22-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు తెలివైనవారిగా అయ్యారు కావున సంపాదన పట్ల చాలా-చాలా అభిరుచి ఉండాలి. వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటి నుండి కూడా సమయము తీసి తండ్రిని స్మృతి చేసినట్లయితే సంపాదన జరుగుతూ ఉంటుంది’’

ప్రశ్న:-
పిల్లలైన మీకు ఇంతకుముందు ఎప్పుడూ లభించలేని ఏ శ్రీమతము ఇప్పుడు లభిస్తుంది?

జవాబు:-
1. మీకు ఈ సమయంలో తండ్రి శ్రీమతము ఇస్తున్నారు - మధురమైన పిల్లలూ, ఉదయముదయమే లేచి తండ్రి స్మృతిలో కూర్చున్నట్లయితే పూర్తి వారసత్వము లభిస్తుంది. 2. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి, ఇటువంటి శ్రీమతము ఇతర సత్సంగాలలో ఎప్పుడూ లభించదు. ఆ సత్సంగాలలో తండ్రి మరియు వారసత్వము యొక్క విషయము ఉండదు.

పాట:-
నీవే తల్లివి, తండ్రివి...

ఓంశాంతి
విశేషంగా ఈ భారత్ లో మరియు మొత్తం ప్రపంచంలో అనేక రకాల సత్సంగాలు జరుగుతాయి. మేము ఈ వారసత్వాన్ని పొందుతున్నాము అని మనుష్యుల బుద్ధిలో ఉండేటువంటి సత్సంగాలు కానీ, చర్చ్ లు కానీ, మందిరాలు కానీ ఏవీ ఉండవు. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చుని ఉన్నారు, అన్ని సెంటర్లలోనూ - మేము మా తండ్రి నుండి సుఖధామము యొక్క వారసత్వాన్ని పొందుతున్నాము అన్న ఆలోచనతో తమ అనంతమైన తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఇతర ఏ సత్సంగాలలో లేక చర్చ్ లు మొదలైనవాటిలో ఈ విధముగా భావించరు. ఈ విషయము పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంది. పిల్లలైన మీకు తెలుసు - మనము అనంతమైన తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నాము. కొత్త ప్రపంచమైన స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. పిల్లలందరూ ఒక్క తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. లెక్కలేనంతమంది పిల్లలున్నారు, వృద్ధి చెందుతూ ఉంటారు. ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ శ్రీమతము లభిస్తుంది. మనము బాబా నుండి ఈ వారసత్వాన్ని తీసుకోనున్నాము. మనము ఆ తండ్రికి చెందినవారిగా అయ్యాము. ఆత్మకు తండ్రి ద్వారా ఇప్పుడు పరిచయము లభించింది. తండ్రి డైరెక్షన్ ఇస్తారు - నన్ను స్మృతి చేయండి మరియు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. అందరూ ఇక్కడికి వచ్చి కూర్చోవడము కాదు. స్కూల్లో చదువుకొని తర్వాత తమ-తమ ఇళ్ళకు వెళ్ళిపోతారు. పిల్లలు ప్రతి ఒక్కరూ (బాలకులు-బాలికలు ఇరువురూ) తమ టీచరు నుండి వారసత్వాన్ని పొందగలరు. ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. ప్రతిరోజూ చదువుకుని, తర్వాత తమ ఇంటికి వెళ్ళి వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేసుకోండి. మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉన్నారు మరియు మీరు విద్యార్థులు కూడా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. ఈ విధముగా సన్యాసులు మొదలైనవారెవ్వరూ చెప్పరు. ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా కూర్చుని ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవుతారు. ఇతరులెవ్వరూ పవిత్రంగా అయి పరమపిత పరమాత్మను స్మృతి చేయరు. గీతను వింటారు, చదువుతారు కానీ తండ్రిని స్మృతి అయితే చేయరు కదా. చెప్పడము మరియు చేయడములో తేడా ఉంది. మీకు తెలుసు - మన తండ్రి నాలెడ్జ్ ఫుల్, వారిలో మొత్తం డ్రామా చక్రము యొక్క జ్ఞానము ఉంది. ఇప్పుడు మనకు కూడా జ్ఞానము లభిస్తుంది. ఈ చక్రం చాలా బాగుంది. ఇది పురుషోత్తమ యుగము అయిన కారణంగా మీ ఈ జన్మ కూడా పురుషోత్తమమైనది. ఎక్స్ ట్రా మాసము (అధిక మాసము) ఉంటుంది కదా.

పిల్లలైన మీకు తెలుసు, మనము తప్పకుండా తండ్రి ద్వారా పురుషోత్తములుగా అవుతున్నాము. మర్యాదా పురుషోత్తములుగా మనము మళ్ళీ అవుతున్నాము. మళ్ళీ 84 జన్మల చక్రము తిరిగాము అన్న జ్ఞానము బుద్ధిలో ఉంది. ఇతర ఏ సత్సంగాలలోనూ ఈ విషయాలు అర్థం చేయించరు. మనము ఈ విధముగా తయారవ్వాలని మీరు అర్థం చేసుకుంటారు. ఇలా తయారుచేసేవారు ఒక్క తండ్రియే. ఈ లక్ష్మీనారాయణుల చిత్రంపై మీరు మంచి రీతిలో అర్థం చేయించవచ్చు. తప్పకుండా బ్రహ్మా ద్వారా యోగబలంతో వీరు ఈ పదవిని పొందారు. ఈ విధముగా బుద్ధిలో ఇమర్జ్ చేసుకోవాలి. బ్రహ్మా-సరస్వతి, లక్ష్మీ-నారాయణుల రెండు రూపాలను కూడా చూపించారు. బ్రహ్మా-సరస్వతి, వారితో పాటు ప్రజలను కూడా చూపించాల్సి ఉంటుంది. ప్రతి విషయము గురించి మంచి రీతిలో ఆలోచించాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే ఈ విధముగా తయారవుతారు అని బ్రహ్మాకు కూడా చెప్తారు. అనగా నన్ను స్మృతి చేయండి అని బ్రహ్మా ముఖవంశావళి అయిన వారందరికీ చెప్పినట్లు. ఎలా స్మృతి చేయాలి అనేది కూడా బుద్ధిలో ఉంది. చిత్రాలు కూడా ఎదురుగా ఉన్నాయి. వీటిపై అర్థం చేయించడము చాలా సహజము. తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ప్రదర్శనీలో కూడా వీటిపై అర్థం చేయించండి. వీరు అందరికీ అనంతమైన తండ్రి అన్న నిశ్చయము కూర్చుంటుంది. ఈ లెక్కన మనకు అనంతమైన వారసత్వం లభించాలి. నిరాకారీ ఆత్మలమైన మనము పరస్పరంలో సోదరులము. సాకారంలోకి వచ్చినప్పుడు సోదరీ-సోదరులు అవుతాము, అప్పుడే చదువుకోగలము. బ్రహ్మా సంతానమే సోదరీ-సోదరులు అవుతారు. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. ఈ విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఎవరికి అర్థం చేయించినా, మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మనది బ్రదర్ హుడ్ (సోదర భావము), సర్వవ్యాపి అనడంతో ఫాదర్ హుడ్ (పితృ భావము) అయిపోతుంది. ఫాదర్ హుడ్ అయితే వారసత్వం ఎక్కడ నుండి లభిస్తుంది. ఇలా అందరినీ ఫాదర్ అని అంటూ పడిపోతూ వచ్చారు, వారసత్వం ఏమీ లభించలేదు. ఇప్పుడు బ్రదర్ హుడ్ అని భావించడంతోనే వారసత్వం లభిస్తుంది. కావున దీని గురించి మంచి రీతిలో అర్థం చేయించినట్లయితే బుద్ధిలో అష్ట దేవతలు మొదలైనవారు ఎవరైతే కూర్చుని ఉన్నారో, అదంతా బుద్ధిలో నుండి తొలగిపోతుంది. ఈ విధంగా చెప్పండి - ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఆత్మిక తండ్రి, ఎవరి ద్వారానైతే సర్వుల సద్గతి జరిగేది ఉందో, వారే సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇస్తారు. అందరూ సుఖమయంగా అవుతారు. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గ రచయిత అని అంటారు. మొదట, తండ్రి ప్రభావాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. వీరు ఆత్మలకు అనంతమైన తండ్రి. వీరినే పతిత-పావనుడు అని అంటారు. ఆత్మలైన మీరు పరమపిత పరమాత్ముని పిల్లలు. ఈ నిశ్చయాన్ని పక్కా చేసుకోండి. ముఖ్యమైన విషయము ఏమిటంటే, మొదట ఈ విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఇది అర్థం చేసుకున్నప్పుడే సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది మరియు మేము తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తాము అని అంటారు. మేము తండ్రిని స్మృతి చేసి విశ్వానికి యజమానులుగా అవుతాము అన్న నిశ్చయము మాకు ఉంది అని అంటారు. వారికి ఈ సంతోషం ఎంతగానో ఉంటుంది. ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో మరియు ఎవరికైతే బుద్ధిలో పూర్తి నిశ్చయముంటుందో, వారంటారు - ఇటువంటి అనంతమైన తండ్రి ఎవరైతే దాదాలోకి వస్తున్నారో, ముందైతే వారిని కలుసుకోవాలి కదా. శివబాబా బ్రహ్మా ద్వారానే మనతో మాట్లాడగలరు. ఆత్మలైన మీరు వారిని కలవలేదు, మరి ఎలా స్మృతి చేస్తారు. పిల్లలు దత్తత తీసుకోబడితే కదా తండ్రి గుర్తుకొస్తారు. దత్తతయే జరగకపోతే ఎలా గుర్తుకొస్తారు. మొదట వారికి చెందినవారిగా అవ్వండి. ఇటువంటి తండ్రిని వెంటనే కలవాలి. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా అని తండ్రి కూడా అడుగుతారు. నేను ఆత్మలైన మీకు తండ్రిని. శివబాబా మీతో మాట్లాడుతున్నారు. శివబాబా ఆత్మనైన నాకు తండ్రి అనగా వారు మీకు కూడా తండ్రియే. వారు అడుగుతారు - ఆత్మలందరికీ తండ్రి ఒక్కరేనని మీకు నిశ్చయముందా? వారే వారసత్వాన్ని ఇస్తారు. పవిత్రంగా కూడా అవ్వాలి. వారిని తప్ప మిగిలినదంతా మర్చిపోవాలి.

ఆత్మలైన మీరు ఇంటి నుండి అశరీరులుగా వచ్చారు కదా. దేహము, సంబంధాలు ఏవీ ఉండేవి కావు. ఆత్మ శరీరంలోకి ప్రవేశించి, పెద్దవారైన తర్వాత - వీరు మీ తండ్రి, వీరు ఫలానా అని అర్థం చేయించడము జరుగుతుంది. ఆత్మ అన్ని సంబంధాలకు అతీతమైనది. ఆత్మ వెళ్ళిపోతే ఈ విధంగా అంటారు - మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచం మరణించినట్లే. మరొక శరీరము లభించినంత వరకు బంధన రహితంగా ఉంటుంది. తల్లి గర్భంలోకి వెళ్ళి, బయటకు వచ్చి, తెలివైనవారిగా అయిన తర్వాత సంబంధాల విషయము వస్తుంది. కావున ఇక్కడ కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. జీవిస్తూనే అంతటినీ మర్చిపోవాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయడము అనేది అవ్యభిచారి స్మృతి. దీనినే యోగము అని అంటారు. ఇక్కడైతే మనుష్యులకు అనేకుల స్మృతి ఉంటుంది. మీది అవ్యభిచారి స్మృతి. ఈ శరీర పరమైన సంబంధాలన్నీ సమాప్తం అవ్వనున్నాయని ఆత్మకు తెలుసు. మన సంబంధం ఒక్క తండ్రితోనే ఉంది, ఎంతగా తండ్రిని స్మృతి చేస్తే, అంతగా వికర్మలు వినాశనమవుతాయి. అలాగని మిత్ర-సంబంధీకులను స్మృతి చేస్తే వికర్మలు తయారవుతాయని కాదు. ఏదైనా తప్పుడు కర్మ చేసినప్పుడు వికర్మలు తయారవుతాయి. అంతేకానీ ఇతరులను స్మృతి చేయడంతో వికర్మలు తయారవ్వవు. కాకపోతే సమయమైతే తప్పకుండా వృథా అవుతుంది. ఒక్క తండ్రిని స్మృతి చేయడంతో వికర్మలు వినాశనమవుతాయి. పాపాలను తొలగించుకునేందుకు ఇదే యుక్తి. ఇకపోతే సంబంధాలు మొదలైనవైతే గుర్తుంటాయి. శరీర నిర్వహణార్థం వ్యాపార-వ్యవహారాలు మొదలైనవన్నీ చేయండి కానీ ఎంత సమయము లభిస్తే అంతగా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, అప్పుడు మాలిన్యం తొలుగుతుంది. ఇదే ముఖ్యమైన విషయము. పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి అని లోలోపలే ఆలోచించండి. తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉండాలి. సన్యాసులు కూడా శరీరాన్ని వదిలి, గృహస్థుల వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటారు. అలాగని వారు జన్మ-జన్మల కొరకు పావనంగా అవుతారని కాదు. నిర్వికారీ ప్రపంచమనేది ఇప్పుడు లేదు. ఇది వికారీ ప్రపంచము. దీని నుండి ఎవరూ బయటపడలేరు. వికారీ ప్రపంచంలో ఉన్న కారణంగా ఏదో ఒక లోపము తప్పకుండా ఉంది. ఇకపోతే ప్రపంచాలు రెండే ఉన్నాయి. వికారీ ప్రపంచము మరియు నిర్వికారీ ప్రపంచము. పావన ప్రపంచంలో దేవతలుండేవారు, ఈ విధంగా అర్థం చేయించడము చాలా సహజము. ఈ పతిత ప్రపంచం ఇప్పుడు వినాశనము అవ్వనున్నది. వినాశనము అయ్యే కన్నా ముందే అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా అంటారు - దేహ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీరు పావనంగా అవుతారు. తండ్రి అంటారు - మీరు నన్ను పతితపావనుడు అని అంటారు కదా. గంగలో మునకలు వేసేవారు చాలా మంది ఉన్నారు. ఇలా చేయడము వలన పావనంగా అవుతారని కాదు. ప్రదర్శినీలలో చాలా బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ప్రజాపిత అయితే ఇక్కడే కావాలి. కింద ఈ బ్రహ్మా మరియు బ్రహ్మాకుమార-కుమారీలు తపస్య చేస్తున్నారు. ఈ విషయాన్ని మంచి రీతిలో అర్థం చేయించాలి. ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా అర్థం చేయించాలి. సంకోచిస్తూ మాట్లాడితే పేరును అప్రతిష్టపాలు చేస్తారు. ఒకవేళ మీరు ఎక్కడైనా తికమకపడితే - అచ్ఛా, కొంచెం ఆగండి, మేము ఇంకొక అక్కయ్యను పంపిస్తాము అని చెప్పండి. ఒకరికంటే ఒకరు చురుకుగా ఉంటారు కదా. ప్రదర్శనీలు, మేళాలలో - వీరు సరిగ్గా అర్థం చేయిస్తున్నారా, ఎవరూ వాదించడము లేదు కదా అని చెక్ చేయాలి. గేటు వద్ద కూడా తెలిసినవారు ఉండాలి. అనేక రకాల వారు వస్తారు కదా. గొప్ప వ్యక్తులకు తప్పకుండా గౌరవం ఇవ్వాలి. తేడా అయితే తప్పకుండా ఉంటుంది. వీరి పట్ల ప్రేమ ఉంది, వీరి పట్ల లేదు అని అనుకోకూడదు. ద్వైత దృష్టి ఉందని కాదు. దీనిని ద్వైత దృష్టి అని అనరు. ఇక్కడ గొప్ప వ్యక్తులకు గౌరవ మర్యాదలు చేస్తున్నారని కొందరు భావిస్తారు. ఎవరైతే సర్వీసబుల్ గా ఉంటారో, వారికి గౌరవ మర్యాదలు చేస్తారు కదా. ఎవరైనా భవనాన్ని తయారుచేసి ఇచ్చినట్లయితే, వారికి తప్పకుండా గౌరవ మర్యాదలు చేస్తారు కదా. మీ కోసమే ఆ భవనాలు తయారయ్యాయి కదా. ఎవరైతే కృషి చేసి రాజుగా అవుతారో, వారిని ప్రజలు ఆటోమేటిక్ గా గౌరవిస్తారు కదా. తక్కువ పదవి వారి కంటే, ఉన్నత పదవిలోని వారికి గౌరవ మర్యాదలు జరుగుతాయి. అనంతమైన తండ్రికి మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ పిల్లలే. కానీ వారు భారత్ లోనే జన్మ తీసుకున్నారు. మొదట ఉన్నతంగా ఉన్న భారతవాసులే ఇప్పుడు నీచంగా అయిపోయారు. అందుకే తండ్రి అంటారు - నేను చదివించడానికి వచ్చాను. నేను భారత్ లోకి వస్తాను, అప్పుడు అందరి కళ్యాణం జరుగుతుంది. ఇన్ పర్టికులర్ (ప్రత్యేకంగా) మరియు ఇన్ జనరల్ (సాధారణంగా) ఉంటుంది కదా. ఇప్పుడు భారత్ యే నరకంగా ఉంది, తర్వాత భారత్ యే స్వర్గముగా అవ్వనున్నది. కావున తండ్రి భారత్ లోకే వెళ్తారు కదా, వేరే చోటుకి వెళ్ళి ఏం చేస్తారు. భారత్ లోనే భక్తి మార్గంలో మొట్టమొదట సోమనాథ మందిరాన్ని చాలా శోభాయమానంగా నిర్మించారు. విదేశాలలో పెద్ద-పెద్ద చర్చ్ లను నిర్మిస్తూ ఉంటారు ఎందుకంటే అది పోప్ యొక్క రాజ్యము. అన్ని చర్చ్ లు ఒకేలా ఉండవు. నంబరువారుగా ఉంటాయి కదా. సోమనాథ మందిరము ఎంతగా వజ్ర-వైఢూర్యాలతో నిండుగా ఉండేది, ముసల్మానులు దానిని దోచుకొని వెళ్ళిపోయారు. మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. చర్చ్ నుండి ఏం దోచుకోగలరు. మనుష్యులు ధనము వెనుక పడతారు కదా. మహమ్మద్ గజనవీ ఎంత తీసుకుని వెళ్ళారు. తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు, వారు కూడా ఇక్కడ నుండి ధనాన్ని తరలిస్తూ వచ్చారు. చాలా ధనము తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఆ ధనము మీకు తిరిగి లభిస్తుంది, కోట్ల రూపాయలు ఇస్తారు. ఇవన్నీ సమయానికి లభిస్తున్నాయి. మీకు రావాల్సిన లెక్క అందకపోతే సమయానికి అవసరాలు ఎలా తీరతాయి.

ఈ డ్రామా ఎలా తయారుచేయబడింది, ఈ ఇచ్చి-పుచ్చుకునే లెక్క ఎలా ఉంటుంది అనేది తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది కూడా పిల్లలకు అర్థం చేయించారు. బాబా అంటారు - పిల్లలూ, మన్మనాభవ. ఇదంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రతి వస్తువు సతో నుండి తమోప్రధానంగా అవుతుంది. రోజంతటిలో వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేసుకునే సమయాన్ని వదిలేయండి. మిగిలిన సమయంలో ఎంతైతే అంత నన్ను స్మృతి చేయండి. వ్యాపారాలు మొదలైనవాటిలో కూడా అప్పుడప్పుడు సమయము లభిస్తుంది. కొంతమంది ఉద్యోగము ఎలా ఉంటుందంటే, కేవలం సంతకం చేస్తే సరిపోతుంది. ఇలా కూడా చాలా మంది ఫ్రీ గా ఉంటారు. రాత్రి సమయమైతే మీదే కదా. రోజంతటిలో శరీర నిర్వహణార్థము ఆ సంపాదన చేసుకుంటారు, రాత్రి సమయంలో ఈ సంపాదన చేయండి. ఈ సంపాదన భవిష్య 21 జన్మల కోసము. ఒక ఘడియ, అర్ధ ఘడియ అని అంటూ ఉంటారు - ఎంత వీలైతే అంత, తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే మీకు చాలా సంపాదన జరుగుతుంది. తెలివైనవారు ఎవరైతే ఉంటారో, వారు - తప్పకుండా చాలా సంపాదన చేసుకోవచ్చని అర్థం చేసుకుంటారు. మేము ఇంత సమయము స్మృతి చేసాము అని కొందరు చార్టు కూడా వ్రాస్తారు. అజ్ఞాన కాలంలో కొందరు తమ దినచర్యను వ్రాసుకుంటారు. మీరు కూడా చార్టు వ్రాసినట్లయితే అటెన్షన్ ఉంటుంది. సమయము ఏమీ వృథా అవ్వడము లేదు కదా! వికర్మలేవీ చేయలేదు కదా! అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ దేహధారినీ స్మృతి చేస్తూ, తమ సమయాన్ని వృథా చేసుకోకూడదు. వికర్మగా అయ్యేటువంటి తప్పుడు కర్మలేవీ జరగకూడదు.

2. జీవిస్తూనే అంతా మరచి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి. దానితో పాటు తెలివైనవారిగా అయి రాత్రి సమయంలో కూడా మేలుకొని, ఈ అవినాశీ సంపాదన చేసుకోవాలి. స్మృతి చార్టు పెట్టుకోవాలి.

వరదానము:-
సంపూర్ణ స్టేజ్ మరియు స్టేటస్ యొక్క స్మృతి ద్వారా సదా ఉన్నతమైన కర్తవ్యం చేసే బాబా సమాన భవ

ప్రతి సమయం, ప్రతి సెకండు, ప్రతి కర్మ చేస్తూ నేను స్టేజ్ పై ఉన్నాను అని సదా స్మృతిలో ఉండాలి. ప్రతి కర్మ పట్ల అటెన్షన్ ఉన్నట్లయితే సంపూర్ణ స్టేజ్ కు సమీపంగా చేరుకుంటారు. దానితో పాటు వర్తమాన మరియు భవిష్య స్టేటస్ యొక్క స్మృతి ఉన్నట్లయితే ప్రతి కర్మ శ్రేష్ఠంగా అవుతుంది. ఈ రెండు స్మృతులే బాబా సమానంగా చేస్తాయి. సమానతలోకి రావడంతో ఇతరుల మనసులోని సంకల్పాలను సహజంగానే క్యాచ్ చేయగలరు. దీని కోసం కేవలం సంకల్పాలపై కంట్రోలింగ్ పవర్ కావాలి. తమ సంకల్పాలలో ఇంకేవీ కలవకూడదు.

స్లోగన్:-
ఈర్ష్య మరియు అప్రాప్తికి కారణం కోరికలు, ఎక్కడైతే సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడ ప్రసన్నత ఉంటుంది.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

ప్రతి క్షణము ప్రతి సంకల్పాన్ని చెక్ చేసుకోండి - ఏమైనా ఇచ్చానా? తీసుకోలేదు కదా? ఇస్తూ వెళ్ళండి. తీసుకోవాల్సింది బాబా నుండి, అది ఎలాగూ తీసుకున్నారు, ఇప్పుడిక ఇవ్వాలి. ఎంతెంతగా ఇవ్వటములో బిజీగా ఉంటారో, అంతగా ఏ విషయాలనైనా దాటడము కష్టమనిపించదు. అన్ని విషయాలు చాలా సహజమైపోతాయి ఎందుకంటే మహాదానిగా అవ్వటము ద్వారా మహాన్ శక్తి స్వతహాగానే ప్రాప్తిస్తుంది.