20-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - యోగబలముతో వికారాల రూపీ రావణుడిపై
విజయము ప్రాప్తి చేసుకుని సత్యాతి-సత్యమైన దసరాను జరుపుకోండి’’
ప్రశ్న:-
రామాయణానికి
మరియు మహాభారతానికి పరస్పరములో ఏం సంబంధముంది? దసరా ఏ విషయాన్ని నిరూపిస్తుంది?
జవాబు:-
దసరా
జరుపుకోవడము అనగా రావణుడు సమాప్తమవ్వడము మరియు సీతలకు విముక్తి లభించడము. కానీ కేవలం
దసరాను జరుపుకోవడము వల్ల రావణుడి నుండి విముక్తి లభించదు. ఎప్పుడైతే మహాభారతము
జరుగుతుందో, అప్పుడు సీతలందరికీ విముక్తి లభిస్తుంది. మహాభారత యుద్ధముతో రావణ
రాజ్యము సమాప్తమవుతుంది. కనుక రామాయణానికి, మహాభారతానికి మరియు గీతకు పరస్పరములో
చాలా లోతైన సంబంధముంది.
పాట:-
సభలో జ్యోతి
వెలిగింది...
ఓంశాంతి
తండ్రి
చెప్తున్నారు - మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారు, మిమ్మల్ని ఇప్పుడు దైవీ
సాంప్రదాయానికి చెందినవారని అనలేము. మీరు ఇప్పుడు బ్రాహ్మణ సాంప్రదాయానికి
చెందినవారు, తర్వాత దైవీ సాంప్రదాయానికి చెందినవారిగా అవ్వనున్నారు. రామాయణము ఉంది
కదా, ఈ రోజున (దసరా రోజున) వీరి రామాయణము పూర్తి అవ్వనున్నట్లుగా భావిస్తారు, కానీ
వాస్తవానికి అది పూర్తి అవ్వదు. ఒకవేళ రావణుడు మరణిస్తే, రామాయణ కథ పూర్తవ్వాలి కానీ
అలా జరగదు. మహాభారతముతోనే విముక్తి లభిస్తుంది. ఇప్పుడు ఇవి కూడా అర్థం
చేసుకోవాల్సిన విషయాలు. రామాయణము ఏమిటి మరియు మహాభారతము ఏమిటి? ప్రపంచానికైతే ఈ
విషయాల గురించి తెలియదు. రామాయణము మరియు మహాభారతము - ఈ రెండింటికీ కనెక్షన్ ఉంది.
మహాభారత యుద్ధముతో రావణ రాజ్యము సమాప్తమవుతుంది. అప్పుడిక, ఈ దసరా మొదలైనవి
జరుపుకోవడమనేది ఉండదు. గీత మరియు మహాభారతము కూడా రావణ రాజ్యాన్ని సమాప్తము చేస్తాయి.
ఇప్పుడింకా సమయముంది, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి - అది హింసాత్మకమైనది, మీది
అహింసాత్మకమైనది. మీది గీత, మీరు గీతా జ్ఞానాన్ని వింటారు. దానితో ఏమి జరగనున్నది?
రావణ రాజ్యము సమాప్తమవ్వనున్నది. వారు రావణుడిని హతమారుస్తారు కానీ దాని వల్ల రామ
రాజ్యమైతే రాదు. ఇప్పుడు రామాయణము మరియు మహాభారతము ఉన్నాయి కదా. మహాభారతము రావణుడిని
సమాప్తము చేయడానికి ఉంది. ఇవి చాలా గుహ్యమైన, అర్థం చేసుకోవాల్సిన విషయాలు, దీని
కోసం విశాలమైన బుద్ధి కావాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మహాభారత యుద్ధముతో
రావణ రాజ్యము సమాప్తమవుతుంది, అంతేకానీ కేవలం రావణుడిని హతమారిస్తే రావణ రాజ్యము
సమాప్తమవుతుందని కాదు. దాని కోసం సంగమము కావాలి. ఇప్పుడిది సంగమము. ఇప్పుడు మీరు
రావణుడిపై విజయము పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం జ్ఞానము యొక్క
అస్త్ర-శస్త్రాలు కావాలి, అంతేకానీ స్థూలమైనవి కావు. రావణుడికి మరియు రాముడికి
మధ్యన యుద్ధము జరిగినట్లుగా చూపిస్తారు. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి
సంబంధించినవి. ఇప్పుడు మీరు యోగబలముతో రావణ రాజ్యముపై విజయము పొందుతారు. ఇది
గుప్తమైన విషయము. 5 వికారాల రూపీ రావణుడిపై మీకు విజయము లభిస్తుంది. దేని ద్వారా?
గీత ద్వారా. బాబా మీకు గీతను వినిపిస్తున్నారు. ఇది భాగవతము కాదు. భాగవతములో
కృష్ణుని చరిత్రను చూపిస్తారు. కృష్ణుని చరిత్ర అంటూ ఏమీ లేదు. వినాశనము
జరిగినప్పుడు మహాభారీ యుద్ధము జరుగుతుందని, దాని ద్వారానే రావణ రాజ్యము
సమాప్తమవుతుందని మీకు తెలుసు. మెట్ల వరస చిత్రములో కూడా చూపించడము జరిగింది.
ఎప్పటినుండైతే రావణ రాజ్యము ప్రారంభమైందో, అప్పటినుండి భక్తి మార్గము ప్రారంభమైంది.
ఇది మీకు మాత్రమే తెలుసు. గీతకు మహాభారత యుద్ధముతో కనెక్షన్ ఉంది. మీరు గీతను విని
రాజ్యాన్ని పొందుతారు మరియు ఈ ప్రపంచమంతటినీ శుభ్రము చేసేందుకే యుద్ధము జరుగుతుంది.
ఇకపోతే, భాగవతములో చూపించిన చరిత్రలు మొదలైనవన్నీ వ్యర్థమైనవే. శివ పురాణములో ఏమీ
లేదు, లేదంటే గీతకు శివ పురాణము అనే పేరు ఉండాలి. శివబాబా కూర్చుని - అన్నింటికన్నా
ఉన్నతమైనది గీత అనే జ్ఞానాన్ని ఇస్తారు. గీత అన్ని శాస్త్రాల కన్నా చిన్ననిది,
మిగిలిన పుస్తకాలన్నీ చాలా పెద్దవిగా తయారుచేసారు. మనుష్యుల జీవిత కథలను కూడా చాలా
పెద్ద-పెద్దవిగా తయారుచేసారు. నెహ్రూ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, వారి గురించి
ఎంత పెద్ద-పెద్ద పుస్తకాలను తయారుచేసారు. శివబాబా చెప్పే ఈ గీత ఎంత పెద్దదిగా ఉండాలి.
కానీ గీత ఎంత చిన్ననిది, ఎందుకంటే తండ్రి కేవలం ఒక్క విషయాన్నే వినిపిస్తారు - నన్ను
స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు చక్రాన్ని అర్థం చేసుకోండి, అంతే.
అందుకే గీతను చిన్నదిగా తయారుచేసారు. ఇది కంఠస్థము చేయాల్సిన జ్ఞానము. గీతను లాకెట్
లా తయారుచేస్తారని మీకు తెలుసు. అందులో చిన్న అక్షరాలుంటాయి. ఇప్పుడు బాబా కూడా మీ
మెడలో - త్రిమూర్తి మరియు రాజ్యాధికారము యొక్క లాకెట్ ను ధరింపజేస్తారు. బాబా అంటారు,
గీత అంటే రెండు పదాలు - అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (రాజ్యాధికార వారసత్వము). ఇది
‘మన్మనాభవ’ అనే గుప్తమైన మంత్రము యొక్క లాకెట్. నన్ను స్మృతి చేస్తే వికర్మలు
వినాశనమవుతాయి. యోగబలముతో విజయము పొందడము మీ పని, తర్వాత మీ కోసం అంతా శుభ్రమై
ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీ యోగబలముతోనే రావణ రాజ్యము యొక్క వినాశనము
జరగనున్నది. రావణ రాజ్యము ఎప్పుడు మొదలైంది, ఇది కూడా తెలియదు. ఈ జ్ఞానము చాలా
సహజమైనది. ఇది సెకెండు యొక్క విషయము కదా. 84 జన్మల మెట్ల వరస చిత్రములో కూడా ఇన్ని
జన్మలు తీసుకున్నారు అన్నది చూపించారు, ఇది ఎంత సహజము. తండ్రి జ్ఞానసాగరుడు. వారు
జ్ఞానము వినిపిస్తూనే ఉంటారు. మీరు మురళీ కాగితాలన్నింటినీ పోగు చేస్తే,
లెక్కలేనన్ని అవుతాయి. తండ్రి వివరముగా అర్థం చేయిస్తారు. సారములో - భగవంతుడిని
స్మృతి చేయండి అని చెప్తారు. మరి మిగిలిన సమయాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? మీ తలపై
పాపాల భారము చాలా ఉంది. దానిని స్మృతి ద్వారానే తొలగించుకోవాలి, ఇందులో శ్రమ
అనిపిస్తుంది. ఘడియ-ఘడియ మీరు మర్చిపోతూ ఉంటారు. మీరు బాబాను స్మృతి చేస్తూ ఉంటే
ఎప్పుడూ విఘ్నాలు కలగవు. దేహాభిమానులుగా అవ్వడముతో విఘ్నాలు కలుగుతాయి. చివరిలో
దేహీ-అభిమానులుగా అవుతారు. ఇక తర్వాత, అర్ధకల్పము వరకు ఏ విఘ్నాలు కలగవు. ఇవి అర్థం
చేసుకోవాల్సిన ఎంత గుహ్యమైన విషయాలు. ప్రారంభము నుండి మొదలుకుని ఎంత వినిపిస్తూ
వచ్చారు, అయినా మళ్ళీ - కేవలం భగవంతుడిని మరియు రాజ్యాధికార వారసత్వాన్ని స్మృతి
చేయండి అని చెప్తున్నారు. అంతే. వృక్షము అనేది విస్తారము. బీజమైతే చాలా చిన్నదిగా
ఉంటుంది. ఆ బీజము నుండి ఎంత పెద్ద వృక్షము వెలువడుతుంది.
ఈ రోజు దసరా కదా.
రామాయణానికి మహాభారతముతో ఏం సంబంధముంది అనేది ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు.
రామాయణమైతే భక్తి మార్గానికి సంబంధించినది. అర్ధకల్పము నుండి కొనసాగుతూ వస్తుంది
అనగా ఇప్పుడు రావణ రాజ్యము నడుస్తూ ఉంది. తర్వాత, మహాభారతము వచ్చిందంటే రావణ రాజ్యము
సమాప్తమై రామ రాజ్యము మొదలవుతుంది. రామాయణానికి మరియు మహాభారతానికి మధ్యన
వ్యత్యాసమేమిటి? రామ రాజ్య స్థాపన మరియు రావణ రాజ్య వినాశనము జరగనున్నది. గీతను విని
మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు యోగ్యులుగా అవుతారు. గీత మరియు మహాభారతము
కూడా ఈ సమయానికి చెందినవే, ఇవి రావణ రాజ్యము సమాప్తమయ్యేందుకే ఉన్నాయి. ఇకపోతే వారు
ఏ యుద్ధాన్ని అయితే చూపించారో, అది తప్పు. ఇది 5 వికారాలపై విజయము పొందేటువంటి
యుద్ధము. మీకు తండ్రి గీత యొక్క రెండు పదాలను వినిపిస్తారు - మన్మనాభవ, మధ్యాజీభవ.
గీతలో ప్రారంభములో మరియు చివరిలో ఈ రెండు పదాలు వస్తాయి. ఇప్పుడు నిజంగా గీతా
అధ్యాయము జరుగుతూ ఉందని పిల్లలు అర్థం చేసుకుంటారు. కానీ ఎవరికైనా చెప్తే,
శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నారని అడుగుతారు. బాబా అర్థం చేయించినదానికి మరియు భక్తి
మార్గపు శాస్త్రాలకు మధ్యన ఎంత వ్యత్యాసముంది. ఈ రామాయణము ఏమిటి, మహాభారతము ఏమిటి
అనేది ఎవ్వరికీ తెలియదు, మహాభారత యుద్ధము తర్వాతనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి.
కానీ మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోరు, అందుకే మీరు తండ్రి పరిచయాన్నే ఇవ్వండి.
తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి ఈ మాటను మొత్తం ప్రపంచానికి
చెప్తున్నారు. ఒక్క గీతను మాత్రమే ఖండించారు. గీతకు అన్ని భాషలలోనూ ప్రాచుర్యము ఉంది.
మీ రాజ్యములో ఒకే భాష ఉంటుంది. అక్కడ శాస్త్రాలు, పుస్తకాలు మొదలైనవేవీ ఉండవు.
అక్కడ భక్తి మార్గానికి చెందిన విషయాలేవీ ఉండవు. భారత్ కు రామాయణము, మహాభారతము మరియు
గీతతోనే సంబంధముంది. భగవంతుడైతే పిల్లలకు గీతను వినిపిస్తారు, తద్వారా మీరు
స్వర్గానికి యజమానులుగా అవుతారు. మహాభారత యుద్ధము తప్పకుండా జరగనున్నది, దాని ద్వారా
పతిత ప్రపంచము సమాప్తమవుతుంది. గీత ద్వారా మీరు పావనముగా అవుతారు. పతిత-పావనుడైన
భగవంతుడు అంతిమములోనే వస్తారు. వారు అంటారు - కామము మహాశత్రువు, దానిపై విజయము
పొందాలి. కామ వికారముతో ఎప్పుడూ ఓడిపోకూడదు, దాని వలన చాలా నష్టము కలుగుతుంది.
వికారాల వెనుక చాలా గొప్ప-గొప్ప పేరు-ప్రఖ్యాతులున్న మినిస్టర్లు మొదలైనవారు కూడా
తమ పేరును అప్రతిష్ఠపాలు చేసుకుంటారు. కామము వెనుక పడి చాలా పాడైపోతారు, అందుకే
తండ్రి అర్థం చేయిస్తున్నారు - బాబా వద్దకు యవ్వనములో ఉన్న పిల్లలు వస్తారు.
బ్రహ్మచర్యములో ఉండేవారు చాలామంది ఉన్నారు. వారు మొత్తం జీవితమంతా వివాహము చేసుకోరు.
స్త్రీలు కూడా ఉంటారు. నన్స్ ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళరు. కానీ దాని వల్ల ప్రాప్తి
ఏమీ లేదు. ఇక్కడి విషయమేమిటంటే, పవిత్రముగా అయి జన్మజన్మలకు స్వర్గానికి యజమానులుగా
అవ్వాలి. జన్మజన్మల పాపాల భారము తలపై ఉంది. అది ఎప్పుడైతే తొలగుతుందో, అప్పుడు
స్వర్గములోకి వెళ్ళగలుగుతారు. ఇక్కడ మనుష్యులు పాపాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా
ఒక్క జన్మ కోసం సన్యాసిగా మారినా, వారి జన్మ అయితే వికారాలతోనే జరిగింది కదా. రావణ
రాజ్యములో వికారాలు లేకుండా జన్మ జరగదు. స్వర్గములో జన్మ ఎలా జరుగుతుంది, యోగబలము
అని దేనిని అంటారు అని అడుగుతూ ఉంటారు. ఇలా అడగాల్సిన అవసరమేమీ లేదు. అది ఉన్నదే
సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. అక్కడ రావణ రాజ్యమే లేనప్పుడు, ఇక ఈ ప్రశ్నే
ఉత్పన్నమవ్వదు. అన్నీ సాక్షాత్కారమవుతాయి. అక్కడ వృద్ధులుగా అయినప్పుడు, నేను వెళ్ళి
బాలుడిగా అవుతానని, తల్లి గర్భములోకి వెళ్తానని సాక్షాత్కారము అవుతుంది. అయితే,
ఫలానా ఇంటిలోకి వెళ్తాను అనేది తెలియదు. కేవలం, ఇప్పుడు చిన్న బాలుడిగా అవుతాను
అన్నది మాత్రమే తెలుస్తుంది. మగ నెమలి, ఆడ నెమలి ఉదాహరణ ఉంది కదా. కంటి అశ్రువుల
ద్వారా గర్భము ధరిస్తుంది. బొప్పాయి వృక్షాలలో కూడా స్త్రీ-పురుష వృక్షాలు ఉంటాయి.
ఒకదానికొకటి పక్కపక్కన ఉన్నప్పుడు ఫలాలను ఇస్తాయి. ఇది కూడా అద్భుతము కదా. జడమైన
వస్తువులలోనే ఇలా ఉన్నప్పుడు, చైతన్యములో సత్యయుగములో జరగనిదేముంది. వీటన్నింటి
విస్తారము వివరముగా మున్ముందు అర్థమవుతుంది. ముఖ్యమైన విషయమేమిటంటే - మీరు తండ్రిని
స్మృతి చేసి తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయి వారసత్వాన్ని అయితే తీసుకోండి. ఆ
తర్వాత అక్కడి ఆచార-పద్ధతులేమిటో చూద్దాము. మీరు యోగబలముతో విశ్వానికి యజమానులుగా
అవుతారు, అలాంటప్పుడు యోగబలముతో పిల్లలెందుకు జన్మించరు. ఇలాంటి ప్రశ్నలు చాలామంది
అడుగుతూ ఉంటారు, ఒకవేళ ఏ విషయములోనైనా పూర్తిగా జవాబు లభించకపోతే పడిపోతారు. చిన్న
విషయములో కూడా సంశయము వస్తుంది. శాస్త్రాలలో ఇలాంటి విషయాలేవీ లేవు. శాస్త్రాలు
భక్తి మార్గానికి చెందినవి. పరమపిత పరమాత్మ వచ్చి బ్రాహ్మణ ధర్మాన్ని, సూర్యవంశీ,
చంద్రవంశీ ధర్మాలను స్థాపన చేస్తారు.
బ్రాహ్మణులైన మీరు
సంగమయుగము వారు. బాబా సంగమయుగములో రావాల్సి ఉంటుంది. ఓ పతిత-పావనా రండి, అని
పిలుస్తారు కూడా. విదేశాలవైపు, ఓ లిబరేటర్ (ముక్తిప్రదాత), దుఃఖము నుండి
విముక్తులుగా చేయండి అని అంటారు. దుఃఖము ఎవరిస్తారు - ఇది కూడా వారికి తెలియదు.
రావణ రాజ్యము సమాప్తమవుతుందని మీకు తెలుసు. మీకు బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు.
చదువు పూర్తి అయినప్పుడు వినాశనము జరుగుతుంది, దానికే మహాభారతము అన్న పేరు పెట్టారు.
మహాభారతములో రావణ రాజ్యము సమాప్తమవుతుంది. దసరా సమయములో ఒక్క రావణుడిని మాత్రమే
సమాప్తము చేస్తారు. అవి హద్దు విషయాలు. ఇవి అనంతమైన విషయాలు. ఈ ప్రపంచమంతా
సమాప్తమైపోతుంది. ఇంత చిన్న-చిన్న కన్యలు ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నారు.
భౌతిక జ్ఞానము కిరసనాయిలు వంటిది, ఈ జ్ఞానము స్వచ్ఛమైన నెయ్యి వంటిది. కనుక రాత్రికి,
పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. రావణ రాజ్యములో మీరు నూనె తినవలసి వస్తుంది. పూర్వము
స్వచ్ఛమైన నెయ్యి ఎంతో చౌకగా లభించేది, తర్వాత ధర పెరిగిపోయింది, అందుకే నూనె
తినవలసి వస్తుంది. పూర్వము ఈ గ్యాసు, కరెంటు మొదలైనవేవీ ఉండేవి కావు. కొన్ని
సంవత్సరాలలోనే ఎంత తేడా వచ్చేసింది. అంతా సమాప్తమవ్వనున్నదని ఇప్పుడు మీకు తెలుసు.
శివబాబా మనల్ని లక్ష్మీ-నారాయణుల వలె తయారుచేయడానికి చదివిస్తున్నారు. ఈ నషా ఈ
బాబాకైతే చాలా ఉంటుంది. పిల్లలను మాయ మరపింపజేస్తూ ఉంటుంది. మేము బాబా నుండి
వారసత్వము తీసుకునేందుకు వచ్చాము అన్నప్పుడు ఆ నషా ఎందుకు ఎక్కదు! స్వీట్ హోమ్ ను,
స్వీట్ రాజధానిని మర్చిపోతారు. ఎవరెవరైతే కష్టపడి ఎముక ఎముకను సేవలో ఉంచుతారో, వారే
మహా-రాజకుమారులుగా అవుతారని బాబాకు తెలుసు. మీకు ఈ నషా ఎందుకుండదు? ఎందుకంటే
స్మృతిలో ఉండరు. సేవలో పూర్తిగా తత్పరులై ఉండరు. అప్పుడప్పుడు సేవలో ఉత్సాహముతో
ఉంటారు, అప్పుడప్పుడు చల్లబడిపోతారు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి - ఇలా
జరుగుతుంది కదా. అప్పుడప్పుడు పొరపాట్లు కూడా జరుగుతాయి, అందుకే బాబా అర్థం
చేయిస్తున్నారు - చాలా మధురముగా మాట్లాడాలి, అందరినీ సంతోషపరచాలి. ఎవ్వరికీ ఆవేశము
రాకూడదు. తండ్రి ఎంత ప్రేమసాగరుడు. ఇప్పుడు గోహత్యను ఆపు చేయడానికి ఎంతగా కష్టపడుతూ
ఉంటారు. బాబా అంటారు - అన్నింటికంటే పెద్ద హత్య కామ ఖడ్గాన్ని ఉపయోగించడము. ముందు
దానిని ఆపు చేయండి. కానీ అదేమీ ఆగేది లేదు, ఎంతగా తల బాదుకుంటారు. ఈ కామ ఖడ్గాన్ని
ఇరువురూ ఉపయోగించకూడదు. మనుష్యులు వినిపించే మాటలు ఎక్కడ, తండ్రి మాటలు ఎక్కడ.
ఎవరైతే కామ వికారాన్ని జయిస్తారో, వారే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు.
అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి సమానముగా ప్రేమసాగరులుగా అవ్వాలి. ఎప్పుడూ కూడా ఆవేశములోకి రాకూడదు.
మీ మాటలను చాలా మధురముగా ఉంచుకోవాలి. అందరినీ సంతుష్టపరచాలి.
2. కష్టపడి ఎముక ఎముకను సేవలో ఉంచాలి. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి
రాకుమార-రాకుమారీలుగా అవుతాము అనే నషాలో ఉండాలి.
వరదానము:-
దేహీ-అభిమానీ స్థితిలో స్థితులై సదా విశేషమైన పాత్రను
అభినయించే సంతుష్టమణి భవ
ఏ పిల్లలైతే విశేషమైన పాత్రధారులో, వారి ప్రతి కర్మ
విశేషముగా ఉంటుంది, ఏ కర్మ కూడా సాధారణముగా ఉండదు. సాధారణ ఆత్మ ఏ కర్మనైనా
దేహాభిమానిగా అయి చేస్తుంది మరియు విశేష ఆత్మ దేహీ-అభిమానిగా అయి చేస్తుంది. ఎవరైతే
దేహీ-అభిమానీ స్థితిలో స్థితులై కర్మలు చేస్తారో, వారు స్వయము కూడా సదా సంతుష్టముగా
ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు, అందుకే వారికి సంతుష్టమణి అనే వరదానము
స్వతహాగా ప్రాప్తిస్తుంది.
స్లోగన్:-
ప్రయోగీ
ఆత్మలుగా అయి యోగ ప్రయోగము ద్వారా సర్వ ఖజానాలను పెంచుకుంటూ వెళ్ళండి.
అవ్యక్త ప్రేరణలు -
పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి
కళ్యాణకారీ భావనను
మరియు వృత్తిని పెట్టుకుని ఏ ఆత్మకైనా పాలన చేసినట్లయితే ఎటువంటి అపకారి ఆత్మనైనా
మీ పాలన ద్వారా ఉపకారిగా చెయ్యగలరు. ఎటువంటి పతిత ఆత్మ అయినా కానీ పతిత-పావన వృత్తి
ద్వారా పావనముగా అవ్వగలదు. ఏ విధముగా తల్లి తన పిల్లల బలహీనతలను కానీ, లోపాలను కానీ
చూడరో, వారిని సరిచేద్దామనే చూస్తారో, అదే విధముగా పాలన చేసే కర్తవ్యము ఈ రూపములో
స్థితులవ్వటము ద్వారా యథార్థముగా జరగగలదు.