21-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శ్రీమతము ఆధారముగా కళ్యాణకారులుగా అవ్వాలి, అందరికీ సుఖపు మార్గాన్ని తెలియజేయాలి’’

ప్రశ్న:-
ఏ రకమైన పొరపాట్లు అయినా జరగడానికి ముఖ్యమైన కారణమేమిటి?

జవాబు:-
దేహాభిమానము. దేహాభిమానము కారణముగానే పిల్లల ద్వారా చాలా పొరపాట్లు జరుగుతాయి. వారు సేవ కూడా చేయలేకపోతారు. వారి ద్వారా ఎటువంటి కర్మలు జరుగుతాయంటే, ఇక అందరూ వారిని ద్వేషిస్తారు. బాబా అంటారు - పిల్లలూ, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఎటువంటి చేయకూడని పనులు చేయకండి. క్షీరఖండము వలె అయి సేవ యొక్క మంచి-మంచి ప్లాన్లు తయారుచేయండి. మురళీని విని ధారణ చేయండి, ఇందులో నిర్లక్ష్యులుగా అవ్వకండి.

పాట:-
ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి...

ఓంశాంతి
ఆత్మిక పిల్లల కోసం ఆత్మిక తండ్రి యొక్క శ్రీమతము. ఇప్పుడు నేను అన్ని సెంటర్ల పిల్లలతో మాట్లాడుతున్నాను. త్రిమూర్తి, సృష్టి చక్రము, కల్ప వృక్షము, మెట్ల వరుస, లక్ష్మీ-నారాయణుల చిత్రము మరియు శ్రీకృష్ణుని చిత్రము - ఈ 6 చిత్రాలు ముఖ్యమైనవి. ఇవి ఉంటే మొత్తం ప్రదర్శనీ ఉన్నట్లే, ఇందులో మొత్తం సారమంతా వచ్చేస్తుంది. నాటకములో ఎడ్వర్టైజ్ (ప్రకటన) చేయడానికి పరదాలను తయారుచేస్తారు కదా, అవి వర్షాలు మొదలైనవాటికి ఎప్పుడూ పాడవ్వవు. అదే విధముగా ఈ ముఖ్యమైన చిత్రాలను తయారుచేయాలి. ఆత్మిక సేవను పెంచేందుకు, భారతవాసీ మనుష్యుల కళ్యాణము చేయడానికి పిల్లలకు శ్రీమతము లభిస్తుంది. అనంతమైన తండ్రిని కళ్యాణకారీ అని మహిమ చేస్తున్నారంటే, తప్పకుండా అకళ్యాణము చేసేవారు కూడా ఎవరో ఉంటారు. దీని కారణముగా తండ్రి వచ్చి మళ్ళీ కళ్యాణము చేయవలసి ఉంటుంది. ఏ ఆత్మిక పిల్లల యొక్క కళ్యాణమైతే జరుగుతుందో, వారు ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. ఎలాగైతే మన కళ్యాణము జరిగిందో, అలాగే మనము ఇతరుల కళ్యాణము కూడా చేయాలి. కళ్యాణము ఎలా చేయాలి అని తండ్రికి కూడా చింతన నడుస్తూ ఉంటుంది. వారు యుక్తులను తెలియజేస్తున్నారు. 6x9 సైజు గల షీట్ పై ఈ చిత్రాలను తయారుచేయాలి. ఢిల్లీ వంటి నగరాలలో చాలా వరకు ఎక్కువమంది మనుష్యులు వస్తారు. అక్కడ గవర్నమెంట్ యొక్క అసెంబ్లీ మొదలైనవి ఉంటాయి. సెక్రెటేరియట్ వైపు చాలామంది వస్తారు, అక్కడ ఈ చిత్రాలను పెట్టాలి. అనేకుల కళ్యాణము చేయడానికి తండ్రి మతాన్ని ఇస్తారు. ఈ విధముగా టిన్ను రేకుపై చాలా చిత్రాలు తయారవుతాయి. దేహీ-అభిమానులుగా అయి తండ్రి సేవలో నిమగ్నమవ్వాలి. ఈ చిత్రాలను హిందీ మరియు ఇంగ్లీషులో తయారుచేయాలి అని తండ్రి సలహానిస్తారు. ఈ 6 చిత్రాలను ముఖ్యమైన స్థానాల్లో పెట్టాలి. ఒకవేళ ముఖ్యమైన స్థానాలలో పెట్టినట్లయితే, వీటిని అర్థం చేసుకునేందుకు మీ వద్దకు వందలాది మంది వస్తారు. కానీ పిల్లల్లో దేహాభిమానము ఉన్న కారణముగా చాలా పొరపాట్లు జరుగుతాయి. ఎవ్వరూ కూడా - నేను పక్కా దేహీ-అభిమానిగా ఉన్నాను అని అనుకోకండి. చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి, సత్యము చెప్పరు. వీరిలో దేహాభిమానము ఉందని అనిపించేలా, ఎవరికైనా చెడుగా, అసహ్యముగా అనిపించే విధమైన పనులేవీ చేయకండి అని అర్థం చేయించడము జరుగుతుంది. మీరు సదా యుద్ధ మైదానములో ఉన్నారు. వేరే చోట్ల అయితే 10-20 సంవత్సరాల వరకు యుద్ధము కొనసాగుతుంది. మీకు మాయతో అంతిమము వరకు యుద్ధము జరుగుతుంది. కానీ ఇది గుప్తముగా జరుగుతుంది, దీనిని ఎవ్వరూ తెలుసుకోలేరు. గీతలో ఉన్న మహాభారత యుద్ధాన్ని స్థూలముగా చూపించారు. కానీ వాస్తవానికి అది ఆత్మిక యుద్ధము. ఆత్మిక యుద్ధము పాండవులది. పరమపిత పరమాత్మతో విపరీత బుద్ధి కలవారిది స్థూలమైన యుద్ధము. బ్రాహ్మణ కుల భూషణులైన మీది ప్రీతి బుద్ధి. మీరు ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి ఒక్క తండ్రితోనే సాంగత్యాన్ని జోడించారు. చాలా సార్లు దేహాభిమానము రావడము కారణముగా మర్చిపోతారు, ఆ తర్వాత తమ పదవిని తామే భ్రష్టము చేసుకుంటారు. అప్పుడు అంతిమములో చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. అప్పుడిక ఏమీ చేయలేరు. ఇది కల్ప-కల్పము యొక్క పందెము. ఈ సమయములో ఏదైనా చేయకూడని పని చేసినట్లయితే, ఇక కల్ప-కల్పము కొరకు పదవి భ్రష్టమైపోతుంది. చాలా నష్టము కలుగుతుంది.

తండ్రి అంటారు, ఇంతకుముందు మీరు 100 శాతము నష్టములో ఉండేవారు, ఇప్పుడు తండ్రి 100 శాతము లాభములోకి తీసుకువెళ్తారు, కావున శ్రీమతాన్ని అనుసరించాలి. పిల్లలు ప్రతి ఒక్కరూ కళ్యాణకారులుగా అవ్వాలి. అందరికీ సుఖపు మార్గాన్ని తెలియజేయాలి. సుఖము ఉన్నది స్వర్గములోనే, నరకములో దుఃఖముంటుంది. ఎందుకు? ఇది వికారీ ప్రపంచము, అది నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారీ ప్రపంచముగా తయారయ్యింది, మళ్ళీ తండ్రి నిర్వికారిగా తయారుచేస్తారు. ఈ విషయాల గురించి ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. కావున ముఖ్యమైన ఈ చిత్రాలను పర్మనెంట్ స్థానాలలో పెట్టాలి. మొదటి నంబరులో ఢిల్లీ ముఖ్యమైనది, రెండవది బొంబాయి మరియు కలకత్తా, ఎవరికైనా ఆర్డర్ ఇచ్చినట్లయితే షీటుపై తయారుచేయగలరు. ఆగ్రాకు కూడా చాలామంది పర్యటించేందుకు వెళ్తారు. పిల్లలు సేవ అయితే చాలా బాగా చేస్తున్నారు, ఇంకా ఏదైనా కార్యము చేసి చూపించాలి. ఈ చిత్రాలను తయారుచేయించడములో ఎటువంటి కష్టము లేదు. కేవలం ఎక్స్పీరియెన్స్ (అనుభవము) కావాలి. దూరము నుండే ఎవరైనా చదవగలిగే విధముగా, చిత్రాలు మంచిగా, పెద్దవిగా ఉండాలి. సృష్టిచక్రము చిత్రము కూడా పెద్దదిగా తయారుచేయవచ్చు. ఎవరూ పాడు చేయకుండా, సురక్షితముగా ఉంచవలసి ఉంటుంది. యజ్ఞములో అసురుల విఘ్నాలు కలుగుతాయి ఎందుకంటే ఇవి కొత్త విషయాలు. వీరు దుకాణము తెరిచి కూర్చున్నారు. మేము దిగజారుతూ వచ్చామని, తప్పకుండా ఏదో లోపముందని చివరిలో అందరూ అర్థం చేసుకుంటారు. తండ్రి ఉన్నదే కళ్యాణకారీ. భారత్ యొక్క కళ్యాణము ఏ విధముగా మరియు ఎప్పుడు జరిగింది అనేది వారే తెలియజేయగలరు. భారత్ ను తమోప్రధానముగా ఎవరు చేస్తారు, తర్వాత సతోప్రధానముగా ఎవరు తయారుచేస్తారు, ఈ చక్రము ఎలా తిరుగుతుంది, ఇది ఎవ్వరికీ తెలియదు. సంగమయుగము గురించి కూడా తెలియదు. భగవంతుడు ప్రతి యుగములోనూ వస్తారని భావిస్తారు. ఒక్కోసారి భగవంతుడైతే నామ-రూపాలకు అతీతమైనవారని అంటారు. ప్రాచీన భారత్ స్వర్గముగా ఉండేది. క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం దేవతల రాజ్యముండేదని కూడా అంటారు, కానీ కల్పము ఆయువును పెద్దగా చేసేసారు. పిల్లలు దేహీ-అభిమానులుగా అయ్యేందుకు చాలా కృషి చేయాలి. అర్ధకల్పము సత్య, త్రేతాయుగాలలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు కానీ పరమాత్మ-అభిమానులుగా ఉండేవారు కాదు. ఇక్కడైతే మీరు దేహాభిమానులుగా అయిపోయారు, మళ్ళీ దేహీ-అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. యాత్ర అనే పదము కూడా ఉంది కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మన్మనాభవ యొక్క అర్థమేమిటంటే - ఆత్మిక యాత్రలో ఉండండి. ఓ ఆత్మలూ, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. కృష్ణుడైతే ఈ విధముగా చెప్పలేరు. వారిపై ఎవరూ కళంకాలను మోపలేరు. ఎప్పుడైతే మెట్లు దిగుతారో, అప్పుడు అర్ధకల్పము కామచితిపై కూర్చుని నల్లగా అయిపోతారని కూడా తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడిది ఇనుప యుగము. వీరి సాంప్రదాయము నల్లగానే ఉంటుంది. కానీ అందరివీ నల్లని రూపాలను ఎలా తయారుచేయాలి. తయారుచేసిన చిత్రాలు మొదలైనవన్నీ తెలివిహీనముగా చేసినవే. వారినే శ్యామము అని, మళ్ళీ వారినే సుందరుడు అని అంటారు... ఇదెలా సాధ్యము. వారిని అంధవిశ్వాసముతో బొమ్మల పూజను చేసేవారు అని అనడము జరుగుతుంది. బొమ్మలకు నామము, రూపము, కర్తవ్యము మొదలైనవి ఉండవు. మీరు కూడా ఇంతకుముందు బొమ్మల పూజ చేసేవారు కదా. అర్థమేమీ తెలిసేది కాదు. బాబా అర్థం చేయించారు, ప్రదర్శనీ కోసం ముఖ్యమైన చిత్రాలు తయారవ్వాలి. ప్రదర్శనీ తర్వాత ప్రదర్శనీని ఏర్పాటు చేసే విధముగా కమిటీని తయారుచేయాలి. బంధనముక్తులుగా అయితే అనేకమంది ఉన్నారు. కన్యలు బంధనముక్తులు. వానప్రస్థులు కూడా బంధనముక్తులే. పిల్లలు డైరెక్షన్లను అమలులోకి తీసుకురావాలి. మీరు గుప్తమైన పాండవులు. ఎవ్వరూ మిమ్మల్ని గుర్తించలేరు. తండ్రి కూడా గుప్తమైనవారే, జ్ఞానము కూడా గుప్తమైనదే. అక్కడ మనుష్యులు, మనుష్యులకు జ్ఞానాన్ని ఇస్తారు. ఇక్కడ తండ్రి అయిన పరమాత్మ ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు. కానీ ఆత్మ, జ్ఞానము తీసుకుంటుందని వారికి తెలియదు ఎందుకంటే వారు ఆత్మను నిర్లేపి అని అనేస్తారు. వాస్తవానికి అంతా ఆత్మయే చేస్తుంది. కర్మల అనుసారముగా పునర్జన్మలను ఆత్మ తీసుకుంటుంది. తండ్రి ఈ పాయింట్లన్నింటినీ మంచి రీతిలో బుద్ధిలో వేస్తారు. అన్ని సెంటర్లలోనూ నంబరువారుగా దేహీ-అభిమానులుగా ఉన్నారు. వారు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు మరియు ఇతరులకు అర్థం చేయిస్తారు. దేహాభిమానులు ఏమీ అర్థం చేసుకోరు, అర్థం చేయించలేరు. నాకేమీ అర్థం కాదు అని అనడము కూడా దేహాభిమానమే. అరే, నీవు ఆత్మవు. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. బుద్ధి తెరుచుకోవాలి. భాగ్యములో లేకపోతే అస్సలు తెరుచుకోదు. కావున తండ్రి పురుషార్థము చేయిస్తారు కానీ భాగ్యములో లేకపోతే పురుషార్థము కూడా చేయరు. వాస్తవానికి ఇది చాలా సహజము కానీ భగవంతుడిని మరియు రాజ్యాధికార వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. భారతవాసులైన మీరంతా గాడ్ గాడెస్ (దేవీ-దేవతలు) గా ఉండేవారు. ప్రజలు కూడా అలాగే ఉండేవారు. ఈ సమయములో పతితులుగా అయిపోయారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయమని ఎంతగా అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రి అంటారు, పిల్లలూ, నేను మిమ్మల్ని దేవీ-దేవతలుగా తయారుచేసాను, ఇప్పుడు మీరు ఎలా అయిపోయారు. ఇది కుంభీపాక నరకము. విషయ వైతరణీ నదిలో మనుష్యులు, జంతువులు, పక్షులు మొదలైనవాటన్నింటినీ ఒకేలా చూపిస్తారు. ఇక్కడైతే మనుష్యులు ఇంకా పాడైపోయారు. మనుష్యులలో క్రోధము కూడా ఎంత ఉంది. లక్షలాది మందిని హతమార్చేస్తూ ఉంటారు. వేశ్యాలయముగా తయారైన భారత్ ను మళ్ళీ శివబాబాయే శివాలయముగా తయారుచేస్తారు. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఇలా-ఇలా చేయండి, చిత్రాలను తయారుచేయండి, ఆ తర్వాత గొప్ప-గొప్ప వ్యక్తులందరికీ అర్థం చేయించండి అని డైరెక్షన్లు ఇస్తారు. ఈ ప్రాచీన యోగము, ప్రాచీన జ్ఞానము అందరూ వినాలి. హాల్ తీసుకుని ప్రదర్శనీ పెట్టాలి. వాస్తవానికి వారు ధనము మొదలైనవేవీ తీసుకోకూడదు. అయినా, మీకు ఎంత సరి అనిపిస్తే అంత తీసుకోండి, ముందు చిత్రాలనైతే చూడండి అని చెప్పండి. చిత్రాలను చూస్తే వెంటనే డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. మీరు కేవలం యుక్తిగా వారికి అర్థం చేయించాలి. అథారిటీ అయితే చేతిలో ఉంటుంది కదా. చెయ్యాలనుకుంటే అంతా చేయగలరు. వినాశన సమయములో విపరీత బుద్ధి కలవారిగా ఉంటే వినాశనాన్ని పొందినట్లే అని వారికి అర్థం కాదు. పాండవులైతే భవిష్యత్తులో పదవిని పొందారు. రాజ్యము కూడా తర్వాత భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పుడు ఉండదు. ఈ ఇళ్ళు మొదలైనవన్నీ కూలిపోతాయి. ప్రదర్శనీ కూడా పెట్టాలని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. చాలా మంచి రీతిలో కార్డులతో ఆహ్వానించాలి. ముందు మీరు పెద్దవారికి అర్థం చేయిస్తే వారు సహాయము కూడా చేస్తారు. అంతేకానీ, నిద్రపోతూ ఉండకూడదు. చాలామంది పిల్లలు దేహాభిమానములో నిద్రపోతూ ఉంటారు. కమిటీని తయారుచేసి క్షీరఖండము వలె అయి ప్లాన్లు తయారుచేయాలి. కానీ మురళీని చదవకపోతే ధారణ ఎలా జరుగుతుంది. ఇలా చాలామంది నిర్లక్ష్యులుగా ఉన్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహీ-అభిమానులుగా అయి సేవ యొక్క రకరకాల యుక్తులను వెలికి తీయాలి. పరస్పరములో క్షీరఖండము వలె అయి సేవ చేయాలి. తండ్రి ఏ విధముగా కళ్యాణకారులో, అలా కళ్యాణకారులుగా అవ్వాలి.

2. ప్రీతి బుద్ధి కలవారిగా అయి ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి. కల్ప-కల్పాలకు నష్టము కలిగించే విధముగా ఎటువంటి చేయకూడని పనులు చేయకూడదు.

వరదానము:-
అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా నష్టోమోహా స్మృతి స్వరూపులుగా అయ్యే చలించనివారిగా-స్థిరమైనవారిగా కండి

ఎవరైతే సదా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటారో, వారు ఎప్పుడూ ఎటువంటి దృశ్యాన్ని చూసి భయపడరు మరియు చలించరు, సదా చలించనివారిగా-స్థిరమైనవారిగా ఉంటారు ఎందుకంటే అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా నష్టోమోహా స్మృతి స్వరూపులుగా అవుతారు. ఒకవేళ కొద్దో-గొప్పో ఏదైనా చూసి అంశమాత్రమైనా అలజడి కలిగినా లేక మోహము ఉత్పన్నమైనా, వారిని అంగదుని సమానమైన చలించనివారు-స్థిరమైనవారు అని అనరు. అనంతమైన వైరాగ్య వృత్తిలో గంభీరతతోపాటు రమణీకత కూడా ఇమిడి ఉంది.

స్లోగన్:-
రాజ్యాధికారిగా ఉండటముతో పాటు అనంతమైన వైరాగిగా ఉండటము - ఇదే రాజఋషికి గుర్తు.

మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు:-

‘‘ఆత్మ ఎప్పుడూ పరమాత్ముని అంశముగా కాజాలదు’’

ఆత్మలమైన మేము పరమాత్ముని అంశము అని చాలామంది మనుష్యులు భావిస్తారు. అంశము అని ముక్కను అంటారు. ఒకవైపేమో పరమాత్మ అనాది మరియు అవినాశీ అని అంటారు. మరి అటువంటి అవినాశీ పరమాత్మను ముక్కలుగా ఎలా చూపిస్తారు! పరమాత్మ కట్ ఎలా అవ్వగలరు! ఆత్మయే అజర్, అమర్ (వృద్ధాప్యము లేనటువంటిది, నాశనము కానటువంటిది), మరి అటువంటప్పుడు తప్పకుండా ఆత్మను రచించేవారు అమరులుగా ఉంటారు. అమరుడైన అటువంటి పరమాత్మను ముక్కగా చెప్పటమంటే మరి పరమాత్మను కూడా వినాశీ అనటము. కానీ ఆత్మ అయిన మనము పరమాత్ముని సంతానము అన్నది మనకు తెలుసు. కనుక మనము వారి వంశజులమయ్యాము అనగా పిల్లలమయ్యాము, మరి వారు అంశముగా ఎలా అవ్వగలరు? అందుకే పరమాత్ముని మహావాక్యాలు ఏమిటంటే - పిల్లలూ, నేను స్వయమే అమరుడిని, వెలుగుతున్న జ్యోతిని, నేను దీపాన్ని, నేను ఎప్పుడూ ఆరిపోను. ఇతర మనుష్యాత్మలందరి దీపాలు వెలుగుతాయి కూడా, ఆరిపోతాయి కూడా. వారందరినీ మేలుకొలిపేవాడిని నేనే, ఎందుకంటే లైట్ మరియు మైట్ ఇచ్చేవాడిని నేనే. కాకపోతే పరమాత్మనైన నా లైట్ కు మరియు ఆత్మ యొక్క లైట్ కు, రెండింటికీ తేడా తప్పకుండా ఉంది. ఏ విధముగానైతే బల్బులలో కూడా కొన్ని ఎక్కువ పవర్ కలిగినవి, కొన్ని తక్కువ పవర్ కలిగినవి ఉంటాయో, అదే విధముగా ఆత్మలలో కూడా కొన్ని ఎక్కువ పవర్ కలిగినవి, కొన్ని తక్కువ పవర్ కలిగినవి ఉన్నాయి. ఇకపోతే పరమాత్మ పవర్ అయితే ఎవరికంటే ఎక్కువ తక్కువ ఉండదు, కనుకనే పరమాత్ముడిని సర్వశక్తివంతుడు అని అంటారు అనగా సర్వాత్మల కంటే వారిలో ఎక్కువ శక్తి ఉంటుంది. వారే సృష్టి అంతిమములో వస్తారు. ఒకవేళ పరమాత్మ సృష్టి మధ్యలో వస్తారని అనగా ప్రతి యుగములోనూ వస్తారని ఎవరైనా అనుకున్నట్లయితే, పరమాత్మ మధ్యలో వచ్చినట్లు, అప్పుడు పరమాత్మ అందరికంటే శ్రేష్ఠులుగా ఎలా అయినట్లు! ఒకవేళ పరమాత్మ ప్రతి యుగములోనూ వస్తారని ఎవరైనా అన్నట్లయితే మరి పరమాత్మ, పదే-పదే తన శక్తిని ఉపయోగిస్తారు అని అనుకోవాలా! ఒకవేళ సర్వశక్తివంతుని శక్తి ఇంతవరకు ఉన్నట్లయితే, ఒకవేళ మధ్యలోనే తన శక్తి ద్వారా అందరికీ శక్తిని మరియు సద్గతిని ఇచ్చినట్లయితే మరి వారి శక్తి స్థిరముగా నిలిచి ఉండాలి కదా, మరి మళ్ళీ దుర్గతిని ఎందుకు పొందుతారు! కనుక దీని బట్టి ఏమి నిరూపణ అవుతుందంటే, పరమాత్మ ప్రతి యుగములోనూ రారు అనగా మధ్యమధ్యలో రారు. వారు కల్పము యొక్క అంతిమ సమయములోనే వస్తారు మరియు ఒకేసారి తన శక్తి ద్వారా సర్వులకు సద్గతిని ఇస్తారు. పరమాత్మ ఇంత పెద్ద సేవ చేసారు కావుననే వారి స్మృతిచిహ్నముగా పెద్ద శివలింగాన్ని తయారుచేసారు మరియు ఎంతగానో పూజలు చేస్తారు, కావున తప్పకుండా పరమాత్మ సత్యమైనవారు కూడా, చైతన్యమైనవారు కూడా మరియు ఆనంద స్వరూపుడు కూడా. అచ్ఛా, ఓం శాంతి.

అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

వ్యర్థ సంకల్పాలు లేక సంశయము వచ్చే అవకాశము ఉన్నప్పటికీ కూడా - సదా బాబా రక్షకుడు, కళ్యాణకారీ అన్న సమర్థ సంకల్పాలు నడవాలి. ఈ నిశ్చయానికి తప్పకుండా విజయము లభిస్తుంది. కావున ప్రశ్నార్థకము అన్న వంకర దారిలో వెళ్ళకుండా సదా కళ్యాణమనే బిందువును పెట్టండి. ఫుల్ స్టాప్. ఈ విధి ద్వారానే ప్రతి విషయము సహజముగా కూడా అవుతుంది మరియు సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది.