23-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఎప్పుడు సమయము లభిస్తే అప్పుడు
ఏకాంతములో కూర్చుని విచార సాగర మంథనము చేయండి, ఏ పాయింట్లనైతే వింటారో వాటిని రివైజ్
చేయండి’’
ప్రశ్న:-
మీ
స్మృతి యాత్ర ఎప్పుడు పూర్తవుతుంది?
జవాబు:-
ఎప్పుడైతే మీ
ఏ కర్మేంద్రియమూ మోసగించదో, కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో, అప్పుడు స్మృతియాత్ర పూర్తి
అవుతుంది. ఇప్పుడు మీరు పూర్తి పురుషార్థము చేయాలి, నిరుత్సాహులుగా అవ్వకూడదు, సేవలో
తత్పరులై ఉండాలి.
ఓంశాంతి
మధురాతి మధురమైన పిల్లలూ, ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా? అర్ధకల్పము మేము
దేహాభిమానులుగా ఉన్నాము అని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా
ఉండేందుకు కష్టపడవలసి ఉంటుంది. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ కూర్చోండి, అప్పుడే తండ్రి గుర్తుకువస్తారు, లేదంటే మర్చిపోతారు. స్మృతి
చేయకపోతే యాత్ర ఎలా చేయగలరు! పాపాలు ఎలా అంతమవుతాయి! నష్టము కలుగుతుంది. మీరు ఘడియ,
ఘడియ స్మృతి చేయండి. ఇదే ముఖ్యమైన విషయము. ఇకపోతే తండ్రి అనేక రకాల యుక్తులను
తెలియజేస్తూ ఉంటారు. తప్పేమిటి, ఒప్పేమిటి అనేది కూడా అర్థం చేయించారు. తండ్రి
జ్ఞానసాగరుడు. వారికి భక్తిని గురించి కూడా తెలుసు. పిల్లలు భక్తిలో ఏమేమి చేయవలసి
ఉంటుంది! తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ యజ్ఞ తపాదులు మొదలైనవి చేయడం, ఇదంతా భక్తి
మార్గము. తండ్రి మహిమను చేస్తారు కానీ తప్పుగా చేస్తారు. వాస్తవానికి శ్రీకృష్ణుని
మహిమ గురించి కూడా వారికి పూర్తిగా తెలియదు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా.
ఉదాహరణకు శ్రీకృష్ణుడిని వైకుంఠనాథుడు అని అంటారు. అచ్ఛా, బాబా అడుగుతున్నారు -
శ్రీకృష్ణుడిని త్రిలోకనాథుడు అని అనవచ్చా? త్రిలోకనాథుడు అని అంటూ ఉంటారు కదా.
నిజానికి త్రిలోకనాథుడు అనగా మూడు లోకాలైన మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనములకు
నాథుడు. మీరు బ్రహ్మాండానికి కూడా అధిపతులు అని పిల్లలైన మీకు అర్థం చేయించడం
జరుగుతుంది. నేను బ్రహ్మాండానికి అధిపతిని అని శ్రీకృష్ణుడు భావిస్తారా? లేదు. అతను
వైకుంఠములో ఉండేవారు. వైకుంఠము అని స్వర్గమైన క్రొత్త ప్రపంచాన్ని అంటారు.
వాస్తవానికి త్రిలోకనాథులు ఎవ్వరూ లేరు. తండ్రి యథార్థమైన విషయాన్ని అర్థం
చేయిస్తున్నారు. మూడు లోకాలైతే ఉన్నాయి. బ్రహ్మాండానికి శివబాబా కూడా యజమానియే,
అలాగే పిల్లలైన మీరు కూడా యజమానులే. సూక్ష్మవతనము యొక్క విషయమే లేదు. శివబాబా
స్థూలవతనములో కూడా యజమానిగా లేరు, వారు స్వర్గానికి కూడా యజమాని కారు, అలాగే
నరకానికి కూడా యజమాని కారు. శ్రీకృష్ణుడు స్వర్గానికి అధిపతి. నరకానికి అధిపతి
రావణుడు. దీనిని రావణ రాజ్యము, ఆసురీ రాజ్యము అని అంటారు. మనుష్యులు ఇలా అంటారు కూడా,
కానీ అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు.
రావణునికి 10 తలలు చూపిస్తారు. పంచ వికారాలు స్త్రీలోనివి, పంచ వికారాలు
పురుషునిలోనివి. వాస్తవానికి పంచ వికారాలైతే అందరి కొరకూ ఉన్నాయి. అందరూ రావణ
రాజ్యములోనే ఉన్నారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠాచారులుగా అవుతున్నారు. తండ్రి వచ్చి
శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని తయారుచేస్తారు. ఏకాంతములో కూర్చోవడం ద్వారా ఇటువంటి విచార
సాగర మథనము నడుస్తుంది. ఆ చదువులో కూడా విద్యార్థులు ఏకాంతములోకి వెళ్ళి పుస్తకాలు
తీసుకుని చదువుకుంటారు. మీరు పుస్తకాలు చదవవలసిన అవసరం లేదు. ఆ, మీరు పాయింట్లు నోట్
చేసుకుంటారు. వాటిని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. ఇవి అర్థం చేసుకోవలసిన చాలా గుహ్యమైన
విషయాలు. ఈ రోజు మీకు గుహ్యాతి గుహ్యమైన కొత్త-కొత్త పాయింట్లను అర్థం చేయిస్తాను
అని బాబా అంటారు కదా. పారసపురికి అధిపతులైతే లక్ష్మీ-నారాయణులే, అంతేకానీ విష్ణువు
అని అనరు. వీరు విష్ణువు గురించి కూడా వీరే లక్ష్మీ-నారాయణులు అని భావించరు. ఇప్పుడు
మీరు క్లుప్తముగా లక్ష్యము, ఉద్దేశ్యము గురించి అర్థం చేయిస్తారు. బ్రహ్మా,
సరస్వతులు పరస్పరం పతి, పత్ని ఏమీ కారు. ఇతను అయితే ప్రజాపిత బ్రహ్మా కదా. ప్రజాపిత
బ్రహ్మాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనవచ్చు. శివబాబాను కేవలం బాబా అనే
అంటారు. మిగిలినవారంతా సోదరులు. వీరంతా బ్రహ్మాకు పిల్లలు. భగవంతుని పిల్లలమైన మనము
సోదరులమవుతాము అన్నది అందరికీ తెలుసు, కానీ అది నిరాకారీ ప్రపంచములో. ఇప్పుడు మీరు
బ్రాహ్మణులుగా అయ్యారు. క్రొత్త ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. దీనికేమో
పురుషోత్తమ సంగమయుగము అన్న పేరు పెట్టారు. సత్యయుగములో పురుషోత్తములే ఉంటారు. ఇవి
చాలా అద్భుతమైన విషయాలు. మీరు కొత్త ప్రపంచము కొరకు తయారవుతున్నారు. ఈ సంగమయుగములోనే
మీరు పురుషోత్తములుగా అవుతారు. మేము లక్ష్మీ-నారాయణులుగా అవుతాము అని అంటారు కూడా.
వారు అందరికన్నా ఉత్తమ పురుషులు. వారిని దేవతలు అని అంటారు. ఉత్తమోత్తమమైన నంబర్ వన్
అయినవారు లక్ష్మీ-నారాయణులు. ఆ తర్వాత పిల్లలైన మీరు నంబరువారుగా తయారవుతారు.
సూర్యవంశము వారిని ఉత్తములు అని అంటారు. వారు నంబర్ వన్ గా అయితే ఉన్నారు కదా.
మెల్లమెల్లగా కళలు తగ్గుతాయి.
ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచానికి ముహూర్తము పెడతారు. కొత్త ఇల్లు
తయారైనప్పుడు పిల్లలు సంతోషిస్తారు కదా. ముహూర్తము పెడతారు. అలాగే పిల్లలైన మీరు
కూడా కొత్త ప్రపంచాన్ని చూసి సంతోషిస్తారు. ముహూర్తము పెడతారు. బంగారు పుష్పాల
వర్షము కురుస్తుంది అని వ్రాయబడి కూడా ఉంది. పిల్లలైన మీకు సంతోషపు పాదరసము ఎంతగా
పైకి ఎక్కాలి. మీకు సుఖ-శాంతులు రెండూ లభిస్తాయి. ఇంత సుఖాన్ని మరియు శాంతిని
ఇచ్చేవారు ఇంకెవరూ లేరు. వేరే ధర్మమేదైనా వస్తే ద్వైతము ఏర్పడుతుంది. మేము
పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందుతాము అని పిల్లలైన మీకు అపారమైన సంతోషము ఉంది.
భాగ్యములో ఏది ఉంటే అది లభిస్తుందిలే, పాసయ్యేది ఉంటే పాస్ అవుతాములే అని భావించడం
కాదు. అలా కాదు. ప్రతి విషయములోనూ పురుషార్థము తప్పకుండా చేయాలి. పురుషార్థము
చేయలేకపోతే భాగ్యములో ఏది ఉంటే అది లభిస్తుందిలే అని అనేస్తారు, ఇక పురుషార్థం
చేయడమే ఆగిపోతుంది. తండ్రి అంటారు, మాతలైన మిమ్మల్ని ఎంత ఉన్నతముగా తయారుచేస్తాను.
స్త్రీలకు అన్ని చోట్ల గౌరవము ఉంది, విదేశాల్లో కూడా గౌరవము ఉంది, కానీ ఇక్కడ కూతురు
పుడితే మంచాన్ని తలకిందులుగా తిప్పేస్తారు. ప్రపంచము పూర్తిగా అశుద్ధముగా ఉంది.
భారత్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఈ సమయములో మీకు తెలుసు. మనుష్యులు
మర్చిపోయారు. కేవలం శాంతి కావాలి, శాంతి కావాలి అని కోరుకుంటూ ఉంటారు. విశ్వములో
శాంతిని కోరుకుంటారు. మీరు ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని చూపించండి. వీరి రాజ్యము
ఉన్నప్పుడు పవిత్రత, సుఖ-శాంతులు కూడా ఉండేవి. మీకు ఇటువంటి రాజ్యము కావాలి కదా.
మూలవతనములో విశ్వ శాంతి అని అనరు. విశ్వములో శాంతి ఇక్కడే ఉంటుంది కదా. దేవతల
రాజ్యము మొత్తం విశ్వములో ఉండేది. మూలవతనము ఆత్మల లోకము. ఆత్మల లోకము ఉంటుందని కూడా
మనుష్యులకు తెలియదు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఎంత ఉన్నతముగా, పురుషోత్తములుగా
తయారుచేస్తాను. ఇది అర్థం చేయించవలసిన విషయము. అంతేకానీ భగవంతుడు వచ్చేసారు,
వచ్చేసారు అని గట్టి, గట్టిగా చెప్పటం కాదు, అలా చెప్తే ఎవరూ నమ్మరు. ఇంకా ఎదురు
తిట్లు తింటారు మరియు తినిపిస్తారు. బి.కె.లు తమ బాబానే భగవంతుడు అని అనేస్తున్నారు
అని అంటారు. ఇలా సేవ జరగదు. బాబా యుక్తిని తెలియజేస్తూ ఉంటారు. ఒక గదిలో గోడ పైన
8-10 చిత్రాలను చక్కగా అమర్చండి మరియు బయట ఇలా వ్రాయండి - అనంతమైన తండ్రి నుండి
అనంతమైన సుఖము యొక్క వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే మరియు మనుష్యుల నుండి దేవతలుగా
అవ్వాలంటే రండి, మేము మీకు అర్థం చేయిస్తాము. దానితో ఎంతోమంది రావడం మొదలుపెడతారు.
తమంతట తామే వస్తుంటారు. విశ్వములో శాంతి అయితే ఉండేది కదా. ఇప్పుడు ఎన్ని
లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. తమోప్రధాన ప్రపంచములో శాంతి ఎలా ఉండగలదు. విశ్వములో
శాంతిని భగవంతుడే స్థాపించగలరు. శివబాబా వస్తారు, అప్పుడు తప్పకుండా ఏదో ఒక కానుకను
తీసుకువస్తారు. ఇంతదూరం నుండి వచ్చేది తండ్రి ఒక్కరే మరియు ఈ బాబా ఒకేసారి వస్తారు.
ఇంత గొప్ప బాబా 5,000 సంవత్సరాల తర్వాత వస్తారు. యాత్ర నుండి తిరిగి వచ్చేటప్పుడు
పిల్లల కోసం కానుకలను తీసుకువస్తారు కదా. స్త్రీ యొక్క పతి కూడా పిల్లలకు తండ్రిగా
అవుతారు కదా, ఆ తర్వాత తాతగా, ముత్తాతగా అవుతారు. ఇతడిని మీరు బాబా (తండ్రి) అని
కూడా అంటారు, అంతేకాక వీరు తాతగా కూడా అవుతారు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ (ముత్తాతగా)
కూడా అవుతారు. వంశాలు ఉన్నాయి కదా. ఆడమ్, ఆదిదేవ్ అన్న పేర్లు ఉన్నాయి కానీ
మనుష్యులు అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు.
తండ్రి ద్వారా మీరు సృష్టిచక్రపు చరిత్ర, భౌగోళికాలను తెలుసుకుని చక్రవర్తీ రాజులుగా
అవుతున్నారు. బాబా ఎంత ప్రేమగా మరియు రుచిగా చదివిస్తారు. కావున అంతగా చదవాలి కదా.
ఉదయం వేళలోనైతే అందరూ ఫ్రీగా ఉంటారు. ఉదయం క్లాస్ జరుగుతుంది - అరగంట, ముప్పావు గంట
మురళి విని వెళ్ళిపోండి. స్మృతినైతే ఎక్కడ ఉన్నా చేయవచ్చు. ఆదివారం రోజైతే సెలవు
ఉంటుంది. ఉదయం 2, 3 గంటలు కూర్చోండి. పగటివేళలో చేసుకోలేని సంపాదనను అక్కడ మేకప్
చేసుకోండి (లోటు భర్తి చేసుకోండి). పూర్తి జోలెను నింపుకోండి. సమయమైతే లభిస్తుంది
కదా. మాయ తుఫానులు వచ్చినట్లయితే స్మృతి చేయలేరు. బాబా చాలా సహజ రీతిలో అర్థం
చేయిస్తారు. భక్తి మార్గములో ఎన్ని సత్సంగాలకు వెళ్తూంటారు. శ్రీకృష్ణుని
మందిరములోకి, మళ్ళీ శ్రీనాథుని మందిరములోకి, అలా ఎందరో మందిరాలలోకి వెళ్తుంటారు.
యాత్రలలో కూడా ఎన్ని చోట్ల ఎంతమందిని దర్శనము చేసుకునేందుకు వెళ్తారు. ఎంతో
కష్టపడతారు కానీ లాభమేమీ ఉండదు. డ్రామాలో ఇది కూడా నిశ్చితమై ఉంది, ఇది మళ్ళీ
జరుగుతుంది. మీ ఆత్మలో పాత్ర నిండి ఉంది. సత్య, త్రేతాయుగాలలో ఏ పాత్రనైతే కల్ప
పూర్వము అభినయించారో, దానినే అభినయిస్తారు. మందబుద్ధి కలవారు ఇది కూడా అర్థం
చేసుకోరు. సూక్ష్మ బుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో వారే బాగా అర్థం చేసుకుని అర్థం
చేయించగలుగుతారు. ఇది అనాది నాటకముగా నిశ్చితమై ఉంది అని వారికి లోలోపల అనుభమవుతుంది.
ఇది అనంతమైన నాటకము అని ప్రపంచములో ఎవరూ అర్థం చేసుకోరు. దీనిని అర్థం చేసుకోవడానికి
కూడా సమయము పడుతుంది. ప్రతి విషయాన్ని విస్తారముగా అర్థం చేయించి... మళ్ళీ
ముఖ్యమైనది స్మృతి యాత్ర అని చెప్పడం జరుగుతుంది. క్షణములో జీవన్ముక్తి అని కూడా
అంటూ ఉంటారు. అలాగే వారు జ్ఞానసాగరుడు అని కూడా గానం చేయబడింది. మొత్తం సాగరమంతటినీ
సిరాగా చేసి అడవిని కలముగా చేసి ఈ భూమిని కాగితముగా చేసినా కూడా అది అంతమవ్వదు.
ప్రారంభము నుండి మొదలుకుని మీరు ఎంతగా వ్రాస్తూ వచ్చారు. ఎన్నో కాగితాలు తయారయ్యాయి.
మీరు ఎదురుదెబ్బలు తినకూడదు. ముఖ్యమైనవారు భగవంతుడే. తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ
కూడా మీరు శివబాబా వద్దకు వస్తారు. శివబాబా వీరిలోకి ప్రవేశించి మిమ్మల్ని ఎంత
ప్రేమగా చదివిస్తారు. ఎటువంటి ఆర్భాటము లేదు. తండ్రి అంటారు, నేను పాత శరీరములోకే
వస్తాను. శివబాబా ఎంత సాధారణ రీతిలో వచ్చి చదివిస్తారు. ఎటువంటి అహంకారమూ లేదు.
తండ్రి అంటారు, మీరు నన్ను - బాబా, పతిత ప్రపంచము, పతిత శరీరములోకి రండి, వచ్చి మాకు
శిక్షణను ఇవ్వండి అని పిలుస్తారు. మీరు వజ్ర వైఢూర్యాల మహల్ లోకి వచ్చి కూర్చోండి,
భోజనము తినండి అని మీరు నన్ను సత్యయుగములో పిలవరు. అసలు శివబాబా భోజనమే చేయరు. మీరు
వచ్చి భోజనము తినండి అని ఇంతకుముందు పిలిచేవారు. 36 రకాల భోజనము తినిపించేవారు, ఇది
మళ్ళీ జరుగుతుంది. దీనిని కూడా చరిత్ర అనే అంటారు. శ్రీకృష్ణుని చరిత్ర ఏమిటి? అతను
సత్యయుగానికి యువరాజు, అతడిని పతిత-పావనుడు అని అనరు. సత్యయుగములో వీరు
విశ్వాధిపతులుగా ఎలా అయ్యారు - ఇది కూడా ఇప్పుడు మీకే తెలుసు. మనుష్కులైతే పూర్తిగా
ఘోర అంధకారములో ఉన్నారు. ఇప్పుడు మీరు అత్యంత ప్రకాశములో ఉన్నారు. తండ్రి వచ్చి
రాత్రిని పగలుగా చేస్తారు. అర్ధకల్పము మీరు రాజ్యము చేస్తారు కావున మీకు ఎంతటి
సంతోషము ఉండాలి.
ఎప్పుడైతే మీ ఏ కర్మేంద్రియము మోసగించదో అప్పుడే మీ స్మృతియాత్ర పూర్తవుతుంది.
ఎప్పుడైతే కర్మాతీత అవస్థకు చేరుకుంటారో అప్పుడే స్మృతియాత్ర పూర్తవుతుంది. ఇప్పుడు
అది ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థము చేయాలి, నిరుత్సాహులుగా
అవ్వకూడదు. సేవ మరియు సేవ. తండ్రి కూడా వచ్చి వృద్ధ తనువు ద్వారా సేవ చేస్తున్నారు
కదా. తండ్రి చేసేవారు మరియు చేయించేవారు. పిల్లల కోసం ఇది తయారుచేయాలి, ఇల్లు
కట్లాలి అని ఎంత చింత ఉంటుంది. ఏ విధంగా లౌకిక తండ్రికి హద్దులోని ఆలోచనలు ఉంటాయో,
అలా పారలౌకిక తండ్రికి అనంతమైన ఆలోచనలు ఉంటాయి. పిల్లలైన మీరే సేవ చేయాలి.
రోజురోజుకు చాలా సహజతరమవుతూ ఉంటుంది. ఎంతగా వినాశనానికి సమీపముగా వస్తూ ఉంటారో,
అంతగా శక్తి వస్తూ ఉంటుంది. భీష్మ పితామహులు మొదలైనవారికి చివరిలో బాణాలు తగిలాయి
అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడే బాణాలు తగిలితే చాలా హంగామా జరిగిపోతుంది. ఇక ఎంతమంది
గుంపులు గుంపులుగా వచ్చేస్తారంటే, ఇక అడగకండి. తల గోక్కునేందుకు కూడా ఖాళీ లేదు అని
అంటారు కదా. వాస్తవానికి అలా ఎవరూ ఉండరు. కానీ అంతమంది గుంపులు గుంపులుగా వచ్చేస్తే
అప్పుడు అలా అంటారు. ఎప్పుడైతే వీరికి బాణము తగులుతుందో అప్పుడు ఇక మీ ప్రభావము
వెలువడుతుంది. పిల్లలందరికీ తండ్రి పరిచయమైతే లభించాలి కదా.
మీరు మూడడుగుల నేలపై కూడా ఈ అవినాశీ హాస్పిటల్ ను మరియు ఈశ్వరీయ
విశ్వవిద్యాలయాన్ని తెరవవచ్చు. డబ్బు లేకపోయినా పర్వాలేదు, మీకు చిత్రాలు లభిస్తాయి.
సేవలో మానావమానాలు, సుఖ-దుఃఖాలు, వేడి-చలి అన్నింటినీ సహించాలి. ఎవరినైనా వజ్రములా
తయారుచేయడమంటే అదేమైనా తక్కువ విషయమా! బాబా ఎప్పుడైనా అలసిపోతారా? మరి మీరు ఎందుకు
అలసిపోతారు? అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఉదయము వేళలో అరగంట, ముప్పావు గంట చాలా ప్రేమగా, రుచిగా చదువును చదువుకోవాలి.
తండ్రి స్మృతిలో ఉండాలి. స్మృతి పురుషార్థము ఎంతగా ఉండాలంటే దాని ద్వారా
కర్మేంద్రియాలు వశమైపోవాలి.
2. సేవలో సుఖ-దుఃఖాలు, మానావమానాలు, వేడి-చలి అన్నింటినీ సహించాలి. ఎప్పుడూ కూడా
సేవలో అలసిపోకూడదు. మూడడుగుల నేలపై కూడా హాస్పిటల్ ను మరియు యూనివర్శిటీని తెరిచి
వజ్రములా తయారుచేసే సేవను చేయాలి.
వరదానము:-
సత్యమైన ఆత్మిక స్నేహాన్ని అనుభూతి చేయించే మాస్టర్ స్నేహ సాగర భవ
ఏ విధంగా సాగర
తీరానికి వెళ్ళినప్పుడు శీతలత అనుభవమవుతుందో, అలాగే పిల్లలైన మీరు మాస్టర్ స్నేహ
సాగరులుగా అయినట్లయితే మీ ఎదురుగా ఏ ఆత్మ వచ్చినా కానీ, స్నేహపు మాస్టర్ సాగరుని
అలలు స్నేహపు అనుభూతిని చేయిస్తున్నాయి అని వారు అనుభవము చేయాలి, ఎందుకంటే నేటి
ప్రపంచము సత్యమైన ఆత్మిక స్నేహము కోసం ఆకలితో ఉంది. స్వార్థపూరితమైన స్నేహాన్ని
చూసి-చూసి అటువంటి స్నేహము నుండి మనసు విరక్తి చెంది ఉంది, అందుకే ఆత్మిక స్నేహముతో
కూడిన కొన్ని క్షణాల అనుభూతిని కూడా వారు జీవితపు ఆధారముగా భావిస్తారు.
స్లోగన్:-
జ్ఞాన
ధనముతో నిండుగా ఉన్నట్లయితే స్థూల ధనము యొక్క ప్రాప్తి స్వతహాగా జరుగుతూ ఉంటుంది.
అవ్యక్త సూచనలు -
సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి
సత్యయుగ సృష్టి
గురించి ఒకటే రాజ్యము, ఒకటే ధర్మము అని అంటారు. అలాగే ఇప్పుడు స్వరాజ్యములో కూడా
ఒకటే రాజ్యము నడవాలి అనగా అందరూ స్వయం సూచించిన సూచనలపైనే నడవాలి. మనసు తన
మన్మతాన్ని నడిపించకూడదు, బుద్ధి నిర్ణయశక్తితో అలజడి కలిగించకూడదు, సంస్కారాలు
ఆత్మను ఆడించేవిగా ఉండకూడదు, అప్పుడే ఒకటే ధర్మము, ఒకటే రాజ్యము అని అంటారు. కనుక
అటువంటి కంట్రోలింగ్ పవర్ ను ధారణ చెయ్యండి, ఇదే అనంతమైన సేవకు సాధనము.
| | |