీ వినిపించడము లేదు. మీరు లక్షల, కోట్ల సార్లు ఈ జ్ఞానాన్ని విన్నారు, మళ్ళీ
వింటారు. మేము కల్ప-కల్పము విన్నాము అని చెప్పేవారు ఏ సత్సంగములోనూ ఉండరు. ఇప్పుడు
వింటున్నారు, తర్వాత మళ్ళీ వింటారు. కల్ప-కల్పము వింటూ వచ్చామని ఎవరూ చెప్పలేరు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు అర్ధకల్పము భక్తి చేసారు, ఇప్పుడు మళ్ళీ మీకు
జ్ఞానము లభించింది, దీని ద్వారా సద్గతి కలుగుతుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే
పాపాలు తొలగిపోతాయి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము కదా. పురుషార్థము చేయాలి. జడ్జి
లేక ఎవరైనా గొప్ప వ్యక్తి కొడుకు ఏదైనా తప్పుడు పని చేస్తే పేరు అప్రతిష్ఠపాలవుతుంది.
ఇక్కడ మీరు కూడా తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక అటువంటి కర్మలేవీ చేయకూడదు,
లేదంటే తండ్రికి నింద తీసుకువస్తారు. సద్గురువుకు నింద తీసుకువచ్చేవారు ఉన్నత
స్థానాన్ని పొందలేరు. ఈశ్వరుని సంతానముగా అయ్యారు కనుక ఆసురీ కర్మలకు భయపడాలి.
శ్రీమతాన్ని అనుసరించాల్సి ఉంటుంది. సొంత మతాన్ని అనుసరిస్తే మోసపోతారు, పదవి
భ్రష్టమైపోతుంది. మేము మీ మతాన్ని సరిగ్గా అనుసరిస్తున్నామా అని బాబాను అడగవచ్చు
కూడా. తండ్రి యొక్క మొట్టమొదటి మతము - తండ్రిని స్మృతి చేయండి. ఏ వికర్మలూ చేయకండి.
బాబా, నేను ఏ వికర్మలు చేస్తున్నానో మీకు తెలిస్తే చెప్పండి అని అడుగుతారు. నాకు
తెలిస్తే చెప్తాను. మీ ద్వారా ఈ-ఈ తప్పులు జరుగుతున్నాయి, వీటిని వికర్మలని అంటారని
బాబా చెప్తారు. అన్నింటికంటే పెద్ద వికర్మ కామ వికారానికి సంబంధించినది. దీని
గురించే ఎక్కువ గొడవలు జరుగుతాయి. పిల్లలకు ధైర్యము ఉండాలి, ఆలోచించాలి. మేము అసలు
వివాహము చేసుకునేదే లేదు అని చెప్పే కుమారీల గ్రూపు ఉండాలి. ఇప్పుడిది కల్పము యొక్క
సంగమయుగము, ఇందులో పురుషోత్తములుగా అవ్వాలి. ఈ లక్ష్మీ-నారాయణులను పురుషోత్తములు అని
అంటారు. వికారులను పురుషోత్తములని అనరు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు.
అలా తయారయ్యే హక్కు అందరికీ ఉంది. పురుషోత్తమ మాసములో మీరు ఎంత సేవ చేయవచ్చు. చాలా
వైభవోపేతముగా చేయాలి. ఈ పురుషోత్తమ యుగమే ఉత్తమ యుగము, ఈ సమయములో మనుష్యులు
నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు. ఇది సాధారణమైన విషయము. పిల్లలైన మీరు మంచి
రీతిలో అర్థం చేయించాలి. పురుషోత్తములు సత్యయుగములో ఉంటారు. కలియుగములో ఉత్తమ
పురుషులెవరూ ఉండనే ఉండరు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. అక్కడైతే అందరూ పవిత్రముగానే
ఉంటారు. ఇతరులకు అర్థం చేయించేందుకని తండ్రి ఈ విషయాలన్నింటినీ పిల్లలకు అర్థం
చేయిస్తారు. అవకాశము చూసి అర్థం చేయించాలి. మీరు ఇక్కడ కూర్చున్నారు. మాకు నిరాకార
బాబా, పరమపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పిస్తున్నారని, మేము విద్యార్థులమని మీరు
అర్థం చేసుకున్నారు. ఈ చదువు ద్వారా స్వర్గములో దేవీ-దేవతలుగా అవుతున్నారు. అన్ని
పరీక్షల కంటే ఇదే పెద్ద పరీక్ష, ఇది రాజ్యము ప్రాప్తి చేసుకునే పరీక్ష. దీని కోసం
పరమాత్మ తప్ప ఎవరూ చదివించలేరు. బాబా స్వయం పరోపకారి, వారు స్వయం స్వర్గానికి
యజమానిగా అవ్వరు. స్వర్గ రాకుమారునిగా శ్రీకృష్ణుడే అవుతారు. బాబా నిష్కామ సేవ
చేస్తారు. బాబా అంటారు - నేను రాజుగా అవ్వను, మిమ్మల్ని రాజులకే రాజులుగా చేస్తాను.
ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. చాలామంది ఇక్కడ షావుకారులుగా ఉంటారు కానీ అక్కడ
పేదవారిగా అయిపోతారు మరియు ఎవరైతే ఇప్పుడు పేదవారిగా ఉన్నారో, వారు అక్కడ గొప్ప
షావుకారులుగా అవుతారు. విశ్వానికి యజమానులుగా అవ్వడమనేది అనంతమైన విషయము కదా. నేను
మిమ్మల్ని రాజులకే రాజులుగా చేస్తానని, స్వర్గానికి యజమానులుగా చేస్తానని అంటూ
ఉంటారు కూడా. మనము స్వర్గానికి యజమానులుగా అవుతున్నామని మీకు తెలుసు కనుక ఎంత నషా
ఉండాలి. మనల్ని చదివించేవారు పరమపిత పరమాత్మ. మనము ఇప్పుడు నరకవాసుల నుండి
స్వర్గవాసులైన దేవతలుగా అవుతాము. ఈ విషయము గుర్తున్నా సరే, సంతోషము యొక్క పాదరసము
పైకి ఎక్కి ఉంటుంది. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ (విద్యార్థి జీవితము
అత్యుత్తమమైన జీవితము). పురుషార్థము చేసి రాజు, రాణిగా అవ్వాలి కదా. మనము రాజుగా అయి,
మళ్ళీ పేదవారిగా అవుతామని ఇతరులకు చెప్పకూడదు. ఈ విషయము చెప్పకూడదు. ఏమవ్వాలని
అనుకుంటున్నారు - అని అడగాలి. అందరూ, మేము విశ్వానికి యజమానులుగా అవుతామని అంటారు.
తండ్రి అయిన భగవంతుడు మాత్రమే అలా తయారుచేయగలరు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే
మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారని అంటారు. ఇది ఎంత సహజమైన విషయము.
ఎవరైనా సరే, ఎంతటి పేదవారైనా సరే అలా తయారవ్వగలరు. ఇందులో ధనము యొక్క విషయమేమీ లేదు.
అందుకే తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు.
తండ్రిని
స్మృతి చేసి పాపాల కుండను ఖాళీ చేసుకోవాలి, ఎవరు ఎంత శ్రమ చేస్తారో అంత పొందుతారు.
మీరు ఎంత పైకి ఎక్కుతారు (ఉన్నతిలోకి వెళ్తారు) అనేది మెట్ల వరుస చిత్రములో చూస్తారు.
ఎవరైతే జ్ఞాన మార్గములో సదా ఉన్నతిని పొందుతూ ఉంటారో, వారు రాజ్య రసాన్ని
ఆస్వాదిస్తారు, ఒకవేళ తప్పటడుగు వేసి మాయకు వశమై దిగజారితే అధఃపాతాళము తప్పదు.
వికారాల్లో పడిపోయారంటే, బాబాను వదిలి వెళ్ళిపోయారంటే, బాబా అంటారు - పూర్తిగా కింద
పడిపోతారు. సుపుత్రులైన పిల్లలైతే పురుషార్థము చేసి తమ జన్మను వజ్ర సమానముగా
తయారుచేసుకుంటారు. పిల్లలు చాలా పురుషార్థము చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరెంత
చేస్తారో, అంత పొందుతారు. మాత-పితలను అనుసరించండి, తమ సమానముగా తయారుచేయండి అని బాబా
అందరికీ చెప్తారు. ఎంతగా దయార్ద్ర హృదయులుగా అవుతారో, అంతగా మీకే లాభముంటుంది.
సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇతరులకు యుక్తులను తెలుపుతూ ఉండాలి. లేదంటే అంత ఉన్నత
పదవిని పొందలేరు. చివరిలో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. అప్పుడిక ఆ సమయములో
మీరేమీ చేయలేరు. పరీక్షలో ఫెయిల్ అయ్యారు అంటే ఇక ఫెయిల్ అయినట్లే. చివరిలో
పశ్చాత్తాపపడాల్సిన అవసరము రాకూడదు. ఇక అప్పుడు పురుషార్థము చేయలేరు. అందుకే, ఎంతగా
తమ మరియు ఇతరుల కళ్యాణము చేయాలో, అంత చేయండి. అంధులకు చేతికర్రగా అవ్వండి.
కల్ప-కల్పము స్వర్గ స్థాపన చేసారు, ఇప్పుడు కూడా తప్పకుండా చేస్తారు. డ్రామాలో
నిశ్చితమై ఉంది. ఇప్పుడు ఎవరైతే చేస్తారో, వారే పొందుతారు. బాబా యొక్క ప్రియమైన
పిల్లలు దాగి ఉండరు. రూప్-బసంత్ (జ్ఞాని-యోగి) వలె నోటి నుండి రత్నాలే వెలువడాలి.
కపటముతో గొడవలు పెట్టేవారిగా అవ్వకూడదు, ఇతరులను నష్టపర్చకూడదు. మీకు ఎవరైనా తప్పుడు
విషయాలను వినిపిస్తే, వారు కపటముతో గొడవలు పెట్టేవారు అని అర్థం చేసుకోండి. వారితో
జాగ్రత్తగా ఉండాలి. తమ అనంతమైన వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవడములో పూర్తిగా
తత్పరులై ఉండండి. అచ్ఛా!
మధురాతి
మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తమ మరియు ఇతరుల కళ్యాణము చేయాలి. అంధులకు చేతికర్రగా అవ్వాలి. ఎప్పుడైనా
ఎవరైనా తప్పుడు మాటలు వినిపిస్తే వారితో జాగ్రత్తగా ఉండాలి.
2. మనసా-వాచా-కర్మణా పవిత్రముగా అవ్వాలి. మేము విద్యార్థులము, భగవంతుడు మాకు
దేవతలుగా తయారయ్యే చదువును చదివిస్తున్నారు, ఈ సంతోషములోనే ఉండాలి.
వరదానము:-
సాథీ మరియు సాక్షీ స్థితి యొక్క స్మృతి ద్వారా అన్ని బంధనాల
నుండి ముక్తులుగా అయ్యే సర్వ శక్తి సంపన్న భవ
సర్వ శక్తులతో సంపన్నముగా అయి ఆధీనత నుండి అతీతముగా
అయ్యేందుకు రెండు పదాలు సదా గుర్తుండాలి - ఒకటి సాక్షీ, రెండు సాథీ (సహచరుడు). ఈ
స్మృతితో బంధనముక్త అవస్థ త్వరగా తయారవుతుంది. సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉంటే
సర్వ శక్తులు స్వతహాగా ప్రాప్తిస్తాయి మరియు సాక్షీగా అయి నడుచుకున్నట్లయితే ఏ
బంధనములోనూ చిక్కుకోరు. ఈ శరీరములో నిమిత్తమాత్రముగా ఉంటూ కర్తవ్యము చేయాలి మరియు
వెంటనే సాక్షీగా అవ్వాలి - విశేషముగా ఈ అభ్యాసాన్ని పెంచండి.
స్లోగన్:-
అశుద్ధము మరియు
శుద్ధము - ఈ రెండింటి మధ్యన యుద్ధము ఉంటే బ్రాహ్మణులకు బదులుగా క్షత్రియులు అవుతారు.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
తపిస్తున్న మరియు
బికారుల వలె దాహముతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేందుకు స్వయాన్ని అతీంద్రియ సుఖముతో
మరియు సర్వ శక్తులతో నిండుగా చేసుకోండి. ఎంతగా సర్వ శక్తుల ఖజానా, అతీంద్రియ సుఖపు
ఖజానా కలిసి ఉంటాయో, అంతగానే మీ స్థితి స్థిరముగా నిలిచి ఉంటుంది మరియు ఇతర ఆత్మలను
కూడా సంపన్నముగా చేయగలరు. మీరు సర్వుల ఒడిని నింపే దాత పిల్లలు. మీరు అందరికీ
ఇవ్వాలి. ఇవ్వబోయే ఆ దృశ్యము చాలా త్వరలోనే మీ ఎదురుగా వస్తుంది.