21-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మధురాతి మధురమైన సాక్కిరిన్,
అందుకే మిగిలిన విషయాలన్నింటినీ వదిలి ఆ తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మధురమైన
సాక్కిరిన్ గా అవుతారు’’
ప్రశ్న:-
మీరు తండ్రి
నుండి శ్రీమతాన్ని తీసుకుని స్వయములో ఏ సంస్కారాలను నింపుకుంటున్నారు?
జవాబు:-
భవిష్యత్తులో
మంత్రి లేకుండా పూర్తి విశ్వముపై రాజ్యము చేసే సంస్కారాలను స్వయములో
నింపుకుంటున్నారు. మీరు ఇక్కడ వచ్చిందే భవిష్య రాజధానిని నడిపించే శ్రీమతాన్ని
తీసుకోవడానికి. తండ్రి మీకు ఎటువంటి శ్రీమతాన్ని ఇస్తారంటే, దాని ద్వారా అర్ధకల్పము
వరకు మీరు ఎవరి సలహాలను తీసుకోవాల్సిన అవసరముండదు. ఎవరి బుద్ధి అయితే బలహీనముగా
ఉంటుందో, వారు సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది.
పాట:-
నీవే తల్లివి,
తండ్రివి...
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలూ అని
ఎవరన్నారు? తప్పకుండా ఆత్మిక తండ్రియే అనగలరు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు
ఇప్పుడు సమ్ముఖములో కూర్చుని ఉన్నారు మరియు తండ్రి చాలా ప్రేమగా అర్థం
చేయిస్తున్నారు. సర్వులకు సుఖ-శాంతులను ఇచ్చేవారు మరియు సర్వులను దుఃఖము నుండి
విముక్తులుగా చేసేవారు, మొత్తం ప్రపంచములో ఆత్మిక తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరని
ఇప్పుడు మీకు తెలుసు, అందుకే దుఃఖములో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు
సమ్ముఖములో కూర్చుని ఉన్నారు. బాబా మనల్ని సుఖధామానికి యోగ్యులుగా చేస్తున్నారని
మీకు తెలుసు. సదా సుఖధామానికి యజమానులుగా చేసేటువంటి తండ్రి సమ్ముఖములోకి మీరు
వచ్చారు. సమ్ముఖముగా వినడానికి మరియు దూరంగా ఉంటూ వినడానికి చాలా తేడా ఉందని ఇప్పుడు
అర్థం చేసుకున్నారు. మధుబన్ లో సమ్ముఖముగా వస్తారు, మధుబన్ ప్రసిద్ధమైనది. మధుబన్
లో, బృందావనములో వారు శ్రీకృష్ణుని చిత్రాన్ని చూపించారు. కానీ శ్రీకృష్ణుడు అక్కడ
లేరు. ఇక్కడైతే నిరాకార తండ్రి పిల్లలైన మిమ్మల్ని కలుస్తారు. మీరు స్వయాన్ని
పదే-పదే ఆత్మగా నిశ్చయము చేసుకోవాలి. ఆత్మనైన నేను తండ్రి నుండి వారసత్వాన్ని
తీసుకుంటున్నాను. పూర్తి కల్పములో ఇటువంటి సమయము ఒకటే ఉంటుంది. ఇది కల్పము యొక్క
మనోహరమైన సంగమయుగము. దీనికి - పురుషోత్తమ అన్న పేరు పెట్టడము జరిగింది. ఈ
సంగమయుగములోనే మనుష్యమాత్రులందరూ ఉత్తములుగా అవుతారు. ఇప్పుడైతే మనుష్యమాత్రులందరి
ఆత్మలు తమోప్రధానముగా ఉన్నాయి, వారే మళ్ళీ సతోప్రధానముగా అవుతారు. సతోప్రధానముగా
ఉన్నప్పుడు మనుష్యులు ఉత్తములుగా ఉంటారు. తమోప్రధానముగా అవ్వడముతో మనుష్యులు కూడా
కనిష్టులుగా అవుతారు. ఆత్మలకు తండ్రి కూర్చుని సమ్ముఖముగా అర్థం చేయిస్తున్నారు.
మొత్తం పాత్ర అంతా ఆత్మయే అభినయిస్తుంది, అంతేకానీ శరీరము కాదు. ఆత్మ మరియు శరీరము,
రెండూ కలిసినప్పుడే పాత్ర అభినయించడము జరుగుతుంది. ఆత్మలమైన మనము వాస్తవానికి
నిరాకారీ ప్రపంచములో లేదా శాంతిధామములో నివసించేవారమని మీ బుద్ధిలోకి వచ్చింది, ఇది
ఎవరికీ తెలియదు. ఇది స్వయమూ అర్థం చేసుకోరు, ఇతరులకు కూడా అర్థం చేయించలేరు. మీ
బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంది, వాస్తవానికి ఆత్మలు పరంధామములో నివసిస్తాయని మీరు
అర్థం చేసుకుంటారు. అది నిరాకారీ ప్రపంచము. ఇది సాకార ప్రపంచము. ఇక్కడ ఆత్మలమైన
మనమంతా యాక్టర్స్, పాత్రధారులము. మొట్టమొదట మనము పాత్రను అభినయించడానికి వస్తాము, ఆ
తర్వాత నంబరువారుగా వస్తూ ఉంటారు. పాత్రధారులందరూ కలిసి ఒకేసారి రారు. రకరకాల
పాత్రధారులు వస్తూ ఉంటారు. నాటకము పూర్తి అయినప్పుడు, అందరూ ఒక చోటుకు చేరుకుంటారు.
ఆత్మ వాస్తవానికి శాంతిధామ నివాసి అని, పాత్రను అభినయించడానికి ఇక్కడకు వస్తుందని
ఇప్పుడు మీకు పరిచయము లభించింది. తండ్రి పాత్రను అభినయించేందుకు మొత్తం సమయము కోసం
రారు. మనమే పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ తమోప్రధానముగా అయిపోతాము. ఇప్పుడు
పిల్లలైన మీకు సమ్ముఖముగా విన్నప్పుడు చాలా ఆనందము కలుగుతుంది. ఇంత ఆనందము మురళిని
చదువుకున్నప్పుడు కలగదు. ఇక్కడ సమ్ముఖముగా ఉన్నారు కదా. ముందు సత్యయుగీ ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మము వారే వస్తారు. భారత్ దేవీ-దేవతల స్థానముగా ఉండేదని, ఇప్పుడు అలా
లేదని మీకు తెలుసు. ఇప్పుడు వారి చిత్రాలను చూస్తున్నారు కావున వారు తప్పకుండా
ఉండేవారని అర్థం. మొట్టమొదట మనము దేవీ-దేవతలుగా ఉండేవారము - అని మీ పాత్రను గుర్తు
చేసుకుంటారా లేక మర్చిపోతారా? తండ్రి అంటారు - మీరు ఈ పాత్రను అభినయించారు, ఇది
డ్రామా. కొత్త ప్రపంచమే తర్వాత పాతదిగా అవుతుంది. మొట్టమొదటగా పై నుండి ఏ ఆత్మలైతే
వస్తారో, వారు బంగారు యుగములోకి వస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి.
సత్యయుగ ఆదిలో పాత్రను అభినయించేందుకు మీరే వచ్చారు. మీరు విశ్వానికి యజమానులుగా,
మహారాజు-మహారాణులుగా ఉండేవారు. మీ రాజధాని ఉండేది. ఇప్పుడైతే రాజధాని లేదు. మేము
రాజ్యాన్ని ఎలా నడిపించాలి - అనేది ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. అక్కడ మంత్రులు
ఉండరు. సలహాలు ఇచ్చేవారి అవసరము ఉండదు. వారు శ్రీమతము ద్వారా శ్రేష్ఠాతి-శ్రేష్ఠముగా
అవుతారు, అప్పుడు వారికి ఇతరులెవరి నుండి సలహాలు తీసుకోవాల్సిన అవసరము ఉండదు. ఒకవేళ
ఎవరి నుండైనా సలహా తీసుకున్నట్లయితే, వారి బుద్ధి బలహీనముగా ఉందని అర్థం చేసుకోవడం
జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే శ్రీమతము లభిస్తుందో, అది సత్యయుగములో కూడా నిలిచి
ఉంటుంది. ఇప్పుడు ఆత్మలైన మీరు ఫ్రెష్ అవుతున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు
దేహీ-అభిమానులుగా అవ్వాలి. శాంతిధామము నుండి వచ్చి ఇక్కడ మీరు టాకీగా అయ్యారు.
టాకీగా అవ్వకుండా కర్మలు జరగవు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎలాగైతే
తండ్రిలో పూర్తి జ్ఞానముందో, అలా ఆత్మ అయిన మీలో కూడా ఇప్పుడు జ్ఞానముంది. ఆత్మ
అంటుంది - నేను ఒక శరీరాన్ని వదిలి, సంస్కారాల అనుసారముగా మరొక శరీరాన్ని
తీసుకుంటాను. పునర్జన్మలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆత్మకు ఏ పాత్ర అయితే లభించిందో,
దానిని అభినయిస్తూ ఉంటుంది మరియు సంస్కారాల అనుసారముగా తర్వాత జన్మలు తీసుకుంటూ
ఉంటుంది. ఆత్మ యొక్క పవిత్రతా డిగ్రీ రోజురోజుకు తగ్గిపోతూ ఉంటుంది. పతితము అనే
పదాన్ని ద్వాపరము తర్వాత ఉపయోగిస్తారు, కానీ తప్పకుండా అప్పటికే కొంత తేడా
వచ్చేస్తుంది. మీరు కొత్త ఇంటిని నిర్మిస్తే, ఒక నెల తర్వాత తప్పకుండా ఎంతోకొంత తేడా
వస్తుంది.
బాబా మనకు వారసత్వాన్ని ఇస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు
- నేను పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇవ్వడానికే వచ్చాను. ఎవరు ఎంత పురుషార్థము
చేస్తారో, అంత పదవిని పొందుతారు. అంతేకానీ తండ్రి వైపు నుండి ఎలాంటి తేడా ఉండదు.
వారు ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారని బాబాకు తెలుసు. ఆత్మలు ప్రతి ఒక్కరూ ఎవరి కోసం
వారు పురుషార్థము చేస్తారు. స్త్రీ-పురుషుల దృష్టి ఇక్కడ ఉండదు. పిల్లలైన మీరంతా
అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఆత్మలందరూ సోదరులు, వారిని
తండ్రి చదివిస్తారు, వారసత్వాన్ని ఇస్తారు. తండ్రియే ఆత్మిక పిల్లలతో ఇలా
మాట్లాడుతారు - ఓ ప్రియమైన, మధురమైన, చాలా కాలం విడిపోయిన తర్వాత కలిసిన పిల్లలూ,
మీరు చాలా సమయము నుండి పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ, మీ వారసత్వాన్ని
తీసుకునేందుకు ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది.
ఆది నుండి మొదలుకుని పాత్ర నిశ్చితమై ఉంది. పాత్రధారులైన మీరు పాత్రను అభినయిస్తూ,
యాక్ట్ చేస్తూ ఉంటారు. ఆత్మ అవినాశీ, ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. శరీరమైతే
మారుతూ ఉంటుంది. ఇకపోతే, ఆత్మ కేవలం పవిత్రము నుండి అపవిత్రముగా అవుతుంది.
సత్యయుగములో పావనముగా ఉంటారు. దీనిని పతిత ప్రపంచమని అంటారు. ఇప్పుడు సుఖధామము
స్థాపనవుతుంది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామములో ఉంటారు. ఇప్పుడిక ఈ అనంతమైన నాటకము
పూర్తి కావస్తుంది. ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. ఈ సమయములో ఏ ఆత్మ వచ్చినా కానీ,
వారికి ఈ పతిత ప్రపంచములో ఏమి విలువ ఉంటుంది. వాస్తవానికి, ఎవరైతే మొట్టమొదటగా
కొత్త ప్రపంచములోకి వస్తారో, వారికే విలువ ఉంటుంది. ఒకప్పుడు కొత్త ప్రపంచముండేది,
అది ఇప్పుడు పాతదిగా అయ్యింది. కొత్త ప్రపంచములో దేవతలు ఉండేవారు, అక్కడ దుఃఖము
అన్న మాటే ఉండదు. ఇక్కడైతే అపారమైన దుఃఖముంది. తండ్రి వచ్చి దుఃఖమయ పాత ప్రపంచము
నుండి విముక్తులుగా చేస్తారు. ఎలాగైతే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు
వస్తుందో, అలా ఈ పాత ప్రపంచము తప్పకుండా మారనున్నది. తప్పకుండా మనము సత్యయుగానికి
యజమానులుగా అవుతామని మీరు భావిస్తారు, కనుక మనము స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని
తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు. ఎంతో కొంత కృషి చేయాల్సి ఉంటుంది. రాజ్యాన్ని
పొందడమనేది అంత సులభమేమీ కాదు, తండ్రిని స్మృతి చేయాలి. మీరు పదే-పదే మర్చిపోయేలా
చేయడము అనేది మాయ యొక్క అద్భుతము. దీని కోసం ఉపాయము రచించాలి. నా వారిగా అవ్వడముతో
స్మృతి నిలుస్తుందని కాదు. అలా అయితే ఇక పురుషార్థము ఏమి చేస్తారు. అలా కాదు.
ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటివరకు పురుషార్థము చేయాలి. జ్ఞానామృతాన్ని తాగుతూ
ఉండాలి. ఇది మన అంతిమ జన్మ అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఈ శరీర భానాన్ని వదిలి
దేహీ-అభిమానులుగా అవ్వాలి. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి, పురుషార్థము తప్పకుండా
చేయాలి. కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని తండ్రిని స్మృతి చేయండి. త్వమేవ
మాతాశ్చ, పితా త్వమేవ... ఇదంతా భక్తి మార్గపు మహిమ. మీరు ఒక్క భగవంతుడిని మాత్రమే
స్మృతి చేయాలి. నేను ఒక్కడినే సాక్కిరిన్ ను, మీరు కూడా మిగిలిన విషయాలన్నింటినీ
వదిలి చాలా మధురమైన సాక్కిరిన్ గా అవ్వండి. ఇప్పుడు మీ ఆత్మ తమోప్రధానముగా అయ్యింది,
దానిని సతోప్రధానముగా తయారుచేసుకునేందుకు స్మృతియాత్రలో ఉండండి. తండ్రి నుండి సుఖ
వారసత్వాన్ని తీసుకోండి అని అందరికీ ఇదే చెప్పండి. సుఖమనేది సత్యయుగములోనే ఉంటుంది.
సుఖధామాన్ని స్థాపన చేసేవారు తండ్రి. తండ్రిని స్మృతి చేయడము చాలా సులభము, కానీ మాయ
అపోజిషన్ చాలా ఉంది, అందుకే ప్రయత్నము చేసి నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యము
తొలగిపోతుంది. సెకెండులో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు.
ఈ డ్రామాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను రిపీట్ చేయాలి. ఈ డ్రామాలో అందరికన్నా ఎక్కువ
పాత్ర మనకే ఉంది. సుఖము కూడా అందరికన్నా ఎక్కువగా మనకే లభిస్తుంది. తండ్రి అంటారు -
మీ దేవీ-దేవతా ధర్మము చాలా సుఖమిచ్చే ధర్మము. మిగిలినవారంతా లెక్కాచారాలను సమాప్తము
చేసుకుని శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఎక్కువ విస్తారములోకి మనమెందుకు వెళ్ళాలి.
అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకే తండ్రి వస్తారు. దోమల వలె అందరినీ తీసుకువెళ్తారు.
శరీరాలు సమాప్తమైపోతాయి. ఇకపోతే, అవినాశీ అయిన ఆత్మ తన లెక్కాచారాలను సమాప్తము
చేసుకుని వెళ్ళిపోతుంది. అంతేకానీ, ఆత్మ అగ్నిలో పడటముతో పవిత్రముగా అవుతుందని కాదు.
ఆత్మ తన స్మృతి రూపీ యోగముతోనే పవిత్రముగా అవ్వాల్సి ఉంటుంది. ఇదే యోగాగ్ని. దీని
గురించే వారు - సీత అగ్నిలోకి వెళ్ళినట్లుగా నాటకాన్ని తయారుచేసారు. ఆ అగ్నిని కేవలం
ఎవరో ఒక్కరు మాత్రమే ఎదుర్కోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - సీతలైన మీరంతా ఈ
సమయములో పతితముగా ఉన్నారు, రావణ రాజ్యములో ఉన్నారు. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతితో
మీరు పావనముగా అవ్వాలి. రాముడు ఒక్కరే. అగ్ని అనే పదాన్ని వినడముతో, సీత అగ్నిలోకి
వెళ్ళిందని అనుకుంటారు. యోగాగ్ని ఎక్కడ, ఆ స్థూల అగ్ని ఎక్కడ. ఆత్మ పరమాత్మతో యోగము
జోడించడముతో పతితము నుండి పావనముగా అవుతుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది.
ఆత్మలందరూ సీతలే. రావణుడి జైలులో, శోకవాటికలో ఉన్నారు. ఇక్కడి సుఖము కాకి రెట్ట
సమానమైనది. స్వర్గ సుఖాలు అపారమైనవి. పిల్లలు జ్ఞాన రత్నాలతో జోలిని నింపుకోవాలి. ఏ
రకమైన సంశయము రాకూడదు. దేహాభిమానము రావడముతో ఇక అనేక రకాల ప్రశ్నలు మొదలైనవి
ఉత్పన్నమవుతాయి. అప్పుడు, తండ్రి ఏదైతే కర్తవ్యాన్ని ఇస్తారో, అది చేయరు. ముఖ్యమైన
విషయమేమిటంటే - మనము పతితము నుండి పావనముగా అవ్వాలి. వేరే సంకల్పాలేవీ చేయాల్సిన
అవసరము లేదు. ఇది పతిత ప్రపంచము, అది పావన ప్రపంచము. పావనముగా అవ్వడమే ముఖ్యమైన
విషయము. పావనముగా ఎవరు తయారుచేస్తారు, ఇది ఏ మాత్రము తెలియదు. మీరు పతితులు అని
చెప్పినట్లయితే డిస్టర్బ్ అవుతారు. ఎవరూ తమను తాము వికారులని భావించరు. అందరూ
గృహస్థులుగా ఉండేవారని, సీతా-రాములకు, లక్ష్మీ-నారాయణులకు కూడా పిల్లలు ఉన్నారు కదా
అని, అక్కడ కూడా పిల్లలు జన్మిస్తారని వారు అంటారు. కానీ దానిని నిర్వికారీ
ప్రపంచమని అంటారన్న విషయాన్ని వారు మర్చిపోయారు. అది శివాలయము.
తండ్రి పిల్లలైన మీకు ఎన్ని యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. బాబా తండ్రి, టీచర్,
గురువు, వారు అందరికీ సద్గతినిస్తారు. అక్కడైతే ఒక గురువు మరణిస్తే, వారి పిల్లలకు
సింహాసనాన్ని ఇస్తారు. ఇప్పుడు ఆ పిల్లలు సద్గతిలోకి ఎలా తీసుకువెళ్తారు. సర్వుల
సద్గతిదాత ఒక్కరే. రావణ రాజ్యములో దుర్గతి ఉంది, రామ రాజ్యములో సద్గతి ఉంటుంది.
తండ్రి అందరినీ పావనముగా తయారుచేసి తీసుకువెళ్తారు, ఆ తర్వాత ఒక్కసారిగా ఎవరూ
పతితులుగా అవ్వరు, నంబరువారుగా కిందకు దిగుతారు. సతోప్రధానము నుండి సతో, రజో, తమో...
మీ బుద్ధిలో 84 జన్మల చక్రము కూర్చుని ఉంది. ఇప్పుడు మీరు లైట్ హౌస్ వలె ఉన్నారు.
జ్ఞానము ద్వారా ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది తెలుసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన
మీరు మిగిలినవారందరికీ మార్గాన్ని తెలియజేయాలి. మీరంతా సైన్యము. మీరు మార్గాన్ని
తెలియజేసే పైలెట్లు. మీరు అందరికీ ఇలా చెప్పండి - ఇప్పుడు శాంతిధామాన్ని,
సుఖధామాన్ని స్మృతి చేయండి, కలియుగ దుఃఖధామాన్ని మర్చిపోండి, మేము మీకు చాలా మంచి
మార్గాన్ని తెలియజేస్తాము, పతిత-పావనుడు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే, వారిని స్మృతి
చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు. మీ ఆత్మపై ఏదైతే తుప్పు పట్టి ఉందో, అది
తొలగిపోతూ ఉంటుంది. భగవానువాచ - మన్మనాభవ. శివ భగవానువాచ - వినాశ కాలే విపరీత బుద్ధి
వినశ్యంతి మరియు వినాశ కాలే పరమపిత పరమాత్ముని పట్ల ప్రీతి బుద్ధి విజయంతి. మీకు
ఎంతగా ప్రీతి బుద్ధి ఉంటుందో, అంత ఉన్నత పదవిని పొందుతారు. దేహాభిమానములోకి
వచ్చినట్లయితే అంత ఉన్నత పదవిని పొందలేరు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. జ్ఞాన రత్నాలతో తమ జోలిని నింపుకోవాలి. ఏ రకమైన సంశయము ఉత్పన్నమవ్వకూడదు. ఎంత
వీలైతే అంత తండ్రిని స్మృతి చేసే పురుషార్థము చేసి పావనముగా అవ్వాలి. ఇకపోతే
ప్రశ్నలలోకి వెళ్ళకూడదు.
2. ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని పెట్టుకుని, తండ్రి సమానముగా మధురమైన
సాక్కిరిన్ గా అవ్వాలి.
వరదానము:-
సదా జ్ఞాన సూర్యుని సమ్ముఖములో ఉండే అంతర్ముఖి, స్వమానధారి
భవ
ఏ విధముగా సూర్యుడిని ఎదురుగా చూసినప్పుడు సూర్యుని
కిరణాలు తప్పకుండా వస్తాయో, అదే విధంగా ఏ పిల్లలైతే జ్ఞాన సూర్యుడైన తండ్రి
సమ్ముఖములో సదా ఉంటారో, వారు జ్ఞాన సూర్యుని సర్వ గుణాల కిరణాలను స్వయములో అనుభవం
చేస్తారు. వారి ముఖముపై అంతర్ముఖత యొక్క ప్రకాశము మరియు, సంగమయుగము మరియు భవిష్యత్తు
యొక్క సర్వ స్వమానాల నషా కనిపిస్తుంది. దీని కోసం సదా ఏమని స్మృతిలో ఉండాలంటే - ఇది
అంతిమ ఘడియ. ఏ ఘడియలోనైనా ఈ తనువు యొక్క వినాశనము జరగవచ్చు, అందుకే సదా ప్రీతి
బుద్ధి కలవారిగా అయి, జ్ఞాన సూర్యుని సమ్ముఖములో ఉంటూ అంతర్ముఖత మరియు స్వమానము
యొక్క అనుభూతిలో ఉండాలి.
స్లోగన్:-
సదా ఎగిరే కళలో
ఎగరడమే అలజడులతో కూడిన పర్వతాన్ని దాటి వేయడము.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
పవిత్రతయే మహానత, ఇదే
యోగీ జీవితానికి ఆధారము. ఒకవేళ సంకల్పములోనైనా అంశమాత్రము అపవిత్రత ఉన్నా కూడా,
ఎక్కడైతే అపవిత్రత యొక్క అంశము ఉంటుందో, అక్కడ పవిత్రమైన బాబా స్మృతి ఏ విధముగా
ఉండాలో, ఎలా ఉండాలో అలా ఉండదు, అందుకే మనసులో కూడా అపవిత్రత యొక్క అంశాన్ని సమాప్తము
చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా అవ్వండి. పూజ్య ఆత్మనైన నేను ఈ శరీరమనే మందిరములో
విరాజమానమై ఉన్నాను అని సదా ఈ స్మృతే ఉండాలి.