22-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మహావీరులుగా అవ్వండి, మాయా తుఫానులతో యుద్ధము చేసేందుకు బదులుగా స్థిరముగా-దృఢముగా అవ్వండి’’

ప్రశ్న:-
బ్రహ్మాబాబా ఎదురుగా అనేక గొడవలు జరుగుతున్నప్పటికీ వారు ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వలేదు - ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే బాబాకు ఏమి నషా ఉండేదంటే - నేను తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. ఇదంతా కల్పక్రితం వలె జరుగుతూ ఉంది, నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు), నిందలైతే అందరికన్నా ఎక్కువ తండ్రికే లభించాయి, అంతేకాక శ్రీకృష్ణుడిని కూడా నిందిస్తారు, కావున ఒకవేళ నేను కూడా నిందలు పడవలసి వస్తే, అందులో పెద్ద విషయమేముంది, ప్రపంచానికి మన విషయాల గురించి తెలియదు కావున తప్పకుండా నిందిస్తారు. అందుకే బాబా ఏ విషయములోనూ డిస్టర్బ్ అవ్వలేదు. అదే విధముగా ఫాలో ఫాదర్ చేయండి.

పాట:-
భోళానాథునికన్నా అతీతమైనవారు...

ఓంశాంతి
ఇది భక్తి మార్గము వారి పాట. జ్ఞాన మార్గములో పాటలు మొదలైనవి పాడటము జరగదు, అలానే తయారుచేయడము జరగదు, వాటి అవసరము కూడా లేదు ఎందుకంటే - తండ్రి ద్వారా సెకెండులో జీవన్ముక్తి వారసత్వము లభిస్తుందని అంటూ ఉంటారు. ఇందులో పాటలు మొదలైనవాటి విషయమేమీ లేదు. మనకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుందని మీకు తెలుసు. భక్తి మార్గము యొక్క ఆచార-పద్ధతులు ఇక్కడ కొనసాగవు. పిల్లలు కవితలు మొదలైనవి కూడా ఇతరులకు వినిపించేందుకని తయారుచేస్తారు. అవి కూడా మీరు అర్థం చేయించనంత వరకు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు కావున సంతోషపు పాదరసము పైకి ఎక్కి ఉండాలి. తండ్రి 84 జన్మల చక్రము యొక్క జ్ఞానాన్ని కూడా వినిపించారు. ఇప్పుడు మనము స్వదర్శన చక్రధారులుగా అయ్యామని, తండ్రి ద్వారా విష్ణుపురికి యజమానులుగా అవుతున్నామని సంతోషముండాలి. నిశ్చయబుద్ధి కలవారికే విజయము లభిస్తుంది. ఎవరికైతే నిశ్చయము ఉంటుందో, వారు తప్పకుండా సత్యయుగములోకి వెళ్తారు. కనుక పిల్లలకు సదా సంతోషముండాలి, ఫాలో ఫాదర్ చేయాలి (తండ్రిని అనుసరించాలి). ఎప్పటినుండైతే నిరాకార బాబా ఈ తనువులోకి ప్రవేశించారో, అప్పటినుండి వీరి వద్ద కూడా చాలా గొడవలు జరిగాయని పిల్లలకు తెలుసు. సోదరుల గొడవలు, ఊరిలో గొడవలు, మొత్తం సింధ్ లో గొడవలు జరిగాయి. వీరి పిల్లలు పెద్దవారైనప్పుడు, పిల్లలకు త్వరగా వివాహము చేయండి, వివాహము చేయకపోతే ఎలా నడుస్తుంది అని అన్నారు. బాబా గీతను చదవడము మిస్ చేసేవారు కాదు. గీతా భగవానుడు శివుడు అని తెలిసినప్పుడు, ఇక ఆ గీతను చదవడము మానేశారు. ఇక నేను విశ్వానికి యజమానిగా అవుతాను అనే నషా కలిగింది. ఇది శివ భగవానువాచ కనుక ఆ గీతను వదిలేశారు. తర్వాత, పవిత్రతకు సంబంధించి పెద్ద గొడవ జరిగింది. సోదరులు, పెదనాన్నలు, చిన్నాన్నలు మొదలైనవారు ఎంతమంది ఉండేవారు. ఇందులో ధైర్యము కావాలి కదా. మీరు మహావీరులు, మహావీరనీలు. మీకు ఒక్కరి గురించి తప్ప ఇంకెవ్వరి గురించి పట్టింపు లేదు. పురుషుడు రచయిత. రచయిత స్వయం పావనముగా అయితే రచనను కూడా పావనముగా తయారుచేయాలి. పవిత్రమైన హంస మరియు అపవిత్రమైన కొంగ కలిసి ఎలా ఉండగలరు. రచయిత అయితే - నా ఆజ్ఞానుసారముగా నడవాలనుకుంటే నడవండి, లేదంటే వెళ్ళిపోండి అని వెంటనే ఆదేశిస్తారు. మీకు తెలుసు కదా - వీరి లౌకిక పుత్రికకు వివాహము జరిగింది. వారికి జ్ఞానము లభించనప్పుడు - ‘వాహ్! తండ్రి పవిత్రముగా అవ్వమని చెప్తున్నప్పుడు నేనెందుకు అవ్వను’ అని అన్నారు. నేను విషమివ్వను అని వెంటనే పతికి జవాబిచ్చారు. అంతే, ఇక ఈ విషయముపైనే చాలా మందికి గొడవలు జరిగాయి. పెద్ద-పెద్ద ఇళ్ళ నుండి కుమార్తెలు వచ్చారు, ఎవ్వరినీ పట్టించుకోలేదు. ఎవరి భాగ్యములోనైతే లేదో, వారు అర్థం చేసుకోలేరు కూడా. పవిత్రముగా ఉండాలనుకుంటే ఉండండి, లేదంటే వెళ్ళి మీ ఏర్పాట్లు చేసుకోండి. ఈ విధముగా చెప్పేందుకు అంతటి ధైర్యము కూడా కావాలి కదా. తండ్రి ఎదురుగా ఎన్ని గొడవలు జరిగాయి. బాబాను ఎప్పుడైనా డిస్టర్బ్ అవ్వడము చూసారా! అమెరికా వరకు వార్తాపత్రికలలో ప్రచురించబడింది. ఇందులో నథింగ్ న్యూ (కొత్తేమీ లేదు). ఇది కల్పక్రితం వలె జరుగుతుంది, ఇందులో భయపడాల్సిన విషయమేముంది. మనమైతే మన తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. మన రచనను రక్షించుకోవాలి. ఈ సమయములో రచన అంతా పతితముగా ఉందని తండ్రికి తెలుసు. నేనే అందరినీ పావనముగా చేయాలి. తండ్రినే అందరూ - ఓ పతిత-పావన, లిబరేటర్ (ముక్తిదాత) రండి, అని పిలుస్తారు. కనుక వారికి దయ కలుగుతుంది. వారు దయార్ద్ర హృదయులు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఏ విషయములోనూ భయపడకండి. భయపడితే అంత ఉన్నత పదవిని పొందలేరు. మాతలపైనే అత్యాచారాలు జరుగుతాయి. దీనికి గుర్తుగానే ద్రౌపదిని వివస్త్రగా చేయడము గురించి చెప్తారు. తండ్రి 21 జన్మల కోసం వివస్త్రగా అవ్వడము నుండి రక్షిస్తారు. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలియదు. సద్గతిదాతను నేను కదా. మనుష్యులు దుర్గతిని పొందనంత వరకు నేను వచ్చి సద్గతిని ఎలా ఇవ్వగలను. సృష్టి కూడా పతితముగా, తమోప్రధానముగా అవుతుంది. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. పాత ఇంటిని వదలాల్సే ఉంటుంది. కొత్త ప్రపంచము బంగారు యుగము, పాత ప్రపంచము ఇనుప యుగము. సదా కొత్తగా ఉండదు. ఇది సృష్టి చక్రమని పిల్లలైన మీకు తెలుసు. దేవీ-దేవతల రాజ్యము మళ్ళీ స్థాపనవుతూ ఉంది. తండ్రి అంటారు, నేను మీకు మళ్ళీ గీతా జ్ఞానాన్ని వినిపిస్తాను. ఇక్కడ రావణ రాజ్యములో దుఃఖముంది. రామ రాజ్యమని దేనినంటారు, ఇది కూడా ఎవరికీ తెలియదు, అంతేకాక అర్థం చేసుకోరు కూడా. తండ్రి అంటారు - నేను స్వర్గాన్ని అనగా రామ రాజ్యాన్ని స్థాపన చేయడానికి వచ్చాను. పిల్లలైన మీరు అనేక సార్లు రాజ్యము తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇది అందరి బుద్ధిలో ఉంది. 21 జన్మలు సత్యయుగములో ఉంటారు, దానిని 21 తరాలని అంటారు, అనగా వృద్ధులుగా అయినప్పుడు శరీరాన్ని వదులుతారు. అక్కడ అకాలమృత్యువు ఎప్పుడూ సంభవించదు. ఇప్పుడు మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. మనము జన్మజన్మలు భక్తి చేస్తామని ఇప్పుడు మీకు తెలుసు. రావణ రాజ్యములో కూడా ఎంత ఆర్భాటము ఉందో చూడండి. ఇది అంతిమ సమయములోని ఆర్భాటము. రామ రాజ్యము సత్యయుగములో ఉంటుంది - అక్కడ ఈ విమానాలు మొదలైనవన్నీ ఉండేవి, తర్వాత అవన్నీ మాయమైపోయాయి. మళ్ళీ, ఈ సమయములో అన్నీ వెలువడ్డాయి. ఇప్పుడు అవన్నీ నేర్చుకుంటున్నారు. నేర్చుకునేవారు ఆ సంస్కారాలను తీసుకువెళ్తారు. తర్వాత వచ్చి అక్కడ విమానాలను తయారుచేస్తారు. ఇవి మీకు భవిష్యత్తులో సుఖమివ్వనున్నాయి. ఈ విమానాలు మొదలైనవన్నీ భారతవాసులు కూడా తయారుచేయగలరు. ఇది కొత్త విషయమేమీ కాదు. వారూ తెలివైనవారే కదా. ఈ సైన్సు మీకు తర్వాత ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సైన్సు దుఃఖము కోసముంది, తర్వాత అక్కడ సుఖము కోసముంటుంది. అక్కడ ప్రతి వస్తువు కొత్తదిగా ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపనవుతూ ఉంది. తండ్రియే కొత్త ప్రపంచ రాజధానిని స్థాపన చేస్తున్నారు. పిల్లలు మహావీరులుగా అవ్వాలి. భగవంతుడు వచ్చారని ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు.

తండ్రి అంటారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా ఉండండి. ఇందులో భయపడాల్సిన విషయమేమీ లేదు, మహా అంటే నిందిస్తారు. వీరిని కూడా చాలా నిందించారు. శ్రీకృష్ణుడిని కూడా నిందించినట్లుగా చూపిస్తారు. వాస్తవానికి శ్రీకృష్ణుడు అయితే నిందలపాలవ్వరు. కలియుగములో నిందలపాలవుతారు. ఇప్పుడున్న మీ రూపము మళ్ళీ కల్పము తర్వాత ఈ సమయములోనే ఉంటుంది, మధ్యలో ఉండదు. జన్మజన్మకు ముఖకవళికలు మారుతూ ఉంటాయి. ఒక ఆత్మకు 84 జన్మలలో ఒకే విధమైన ముఖకవళికలు లభించవు. సతో, రజో, తమోలలోకి వస్తూ ఉంటారు, ముఖకవళికలు మారుతూ ఉంటాయి. ఈ డ్రామా తయారై ఉంది. 84 జన్మలలో ఏ ముఖకవళికలతోనైతే జన్మలు తీసుకున్నారో, మళ్ళీ అలానే తీసుకుంటారు. వీరి ముఖకవళికలు మారి మరుసటి జన్మలో వీరు లక్ష్మీ-నారాయణులుగా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు. మీ బుద్ధి తాళము ఇప్పుడు తెరుచుకుంది. ఇప్పుడిది కొత్త విషయము. బాబా కూడా కొత్తవారే, విషయాలు కూడా కొత్తవే. ఈ విషయాలు అంత త్వరగా ఎవరికీ అర్థం కావు. భాగ్యములో ఉంటే ఎంతోకొంత అర్థం చేసుకుంటారు. మహావీరులు ఏ తుఫానులకు భయపడరు. ఆ అవస్థ చివరిలో ఏర్పడుతుంది, అందుకే అతీంద్రియ సుఖము గురించి అడగాలంటే గోప-గోపికలను అడగండి అని అంటూ ఉంటారు. తండ్రి, పిల్లలను స్వర్గానికి యోగ్యులుగా తయారుచేసేందుకే వచ్చారు. కల్పక్రితం వలె నరకము యొక్క వినాశనమైతే జరగాల్సిందే. సత్యయుగములోనైతే ఒకే ధర్మముంటుంది. ఐక్యత ఉండాలని, ఒకే ధర్మము ఉండాలని కోరుకుంటారు. రామ రాజ్యము వేరు, రావణ రాజ్యము వేరు అని కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ వికారాలు లేకుండా జన్మ జరగదు. మురికిగా అయిపోయారు కదా. ఇప్పుడు తండ్రి పట్ల నిశ్చయముంటే, శ్రీమతమనుసారముగా పూర్తిగా నడుచుకోవాల్సి ఉంటుంది కదా. ప్రతి ఒక్కరి నాడిని చూడడము జరుగుతుంది. దాని అనుసారముగా సలహా కూడా ఇవ్వడము జరుగుతుంది. బాబా కూడా పిల్లలకు - ఒకవేళ వివాహము చేసుకోవాలనుకుంటే వెళ్ళి చేసుకోండి అని చెప్పారు. చాలామంది మిత్ర-సంబంధీకులు మొదలైనవారు కూర్చుని ఉన్నారు, వారు వివాహము చేయించేస్తారు. ఇలా ప్రతి ఒక్కరి నాడి చూడడము జరుగుతుంది. ఈ విధముగా అడుగుతారు - బాబా, పరిస్థితి ఇలా ఉంది, మేము పవిత్రముగా ఉండాలని అనుకుంటున్నాము, మా మిత్ర-సంబంధీకులు మమ్మల్ని ఇంటి నుండి పంపించేయాలని అనుకుంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి. బాబా అంటారు - పవిత్రముగా ఉండాలా అని అడుగుతున్నారా, ఒకవేళ ఉండలేకపోతే వెళ్ళి వివాహము చేసుకోండి. అచ్ఛా, ఎవరికైనా నిశ్చితార్థము జరిగితే, రాజీ చేసుకోవాలి, తప్పేమీ లేదు. వివాహ ముడి వేసేటప్పుడు కూడా - వీరు మీకు పతి, గురువు అని చెప్తారు. అచ్ఛా, ఆ సమయములో మీరు వారి చేత ఈ విషయాలను వ్రాయిస్తూ వెళ్ళండి. నేను మీకు గురువును, ఈశ్వరుడిని అని ఒప్పుకుంటారా, వ్రాయండి. అచ్ఛా, ఇప్పుడు నేను మీకు ఆజ్ఞను ఇస్తున్నాను - పవిత్రముగా ఉండాలి. దీని కోసం ధైర్యము కావాలి కదా. గమ్యము చాలా ఉన్నతమైనది. ఇరువురూ ఎలా కలిసి ఉంటున్నారు అనేది అందరికీ చూపించాలి. దీని ద్వారా చాలా గొప్ప ప్రాప్తి లభిస్తుంది. ప్రాప్తి గురించి తెలియనప్పుడే నిప్పు అంటుకుంటుంది. తండ్రి అంటారు - ఇంత గొప్ప ప్రాప్తి లభిస్తున్నప్పుడు ఒక్క జన్మ పవిత్రముగా ఉండటమనేది ఏమంత పెద్ద విషయము. నేను మీ పతిని, ఈశ్వరుడిని. నా ఆజ్ఞ అనుసారముగా పవిత్రముగా ఉండాల్సి ఉంటుంది. తండ్రి యుక్తులను తెలియజేస్తారు. భారత్ లో ఈ నియమముంది - మీకు పతియే ఈశ్వరుడని, అతని ఆజ్ఞ అనుసారముగా నడుచుకోవాలని స్త్రీకి చెప్తారు. పతి పాదాలను ఒత్తాలని చెప్తారు ఎందుకంటే లక్ష్మీ, నారాయణుడి పాదాలను ఒత్తారని అనుకుంటారు. ఈ అలవాటు ఎక్కడ నుండి మొదలైంది? ఈ అసత్యమైన చిత్రాల నుండి మొదలైంది. సత్యయుగములోనైతే ఇలాంటి విషయాలు ఉండవు. లక్ష్మి కూర్చుని పాదాలు ఒత్తడానికి నారాయణుడు ఎప్పుడైనా అలసిపోతారా? అలసట యొక్క విషయమే ఉండదు ఎందుకంటే అలసిపోవడము అనేది దుఃఖము యొక్క విషయము. అక్కడ దుఃఖము ఎక్కడి నుండి వస్తుంది. ఎన్ని అసత్యమైన విషయాలను వ్రాసేసారు. బాబాకు చిన్నప్పటి నుండే వైరాగ్యముండేది, అందుకే భక్తి చేసేవారు.

బాబా పిల్లలకు చాలా మంచి యుక్తిని తెలియజేస్తారు. కొంతమంది పిల్లలను సంబంధీకులు విసిగిస్తారు - అచ్ఛా, వివాహము చేసుకోండి, స్త్రీ మీవారు అవుతారు, అప్పుడిక ఎవ్వరూ ఏమీ చేయలేరు. పరస్పరములో కలిసి ఉంటూ పవిత్రముగా ఉండండి, కంపానియన్లుగా ఉంటారు. విదేశాలలో వృద్ధులుగా అయినప్పుడు, వాళ్ళను చూసుకునేందుకని కంపానియన్ ను పెట్టుకుంటారు. సివిల్ మ్యారేజ్ చేసుకుంటారు, వికారాలలోకి వెళ్ళరు. మనము ఒక్క తండ్రి పిల్లలమని, పరస్పరములో సోదరీ-సోదరులుగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రిని పిలవడము కూడా పతిత ప్రపంచములోకి పిలుస్తారు. ఓ పతిత-పావనా, సీతలందరి రామా, అని పిలుస్తారు. మనుష్యులు రామ-రామ అని జపించినప్పుడు సీతను గుర్తు చేసుకోరు. సీత కంటే గొప్పవారు లక్ష్మి. కానీ స్మృతి అయితే ఒక్క తండ్రిని మాత్రమే చేస్తారు. లక్ష్మీ-నారాయణుల గురించైతే ఎంతోకొంత తెలుసు కానీ శివుని గురించి ఎవరికీ తెలియదు. ఆత్మ బిందువు కనుక ఆత్మల తండ్రి కూడా బిందువే అవుతారు కదా. ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది. బాబాను జ్ఞానసాగరుడు అని అంటారు. ఆత్మలైన మీరు కూడా జ్ఞానసాగరులుగా అవుతారు. జ్ఞానసాగరుడు కూర్చుని ఆత్మలైన మీకు అర్థం చేయిస్తారు. ఆత్మ చైతన్యమైనది. మీ ఆత్మ జ్ఞానసాగరముగా అవుతూ ఉంది. మీకు మొత్తం సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. మధురమైన పిల్లలు ధైర్యము పెట్టాలి. మనము బాబా శ్రీమతాన్ని అనుసరించాలి కదా. అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలను స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు కనుక తండ్రి అంటారు - మీరు కూడా మీ రచనను మీ చేతుల్లో పెట్టుకోవాలి. ఒకవేళ కొడుకు మీ ఆజ్ఞను పాటించకపోతే ఇక ఆ కొడుకు, కొడుకు కానట్లే. అతడు కుపుత్రుడు అయినట్లు. ఆజ్ఞాకారీ, విశ్వాసపాత్రుడైన కొడుకు అయితే వారసత్వానికి హక్కుదారునిగా అవ్వగలడు. అనంతమైన తండ్రి కూడా అంటారు - నా శ్రీమతాన్ని అనుసరించినట్లయితే, మీరు ఈ విధముగా శ్రేష్ఠముగా అవుతారు లేదంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. తండ్రి మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా తయారుచేయడానికి వచ్చారు. ఇది సత్యమైన సత్యనారాయణుడి కథ. మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు మమ్మా, బాబా రాజా-రాణులుగా అవుతారు కనుక మీరు కూడా ధైర్యము చేయండి. తండ్రి అయితే తప్పకుండా తమ సమానముగా తయారుచేస్తారు. ప్రజలుగా అవ్వడములో సంతోషపడకూడదు. మేము తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము, బలిహారమవుతాము అని పురుషార్థము చేయాలి. మీరు బాబాను మీ వారసునిగా చేసుకుంటే, వారు మీకు 21 జన్మల కొరకు వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి పిల్లలపై బలిహారమవుతారు. పిల్లలంటారు - బాబా, ఈ తనువు, మనసు, ధనము అంతా మీదే. మీరు తండ్రి కూడా మరియు బిడ్డ కూడా. త్వమేవ మాతాశ్చ, పితా త్వమేవ. ఒక్క తండ్రి మహిమ ఎంత గొప్పది. ప్రపంచములో ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇదంతా భారత్ కు సంబంధించిన విషయమే. ఇది అదే 5 వేల సంవత్సరాల క్రితం నాటి యుద్ధము అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది. కావున పిల్లలు సదా చాలా సంతోషముగా ఉండాలి. భగవంతుడు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు కనుక మీకు సంతోషము ఉండాలి. తండ్రి పిల్లలైన మిమ్మల్ని అలంకరిస్తున్నారు. వారు మిమ్మల్ని చదివిస్తారు కూడా - వారు అనంతమైన తండ్రి, జ్ఞానసాగరుడు. మనకు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తారు. ఎవరికైతే తండ్రి గురించి తెలియదో, వారు నాస్తికులు. మీకు తండ్రి గురించి మరియు రచన గురించి తెలుసు కనుక మీరు ఆస్తికులు. లక్ష్మీ-నారాయణులు ఆస్తికులా లేక నాస్తికులా? మీరేమంటారు? సత్యయుగములో పరమాత్మను ఎవరూ స్మృతి చేయరు అని మీరే చెప్తారు. అక్కడ సుఖముంటుంది కావున సుఖములో పరమాత్మను స్మరించరు ఎందుకంటే పరమాత్మ గురించి తెలియదు. ఈ సమయములో మీరు ఆస్తికులుగా అయి వారసత్వాన్ని పొందుతున్నారు. తర్వాత అక్కడ అసలు స్మృతియే చేయరు. ఇక్కడ వారిని స్మృతి చేస్తారు కానీ వారి గురించి తెలియదు, అందుకే నాస్తికులని అంటారు. అక్కడ తండ్రి గురించి తెలియదు కనుక స్మృతి కూడా చేయరు. ఈ స్వర్గ వారసత్వము మనకు శివబాబా నుండి లభించింది అన్న విషయము కూడా వారికి తెలియదు కానీ వారిని నాస్తికులని అనరు ఎందుకంటే వారు పావనమైనవారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతాన్ని అనుసరించేందుకు పూర్తి ధైర్యమును ఉంచాలి. ఏ విషయములోనూ భయపడకూడదు మరియు డిస్టర్బ్ అవ్వకూడదు.

2. తమ రచనను తమ చేతుల్లో పెట్టుకోవాలి. వారిని వికారాల నుండి రక్షించాలి. పావనముగా అయ్యే సలహాను ఇవ్వాలి.

వరదానము:-
సదా తండ్రి సమ్ముఖములో ఉంటూ సంతోషాన్ని అనుభవం చేసే అలసిపోనివారిగా మరియు సోమరితనము లేనివారిగా కండి

ఏ రకమైన సంస్కారాన్ని అయినా లేక స్వభావాన్ని అయినా పరివర్తన చేయడములో నిరుత్సాహులుగా అవ్వడము లేక సోమరితనము రావడము కూడా అలసిపోవడము వంటిదే, ఈ విషయములో అలసటలేనివారిగా అవ్వండి. అలసటలేనివారు అంటే అర్థం సోమరితనము లేకపోవడము. ఏ పిల్లలైతే ఇలా సోమరితనము లేకుండా ఉంటారో, వారు సదా తండ్రి సమ్ముఖములో ఉంటారు మరియు సంతోషాన్ని అనుభవం చేస్తారు. వారి మనసులో ఎప్పుడూ దుఃఖపు అల రాదు, అందుకే సదా సమ్ముఖములో ఉండండి మరియు సంతోషాన్ని అనుభవం చేయండి.

స్లోగన్:-
సిద్ధి స్వరూపులుగా అయ్యేందుకు ప్రతి సంకల్పములో పుణ్యాన్ని మరియు ప్రతి మాటలో ఆశీర్వాదాలను జమ చేసుకుంటూ వెళ్ళండి.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

ఎవరికైతే మీ పట్ల శుభ భావము ఉంటుందో, వారి పట్ల మీరు కూడా శుభ భావము పెడతారు, ఉపకారులకు ఉపకారము చేస్తారు, ఇదేమంత పెద్ద విషయము కాదు. కానీ ఎవరైనా మిమ్మల్ని పదే-పదే పడేసేందుకు ప్రయత్నించినా, మీ మనసును డిస్టర్బ్ చేసినా, అప్పుడు కూడా మీకు వారి పట్ల సదా శుభచింతక భావన, చలించని-స్థిరమైన భావన ఉండాలి. విషయము కారణముగా భావము మారకూడదు, ఎవరైనా అపకారము చేసినా కానీ మీరు ఒక్క క్షణములో అపకారాన్ని ఉపకారములోకి పరివర్తన చేయండి, అప్పుడు అద్భుతము అని అంటారు.