20-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 25.02.2006


‘‘ఈ ఉత్సవము రోజున మనసులోని ఉల్లాస-ఉత్సాహాల ద్వారా మాయ నుండి ముక్తులుగా ఉండే వ్రతాన్ని చేపట్టండి, దయార్ద్రహృదయులుగా అయ్యి మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వండి, తోడుగా వెళ్ళాలంటే సమానముగా అవ్వండి’’

ఈ రోజు నలువైపులా ఉన్న అతి స్నేహీ పిల్లల యొక్క ఉల్లాస-ఉత్సాహాలతో నిండిన మధురాతి-మధురమైన ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు చేరుకుంటున్నాయి. ప్రతి ఒక్కరి మనసులో బాప్ దాదా యొక్క జన్మదినానికి చెందిన ఉల్లాసముతో కూడిన శుభాకాంక్షలు ఇమిడి ఉన్నాయి. మీరందరూ కూడా విశేషముగా ఈ రోజు శుభాకాంక్షలను ఇవ్వడానికి వచ్చారా లేక తీసుకోవడానికి వచ్చారా? బాప్ దాదా కూడా చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలు ప్రతి ఒక్కరికీ వారి జన్మదినం సందర్భముగా పదమాల, పదమాల, పదమాల రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఈ రోజుకు ఉన్న విశేషత మొత్తము కల్పములో ఏ రోజుకు ఉండదు, ఈ రోజు తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒకేసారి జరుగుతుంది. దీనిని విచిత్ర జయంతి అంటారు. మొత్తము కల్పమంతా తిరిగి చూడండి, ఇటువంటి జయంతిని ఎప్పుడైనా జరుపుకున్నారా! కానీ ఈ రోజు బాప్ దాదా పిల్లల జయంతిని జరుపుతున్నారు మరియు పిల్లలు బాప్ దాదా జయంతిని జరుపుతున్నారు. పేరైతే శివజయంతి అని అంటారు కానీ ఇది ఎటువంటి జయంతి అంటే, ఈ ఒక్క జయంతిలో అనేక జయంతులు ఇమిడి ఉన్నాయి. మేము బాబాకు శుభాకాంక్షలను ఇవ్వడానికి వచ్చాము మరియు బాబా మాకు శుభాకాంక్షలను ఇవ్వడానికి వచ్చారు అని మీ అందరికీ కూడా చాలా సంతోషము కలుగుతూ ఉంది కదా, ఎందుకంటే తండ్రి మరియు పిల్లల జన్మదినం కలిపి ఒకేసారి జరగటమంటే, ఇది అతి ప్రేమకు గుర్తు. పిల్లలు లేకుండా బాబా ఏమీ చెయ్యలేరు మరియు బాబా లేకుండా పిల్లలు ఏమీ చెయ్యలేరు. జన్మ కూడా కలిపే జరిగింది మరియు సంగమయుగములో ఉండటము కూడా కలిసే ఉంటారు, ఎందుకంటే బాబా మరియు పిల్లలు కంబైండ్ గా ఉన్నారు, విశ్వ కళ్యాణ కార్యాన్ని కూడా కలిసే చేస్తారు, కేవలం బాబా ఒక్కరే కూడా చెయ్యలేరు, కేవలం పిల్లలు ఒక్కరే కూడా చెయ్యలేరు, కలిసే ఉన్నారు, అంతేకాక బాబా ప్రతిజ్ఞ ఏమిటంటే - కలిసే ఉంటాము, కలిసే వెళ్తాము. కలిసే వస్తారు కదా! ప్రతిజ్ఞ ఉంది కదా! తండ్రి మరియు పిల్లల మధ్యన ఇంతటి ప్రేమ ఉండటాన్ని చూసారా? చూసారా లేక అనుభవం చేస్తున్నారా? అందుకే ఈ సంగమయుగానికి మహత్వము ఉంది మరియు ఈ మిలనము యొక్క స్మృతిచిహ్నమునే రకరకాల మేళాలలో తయారుచేసారు. ఈ శివజయంతి రోజున భక్తులు - భగవంతుడా రండి అని పిలుస్తున్నారు. వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు... అని ఆలోచిస్తున్నారు, కానీ మీరు వారితో మిలనము జరుపుకుంటున్నారు.

బాప్ దాదాకు భక్తుల పట్ల స్నేహము కూడా ఉంది మరియు దయ కూడా కలుగుతుంది. భగవంతుని కోసం ఎంతగా ప్రయత్నము చేస్తుంటారు, ఎంతగా వెతుకుతుంటారు. మీరు వెతికారా? లేక బాబా మిమ్మల్ని వెతికారా? ఎవరు వెతికారు? మీరు వెతికారా? మీరైతే చుట్టూ భ్రమిస్తూనే ఉన్నారు. కానీ బాబాను చూడండి, పిల్లలు ఏ మూలలో తప్పిపోయి ఉన్నా కానీ వెతికి పట్టుకున్నారు. ఈ రోజు కూడా చూడండి, భారత్ లోని అనేక రాష్ట్రాల నుండైతే వచ్చారు, కానీ విదేశాలు కూడా తక్కువగా ఏమీ లేవు, 100 దేశాల నుండి వచ్చారు. కానీ దీని కోసం చేసిన శ్రమ ఏమిటి? బాబాకు చెందినవారిగా అవ్వడానికి ఏం శ్రమ పడ్డారు? శ్రమ పడ్డారా? చేసారా శ్రమ? ఎవరైతే బాబాను వెతకటానికి శ్రమపడ్డారో వారు చేతులెత్తండి. భక్తిలో చేసారు, కానీ ఇప్పుడు బాబానే మిమ్మల్ని వెతికినప్పుడు, ఇక మీరు శ్రమ పడ్డారా? చేసారా శ్రమ? క్షణములో ఒప్పందము కుదుర్చుకున్నారు. ఒక్క పదముతో ఒప్పందము కుదిరిపోయింది. ఆ ఒక్క పదము ఏమిటి? ‘‘మేరా’’. పిల్లలు ‘‘మేరా బాబా’’ (నా బాబా) అని అన్నారు, బాబా ‘‘మేరే బచ్చే’’ (నా పిల్లలు) అని అన్నారు. అంతే, అలా అయిపోయారు. ఇది సులువైన వ్యాపారమా లేక కష్టమైనదా? సులువైనదే కదా! కొంచెం, కొంచెం కష్టము అని అనుకునేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు అయితే కష్టమనిపిస్తుంది కదా! లేక అనిపించటం లేదా? వాస్తవానికి సహజమైనదే కానీ మీ బలహీనతలు కష్టముగా ఉన్నట్లు అనుభవం చేయిస్తాయి.

బాప్ దాదా కూడా చూస్తుంటారు. భక్తులలో కూడా సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో, స్వార్థపూరితమైన భక్తులు కారు, సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో, వారు ఈ రోజున చాలా ప్రేమతో వ్రతాన్ని చేపడతారు. మీరందరూ కూడా వ్రతాన్ని తీసుకున్నారు. వారు కొద్దిరోజుల కోసం వ్రతాన్ని పెట్టుకుంటారు, కానీ మీరందరూ ఎటువంటి వ్రతాన్ని పెట్టుకున్నారంటే, ఇప్పుడు చేసే ఈ ఒక్క వ్రతము 21 జన్మలకు స్థిరముగా నిలిచిపోతుంది. వారు ప్రతి సంవత్సరమూ జరుపుకుంటారు, వ్రతము పెట్టుకుంటారు. మీరు కల్పములో ఒక్కసారి వ్రతాన్ని చేపడతారు, దీని వలన 21 జన్మల కోసం ఇక మనసుతో గాని, తనువుతో గాని వ్రతాన్ని పెట్టుకోవలసిన అవసరముండదు. వ్రతమైతే మీరు కూడా చేపడతారు, ఏ వ్రతాన్ని చెపట్టారు? పవిత్ర వృత్తి, దృష్టి, కృతి, పవిత్ర జీవితము యొక్క వ్రతాన్ని చేపట్టారు. జీవితమే పవిత్రముగా అయ్యింది. పవిత్రత అంటే కేవలము బ్రహ్మచర్య వ్రతమనే కాదు, కానీ జీవితములో ఆహారము, వ్యవహారము, సంసారము, సంస్కారాలు అన్నీ పవిత్రముగా ఉండాలి. ఇటువంటి వ్రతాన్నే చేపట్టారు కదా? చేపట్టారా? తల ఊపండి. చేపట్టారా? పక్కాగా చేపట్టారా? పక్కానా లేక కాస్త కాస్త కచ్చాగా కూడా ఉందా? అచ్ఛా, ఒక మహాభూతము కామము, ఈ విషయములోనే వ్రతాన్ని చేపట్టారా లేక మిగిలిన నాలుగు భూతాల గురించి కూడా వ్రతాన్ని చేపట్టారా? బ్రహ్మచారులుగా అయితే అయ్యారు, కానీ వెనక ఉన్న నాలుగు భూతాల విషయములో కూడా వ్రతాన్ని చేపట్టారా? క్రోధము విషయములో కూడా వ్రతాన్ని చేపట్టారా లేక దానిని మినహాయించారా? క్రోధము చేయడానికి అనుమతి లభించిందా? అది రెండవ నంబర్ లోనిది కదా, అందుకే ఏం ఫర్వాలేదులే అనైతే అనుకోవటము లేదు కదా? ఎలా అయితే కామాన్ని మహాభూతముగా భావించి మనసా, వాచ, కర్మలలో పక్కా వ్రతాన్ని చేపట్టారో, అలాగే క్రోధము విషయములో కూడా వ్రతాన్ని చేపట్టారా? మేము క్రోధము విషయములో కూడా వ్రతాన్ని చేపట్టాము అని ఎవరైతే భావిస్తున్నారో, దాని వెనక లోభము, మోహము, అహంకారము అనే పిల్లా పాపలు కూడా ఉన్నాయి, కానీ బాప్ దాదా ఈ రోజు క్రోధము గురించి అడుగుతున్నారు. క్రోధమనే వికారము విషయములో ఎవరైతే సంపూర్ణ వ్రతాన్ని చేపట్టారో, వారు మనసులో కూడా క్రోధము లేకుండా, హృదయములో కూడా క్రోధము యొక్క ఫీలింగ్ లేకుండా ఉన్నారా? ఈ రోజు శివజయంతి కదా! ఈ రోజు భక్తులు వ్రతము పెట్టుకుంటారు కావున బాప్ దాదా కూడా వ్రతము గురించి అడుగుతారు కదా! మాకు స్వప్నములో కూడా క్రోధము యొక్క అంశము రాజాలదు అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. రాజాలదు. వస్తుందా? రాదా? రాదా? (కొద్దిమంది చేతులెత్తారు). అచ్ఛా, ఎవరైతే చేతులెత్తారో వారి ఫోటో తియ్యండి ఎందుకంటే బాప్ దాదా మీరు చేతులెత్తినంత మాత్రాన ఒప్పుకోరు. మీ సహచరుల నుండి కూడా సర్టిఫికేట్ తీసుకుంటారు, అప్పుడు ప్రైజ్ ఇస్తారు. ఇది మంచిది. ఎందుకంటే బాప్ దాదా చూసారు, క్రోధము యొక్క అంశము కూడా ఉంటుంది, ఈర్ష్య, ద్వేషము, ఇవి కూడా క్రోధానికి పిల్లాపాపలు వంటివి. కానీ మంచిది. ఎవరైతే ధైర్యము పెట్టారో, వారికి బాప్ దాదా ఇప్పుడైతే అభినందనలను ఇస్తున్నారు కానీ సర్టిఫికేట్ లభించిన తర్వాత ప్రైజ్ ఇస్తారు, ఎందుకంటే బాప్ దాదా హోమ్ వర్క్ ను ఏదైతే ఇచ్చారో, దాని రిజల్టును కూడా బాప్ దాదా చూస్తున్నారు.

ఈ రోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు, మరి పుట్టినరోజు నాడు ఏం చేస్తారు? ఒకటేమో కేక్ కట్ చేస్తారు. మరి ఇప్పటికి రెండు నెలలు అయిపోయింది, ఇప్పుడింకా ఒక నెల మిగిలి ఉంది, ఈ రెండు నెలలలో మీరు వ్యర్థ సంకల్పాలనే కేక్ ను కట్ చేసారా? ఆ కేక్ ను అయితే చాలా సహజముగా కట్ చేస్తారు కదా, ఈ రోజు కూడా కేక్ కట్ చేస్తారు. కానీ వ్యర్థ సంకల్పాలనే కేక్ ను కట్ చేసారా? కట్ చెయ్యాలి కదా! ఎందుకంటే కలిసే వెళ్దాము అన్నదైతే పక్కా ప్రతిజ్ఞ కదా! కలిసే ఉన్నాము, కలిసే వెళ్దాము అన్నదైతే పక్కా ప్రతిజ్ఞ కదా! మరి కలిసి వెళ్ళాలి అంటే సమానముగా అయితే అవ్వాల్సి ఉంటుంది కదా! ఒకవేళ ఏదో కొద్దో గొప్పో మిగిలిపోయి ఉన్నా కానీ ఇప్పటికి రెండు నెలలైతే పూర్తయిపోయాయి. ఈ రోజు పుట్టినరోజును జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుండో వచ్చారు. విమానములో కూడా వచ్చారు, ట్రైన్ లో కూడా వచ్చారు, కార్లలో కూడా వచ్చారు. పరుగు పరుగున వచ్చారు అని బాప్ దాదాకు సంతోషముగా ఉంది. కానీ పుట్టినరోజు నాడు ముందుగా కానుకను కూడా ఇస్తారు, మరి ఒక్క నెల మిగిలి ఉంది కదా, అలాగే హోలీ కూడా రానున్నది. హోలీలో కూడా కాల్చటం జరుగుతుంది. కనుక కొద్దో గొప్పో వ్యర్థ సంకల్పాల బీజము ఏదైతే ఉందో, ఒకవేళ బీజము ఉండిపోయినట్లయితే ఇక ఎప్పుడైనా దాని నుండి మళ్ళీ కాండము కూడా రావచ్చు, ఒక్కోసారి శాఖలు కూడా వస్తాయి. కనుక నేటి ఈ ఉత్సవము రోజున మనసులోని ఉల్లాస-ఉత్సాహాల ద్వారా (మనసులోని ఉల్లాస-ఉత్సాహాలు, నోటి నుండి రావటం కాదు, మనసు నుండి రావాలి, మనను యొక్క ఉల్లాస-ఉత్సాహాలు) మనసులోనైనా, వాణిలోనైనా, సంబంధ-సంపర్కములోనైనా కొద్దో గొప్పో ఏదైతే మిగిలిపోయి ఉందో, దానిని ఈ రోజున, బాబా పుట్టినరోజు సందర్భముగా బాబాకు ఈ కానుకను ఇవ్వగలరా? మనసులోని ఉల్లాస-ఉత్సాహాల ద్వారా ఇవ్వగలరా? లాభమైతే మీకే. బాబా అయితే చూస్తుండాలి. ఎవరైతే ఉల్లాస-ఉత్సాహాలతో ధైర్యము ఉంచుతారో, చేసే చూపిస్తాము, బెస్ట్ గా తయారయ్యే చూపిస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. వదలాల్సి ఉంటుంది, ఆలోచించుకోండి. మాటలలో కూడా రాకూడదు. సంబంధ-సంపర్కములో కూడా ఉండకూడదు. అంత ధైర్యము ఉందా? ఉందా ధైర్యము? మధుబన్ వారిలో కూడా ధైర్యము ఉంది, విదేశాలవారిలో కూడా ఉంది, భారతవాసులలో కూడా ఉంది, ఎందుకంటే బాప్ దాదా యొక్క ప్రేమ ఉంది కదా, కనుక బాప్ దాదా భావిస్తున్నారు - అందరూ కలిసే వెళ్ళాలి, ఎవ్వరూ మిగిలిపోకూడదు. కలిసే వెళ్తాము అన్న ప్రతిజ్ఞ చేసినప్పుడు మరి సమానముగా అయితే అవ్వాల్సే ఉంటుంది. ప్రేమ ఉంది కదా! కష్టముగా అయితే చేతులు ఎత్తలేదు కదా?

బాప్ దాదా ఈ సంగఠనను, బ్రాహ్మణ పరివారాన్ని బాబా సమానమైన ముఖము కలవారిగా చూడాలనుకుంటున్నారు. కేవలం దృఢ సంకల్పము చేసే ధైర్యము పెట్టుకోండి, ఇది కష్టమైన విషయమేమీ కాదు, కానీ దీని కొరకు సహనశక్తి కావాలి, ఇముడ్చుకునే శక్తి కావాలి. ఎవరిలోనైతే సహనశక్తి, ఇముడ్చుకునే శక్తి ఉన్నాయో, ఈ రెండు శక్తులు ఉన్నాయో, వారు క్రోధముక్తులుగా సహజముగానే అవ్వగలరు. బ్రాహ్మణ పిల్లలైన మీకైతే బాప్ దాదా సర్వ శక్తులను వరదానముగా ఇచ్చారు. మీ టైటిల్ యే మాస్టర్ సర్వశక్తివాన్. కేవలం ఒక్క స్లోగన్ ను గుర్తుంచుకోండి, అంతే. ఒకవేళ ఒక్క నెలలో సమానముగా అవ్వాల్సిందే అని అనుకుంటే ఒక స్లోగన్ ను గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ప్రతిజ్ఞ, అదేమిటంటే - దుఃఖము ఇవ్వకూడదు, దుఃఖము తీసుకోకూడదు. కొందరు - ఈ రోజున ఎవరికీ దుఃఖము ఇవ్వలేదు కదా అన్నదానిని చెక్ చేసుకుంటారు కానీ దుఃఖాన్ని తీసుకోవటమైతే చాలా సహజముగా తీసుకుంటారు, ఎందుకంటే తీసుకునేటప్పుడు ఇతరులు ఇచ్చారు కదా అని అంటూ స్వయాన్ని సమర్థించుకుంటారు. నేనేమైనా చేసానా, వారు ఇచ్చారు అని అంటారు, కానీ ఎందుకు తీసుకున్నారు? తీసుకున్నది మీరా లేక ఇచ్చేవారా? ఇచ్చేవారు పొరపాటు చేసారు, దాని లెక్కచారము బాబాకు మరియు డ్రామాకు తెలుసు, కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? బాప్ దాదా రిజల్టులో ఏం చూసారంటే - దుఃఖము ఇచ్చే విషయములోనైతే ఎంతోకొంత ఆలోచిస్తారు, కానీ తీసుకోవటమైతే చాలా త్వరగా తీసుకుంటారు, అందుకే సమానముగా అవ్వలేకపోతారు. ఎవరు ఎంత దుఃఖము ఇచ్చినా కానీ తీసుకోకూడదు, లేదంటే ఫీలింగ్ అనే జబ్బు పెరిగిపోతుంది, అందుకే ఒకవేళ చిన్న-చిన్న విషయాలలో ఫీలింగ్ పెరుగుతుంటే వ్యర్థ సంకల్పాలు సమాప్తమవ్వలేవు, మరి అప్పుడు బాబాతో పాటు కలిసి ఎలా వెళ్ళగలరు! బాబాకు ప్రేమ ఉంది. బాబా మిమ్మల్ని వదల్లేరు, తమతో పాటు తీసుకునే వెళ్ళాలి. అంగీకారమేనా? ఇష్టమే కదా? ఇష్టమైతే చేతులెత్తండి. వెనక వెనక అయితే రాకూడదు కదా! ఒకవేళ కలిసే వెళ్ళాలంటే కానుకను ఇవ్వాల్సే ఉంటుంది. ఒక నెల అందరూ అభ్యాసము చేయండి - దుఃఖము తీసుకోకూడదు, దుఃఖము ఇవ్వకూడదు. నేను దుఃఖాన్ని ఇవ్వలేదు, వారే తీసుకున్నారు అని అనవద్దు. ఏదో ఒకటి జరుగుతుంటుంది. పరదర్శనము చెయ్యకూడదు, స్వ దర్శనము చేసుకోవాలి. హే అర్జున్ గా నేనే అవ్వాలి.

చూడండి, బాప్ దాదా రిపోర్ట్ చూసారు, ఇప్పుడు మెజారిటీలో సంతుష్టతా రిపోర్టు లేదు, అందుకే బాప్ దాదా మళ్ళీ ఒక నెల కోసం అండర్ లైన్ చేయిస్తున్నారు. ఒకవేళ ఒక నెల అభ్యాసము చేసినట్లయితే అది అలవాటైపోతుంది. అలవాటు చేసుకోవాలి. ఇలా అవుతూనే ఉంటుంది, ఈ మాత్రమైతే నడుస్తుందిలే... అని తేలికగా వదిలేయకండి. ఒకవేళ బాప్ దాదా పట్ల ప్రేమ ఉంటే ఆ ప్రేమ కోసం కేవలం ఒక్క క్రోధమనే వికారాన్ని బలిహారము చెయ్యలేరా? బలిహారము చేయడానికి గుర్తు ఏమిటంటే - ఆజ్ఞను పాటించేవారిగా ఉండటము. వ్యర్థ సంకల్పాలు అంతిమ ఘడియలో చాలా మోసగించగలవు ఎందుకంటే నలువైపులా దుఃఖపూరిత వాయుమండలము, ప్రకృతి వాయుమండలము మరియు ఆత్మల వాయుమండలము తమవైపుకు ఆకర్షించేవిగా ఉంటాయి. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు చేసే అలవాటు ఉన్నట్లయితే ఆ వ్యర్థములోనే చిక్కుకుపోతారు. ఈ రోజు బాప్ దాదాకు విశేషముగా ధైర్యముతో కూడిన ఈ సంకల్పము ఉంది, అదేమిటంటే - విదేశాలలో ఉండేవారైనా, భారత్ లో ఉండేవారైనా, అందరూ ఒక్క బాప్ దాదా పిల్లలే, కనుక నలువైపులా ఉన్న పిల్లలు ధైర్యము మరియు దృఢతతో సఫలతామూర్తులుగా అయ్యి విశ్వములో ఈ విషయాన్ని అనౌన్స్ చెయ్యాలి - మాలో కామము లేదు, క్రోధము లేదు, మేము పరమాత్ముని పిల్లలము. ఇతరులలో ఉన్న మద్యపానం తాగే అలవాటు, బీడీని కాల్చే అలవాటును మాన్పిస్తారు. కానీ బాప్ దాదా ఈ రోజు పిల్లలు ప్రతి ఒక్కరికీ క్రోధ ముక్తులుగా, కామవికార ముక్తులుగా అయ్యే ధైర్యాన్నిచ్చి వారిని విశ్వవేదికపై చూపించాలనుకుంటున్నారు. ఇష్టమేనా? దాదీలకు ఇష్టమేనా? మొదటి వరుసలోనివారికి ఇష్టమేనా? మధుబన్ వారికి ఇష్టమేనా? మధుబన్ వారికి కూడా ఇష్టమే. విదేశాలలోనివారికి కూడా ఇష్టమేనా? మరి ఇష్టమైనది చెయ్యటము ఏమంత పెద్ద విషయము కాదు. బాప్ దాదా కూడా ఎక్స్ ట్రా కిరణాలను ఇస్తారు. వీరు ఆశీర్వాదాలను ఇచ్చే మరియు తీసుకునే బ్రాహ్మణ పరివారము అన్నది చూపించాలి ఎందుకంటే సమయము కూడా పిలుస్తూ ఉంది, బాప్ దాదా వద్దనైతే అడ్వాన్స్ పార్టీ వారి యొక్క హృదయపు పిలుపు కూడా ఉంది. మాయ కూడా ఇప్పుడు అలసిపోయి ఉంది. ఇప్పుడు నాకు కూడా ముక్తిని ఇవ్వండి అని అది కూడా కోరుకుంటుంది. ముక్తిని ఇస్తారు కానీ మధ్యమధ్యలో దానితో కాస్త స్నేహము చేస్తారు, ఎందుకంటే 63 జన్మలు స్నేహితురాలిగా ఉంది కదా! బాప్ దాదా అంటున్నారు - ఓ మాస్టర్ ముక్తిదాతలారా, ఇప్పుడు అందరికీ ముక్తిని ఇవ్వండి, ఎందుకంటే మొత్తము విశ్వానికి ఏదో ఒక ప్రాప్తి అనే అంచలిని ఇవ్వాలి, దాని కోసం ఎంత పని చెయ్యాలి, ఎందుకంటే ఈ సమయములో సమయము మీకు సహచరునిగా ఉంది, సర్వాత్మలు ముక్తిలోకి వెళ్ళాల్సిందే, ఇది ఆ సమయమే. ఇతర సమయాలలో ఒకవేళ మీరు పురుషార్థము చేసినా కానీ సమయము ఉండదు, అందుకే మీరు ఇవ్వలేరు. ఇప్పుడు సమయము ఉంది, అందుకే బాప్ దాదా అంటున్నారు - ముందు స్వయానికి ముక్తిని ఇచ్చుకోండి, ఆ తర్వాత విశ్వములోని సర్వాత్మలకు ముక్తిని ఇచ్చే దోసిలిని ఇవ్వండి. వారు పిలుస్తూ ఉన్నారు, మీకు ఆ దుఃఖితుల పిలుపు వినపడటం లేదా? ఒకవేళ మీరు మీదానిలోనే బిజీగా ఉన్నట్లయితే వారి పిలుపు వినపడదు. దుఃఖితులపై దయ చూపించండి... అని పదే పదే పాట పాడుతున్నారు. ఇప్పటినుండే దయాళు, కృపాళు, దయార్ద్ర హృదయము కల సంస్కారాలను బహుకాలము నుండి నింపుకోకపోతే, మీ జడ చిత్రాలలో దయార్ద్ర హృదయము, కృప, దయతో కూడిన వైబ్రేషన్లు ఎలా నిండుతాయి.

డబుల్ విదేశీయులు ఇలా అనుకుంటున్నారా, మీరు కూడా ద్వాపరములో దయార్ద్ర హృదయులై మీ జడ చిత్రాల ద్వారా అందరికీ దయ చూపిస్తారు కదా! అవి మీ చిత్రాలే కదా లేక ఇండియావారివేనా? అవి మా చిత్రాలు అని విదేశీయులు భావిస్తున్నారా? మరి చిత్రాలు ఏమిస్తాయి? చిత్రాల వద్దకు వెళ్ళి ఏమడుగుతారు? దయ. దయ కావాలి అని కోరుకుంటారు. ఇప్పుడు సంగమములో మీరు మీ ద్వాపర, కలియుగాల సమయము కోసం జడ చిత్రాలలో వాయుమండలాన్ని నింపుతారు, అప్పుడు మీ జడచిత్రాల ద్వారా వాటిని అనుభవము చేస్తారు. భక్తుల కళ్యాణమైతే జరుగుతుంది కదా! భక్తులు కూడా మీ వంశావళి వారే కదా! మీరందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కు సంతానము. భక్తులు దుఃఖముతో ఉన్నారు, కానీ వాస్తవానికి వారు మీ వంశావళివారే కదా! మరి మీకు దయ కలగటం లేదా? కలుగుతుంది కానీ కొద్దికొద్దిగా ఇంకెక్కడెక్కడో బిజీ అయిపోతారు. ఇప్పుడు మీరు మీ పురుషార్థములో ఎక్కువ సమయాన్ని పెట్టకండి. ఇవ్వటములో పెట్టండి, అప్పుడు ఇవ్వటం తీసుకోవటముగా అయిపోతుంది. చిన్న-చిన్న విషయాలలో చిక్కుకోకండి. ముక్తిరోజును జరుపుకోండి. ఈ రోజును ముక్తిరోజుగా జరుపుకోండి. సరేనా? మొదటి వరుసలోని వారు సరేనా? మధుబన్ వారు సరేనా?

ఈ రోజు మధుబన్ వారు చాలా ప్రియముగా అనిపిస్తున్నారు ఎందుకంటే మధుబన్ ను చాలా త్వరగా ఫాలో చేస్తారు. ప్రతి విషయములోనూ మధుబన్ ను చాలా త్వరగా ఫాలో చేస్తారు. మరి మధుబన్ వారు ముక్తిరోజును జరుపుకున్నట్లయితే అందరూ ఫాలో చేస్తారు. మధుబన్ నివాసులైన మీరందరూ మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వాలి. అవ్వాలా? (అందరూ చేతులెత్తుతున్నారు) మంచిది. చాలామంది ఉన్నారు. అచ్ఛా, ఇప్పుడు బాప్ దాదా ఇక్కడ సమ్ముఖములో కూర్చుని ఉన్నవారికి, దేశ-విదేశాలలో దూరముగా కూర్చుని వింటున్నవారికి, చూస్తున్నవారికి, పిల్లలందరికీ డ్రిల్ చేయిస్తారు. అందరూ రెడీ అయ్యారు. అన్ని సంకల్పాలను మర్జ్ చేయండి. ఇప్పుడు ఒక్క క్షణములో మనసు-బుద్ధి ద్వారా మీ స్వీటహోమ్ కు చేరుకోండి... ఇప్పుడు పరంధామము నుండి మీ సూక్ష్మవతనానికి చేరుకోండి... ఇప్పుడు సూక్ష్మవతనము నుండి స్థూల సాకార వతనానికి, మీ రాజ్యమైన స్వర్గములోకి చేరుకోండి... ఇప్పుడు మీ పురుషోత్తమ సంగమయుగానికి చేరుకోండి... ఇప్పుడు మధుబన్ కు చేరుకోండి. ఇలాగే పదే-పదే స్వదర్శన చక్రధారిగా అయ్యి తిరుగుతూ ఉండండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ పిల్లలకు, సదా స్వరాజ్యము ద్వారా స్వపరివర్తనను చేసుకునే రాజా పిల్లలకు, సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతా సితారలకు, సదా సంతోషముగా ఉండే అదృష్టవంతులైన పిల్లలకు, బాప్ దాదా యొక్క నేటి ఈ పుట్టినరోజుకు, బాబా మరియు పిల్లల పుట్టినరోజుకు చాలా చాలా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు, ఇటువంటి శ్రేష్ఠమైన పిల్లలకు నమస్తే.

వరదానము:-
విశ్వ కళ్యాణమును బాధ్యతగా భావిస్తూ సమయమును మరియు శక్తులను పొదుపు చేసే మాస్టర్ రచయిత భవ

విశ్వములోని సర్వాత్మలు శ్రేష్ఠ ఆత్మలైన మీ పరివారము, ఎంత పెద్ద పరివారము ఉంటుందో అంతగానే పొదుపు గురించి ఆలోచించడము జరుగుతుంది. కావున సర్వాత్మలను ఎదురుగా ఉంచుకుని, స్వయాన్ని అనంతమైన సేవకు నిమిత్తులుగా భావిస్తూ, తమ సమయాన్ని మరియు శక్తులను కార్యములో వినియోగించండి. మీ కొరకే సంపాదించుకోవడము, తినడము మరియు పోగొట్టుకోవడము - ఇటువంటి సోమరులుగా అవ్వకండి. సర్వ ఖజానాల బడ్జెట్ ను తయారుచెయ్యండి. మాస్టర్ రచయిత భవ అన్న వరదానాన్ని స్మృతిలో ఉంచుకుని, సమయము మరియు శక్తుల స్టాక్ ను సేవ కొరకు జమ చెయ్యండి.

స్లోగన్:-
మహాదాని ఎవరంటే, ఎవరి సంకల్పాలు మరియు మాటల ద్వారా అందరికీ వరదానాల ప్రాప్తి జరుగుతుందో వారు.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి

మీ సూక్ష్మ శక్తులైన మంత్రి మరియు మహామంత్రి (మనసు, బుద్ధి) ఏవైతే ఉన్నాయో, వాటిని మీ ఆర్డర్ అనుసారముగా నడిపించండి. ఒకవేళ ఇప్పటినుండే రాజ్య దర్బారు సరిగ్గా ఉన్నట్లయితే ధర్మరాజు దర్బారులోకి వెళ్ళరు. ధర్మరాజు కూడా స్వాగతము పలుకుతారు. కానీ ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేకపోతే ఫైనల్ రిజల్టులో ఫైన్ కట్టడానికి ధర్మరాజపురిలోకి వెళ్ళవలసి వస్తుంది. ఈ శిక్షలే ఫైన్. రిఫైన్ గా అయినట్లయితే ఫైన్ కట్టవలసిన అవసరం ఉండదు.

సూచన:- ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము, రాజయోగీ తపస్వీలు అయిన సోదరీ-సోదరులందరు సాయంత్రం 6-30 గంటల నుండి 7-30 గంటల వరకు, విశేషముగా యోగాభ్యాసము చేసే సమయములో భక్తుల పిలుపును వినండి మరియు తమ ఇష్టదేవుల దయార్ద్ర హృదయము, దాతా స్వరూపములో స్థితులై అందరి మనోకామనలను పూర్తి చేసే సేవ చెయ్యండి.