24-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సుఖాన్ని ఇచ్చే తండ్రిని చాలా-చాలా ప్రేమగా స్మృతి చేయండి, స్మృతి లేకుండా ప్రేమ ఉండదు’’

ప్రశ్న:-
తండ్రి పిల్లలకు ప్రతి రోజు స్మృతి యొక్క అభ్యాసము చేయాలనే సూచనను ఎందుకు ఇస్తారు?

జవాబు:-
ఎందుకంటే స్మృతితోనే ఆత్మ పావనముగా అవుతుంది. స్మృతి ద్వారానే పూర్తి వారసత్వాన్ని తీసుకోగలరు. ఆత్మకు గల బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. వికర్మల నుండి ముక్తులు అయిపోతారు. శిక్షల నుండి విముక్తులైపోతారు. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సంతోషముంటుంది. గమ్యము సమీపముగా ఉన్నట్లు అనుభవమవుతుంది. ఎప్పుడూ కూడా అలసిపోరు. అనంతమైన సుఖాన్ని పొందుతారు. అందుకే స్మృతి యొక్క అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి.

పాట:-
బాల్యపు రోజులు మర్చిపోకండి...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైన్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు జీవిస్తూనే మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. మొత్తం కల్పమంతా హద్దు తండ్రికి చెందినవారిగా ఉన్నారు. సత్యయుగములో కూడా హద్దు తండ్రికి చెందినవారిగా ఉంటారు. ఇప్పుడు కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. అనంతమైన తండ్రి నుండి మనము అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఒకవేళ తండ్రిని విడిచిపెడితే, అనంతమైన వారసత్వము లభించదు. మీరు అర్థం చేయిస్తారు కానీ కొద్ది మాత్రానికే ఎవరూ రాజీ పడరు. మనుష్యులు చాలా ధనాన్ని కోరుకుంటారు. ధనము లేకుండా సుఖము లభించదు. ధనము కూడా కావాలి, శాంతి కూడా కావాలి, నిరోగి శరీరము కూడా కావాలి. ప్రపంచములో నేడు ఏముంది, రేపు ఏమి ఉండబోతుంది అనేది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వినాశనమైతే ఎదురుగా నిలబడి ఉంది. ఇతురులెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని ఒకవేళ అర్థం చేసుకున్నా కూడా, ఏమి చేయాలి అనేది వారికి తెలియదు. యుద్ధము ఎప్పుడైనా ప్రారంభము కావచ్చునని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు, మీకు తెలుస్తుంది. చిన్న నిప్పురవ్వ అంటుకుందంటే, విస్ఫోటము జరుగుతుంది, దానికి సమయము పట్టదు. ఇంతకుముందు కూడా చిన్న విషయానికే ఎంత పెద్ద యుద్ధము జరిగింది. పాత ప్రపంచము ఇక సమాప్తమైపోబోతుందని పిల్లలకు తెలుసు, అందుకే ఇప్పుడు త్వరత్వరగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని సదా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే చాలా హర్షితముగా ఉంటారు. దేహాభిమానములోకి రావడముతోనే ఆ సంతోషము మాయమైపోతుంది. దేహీ-అభిమానులుగా అయినట్లయితే తండ్రిని స్మృతి చేస్తారు. దేహాభిమానములోకి రావడము వలన తండ్రిని మర్చిపోయి దుఃఖము పొందుతారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా అనంతమైన తండ్రి నుండి సుఖము పొందుతారు. మీరు ఇక్కడకు ఈ విధముగా లక్ష్మీ-నారాయణులుగా అవ్వడానికే వచ్చారు. రాజా-రాణుల నౌకర్లకు మరియు ప్రజల నౌకర్లకు, చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పటి పురుషార్థమే ఇక కల్ప-కల్పానికి నిశ్చితమైపోతుంది. తాము ఎంత పురుషార్థము చేసారు - అనేది చివరిలో అందరికీ సాక్షాత్కారము అవుతుంది. ఇప్పుడు కూడా తండ్రి అంటారు - ఏ మధురాతి మధురమైన తండ్రి నుండైతే స్వర్గ వారసత్వము లభిస్తుందో, వారిని నేను ఎంతగా స్మృతి చేస్తున్నాను - అని మీ అవస్థను చూసుకుంటూ ఉండండి. మీదంతా స్మృతిపైనే ఆధారపడి ఉంటుంది. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సంతోషము కూడా ఉంటుంది. ఇప్పుడిక దగ్గరకు వచ్చి చేరుకున్నామని అర్థం చేసుకుంటారు. గమ్యము ఎంత దూరంగా ఉందో ఏమిటో తెలియదు అని కొందరు అలసిపోతారు కూడా. గమ్యాన్ని చేరుకుంటే శ్రమ కూడా సఫలమవుతుంది. భగవంతుడు అని ఎవరిని అంటారు అనేది కూడా ప్రపంచానికి తెలియదు. ఓ భగవంతుడా, అని అంటారు కూడా, మళ్ళీ రాయి-రప్పలలో ఉన్నారని అనేస్తారు. మనము తండ్రికి చెందినవారిగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి మతమనుసారముగానే నడుచుకోవాలి. విదేశాల్లో ఉన్నా సరే, అక్కడ ఉంటున్నా సరే, కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మీకు శ్రీమతమైతే లభించింది. ఆత్మ తండ్రి స్మృతితో తప్ప తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వలేదు. మీరంటారు - బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము, ఎలాగైతే మా బాబా (బ్రహ్మా) వారసత్వాన్ని తీసుకుంటారో, అలా మేము కూడా పురుషార్థము చేసి వారి సింహాసనముపై తప్పకుండా కూర్చుంటాము. మమ్మా-బాబా రాజరాజేశ్వరునిగా మరియు రాజరాజేశ్వరిగా అవుతారు కావున మేము కూడా అలా అవుతాము. పరీక్ష అయితే అందరికీ ఒక్కటే. కేవలం తండ్రిని స్మృతి చేయండి అని మీకు చాలా కొద్దిగా నేర్పించడము జరుగుతుంది. దీనిని సహజ రాజయోగ బలమని అంటారు. యోగముతో చాలా బలం లభిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. మనము ఏదైనా వికర్మను చేసినట్లయితే, చాలా శిక్ష అనుభవిస్తాము, పదవి భ్రష్టమైపోతుంది. స్మృతిలోనే మాయ విఘ్నాలు వేస్తుంది.

మనము పావన ప్రపంచములోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే నిమిత్తులుగా అవుతారు. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుండా మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికనే పిల్లలను రచిస్తారు. మనము ఎలాగూ శివబాబాకు చెందినవారమే. వారు పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడానికని కొత్త సృష్టిని రచిస్తారు. శరీరధారులకే వారసత్వాన్ని ఇస్తారు. ఆత్మలైతే పైన ఉంటాయి. అక్కడ వారసత్వము లేక ప్రారబ్ధము యొక్క విషయమేమీ లేదు. మీరు ఇప్పుడు పురుషార్థము చేసి ప్రారబ్ధాన్ని తీసుకుంటున్నారు, ఈ విషయము ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు సమయము సమీపముగా వస్తూ ఉంటుంది. ఫలానావారు ఒకవేళ అలా చేసినట్లయితే, మేము వారిని మొత్తానికే సమాప్తము చేసేస్తామని బెదిరిస్తూ ఉంటారు. అలా హతమార్చడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. బాంబులు మొదలైనవేవీ దాచిపెట్టుకునేది లేదు. ఏర్పాట్లు చాలా జరుగుతున్నాయి. బ్రిటీష్ గవర్నమెంట్ సమయములో పాకిస్థాన్, హిందుస్థాన్ ఉండేవా ఏమిటి? యవనుల (యాదవులు) యుద్ధము గురించి వ్రాయబడి ఉంది. పాండవులకు మరియు కౌరవులకు మధ్యన యుద్ధమేమీ జరగలేదు. యాదవులు నిజంగా యుద్ధము చేసుకుంటున్నారు. బాంబులు కూడా తయారైపోయాయి. నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి మనల్ని ఆజ్ఞాపిస్తున్నారు, లేదంటే చివరిలో చాలా ఏడ్వాల్సి ఉంటుంది. పరీక్షలో ఫెయిల్ అయితే, ఆ కోపములో వెళ్ళి నీటిలో దూకి మరణిస్తారు. ఇక్కడ కోపగించుకునే మాటే లేదు. చివరిలో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. మేము ఎలా-ఎలా అవుతాము అనేది కూడా తెలిసిపోతుంది. తండ్రి పని పురుషార్థము చేయించడము. తండ్రి అంటారు - పిల్లలూ, కర్మలు చేస్తూ స్మృతి చేయడము మర్చిపోయినా లేక తీరిక లభించకపోయినా, అచ్ఛా, కూర్చోండి, స్మృతిలో కూర్చుని తండ్రిని గుర్తు చేయండి. మీరు పరస్పరము కలుసుకున్నప్పుడు కూడా, మేము తండ్రిని స్మృతి చేయాలి అనే ప్రయత్నము చేయండి. అలా కలిసి కూర్చున్నట్లయితే, మీరు బాగా స్మృతి చేయగలరు, సహాయము లభిస్తుంది. ఇక్కడకు వచ్చినా, రాకపోయినా సరే, తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. కొందరు విదేశాలకు వెళ్ళిన తర్వాత ఇక్కడకు మళ్ళీ రాలేరు. అక్కడ కూడా కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - తండ్రి స్మృతితోనే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. తండ్రి అంటారు - కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అంటారు - మన్మనాభవ. నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ముఖ్యమైన విషయము స్మృతికి సంబంధించినది. ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరము లేదు. ఇంటిలోనే ఉండండి, కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. పవిత్రముగా అవ్వకపోతే స్మృతి చేయలేరు. అందరూ క్లాసుకు వచ్చి చదువుకోవడమనేది జరగదు. మంత్రాన్ని తీసుకున్న తర్వాత మీరు ఇంకెక్కడికైనా వెళ్ళవచ్చు. సతోప్రధానముగా అయ్యే మార్గాన్ని తండ్రే తెలియజేశారు. అయితే, సెంటరుకు రావడము వలన కొత్త-కొత్త పాయింట్లు వింటూ ఉంటారు. ఒకవేళ ఏ కారణముగానైనా రాలేకపోతే, వర్షము కురిస్తే లేక కర్ఫ్యూ ఉంటే, ఎవరూ బయటకు రాలేకపోతే, అప్పుడు ఏమి చేస్తారు? తండ్రి అంటారు - పర్వాలేదు, ఎక్కడ ఉన్నా సరే మీరు స్మృతిలో ఉండండి. నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని మరియు దేవతలుగా అవుతారని ఇతరులకు ఇదే చెప్పండి. చెప్పాల్సింది కేవలం రెండు మాటలే.

తండ్రి అంటారు, ఈ బాల్యాన్ని మర్చిపోకండి. ఈ రోజు నవ్వుతున్నారు, ఒకవేళ తండ్రిని మర్చిపోతే రేపు ఏడ్వాల్సి ఉంటుంది. తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. స్వర్గములోకైతే వెళ్తాము కదా, ఇక తర్వాత భాగ్యములో ఏముంటే అది అని అనేవారు చాలామంది ఉన్నారు. దీనిని పురుషార్థము చేయడమని అనరు. మనుష్యులు ఉన్నత పదవిని పొందడానికే పురుషార్థము చేస్తారు. ఇప్పుడు తండ్రి వద్ద ఉన్నత పదవి లభిస్తుంది అన్నప్పుడు నిర్లక్ష్యము ఎందుకు చేయాలి. ఎవరైతే స్కూల్లో చదువుకోరో, వారు చదువుకున్నవారి ఎదురుగా సేవ చేయవలసి ఉంటుంది. తండ్రిని పూర్తిగా స్మృతి చేయకపోతే, వెళ్ళి ప్రజల వద్ద కూడా నౌకర్లుగా అవుతారు. ఈ విషయములో సంతోషపడకూడదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీరు సమ్ముఖముగా రిఫ్రెష్ అయ్యి వెళ్తారు. బంధనములో ఉన్న కుమార్తెలు కొంతమంది ఉన్నారు, పర్వాలేదు, ఇంటిలో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మీకు ఎంత సహజముగా అర్థం చేయిస్తారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, యుద్ధము అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. ఏ మాత్రం తేడా చేసినా, మేము ఇలా చేస్తామని ఒకరికొకరు చెప్పుకుంటారు, ముందు నుండే చెప్పుకుంటారు. బాంబులు ఉన్నాయన్న అహంకారము చాలా ఉంది. తండ్రి అంటారు - పిల్లలు యోగబలములో ఇంకా తెలివైనవారిగా అవ్వలేదు. మీరు తయారవ్వక ముందే యుద్ధము మొదలవ్వడమనేది జరగకూడదు. కానీ డ్రామానుసారముగా అలా జరగనే జరగదు. పిల్లలు పూర్తి వారసత్వాన్ని తీసుకోలేదు, అందుకే ఈ యుద్ధము ఒకవేళ మొదలైనా కూడా, అది మళ్ళీ ఆగిపోతుంది అని వారికి నిశ్చయము ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడింకా రాజధాని స్థాపన అవ్వలేదు. దానికి సమయము పడుతుంది. పురుషార్థము చేయిస్తూ ఉంటారు, ఏ సమయములోనైనా ఏమైనా జరగవచ్చు, చెప్పలేము. బస్సులు పడిపోతూ ఉంటాయి, విమానాలు, రైళ్ళు పడిపోతూ ఉంటాయి, మృత్యువు ఎంత సహజముగా నిలబడి ఉంది. భూమి కూడా కంపిస్తూ ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువ పని భూకంపాలు చేస్తాయి. కానీ వినాశనము జరిగే కంటే ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. అందుకే చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మీరు తప్ప మాకు వేరెవ్వరూ లేరు. కేవలం తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. ఎంత సహజముగా చిన్న-చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా అర్థం చేయిస్తున్నారు. ఇంకే కష్టము ఇవ్వను, కేవలం స్మృతి చేయండి. కామ చితిపై కూర్చుని కాలిపోయిన మీరు, ఇప్పుడు జ్ఞాన చితిపై కూర్చుని పవిత్రముగా అవ్వండి. మీ ఉద్దేశ్యము ఏమిటి అని మిమ్మల్ని అడుగుతారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారని సర్వుల తండ్రి చెప్తున్నారని వారికి చెప్పండి. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియే. ఇప్పుడు తండ్రి అంటారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది. ఈ మాత్రం సందేశాన్ని అయితే ఇవ్వగలరు కదా. స్వయం స్మృతి చేసినప్పుడే ఇతరుల చేత కూడా స్మృతి చేయించగలరు. అప్పుడు ఇతరులకు అభిరుచితో చెప్తారు. లేదంటే మనసులో నుండి ఈ మాటలు రావు. తండ్రి అంటారు - ఎక్కడ ఉన్నా సరే, ఎంత వీలైతే అంత కేవలం స్మృతి చేయండి. ఆహార-పానీయాల విషయములో కొద్దిగా కష్టము కలుగుతుంది. ఉండటమైతే ఇంటిలోనే ఉండాల్సి ఉంటుంది. ఇంటిలో ఉంటూ తండ్రిని స్మృతి చేయండి. ఎవరు కలిసినా వారికి, మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని ఇదే శిక్షణను ఇవ్వండి.

తండ్రి అంటారు - మీరంతా తమోప్రధానముగా, పతితముగా అయిపోయారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రముగా అవ్వండి. ఆత్మయే పతితముగా అయ్యింది. సత్యయుగములో ఆత్మ పావనముగా ఉంటుంది. తండ్రి స్మృతితోనే ఆత్మ పావనముగా అవుతుంది. ఇంకే ఉపాయము లేదు. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూ వెళ్ళినా సరే అనేకుల కళ్యాణము చేస్తారు. ఇంకే కష్టము ఇవ్వరు. పురుషోత్తమ మాసములో కూడా వెళ్ళి, అందరికంటే పురుషోత్తములు ఎవరు అనేది అర్థం చేయించండి. సత్యయుగ ఆదిలో ఈ లక్ష్మీ-నారాయణులు పురుషోత్తములుగా ఉండేవారు. వీరిని ఇలా పురుషోత్తములుగా తయారుచేసేవారు అనగా స్వర్గ స్థాపన చేసేవారు తండ్రియే. ఆత్మలందరినీ పావనముగా చేసే పతిత-పావనుడు తండ్రి మాత్రమే. అందరికంటే ఉత్తమోత్తమమైన పురుషులుగా తయారుచేసేవారు తండ్రియే. పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. రావణ రాజ్యములో మనము పూజారులుగా అయ్యాము, రామ రాజ్యములో పూజ్యులుగా ఉండేవారము. ఇప్పుడిది రావణ రాజ్యము యొక్క అంతిమము. మనము పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా అవుతాము. తండ్రిని స్మృతి చేసే మార్గాన్ని ఇతరులకు కూడా తెలియజేయాలి. వృద్ధ మాతలు కూడా ఈ సేవ చేయాలి. మిత్ర-సంబంధీకులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. వారికి చెప్పండి - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారని శివబాబా చెప్తున్నారు. నిరాకార శివబాబా, సర్వుల సద్గతిదాత అయిన బాబా ఆత్మలందరికీ చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా అవుతారు. ఈ విషయాన్ని అర్థం చేయించడమైతే సహజము కదా. వృద్ధ మాతలు కూడా ఈ సేవను చేయగలరు. ముఖ్యమైన విషయము ఇదే. వివాహాలు మొదలైనవాటికి ఎక్కడికి వెళ్ళినా సరే చెవిలో ఈ విషయాన్ని వినిపించండి. నన్ను స్మృతి చేయండి అని గీతా భగవానుడు చెప్తున్నారని చెప్పండి. ఈ విషయాన్ని అందరూ ఇష్టపడతారు. ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరము లేదు. కేవలం నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు అనే తండ్రి సందేశాన్ని ఇవ్వాలి.

అచ్ఛా - భగవంతుడు ప్రేరణ ఇస్తున్నారనే అనుకోండి. అప్పుడు స్వప్నములో సాక్షాత్కారము జరుగుతుంది, నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా అవుతారని తండ్రి చెప్తున్నట్లుగా శబ్దము వినిపిస్తుంది. స్వయం మీరు కూడా కేవలం ఇదే చింతన చేస్తూ ఉన్నట్లయితే నావ తీరానికి చేరుతుంది. మనము ప్రాక్టికల్ గా అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము మరియు తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నాము కనుక సంతోషముండాలి కదా. తండ్రిని మర్చిపోవడము వలనే కష్టము కలుగుతుంది. నన్ను స్మృతి చేయండి అని తండ్రి ఎంత సహజముగా తెలియజేస్తారు, అప్పుడు వీరికి నిజంగా సరైన మార్గము లభించిందని అందరూ అర్థం చేసుకుంటారు. ఈ మార్గాన్ని ఎప్పుడూ ఎవ్వరూ తెలియజేయలేరు. ఎలాంటి సమయము వస్తుందంటే మీరు ఇంటి నుండి బయటకు రాలేరు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. అంతిమ సమయములో ఎవరైతే శివబాబాను స్మరిస్తారో... వారు నారాయణుడి వంశములో జన్మిస్తారు. లక్ష్మీ-నారాయణుల రాజ్యములోకి వస్తారు. పదే-పదే రాజ్య పదవిని పొందుతారు. కేవలం తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి, అంతే. స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు. సుఖము లభిస్తుంది కావుననే స్మృతి చేయడము జరుగుతుంది. దుఃఖమిచ్చేవారిని ప్రేమించడము జరగదు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను, అందుకే నన్ను ప్రేమించండి. తండ్రి మతాన్ని అనుసరించాలి కదా. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చదువులో ఎప్పుడూ నిర్లక్ష్యము చేయకూడదు, యుద్ధము కంటే ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి.

2. శ్రీమతాన్ని అనుసరిస్తూ తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి.

వరదానము:-
సంకల్పము, వృత్తి మరియు స్మృతి నుండి వ్యర్థాన్ని సమాప్తము చేసే సత్యమైన బ్రాహ్మణ, సంపూర్ణ పవిత్ర భవ

మీ సంకల్పాలను, వృత్తిని మరియు స్మృతిని చెక్ చేసుకోండి - ఏదో తప్పు జరిగిపోయింది, పశ్చాత్తాపపడ్డాము, క్షమాపణలు అడిగాము, అంతే అయిపోయింది అని కాదు. ఎవరెంత క్షమాపణలు తీసుకున్నా కానీ ఏదైతే పాప కర్మ లేక వ్యర్థ కర్మ జరిగిందో, దాని మరక చెరిగిపోదు. రిజిస్టరు శుద్ధముగా, స్వచ్ఛముగా ఉండదు. కేవలం ఈ పద్ధతిని అనుసరించడం కాదు, కానీ నేను సంపూర్ణ పవిత్ర బ్రాహ్మణాత్మను, అపవిత్రత అనేది సంకల్పాన్ని, వృత్తిని మరియు స్మృతిని కూడా టచ్ చేయకూడదు అనే స్మృతి ఉండాలి. దీని కోసం అడుగడుగులోనూ సావధానముగా ఉండండి.

స్లోగన్:-
తండ్రి తోడును ఉపయోగించుకుంటే ఎప్పుడూ నిరాశ చెందరు.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

పవిత్రతా రహస్యాన్ని ప్రాక్టికల్ లోకి తీసుకురావటము అనగా సంకల్పము రూపములో కూడా 5 వికారాలపై విజయులుగా అవ్వటము. వ్యర్థ సంకల్పాలు క్రోధాన్ని ఉత్పన్నము చేస్తాయి. కామము అనగా ఎవరి పట్లనైనా ఒకవేళ వ్యర్థ దృష్టి వెళ్ళినట్లయితే ఆ సమయములో దానిని పవిత్రత అని భావించరు. కావున ఈ వ్యర్థ సంకల్పాలను బాబా ప్రేమలో బలిహారము చేయండి.