23-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
31.03.2011
‘‘దృఢ సంకల్పము ద్వారా ‘‘టెన్షన్ ఫ్రీ’’ యొక్క
ఉదాహరణగా అయ్యి అందరికీ ఆధారమూర్తులుగా అవ్వండి, మనసా శక్తి
ద్వారా దుఃఖముతో ఉన్న ఆత్మలకు సంతోషము యొక్క వరదానము ఇవ్వండి’’
ఈ రోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కోట్లలో కొద్దిమంది,
కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన తమ పిల్లల భాగ్య రేఖలను
చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకములో ప్రకాశిస్తూ ఉన్న,
దివ్యమైన మెరుస్తున్న సితారల యొక్క మెరుపును చూస్తున్నారు.
నయనాలలో స్నేహపు రేఖను చూస్తున్నారు. నోటిలో జ్ఞాన రేఖను
చూస్తున్నారు. హృదయములో హృదయాభిరాముడి లవలీన రేఖను చూస్తున్నారు.
చేతులలో జ్ఞాన ఖజానాల రేఖను చూస్తున్నారు. పాదాలలో ప్రతి
అడుగులోనూ పదమాల రేఖను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ
రేఖలలో నంబరువారుగా సంపన్నముగా ఉన్నారు. ఇటువంటి భాగ్యము మీకు
తప్ప మరెవ్వరికీ లేదు. మీ ఇంతటి శ్రేష్ఠ భాగ్యము ప్రతి బిడ్డ
నుండి మెరుస్తూ కనిపిస్తుంది మరియు ఈ భాగ్యము అవినాశీగా
అయిపోతుంది, ఎందుకని? ఎందుకంటే ఇచ్చేవారు అవినాశీ తండ్రి. ఈ
సంగమయుగములోనే ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము ప్రాప్తిస్తుంది, ఇది
భవిష్యత్తులో కూడా నడుస్తూ ఉంటుంది. ఈ సంగమయుగము సర్వ
ప్రాప్తుల యుగము. ఎవరు ఎంతగా తమ భాగ్యాన్ని జమ చేసుకుంటారో,
అంతగా అనేక జన్మలు భాగ్యము యొక్క ఫలము ప్రాప్తిస్తూ ఉంటుంది. ఈ
సంగమయుగ మహిమ గురించి పిల్లలైన మీకే తెలుసు. సంగమయుగ ప్రాప్తులు
పూర్తి కల్పములో శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవి.
పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ సంగమయుగ ప్రాప్తులతో ఎంత సంపన్నముగా
ఉన్నారు? అన్నదానిని బాప్ దాదా చూస్తున్నారు. మీరందరూ కూడా
సర్వ ప్రాప్తుల అనుభవాలలో సదా ఉంటున్నారా లేక అప్పుడప్పుడూనా?
అవినాశీ తండ్రి కనుక ప్రాప్తులు కూడా అవినాశీ అయినవి. బాప్ దాదా
ప్రతి బిడ్డను ఏ రూపములో చూడాలనుకుంటున్నారు, తెలుసు కదా! బాప్
దాదా కోరుకుంటున్నారు - ప్రతి బిడ్డ స్వరాజ్య అధికారీ రాజుగా
అవ్వాలి. స్వయం పైన అనగా కర్మేంద్రియాల పైన,
మనసు-బుద్ధి-సంస్కారాల పైన రాజుగా అయ్యి రాజ్యము చెయ్యాలి.
భవిష్యత్తులో అయితే రాజ్యాధికారిగా అవుతారు కానీ ఇప్పుడు
స్వరాజ్య అధికారీ రాజుగా అవ్వాలి. ఏ కర్మేంద్రియమైనా మీ
కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే బాబా ద్వారా సర్వ శక్తుల ఖజానా
ప్రాప్తించింది. కావున బాప్ దాదా ప్రతి బిడ్డను స్వరాజ్య
అధికారీ రాజు రూపములో చూడాలని కోరుకుంటున్నారు. మరి మీరందరూ
స్వరాజ్య అధికారులుగా అయ్యారా? మనసు, బుద్ధిపై రూలింగ్ పవర్,
కంట్రోలింగ్ పవర్ వచ్చాయా? ఆధీనత అయితే లేదు కదా? మీరు
అధికారులు. బాప్ దాదాను తోడుగా పెట్టుకున్నప్పుడు, ఒంటరిగా
అవ్వనప్పుడు, బాబాను సదా సహచరునిగా చేసుకుని పెట్టుకున్నట్లయితే,
అప్పుడు ఈ మనసు-బుద్ధి-సంస్కారాలు, వేటికీ కూడా కంట్రోల్లో
లేకుండా ఉండేంత శక్తి ఉండదు. అందుకే బాప్ దాదా శక్తులకు సదా
ఏమని చెప్తారంటే - తండ్రి తోడును మర్చిపోకుండా ఉండేందుకు మీ
యొక్క ఏ స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి? అదేమిటంటే - నేను
శివశక్తిని. శివుడు మరియు శక్తి, ఇరువురూ కలిసి ఉన్నారు. ఈ
స్మృతి మాయాజీతులుగా, ప్రకృతీజీతులుగా స్వతహాగా చేస్తుంది
ఎందుకంటే బాప్ దాదా వినిపించి ఉన్నారు - వర్తమాన సమయములో
ప్రకృతి తన పని చేస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రకృతిని కూడా
మనుష్యాత్మలు విసిగిస్తున్నారు కావున ప్రకృతి కూడా విసిగిస్తూ
ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రకృతి ఎక్కడో ఒక చోట తన కార్యాన్ని
చేస్తూ ఉండటాన్ని చూస్తూనే ఉన్నారు, కానీ మీరు ప్రకృతీజీతులుగా
అయ్యి ప్రకృతిని కూడా సతోప్రధానముగా చేస్తున్నారు. లోకులైతే
ప్రకృతి అలజడులను చూసి రేపు ఏమవుతుందా అని భయపడుతూ ఉంటారు! కానీ
అంతా ఎంతో మంచి జరగనున్నది అని మీకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఈ
సంగమయుగము అనగా సృష్టి చక్రము యొక్క అమృతవేళ జరుగుతుంది. మరి
అమృతవేళ తర్వాత ఏమి వస్తుంది? ఉదయము. అంధకారము సమాప్తమై
ప్రకాశము వస్తుంది. కావున - ఇప్పుడిక మా రాజ్యము, సుఖమయ
ప్రపంచము, ఎక్కడైతే ప్రకృతి కూడా సుఖమయముగా ఉంటుందో, ఆ రాజ్యము
ఇక రానున్నది అని మీకు సంతోషముగా ఉంది. సంతోషముగా ఉంది కదా! ఆ
రాజ్యములో దుఃఖము, అశాంతి యొక్క నామ-రూపాలు కూడా ఉండవు ఎందుకంటే
ఇప్పుడు సంగమములో మీరు ప్రకృతీజీతులుగా అవుతున్నారు. మరి
అందరికీ సంతోషముగా ఉంది కదా, ఏ విషయములో? చెప్పండి, మా రాజ్యము
రానున్నది. ఈ సంతోషము ఉందా? ఎవరైతే ఈ సంతోషములో ఉంటారో వారు
చేతులెత్తండి. చాలా మంచిది. మీరైతే సంతోషముగా ఉంటున్నారు,
ఇందుకు అభినందనలు. కానీ ఇటువంటి సంతోషాన్ని, మీ సంతోషాన్ని
దుఃఖముతో అశాంతిగా ఉన్న మీ సోదరీ-సోదరులకు మీ తండ్రి నుండి
తీసుకున్న కిరణాల ద్వారా సంతోషపు కిరణాలను అందజేస్తున్నారా?
బాప్ దాదా ఏమన్నారంటే - ఇటువంటి మనసా సేవను చేసేందుకు సమయాన్ని
ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఫిక్స్ చేసుకోవాలి. ఎలా అయితే ఇతర
కార్యాల కోసం సమయము ఫిక్స్ చేసుకున్నారో, అలా మీ సంతోషపు ఔషధము
ద్వారా దుఃఖములో ఉన్న ఆత్మలకు మనసా శక్తి ద్వారా కొద్దిగా
వరదానాలను ఇచ్చి వారిని కూడా సంతోషపరచండి. మరి ఎవరైతే తమ
సమయాన్ని మనసా సేవ కోసం ఫిక్స్ చేసుకున్నారో, వారు చేతులెత్తండి.
అచ్ఛా, ఎవరైతే ఫిక్స్ చేసుకోలేదో, వారు కూడా కొద్దిమంది ఉన్నారు.
కానీ ప్రతి ఒక్కరూ దాని కోసం సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి
ఎందుకంటే మన సోదర-సోదరీలే కదా. దయ కలుగుతుంది కదా! లేక దయ కలగడం
లేదా? కలుగుతుంది కదా! మరియు బాప్ దాదా అందరినీ
చూడాలనుకుంటున్నారు - సంగమములో ఏవైతే విశేషమైన రెండు విషయాలు
ఉన్నాయో, అవి అమూల్యమైనవి, ఒకటి సంకల్ప శక్తి మరియు రెండవది,
సంగమ సమయము ఎందుకంటే సంగమ సమయములో ఒక్క జన్మలో అనేక జన్మల
ప్రారబ్ధాన్ని తయారుచేసుకోవాలి. ఈ రోజుల్లో బాప్ దాదా ఏమి
చూసారంటే, చాలామందికి అశుద్ధ సంకల్పాలు తక్కువగా నడుస్తాయి కానీ
వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఈ ఒక్క జన్మ యొక్క విలువ
అనుసారముగా వ్యర్థ సంకల్పాలు ఇప్పుడు సమాప్తమైపోవాలి ఎందుకంటే
సంగమయుగ మహత్వము అనుసారముగా ఒక్క క్షణము ఎంతో విలువైన సమయానికి
అధికారిగా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ రెండు విషయాలను -
సమయము మరియు సంకల్పాలు, ఈ రెండింటి విలువను తెలుసుకుని సమయాన్ని
మరియు సంకల్పాలను సఫలం చేయండి. ఏ విధముగా స్థూల ఖజానాలను సఫలం
చేసుకుంటారో, అలా సఫలం చేసుకోండి. ఈ ఒక్క జన్మలో సఫలం
చేసుకున్నట్లయితే అనేక జన్మల కొరకు దాని ప్రాప్తి జమ అవుతుంది.
ఈ విధముగా ఈ రెండు విషయాల పట్ల అటెన్షన్ పెడుతూ సఫలం చేసి
సఫలతామూర్తులుగా అవ్వండి.
బాప్ దాదా ప్రతి బిడ్డకు ఈ రోజు విశేషముగా ఒక వరదానాన్ని
ఇస్తున్నారు - ప్రతి బిడ్డ ఈ రోజు నుండి స్వయాన్ని టెన్షన్ ఫ్రీ
చేసుకోగలరా? దృఢ సంకల్పము చేయండి - ఈ రోజు నుండి అటెన్షన్, నో
టెన్షన్. బాప్ దాదా పిల్లలను టెన్షన్ లో ఉండటాన్ని చూసినప్పుడు,
అదే సమయములో ఆ పిల్లల ఫోటోను తీసి వారికి పంపించాలని బాప్
దాదాకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు - నేనెలా అయిపోయాను అని
తమంతట తమకే అర్థమవుతుంది. బాప్ దాదా మన్ జీతులుగా, జగజ్జీతులుగా
చేయాలని కోరుకుంటున్నారు. టెన్షన్ ఎక్కడ వస్తుంది, మనసులోనే
వస్తుంది కదా! మరి మీరైతే రాజులు కదా, స్వరాజ్య అధికారులు కదా!
మనసు మీదా లేక మనసు యజమానినా? మీరేమంటారు? రోజంతా నా మనసు అని
అంటారు కదా! మనసు మీకు యజమాని కాదు కదా! ఎవరు ధైర్యము ఉంచగలరు?
బాబా వరదానమైతే సహజముగానే లభిస్తుంది కానీ కేవలం కొద్దిగా
అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది. బాబా ఇచ్చిన వరదానము యొక్క
సహాయాన్ని అనుభవం చేసి చూడండి. ఎప్పుడు చూసినా కానీ అందరి
ముఖాలు ఎలా కనిపించాలి? టెన్షన్ ఫ్రీగా, కమల పుష్ప సమానముగా
మరియు వికసించిన గులాబీ పుష్పము వలె కనిపించాలి.
బాప్ దాదా చూసారు - పర్సెంటేజ్ వ్రాసే పని ఏదైతే బాబా ఇచ్చి
ఉన్నారో, అన్ని స్థానాల నుండి కొంత-కొంత సమాచారము వచ్చింది.
ఇక్కడ కూడా రిజల్టు తయారుచేసారు. అటెన్షన్ పెట్టినందుకు బాప్
దాదా అభినందనలు తెలియజేస్తున్నారు కానీ బాప్ దాదా ఇప్పుడు ఇదే
కోరుకుంటున్నారు, సమయమనుసారముగా ఇప్పుడు వాణి ద్వారా వినేందుకు
కూడా సమయము తక్కువగా లభిస్తుంది, అందుకే మనసా ద్వారా మరియు మీ
ముఖము మరియు నడవడిక ద్వారా సేవ చేయండి. ఇప్పటి అభ్యాసము
మున్ముందు రాబోయే సమయములో ఉపయోగపడుతుంది. మరి ఈ రోజు నుండి
టెన్షన్ ఫ్రీ యొక్క సంకల్పాన్ని చేయగలరా? చేయగలరా? చేతులెత్తండి.
టెన్షన్ ఫ్రీ. అచ్ఛా, అందరి ఫోటో తీయండి. చాలా మంచిది. ఏ
ఆత్మలైతే పరిస్థితుల అనుసారముగా చాలా టెన్షన్ లో ఉంటారో, ఈ
రోజుల్లో ప్రపంచములో టెన్షన్ బాగా పెరిగిపోతుంది, మీ టెన్షన్
ఫ్రీ అనుభవము, టెన్షన్ ఫ్రీ నడవడిక మరియు ముఖము వారి ఎదురుగా
ఒక ఆధారమూర్తిగా అవుతుంది. ఒకవేళ ఈనాటి ప్రపంచాన్ని చుట్టి
వచ్చినా లేక సమాచారము విన్నా ఏమి కనిపిస్తుంది? తాత్కాలికముగా
తమను తాము సంతోషపరుచుకోవడానికి సాధనాలు తయారుచేస్తూ ఉన్నారు.
కావున టెన్షన్ లో ఉన్నవారికి టెన్షన్ ఫ్రీ యొక్క ఉదాహరణగా అయ్యి
చూపించండి. అప్పుడు వారికి కూడా ఆధారము కనిపిస్తుంది. మరి
సంకల్పము చేసారా, టెన్షన్ ఫ్రీ గా ఉంటాము అని మీ మనసులో
సంకల్పము చేసారా? చేసారా? దృఢముగా చేసారా లేక సాధారణముగా చేసారా?
ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. చేస్తాము కాదు,
చేయాల్సిందే. ఇష్టమేనా? ఇందులో చేతులెత్తండి.
బాప్ దాదా ఒక విషయము ఏమి చూసారంటే, చేతులెత్తి చాలా
సంతోషపరుస్తారు. చేతులెత్తి అయితే సంతోషపరిచారు కానీ ఇప్పుడు
ఏమి చేస్తారు? దృఢ సంకల్పానికి, సాధారణ సంకల్పానికి రాత్రికి
పగలుకు ఉన్నంత తేడా ఉంది. చేస్తారు మరియు చేయవలసిందే. మరి ఈ
సీజన్ లో ఈ సంవత్సరానికి ఈ రోజు చివరి రోజు, కానీ రాబోయే సీజన్
లో బాప్ దాదా ప్రతి చిన్న-పెద్ద సెంటర్లు, మధ్యలో చాలా సమయము
ఉంది, వచ్చే సంవత్సరము యొక్క సీజన్ లో కారణము కాకుండా నివారణ
స్వరూపులుగా మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నారు. మరి బ్రాహ్మణ
పరివారములో టెన్షన్ యొక్క నామ-రూపాలు కూడా ఉండకూడదు అని ఎంత
ధైర్యము మరియు ఉల్లాసము ఉన్నాయి. వీలవుతుందా? ప్రతి ఒక్కరూ
స్వయాన్ని ప్రశ్నించుకోండి, వీలవుతుందా? ఈ శుభవార్తను బాప్ దాదా
వినాలని కోరుకుంటున్నారు.
బాప్ దాదా ఏమి చూసారంటే - చేయాలి అన్న కోరికైతే అందరూ
పెట్టుకుంటారు, కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మిమ్మల్ని
తనదిగా చేసుకుంటుంది. అప్పుడు చాలా మధురమైన మాటలను వినిపిస్తారు,
ఇలా జరిగిపోతుంది కదా, ఇదైతే అవుతుంది కదా, ఇదైతే నడుస్తుంది
కదా! బాప్ దాదాకు చాలా మధురాతి మధురమైన మాటలను వినిపిస్తారు.
అన్నింటికీ నివారణ ఒక్కటే, రాజుగా అయిపోండి, చాలు. స్వరాజ్య
అధికారిగా అయిపోండి. ఈ రోజు బాప్ దాదా పిల్లలందరికీ, ఎదురుగా
కూర్చున్నవారికైనా, దూరముగా ఉంటూ హృదయములో కూర్చున్నవారికైనా,
మీరైతే కళ్ళ ఎదురుగా ఉన్నారు, కానీ దూరముగా కూర్చుని ఉన్నవారిని
బాప్ దాదా తమ హృదయములో చూస్తున్నారు.
ఈ రోజు మధుబన్ లో కూడా చిన్న-చిన్న గీతా పాఠశాలలు ఏర్పాటు
చేయబడ్డాయని బాప్ దాదాకు తెలుసు. పిల్లలు వచ్చారు. కింద
కూర్చున్నవారికి, ఎక్కడెక్కడో కూర్చున్నవారికి అన్నింటికన్నా
ముందుగా బాప్ దాదా చాలా చాలా చాలా హృదయము యొక్క ప్రేమను మరియు
ప్రియస్మృతులను ఇస్తున్నారు. (ఈ రోజు శాంతివన్ లో 28 వేల కంటే
ఎక్కువమంది సోదరీ-సోదరులు చేరుకున్నారు) బాప్ దాదా చూసారు,
పిల్లలు కొద్దిగా కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చింది, కానీ ఈ
కష్టాన్ని కూడా సంతోషము కారణముగా అనుభవం చేయడం లేదు.
అయినప్పటికీ ప్రశాంతముగా పడుకోవడానికి మూడు అడుగుల నేల అయితే
లభించింది కదా. ఎవరైతే పట్రాణీగా అయ్యారో (నేల మీద పడుకున్నారో)
వారికి బాప్ దాదా విశేషమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. అచ్ఛా,
ఎవరైతే ఈ రోజు మొదటిసారిగా మధుబన్ కు వచ్చారో లేక బాప్ దాదాను
మొదటిసారిగా కలుసుకోవడానికి వచ్చారో, వారు లేవండి. ఈ రోజు
మొదటిసారిగా వచ్చిన పిల్లలకు బాప్ దాదా కొత్త బ్రాహ్మణ
పరివారములోకి విచ్చేసినందుకు తమ తరఫున మరియు బ్రాహ్మణ పరివారము
తరఫున చాలా చాలా అభినందనలను తెలియజేస్తున్నారు ఎందుకంటే టూ లేట్
సమయములో వచ్చారు, కానీ వచ్చేసారు కదా. బాప్ దాదాను మరియు
పరివారాన్ని అయితే చూసారు కదా. బాప్ దాదా ఏమని భావిస్తున్నారంటే,
మీరు కావాలనుకుంటే ఈ రోజు మొదటిసారిగా వచ్చినవారికి ఒక విశేష
వరదానము ఉంది, ఒకవేళ మనస్ఫూర్తిగా కావాలనుకుంటే - లాస్ట్ సో
ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ గా ముందుకు రాగలరు. బాప్ దాదాకు మరియు
పరివారానికి ఆత్మలైన మీ అందరి పట్ల ప్రేమ ఉంది. మీకు సహయోగిగా
అవుతారు, స్నేహాన్ని ఇస్తారు మరియు మిమ్మల్ని ముందుకు పంపుతారు.
అవకాశాన్ని ఇస్తారు. అందుకే ఈ రోజు వచ్చినవారికి ముందుకు వెళ్ళే
అవకాశము డ్రామా అనుసారముగా చాలా బాగా లభించగలదు. మీరు ఎక్కడి
నుండి వచ్చినా కానీ పూర్తి పరివారమంతా మీకు సహయోగిగా అవుతుంది.
మీరు సహజయోగిగా అవ్వండి. అచ్ఛా!
సేవా టర్న్ రాజస్థాన్ మరియు భోపాల్
జోన్ వారిది:-
రాజస్థాన్ ధరణి బ్రహ్మాబాబాకు చాలా ఇష్టమనిపించింది, అందుకే
రాజస్థాన్ లోనే మధుబన్ ను తయారుచేసారు. రాజస్థాన్ లోని ప్రతి
స్థానములోనూ ఇప్పుడు సేవ బాగా వృద్ధి అవ్వడాన్ని బాప్ దాదా
చూసారు. కొత్త-కొత్త ఆత్మలకు బాబా సందేశాన్ని ఇచ్చే
ప్రోగ్రామ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. కానీ బాప్ దాదా అందరికీ
ఏమని చెప్తున్నారంటే, ప్రతి సేవాకేంద్రము యజ్ఞ స్నేహీ వారసులను,
ఎటువంటి గ్రూపును తయారుచేయాలంటే, స్వయం కూడా ముందుకు వెళ్తూ
ఇతరులను కూడా యజ్ఞ స్నేహీగా చేయాలి. క్రితంసారి కూడా బాప్ దాదా
ఏమన్నారంటే, యజ్ఞ స్నేహీ, సేవా స్నేహీ మరియు సఫలం చెయ్యడములో
సదా చాలా ముందుకు వెళ్ళేవారి సంఖ్య వృద్ధి అవుతుంది, మంచిది.
సందేశాన్ని ఇచ్చే కార్యములో ప్రతి ఒక్కరూ ఉల్లాస-ఉత్సాహాలలో
ఉన్నారు. ఇప్పుడు బాప్ దాదా ఇదే చూడాలని కోరుకుంటున్నారు, స్వ
మరియు సేవ, రెండింటిలోనూ బ్యాలెన్స్ పెట్టేవారు ప్రతి
సెంటరులోనూ చాలా ముందుకు రావాలి. కేవలం సేవ కాదు, స్వ మరియు
సేవ, ఎందుకంటే ఇప్పుడు స్వ పరివర్తనకు అంత ఎక్కువ సమయము లేదు.
అందుకే ముందు స్వ, దానితోపాటు సేవ. ప్రతి సేవాకేంద్రము
నిర్విఘ్నముగా, తోటివారందరూ నిర్విఘ్నముగా, కేవలం టీచరే కాదు,
కానీ పూర్తి క్లాస్ అంతా నిర్విఘ్నముగా ఉండాలి మరియు స్వ
పరివర్తన పట్ల అటెన్షన్ పెట్టేవారిగా ఉండాలి. మరి ఈ వృద్ధిని
చేయండి. ఒక్కొక్కరి విషయాలను వినండి మరియు వారికి
ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలను పెట్టండి, ఇలా బాప్ దాదాకు
నిర్విఘ్న సెంటరు గురించి సమాచారము ఇవ్వగలగాలి. ఇకపోతే బాప్
దాదా చూసారు, రాజస్థాన్ కూడా ముందుకు వెళ్తూ ఉంది, వెళ్తూ
ఉంటుంది. బాప్ దాదా ప్రతి బిడ్డకు ముందుకు వెళ్తున్నందుకు
అభినందనలను తెలియజేస్తున్నారు.
భోపాల్ జోన్:-
అచ్ఛా, ఈ జోన్ కూడా తమ పరివర్తన మరియు సేవా
వృద్ధిలో బాగా ముందుకు వెళ్తున్నారు. ప్రతి బిడ్డ స్వ కోసం కూడా
ప్లాన్ ను తయారుచేసుకుంటున్నారు మరియు ప్రాక్టికల్ లోకి కూడా
తీసుకువస్తున్నారు అన్న విషయములో బాప్ దాదాకు సంతోషముగా ఉంది.
అంతేకాక, బాబా యొక్క శుభ ఆశ ఏమిటంటే, పిల్లలు సదా ముందుకు
వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి అన్నది ప్రతి
ఒక్క జోనులోనూ కనిపిస్తుంది, అందుకే సేవలో తమ-తమ స్థానాలలో
వృద్ధిని తీసుకువస్తున్నారు. బాప్ దాదా భవిష్యత్తు కోసం కూడా
అభినందనలను తెలియజేస్తున్నారు, ముందుకు వెళ్తూ ఉండండి, ఎగురుతూ
ఉండండి, ఎగిరేలా చేస్తూ ఉండండి. అచ్ఛా!
డబుల్ విదేశీ సోదరీ-సోదరులతో:-
విదేశీయుల వద్దకు పరీక్షలైతే
వస్తాయి, కానీ వారిలోని ఒక విశేషత ఏమిటంటే, వారు సత్యమైన
హృదయముతో చెప్పేస్తారు, లోపల పెట్టుకోరు, అంతేకాక దానిని
సమాధానపరచడము కూడా సత్యమైన హృదయముతో చేస్తూ ఉంటారు. ఈ విషయములో
బాప్ దాదా సంతోషిస్తున్నారు. సత్యమైన హృదయము ఉన్నప్పుడు హజూర్
హాజరైపోతారు. మంచి రిజల్టును చూసి బాప్ దాదా అభినందనలను కూడా
తెలియజేస్తున్నారు మరియు సదా ముందుకు వెళ్తూ ఉంటారు అన్న
వరదానాన్ని కూడా ఇస్తున్నారు. టీచర్లు కూడా మంచి కృషి
చేస్తున్నారు. మధుబన్ లాభాన్ని అందరికంటే ఎక్కువగా విదేశీయులే
తీసుకుంటున్నారు అన్న విషయములో బాప్ దాదాకు సంతోషము కలుగుతుంది.
విదేశాలలోని చిన్న-చిన్న స్థానాలలో కూడా ప్రసిద్ధముగా
సందేశాన్ని వినిపించే సేవను ఆరంభించడాన్ని బాప్ దాదా చూసారు.
కావున సేవకు అభినందనలు, స్వ పరివర్తనకు అభినందనలు. ఎగురుతూ
ఉండండి మరియు ఎగిరేలా చేస్తూ ఉండండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న దేశ-విదేశాలలోని పిల్లలు పురుషార్థములో సహజముగా
ముందుకు వెళ్తున్నందుకు, ముందుకు తీసుకువెళ్తున్నందుకు బాప్
దాదా విశేషమైన అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే
సమయము రాబోతుందో, దాని కోసం బాప్ దాదా ఏ డైరెక్షన్ ఇచ్చారంటే -
తీవ్ర పురుషార్థులుగా అయ్యి సెకండులో బిందువు పెట్టడము, ఫుల్
స్టాప్ పెట్టడము, ఈ అభ్యాసము అత్యంత అవసరము. దీనిని తేలికగా
తీసుకోకండి. అకస్మాత్తుగా ఏదో ఒకటి జరగవలసిందే. అందుకే బాబా
యొక్క శుభ ఆశ ఏమిటంటే - ప్రతి బిడ్డ కలిసి ఉన్నారు, కలిసి
వెళ్తారు, బ్రహ్మాబాబాతో కలిసి రాజ్యము చేస్తారు. శివబాబా
సాక్షీగా అయిపోతారు. కలిసి ఉండేవారిగా అయ్యేదుంటే బాప్ దాదా
సమానముగా అవ్వవలసిందే. అచ్ఛా - ప్రతి బిడ్డకు బాప్ దాదా తరఫు
నుండి ఈ సంవత్సరానికి అభినందనలు మరియు రాబోయే సంవత్సరానికి కూడా
సదా బాబా సమానముగా అవ్వవలసిందే అన్న అభినందనలు. అచ్ఛా.
వరదానము:-
మనన శక్తి ద్వారా శక్తిశాలిగా అయి
విఘ్నాల ఫోర్సును సమాప్తము చేసే సర్వ ఆకర్షణ ముక్త భవ
వర్తమాన సమయములో మనన శక్తి ద్వారా
ఆత్మలో సర్వ శక్తులను నింపుకునే అవసరముంది. దీని కోసం
అంతర్ముఖులుగా అయి ప్రతి పాయింటును మననము చేయండి, అప్పుడు
వెన్న వస్తుంది మరియు మీరు శక్తిశాలిగా అయిపోతారు. ఇటువంటి
శక్తిశాలి ఆత్మలు అతీంద్రియ సుఖము యొక్క ప్రాప్తిని అనుభవము
చేస్తారు, వారిని అల్పకాలికమైనది ఏదీ కూడా తనవైపుకు
ఆకర్షించలేదు. వారి మగ్న అవస్థ ద్వారా ఏదైతే ఆత్మికతతో కూడిన
శక్తిశాలి స్థితి తయారవుతుందో, దాని ద్వారా విఘ్నాల ఫోర్సు
సమాప్తమైపోతుంది.
స్లోగన్:-
బ్రాహ్మణ ప్రపంచములో అందరి గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేవారే
సింహాసనాధికారులుగా అవుతారు.
అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి
సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి
బ్రహ్మాబాబాకు మరియు శివబాబాకు విశేషముగా ఇష్టమైనది పవిత్రత.
కానీ పవిత్రత యొక్క నిర్వచనము చాలా శ్రేష్ఠమైనది మరియు
గుహ్యమైనది. పవిత్రత ఎక్కడైతే ఉంటుందో, అక్కడ నిశ్చయము,
సత్యత-స్వచ్ఛత, ఇవన్నీ వచ్చేస్తాయి. సంపూర్ణ పవిత్రత అంటేనే
అర్థము - స్వప్నమాత్రములో కూడా అపవిత్రత మనసును మరియు బుద్ధిని
టచ్ చేయకూడదు, అటువంటివారినే సత్యమైన వైష్ణవులు అని అంటారు.
|
|
|
|