‘‘అమృతవేళ విశేషముగా సర్వ శక్తుల అనుభవీ స్వరూపులుగా
అయ్యి యోగము యొక్క సకాష్ ను వాయుమండలములో వ్యాపింపజేయండి,
మనసును సదా బిజీగా పెట్టుకోండి, సమయము యొక్క పిలుపు - తీవ్ర
పురుషార్థీ భవ’’
ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల మస్తకములో భాగ్యము
యొక్క మెరుస్తున్న సితారలను చూస్తున్నారు. ఒకటి, జన్మ యొక్క
భాగ్యము, రెండు, సంబంధాల భాగ్యము మరియు మూడు, ప్రాప్తుల భాగ్యము.
మూడు భాగ్యాలను చూసి హర్షిస్తున్నారు. జన్మ యొక్క భాగ్యమైతే
మీకు తెలుసు. మీ అందరికీ ఈ దివ్య జన్మను, బ్రాహ్మణ జన్మను
ఇచ్చింది స్వయంగా భాగ్యవిధాత. కావున ఆలోచించండి, ఇది ఎంత పెద్ద
భాగ్యము! దీనితోపాటు సంబంధాల భాగ్యము, దీని విశేషత తెలుసు కదా.
మూడు సంబంధాలు - తండ్రి, టీచర్, సద్గురువు. మూడు సంబంధాలూ ఒక్క
బాబాతోనే ఉన్నాయి. ఒక్కరిలోనే మూడు సంబంధాలు ఉన్నాయి.
ప్రాప్తుల భాగ్యము గురించి కూడా తెలుసు. ఎక్కడైతే బాబా ఉన్నారో
అక్కడ ప్రాప్తులు సర్వమూ ఉన్నాయి మరియు అనంతముగా ఉన్నాయి.
ఒక్కరిలో మూడు సంబంధాలు ఉన్నాయి. మామూలుగా కూడా జీవితములో ఈ
మూడు సంబంధాలు అవసరము. కానీ ప్రపంచము వారి ప్రతి సంబంధము
వేర్వేరు వ్యక్తులతో ఉంటుంది మరియు మీ మూడు సంబంధాలు ఒక్కరితోనే
ఉన్నాయి. ఒక్కరితోనే మూడు సంబంధాలూ ఉన్న కారణముగా స్మృతి కూడా,
అనుభవము కూడా సహజముగా జరుగుతుంది. అందరూ మూడు సంబంధాలలోనూ
అనుభవీలు కదా! తండ్రి ద్వారా ఏమి లభిస్తుంది? వారసత్వము.
వారసత్వము కూడా ఎంత ఉన్నతమైనది లభిస్తుంది మరియు ఈ వారసత్వము
ఎంత సమయము వరకు ఉంటుంది! ఎందుకంటే ఈ వారసత్వము తండ్రి అయిన
పరమాత్మ ద్వారా ప్రాప్తిస్తుంది. రెండవ సంబంధము టీచర్. శిక్షణను
సోర్స్ ఆఫ్ ఇన్ కమ్ (ఆదాయానికి ఆధారము) అని అంటారు. మరి మీ
అందరికీ టీచర్ ద్వారా ఎంతటి ఉన్నత ప్రాప్తి లభించింది, తెలుసు
కదా! ఇంతటి ఉన్నత ప్రాప్తి తండ్రి అయిన పరమాత్ముని ద్వారా తప్ప
మరెవ్వరి ద్వారా లభించదు. విద్య ద్వారా పదవి ప్రాప్తిస్తుంది
మరియు మీ అందరికీ అన్నింటికంటే శ్రేష్ఠ ప్రాప్తి కలిగింది.
ప్రపంచములో కూడా అన్నింటికంటే శ్రేష్ఠ ప్రాప్తి అని రాజ్య
పదవిని అంటారు. మరి మీకు కూడా టీచర్ ద్వారా రాజ్య పదవి
ప్రాప్తించింది. ఇప్పుడు కూడా స్వరాజ్యానికి రాజులు, ఎందుకని?
ఆత్మ రాజయోగి అయిన కారణముగా స్వరాజ్య అధికారిగా అవుతుంది.
స్వయముపై రాజ్యము చేస్తుంది. కర్మేంద్రియాలకు వశమవ్వదు, ఆత్మ
యజమానిగా అయ్యి ఈ కర్మేంద్రియాలకు రాజుగా అవుతుంది. ఇప్పుడు
కూడా స్వరాజ్యము లభిస్తుంది మరియు భవిష్యత్తులో కూడా రాజ్య
భాగ్యము ప్రాప్తిస్తుంది. కావున డబుల్ రాజ్యము - ఇప్పుడు కూడా
మరియు భవిష్యత్తులో కూడా పదవి ప్రాప్తిస్తుంది. మూడవ సంబంధము -
సద్గురువు. మూడు సంబంధాలు ప్రాప్తించాయి కదా! ప్రాప్తించాయా?
తండ్రి, టీచర్ మరియు మూడవది సద్గురువు. సద్గురువు ద్వారా గురువు
యొక్క శ్రీమతము లభిస్తుంది. ఎంతటి శ్రేష్ఠ మతము లభించింది?
కావున స్వయాన్ని చెక్ చేసుకోండి, సదా శ్రీమతముపై నడుస్తున్నారా
లేక ఒక్కోసారి మన్మతము వైపుకు, ఒక్కోసారి పరమతము వైపుకు బుద్ధి
వెళ్తుందా? చెక్ చేసుకున్నారా? సద్గురువు ద్వారా సదా శ్రీమతమనే
శ్రేష్ఠ మతముపైనే నడుస్తున్నాము, మన్మతము లేక పరమతము వైపుకు
ఎప్పుడూ స్వప్నములో కూడా వెళ్ళటము లేదు అని ఎవరైతే
భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. ఎవరైతే సదా శ్రీమతముపైనే
నడుస్తున్నారో, పరమతము లేక మన్మతము లేదో వారు చేతులెత్తండి.
చూడండి, మాతలు చేతులెత్తారు. కొద్దిమంది చేతులెత్తుతున్నారు.
అప్పుడప్పుడూ మన్మతము లేక పరమతము వైపుకు వెళ్తుంది. కానీ పరమతము,
మన్మతము మోసం చేస్తాయి. విశేషమైన శ్రీమతము ఏమిటి? స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. ఇది సహజమా
లేక కష్టమా? అప్పుడప్పుడూ కష్టముగా అనిపిస్తుందా! కానీ బాబా ఇదే
కోరుకుంటున్నారు - సదా ఈ మూడు సంబంధాలలోనూ ప్రతి బిడ్డ ఇంకా,
ఇంకా ముందుకు ఎగురుతూ వెళ్ళాలి. బాప్ దాదా అడుగుతున్నారు,
ఎవరైతే చేతులెత్తలేదో వారు ఇప్పటినుండి మన్మతాన్ని, పరమతాన్ని
త్యాగము చెయ్యగలరా? చెయ్యగలరా? వారు చేతులెత్తండి. అచ్ఛా!
ఎందుకంటే బాప్ దాదా సమయము గురించి సూచనను ఇచ్చి ఉన్నారు.
ఇప్పుడు ఈ సంగమ సమయము అతి విలువైనది. వర్తమాన సమయమనుసారముగా
అన్నీ అకస్మాత్తుగా జరగనున్నాయి అని బాప్ దాదా ఈ సూచనను కూడా
ఇచ్చి ఉన్నారు. అందుకే సదా ఎవర్రెడీగా అవ్వాలి కదా! అందరూ కలిసి
వస్తారు కదా లేక వెనుక-వెనుక వస్తారా? బాప్ దాదాతో పాటు కలిసి
ఇంటికి వెళ్ళాలి కదా! రెడీగా ఉన్నారు కదా! కలిసి వెళ్ళడానికి
రెడీగా ఉన్నారా! ఎవర్రెడీ. రెడీ కూడా కాదు, ఎవర్రెడీ. బాప్ దాదా
సమయము గురించి సూచనను ఇస్తున్నారు. ఈ ఒక్క జన్మలో 21 జన్మల
ప్రారబ్ధాన్ని తయారుచేసుకోవాలి. మరి ఎంత అటెన్షన్ ఉంచాలో
ఆలోచించండి. బాబాకు ప్రతి బిడ్డ పట్ల ప్రేమ ఉంది. ప్రతి బిడ్డ
బాబాతో కలిసి వెళ్ళాలి మరియు కలిసి రాజ్యాధికారిగా అవ్వాలి అని
బాబా ఇదే కోరుకుంటున్నారు.
మరి మీరు కలిసి వెళ్ళాలంటే బాబా సమానముగా సంపూర్ణముగా మరియు
సంపన్నముగా అవ్వాలి, అప్పుడే కదా కలిసి వెళ్తారు! ఈ సమయములో ఈ
చిన్నని జన్మలో 21 జన్మల ప్రాప్తి నిశ్చితము. మరి ఆలోచించండి,
సంగమములోని ఈ చిన్నని జన్మలోని ఒక్కొక్క నిమిషము ఎంత
మహత్తరమైనది! లెక్క వేయండి, ఈ ఒక్క జన్మలో 21 జన్మల రాజ్య
భాగ్యాన్ని తీసుకోవాలంటే సంగమములోని ఒక్క నిమిషము కూడా ఎంత
విలువైనది. ఈ విలువను తెలుసుకుని ఏం చెయ్యవలసి ఉంటుంది?
బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించి ఉన్నారు - రెండు
విషయాల పట్ల విశేషమైన అటెన్షన్ ను ఉంచండి. ఆ రెండు విషయాలు
ఏమిటి? గుర్తుంది కదా! ఒకటి, సమయము మరియు రెండు, సంకల్పాలు.
సంకల్పాలు వ్యర్థముగా పోకూడదు, సమయము వ్యర్థముగా పోకూడదు.
ఒక్కొక్క క్షణము సఫలమవ్వాలి. మరి చెప్పండి, అంతటి అటెన్షన్ ను
ఉంచవలసి ఉంటుంది కదా! బాప్ దాదాకు అయితే పిల్లలందరి పట్ల ప్రేమ
ఉంది. బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, ఒక్క బిడ్డ కూడా కలిసి
వెళ్ళడము నుండి వంచితమవ్వకూడదు. కలిసి ఉన్నాము, కలిసి వెళ్తాము,
కలిసి రాజ్యాధికారులుగా అయ్యి సదా జీవితములో సుఖ-శాంతులను
అనుభవం చేస్తాము. మరి చెప్పండి, నాతోపాటు వస్తారు కదా! వస్తారా?
ఉండిపోరు కదా? చూడండి, మూడు భాగ్యాలైతే ప్రతి ఒక్కరి మస్తకములో
మెరుస్తున్నాయి. మీ మస్తకములో ఈ మూడు భాగ్యాలు కనిపిస్తూ
ఉన్నాయి కదా! సంగమయుగమే భాగ్యశాలి యుగము. ఎవరు ఎంత భాగ్యాన్ని
తయారుచేసుకోవాలనుకుంటే అంత తయారుచేసుకోవచ్చు. కానీ దాని కోసం
బహుకాలపు అటెన్షన్ కావాలి. కావున పిల్లలందరూ తమ-తమ
పురుషార్థములో ఇప్పుడు తీవ్రతను తీసుకురండి. మీరు పురుషార్థులు.
బాప్ దాదా ఏమి చూసారంటే, పురుషార్థము చేస్తున్నారు కానీ ఇప్పుడు
అందరిదీ తీవ్రతతో కూడిన పురుషార్థము ఉండాలి. బాప్ దాదా ప్రతి
బిడ్డను బాలకులు మరియు యజమానులుగా చూడాలనుకుంటున్నారు. దేనికి
యజమానులు? సర్వ ఖజానాలకు యజమానులు. అప్పుడప్పుడూ కొంతమంది
పిల్లలు బాప్ దాదాతో ఏమని చెప్తారంటే - బాబా, మీరైతే సర్వ
శక్తులను ఇచ్చారు మరియు మేము కూడా స్వయాన్ని సర్వశక్తివంతులుగా
భావిస్తున్నాము, కానీ కొంతమంది పిల్లల ఫిర్యాదు ఏమిటంటే,
అప్పుడప్పుడూ ఏ సమయములో ఏ శక్తి అవసరమో అది సమయానికి రాదు.
దానికి కారణము ఏమిటి? బాబా ప్రతి ఒక్కరికీ సర్వ శక్తులను
ఇచ్చారు. ఇచ్చారా లేక కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇచ్చారా?
సర్వ శక్తులు లభించాయా, చేతులెత్తండి. అందరికీ లభించాయి కానీ
సమయానికి ఎందుకు ఉపయోగపడవు? దానికి కారణము? కారణము మీకు తెలుసు
కూడా, కానీ ఆ సమయములో మర్చిపోతారు. సర్వ శక్తుల ఖజానా ప్రతి
బిడ్డకు వారసత్వముగా లభించింది. బాబా అందరికీ సర్వ శక్తుల
వారసత్వాన్ని ఇచ్చారు. ఒకరికి తక్కువగా, ఒకరికి ఎక్కువగా
ఇవ్వలేదు. సర్వ శక్తులనూ ఇచ్చారు. కానీ సమయానికి ఎందుకు
ఉపయోగపడటం లేదు? మీరు ఆలోచించండి. ఎవరైనా తమ స్వమానమనే సీట్ పై
ఉండకపోతే వారి ఆజ్ఞను ఎవరైనా పాటిస్తారా? అదే విధముగా, ఏ
సమయములోనైతే శక్తి రావడము లేదో, దానికి కారణమేమిటంటే - మీరు మీ
మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీట్ పై సెట్ అవ్వడము లేదు. అందుకే
సీట్ పై లేకపోతే ఎవరూ మాట వినరు. కావున సదా మీ సీట్ పై సెట్
అయ్యి ఉండండి. ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాలు నడుస్తే లేక
ఎప్పుడైనా టెన్షన్ వస్తే, దాని వలనే స్వమానమనే సీట్ దూరమవుతుంది.
బాప్ దాదా ప్రతి ఒక్కరికీ ఎన్ని స్వమానాలు ఇచ్చారు. ఎంత పెద్ద
స్వమానాల లిస్టు ఉంది! లెక్క పెట్టండి, ఎన్ని స్వమానాలు బాబా
ఇచ్చారు? స్వమానములో సెట్ అయ్యి ఉండకపోతే, ఎక్కడైతే స్వమానము
ఉండదో అక్కడ ఏమి జరుగుతుంది? తెలుసు కదా! దేహ అభిమానము వస్తుంది.
అయితే స్వమానము ఉంటుంది లేకపోతే దేహ భానము ఉంటుంది. దేహ భానము
అనే సీట్ పై కూర్చుని ఆర్డర్ చేస్తే శక్తులు మీ మాట వినవు.
లేదంటే అసలు మాస్టర్ సర్వశక్తివంతుని ఆజ్ఞను శక్తి వినకపోవడము
అనేది జరగదు. సీట్ పై సెట్ అయ్యి ఉండటము, ఈ అభ్యాసాన్ని సదా
చెయ్యండి. చెక్ చేసుకోండి, కర్మయోగములో ఉన్నా, సేవలో ఉన్నా, మీ
మననము, మంథనములో ఉన్నా, సీట్ పై సెట్ అయ్యి ఉంటే సర్వ శక్తులు
హాజరైపోతాయి.
ఈ రోజు బాప్ దాదా ఏమి చూసారంటే, అమృతవేళ అంతటా చుట్టి
వచ్చారు. నలువైపులా చుట్టి వచ్చారు. దేశములోనైనా లేక
విదేశాలలోనైనా, బాప్ దాదాకు చుట్టి రావడానికి సమయమేమీ పట్టదు.
అప్పుడు ఏమి చూసారు? చెప్పమంటారా. అందరూ మెజారిటీ కూర్చునైతే
ఉన్నారు, లేచి తమ-తమ స్థానాలలో కూర్చుని ఉన్నారు. అమృతవేళలోని
సమయమంతా అనుభవీమూర్తిగా అయ్యి కూర్చోవాలని పురుషార్థము కూడా
చేస్తున్నారు కానీ ఏమి చూసారు? అనుభవీమూర్తులుగా కొద్దిమందే
ఉన్నారు, ఎందుకంటే అన్నింటికంటే పెద్ద శక్తి అనుభవము. అనుభవీ
స్వరూపము, సర్వ శక్తుల అనుభవీ స్వరూపము, మాస్టర్ నాలెడ్జ్ ఫుల్,
మాస్టర్ సర్వ శక్తి స్వరూపము. అనుభవీ స్వరూపులుగా అవ్వడములో
కొంత లోటు కనిపించింది. పురుషార్థము చేస్తున్నారు. అయినా కానీ
బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు, ఎందుకంటే మెజారిటీ
పురుషార్థము చేసి వస్తారు. మెజారిటీ కూర్చుంటారు కానీ బాప్ దాదా
ఇదే కోరుకుంటున్నారు - లైట్ మైట్ స్వరూపము యొక్క
అనుభవీమూర్తులుగా అయ్యి కూర్చోవాలి, ఎందుకంటే ఈ అమృతవేళలోని
యోగ సకాష్ పూర్తి వాయుమండలములో వ్యాపిస్తుంది. ఈ అనుభవాన్ని
మరింత ముందుకు తీసుకువెళ్ళండి. ఎలా అయితే బ్రహ్మాబాబాను చూసాము
కదా, ఎంతటి శక్తిశాలి ఫరిశ్తా స్థితి ఉండేది! అలాగే ఈ అమృతవేళకు
ఇప్పుడు తమ-తమ అనుసారముగా అటెన్షన్ అలసట లేకుండా ఇవ్వండి. బాప్
దాదా ఏమి చూసారంటే కొంతమంది పిల్లలు లైట్-మైట్ రూపములో కూడా
కూర్చుంటారు, కూర్చోరు అని కూడా కాదు. కూర్చుంటారు, కానీ ఈ
సమయములో చేసే పురుషార్థానికి మరింత అటెన్షన్ ఇవ్వవలసి ఉంటుంది.
బాప్ దాదా ఇంతకుముందు కూడా సూచనను ఇచ్చి ఉన్నారు - మీ మనసును
సదా బిజీగా పెట్టుకోండి. మనసా సేవతోనైనా, వాచా సేవతోనైనా, మనన
శక్తితోనైనా ఏదో ఒక విధముగా మనసును బిజీ పెట్టుకోండి. మననము
చెయ్యండి. మనన శక్తి మనసును ఏకాగ్రము చేస్తుంది. కొంతమంది
పిల్లలు మననము బాగా చేస్తారు కూడా, కానీ మనన శక్తిని కూడా
రోజంతటిలో పెంచండి ఎందుకంటే బాప్ దాదాకు చివరి బిడ్డపై కూడా
ప్రేమ ఉంది. చివరి బిడ్డ నుండి కూడా బాప్ దాదా ఇదే
కోరుకుంటున్నారు - వారు బాబాతో పాటు వెళ్ళాలి, వెనుక
ఉండిపోకూడదు అని. వెనుక-వెనుక ఉండిపోకూడదు. మరి ఏం చేస్తారు?
అటెన్షన్.
ఈ రోజు బాప్ దాదా సభను చూసారు, పిల్లల వృద్ధి జరిగేదే ఉంది
అని తెలుసు. 75 సంవత్సరాల జూబ్లీ జరుపుకున్నారు. అందుకు బాప్
దాదా పిల్లలకు అభినందనలు తెలుపుతున్నారు. బాప్ దాదా సేవా తపనను
కూడా చూసారు. ప్రతి స్థానములోని వారికి ఉల్లాసము ఉంది. సేవ
యొక్క ఫలము మరియు సేవ యొక్క బలము కూడా కనిపిస్తున్నాయి.
విశేషముగా బాప్ దాదా ఏమి చూసారంటే, పిల్లలు ఎక్కడ సేవ చేసినా
కానీ అక్కడ ఈ సారి ప్రభుత్వములో నిమిత్తమై ఉన్న ఆత్మలు ఎక్కువగా
వచ్చారు. మరియు రిజల్టులో ఇది కూడా ఒప్పుకుంటున్నారు - ఇప్పటి
సమయమనుసారముగా దుఃఖము, అశాంతి పెరుగుతున్న ఈ సమయములో ఈ టాపిక్
ఏదైతే పెట్టారో, అది చాలా అవసరమని అంటారు, ఎందుకంటే ఎంతగా
శాంతిని కోరుకుంటున్నారో అంతగా అశాంతి పెరుగుతుంది. అశాంతితో
కూడిన విషయము ఏదో ఒకటి వస్తూనే ఉంది. అందుకే నలువైపులా టెన్షన్
పెరుగుతూ ఉంది మరియు ప్రభుత్వము కూడా భారత్ టెన్షన్ ఫ్రీ
అవ్వాలని కోరుకుంటుంది. మరి అందరూ, ఏ పిల్లలైతే సేవను చేసారో,
ఆ పిల్లలందరికీ బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. సేవ
చేయబోయే వారికి కూడా ఎడ్వాన్స్ లో అభినందనలు తెలుపుతున్నాము.
బాప్ దాదా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు - ఒక్కొక్క బిడ్డ
ఫాలో ఫాదర్ చేస్తూ బాబా సమానముగా సంపన్నముగా తప్పకుండా అవ్వాలి.
బాప్ దాదా ఏం చూసారంటే, పురుషార్థము కూడా పిల్లలందరూ
చేస్తున్నారు. పురుషార్థము చెయ్యాలనే తపన కూడా ఉంది. ఇప్పుడిక
చెయ్యము, ఇప్పుడిక చెయ్యము... అని స్వయముతో అనేక ప్రతిజ్ఞలు
కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ కారణము ఏమవుతుంది? కారణమేమిటంటే -
పురుషార్థములో దృఢత తక్కువగా ఉంది. మధ్యమధ్యలో నిర్లక్ష్యము
వచ్చేస్తుంది. అయిపోతాములే, తయారైపోతాములే... ఈ నిర్లక్ష్యము
పురుషార్థాన్ని ఢీలా చేసేస్తుంది. మరి ఇప్పుడు ఏమి చేస్తారు?
ఇప్పుడు ఇదే విశేషమైన అటెన్షన్ ను ఉంచండి. మీకు మీరే మీ
ప్రోగ్రామును తయారుచేయండి, అందులో రోజంతా మనసును బిజీగా
పెట్టుకోండి. మీ ప్రోగ్రామును మీరు తయారుచేసుకోండి. మనసును
బిజీగా పెట్టుకునే విధముగా మీ టైమ్ టేబుల్ ను మీరే
తయారుచేసుకోండి. మననము అయినా చేయండి, సేవ అయినా చెయ్యండి,
పరస్పరము అటెన్షన్ ఇప్పించుకోండి, కానీ బిజీ పెట్టుకోండి.
మనసుతో బిజీ, శరీరముతో అయితే బిజీగా ఉండనే ఉంటారు, కానీ మనసుతో
బిజీగా ఉండండి. మనసుతో బిజీగా ఉండటములో నంబర్ వన్ బిజినెస్
మ్యాన్ గా అవ్వండి. ఇది చెయ్యగలరా? చేస్తారా? చేస్తారా?
ఎందుకంటే మీకు తెలుసు, బ్రహ్మాబాబా కూడా మీ కోసం
ఎదురుచూస్తున్నారు. మీ అడ్వాన్స్ పార్టీ వారు కూడా - వీరు
ఎప్పుడు సమయాన్ని సమీపముగా తీసుకువస్తారు అని మీ కోసం
ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే సమయాన్ని సమీపముగా తీసుకువచ్చే
బాధ్యత మీదే. స్వయాన్ని సంపన్నముగా తయారుచేసుకోవడమంటే సమయాన్ని
సమీపముగా తీసుకురావడము.
బాప్ దాదా విశేషముగా ఒక్క నెల సమయాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ
ఒక్క నెలలో ప్రతి ఒక్కరూ తీవ్ర పురుషార్థులుగా అయ్యి,
పురుషార్థులు కాదు, తీవ్ర పురుషార్థులుగా అవ్వాల్సిందే.
సమ్మతమేనా? సమ్మతమేనా? చేతులెత్తండి. అచ్ఛా, అభినందనలు. ఇప్పుడు
ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పము చేసి ప్రతి రోజూ బాప్ దాదాకు రోజంతటి
రిజల్టును ఎలా ఇవ్వాలి? తీవ్ర పురుషార్థము యొక్క చార్టును ఎలా
ఇవ్వాలి? పురుషార్థము కాదు, తీవ్ర పురుషార్థము. దీని కోసం
తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారా? రెండు చేతులు ఎత్తండి. చాలా
మంచిది. ఇప్పుడు బాప్ దాదా అకస్మాత్తుగా మధ్యలోనే రిజల్టును
అడుగుతారు. డేట్ చెప్పరు. అకస్మాత్తుగా ఒక్క నెలలో ఏ రోజైనా
రిజల్టును అడుగుతారు. చెయ్యాల్సిందే. ఈ ప్రతిజ్ఞను మీకు మీరే
చేసుకోండి. బాప్ దాదా చేయిస్తారు, వారు ఎలాగూ చేయిస్తారు, కానీ
మీకు మీరే ఈ సంకల్పము చెయ్యండి మరియు ప్రాక్టికల్ గా చేసి
చూపించండి. చెయ్యాల్సిందే. చేద్దాములే, లే, లే వద్దు... ఇప్పుడు
ఇది మంచిది కాదు. సమయము ముందుకు సాగుతుంది, అతిలోకి వెళ్తుంది.
మరి సమయాన్ని పరివర్తన చేసే పూర్వజులైన మీకు దుఃఖముతో ఉన్న మీ
పరివారాన్ని చూసి దయ కలగడము లేదా? దయార్ద్ర హృదయులుగా అవ్వండి.
దుఃఖముతో ఉన్నవారికి సుఖము యొక్క మార్గాన్ని తెలియజేయండి. మనసా
ద్వారా కావచ్చు, వాచా ద్వారా కావచ్చు లేక సంబంధ-సంపర్కాల ద్వారా
కావచ్చు. మీ పరివారమే కదా! కావున పరివారములోని దుఃఖాన్ని
తొలగించాలి. దయార్ద్ర హృదయులుగా అవ్వండి. అచ్ఛా!
ఇప్పుడు ఎవరు ఎక్కడ కూర్చున్నా కానీ వారందరికీ, టి.వి.లో
చూస్తున్నా కానీ, ఇక్కడ భిన్న-భిన్న స్థానాలలో కూర్చున్నా కానీ,
వారు కూడా టి.వి.లో చూస్తున్నారు. ఒక్కొక్క బిడ్డకు బాప్ దాదా
ఈ రోజు తీవ్ర పురుషార్థీ అన్న టైటిల్ ను ఇస్తున్నారు. ఇప్పుడు
ఈ టైటిల్ నే సదా గుర్తుంచుకోండి. మీరెవరు అని మిమ్మల్ని ఎవరైనా
అడిగితే తీవ్ర పురుషార్థులము అనే చెప్పండి. సరేనా, అందరికీ
సమ్మతమేనా? సమ్మతమేనా? ఇప్పుడు ఢీలా పురుషార్థము సరిపోదు, సమయము
ముందుకు పరిగెత్తుతుంది, అందుకే ఇప్పుడు తీవ్ర పురుషార్థులుగా
అవ్వవలసిందే. సమయము యొక్క పిలుపు - తీవ్ర పురుషార్థీ భవ.
పిల్లలందరికీ బాప్ దాదా నుండి చాలా చాలా ప్రియస్మృతులు మరియు
తీవ్ర పురుషార్థానికి కానుకను ఇస్తున్నారు. అచ్ఛా - ఓం శాంతి.