‘‘కారణము అన్న పదము నుండి ముక్తులుగా ఉంటూ నడవడిక
మరియు ముఖము ద్వారా ముక్తిని ఇచ్చే ముక్తిదాతలుగా అవ్వండి, సేవ
యొక్క ఉల్లాస-ఉత్సాహాలతో పాటు సదా అనంతమైన వైరాగ్య వృత్తిలో
ఉండండి’’
ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలెవరైతే డబుల్
యజమానులుగా ఉన్నారో, ఆ పిల్లలు ప్రతి ఒక్కరినీ చూస్తున్నారు.
ఒకటేమో బాబా యొక్క ఖజానాలన్నింటికీ యజమానులు మరియు రెండవది
స్వరాజ్యానికి యజమానులు. రెండు యాజమాన్యాలు ప్రతి బిడ్డకు బాబా
ద్వారా లభించి ఉన్నాయి. బాలకులు కూడా మరియు యజమానులు కూడా. నా
బాబా అన్నారు మరియు బాబా కూడా నా పిల్లలు అన్నారు, కావున
బాలకులు మరియు యజమానులు, రెండింటి అనుభవము ఉంది.
ఈ రోజు చాలా చాలా మంది పిల్లలు వచ్చారు, ఇది ఈ సంవత్సరములోని
చివరి టర్న్. ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని
చెక్ చేసారు. మరి ఏమి చూసి ఉంటారో చెప్పండి? నా పురుషార్థము
ఏమిటి అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. బాప్ దాదా
పిల్లలందరినీ చూసి సంతోషించారు కూడా, కానీ ఒక ఆశ బాబాకు ఉంది,
అది ఏమిటో చెప్పమంటారా! బాబా ఆశను పూర్తి చేస్తారు కదా! ఒక్కటే
ఆశ ఉంది, చెప్పమంటారా! ఆశను పూర్తి చేస్తాము అన్నవారు
చేతులెత్తండి. చాలా మంచిది. చిన్న ఆశ ఉంది, అదేమిటంటే - ఈ రోజు
నుండి ఒక్క పదాన్ని మార్చి వేయండి, అది ఏ పదము? ఏదైతే పదే-పదే
కిందకు తీసుకువస్తుందో, ఆ పదము ఏమిటంటే - ‘‘కారణము’’. ఈ కారణము
అన్న పదాన్ని పరివర్తన చేసి నివారణ అన్న పదాన్ని సదా ధారణ
చేయండి, ఎందుకంటే ఇప్పుడు మీ సేవ కూడా ఏమిటి? విశ్వములోని
ఆత్మలందరి సమస్యల కారణాన్ని నివారణ చేసి, నివారణ చేయగానే
నిర్వాణధామములో తీసుకువెళ్ళాలి, ఎందుకంటే మీరందరూ ముక్తిదాతలు.
మరి ఇతరులకు కూడా ముక్తిని ఇచ్చేవారు కావున స్వయము కూడా
కారణాన్ని నివారణ చేస్తారు, అప్పుడు ఇతరులకు ముక్తిని
ఇప్పించగలుగుతారు, నిర్వాణములోకి పంపించగలుగుతారు. మరి ఈ ఒక్క
పదములో మార్పును తీసుకురావడము కష్టమా లేక సహజమా? ఆలోచించండి.
ఈ రోజు ఎవరెవరైతే వచ్చారో లేదా తమ-తమ స్థానాలలో నుండి
చూస్తున్నారో, వింటున్నారో, వారందరి నుండి బాప్ దాదా ఒక్క
పదములో పరివర్తనను కోరుకుంటున్నారు ఎందుకంటే కారణము అన్న పదమే
కిందకు తీసుకువస్తుంది. కారణములోనైతే అర్ధకల్పము ఉన్నారు,
ఇప్పుడు ఇది నివారణ చేసే సమయము. నివారణ మరియు నిర్వాణము, ముక్తి.
మరి ఈ రోజు బాబాకు ఇది ఇచ్చేటటువంటి ధైర్యము ఉందా? ఇది చివరి
టర్న్ కదా, అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో వచ్చారు మరియు బాప్ దాదా
ఒక్కొక్కరికీ అభినందనలను తెలియజేస్తున్నారు. పడుకోవడానికి,
భోజనానికి కష్టముగా కూడా ఉంది, కానీ అందరూ స్నేహముతో
చేరుకున్నారు, స్నేహము అనే ప్లేన్ (విమానము) మీ అందరినీ మధుబన్
కు చేర్చింది. బాప్ దాదా ప్రతి ఒక్కరి స్నేహాన్ని చూసి, ప్రతి
ఒక్కరికీ పదమాల రెట్లు హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తున్నారు. కానీ
స్నేహములో మీరు ఏమి చేస్తారు? ఎవరితో అయితే స్నేహము ఉంటుందో,
వారికి స్నేహముతో కానుకను కూడా ఇవ్వడము జరుగుతుంది. మరి ఈ రోజు
బాప్ దాదా కానుక రూపములో ఈ కారణము అన్న పదాన్ని తీసుకోవాలని
కోరుకుంటున్నారు. బాప్ దాదాకు ఉన్న ఈ ఆశను పూర్తి చేయాలి కదా!
అయితే చేతులెత్తండి. ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ గేట్ నుండి
బయటకు వెళ్తే కారణము అన్న పదము సమాప్తమై ఉండాలి. పొరపాటున మీ
వద్దకు మళ్ళీ వచ్చేసినా అది బాబాకు ఇచ్చేసిన వస్తువు, ఇక అది
బాబా ఆస్తి. మరి బాబా ఆస్తిని ఏమి చేస్తారు? మళ్ళీ మీరు తిరిగి
తీసుకుంటారా? మరి అందరూ దృఢ సంకల్పము చేసారా? చేసారా? మళ్ళీ
చేతులెత్తండి. వెనుక ఉన్నవారు చేతులు ఊపండి. (ఈ రోజు శాంతివన్
లో సుమారుగా 28-29 వేల సోదరీ, సోదరులు లోపల బయట కూర్చుని
మురళిని వింటున్నారు, అందరూ చేతులు ఊపుతున్నారు) మంచిది, చాలా
మంచిది, ఎందుకంటే ఇప్పుడు సమయమనుసారముగా మీ వద్ద క్యూ
ఏర్పడుతుంది. ఎందుకని క్యూ ఏర్పడుతుంది? ఓ ముక్తిదాతలారా,
ముక్తిని ఇవ్వండి. మరి ఇచ్చేటటువంటి ముక్తిదాతలు, ముందుగా మీరు
ఈ ఒక్క పదము నుండి ముక్తులుగా అయితే అప్పుడే ముక్తిని
ఇవ్వగలుగుతారు.
బాప్ దాదా కోరుకుంటున్నది ఏమిటంటే, ఇప్పుడు ఈ సంవత్సరము హోమ్
వర్క్ గా ఇదే ఉండాలి, అదేమిటంటే - నేను ముక్తునిగా అయి ముక్తిని
ఇప్పించాలి ఎందుకంటే సమస్యలు రోజురోజుకూ చాలా పెరగనున్నాయి
కావున సమస్య సమాధాన రూపములోకి మారిపోవాలి. సమస్యను తొలగించడములో
కష్టము ఉండకూడదు, సమయము పట్టకూడదు. మీకు మీ భక్తులు మరియు సమయము
యొక్క పిలుపు వినిపించడము లేదా! మరి ఇప్పుడు సమయమనుసారముగా
దేనిని పరివర్తన చేయడము అవసరము? ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ
అనుభవీమూర్తులుగా అయి ఏదో ఒక అనుభూతిని చేయించవలసిన అవసరము ఉంది.
కావున బాబా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారంటే - వీరు ముక్తిదాత
పిల్లలు, ముక్తిని ఇచ్చేవారు అని మీ అందరి ముఖము, నడవడికలో
స్పష్టముగా కనిపించాలి, మీ మస్తకము ద్వారా మెరుస్తూ ఉన్న
నక్షత్రము అనుభవమవ్వాలి. కేవలం వినిపించడము ద్వారా కాకుండా
ముఖము ద్వారానే అనుభవము అవ్వాలి ఎందుకంటే అనుభవము దగ్గరగా
తీసుకువస్తుంది. ఈ అనుభవాన్ని ముఖము మరియు నడవడిక ద్వారా
చూపించండి. చూడండి, ఎలా అయితే సైన్స్ సాధనాలు అనుభవము
చేయిస్తాయి కదా, ఇప్పుడు ఎండల సీజన్ అయితే వేడి మరియు
చల్లదనాన్ని అనుభవము చేయిస్తున్నాయి కదా! సైన్స్ సాధనాలు
అనుభవజ్ఞులుగా చేస్తున్నప్పుడు మరి సైలెన్స్ పవర్ శక్తిని
అనుభవము చేయించలేదా! కావున బాప్ దాదా ఇప్పుడు పిల్లల నుండి ఏమి
కోరుకుంటున్నారంటే, అనుభవమనే స్థితిలో స్థితులై నయనాల ద్వారా,
మస్తకము ద్వారా ఏదో ఒక శక్తిని అనుభవము చేయించండి. విన్న విషయము,
వినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఏదైనా సమస్య వస్తే
మర్చిపోతారు కూడా, కానీ అనుభవాన్ని జీవితాంతము మర్చిపోలేరు.
బాప్ దాదా ఒక కారణాన్ని చూసారు, రిజల్టును కూడా చూసారు. ఒక
రిజల్టును చూసి చాలా చాలా అభినందనలను ఇచ్చారు. ఆ రిజల్టు ఏమిటి?
ఈ రోజు వరకు సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి కావున బాప్
దాదా అభినందనలను కూడా తెలియజేస్తున్నారు. మీరు సేవను
పెంచుతున్నారు కూడా మరియు ప్లాన్లు కూడా మంచిగా చేస్తున్నారు,
రిజల్టు కూడా యథా శక్తి లభిస్తుంది, కానీ అనుభవము చేయించడానికి
ఒక్క విషయములో స్వయముపై అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది. ఎలా అయితే
మీ సేవ ఇప్పుడు ప్రసిద్ధమవుతూ ఉంటుందో, సంతోషిస్తూ కూడా ఉంటారు
మరియు ఈ రోజుల్లో ఇంటరెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడిక
అనుభవము చేయించడానికి విధి ఏమిటి? అదేమిటంటే -
ఉల్లాస-ఉత్సాహాలతోపాటు, ఎంత ఉల్లాసమో, అంతగానే సమయమనుసారముగా
ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తి కూడా కావాలి. పురుషార్థములో
ఎవరైనా లేక ఏదైనా సమస్యా రూపముగా అనిపిస్తుంటే దానికి కారణము
అనంతమైన వైరాగ్య వృత్తిలో లోటు ఉండటము. ఇప్పుడు అనంతమైన
వైరాగ్యము కావాలి. అనంతమైన వైరాగ్యము అనేది సదాకాలము ఉంటుంది.
ఒకవేళ సమయమనుసారముగా ఉంటే అప్పుడు సమయము నంబర్ వన్ అయిపోతుంది
మరియు మీరు నంబర్ టూ అవుతారు. సమయము మీకు వైరాగ్యాన్ని
ఇప్పించినట్లు కదా. అనంతమైన వైరాగ్యము అనేది సదాకాలము ఉంటుంది.
ఒకవైపు ఉల్లాస-ఉత్సాహాలు, సంతోషము మరియు మరోవైపు అనంతమైన
వైరాగ్యము. అనంతమైన వైరాగ్యము సదా ఉండకపోవడానికి కారణము ఏమిటి?
బాప్ దాదా చూసారు - దానికి కారణము దేహాభిమానము. దేహము అన్న పదము
అన్ని విషయాలలోనూ వస్తుంది - దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ
సంస్కారాలు - దేహము అన్న పదము అన్నింటిలోనూ వస్తుంది మరియు
విశేషముగా దేహాభిమానము ఏ విషయములో వస్తుంది? అది దేహీ-అభిమానీ
నుండి దేహాభిమానములోకి తీసుకువస్తుంది, దానిని ఇప్పటివరకు బాప్
దాదా చెక్ చేసారు, మూల కారణమేమిటంటే, పాత సంస్కారాలు కిందకు
తీసుకువస్తాయి. సంస్కారాలను తొలగించుకున్నారు కానీ ఏదో ఒక
సంస్కారము నేచర్ రూపములో ఇప్పటికీ పని చేస్తుంది. ఎలా అయితే
దేహాభిమానము యొక్క నేచర్ (స్వభావము) నేచురల్ గా (సహజముగా)
అయిపోయిందో, అలా దేహీ-అభిమానము యొక్క నేచర్ నేచురల్ గా కాలేదు.
మేము సమాప్తము చేసేసాము అని అంటారు కానీ పూర్తిగా బీజాన్ని
భస్మము చెయ్యలేదు. అందుకే సమయము వచ్చినప్పుడు మళ్ళీ ఆ
దేహాభిమాన సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. కావున ఇప్పుడు దేహ భానము
యొక్క నేచర్ ను పవర్ ఫుల్ దేహీ-అభిమానీ శక్తితో వంశ సహితముగా
నాశనము చెయ్యాల్సిన అవసరము ఉంది, ఎందుకంటే పిల్లలు ఏమంటారంటే -
మేము అనుకోవటము లేదు కానీ అప్పుడప్పుడూ వచ్చేస్తుంది. ఎందుకు
వస్తుంది? అంశము ఉంటేనే వంశమై బయటకు వస్తుంది. కావున ఇప్పుడు
శక్తి స్వరూపులుగా అవ్వవలసిన అవసరము ఉంది. దానికి ఆధారము
ఏమిటంటే - ఏ స్వరూపములోనైనా అంశమాత్రముగానైనా పాత దేహ భాన
సంస్కారము ఉండిపోలేదు కదా అని చెక్ చేసుకోండి. మరియు అది
అనంతమైన వైరాగ్య వృత్తితో సమాప్తమవుతుంది. సేవను చూసి, విని
బాప్ దాదా సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు బాప్ దాదా
కోరుకుంటుంది ఏమిటంటే, ఎలాగైతే సేవ యొక్క నషా, మెరుపు ఇప్పుడు
లోకులకు కనిపిస్తుందో, సేవ అనుభవమవుతుందో, అలాగే అనంతమైన
వైరాగ్య వృత్తి యొక్క ప్రభావము ఉండాలి, ఎందుకంటే ఈ రోజుల్లో
సేవ ద్వారా మీ ప్రశంస పెరుగుతుంది, ప్రకృతి మీకు దాసి అవుతుంది.
అనుభవము చేస్తారు, సాధనాలు పెరుగుతాయి, కానీ అనంతమైన వైరాగ్య
వృత్తి ఉన్నట్లయితే సాధనాలు మరియు సాధన యొక్క బ్యాలెన్స్
ఉంటుంది. ఎలా అయితే మీరు ప్రవృత్తిలో ఉండేవారికి - అన్నీ చేస్తూ
కూడా కర్మయోగిలా, కమల పుష్ప సమానముగా ఉండండి అని ఉదాహరణ ఇస్తారు
కదా, అలాగే మీరందరూ కూడా సేవ చేస్తూ, సాధనాలు లభిస్తున్నప్పటికీ,
సాధనాలు మరియు సాధన యొక్క బ్యాలెన్స్ ను ఉంచాలి. కావున ఈ
రోజుల్లో సేవతో పాటు అదనముగా అనంతమైన వైరాగ్య వృత్తి కూడా
అవసరము. నడుస్తూ-తిరుగుతూ కూడా, వీరు విశేష ఆత్మలు అన్నది
అనుభవము చెయ్యాలి. కేవలం యోగములో కూర్చునే సమయములోనే కాదు,
భాషణ చేసే సమయములోనే కాదు, కానీ నడుస్తూ-తిరుగుతూ కూడా మీ
మస్తకము నుండి శాంతి, శక్తి, సంతోషము యొక్క అనుభూతి కలగాలి
ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇప్పుడిక సమయము మారుతూ ఉంటుంది.
బాప్ దాదా ఎప్పటికప్పుడు సూచనను అయితే ఇచ్చారు, కానీ ఈ రోజు
విశేషముగా బాప్ దాదా, ఒకటేమో అనంతమైన వైరాగ్యము వైపు సూచనను
ఇస్తున్నారు, దీని కోసం ఇప్పుడు స్వయాన్ని చెక్ చేసుకుని
దేహీ-అభిమానీగా అవ్వడములో ఏదైతే దేహాభిమానము అన్న విఘ్నము
కలుగుతుందో, దానిని పరివర్తన చేసుకోండి. అనేక రకాల దేహాభిమానము
యొక్క అనుభవము ఉంది కదా, వాటిని పరివర్తన చేయండి. మరియు రెండవ
విషయమేమిటంటే, బహుకాలము విషయములో కూడా స్వయము గురించి
ఆలోచించండి. బహుకాలపు అభ్యాసము కావాలి. బహుకాలపు పురుషార్థము,
బహుకాలపు ప్రారబ్ధము. ఒకవేళ ఇప్పుడు బహుకాలము పట్ల అటెన్షన్
తక్కువ పెడితే అంతిమ కాలములో బహుకాలమును జమ చేసుకోలేరు. టూ లేట్
బోర్డు పడిపోతుంది. అందుకే బాప్ దాదా ఈ రోజు వచ్చే సంవత్సరము
కోసం హోమ్ వర్క్ ను ఇస్తున్నారు. ఈ దేహాభిమానము అన్ని సమస్యలకు
కారణమవుతుంది. పిల్లలు రమణీకమైనవారు కదా, కావున సమయానికి మేము
సరిగ్గా అయిపోతాములేండి అని బాబాకు కూడా ధైర్యము చెప్తారు. బాప్
దాదా అడుగుతున్నారు - సమయము మీ టీచరా? సమయానికి సరిగ్గా
అయిపోతాము అంటే అప్పుడు మీ టీచర్ ఎవరైనట్లు? మీ రచన అయిన సమయము
మీకు టీచర్ గా అయితే అది బాగా అనిపిస్తుందా? అందుకే సమయాన్ని
మీరు సమీపముగా తీసుకురావాలి. మీరు సమయాన్ని సమీపముగా
తీసుకువచ్చేవారు, మీరు సమయముపై ఆధారపడేవారు కాదు, సమయాన్ని
టీచర్ గా చేసుకోకండి.
బాప్ దాదా ఈ రోజు పదే-పదే ఇదే సూచనను ఇస్తున్నారు, అదేమిటంటే,
స్వయాన్ని చెక్ చేసుకోండి, పదే-పదే చెక్ చేసుకోండి మరియు
పరివర్తన చేయండి. బహుకాలపు పరివర్తన బహుకాలపు ప్రారబ్ధానికి
అధికారిగా చేస్తుంది. ఒకవేళ ఏ బిడ్డ అయినా ఇప్పటివరకు ఢీలా-ఢీలా
పురుషార్థీగా ఉన్నా కానీ చివరి నంబర్ పిల్లలపై కూడా బాబాకు
స్నేహము ఉంది. స్నేహము ఉంది కావుననే బాబాకు చెందినవారిగా
అయ్యారు, బాబాను గుర్తించారు, నా బాబా అని అయితే అంటారు, అందుకే
సమయముపై వదిలిపెట్టకండి. సమయము రాదు, మనమే సంపూర్ణత యొక్క
సమయాన్ని సమీపముగా తీసుకురావాలి. బాప్ దాదా యొక్క విశ్వ
పరివర్తనా కార్యములో మీరందరూ సహచరులు. ఒంటరిగా బాబా ఈ
కార్యాన్ని చెయ్యలేరు, పిల్లలు తోడుగా ఉన్నారు. బాబా అయితే
అంటారు - ముందుగా పిల్లలు, పిల్లలు ముందు ఉండాలి అని. మరి
ఇప్పుడు ఒకవేళ వచ్చే సంవత్సరములో రావాల్సిందే అంటే ఈ హోమ్ వర్క్
చేసి తీరండి! చేస్తారా? చేతులెత్తండి. అచ్ఛా! వెనుకవారు కూడా
చేతులెత్తుతున్నారు.
చూడండి, ఈ రోజు సంఖ్య పెరిగిపోయింది, కావున బాప్ దాదా
కుమార్తెకు ఏమని సూచన ఇచ్చారంటే - ఎక్కడెక్కడ పడుకుని ఉన్నారు,
ఎలా లైన్ లో తింటున్నారు అనేది వెళ్ళి చూసి రండి. పెద్ద లైన్
ఉంది. కానీ అందరి ముఖాలలో సంతోషము ఉంది. మధుబన్ లో అయితే
ఉన్నాము కదా! కానీ ఈ సంతోషాన్ని మధుబన్ లోనే వదిలి వెళ్ళకండి.
మీతో పాటు తీసుకువెళ్ళండి. బాప్ దాదా వతనములో కూర్చుని మీ అందరూ
పడుకోవడము, భోజనము దగ్గర క్యూలో ఉండడము, ఈ దృశ్యాలను చూసారు.
బాప్ దాదాకు ఎటువంటి సంకల్పము కలుగుతుందంటే - ఇప్పటికిప్పుడే
రజాయిలు మరియు పరుపుల యొక్క వర్షము కురవాలి అని. కానీ ఇది కూడా
ఆనందాల మేళా. అంతేకాక బాప్ దాదా మంచిగా చూసారు, ఎక్కడ లభించినా,
ఎలా లభించినా అందరూ మెజారిటీ బాగా పాస్ అయ్యారు. చప్పట్లు
కొట్టండి. కానీ ఈ హోమ్ వర్క్ ను మర్చిపోకండి. ఇందులో చప్పట్లు
కొట్టడము లేదు. బాప్ దాదా మరియు విశేషముగా బ్రహ్మాబాబా
ఎల్లప్పుడూ పిల్లలను మధుబన్ యొక్క అలంకారము అని అనేవారు.
మీరందరూ మధుబన్ కు వచ్చారు, బాప్ దాదా కూడా సాకార రూపములో ఇంతటి
పరివారాన్ని చూసి సంతోషిస్తున్నారు. సహించవలసి వచ్చింది కానీ ఈ
సహించడము సదా కొరకు సహనశక్తిని పెంచుతుంది. అందరూ సంతోషముగా
ఉన్నారు కదా! ఇబ్బంది అవ్వలేదు కదా! ఇంకా చూడండి, ఇంతటి
పరివారములో కూడా నీరు అయితే లభిస్తూ ఉంది. అందరూ నీటిని
ఉపయోగించారు కదా! కొంచెము తక్కువ ఉంది కావున శ్రద్ధ పెట్టవలసి
ఉంటుంది, కానీ ఈ రోజుల్లో గ్రామాలలో తాగడానికి కూడా నీరు
లభించడము లేదు, ఇక్కడైతే మీకు బట్టలు ఉతుక్కోడానికి కూడా
లభించాయి. మరియు ఇంత పరివారాన్ని చూసి సంతోషము కూడా కలుగుతుంది.
బాప్ దాదాకు గర్వముగా ఉంది, మొత్తము కల్పములో ఇంత పెద్ద
పరివారము ఇంకెవ్వరికీ లేదు. అచ్ఛా!
ఈ రోజు బాప్ దాదా టీచర్లు అందరికీ ఒక విశేషమైన సేవను గుర్తు
తెప్పిస్తున్నారు. ఆ హోమ్ వర్క్ చేయాలి. టీచర్లకు హోమ్ వర్క్
ఏమిటంటే - సదా టీచర్ స్వయాన్ని బాప్ దాదాకు సత్యమైన సహవాసిగా,
సమీప సహవాసిగా, తన ద్వారా బాబాను ప్రత్యక్షము చేసేవారిగా
అవ్వాలి, మిమ్మల్ని ఎవరు చూసినా వీరిని తయారుచేసింది ఎవరు,
వీరికి కూడా తండ్రి, శిక్షకుడు, సద్గురువు ఎవరు అని అనిపించాలి.
మిమ్మల్ని చూడకూడదు, బాబాను చూడాలి. ఈ 6-7 నెలల సమయమేదైతే
ఇప్పుడు లభించనున్నదో, ఈ స్వమానములోనే ఉండండి, ఈ హోమ్ వర్క్
చేయండి, తర్వాత బాప్ దాదా అడుగుతారు, ప్రతి ఒక్కరూ ఎంత శాతములో
చేసారు? ఎక్కువ సమాచారాన్ని అడగరు, ఎంత శాతములో ఈ హోమ్ వర్క్
ను చేసారు? మీరు కనిపించకూడదు, బాబా కనిపించాలి. ఇందులో అన్ని
ధారణలు వచ్చేస్తాయి. మధుబన్ వారికి కూడా బాప్ దాదా
ప్రియస్మృతులనైతే ఇస్తూ ఉన్నారు. కానీ నలువైపులా ఉన్న మధుబన్
వారు కూడా ఎలా భావించండి అంటే - మధుబన్ యొక్క ఒక్కొక్క రత్నము
విశేషముగా బాబాను ప్రత్యక్షము చేయడానికి నిమిత్తముగా ఉన్నారు.
పూర్తి సమయము మధుబన్ వారు ఈ విధముగా మనసా సేవలో, కర్మణా సేవలో
మరియు అందరినీ బాబా సమానముగా తయారుచేసే సేవలో ఉదాహరణగా తయారై
చూపించాలి. బాబా సమానముగా అయ్యే చిత్రాన్ని స్వయములో చూపించారా
అన్న రిజల్టును మధుబన్ వారు ఇవ్వవలసి ఉంటుంది. వాహ్ బాబా
పిల్లలు వాహ్! అని ప్రతి ఒక్కరి నోటి నుండి రావాలి. మీరి
మీరందరూ ఏమి చేస్తారు? మీరందరూ స్వయాన్ని నంబరువారుగా కాదు,
నంబర్ వన్ గా అయ్యే ఉదాహరణగా అయి చూపించండి. నంబరువారుగా
అవ్వడములో మజా లేదు. అయ్యారంటే నంబర్ వన్ అవ్వాలి. నంబరువారుగా
అవ్వడము ఏమంత పెద్ద విషయము! మరి అందరూ విన్ మరియు వన్ అన్న
రిజల్టును వినిపించండి. అచ్ఛా!
అన్ని వైపులా ఉన్న బాప్ దాదా హృదయ సింహాసనాధికారులు మరియు
భృకుటి సింహాసనాధికారులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్య
సింహాసనాధికారులు, బాప్ దాదాకు చాలా కాలము దూరమైన తర్వాత
కలిసిన పిల్లలు, పదమాల పదమాల రెట్ల భాగ్యశాలీ పిల్లలు, సదా తమ
నయనాల ద్వారా ఆత్మికతను అనుభవము చేయించేవారికి మరియు ముఖము
ద్వారా సదా అదృష్టవంతులు, మనసు సదా సంతోషముతో నాట్యము చేస్తూ
ఉండాలి, ఎవరు ఎదురుగా వచ్చినా కానీ, వీరికున్న సంతోషము
ఇంకెక్కడా లేదు అని అందరూ అనుభవము చేయాలి మరియు అందరూ పాఠము
నేర్చుకుని వెళ్ళాలి. ఇలా బాబా యొక్క ప్రతి బిడ్డ స్వయము ద్వారా
బాబాను, నోటి ద్వారా బాబా పరిచయాన్ని ఇస్తారు కానీ నయనాలు మరియు
ముఖము ద్వారా బాబాను సాక్షాత్కారము చేయించేవారు, నలువైపులా
ఉన్న ఇటువంటి పిల్లలకు, ఎవరైతే ఉత్తరాలు పంపించారో, ఈ-మెయిల్
చేసారో, అందరివీ బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. ఏ సమయములోనైతే
మీరు సంకల్పము చేసారో, ఆ సమయములోనే అవి బాబా వద్దకు
చేరుకున్నాయి, అందుకే చాలా చాలా అభినందనలు. దేశ-విదేశాలలోని
పిల్లలందరికీ బాబా హృదయపూర్వక స్నేహానికి రెస్పాన్స్
ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలకు బాప్ దాదా పదమాల రెట్లు
హృదయపూర్వక అనురాగమును, హృదయపూర్వక ప్రేమను ఇస్తున్నారు, మరియు
అందరికీ నమస్తే చెప్తున్నారు.