23-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మిమ్మల్ని జ్ఞాన రత్నాలతో అలంకరించి
తిరిగి ఇంటికి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు, ఆ తర్వాత రాజ్యములోకి పంపిస్తారు,
కావున అపారమైన సంతోషములో ఉండండి, ఒక్క తండ్రినే ప్రేమించండి’’
ప్రశ్న:-
మీ
ధారణను దృఢముగా చేసుకునేందుకు ఆధారమేమిటి?
జవాబు:-
మీ ధారణను
శక్తివంతముగా చేసుకునేందుకు సదా పక్కా చేసుకోండి - ఈ రోజు ఏదైతే గతించిందో అది
మంచిగా గతించింది, ఇది మళ్ళీ కల్పము తర్వాత జరుగుతుంది. ఏదైతే జరిగిందో అది
కల్పపూర్వము కూడా ఇలాగే జరిగింది, నథింగ్ న్యూ (కొత్తేమీ లేదు). ఈ యుద్ధము కూడా 5
వేల సంవత్సరాల క్రితం జరిగింది, ఇది మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. ఈ ప్రపంచము యొక్క
వినాశనము జరిగేదే ఉంది... ఈ విధముగా ప్రతి క్షణము డ్రామా స్మృతిలో ఉన్నట్లయితే ధారణ
దృఢముగా అవుతూ ఉంటుంది.
పాట:-
దూరదేశములో
నివసించేవారు...
ఓంశాంతి
పిల్లలు ఇంతకుముందు కూడా దూర దేశము నుండి పరాయి దేశములోకి వచ్చారు. ఇప్పుడు ఈ పరాయి
దేశములో దుఃఖితులుగా ఉన్నారు, అందుకే - మన దేశానికి తీసుకువెళ్ళండి, ఇంటికి
తీసుకువెళ్ళండి అని తండ్రిని పిలుస్తారు. మీరందరూ పిలిచారు కదా. ఎంతోకాలము నుండి
స్మృతి చేస్తూ వచ్చారు కావున తండ్రి కూడా సంతోషముగా వస్తారు. నేను పిల్లల వద్దకు
వెళ్తున్నాను అని వారికి తెలుసు. ఏ పిల్లలైతే కామ చితిపై కూర్చుని కాలిపోయారో వారిని
తమ ఇంటికి కూడా తీసుకువెళ్తాను మరియు ఆ తర్వాత రాజ్యములోకి కూడా పంపిస్తాను. దాని
కోసము జ్ఞానముతో వారిని అలంకరిస్తాను కూడా. పిల్లలు కూడా తండ్రి కన్నా ఎక్కువగా
సంతోషపడాలి. తండ్రి వచ్చారు కావున ఇక వారికి చెందినవారిగా అయిపోవాలి. వారిని ఎంతగానో
ప్రేమించాలి. బాబా ప్రతి రోజూ అర్థం చేయిస్తారు. ఆత్మ ఇలా మాట్లాడుతుంది కదా - బాబా,
ఐదు వేల సంవత్సరాల తరువాత డ్రామానుసారముగా మీరు వచ్చారు, మాకు సంతోషపు ఖజానా ఎంతగానో
లభిస్తుంది. బాబా, మీరు మా జోలెను నింపుతున్నారు, మమ్మల్ని మన ఇల్లయిన శాంతిధామానికి
తీసుకువెళ్తారు, ఆ తర్వాత రాజధానిలోకి పంపిస్తారు. ఎంతటి అపారమైన సంతోషము ఉండాలి.
తండ్రి అంటారు, నేను ఈ పరాయి రాజధానిలోకే రావలసి ఉంటుంది. తండ్రిది ఎంతో మధురమైన
మరియు అద్భుతమైన పాత్ర. అందులోనూ విశేషముగా ఎప్పుడైతే ఈ పరాయి దేశములోకి వస్తారో
అప్పుడు వారి పాత్ర ఎంతో మధురమైనది మరియు అద్భుతమైనది. ఈ విషయాలను మీరు ఇప్పుడే
అర్థం చేసుకుంటారు, తర్వాత ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. అక్కడ ఈ జ్ఞానము యొక్క అవసరమే
ఉండదు. తండ్రి అంటారు, మీరు ఎంత బుద్ధిహీనులుగా అయిపోయారు. డ్రామాలోని నటులై ఉండి
కూడా తండ్రి గురించి మీకు తెలియదు! చేసేవారు మరియు చేయించేవారు తండ్రియే కానీ వారు
ఏం చేస్తారు మరియు ఏం చేయిస్తారు అన్నది మీరు మర్చిపోయారు. మొత్తం పాత ప్రపంచాన్ని
స్వర్గముగా తయారుచేయడానికి వస్తారు మరియు వారు జ్ఞానాన్ని ఇస్తారు. వారు
జ్ఞానసాగరుడు కావున తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చే కర్తవ్యమునే చేస్తారు కదా. ఆ తర్వాత
మీ చేత కూడా ఈ కర్తవ్యాన్ని చేయిస్తారు అనగా ఇతరులకు కూడా ఈ సందేశాన్ని ఇవ్వమని
చెప్తారు, అదేమిటంటే - ఇప్పుడు దేహ భానాన్ని వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే
వికర్మలు వినాశనమవుతాయని తండ్రి అందరికీ తెలియజేస్తున్నారు. నేను శ్రీమతాన్ని
ఇస్తాను. అందరూ పాపాత్ములే. ఈ సమయములో మొత్తం వృక్షమంతా తమోప్రధానముగా అయి
శిథిలావస్థకు చేరుకుంది. వెదురు అడవికి నిప్పంటుకుంటే ఒక్కసారిగా మొత్తమంతా కాలిపోయి
సమాప్తమైపోతుంది, ఆ అగ్నిని ఆర్పేందుకు అడవిలో నీరు ఎక్కడ దొరుకుతుంది. అలాగే ఈ పాత
ప్రపంచమేదైతే ఉందో, దీనికి నిప్పంటుకుంటుంది. ఇందులో కొత్త ఏమీ లేదు అని తండ్రి
అంటారు. తండ్రి మంచి-మంచి పాయింట్లను ఇస్తూ ఉంటారు, వాటిని నోట్ చేసుకుంటూ ఉండాలి.
ఇతర ధర్మ స్థాపకులు కేవలం తమ ధర్మాన్ని మాత్రమే స్థాపించుకునేందుకు వస్తారని తండ్రి
అర్థం చేయించారు. వారిని సందేశకులు, పైగంబర్, మెసెంజర్ అని అనడానికి వీల్లేదు. ఈ
విషయాన్ని కూడా చాలా యుక్తిగా వ్రాయవలసి ఉంటుంది. శివబాబా పిల్లలకు అర్థం
చేయిస్తున్నారు. వాస్తవానికి అందరూ పిల్లలే, అందరూ పరస్పరము సోదరులే. ప్రతి
చిత్రములో, ప్రతి వివరణలో శివబాబా ఈ విధముగా అర్థం చేయిస్తున్నారని తప్పకుండా
వ్రాయాలి. తండ్రి అంటారు - పిల్లలూ, నేను వచ్చి సత్యయుగీ ఆది సనాతన దేవీ-దేవతా
ధర్మాన్ని స్థాపన చేస్తాను, అందులో 100 శాతము సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి,
అందుకే దానిని స్వర్గము అని అంటారు. అక్కడ దుఃఖపు నామ-రూపాలే ఉండవు. మిగిలిన
ధర్మాలన్నీ ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ వినాశనము చేయడానికి నేను నిమిత్తమవుతాను.
సత్యయుగములో ఒకే ధర్మము ఉంటుంది. అది కొత్త ప్రపంచము. నేను పాత ప్రపంచాన్ని అంతము
చేయిస్తాను. ఇటువంటి వ్యాపారాన్ని అయితే ఇంకెవ్వరూ చేయలేరు. శంకరుడి ద్వారా వినాశనము
అని అంటారు. విష్ణువు కూడా లక్ష్మీ-నారాయణుల రూపమే. ప్రజాపిత బ్రహ్మా కూడా ఇక్కడే
ఉన్నారు కదా. ఇతనే పతితము నుండి పావనముగా, ఫరిశ్తాగా అవుతారు, అందుకే బ్రహ్మా దేవతా
అని అంటారు. ఇతని ద్వారా దేవీ-దేవతా ధర్మము స్థాపన అవుతోంది. ఈ బాబా కూడా దేవీ-దేవతా
ధర్మము యొక్క మొదటి రాకుమారునిగా అవుతారు. కావున బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని
ద్వారా వినాశనము. చిత్రాలనైతే చూపించాలి కదా. అర్థం చేయించేందుకని ఈ చిత్రాలను
తయారుచేసారు. వీటి అర్థమేమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. స్వదర్శన చక్రధారి గురించి
కూడా అర్థం చేయించారు. పరమపిత పరమాత్మకు సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలుసు, వారిలో
జ్ఞానమంతా ఉంది, కావున వారు స్వదర్శన చక్రధారి కదా. నేనే ఈ జ్ఞానాన్ని వినిపిస్తాను
అని ఆ తండ్రికి తెలుసు. నేను కమలపుష్ప సమానముగా అవ్వాలి అని బాబా అయితే అనరు కదా.
సత్యయుగములో మీరు కమలపుష్ప సమానముగానే ఉంటారు. సన్యాసుల విషయములో ఇలా అనరు, వారు
అడవులలోకి వెళ్ళిపోతారు. తండ్రి కూడా ఏమంటారంటే - ఆ సన్యాసులు మొదట పవిత్రముగా,
సతోప్రధానముగా ఉంటారు, వారు తమ పవిత్రతా బలముతో భారత్ ను నిలిపి ఉంచుతారు. భారత్
వంటి పవిత్ర దేశము ఇంకేదీ ఉండదు. ఏ విధముగా తండ్రి మహిమ ఉందో, అదే విధముగా భారత్
యొక్క మహిమ కూడా ఉంది. భారత్ స్వర్గముగా ఉండేది, అప్పుడు ఈ లక్ష్మీ-నారాయణులు
రాజ్యము చేసేవారు, ఆ తర్వాత వారు ఏమయ్యారు. ఈ విషయము ఇప్పుడు మీకు తెలుసు. ఈ దేవతలే
84 జన్మలను తీసుకుని మళ్ళీ పూజారులుగా అవుతారని ఇంకెవ్వరికీ తెలియదు. మనము ఇప్పుడు
పూజ్యులైన దేవీ-దేవతలుగా అవుతామని, ఆ తర్వాత పూజారులైన మనుష్యులుగా అవుతామని ఇప్పుడు
మీకు మొత్తం జ్ఞానమంతా ఉంది. మనుష్యులైతే మనుష్యులుగానే అవుతారు. చిత్రాలలో
రకరకాలుగా తయారుచేస్తూ ఉంటారు కదా, వాస్తవానికి అలాంటి మనుష్యులు ఎవ్వరూ ఉండరు.
ఇవన్నీ భక్తి మార్గములోని అనేక చిత్రాలు. మీ జ్ఞానము గుప్తమైనది. ఈ జ్ఞానాన్ని అందరూ
తీసుకోరు. ఈ దేవీ-దేవతా ధర్మానికి చెందిన ఆకులు ఎవరైతే ఉన్నారో, వారే ఈ జ్ఞానాన్ని
తీసుకుంటారు. ఇతరులను నమ్మేవారెవ్వరూ ఈ విషయాలను వినరు. ఎవరైతే శివుడు మరియు దేవతల
భక్తిని చేస్తారో వారే ఇక్కడికి వస్తారు. మొట్టమొదట నన్ను కూడా పూజిస్తారు, ఆ
తర్వాత పూజారులుగా అయి తమను తాము కూడా పూజించుకుంటూ ఉంటారు. పూజ్యుల నుండి
పూజారులుగా అయిన మనము ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నామని మీకు ఇప్పుడు సంతోషము
కలుగుతుంది. అక్కడ ఎన్ని సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడైతే అల్పకాలికముగా
సంతోషాన్ని జరుపుకుంటారు. అక్కడైతే మీకు సదా సంతోషము ఉంటుంది. అక్కడ దీపావళి
మొదలైనవి లక్ష్మిని పిలిచేందుకని జరగవు. పట్టాభిషేకమప్పుడు దీపావళి జరుగుతుంది.
ఇకపోతే ఈ సమయములో ఏ ఉత్సవాలనైతే ఇక్కడ జరుపుకుంటారో, అవి అక్కడ ఉండవు. అక్కడైతే
సుఖమే సుఖము ఉంటుంది. ఈ ఒక్క సమయములోనే మీకు ఆదిమధ్యాంతాలను గురించి తెలుసు. ఈ
పాయింట్లన్నింటినీ వ్రాయండి. సన్యాసులది హఠయోగము. ఇది రాజయోగము. బాబా అంటారు, ప్రతి
పేజీలోనూ ఎక్కడో ఒక చోట శివబాబా పేరు తప్పకుండా ఉండాలి. శివబాబా పిల్లలైన మనకు అర్థం
చేయిస్తున్నారు. నిరాకార ఆత్మలు ఇప్పుడు సాకారములో కూర్చుని ఉన్నారు. కావున తండ్రి
కూడా సాకారములోనే అర్థం చేయిస్తారు కదా. వారు అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
నన్ను స్మృతి చేయండి. శివ భగవానువాచ పిల్లల కోసము. వారు స్వయం ఇప్పుడు ఇక్కడ ఉన్నారు
కదా. ముఖ్యమైన పాయింట్లు పుస్తకాలలో ఎంత స్పష్టముగా వ్రాసి ఉండాలంటే, వాటిని
చదివినప్పుడు జ్ఞానము దానంతటదే అర్థం కావాలి. శివ భగవానువాచ అని వ్రాసి ఉండడం వల్ల
చదివేటప్పుడు ఆనందము కలుగుతుంది. ఇది బుద్ధికి సంబంధించిన విషయము కదా. బాబా కూడా
శరీరాన్ని అప్పుగా తీసుకుని అర్థం చేయిస్తారు కదా, ఇతని ఆత్మ కూడా వింటుంది.
పిల్లలకు ఎంతో నషా ఉండాలి. తండ్రిపై ఎంతో ప్రేమ ఉండాలి. ఇది వారి రథము. ఇది అనేక
జన్మలలోని చివరి జన్మ. తండ్రి వీరిలోకి ప్రవేశించారు. బ్రహ్మా ద్వారా ఈ బ్రాహ్మణులు
తయారవుతారు, ఆ తర్వాత మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. చిత్రాలు ఎంత స్పష్టముగా
ఉన్నాయి. ద్వికిరీటధారులుగా ఉన్న మీ చిత్రాన్ని కూడా పైన కానీ, ప్రక్కన కానీ
చూపించండి. యోగబలము ద్వారా మేము ఈ విధముగా అవుతాము అని చూపించండి. పైన శివబాబా
ఉండాలి. వారిని స్మృతి చేస్తూ-చేస్తూ మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. ఇది
పూర్తిగా స్పష్టముగా ఉంది. మనుష్యులు చూసి సంతోషించే విధముగా రంగు-రంగుల చిత్రాల
పుస్తకము ఉండాలి. అందులో పేదవారి కొరకు సామాన్యమైన పుస్తకాలను కూడా ముద్రించవచ్చు.
పెద్దదాని నుండి చిన్నగా, చిన్నదాని నుండి ఇంకా చిన్నగా తయారుచేయవచ్చు, రహస్యమంతా
అందులో రావాలి. గీతా భగవానుడి చిత్రము ముఖ్యమైనది. ఆ గీతపై కృష్ణుని చిత్రము, ఈ
గీతపై త్రిమూర్తి చిత్రము ఉన్నట్లయితే మనుష్యులకు అర్థం చేయించడం సహజమవుతుంది.
ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలైన బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మా
సూక్ష్మవతనములోనైతే ఉండరు. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు, మరి
ఇప్పుడు దేవతలు ఎవరు! దేవతలైతే ఇక్కడ రాజ్యము చేసేవారు. దేవతా ధర్మమైతే ఉంది కదా. ఈ
విషయాలన్నింటినీ బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. బ్రహ్మాయే విష్ణువుగా అవుతారు,
విష్ణువే బ్రహ్మాగా అవుతారు, ఇరువురూ ఇక్కడే ఉన్నారు. చిత్రము ఉన్నట్లయితే అర్థం
చేయించవచ్చు. మొట్టమొదట భగవంతుని గురించి నిరూపించినట్లయితే అన్ని విషయాలు
నిరూపించబడతాయి. పాయింట్లు అయితే ఎన్నో ఉన్నాయి. మిగిలినవారందరూ ధర్మ స్థాపన
చేయడానికి వస్తారు. తండ్రి అయితే స్థాపన మరియు వినాశనము, రెండూ చేయిస్తారు.
వాస్తవానికి అంతా డ్రామానుసారముగానే జరుగుతుంది. బ్రహ్మా మాట్లాడగలరు, విష్ణువు
మాట్లాడగలరా? సూక్ష్మవతనములో ఏమి మాట్లాడుతారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు.
ఇక్కడ మీరు అర్థం చేసుకుని పై క్లాసుకు ట్రాన్స్ఫర్ అవుతారు. అసలు గదే వేరేది
లభిస్తుంది. మూలవతనములోనైతే కూర్చుని ఉండిపోయేది లేదు. అక్కడి నుండి నంబరువారుగా
రావలసి ఉంటుంది. మొట్టమొదట ముఖ్యమైన విషయము ఒక్కటే, దానికి ఎక్కువ ప్రాధాన్యతను
ఇవ్వాలి. కల్పపూర్వము కూడా ఈ విధముగా జరిగింది. ఈ సెమినార్లు మొదలైనవన్నీ కూడా ఇదే
విధముగా కల్పపూర్వము కూడా జరిగాయి. పాయింట్లు కూడా అప్పుడు ఇదే విధముగా వెలువడ్డాయి.
ఈ రోజు ఏదైతే గతించిందో అది బాగా గతించింది, మళ్ళీ కల్పము తర్వాత ఇదే విధముగా
జరుగుతుంది. ఈ విధముగా మీ ధారణను చేస్తూ పక్కాగా అవుతూ వెళ్ళండి. బాబా అన్నారు -
మ్యాగజైన్ లో కూడా వ్రాయండి, ఈ యుద్ధము ఇంతకుముందు కూడా జరిగింది, ఇందులో కొత్తేమీ
లేదు. ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా జరిగింది. ఈ విషయాలు కేవలం మీరు మాత్రమే
అర్థం చేసుకుంటారు, బయటివారు అర్థం చేసుకోలేరు. వారు కేవలము ఏమంటారంటే - ఈ విషయాలైతే
అద్భుతముగా ఉన్నాయి, అచ్ఛా, ఎప్పుడైనా వెళ్ళి వీటిని అర్థం చేసుకుంటాములే. పిల్లల
కోసము శివ భగవానువాచ. ఈ విధమైన పదాలు ఉన్నట్లయితే వాళ్ళు వచ్చి అర్థం చేసుకుంటారు
కూడా. ప్రజాపిత బ్రహ్మాకుమార, కుమారీలు అన్న పేరు వ్రాసి ఉంది. ప్రజాపిత బ్రహ్మా
ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని అంటారు కదా. మరి
వారు ఏ బ్రాహ్మణులు? బ్రహ్మా సంతానము అంటే ఎవరు అనేది మీరు ఆ బ్రాహ్మణులకు కూడా
అర్థం చేయించవచ్చు. ప్రజాపిత బ్రహ్మాకు ఇంతమంది పిల్లలు ఉన్నారంటే తప్పకుండా వారు ఈ
సమయములో దత్తత తీసుకోబడి ఉంటారు. ఎవరైతే మన కులానికి చెందినవారు ఉంటారో, వారు బాగా
అర్థం చేసుకుంటారు. మీరైతే తండ్రికి పిల్లలుగా అయ్యారు. తండ్రి బ్రహ్మాను కూడా
దత్తత తీసుకుంటారు, లేదంటే ఈ శరీరము ఎక్కడి నుండి వస్తుంది. బ్రాహ్మణులే ఈ విషయాలను
అర్థం చేసుకుంటారు, సన్యాసులు అర్థం చేసుకోరు. అజ్మేర్ లో బ్రాహ్మణులు ఉంటారు మరియు
హరిద్వార్ లో అంతా సన్యాసులే సన్యాసులు. పండాలుగా బ్రాహ్మణులే ఉంటారు, కానీ వారు
ఎంతో లోభము కలిగి ఉంటారు. మీరు వారికి చెప్పండి - మీరు దైహికమైన పండాలు, ఇప్పుడు
ఆత్మిక పండాలుగా అవ్వండి. మీ పేరు కూడా పండాలే. పాండవ సేన అన్న పదము అర్థాన్ని కూడా
అర్థం చేసుకోరు. బాబా పాండవుల శిరోమణి వంటివారు. వారు అంటారు - ఓ పిల్లలూ,
నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు మీ ఇంటికి
వెళ్ళిపోతారు. ఆ తర్వాత అమరపురికి పెద్ద యాత్ర జరుగుతుంది. మూలవతనపు యాత్ర ఎంత
పెద్దగా ఉంటుంది. ఆత్మలన్నీ అక్కడికి వెళ్తాయి. తేనెటీగలు గుంపుగా వెళ్తాయి కదా,
అక్కడ ఆ రాణి ఈగ ఎగురుతూ వెళ్ళినట్లయితే మిగిలినవన్నీ గుంపుగా దాని వెనుక వెళ్తాయి.
ఇది ఒక అద్భుతము కదా. ఆత్మలన్నీ కూడా దోమల గుంపులా వెళ్తాయి. శివుని ఊరేగింపు ఉంది
కదా. మీరందరూ వధువులు. మీ అందరికీ తీసుకువెళ్ళేందుకు వరుడినైన నేను వచ్చాను. మీరు
అశుద్ధముగా అయిపోయారు, కావుననే మిమ్మల్ని అలంకరించి నాతోపాటు తీసుకువెళ్తాను. ఎవరైతే
అలంకరించుకోరో వారు శిక్షలు అనుభవిస్తారు. కానీ ప్రతి ఒక్కరూ వెళ్ళి తీరవలసిందే.
కాశీలోని కత్తుల బావిలోకి దూకి మనుష్యులు చనిపోతారు, అప్పుడు ఒక్క సెకండులో ఎన్ని
శిక్షలను అనుభవిస్తారు. మనుష్యులు ఎంతో ఆర్తనాదాలు చేస్తారు. ఇక్కడ కూడా అలాగే
ఉంటుంది. నేను జన్మ-జన్మాంతరాల దుఃఖాన్ని, శిక్షను అనుభవిస్తున్నాను అన్నట్లుగా
అనిపిస్తుంది. ఆ దుఃఖపు అనుభూతి అలా ఉంటుంది. జన్మ-జన్మాంతరాలుగా చేసిన పాపాలకు
శిక్ష లభిస్తుంది. ఎంతగా శిక్షలు అనుభవిస్తారో అంతగా పదవి తగ్గిపోతుంది, అందుకే బాబా
అంటారు, యోగబలముతో లెక్కాచారాలను సమాప్తము చేసుకోండి. స్మృతి ద్వారా జమ చేసుకుంటూ
వెళ్ళండి. జ్ఞానమైతే చాలా సహజమైనది. ఇప్పుడు ఇక ప్రతి కర్మను జ్ఞానయుక్తముగా
ఆచరించాలి. దానము కూడా పాత్రులకే ఇవ్వాలి. పాపాత్ములకు దానము ఇచ్చినట్లయితే
ఇచ్చినవారిపై కూడా దాని ప్రభావము పడుతుంది. వారు కూడా పాపాత్ములుగా అయిపోతారు. మీరు
ఇచ్చిన ధనముతో పాపాలు చేసేవారికి దానమెప్పుడూ ఇవ్వకూడదు. పాపాత్ములకు ఇచ్చేవారైతే
ప్రపంచములో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మీరైతే ఆ విధముగా చేయకూడదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు ప్రతి కర్మను జ్ఞానయుక్తముగా చేయాలి, పాత్రులకే దానమివ్వాలి.
పాపాత్ములతో ఇప్పుడు ధనము మొదలైనవాటికి సంబంధించిన ఇచ్చిపుచ్చుకోవడాలేవీ చేయకూడదు.
యోగబలముతో పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తము చేసుకోవాలి.
2. అపారమైన సంతోషములో ఉండేందుకు మీతో మీరే మాట్లాడుకోవాలి - బాబా, అపారమైన సుఖపు
ఖజానాను ఇచ్చేందుకు మీరు వచ్చారు. మీరు మా జోలిని నింపుతున్నారు. మీతోపాటు ముందు
మేము శాంతిధామానికి వస్తాము, ఆ తరువాత మళ్ళీ మా రాజధానిలోకి వెళ్తాము.
వరదానము:-
సమస్యలను సమాధాన రూపములోకి పరివర్తన చేసే విశ్వకళ్యాణి భవ
నేను విశ్వకళ్యాణిని - ఇప్పుడు ఈ శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ
కామన యొక్క సంస్కారాన్ని ఇమర్జ్ చేయండి. ఈ శ్రేష్ఠ సంస్కారము ముందు హద్దు సంస్కారాలు
స్వతహాగా సమాప్తమైపోతాయి. సమస్యలు సమాధాన రూపములోకి పరివర్తన అయిపోతాయి. ఇప్పుడు ఇక
యుద్ధములో సమయాన్ని పోగొట్టుకోకండి, విజయీతనపు సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి.
ఇప్పుడు సర్వస్వాన్ని సేవలో పెట్టినట్లయితే శ్రమ నుండి విముక్తులవుతారు. సమస్యలలోకి
వెళ్ళేందుకు బదులుగా దానమివ్వండి, వరదానాలు ఇవ్వండి, అప్పుడు స్వయం యొక్క గ్రహణము
స్వతహాగా సమాప్తమవుతుంది.
స్లోగన్:-
ఎవరివైనా బలహీనతలను, లోపాలను వర్ణన చేసేందుకు బదులుగా గుణ స్వరూపులుగా అవ్వండి,
గుణాలనే వర్ణన చేయండి.
అవ్యక్త ప్రేరణలు -
సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి
బాబాకు పిల్లలంటే ఎంత
ప్రేమ అంటే అమృతవేళ నుండే పిల్లలను పాలన చేస్తారు. రోజు యొక్క ఆరంభమే ఎంత
శ్రేష్ఠముగా ఉంటుంది! స్వయం భగవంతుడే మిలనము జరుపుకునేందుకు పిలుస్తారు, ఆత్మిక
సంభాషణ చేస్తారు, శక్తులను నింపుతారు! బాబా యొక్క ప్రేమ గీతాలు మిమ్మల్ని లేపుతాయి.
మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ, రండి... అని ఎంత స్నేహముతో పిలుస్తారు మరియు
నిద్ర నుండి లేపుతారు. మరి ఈ ప్రేమ పాలనకు ప్రాక్టికల్స్వరూపము ‘సహజయోగీ జీవితము’.
| | |