21-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - యోగాగ్నితో పాపాలను భస్మము చేసుకుని
సంపూర్ణ సతోప్రధానముగా అవ్వాలి, ఎటువంటి పాప కర్మలు చేయకూడదు’’
ప్రశ్న:-
సత్యయుగములో
ఉన్నత పదవి దేని ఆధారముగా లభిస్తుంది? ఇక్కడ ఉన్న ఏ నియమాన్ని అందరికీ వినిపించాలి?
జవాబు:-
సత్యయుగములో
పవిత్రత ఆధారముగా ఉన్నత పదవి లభిస్తుంది. ఎవరైతే పవిత్రతను తక్కువగా ధారణ చేస్తారో,
వారు సత్యయుగములోకి ఆలస్యముగా వస్తారు మరియు పదవి కూడా తక్కువది పొందుతారు. ఇక్కడికి
ఎవరైనా వచ్చినప్పుడు, వారికి ఈ నియమాన్ని వినిపించండి - దానమిస్తే గ్రహణము
తొలగిపోతుంది. 5 వికారాలను దానమిచ్చినట్లయితే మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు.
పిల్లలైన మీరు కూడా మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - నాలో ఏ వికారాలు లేవు కదా?
ఓంశాంతి
ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతూ ఉందని మనుష్యులకెలా అర్థం చేయించాలి అనేది ఆత్మిక
తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా భారత్
లో స్వర్గముండేది, లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. ఆ సమయములో ఎంతమంది
మనుష్యులుండేవారో ఆలోచించాలి. సత్యయుగము ఆదిలో మహా అయితే 9-10 లక్షల మంది ఉంటారు.
మొదటిలో వృక్షము చిన్నగానే ఉంటుంది. ఈ సమయములో కలియుగాంతములో వృక్షము ఎంత పెద్దగా
అయిపోయింది, ఇప్పుడు దీని వినాశనము కూడా తప్పకుండా జరగనున్నది. ఇది అదే మహాభారత
యుద్ధమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ సమయములోనే గీతా భగవానుడు రాజయోగాన్ని
నేర్పించారు మరియు దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసారు. సంగమములోనే అనేక ధర్మాల
వినాశనము, ఏక ధర్మ స్థాపన జరిగింది. పిల్లలకు ఈ విషయము కూడా తెలుసు - నేటికి 5 వేల
సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది, అప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు.
అటువంటి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి తండ్రి సంగమములో వస్తారు. ఇప్పుడు ఆ
స్థాపన జరుగుతూ ఉంది. పాత ప్రపంచము వినాశనమవుతుంది. సత్యయుగములో భారత ఖండము ఒక్కటే
ఉండేది, ఇంకే ఖండము ఉండేది కాదు. ఇప్పుడైతే ఎన్ని ఖండాలు ఉన్నాయి. ఇప్పుడు భారత
ఖండము కూడా ఉంది కానీ ఇందులో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము లేదు. అది కనుమరుగైపోయింది.
ఇప్పుడు మళ్ళీ పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తున్నారు. ఇక మిగిలిన
ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. సత్య, త్రేతాయుగాలలో వేరే రాజ్యాలేవీ ఉండేవి కావని
గుర్తుంచుకోవాలి. ఇతర ధర్మాలన్నీ ఇప్పుడు వచ్చాయి. ఎంత దుఃఖము, అశాంతి, కొట్లాటలు
ఉన్నాయి. మహాభారీ మహాభారత యుద్ధము కూడా అదే. ఒక వైపు యూరోప్ వాసులైన యాదవులు కూడా
ఉన్నారు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా వారు మిసైల్స్ ను కనుగొన్నారు. కౌరవులు,
పాండవులు కూడా ఉండేవారు. స్వయంగా పరమపిత పరమాత్మ పాండవులకు సహాయకునిగా ఉండేవారు.
అందరికీ ఈ విషయాన్నే చెప్పారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ నన్ను స్మృతి చేసినట్లయితే
మీ పాపాలు వృద్ధి చెందవు మరియు గతం యొక్క వికర్మలు వినాశనమవుతాయి.
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - సత్యయుగములో సతోప్రధానముగా ఉన్న భారతవాసులైన
మీరే ఈ సమయములో 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ, ఇప్పుడు మీ ఆత్మలు తమోప్రధానముగా
అయిపోయాయి. ఇప్పుడు సతోప్రధానముగా ఎలా అవ్వాలి. పతిత-పావన తండ్రినైన నన్ను స్మృతి
చేసినప్పుడు సతోప్రధానముగా అవుతారు. ఈ యోగాగ్నితోనే పాపాలు భస్మమవుతాయి మరియు ఆత్మ
సతోప్రధానముగా అవుతుంది. తర్వాత స్వర్గములో 21 జన్మల కొరకు వారసత్వాన్ని పొందుతారు.
ఇకపోతే, ఈ పాత ప్రపంచ వినాశనమైతే జరగాల్సిందే. భారత్ సత్యయుగములో శ్రేష్ఠాచారిగా
ఉండేది మరియు సృష్టి ఆదిలో చాలా తక్కువమంది మనుష్యులు ఉండేవారు. భారత్ స్వర్గముగా
ఉండేది, అప్పుడు ఇంకే ఖండము ఉండేది కాదు. ఇప్పుడు ఇతర ధర్మాలు వృద్ధి
చెందుతూ-చెందుతూ వృక్షము ఎంత పెద్దదిగా అయిపోయింది, అంతేకాక తమోప్రధానముగా అయి
శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు ఈ తమోప్రధాన వృక్షము యొక్క వినాశనము మరియు కొత్త
దేవీ-దేవతా ధర్మానికి చెందిన వృక్షము యొక్క స్థాపన తప్పకుండా జరగాలి. అది సంగమములోనే
జరుగుతుంది. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము
యొక్క అంటు కట్టబడుతుంది. పతిత మనుష్యులను తండ్రి పావనముగా తయారుచేస్తున్నారు, వారే
తర్వాత దేవతలుగా అవుతారు. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, ఎవరైతే 84 జన్మలు
తీసుకున్నారో, వారే మళ్ళీ మొదటి నంబరులోకి వస్తారు. అందరికంటే ముందు దేవీ-దేవతల
పాత్ర ఉండేది. వారే మొట్టమొదట విడిపోయారు. మళ్ళీ వారి పాత్రే ఉండాలి కదా.
సత్యయుగములో సర్వగుణ సంపన్నులుగా... ఉంటారు. ఇప్పుడిది వికారీ ప్రపంచము. రాత్రికి,
పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు వికారీ ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచముగా ఎవరు
తయారుచేస్తారు. పావనముగా తయారుచేసే వారా రండి, అని పిలుస్తారు కూడా. ఇప్పుడు వారు
వచ్చారు. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని నిర్వికారులుగా తయారుచేస్తున్నాను. ఈ
వికారీ ప్రపంచము యొక్క వినాశనము కోసం యుద్ధము జరగనున్నది. ఇప్పుడు ఏక మతం ఎలా
ఏర్పడుతుంది అని మనుష్యులంటారు ఎందుకంటే ఈ సమయములో అనేక మతాలున్నాయి కదా. అనేక మతాలు
ఉన్నప్పుడు ఏక ధర్మము యొక్క మతాన్ని ఎవరు స్థాపన చేస్తారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, ఇప్పుడు ఏక మత స్థాపన జరుగుతూ ఉంది, మిగిలినవన్నీ వినాశనమైపోతాయి.
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమువారు ఎవరైతే పావనముగా ఉండేవారో, వారే మళ్ళీ 84 జన్మలను
అనుభవించి ఇప్పుడు పతితముగా అయ్యారు. మళ్ళీ తండ్రి వచ్చి భారతవాసులకు మళ్ళీ స్వర్గ
వారసత్వాన్ని ఇస్తున్నారు అనగా అసురుల నుండి దేవతలుగా తయారుచేస్తున్నారు. మీరు
ఎవరికైనా ఇలా అర్థం చేయించవచ్చు - తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే
మీరు పతితము నుండి పావనముగా అవుతారు. ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చోండి. ఈ చితిపై
కూర్చుంటే మీరు పావనముగా అవుతారు. తర్వాత ద్వాపరములో రావణ రాజ్యము ఉన్న కారణముగా
కామ చితిపై కూర్చుంటూ-కూర్చుంటూ భ్రష్టాచారీ ప్రపంచముగా తయారైంది. నేటికి 5 వేల
సంవత్సరాల క్రితం దేవీ-దేవతలు ఉండేవారు. అప్పుడు కొద్దిమంది మనుష్యులు మాత్రమే
ఉండేవారు. ఇప్పుడు ఎంతగా అసురుల వలె అయ్యారు. ఇతర ధర్మాలు కూడా చేరడముతో వృక్షము
పెద్దది అయిపోయింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ వృక్షము శిథిలావస్థకు
చేరుకుంది, ఇప్పుడు మళ్ళీ నేను ఏక మతము యొక్క రాజ్యాన్ని స్థాపన చేయాల్సి ఉంటుంది.
భారతవాసులు, ఒకే ధర్మము, ఒకే మతము ఉండాలని అంటారు కూడా. సత్యయుగములో ఒకే
ధర్మముండేదని భారతవాసులు మర్చిపోయారు. ఇక్కడైతే అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు తండ్రి
వచ్చి మళ్ళీ ఏక ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. పిల్లలైన మీరు రాజయోగాన్ని
నేర్చుకుంటున్నారు. తప్పకుండా భగవంతుడే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ విషయము ఎవ్వరికీ
తెలియదు. ప్రదర్శనీని ప్రారంభోత్సవము చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి కూడా ఇలా
అర్థం చేయించాలి - మీరు దేని ప్రారంభోత్సవము చేస్తున్నారు? తండ్రి ఈ భారత్ ను
స్వర్గముగా తయారుచేస్తున్నారు. ఇకపోతే, నరకవాసులంతా వినాశనమైపోతారు. వినాశనానికి
ముందే ఎవరైతే తండ్రి నుండి వారసత్వము తీసుకునేది ఉందో, వారు వచ్చి తెలుసుకోండి. ఈ
బి.కె.ల ఆశ్రమము క్వారంటైన్ క్లాస్ వంటిది (సెంటరుకు కొత్తగా వచ్చిన వారిని విడిగా
కూర్చోబెట్టి జ్ఞానము వినిపిస్తారు). ఇక్కడ ఏడు రోజుల క్లాసు తీసుకోవాలి, అప్పుడు ఈ
పంచ వికారాలు తొలగిపోతాయి. దేవతలలో ఈ పంచ వికారాలు ఉండవు. ఇప్పుడు ఇక్కడ పంచ
వికారాలను దానమివ్వాలి, అప్పుడు గ్రహణము తొలగుతుంది. దానమిస్తే గ్రహణము తొలగుతుంది.
అప్పుడు మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. భారత్ సత్యయుగములో 16 కళల సంపూర్ణముగా
ఉండేది, ఇప్పుడైతే ఏ కళ మిగలలేదు. అందరూ నిరుపేదలుగా అయిపోయారు.
ఎవరైనా ప్రారంభోత్సవము చేయడానికి వస్తే వారికి ఇలా చెప్పండి - ఇక్కడి నియమేమిటంటే,
పంచ వికారాలను దానమిస్తే గ్రహణము తొలగిపోతుందని తండ్రి చెప్తున్నారు. మీరు 16 కళల
సంపూర్ణులుగా దేవతలుగా అవుతారు. పవిత్రత అనుసారముగా పదవిని పొందుతారు. ఇకపోతే,
ఒకవేళ ఏవైనా కళలు తక్కువైతే జన్మ కూడా ఆలస్యముగా తీసుకుంటారు. వికారాలను
దానమివ్వడమనేది మంచిదే కదా. పూర్వము చంద్రునికి గ్రహణము పడితే బ్రాహ్మణులు దానము
తీసుకునేవారు. ఇప్పుడైతే బ్రాహ్మణులు పెద్ద వ్యక్తులయ్యారు. పాపం పేదవారు భిక్షము
అడుగుతూ ఉంటారు, పాత వస్త్రాలు మొదలైనవి కూడా తీసుకుంటూ ఉంటారు. వాస్తవానికి
బ్రాహ్మణులు పాత వస్త్రాలు తీసుకోరు, వారికి కొత్తవి ఇస్తారు. భారత్ 16 కళల
సంపూర్ణముగా ఉండేదని, ఇప్పుడు ఇనుపయుగముదిగా అయిపోయిందని ఇప్పుడు మీరు అర్థం
చేయిస్తారు. 5 వికారాల గ్రహణము పట్టి ఉంది. ఇప్పుడు మీరు ఆ పంచ వికారాలను దానమిచ్చి
ఈ అంతిమ జన్మ పవిత్రముగా ఉంటే కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. స్వర్గములో
చాలా కొద్దిమంది ఉండేవారు, తర్వాత వృద్ధి జరిగింది. ఇప్పుడు వినాశనము కూడా ఎదురుగా
నిలిచి ఉంది. తండ్రి అంటారు - పంచ వికారాలను దానమిస్తే గ్రహణము తొలగిపోతుంది.
ఇప్పుడు మీరు శ్రేష్ఠాచారులుగా అయి స్వర్గములో సూర్యవంశీ రాజ్యాన్ని తీసుకోవాలి
కనుక భ్రష్టాచారాన్ని వదలాల్సి ఉంటుంది. 5 వికారాలను దానమివ్వండి. మీ హృదయాన్ని
ప్రశ్నించుకోండి - మేము సర్వ గుణ సంపన్నులుగా, సంపూర్ణ నిర్వికారులుగా అయ్యామా?
నారదుని ఉదాహరణ ఉంది కదా. ఒక్క వికారమున్నా సరే, లక్ష్మిని ఎలా వరించగలరు?
ప్రయత్నిస్తూ ఉండండి, మాలిన్యాన్ని కాల్చేస్తూ ఉండండి. బంగారాన్ని కరిగించేటప్పుడు,
అది కరుగుతూ ఉండగా ఒకవేళ అగ్ని చల్లారిపోతే మాలిన్యము తొలగదు. అందుకే, చాలా
తీవ్రమైన అగ్నిలో కరిగిస్తారు. బంగారము నుండి మాలిన్యము వేరైపోయిందని చూసినప్పుడు
ఇక దానిని అచ్చులలో పోస్తారు. ఇప్పుడు స్వయంగా తండ్రి చెప్తున్నారు - ఏ వికారాలలోకి
వెళ్ళకండి, తీవ్ర వేగముతో పురుషార్థము చేయండి. ముందుగా పవిత్రత యొక్క ప్రతిజ్ఞ
చేయండి. బాబా, మీరు పావనముగా తయారుచేయడానికి వచ్చారు, ఇక మేము ఎప్పుడూ వికారాలలోకి
వెళ్ళము. దేహీ-అభిమానులుగా అవ్వాలి. తండ్రి ఆత్మలైన మనకు అర్థం చేయిస్తున్నారు. వారు
సుప్రీమ్ ఆత్మ. మనము పతితముగా ఉన్నామని మీకు తెలుసు. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి.
నేను మీ తండ్రిని, ఆత్మలైన మీతో మాట్లాడుతున్నాను. నేను మీ తండ్రిని, పరమాత్మను,
నేను పావనముగా తయారుచేయడానికి వచ్చాను అని ఇంకెవ్వరూ అనలేరు. మీరు మొట్టమొదట
సతోప్రధానముగా ఉండేవారు, తర్వాత సతో, రజో, తమోలలోకి వచ్చారు, తమోప్రధానముగా అయ్యారు.
ఈ సమయములో పంచ తత్వాలు కూడా తమోప్రధానముగా ఉన్నాయి, అందుకే అవి దుఃఖాన్ని
ఇస్తున్నాయి. ప్రతి వస్తువు దుఃఖము ఇస్తుంది. ఈ తత్వాలే సతోప్రధానముగా ఉన్నప్పుడు
సుఖము ఇస్తాయి. దాని పేరే సుఖధామము. ఇది దుఃఖధామము. సుఖధామము అనంతమైన తండ్రి
వారసత్వము. దుఃఖధామము రావణుడి వారసత్వము. ఇప్పుడు ఎంతగా శ్రీమతముపై నడుస్తారో, అంత
ఉన్నతముగా అవుతారు. ఇక కల్ప-కల్పము వీరు ఈ విధమైన పురుషార్థమే చేస్తారని
ప్రసిద్ధమవుతారు. ఇది కల్ప-కల్పము యొక్క పందెము. ఎవరైతే ఎక్కువ పురుషార్థము
చేస్తున్నారో, వారు తమ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. పురుషార్థము సరిగ్గా
చేయకపోతే థర్డ్ గ్రేడ్ లోకి వెళ్ళిపోతారు. ప్రజలలో కూడా ఏమవుతారో తెలియదు. లౌకిక
తండ్రి కూడా, నీవు నా పేరు పాడు చేస్తున్నావు, ఇంటి నుండి బయటికి వెళ్ళిపో అని
అంటారు. అనంతమైన తండ్రి కూడా అంటారు - మీకు మాయ చెంపదెబ్బ ఎలా తగులుతుందంటే ఇక మీరు
సూర్యవంశములోకి, చంద్రవంశములోకి రానే రారు, మీకు మీరే చెంపదెబ్బ వేసుకుంటారు. తండ్రి,
వారసులుగా అవ్వండి అని చెప్తారు. రాజ్య తిలకాన్ని తీసుకోవాలనుకుంటే నన్ను స్మృతి
చేయండి మరియు ఇతరులకు కూడా స్మృతినిప్పించండి, అప్పుడు మీరు రాజులుగా అవుతారు.
నంబరువారుగా అయితే ఉంటారు కదా. కొంతమంది బ్యారిస్టర్లు ఒక్కొక్క కేసుకు లక్షల
రూపాయలు సంపాదిస్తారు, మరికొంతమందిని చూడండి, ధరించేందుకు కోటు కూడా ఉండదు. అంతా
పురుషార్థముపై ఆధారపడి ఉంటుంది కదా. మీరు కూడా పురుషార్థము చేస్తే ఉన్నత పదవిని
పొందుతారు. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. యజమానులుగానైనా అవ్వండి, ప్రజలుగానైనా
అవ్వండి. ప్రజలలో కూడా నౌకర్లుగా అవుతారు. విద్యార్థి నడవడిక ద్వారా టీచర్ అర్థం
చేసుకుంటారు. విచిత్రమేమిటంటే ముందు వచ్చినవారి కంటే వెనుక వచ్చినవారు చురుకుగా
ముందుకు వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇప్పుడు రోజురోజుకు రిఫైన్ పాయింట్లు లభిస్తూ ఉంటాయి.
అంటు కడుతూ ఉంటారు. ముందు వచ్చినవారైతే కొంతమంది పారిపోయారు. కొత్తవారు జోడించబడుతూ
ఉంటారు. కొత్త-కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి. చాలా యుక్తిగా అర్థం చేయించడము
జరుగుతుంది. బాబా అంటారు, నేను మీకు ఎంతో గుహ్యాతి-గుహ్యమైన, రమణీకమైన విషయాలను
వినిపిస్తాను, వాటితో మీరు వెంటనే నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారు. నా పాత్ర
ఉన్నంతవరకు మిమ్మల్ని చదివిస్తూ ఉంటాను. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది.
కర్మాతీత అవస్థను చేరుకున్నప్పుడు చదువు పూర్తవుతుంది. పిల్లలు కూడా అర్థం
చేసుకుంటారు. చివరిలో పరీక్ష ఫలితాలు తెలుస్తాయి కదా. ఈ చదువులో నంబరువన్ సబ్జెక్ట్
పవిత్రత. ఎప్పటివరకైతే తండ్రిని స్మృతి చేయరో, తండ్రి సేవ చేయరో, అప్పటివరకు
విశ్రాంతి తీసుకోకూడదు. మీ యుద్ధము మాయతోనే. రావణుడిని కాలుస్తారు కానీ అతడు ఎవరు
అనేది తెలియదు. దసరా పండుగను చాలా బాగా జరుపుకుంటారు. భగవాన్ రాముని యొక్క భగవతి
అయిన సీత అపహరించబడ్డారని, తర్వాత రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారని వింటే -
ఇప్పుడు మీకు ఆశ్చర్యమనిపిస్తుంది. ఈ విధముగా ఎప్పుడైనా జరగగలదా? ఏమీ అర్థం చేసుకోరు.
ప్రదర్శనీలకు వచ్చినప్పుడు మొట్టమొదట వారికి చెప్పాలి - భారత్ లో ఈ
లక్ష్మీ-నారాయణుల రాజ్యమున్నప్పుడు ఎంతమంది మనుష్యులు ఉంటారు. ఇది 5 వేల సంవత్సరాల
విషయము. ఇప్పుడిది కలియుగము, ఇది అదే మహాభారీ మహాభారత యుద్ధము కూడా. తండ్రి వచ్చి
రాజయోగాన్ని నేర్పిస్తారు. వినాశనము కూడా జరుగుతుంది. ఇక్కడ ఏక ధర్మము, ఏక మతము ఎలా
ఏర్పడతాయి అనగా శాంతి ఎలా ఏర్పడుతుంది? ఏక మతము ఏర్పడాలని ఎంతగా కష్టపడుతూ ఉంటారో,
అంతగానే కొట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు - ఇప్పుడు నేను వారందరినీ పరస్పరములో
కొట్లాడుకునేలా చేసి వెన్న మీకు ఇస్తాను. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎవరైతే
చేస్తారో వారు పొందుతారు. కొంతమంది పిల్లలు తండ్రి కంటే కూడా ఉన్నతముగా అవ్వగలరు.
మీరు నా కంటే కూడా షావుకారులుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు. నేను అలా అవ్వను.
నేను పిల్లలైన మీకు నిష్కామ సేవ చేస్తాను. నేను దాతను. ఎవ్వరూ కూడా, నేను శివబాబాకు
5 రూపాయలు ఇస్తున్నాను అని అనుకోకండి. నేను శివబాబా నుండి స్వర్గములో 5 పదమాలు
తీసుకుంటాను అని అనుకోండి. మరి అది ఇవ్వడమా? ఒకవేళ మేము ఇస్తున్నాము అని భావిస్తే,
అది శివబాబాను చాలా అవమానపరచినట్లు. తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతముగా
తయారుచేస్తున్నారు. మీరు శివబాబా ఖజానాకు 5 రూపాయలిస్తారు. బాబా మీకు 5 కోట్లు
ఇస్తారు. గవ్వ నుండి వజ్ర సమానముగా తయారుచేస్తారు. మేము శివబాబాకు ఇచ్చాము అని
ఎప్పుడూ సంశయపడకండి. బాబా ఎంతటి భోళానాథుడు. మేము బాబాకు ఇస్తున్నాము అనే ఆలోచన
ఎప్పుడూ రాకూడదు. అలా కాదు. శివబాబా నుండి మనము 21 జన్మల కోసం వారసత్వాన్ని
తీసుకుంటాము. శుద్ధ భావముతో ఇవ్వకపోతే ఎలా స్వీకరించబడుతుంది. అన్ని విషయాల జ్ఞానము
బుద్ధిలో ఉంచుకోవాలి. ఈశ్వరార్థము దానము చేస్తారు, ఈశ్వరుడేమైనా ఆకలితో ఉన్నారా?
లేదు. మాకు మరుసటి జన్మలో లభిస్తుందని భావిస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చుని మీకు
కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ చేసే కర్మలన్నీ వికర్మలుగానే
అవుతాయి ఎందుకంటే ఇది రావణ రాజ్యము. సత్యయుగములో కర్మలు అకర్మలుగా అవుతాయి. నేను
మిమ్మల్ని ఇప్పుడు ఆ ప్రపంచములోకి ట్రాన్స్ఫర్ చేస్తాను, అక్కడ మీ ద్వారా అసలు
వికర్మలు జరగనే జరగవు. చాలామంది పిల్లలు తయారవుతారు, ఇక మీ ధనాన్ని ఏం చేసుకుంటారు.
ఉపయోగపడనిది తీసుకుని, మళ్ళీ దానికి రిటర్న్ ఇవ్వడానికి నేనేమీ అనుభవం లేని
వ్యాపారిని కాను. నేను పక్కా వ్యాపారిని. అవసరము లేదని చెప్పేస్తాను. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తీవ్ర వేగముతో పురుషార్థము చేసి వికారాల మాలిన్యాన్ని యోగాగ్నిలో కరిగించేయాలి.
పవిత్రత యొక్క పూర్తి ప్రతిజ్ఞను చేయాలి.
2. కర్మ-అకర్మ-వికర్మల గతిని బుద్ధిలో ఉంచుకుని తమదంతా కొత్త ప్రపంచము కోసం
ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
వరదానము:-
శ్రీమతము ఆధారముగా సంతోషాన్ని, శక్తిని మరియు సఫలతను అనుభవం
చేసే సర్వ ప్రాప్తి సంపన్న భవ
ఏ పిల్లలైతే స్వయాన్ని ట్రస్టీగా భావిస్తూ
శ్రీమతమనుసారముగా నడుస్తారో, శ్రీమతములో కొంచెం కూడా మన్మతాన్ని లేక పరమతాన్ని
మిక్స్ చేయరో, వారికి నిరంతరము సంతోషము, శక్తి మరియు సఫలత అనుభవమవుతాయి. పురుషార్థము
లేక శ్రమ తక్కువగా ఉన్నా కానీ ప్రాప్తి ఎక్కువగా ఉండాలి, అప్పుడు శ్రీమతముపై
యథార్థముగా నడిచేవారు అని అంటారు. కానీ మాయ ఈశ్వరీయ మతములో మన్మతాన్ని లేక పరమతాన్ని
రాయల్ రూపములో మిక్స్ చేస్తుంది, కావుననే సర్వ ప్రాప్తుల అనుభవం కలగదు. దీని కోసం
పరిశీలనా శక్తిని మరియు నిర్ణయ శక్తిని ధారణ చేయండి, అప్పుడు మోసపోరు.
స్లోగన్:-
ఎవరైతే తపస్యా
బలముతో భాగ్యవిధాత అయిన తండ్రిని తమవారిగా చేసుకుంటారో వారే బాలక్ సో మాలిక్.
అవ్యక్త ప్రేరణలు -
పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి
సంతుష్టముగా
ఉన్నవారిని సంతుష్టపర్చడము, స్నేహీలకు స్నేహాన్ని ఇవ్వటము, సహయోగులుగా ఉన్నవారికి
సహయోగులుగా అవ్వటము - ఇది మహావీరత కాదు. కానీ ఎవరు ఎంత అసహయోగులుగా అయినా, మీ సహయోగ
శక్తి ద్వారా అసహయోగులను సహయోగులుగా చెయ్యటము, దీనినే మహావీరత అని అంటారు. బలహీనముగా
ఉన్నవారిని బలహీనులుగా భావించి వదలకండి, వారికి బలాన్ని ఇచ్చి బలశాలిగా చేయండి,
బలహీనులను హై జంప్ చేయడానికి యోగ్యులుగా చేయండి, అప్పుడు మహావీరులని, అందరికీ
ఉపకారము చేసేవారని అంటారు.