19-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు సదా స్మృతి యొక్క ఉరికంబముపై ఎక్కి ఉండాలి, స్మృతి ద్వారానే ఆత్మ సత్యమైన బంగారముగా తయారవుతుంది’’

ప్రశ్న:-
ఏ బలము క్రిమినల్ దృష్టిని వెంటనే పరివర్తన చేస్తుంది?

జవాబు:-
జ్ఞానము యొక్క మూడవ నేత్రము యొక్క బలము ఆత్మలోకి వచ్చినప్పుడు క్రిమినల్ తనము సమాప్తమైపోతుంది. తండ్రి శ్రీమతము ఏమిటంటే - పిల్లలూ, మీరందరూ పరస్పరములో సోదరులు, సోదర-సోదరీలు, మీ కళ్ళు ఎప్పుడూ క్రిమినల్ గా అవ్వలేవు. మీరు సదా స్మృతి యొక్క నషాలో ఉండండి. వాహ్ భాగ్యము వాహ్! నన్ను భగవంతుడు చదివిస్తున్నారు. ఈ విధముగా ఆలోచించినట్లయితే నషా నిలిచి ఉంటుంది.

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి కూడా ఆత్మనే అని, వారు పర్ఫెక్ట్ అని, వారికి ఎటువంటి తుప్పు పట్టి లేదు అని పిల్లలకు తెలుసు. నాపై తుప్పు ఉంది అని శివబాబా అంటారా. అస్సలు అనరు. ఈ దాదాపై అయితే పూర్తిగా తుప్పు ఉండేది. వీరిలో తండ్రి ప్రవేశించారు కావున సహాయము కూడా లభిస్తుంది. ముఖ్యమైన విషయమేమిటంటే 5 వికారాల కారణముగా ఆత్మపై తుప్పు ఏర్పడడముతో ఆత్మ అపవిత్రముగా అయిపోయింది. ఎవరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా తుప్పు వదిలిపోతూ ఉంటుంది. భక్తి మార్గపు కథలనైతే జన్మ-జన్మాంతరాలుగా వింటూ వచ్చారు. ఈ విషయాలైతే అతీతమైనవి. మీకు ఇప్పుడు జ్ఞాన సాగరుడి నుండి జ్ఞానము లభిస్తుంది. మీ బుద్ధిలో లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది, ఇతర ఏ సత్సంగాలు మొదలైనవాటిలో లక్ష్యము-ఉద్దేశ్యము లేదు. డ్రామా ప్లాన్ అనుసారముగా ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటూ నన్ను నిందిస్తూ ఉంటారు. ఇది డ్రామా అని కూడా మనుష్యులు అర్థం చేసుకోరు. ఇందులో క్రియేటర్, డైరెక్టర్ కూడా డ్రామాకు వశమై ఉన్నారు. వారిని సర్వశక్తివంతుడు అని అంటూ ఉంటారు కానీ వారు కూడా డ్రామా పట్టాలపై నడుస్తున్నారని మీకు తెలుసు. స్వయముగా తండ్రే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వారు అంటారు, నా ఆత్మలో అవినాశీ పాత్ర నిశ్చితమై ఉంది, దాని అనుసారముగా చదివిస్తాను. నేను ఏదైతే అర్థం చేయిస్తానో, అదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇప్పుడు మీరు ఈ పురుషోత్తమ సంగమయుగములో పురుషోత్తములుగా అవ్వాలి. భగవానువాచ కదా. తండ్రి అంటారు, పిల్లలైన మీరు పురుషార్థము చేసి ఈ లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలి. మీరు విశ్వానికి యజమానులుగా అవ్వాలని ఈ విధముగా మనుష్యులెవ్వరూ చెప్పలేరు. మనము విశ్వానికి యజమానులుగా, నరుని నుండి నారాయణునిగా అవ్వడము కోసమే వచ్చామని మీకు తెలుసు. భక్తి మార్గములోనైతే జన్మ-జన్మాంతరాలుగా కథలు వింటూ వచ్చారు, ఏమీ అర్థమయ్యేది కాదు. తప్పకుండా ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము స్వర్గములో ఉండేదని, ఇప్పుడు లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. త్రిమూర్తుల గురించి కూడా పిల్లలకు అర్థం చేయించారు. బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవత ధర్మము యొక్క స్థాపన జరుగుతుంది. సత్యయుగములో ఆ ఒక్క ధర్మమే ఉండేది, వేరే ధర్మాలేవీ ఉండేవి కాదు. ఇప్పుడు ఆ ధర్మము లేదు, అది మళ్ళీ స్థాపనవుతుంది. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము యొక్క సంగమయుగములో వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. ఇది పాఠశాల కదా. ఇక్కడ పిల్లలు తమ క్యారెక్టర్లను కూడా తీర్చిదిద్దుకోవాలి. 5 వికారాలను తొలగించుకోవాలి. మీరే దేవతల ఎదురుగా వెళ్ళి - మీరు సర్వగుణ సంపన్నులు... మేము పాపులము అని పాడేవారు. భారతవాసులే దేవతలుగా ఉండేవారు. సత్యయుగములో ఈ లక్ష్మీ-నారాయణులు పూజ్యులుగా ఉండేవారు, తర్వాత కలియుగములో పూజారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు. ఇంతకుముందు పూజ్యులుగా, సతోప్రధాన ఆత్మలుగా ఉండేవారు. వారి శరీరాలు కూడా సతోప్రధానముగా ఉండేవి. ఎటువంటి ఆత్మనో, అటువంటి ఆభరణము. బంగారములో మాలిన్యాన్ని కలిపినప్పుడు దాని విలువ ఎంతగా తగ్గిపోతుంది. ఇంతకుముందు మీ విలువ కూడా చాలా ఉన్నతముగా ఉండేది, ఇప్పుడు విలువ ఎంతగా తగ్గిపోయింది. మీరు పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. ఇప్పుడు ఎంతగా యోగములో ఉంటారో, అంతగా తుప్పు తొలగుతుంది మరియు తండ్రి పట్ల ప్రేమ ఏర్పడుతుంది, సంతోషము కూడా కలుగుతుంది. తండ్రి స్పష్టముగా చెప్తున్నారు - పిల్లలూ, మొత్తము రోజంతటిలో నేను ఎంత సమయము స్మృతి చేస్తున్నాను అని చార్ట్ పెట్టండి. స్మృతియాత్ర అన్న పదము సరైనది. స్మృతి చేస్తూ-చేస్తూ, తుప్పు తొలగుతూ-తొలగుతూ, అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ లభిస్తుంది. అక్కడైతే పండాలు యాత్రలకు తీసుకువెళ్తారు. ఇక్కడైతే స్వయముగా ఆత్మే యాత్ర చేస్తుంది. మనం మన పరంధామానికి వెళ్ళాలి ఎందుకంటే డ్రామా చక్రము ఇప్పుడు పూర్తవుతుంది. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచమని కూడా మీకు తెలుసు. పరమాత్మ గురించైతే ఎవ్వరికీ తెలియదు, తెలుసుకోరు కూడా, అందుకే వినాశ కాలే విపరీత బుద్ధి అని అంటారు. వారికైతే ఈ నరకమే స్వర్గము సమానముగా ఉంటుంది. వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోలేవు. ఇవన్నీ విచార సాగర మంథనము చేసేందుకు పిల్లలైన మీకు చాలా ఏకాంతము కావాలి. ఇక్కడైతే ఏకాంతము చాలా బాగుంటుంది, అందుకే మధుబన్ కు మహిమ ఉంది. పిల్లలకు చాలా సంతోషము ఉండాలి. జీవాత్మలైన మనల్ని పరమాత్మ చదివిస్తున్నారు. కల్పక్రితము కూడా ఇలాగే చదివించారు. ఇది శ్రీకృష్ణుని విషయము కాదు. అతను చిన్న బాలుడు. అతను ఆత్మ, వీరు పరమాత్మ. మొదటి నంబర్ ఆత్మ అయిన శ్రీకృష్ణుడే మళ్ళీ చివరి నంబరులోకి వచ్చేశారు కావున పేరు కూడా మారిపోయింది. అనేక జన్మల అంతిమ జన్మలో వేరే పేరు ఉంటుంది కదా. వీరిని దాదా లేఖ రాజ్ అని అనేవారు. ఇది వీరి అనేక జన్మల అంతిమ జన్మ. తండ్రి అంటారు, నేను వీరిలో ప్రవేశించి మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. తండ్రి ఎవరో ఒకరిలోకైతే వస్తారు కదా. శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు, మీరే చదువుకుంటారు. మళ్ళీ సత్యయుగములో ఈ జ్ఞానముండదు. అక్కడ ప్రారబ్ధము ఉంటుంది. తండ్రి సంగమములో వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు, ఆ తర్వాత మీరు పదవిని పొందుతారు. ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని పొందే సమయము, అందుకే పిల్లలు పొరపాట్లు చేయకూడదు. మాయ చాలా పొరపాట్లు చేయిస్తుంది, అప్పుడిక వారి భాగ్యములో లేదని అనుకోవడం జరుగుతుంది. తండ్రి అయితే పురుషార్థము చేయిస్తారు. భాగ్యములో ఎంత తేడా వచ్చేస్తుంది. కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. డబల్ కిరీటధారులుగా అయ్యేందుకు పురుషార్థము చేయవలసి ఉంటుంది.

తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో ఉండండి. లౌకిక తండ్రి ఋణాన్ని కూడా పిల్లలు తీర్చుకోవాలి. నియమబద్ధముగా నడుచుకోవాలి. ఇక్కడైతే అందరూ నియమ విరుద్ధముగా ఉన్నారు. మనమే ఎంతో ఉన్నతముగా, పవిత్రముగా ఉండేవారమని, ఆ తర్వాత పడిపోతూ వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అవ్వాలి. ప్రజాపిత బ్రహ్మా పిల్లలైన మీరందరూ బి.కె.లు కావున క్రిమినల్ దృష్టి ఉండకూడదు ఎందుకంటే మీరు సోదరీ-సోదరులు కదా. తండ్రి ఈ యుక్తిని తెలియజేస్తారు. మీరందరూ బాబా-బాబా అని అంటున్నారంటే పరస్పరము సోదరీ-సోదరులైనట్లు. భగవంతుడిని అందరూ బాబా అని అంటారు కదా. మేము శివబాబా పిల్లలము అని ఆత్మలు అంటారు. ఆ తర్వాత శరీరములో ఉన్నప్పుడు సోదరీ-సోదరులు అవుతారు. కావున మనకు వికారీ దృష్టి ఎందుకు ఉండాలి. మీరు ఇది పెద్ద-పెద్ద సభలలో అర్థం చేయించవచ్చు. మీరంతా పరస్పరము సోదరులు, తర్వాత ప్రజాపిత బ్రహ్మా ద్వారా రచన రచింపబడింది కావున సోదరీ-సోదరులుగా అయ్యారు, ఇంకే సంబంధమూ లేదు. మనమందరము ఒకే తండ్రి పిల్లలము. ఒకే తండ్రికి పిల్లలు అన్నప్పుడు వికారాలలోకి ఎలా వెళ్ళగలరు. పరస్పరము సోదరులము కూడా, అలాగే సోదరీ-సోదరులము కూడా. ఈ కళ్ళు చాలా మోసము చేస్తాయని తండ్రి అర్థం చేయించారు. కళ్ళు మంచి వస్తువును చూసినప్పుడే దానిపై మనసు కలుగుతుంది. ఒకవేళ కళ్ళు చూడనే చూడకపోతే, కోరిక అనేదే కలగదు. ఈ క్రిమినల్ దృష్టిని పరివర్తన చేసుకోవలసి ఉంటుంది. సోదరీ-సోదరులు వికారాలలోకి వెళ్ళలేరు. ఆ దృష్టి తొలగిపోవాలి. జ్ఞానము యొక్క మూడవ నేత్రపు బలము కావాలి. అర్ధకల్పము ఈ కళ్ళ ద్వారా పని చేసారు, ఇప్పుడు తండ్రి అంటారు, ఈ తుప్పు అంతా ఎలా తొలగుతుంది? పవిత్రముగా ఉన్న ఆత్మలైన మనపై తుప్పు చేరింది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా తండ్రిపై ప్రేమ కలుగుతుంది. చదువు ద్వారా కాదు, స్మృతి ద్వారా ప్రేమ కలుగుతుంది. ప్రాచీన యోగము భారత్ దే, దీని ద్వారా ఆత్మ పవిత్రముగా అయి తన ధామానికి వెళ్ళిపోతుంది. సోదరులందరికీ తమ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. సర్వవ్యాపి జ్ఞానము ద్వారానైతే చాలా తీవ్రముగా పడిపోయారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, డ్రామానుసారముగా మీ పాత్ర అలా ఉంది. రాజధాని తప్పకుండా స్థాపనవ్వనున్నది. కల్పక్రితము ఎంతగా పురుషార్థము చేశారో, అంతగానే తప్పకుండా చేస్తారు. మీరు సాక్షీగా అయి చూస్తూ ఉంటారు. ఈ ప్రదర్శనీలు మొదలైనవైతే చాలా చూస్తూ ఉంటారు. మీది ఈశ్వరీయ మిషన్. ఇది నిరాకార గాడ్ ఫాదర్లీ మిషన్. అవి క్రిస్టియన్ మిషన్లు, బౌద్ధ మిషన్లు. ఇది నిరాకార ఈశ్వరీయ మిషన్. నిరాకారుడైతే తప్పకుండా ఏదో ఒక శరీరములోకి వస్తారు కదా. నిరాకార ఆత్మలైన మీరు కూడా నాతో పాటే ఉండేవారు కదా. ఈ డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఎవరి బుద్ధిలోనూ లేదు. రావణ రాజ్యములో అందరూ విపరీత బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు తండ్రితో ప్రీతిని జోడించాలి. నాకైతే ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నదే మీ ప్రతిజ్ఞ. నష్టోమోహులుగా అవ్వాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. ఇది ఉరికంబము పైకి ఎక్కడము వంటిది. తండ్రిని స్మృతి చేయడము అనగా ఉరికంబము ఎక్కడము. ఆత్మ తన శరీరాన్ని మర్చిపోయి తండ్రి స్మృతిలోకి వెళ్ళిపోవాలి. తండ్రి స్మృతి చాలా అవసరము. లేకపోతే తుప్పు ఎలా తొలగుతుంది? శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలకు లోలోపల సంతోషముండాలి. ఎవరైనా వింటే - వీరు ఏం మాట్లాడుతున్నారని అంటారు, ఎందుకంటే వారు శ్రీకృష్ణుడిని భగవంతునిగా భావిస్తారు.

మనము ఇప్పుడు శ్రీకృష్ణుని రాజధానిలోకి వెళ్తామని పిల్లలైన మీకైతే ఇప్పుడు చాలా సంతోషము కలుగుతుంది. మనము కూడా రాకుమార, రాకుమారీలుగా అవ్వగలము. వారు మొదటి రాకుమారుడు. కొత్త ఇంటిలో ఉంటారు. తర్వాత జన్మించే పిల్లలైతే ఆలస్యముగా వచ్చినట్లే కదా. జన్మ స్వర్గములోనే జరుగుతుంది. మీరు కూడా స్వర్గములో రాకుమారులుగా అవ్వవచ్చు. అందరూ అయితే మొదటి నెంబరులోకి రారు. మాల నంబరువారుగా తయారవుతుంది కదా. తండ్రి అంటారు - పిల్లలూ, బాగా పురుషార్థము చేయండి. ఇక్కడికి మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు. కథ కూడా సత్యనారాయణుని కథ. సత్య లక్ష్మి యొక్క కథ అని ఎప్పుడూ విని ఉండరు. ప్రేమ కూడా అందరికీ శ్రీకృష్ణుని పట్లే ఉంది. శ్రీకృష్ణుడినే ఊయలలో ఊపుతారు. రాధను ఎందుకు ఊపరు? డ్రామా ప్లాన్ అనుసారముగా వారి పేరు కొనసాగుతూ వస్తుంది. రాధ మీ తోటి వారు, అయినా ప్రేమ శ్రీకృష్ణుని పట్లే ఉంటుంది. డ్రామాలో వారి పాత్ర కూడా ఆ విధముగా ఉంది. పిల్లలు సదా ప్రియముగా ఉంటారు. తండ్రి పిల్లలను చూసి ఎంతగా సంతోషిస్తారు. కొడుకు జన్మిస్తే సంతోషము కలుగుతుంది, కూతురు జన్మిస్తే గుటకలు మింగుతూ ఉంటారు. కొందరైతే హతమార్చేస్తారు కూడా. రావణ రాజ్యములోని క్యారెక్టర్లలో ఎంత తేడా వస్తుంది. మీరు సర్వగుణ సంపన్నులు... మేము నిర్గుణులము అని పాడుతారు కూడా. ఇప్పుడు తండ్రి అంటారు, మళ్ళీ అటువంటి గుణవంతులుగా అవ్వండి. మనము అనేక సార్లు ఈ విశ్వానికి యజమానులుగా అయ్యామని, ఇప్పుడు మళ్ళీ తయారవ్వాలని ఇప్పుడు భావిస్తారు. పిల్లలకు చాలా సంతోషము ఉండాలి. వాహ్! శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు. కూర్చుని ఇదే చింతన చేయండి. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు, వాహ్ భాగ్యము వాహ్! ఈ విధముగా ఆలోచిస్తూ పూర్తిగా ఆత్మిక నషాలో నిమగ్నమైపోవాలి. వాహ్ భాగ్యము వాహ్! అనంతమైన తండ్రి మాకు లభించారు, మేము బాబానే స్మృతి చేస్తాము. పవిత్రతను ధారణ చేయాలి. మనము ఇలా తయారవుతాము, దైవీ గుణాలను ధారణ చేస్తాము. ఇది కూడా మన్మనాభవయే కదా. బాబా మనల్ని ఇలా తయారుచేస్తున్నారు. ఇది ప్రాక్టికల్ గా అనుభవము చేసే విషయము.

తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు సలహా ఇస్తున్నారు - చార్ట్ వ్రాయండి మరియు ఏకాంతములో కూర్చుని మీతో మీరు ఇలా మాట్లాడుకోండి. ఈ బ్యాడ్జిను ఛాతిపై తగిలించుకోండి. భగవంతుని శ్రీమతము ఆధారముగా మనము ఇలా తయారవుతున్నాము. దీనిని చూస్తూ వారిని ప్రేమిస్తూ ఉండండి. బాబా స్మృతి ద్వారా మనము ఇలా తయారవుతాము. బాబా, మీదైతే అద్భుతము. బాబా, మీరు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారని ఇంతకుముందు మాకు తెలియదు. నవ విధ భక్తిలో దర్శనము కొరకు శిరస్సును ఖండించుకోవడానికి, ప్రాణ త్యాగము చేయడానికి సిద్ధమైపోతారు, అప్పుడు దర్శనమవుతుంది. ఇటువంటి భక్తుల మాలే తయారై ఉంది. భక్తుల పట్ల గౌరవము కూడా ఉంది. కలియుగములో భక్తులు చక్రవర్తుల వలె ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి పట్ల ప్రీతి ఉంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు ఉండకూడదు. లైన్ పూర్తిగా క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనము తండ్రి ఆజ్ఞపై పూర్తిగా నడుచుకుంటాము. కామము మహాశత్రువు, దానితో ఓడిపోకూడదు. ఓటమి పొందిన తర్వాత పశ్చాత్తాపపడి ఏం చేస్తారు? ఒక్కసారిగా ఎముకలన్నీ విరిగిపోతాయి. చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది. తుప్పు తొలగిపోయేందుకు బదులుగా ఇంకా తీవ్రముగా పట్టేస్తుంది. యోగము కుదరదు. స్మృతిలో ఉండడము చాలా కష్టము. మేము తండ్రి స్మృతిలోనే ఉంటామని చాలా ప్రగల్భాలు పలుకుతారు. అలా ఉండలేరని బాబాకు తెలుసు. ఇందులో మాయా యొక్క పెద్ద తుఫానులు వస్తాయి. స్వప్నాలు మొదలైనవి ఎటువంటివి వస్తాయంటే, అవి బాగా విసిగించేస్తాయి. జ్ఞానమైతే చాలా సహజము. చిన్న పిల్లలు కూడా అర్థం చేయించగలరు. ఇకపోతే స్మృతియాత్రలోనే చాలా ఆటంకము కలుగుతుంది. మేము చాలా సేవ చేస్తున్నాము అని సంతోషపడిపోకూడదు. తమ యొక్క గుప్త సేవను (స్మృతిని) చేస్తూ ఉండండి. నేను శివబాబాకు ఒక్కగానొక్క బిడ్డను అని వీరికైతే నషా ఉంటుంది. బాబా విశ్వ రచయిత కావున తప్పకుండా మనము కూడా స్వర్గానికి యజమానులుగా అవుతాము. నేను రాకుమారునిగా అవ్వబోతున్నాను అని ఆంతరిక సంతోషము ఉండాలి. కానీ ఎంతగా పిల్లలైన మీరు స్మృతిలో ఉండగలరో, అంతగా నేను ఉండలేను. బాబా అయితే చాలా ఆలోచించవలసి ఉంటుంది. బాబా గొప్ప వ్యక్తులకు ఎందుకు అన్ని మర్యాదలు చేస్తారని పిల్లలకు ఎప్పుడూ ఈర్ష్య కలగకూడదు. తండ్రి ప్రతి బిడ్డ యొక్క నాడిని చూసి, వారి కళ్యాణార్థము ప్రతి ఒక్కరినీ దాని అనుసారముగా నడిపిస్తారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఎలా నడిపించాలో టీచర్ కు తెలుసు. పిల్లలకు ఇందులో సంశయము కలగకూడదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏకాంతములో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోవాలి. ఆత్మపై ఏదైతే తుప్పు చేరిందో, దానిని తొలగించుకునేందుకు స్మృతియాత్రలో ఉండాలి.

2. ఏ విషయములోనూ సంశయము కలగకూడదు, ఈర్ష్య పడకూడదు, ఆంతరిక సంతోషములో ఉండాలి. తమ గుప్త సేవ చేసుకోవాలి.

వరదానము:-
బికారి నుండి రాకుమారునిగా అయ్యే పాత్రను ప్రాక్టికల్ గా అభినయించే త్యాగీ మరియు శ్రేష్ఠ భాగ్యశాలీ అత్మా భవ

ఏ విధముగా భవిష్యత్తులో విశ్వ మహారాజులు దాతలుగా ఉంటారో, అలా ఇప్పటినుండే దాతా స్వరూపవు సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. ఎవరి నుండైనా ఏదైనా పరిష్కారాన్ని తీసుకొని ఆ తర్వాత వారికి ఏదైనా పరిష్కారాన్ని ఇవ్వాలి అన్నది సంకల్పములో కూడా ఉండకూడదు. దీనినే బికారి నుండి రాకుమారునిగా అవ్వడము అని అంటారు. స్వయం తీసుకోవాలి అన్న కోరిక లేనివారిగా ఉండాలి. ఈ అల్పకాలికమైన కోరికలు లేని బికారులుగా అవ్వాలి. ఇటువంటి బికారులే సంపన్నమూర్తులు. ఎవరైతే ఇప్పుడు బికారుల నుండి రాకుమారులుగా అయ్యే పాత్రను ప్రాక్టికల్ గా అభినయిస్తారో వారినే సదా త్యాగీ మరియు శ్రేష్ఠ భాగ్యశాలీ అని అంటారు. త్యాగము ద్వారా సదాకాలికమైన భాగ్యము స్వతహాగా తయారవుతుంది.

స్లోగన్:-
సదా హర్షితముగా ఉండేందుకు సాక్షీ స్వరూపపు సీట్ పై దృష్టాగా అయి ప్రతి ఆటను చూడండి.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

అశరీరి స్థితిని అనుభవము చేసేందుకు సూక్ష్మముగా సంకల్పము రూపములో కూడా ఎక్కడా మోహము అనేది ఉండకూడదు. సంబంధము పట్ల, సంపర్కము పట్ల లేక తమలోని ఏదైనా విశేషత పట్ల కూడా మోహము ఉండకూడదు. ఒకవేళ తమలో ఉన్న ఏ విశేషత పట్లనైనా మోహము ఉన్నట్లయితే, ఆ మోహము కూడా బంధనయుక్తులుగా చేసేస్తుంది మరియు ఆ మోహము అశరీరిగా అవ్వనివ్వదు.