ఓంశాంతి
పిల్లలందరూ ఈ పాటను విన్నారు. పిల్లలు అని అన్నప్పుడు బాబా బ్రాహ్మణులైన మన కోసమే
అంటున్నారని అన్ని సెంటర్లలోని పిల్లలకు తెలుసు - జీవిస్తూనే మెడలోని హారముగా
అయ్యేందుకని అనగా మూలవతనానికి వెళ్ళి బాబా ఇంట్లో ఉండేందుకని పిల్లలు ఈ పాటను
విన్నారు. అది శివబాబా ఇల్లు కదా, అందులో సాలిగ్రామాలందరూ ఉంటారు. తప్పకుండా ఆ
బాబాయే వచ్చి ఉన్నారని బ్రాహ్మణ కులభూషణులైన, స్వదర్శన చక్రధారులైన పిల్లలకు తెలుసు.
ఇప్పుడు మీరు అశరీరిగా అవ్వాలి అనగా దేహ భానాన్ని మర్చిపోవాలి అని వారంటారు. ఈ పాత
ప్రపంచమైతే అంతమైపోతుంది. ఈ శరీరాన్ని అయితే విడిచిపెట్టాలి అనగా అందరినీ
విడిచిపెట్టాలి ఎందుకంటే ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది. కావున ఇప్పుడు తిరిగి ఇంటికి
వెళ్ళాలి. పిల్లలందరికీ ఇప్పుడు సంతోషము కలుగుతుంది, ఎందుకంటే అర్ధకల్పము బట్టి
ఇంటికి వెళ్ళేందుకని చాలా భ్రమించారు కానీ మార్గమేమీ లభించలేదు సరికదా, ఇంకా భక్తి
మార్గపు ఆర్భాటాలను చూస్తూ మనుష్యులు చిక్కుకుంటూ వచ్చారు. ఇది భక్తి మార్గపు ఊబి,
ఇందులో మనుష్యులు మెడ వరకు చిక్కుకుని ఉన్నారు. బాబా, మేము పాత ప్రపంచాన్ని, పాత
శరీరాన్ని మర్చిపోతాము, ఇప్పుడు అశరీరిగా అయి మీతోపాటు ఇంటికి వస్తాము అని
పిల్లలంటారు. మమ్మల్ని తీసుకువెళ్ళేందుకు పరమపిత పరమాత్మ పరంధామము నుండి వచ్చారని
అందరి బుద్ధిలోనూ ఉంది. వారు, కేవలం మీరు పవిత్రముగా అయి నన్ను స్మృతి చేయండి అని
చెప్తున్నారు. జీవిస్తూ మరణించాలి. అక్కడ ఆ ఇంటిలో ఆత్మలు నివసిస్తారని మీకు తెలుసు.
ఆత్మ అయితే బిందువు. నిరాకారీ ప్రపంచములోకి ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి, ఎంతమంది
మనుష్యులో అన్ని ఆత్మలు అక్కడ ఉంటాయి. ఆ మహాతత్వములో ఆత్మలు ఎంత చోటు తీసుకుంటాయి?
శరీరమైతే ఇంత పెద్దది, ఇది ఎంత చోటు తీసుకుంటుంది? అదే ఆత్మకైతే ఎంత చోటు కావాలి!
ఆత్మలమైన మనము ఎంత తక్కువ చోటును తీసుకుంటాము? చాలా తక్కువ. పిల్లలకు ఈ
విషయాలన్నింటినీ తండ్రి ద్వారా వినే సౌభాగ్యము ఇప్పుడు లభిస్తుంది. తండ్రియే అర్థం
చేయిస్తున్నారు - మీరు శరీరము లేకుండా వచ్చారు, తర్వాత శరీరాన్ని ధరించి పాత్రను
అభినయించారు, ఇప్పుడు మళ్ళీ జీవిస్తూనే మరణించాలి, అందరినీ మర్చిపోవాలి. తండ్రి
వచ్చి మరణించడము నేర్పిస్తారు. మీ తండ్రిని, మీ ఇంటిని స్మృతి చేయండి, బాగా
పురుషార్థము చేయండి అని చెప్తారు. యోగములో ఉండటముతో పాపాలు నశిస్తాయి. అప్పుడు ఆత్మ
తమోప్రధానము నుండి సతోప్రధానము అయిపోతుంది, అందుకే తండ్రి సలహా ఇస్తున్నారు,
కల్పక్రితం కూడా చెప్పారు, దేహపు సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి.
అందరి తండ్రి వారొక్కరే కదా. మీరు ప్రజాపిత బ్రహ్మాకు ముఖవంశావళి పిల్లలు, మీరు
జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. మీరు ఎలాగూ శివుని పిల్లలే. మేము భగవంతుని పిల్లలము
అన్న నిశ్చయమైతే అందరికీ ఉంది, కానీ వారి నామ, రూప, దేశ, కాలాలను మర్చిపోయిన
కారణముగా భగవంతుని పట్ల ఎవరికీ అంత ప్రేమ ఉండదు. దీనికి ఎవరినీ దూషించరు. ఇది కూడా
డ్రామాలో నిశ్చితమై ఉంది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఆత్మ అయిన నీవు ఎంత చిన్నని బిందువు, ఆ బిందువులో
84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఆత్మ ఏ విధముగా శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది
అనేది ఎంత అద్భుతము. ఇప్పుడు మీకు అనంతమైన పాత్ర గురించి తెలిసింది. ఈ జ్ఞానము
ఇంకెవ్వరికీ లేదు. మీరు కూడా దేహాభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు ఎంత పరివర్తనయ్యారు.
అది కూడా ప్రతి ఒక్కరి భాగ్యముపై ఆధారపడి ఉంటుంది. కల్పక్రితపు భాగ్యము ఇప్పుడు
సాక్షాత్కారమవుతోంది. ప్రపంచములో ఎంతమంది మనుష్యులు ఉన్నారు, ప్రతి ఒక్కరి భాగ్యము
ఎవరిది వారిదే. ఎవరు ఎలాంటి కర్మలు చేసారో, దాని అనుసారముగా దుఃఖమయంగా, సుఖమయంగా,
షావుకారులుగా, పేదవారిగా అవుతారు. అలా అయ్యేది ఆత్మనే. ఆత్మ ఏ విధముగా సుఖములోకి
వస్తుంది, మళ్ళీ ఏ విధముగా దుఃఖములోకి వస్తుంది అనేది తండ్రి కూర్చుని అర్థం
చేయిస్తున్నారు. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యే తెలివిని కల్పక్రితం వలె
తండ్రియే నేర్పిస్తారు. అప్పుడు ఎవరెంత తెలివిని పొందారో, ఇప్పుడు కూడా అంతే
పొందుతున్నారు. చివరి కల్లా ప్రతి ఒక్కరి భాగ్యాన్ని అర్థం చేసుకుంటారు, అప్పుడిక
కల్ప-కల్పము ప్రతి ఒక్కరి భాగ్యము ఇలాగే ఉంటుందని అంటారు. ఎవరైతే బాగా యోగయుక్తులుగా,
జ్ఞానయుక్తులుగా ఉంటారో - వారు సేవ కూడా చేస్తూ ఉంటారు. చదువులో సదా ఉన్నతి జరుగుతూ
ఉంటుంది. లౌకికములో కొందరు పిల్లలు త్వరగా ఉన్నతి పొందుతారు, కొందరు చాలా తలనొప్పిని
కలిగిస్తారు. ఇక్కడ కూడా అలానే ఉన్నారు. కల్పక్రితం వలె ఎవరెవరైతే ఉన్నతి పొందుతారో,
వారు దాగి ఉండలేరు. అందరి కనెక్షన్ శివబాబాతో ఉందని తండ్రికైతే తెలుసు కదా. వీరు (బ్రహ్మా)
కూడా పిల్లల కర్మలు చూసి అర్థం చేసుకుంటారు, అలాగే వారు (శివబాబా) కూడా చూస్తూ
ఉంటారు. వీరి నుండి ఎవరైనా దాచిపెట్టవచ్చు కానీ శివబాబా నుండి ఎవరూ దాచిపెట్టలేరు.
భక్తి మార్గములోనే పరమాత్మ నుండి దాచిపెట్టలేరంటే ఇక జ్ఞాన మార్గములో ఎలా
దాచిపెట్టగలరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - చదువైతే చాలా సహజమైనది, కర్మలు కూడా
చేయాలి, ఉండటము కూడా పాత ప్రపంచములో మిత్ర-సంబంధీకుల వద్దనే ఉండాలి. అక్కడ ఉంటూ కృషి
చేయాలి. ఒకవేళ ఎంతో తపన, ప్రేమ ఉన్నట్లయితే, ఇక్కడ ఉంటూ పురుషార్థము చేసేవారి కన్నా
అక్కడ ఇంటిలో ఉంటూ పురుషార్థము చేసేవారు చురుకుగా ముందు వెళ్ళగలరు. శాస్త్రాలలో
అర్జునుడు మరియు బోయవాడి (ఏకలవ్యుడు) ఉదాహరణ ఉంది కదా. ఏకలవ్యుడు బయట నివసించేవాడు
కానీ అభ్యాసముతో అతను బాణాలు వేయడములో అర్జునుడి కన్నా తెలివైనవాడిగా అయ్యాడు.
కావున గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండాలి. మీరు ఇటువంటి ఉదాహరణలను
కూడా చూస్తారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ చాలా మంచి సేవను చేయవచ్చు. అటువంటివారు చాలా
వృద్ధిని పొందుతూ ఉంటారు. ఇక్కడ ఉండేవారిని కూడా మాయ విడిచిపెట్టదు. బాబా వద్దకు
వస్తే విముక్తులైపోతారు అనేమీ కాదు. అలా కాదు. ప్రతి ఒక్కరి పురుషార్థము ఎవరిది
వారిదే. గృహస్థ వ్యవహారములో ఉండేవారు ఇక్కడ ఉండేవారి కన్నా మంచి పురుషార్థము చేయగలరు.
వారు చాలా మంచి ధైర్యాన్ని చూపించగలరు. ఎవరైతే గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప
సమానముగా అయి చూపిస్తారో, వారినే మహావీరులని అంటారు. బాబా, మీరైతే వదిలేశారు అని
అంటారు. బాబా అంటారు - నేనెక్కడ వదిలేసాను, మీరే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. బాబా
అయితే ఎవరినీ వదిలేసి రాలేదు. ఇంటికి ఇంకా ఎక్కువమంది పిల్లలు వచ్చారు. ఇకపోతే
కన్యలకైతే బాబా చెప్తున్నారు, మీరు ఈ ఈశ్వరీయ సేవ చేయండి. వీరు కూడా బాబానే, వారు
కూడా బాబానే. కుమారులు కూడా చాలామంది వచ్చారు కానీ నడవలేకపోయారు. కన్యలు ఎంతైనా
బాగానే ఉన్నారు. కన్య 100 మంది బ్రాహ్మణుల కన్నా ఉత్తమముగా భావించబడుతుంది. కావున
కన్యలు అనగా 21 కులాలను ఉద్ధరించేవారు, జ్ఞాన బాణాలను వేసేవారు. ఇకపోతే గృహస్థములో
ఉండేవారు కూడా బి.కె. లే, మున్ముందు వారి బంధనము కూడా సమాప్తమైపోతుంది. సేవ అయితే
చేయాలి కదా. కొంతమంది సేవ చేసే పిల్లలు బాప్ దాదా హృదయాన్ని అధిరోహించి ఉన్నారు,
వారు వేలాది మంది కళ్యాణాన్ని చేస్తున్నారు కావున ఇటువంటి సేవాధారి పిల్లలకు
ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. వారు హృదయాన్ని అధిరోహించి ఉంటారు. ఎవరైతే
హృదయములో ఉంటారో, వారే సింహాసనముపై కూర్చుంటారు. బాబా అంటారు, అందరికీ మార్గాన్ని
తెలియజేసేందుకు పరస్పరం కలుసుకుని యుక్తులను రచిస్తూ ఉండండి. చిత్రాలు కూడా తయారవుతూ
ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు.
ఇప్పుడు మీరు అర్థం చేయిస్తున్నారు, పరమపిత పరమాత్మ నిరాకారుడు, వారు కూడా
బిందువే, కానీ వారు నాలెడ్జ్ ఫుల్, పతిత-పావనుడు. ఆత్మ కూడా బిందువే. పిల్లలు ఎంతైనా
చిన్నగా ఉంటారు. తండ్రికి మరియు పిల్లలకు మధ్యన తేడా అయితే ఉంటుంది కదా. ఈ
రోజుల్లోనైతే 15-16 సంవత్సరాల వారు కూడా తండ్రి అయిపోతున్నారు, కానీ అప్పుడు కూడా
బిడ్డ అంటే తండ్రి కన్నా చిన్నగానే ఉంటారు కదా. ఇక్కడి విచిత్రము చూడండి - తండ్రి
కూడా ఆత్మనే, బిడ్డ కూడా ఆత్మనే. వారు సుప్రీమ్ ఆత్మ, నాలెడ్జ్ ఫుల్. మిగిలినవారంతా
తమ చదువు అనుసారముగా తక్కువ పదవిని లేక ఉన్నత పదవిని పొందుతారు. మొత్తమంతా చదువుపైనే
ఆధారపడి ఉంటుంది. మంచి కర్మలు చేసినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు
పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. స్వర్గములో కేవలం భారత్ మాత్రమే
ఉండేది, ఇంకే ఖండము ఉండేది కాదు. కావున చిన్న కొత్త భారత్ లో మన స్వర్గాన్ని
చూపించండి. ఉదాహరణకు ద్వారిక అన్న పేరు కాదు, లక్ష్మీ-నారాయణుల వంశస్థుల రాజ్యము అని
వ్రాయాలి. సత్యయుగములో మొదట దైవీ వంశస్థుల రాజ్యముంటుందని బుద్ధి కూడా చెప్తుంది.
వారికి గ్రామాలు ఉంటాయి, చిన్న-చిన్న ప్రాంతాలు ఉంటాయి. ఇది కూడా విచార సాగర మంథనము
చేయాలి. దీనితోపాటు శివబాబాతో బుద్ధియోగాన్ని కూడా జోడించాలి. మనము స్మృతి ద్వారానే
రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. స్మృతితోనే తుప్పు వదులుతుంది, ఇందులోనే శ్రమంతా ఉంది.
అనేకుల బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది, ఇక్కడ కూర్చున్నా కానీ పూర్తి సమయమంతా
స్మృతిలో ఉండలేరు, బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది. భక్తి మార్గములో కూడా ఇలాగే
జరుగుతుంది. శ్రీకృష్ణుని భక్తి చేస్తూ-చేస్తూ బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది.
నవవిధ భక్తి చేసేవారు సాక్షాత్కారము కోసం చాలా శ్రమిస్తారు. శ్రీకృష్ణుడు తప్ప
ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదని ఎన్ని గంటలు కూర్చుండిపోతారు, ఇందులో చాలా శ్రమ ఉంటుంది.
ఇక్కడ 8 మరియు 16108 మణుల మాలలు ఉంటాయి. వారు లక్షల మణిపూసల మాలను కూడా చూపిస్తారు.
కానీ జ్ఞాన మార్గపు మాల చాలా విలువైనది ఎందుకంటే ఇందులో ఆత్మిక శ్రమ ఉంది, భక్తి
మార్గపు మాల తక్కువ విలువైనది. శ్రీకృష్ణుడిని చూసి సంతోషములో నాట్యము చేస్తారు.
భక్తికి మరియు జ్ఞానానికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. శ్రీకృష్ణుడిని స్మృతి
చేస్తే తుప్పు వదులుతుంది అని మీకు ఇలా అర్థం చేయించడం జరగదు. ఎంతగా తండ్రిని స్మృతి
చేస్తారో, అంతగా పాపాలు నశిస్తాయని ఇక్కడ అర్థం చేయించడం జరుగుతుంది.
పిల్లలైన మీరు ఇప్పుడు యోగబలముతో విశ్వానికి యజమానిగా అవుతారు. స్వప్నములో కూడా
ఎవరికీ ఈ ఆలోచన రాదు. లక్ష్మీ-నారాయణులు యుద్ధాలు మొదలైనవేవీ చేయలేదు. మరి వారు
విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు? ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రి
అంటారు, యోగబలముతో మీకు రాజ్యము లభిస్తుంది. కానీ భాగ్యములో లేకపోతే పురుషార్థమే
చేయరు, సేవాధారులుగా అవ్వరు. ఈ విధముగా ప్రదర్శనీలు చేయండి అని బాబా అయితే సూచనలు
ఇస్తూనే ఉంటారు. తక్కువలో తక్కువ ఒక రోజులో 150-200 ప్రదర్శనీలు జరగాలి. అన్ని
గ్రామాలలోనూ తిరిగి రండి. ఎన్ని సెంటర్లు ఉన్నాయో అన్ని ప్రదర్శనీలు జరగాలి.
ఒక్కొక్క సెంటర్ లోనూ ప్రదర్శనీని ఏర్పాటు చేసినట్లయితే అర్థం చేయించడం సహజమవుతుంది.
చిత్రాలు మొదలైనవి పెట్టుకోగలిగేలా సెంటర్లు కూడా రోజురోజుకూ పెద్దవి అవుతూ ఉంటాయి.
చిత్రాలు కూడా కొత్తకొత్తగా తయారుచేస్తూ ఉంటారు. వైకుంఠ చిత్రాన్ని భారత్ లో
సుందరమైన మహళ్ళు మొదలైనవి ఉన్నట్లుగా తయారుచేయాలి. మున్ముందు అర్థం చేయించేందుకు
మంచి-మంచి చిత్రాలు వెలువడుతూ ఉంటాయి. వానప్రస్థావస్థ కలవారు నడుస్తూ-తిరుగుతూ కూడా
సేవ చేస్తూ ఉండాలి, ఎవరి భాగ్యము ఉదయిస్తే వారు వెలువడుతారు. కొంతమంది పిల్లలు చెడు
కర్మలు చేసి తమ గౌరవాన్ని పోగొట్టుకుంటారు, అప్పుడు యజ్ఞ గౌరవాన్ని భంగపరుస్తారు.
నడవడిక ఎలా ఉంటే, అటువంటి పదవి లభిస్తుంది. ఎవరైతే అనేకులకు సుఖము ఇస్తారో, వారి
పేరు మహిమ చేయబడుతుంది కదా. ఇప్పుడింకా సర్వ గుణాలలో సంపన్నులుగా అవ్వలేదు కదా.
కొందరు చాలా మంచి సేవను చేస్తున్నారు. అటువంటివారి పేర్లు విని బాబా
సంతోషిస్తున్నారు. సేవాధారి పిల్లలను చూసి బాబా సంతోషిస్తారు కదా. వారు సేవలో మంచిగా
శ్రమిస్తూ ఉంటారు. వారు సెంటర్లు కూడా తెరుస్తూ ఉంటారు, దీనితో వేలాది మంది కళ్యాణము
జరగనున్నది. మళ్ళీ వారి నుండి ఎంతోమంది వెలువడుతూ ఉంటారు. సంపూర్ణముగా అయితే ఇంకా
ఎవరూ అవ్వలేదు. పొరపాట్లు కూడా ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. మాయ విడిచిపెట్టదు. ఎంతగా
సేవ చేసి తమ ఉన్నతిని చేసుకుంటారో, అంతగానే హృదయాన్ని అధిరోహిస్తారు, అంతగానే ఉన్నత
పదవిని పొందుతారు. ఇక కల్ప-కల్పము అటువంటి పదవియే లభిస్తుంది. శివబాబా నుండైతే ఎవరూ
దాచిపెట్టలేరు. అంతిమములో ప్రతి ఒక్కరికీ తమ కర్మల సాక్షాత్కారమైతే జరుగుతుంది.
అప్పుడిక ఏమి చేయగలరు! వెక్కివెక్కి ఏడవాల్సి వస్తుంది, అందుకే బాబా అర్థం చేయిస్తూ
ఉంటారు - అంతిమములో శిక్షలను అనుభవించి, పశ్చాత్తాప పడవలసి వచ్చేలాంటి కర్మలేవీ
చేయకండి. కానీ ఎంతగా అర్థం చేయించినా సరే, భాగ్యములో లేకపోతే అసలు పురుషార్థమే చేయరు.
ఈ రోజుల్లోని మనుష్యులకైతే తండ్రి గురించి తెలియదు. భగవంతుడిని గుర్తు చేసుకుంటారు
కానీ వారెవరో తెలియదు. వారు చెప్పేది వినరు. ఇప్పుడు ఆ అనంతమైన తండ్రి నుండి మీకు
ఒక్క క్షణములో సత్యయుగీ స్వరాజ్య వారసత్వము లభిస్తుంది. శివబాబా పేరునైతే అందరూ
ఇష్టపడతారు కదా. ఆ అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుందని పిల్లలకు
తెలుసు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.