24-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మాతా-పితలను ఫాలో చేస్తూ
సింహాసనాధికారులుగా అవ్వండి, ఇందులో కష్టమేమీ లేదు, కేవలం తండ్రిని స్మృతి చేయండి
మరియు పవిత్రముగా అవ్వండి’’
ప్రశ్న:-
పేదల పెన్నిధి
అయిన తండ్రి తన పిల్లల భాగ్యాన్ని తయారుచేయడానికి ఏ సలహాను ఇస్తారు?
జవాబు:-
పిల్లలూ,
శివబాబాకు మీకు సంబంధించినదేదీ అవసరము లేదు. మీరు తినండి, తాగండి, చదవండి - రిఫ్రెష్
అయి వెళ్ళండి కానీ పిడికెడు బియ్యానికి కూడా మహిమ ఉంది. 21 జన్మలకు షావుకార్లుగా
అవ్వాలి, పేదవారి ఒక్క పైసా కూడా షావుకారుల 100 రూపాయలకు సమానము, అందుకే తండ్రి
ఎప్పుడైతే డైరెక్టుగా వస్తారో, అప్పుడు మీదంతా సఫలం చేసుకోండి.
పాట:-
నీవే తల్లివి,
తండ్రివి నీవే...
ఓంశాంతి
పిల్లలు పాట
అర్థాన్ని తెలుసుకున్నారు. మనుష్యులు వారిని పిలుస్తారు కానీ అర్థం చేసుకోరు. వారు
మన తండ్రి అని మీకు తెలుసు. వాస్తవానికి వారు కేవలం మీకు మాత్రమే తండ్రి కాదు, వారు
అందరికీ తండ్రి. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఎంతమంది ఆత్మలు ఉన్నారో,
వారందరికీ తప్పకుండా పరమాత్మయే తండ్రి. బాబా-బాబా అని అంటూ ఉంటే వారసత్వము తప్పకుండా
గుర్తుకువస్తుంది. తండ్రిని స్మృతి చేయడముతోనే వికర్మలు వినాశనమవుతాయి. మీ ఆత్మ
పతితముగా అయిందని, ఇప్పుడు దానిని పావనముగా తయారుచేసుకోవాలని తండ్రి పిల్లలకు
చెప్తారు. వారు అందరికీ తండ్రి కనుక పిల్లలు తప్పకుండా నిర్వికారులుగా ఉండాలి.
ఒకానొక సమయములో అందరూ నిర్వికారులుగా ఉండేవారు. తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు
- శ్రీ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు అందరూ నిర్వికారులుగా ఉండేవారు,
అక్కడున్న మనుష్యాత్మలందరూ నిర్వికారులుగా ఉండేవారు ఎందుకంటే ఇప్పుడు శరీరాలైతే
వినాశనమైపోతాయి, ఆత్మలందరూ నిరాకారీ ప్రపంచానికి వెళ్ళి ఉంటారు. ఆ నిరాకారీ
ప్రపంచములో వికారాల నామ-రూపాలే ఉండవు. అక్కడ అసలు శరీరాలే ఉండవు. అక్కడి నుండే
ఆత్మలందరూ పాత్రను అభినయించేందుకు ఈ ప్రపంచములోకి వస్తారు. మొట్టమొదట భారతవాసులు
వస్తారు. భారత్ లో మొట్టమొదట ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, ఆ సమయములో మిగిలిన
ధర్మాల వారందరూ నిరాకారీ ప్రపంచములో ఉండేవారు. ఈ సమయములో అందరూ సాకారీ ప్రపంచములో
ఉన్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని నిర్వికారీ దేవీ-దేవతలుగా
తయారుచేయడానికి నిర్వికారులుగా తయారుచేస్తారు. మీరు దేవీ-దేవతలుగా అయినప్పుడు మీ
కోసం తప్పకుండా కొత్త ప్రపంచము కావాలి. పాత ప్రపంచము సమాప్తమవ్వాలి. శాస్త్రాలలో
మహాభారత యుద్ధాన్ని కూడా చూపించారు. 5 మంది పాండవులు మిగిలారని, వారు కూడా పర్వతాలపై
కరిగిపోయారని, ఎవ్వరూ మిగలలేదని చూపించారు. అచ్ఛా, మరి ఇంతమంది ఆత్మలు ఎక్కడికి
వెళ్ళిపోయారు? ఆత్మ వినాశనమవ్వదు కావున నిరాకారీ, నిర్వికారీ ప్రపంచములోకి వెళ్ళారని
అంటారు. తండ్రి వికారీ ప్రపంచము నుండి నిరాకారీ, నిర్వికారీ ప్రపంచములోకి
తీసుకువెళ్తారు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వము లభించాలని మీకు తెలుసు. ఇప్పుడు
దుఃఖము పెరిగిపోయింది. ఈ సమయములో మనకు సుఖము, శాంతి రెండూ కావాలి. ఓ భగవంతుడా, మాకు
సుఖము ఇవ్వండి, శాంతి ఇవ్వండి అని అందరూ భగవంతుడిని వేడుకుంటారు. మనుష్యులు ప్రతి
ఒక్కరూ ధనము కోసం పురుషార్థము చేస్తారు. ధనముంటే సుఖముంటుంది. మీకు అనంతమైన తండ్రి
చాలా ధనము ఇస్తారు. మీరు సత్యయుగములో ఎంత ధనవంతులుగా ఉండేవారు, వజ్ర-వైఢూర్యాల
మహళ్ళు ఉండేవి. మనము అనంతమైన తండ్రి నుండి అనంతమైన స్వర్గము యొక్క వారసత్వము
తీసుకునేందుకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. మొత్తం ప్రపంచమంతా ఇక్కడకు రాదు.
తండ్రి భారత్ లోనే వస్తారు. భారతవాసులే ఈ సమయములో నరకవాసులుగా ఉన్నారు, మళ్ళీ వారిని
స్వర్గవాసులుగా తండ్రి తయారుచేస్తారు. భక్తిలో దుఃఖము కారణముగా తండ్రిని - ఓ పరమపిత
పరమాత్మ, ఓ కళ్యాణకారీ, దుఃఖహర్త-సుఖకర్త బాబా అని జన్మ-జన్మలుగా స్మృతి చేసారు.
వారిని స్మృతి చేస్తున్నారంటే తప్పకుండా వారు ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కూడా. ఊరికే
అలా స్మృతి చేయరు కదా. భగవంతుడైన తండ్రి వచ్చి భక్తులకు ఫలాన్ని ఇస్తారని భావిస్తారు.
మరి వారు అందరికీ ఇస్తారు కదా. బాబా అయితే అందరివారు కదా.
మనము సుఖధామానికి
వెళ్తామని మీకు తెలుసు. మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్తారు. మీరు సుఖధామములో
ఉన్నప్పుడు మొత్తం సృష్టిలో సుఖ-శాంతులు ఉంటాయి. తండ్రికైతే పిల్లల పట్ల ప్రేమ
ఉంటుంది కదా. అలాగే పిల్లలకు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంటుంది. నీవే
తల్లివి-తండ్రివి... అని పాడుతారు కూడా. దైహిక తల్లిదండ్రులున్నా కూడా, నీవే
తల్లివి-తండ్రివి... నీ కృపతో అపారమైన సుఖము లభిస్తుందని పాడుతారు. లౌకిక
తల్లిదండ్రుల గురించి ఇలా పాడరు. వారు కూడా పిల్లలను సంభాళిస్తారు, శ్రమిస్తారు,
వారసత్వాన్ని ఇస్తారు, నిశ్చితార్థము చేయిస్తారు. కానీ, అపారమైన సుఖాన్ని అయితే
పారలౌకిక మాత-పిత మాత్రమే ఇస్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరుని ద్వారా దత్తత తీసుకోబడిన
పిల్లలు. వారంతా అసురుని ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలు. సత్యయుగములో ఎప్పుడూ ఎవరూ
పిల్లలను దత్తత తీసుకోరు. అక్కడైతే సుఖమే సుఖముంటుంది. దుఃఖము యొక్క నామ-రూపాలే
ఉండవు. తండ్రి అంటారు - నేను 21 తరాల కోసం మీకు స్వర్గము యొక్క అపారమైన సుఖాన్ని
ఇచ్చేందుకు వచ్చాను.
మనము అనంతమైన తండ్రి
నుండి అపారమైన స్వర్గ సుఖాలను పొందుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఈ దుఃఖపు
బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. సత్యయుగములో సుఖమయ సంబంధాలు ఉంటాయి, కలియుగములో దుఃఖపు
బంధనాలు ఉంటాయి. తండ్రి సుఖమయ సంబంధాలలోకి తీసుకువెళ్తారు. వారిని దుఃఖహర్త-సుఖకర్త
అని అంటారు. తండ్రి వచ్చి పిల్లలకు సేవ చేస్తారు. తండ్రి అంటారు, నేను మీ విధేయుడైన
సేవకుడిని. ఓ బాబా, మీరు వచ్చి మాకు అపారమైన సుఖాన్ని ఇవ్వండి అని మీరు నన్ను
అర్ధకల్పము స్మృతి చేసారు, ఇప్పుడు నేను ఇవ్వడానికి వచ్చాను కనుక శ్రీమతముపై నడవాలి.
ఈ మృత్యులోకమంతా సమాప్తమవ్వనున్నది. అమరలోకము స్థాపనవుతుంది. అమరపురికి వెళ్ళేందుకు
అమరనాథుడైన బాబా నుండి మీరు అమరకథను వింటారు. అక్కడ ఎవ్వరూ మరణించరు, నోటి ద్వారా
ఎప్పుడూ ఫలానావారు మరణించారు అని అనరు. నేను శిథిలావస్థలో ఉన్న ఈ శరీరాన్ని వదిలి
కొత్తది తీసుకుంటానని ఆత్మ అంటుంది. అది మంచిదే కదా. అక్కడ అనారోగ్యాలు మొదలైనవేవీ
ఉండవు. మృత్యులోకము పేరే ఉండదు. నేను మిమ్మల్ని అమరపురికి యజమానులుగా తయారుచేయడానికి
వచ్చాను. అక్కడ మీరు రాజ్యము చేసేటప్పుడు, ఈ మృత్యులోకానికి సంబంధించినదేదీ
గుర్తుండదు. కిందకు దిగుతూ-దిగుతూ మనము ఎలా అవుతాము అనేది కూడా అక్కడ తెలియదు.
ఒకవేళ తెలిస్తే, ఆ సుఖము దూరమైపోతుంది. ఇక్కడ మీరు పూర్తి చక్రాన్ని బుద్ధిలో
ఉంచుకోవాలి. తప్పకుండా ఒకప్పుడు స్వర్గముండేది, ఇప్పుడు నరకముంది, అందుకే తండ్రిని
పిలుస్తారు. ఆత్మలైన మీరు శాంతిధామ నివాసులు. ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు.
ఇక్కడ నుండి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు సంస్కారాలను తీసుకువెళ్తారు. తర్వాత అక్కడ
నుండి వచ్చి కొత్త శరీరాలను ధారణ చేసి రాజ్యము చేస్తారు. ఇప్పుడు మీకు నిరాకారీ,
ఆకారీ మరియు సాకారీ ప్రపంచాల సమాచారాన్ని వినిపిస్తారు. సత్యయుగములో ఇవేమీ తెలియదు.
అక్కడ కేవలం రాజ్యము చేస్తారు. డ్రామా గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు.
సత్యయుగము కోసం మనము పురుషార్థము చేస్తున్నామని మీ ఆత్మకు తెలుసు. స్వర్గములోకి
వెళ్ళేందుకు యోగ్యులుగా తప్పకుండా అవుతారు. స్వ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము కూడా
చేస్తారు. అప్పుడు వారి ఆశీర్వాదాలు మీకు లభిస్తూ ఉంటాయి. మీ ప్లాన్ ఎలా ఉందో చూడండి.
ఈ సమయములో అందరికీ ఎవరి ప్లాన్లు వారికి ఉన్నాయి. తండ్రికి కూడా ప్లాన్ ఉంది.
మనుష్యులు ఆనకట్టలు మొదలైనవి నిర్మించేటప్పుడు విద్యుత్తు మొదలైనవాటి కోసం ఎన్ని
కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు అవన్నీ ఆసురీ
ప్లాన్లు. మనది ఈశ్వరీయ ప్లాన్. ఇప్పుడు ఎవరి ప్లాన్ విజయము పొందుతుంది? వారు
పరస్పరములో కొట్లాడుకుంటారు. అందరి ప్లాన్లు మట్టిలో కలిసిపోతాయి. వారెవ్వరూ స్వర్గ
స్థాపన చేయరు. వారు ఏం చేసినా, అది దుఃఖము కోసమే చేస్తారు. స్వర్గము తయారుచేయడమనేది
తండ్రి ప్లాన్. నరకవాసులైన మనుష్యులు నరకములో ఉండేందుకే ప్లాన్లు తయారుచేస్తారు.
తండ్రి స్వర్గాన్ని తయారుచేసే ప్లాన్ చేస్తున్నారు. కనుక మీకు ఎంత సంతోషముండాలి. మీ
కృపతో అపారమైన సుఖము లభిస్తుంది... అని పాడుతారు కూడా. మరి అది పురుషార్థము చేసి
తీసుకోవాలి కదా. తండ్రి అంటారు, మీకు ఏం కావాలంటే, అది తీసుకోండి. విశ్వానికి
యజమానులైన రాజు-రాణులుగా అయినా అవ్వండి లేక దాస-దాసీలుగా అయినా అవ్వండి. ఎంత
పురుషార్థము చేస్తే, అంత పొందుతారు. తండ్రి కేవలం - ఒకటి పవిత్రముగా అవ్వండి మరియు
ప్రతి ఒక్కరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి అని చెప్తారు. భగవంతుడిని స్మృతి
చేసినట్లయితే రాజ్యాధికార వారసత్వము మీది అవుతుంది. తండ్రిని స్మృతి చేయడములోనే మాయ
చాలా విఘ్నాలను కలిగిస్తుంది. బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. తండ్రి అంటారు, మీరు
నన్ను ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పాపాలు కూడా భస్మమవుతాయి మరియు ఉన్నత పదవిని
కూడా పొందుతారు. అందుకే, భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. తండ్రిని
లిబరేటర్ (ముక్తిప్రదాత) అని కూడా అంటారు. 21 జన్మల కోసం తండ్రి మిమ్మల్ని దుఃఖము
నుండి విముక్తులుగా చేస్తారు. భారతవాసులు సుఖధామములో ఉంటారు, మిగిలినవారంతా
శాంతిధామములో ఉంటారు. నిరాకారీ ప్రపంచము మరియు సాకారీ ప్రపంచము యొక్క ప్లాన్
చూపించినప్పుడు - ఇతర ధర్మాలవారు స్వర్గములోకి రాలేరని వెంటనే అర్థం చేసుకుంటారు.
స్వర్గములోనైతే కేవలం దేవీ-దేవతలే ఉంటారు. ఈ డ్రామా జ్ఞానాన్ని తండ్రి తప్ప
వేరెవ్వరూ అర్థం చేయించలేరు. పిల్లలు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకే
వస్తారు. సత్యయుగములోనే అపారమైన సుఖముంటుంది, తర్వాత రావణ రాజ్యము ఉంటుంది, అందులో
అపారమైన దుఃఖముంటుంది. బాబా మనకు సత్యాతి-సత్యమైన కథను వినిపించి అమరలోకములోకి
వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు.
ఇప్పుడు అలాంటి కర్మలు చేస్తున్నారు కావుననే మీరు 21 జన్మలకు ధనవంతులుగా అవుతారు.
ధనవాన్ భవ, పుత్రవాన్ భవ... అని అంటారు కూడా. అక్కడ మీకు ఒక కుమారుడు, ఒక కుమార్తె
తప్పకుండా ఉంటారు. ఆయుష్మాన్ భవ, మీ ఆయుష్షు కూడా 150 సంవత్సరాలు ఉంటుంది. అకాల
మృత్యువు ఎప్పుడూ సంభవించదు. ఈ విషయాన్ని తండ్రియే అర్థం చేయిస్తారు. మీరు
అర్ధకల్పము నన్ను పిలుస్తూ వచ్చారు. సన్యాసులు ఇలా అంటారా ఏమిటి? వారికేమి తెలుసు!
తండ్రి కూర్చుని ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఒకవేళ ఈ ఒక్క జన్మ
పావనముగా అయినట్లయితే 21 జన్మలు పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పవిత్రతలోనైతే
సుఖముంటుంది కదా. మీరు పవిత్రమైన దైవీ ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. ఇప్పుడు
అపవిత్రముగా అయి దుఃఖములోకి వచ్చారు. స్వర్గములో నిర్వికారులుగా ఉండేవారు, ఇప్పుడు
వికారులుగా అవ్వడముతో నరకములో దుఃఖితులు అయ్యారు. తండ్రి అయితే పురుషార్థము
చేయిస్తారు కదా. స్వర్గము యొక్క మహారాజు-మహారాణులుగా అవ్వండి. మీ బాబా-మమ్మా అలా
తయారవుతారు కదా. కనుక మీరు కూడా పురుషార్థము చేయండి. ఇందులో తికమకపడే విషయమేమీ లేదు.
బాబా అయితే ఎవ్వరినీ కాళ్ళకు కూడా నమస్కారము చేయనివ్వరు.
తండ్రి అర్థం
చేయిస్తున్నారు - నేను మీకు బంగారము, వజ్రాల మహళ్ళను ఇచ్చాను, స్వర్గానికి
యజమానులుగా తయారుచేసాను. తర్వాత అర్ధకల్పము మీరు భక్తి మార్గములో నుదురు
అరగదీసుకుంటూ వచ్చారు, ధనము కూడా ఇస్తూ వచ్చారు. ఆ బంగారము, వజ్రాల మహళ్ళన్నీ
ఏమైపోయాయి? మీరు స్వర్గము నుండి దిగుతూ-దిగుతూ నరకములోకి వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని
మళ్ళీ స్వర్గములోకి తీసుకువెళ్తాను. మీకు ఏ కష్టము ఇవ్వను. కేవలం నన్ను స్మృతి
చేయండి మరియు పవిత్రముగా అవ్వండి. ఒక్క పైసా కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు. తినండి,
తాగండి, చదవండి, రిఫ్రెష్ అయ్యి వెళ్ళండి. తండ్రి అయితే కేవలం చదివిస్తారు. ఈ
చదువుకు ధనమేమీ తీసుకోరు. పిల్లలు అంటారు - బాబా, మేము తప్పకుండా ఇస్తాము, లేదంటే
అక్కడ మహళ్ళు మొదలైనవి ఎలా లభిస్తాయి? భక్తి మార్గములో కూడా మీరు ఈశ్వరార్థము పేదలకు
దానము చేసేవారు. దానికి ఫలం కూడా ఈశ్వరుడే ఇస్తారు, పేదవారు ఇవ్వరు. కానీ అది ఒక్క
జన్మకు మాత్రమే లభిస్తుంది. బాబా, ఇప్పుడైతే మీరు డైరెక్టుగా వచ్చారు, మేము ఈ కొంచెం
ధనము ఇస్తాము, మీరు మాకు 21 జన్మలకు స్వర్గములో ఇవ్వండి అని అంటారు. తండ్రి అందరినీ
షావుకారులుగా చేస్తారు. ధనమిస్తే మీరు ఉండేందుకే భవనాలు మొదలైనవి తయారుచేస్తారు.
లేదంటే ఇవన్నీ ఎలా తయారవుతాయి? పిల్లలే ఈ భవనాలు మొదలైనవి తయారుచేస్తారు కదా.
శివబాబా అంటారు - నేనేమీ ఈ భవనాలలో ఉండను. శివబాబా అయితే నిరాకార దాత కదా. మీరు
ఇస్తే, దానికి మీకు 21 జన్మల కోసం ఫలం ఇస్తారు. నేనైతే మీ స్వర్గములోకి అసలు రాను
కూడా. మిమ్మల్ని నరకము నుండి బయటకు తీసుకువచ్చేందుకు నేను నరకములోకి రావాల్సి
ఉంటుంది. మీ గురువులైతే మిమ్మల్ని ఇంకా ఊబిలో చిక్కుకునేలా చేస్తారు. వారెవ్వరూ
సద్గతినివ్వరు. ఇప్పుడు తండ్రి పవిత్ర ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. మరి
అటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? తండ్రి అంటారు - మీరు ధనమేమీ ఇవ్వకండి, కేవలం
నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు నశిస్తాయి మరియు మీరు నా వద్దకు వచ్చేస్తారు. ఈ
భవనాలు మొదలైనవన్నీ పిల్లలైన మీరు మీ కోసమే తయారుచేయించుకున్నారు. ఇక్కడ పిడికెడు
బియ్యానికి మహిమ ఉంది కదా. పేదవారు తమ ధైర్యము అనుసారముగా ఎంత ఇస్తే, అంత వారి
భాగ్యము తయారవుతుంది. షావుకారులకు ఎంత పదవి లభిస్తుందో, పేదవారికి కూడా అంతే పదవి
లభిస్తుంది. ఇరువురిదీ సమానమైపోతుంది. పేదవారి వద్ద ఉన్నదే 100 రూపాయలు అన్నప్పుడు,
అందులో నుండి ఒక్క రూపాయి ఇస్తే, అలాగే షావుకారుల వద్ద చాలా ధనమున్నా కానీ వారు కూడా
100 రూపాయలే ఇస్తే, ఇరువురికీ ఒకే విధమైన ఫలముంటుంది. అందుకే తండ్రిని పేదల పెన్నిధి
అని అంటారు. అన్నింటికంటే పేదది భారత్. నేను వచ్చి దానినే షావుకారుగా తయారుచేస్తాను.
పేదవారికే దానము ఇవ్వడము జరుగుతుంది కదా. తండ్రి ఎంత స్పష్టం చేసి అర్థం
చేయిస్తున్నారు. పిల్లలూ, ఇప్పుడు మృత్యువు ఎదురుగా ఉంది. ఇప్పుడు త్వరత్వరగా చేయండి.
స్మృతి యొక్క వేగాన్ని పెంచండి. అతి మధురమైన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా
వారసత్వము లభిస్తుంది. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. తండ్రి మిమ్మల్ని, తల వంచి
నమస్కరించమని, మేళాలకు వెళ్ళమని చెప్పరు. ఇంటిలో కూర్చుని ఉండగానే తండ్రిని మరియు
వారసత్వాన్ని స్మృతి చేయండి, అంతే. తండ్రి ఒక బిందువు, వారిని పరమపిత పరమాత్మ అని
అంటారు. సుప్రీమ్ సోల్ అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు. తండ్రి అంటారు - నేను కూడా
బిందువును, మీరు కూడా బిందువులే. కేవలం భక్తి మార్గము కోసం నా రూపాన్ని పెద్దదిగా
చేసి పెట్టుకున్నారు. లేదంటే బిందువును ఎలా పూజిస్తారు. వారిని శివబాబా అని కూడా
అంటారు. ఈ మాట ఎవరన్నారు? శివబాబా మాకు వారసత్వాన్ని ఇస్తున్నారని ఇప్పుడు మీరంటారు.
ఇది అద్భుతము కదా. 84 జన్మల చక్రము తిరుగుతూ ఉంటుంది. అనేక సార్లు మీరు వారసత్వాన్ని
తీసుకున్నారు మరియు తీసుకుంటూనే ఉంటారు. తండ్రి కూర్చుని ఎంత బాగా అర్థం
చేయిస్తున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, అందుకే ఇప్పుడు స్మృతి వేగాన్ని పెంచాలి.
సత్యయుగీ ప్రపంచములో ఉన్నత పదవిని పొందేందుకు పూర్తి పురుషార్థము చేయాలి.
2. స్వ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము చేసి ఆశీర్వాదాలను పొందాలి. పవిత్ర
ప్రపంచములోకి వెళ్ళేందుకు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి.
వరదానము:-
కనెక్షన్ మరియు రిలేషన్ ద్వారా మనసా శక్తి యొక్క ప్రత్యక్ష
ఋజువును చూసే సూక్ష్మ సేవాధారీ భవ
ఏ విధముగా వాణి శక్తి మరియు కర్మల శక్తి యొక్క ప్రత్యక్ష
ఋజువు కనిపిస్తుందో, అదే విధముగా అన్నింటికన్నా శక్తివంతమైన సైలెన్స్ శక్తి యొక్క
ప్రత్యక్ష ఋజువును చూసేందుకు బాప్ దాదాతో నిరంతరము క్లియర్ కనెక్షన్ మరియు రిలేషన్
ఉండాలి, దీనినే యోగబలము అని అంటారు. ఇటువంటి యోగబలము కల ఆత్మలు స్థూలముగా దూరముగా
ఉండే ఆత్మకు సమ్ముఖముగా ఉన్న అనుభవాన్ని చేయించగలరు. ఆత్మలను ఆహ్వానించి వారిని
పరివర్తన చేయగలరు. ఇదే సూక్ష్మమైన సేవ, దీని కోసం ఏకాగ్రతా శక్తిని పెంచండి.
స్లోగన్:-
తమ సర్వ
ఖజానాలను సఫలం చేసుకునేవారే మహాదానీ ఆత్మలు.
అవ్యక్త ప్రేరణలు -
పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి
ఎవరైనా దేహధారి
దృష్టితో మీ ఎదురుగా వచ్చినట్లయితే మీరు ఒక్క క్షణములో వారి దృష్టిని ఆత్మిక
దృష్టిలోకి పరివర్తన చేయండి. ఎవరైనా మిమ్మల్ని పడేయాలి అన్న వృత్తితో లేక వారి
సాంగత్య దోషములోకి తీసుకురావాలన్న దృష్టితో మీ ఎదురుగా వచ్చినట్లయితే, మీరు వారిని
సదా శ్రేష్ఠ సాంగత్యము యొక్క ఆధారము ద్వారా సాంగత్య దోషము నుండి బయటకు తీసి శ్రేష్ఠ
సాంగత్యము చేసేవారిగా తయారుచేయండి. ఈ విధముగా పరివర్తన చేసే యుక్తి వచ్చినట్లయితే
ఎప్పుడూ విఘ్నాలతో ఓడిపోరు. సంపర్కములోకి వచ్చేవారు మీ ఈ సూక్ష్మమైన, శ్రేష్ఠమైన
సేవకు బలిహారమవుతారు.