25-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి
చేయడములో మీ సంపాదన కూడా ఉంది మరియు ఆరోగ్యము కూడా ఉంది, మీరు అమరులుగా అయిపోతారు’’
ప్రశ్న:-
హృదయాన్ని
శుద్ధముగా చేసుకునేందుకు సహజమైన యుక్తి ఏమిటి?
జవాబు:-
ఎక్కడ ఉన్నా
సరే, ట్రస్టీగా ఉండండి. ఎల్లప్పుడూ - మేము శివబాబా భండారా నుండి తింటున్నామని
భావించండి. శివబాబా భండారా యొక్క భోజనము తినేవారి హృదయము శుద్ధమవుతూ ఉంటుంది. ఒకవేళ
ప్రవృత్తిలో ఉంటూ కూడా శ్రీమతమనుసారముగా ఇచ్చిన డైరెక్షన్ల ఆధారముగా ట్రస్టీగా
ఉన్నట్లయితే, అది కూడా శివబాబా భండారాయే అవుతుంది, అటువంటివారు మనసుతో సరెండర్
అయినట్లు.
ఓంశాంతి
అర్ధకల్పము నుండి, జన్మజన్మలుగా పిల్లలు సత్సంగాలకు వెళ్తూ వచ్చారు. సాధు-సన్యాసులు,
పండితులు మొదలైన వ్యక్తుల సత్సంగాలు ఉంటాయి. ఇది మనుష్య సత్సంగము కాదు. దీనిని
ఆత్మిక సత్సంగమని అంటారు. సుప్రీమ్ ఆత్మ, ఆత్మలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు అనగా
సత్సంగము జరుపుతున్నారు. ఇక్కడ మీరు మనుష్యుల నుండి వినరు, అలాగని దేవతల నుండి వినరు.
మీరు భగవంతుడి నుండి వింటారు. భగవంతుడిని సదా నిరాకారుడు అని అంటారు. ఎప్పుడైతే
పిల్లలను భగవాన్-భగవతీలుగా చేయడానికి చదివించవలసి ఉంటుందో, అప్పుడే భగవంతుడు వస్తారు.
భగవంతుడు తప్ప భగవాన్ మరియు భగవతీల పదవిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. కల్ప-కల్పము
సంగమయుగము ఉంటుందని, అప్పుడు నిరాకార భగవంతుడు వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తారని
పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయము కూడా కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు,
ఇతరులెవరైనా కష్టం మీద అర్థం చేసుకోగలరు. శివబాబా తప్పకుండా వస్తారు, కానీ వారికి
బదులుగా శ్రీకృష్ణుడిని గీతా భగవానుడిగా అనేశారు. కనుక అందరి బుద్ధిలోకి తప్పకుండా
మనుష్య తనువే వస్తూ ఉంటుంది. మీరే దైవీ గుణాలు కలవారిగా ఉండేవారు మరియు ఇప్పుడు
ఆసురీ గుణాలు కలవారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ దైవీ గుణాలు కలవారిగా అవుతారు. దైవీ
గుణాలు కలవారిని ఈశ్వరీయ సంప్రదాయులని, ఆసురీ గుణాలు కలవారిని ఆసురీ సంప్రదాయులని
అంటారు. ఇప్పుడు నిరాకార తండ్రి నిరాకార సంప్రదాయులను అనగా ఆత్మలను చదివిస్తున్నారు,
అందుకే ఈశ్వరీయ సాంప్రదాయము లేక ఆత్మిక సాంప్రదాయము అని అంటారు, వారిని ఆత్మిక
తండ్రి వచ్చి చదివిస్తారు. ఇప్పుడు మీరు ఆత్మ-అభిమానులుగా అవుతారు. మనము ఆత్మలము,
తండ్రి మనల్ని చదివిస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని
అంటారు. వారు ఆత్మలనే చదివిస్తారు, వారే నాలెడ్జ్ ఫుల్. ఋషులు-మునులు మొదలైనవారంతా
మాకు తెలియదు, తెలియదు అని అంటూ వచ్చారు అనగా మాకు ఆత్మ గురించి తెలియదు అని అన్నారు.
ఆ జ్ఞానసాగరుడు సమ్ముఖముగా రానంత వరకు జ్ఞానాన్ని ఎలా అర్థం చేయించగలరు? ఇవి బాగా
అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనల్ని మనుష్యులెవరూ చదివించడము లేదు, మనల్ని తండ్రి
చదివిస్తున్నారు. వారు అనంతమైన తండ్రి, నిరాకారుడు. సాకార తండ్రి మరియు నిరాకార
తండ్రి - ప్రతి ఒక్కరికీ ఇద్దరు తండ్రులు ఉంటారని కూడా పిల్లలకు అర్థం చేయించారు.
ఒకరు ఆత్మిక తండ్రి, ఇంకొకరు దైహిక తండ్రి. ఆత్మిక తండ్రియే వచ్చి ఆత్మలను పావనముగా
తయారుచేస్తారు. మనము పావనముగా ఉండేవారమని, పతితులుగా అయ్యామని, మళ్ళీ పతితుల నుండి
పావనముగా ఎలా అవుతాము అనేది మీకు తెలుసు. చిత్రాలు కూడా ఎదురుగా ఉన్నాయి. పదే-పదే
చక్రము ఎదురుగా వెళ్ళి కూర్చున్నట్లయితే - మేమిప్పుడు సంగమయుగములో కూర్చున్నామని
బుద్ధిలోకి ఈ జ్ఞానమంతా వచ్చేస్తుంది. మిగిలినవారంతా తమను తాము కలియుగములో
ఉన్నట్లుగా భావిస్తున్నారు. కలియుగాన్ని ఘోర అంధకారమని అంటారు. ఇప్పుడు మీరు
సంగమయుగములో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రకాశముంది. సత్యయుగములో మళ్ళీ మీకు ఈ జ్ఞానము
లభించదు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడే అత్యంత ప్రకాశము ఉంటుంది. ఈ సంగమయుగము
ఉన్నదే కళ్యాణకారి యుగము. ఇటువంటి యుగము ఇంకేదీ ఉండదు, ఈ యుగములోనే తండ్రి వస్తారు.
సత్యయుగాన్ని కళ్యాణకారి యుగమని అనరు. అక్కడ ఎవరి కళ్యాణము జరగదు. కళ్యాణము
సంగమయుగములోనే జరుగుతుంది. సత్యయుగములో ఎలాగూ కళ్యాణమే ఉంటుంది. సంగమయుగములో
కలియుగాన్ని సత్యయుగముగా, కళ్యాణకారిగా తయారుచేస్తారు. కనుక ఇప్పుడు మీ కళ్యాణము
ఎంతగా జరుగుతుందో చూడండి, కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడములో మీకు
ఎంత సంపాదన ఉంది. సంపాదనకు సంపాదన కూడా ఉంది మరియు ఆరోగ్యానికి ఆరోగ్యము కూడా ఉంది.
మీ జీవితము అమరముగా అవుతుంది. మీకెప్పుడూ అకాల మృత్యువు సంభవించదు. కనుక పిల్లలకు
ఎంత సంతోషముండాలి, ఎందుకంటే మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. పిల్లలైన మీరు
ఇక్కడకు వస్తారు కనుక పురుషార్థము చేసి మ్యూజియంలోని చిత్రాల గురించి అర్థం
చేయించేందుకు యోగ్యులుగా అవ్వాలి. స్వయాన్ని యోగ్యులుగా చేసుకునేందుకు 7-8 రోజులు
కూర్చుని నేర్చుకోండి. ప్రాక్టీస్ అవ్వగానే వెంటనే సేవ కొరకు పరుగుపెట్టాలి. సేవ
చేసి మళ్ళీ తిరిగి రండి. ఇది నేర్చుకోవడము చాలా సహజము. చిత్రాలను ఎదురుగా చూడగానే -
మేము సంగమయుగములో కూర్చున్నామని బుద్ధిలోకి వచ్చేస్తుంది. నేటి ప్రపంచములో చాలామంది
మనుష్యులున్నారు, రేపు చాలా తక్కువమంది ఉంటారు. మిగిలినవారంతా తిరిగి
వెళ్ళిపోనున్నారు. ఇప్పుడు తండ్రి స్వయంగా వచ్చారు, పిల్లలకు ఎంత గౌరవాన్ని ఇస్తారు.
దూరదేశములో నివసించేవారు పరాయి దేశములోకి వచ్చారు... రావణుడి దేశము పరాయి దేశము కదా.
రాముని దేశములోకి రావణుడు ఎప్పుడూ రాలేడు.
ఇప్పుడు పిల్లలైన మీ పాలన తండ్రి చేతుల్లో ఉంది. కేవలం మీతోనే తింటాను అనగా మీ
భండారా నుండే తింటాను... మీ పాలన అంతా ఇక్కడే జరుగుతుంది. ఎవరైతే సరెండర్ అవుతారో,
వారి పాలన అయితే ఎలాగూ జరుగుతుంది. కానీ, ఎవరైతే, ఇదంతా ఈశ్వరునిదే (బాబాదే), నేను
ట్రస్టీను, నేను శ్రీమతమనుసారముగానే నడుచుకుంటూ ఖర్చు చేస్తాను అని మనసు ద్వారా
భావిస్తారో, వారు కూడా శివబాబా భండారా నుండి తింటున్నట్లే. శివబాబా భండారా నుండి
తినడము వలన హృదయము శుద్ధమవుతుంది. అలాగని మిగతావారు శివబాబా భండారా నుండి తినడము
లేదని కాదు. బాబా డైరెక్షన్ల అనుసారముగా నడుచుకునేవారు కూడా బాబా భండారా నుండి
తింటున్నట్లే. ఏ భండారా నుండైతే తింటున్నారో, ఆ భండారా నిండుగా ఉంటుంది, కష్టాలు,
దుఃఖాల నుండి దూరంగా ఉంటుంది... ఇక తర్వాత మీరెప్పుడూ అకాల మృత్యువును పొందరు. ఈ
సమయములోనే శివబాబా వస్తారు, వారి మహిమ కూడా గాయనము చేయబడింది. శివజయంతిని కూడా
జరుపుకుంటారు కానీ వారి భండారా ఎలా ఉంటుంది అనేది ఎవ్వరికీ తెలియదు. బాబా కూడా
తప్పకుండా వస్తారు కదా. పిల్లలు ఎవరు వచ్చినా సరే, వారికి శివబాబా భండారా నుండి
భోజనము లభిస్తుంది. అచ్ఛా, పురుషులు సరెండర్ అయితే మంచిదే, ఒకవేళ వారు సరెండర్
అవ్వకపోతే మాతలు ఏమి చేయగలరు? ఎందుకంటే సంపాదన పతిది. కానీ అతను సరెండర్ అవ్వరు.
అతను సంపాదిస్తేనే పత్ని తినగలుగుతుంది. ఒకవేళ ఇద్దరూ సరెండర్ అయితే, అప్పుడు
శివబాబా భండారా నుండి పాలన జరగగలదు. తండ్రి పిల్లలకు మంచి రీతిలో అర్థం చేయిస్తారు.
కర్మాతీత అవస్థకు చేరుకునేంత వరకు మేము తండ్రి వద్ద కూర్చుని ఉంటామని బుద్ధిలో
ఉండాలి. రోజురోజుకు మనము మన స్వరాజ్యానికి సమీపముగా వస్తూ ఉంటాము. సమయము గడుస్తూ
ఉంటుంది, మీరు సమీపముగా వస్తూ ఉంటారు. సత్యయుగపు మొదటి సంవత్సరానికి ఇప్పుడు ఇంకా
ఎన్ని సంవత్సరాలుందని అంటారు? ఇప్పుడు ఎంత సమీపముగా వచ్చారు? తండ్రి అంటారు -
పిల్లలూ, ఇప్పుడు మీ 84 జన్మల చక్రము పూర్తవుతుంది. మీరిప్పుడు 84 జన్మల చక్రాన్ని
తెలుసుకున్నారు. చక్రాన్ని చూడగానే - మనము ఇప్పుడు సంగమయుగములో ఉన్నామని అంటారు.
ఇటువైపు కలియుగము ఉంది, అటువైపు సత్యయుగము ఉంది. రేపు మనము మన సుఖధామములో ఉంటాము.
ప్రపంచానికి ఇది తెలియదు, వారు పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. పిల్లలైన మీకు చాలా
సంతోషము ఉండాలి. అనంతమైన తండ్రి నుండి మనము 21 జన్మల కోసం సంపాదన చేసుకుంటున్నాము.
సదా సుఖము యొక్క వారసత్వాన్ని పొందుతున్నాము - ఈ సంతోషముంటుంది. స్వర్గవాసులుగా
అవ్వడమనేది మీ భాగ్యములోనే ఉంది. స్వర్గము ఒక అద్భుతమైన స్థానము. 7 అద్భుతాలను
చూపిస్తారు కదా. ఇది అన్నింటికంటే గొప్ప అద్భుతము. అద్భుతమైన స్వర్గము యొక్క
చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు.
అందుకే బాబా ఇలా వ్రాశారు - పైన సూర్యవంశీయులని వ్రాయండి, దాని కింద చంద్రవంశీయులని
వ్రాయండి, అప్పుడు అర్ధకల్పము పూర్తి అయిపోతుంది. సూర్యవంశీయులు 1250 సంవత్సరాలు
ఉంటారు, చంద్రవంశీయులు 1250 సంవత్సరాలు ఉంటారు. అప్పుడిక లక్షల సంవత్సరాలనే మాటే
ఉండదు. అక్కడ బాహుబలం వెనుక ఎంత ఖర్చు అవుతుంది. ఇక్కడ ప్రారంభము నుండి మొదలుకుని
అంతిమము వరకు ఏ ఖర్చు ఉండదు. ఇక్కడ తండ్రి మరియు పిల్లల లెక్క ఉంటుంది, ఖర్చు అనే
మాటే ఉండదు. ఇక్కడకు పిల్లలు వచ్చి రిఫ్రెష్ అవుతారు, అందుకే భవనాలు మొదలైనవి
నిర్మిస్తారు. ఇదంతా పిల్లల ధనమే. అయినా ఇప్పటికి ఎన్ని రోజులు గడిచిపోయాయి, ఇంకా
కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఇందులో ఖర్చు ఏమీ లేదు. పైసా ఖర్చు లేకుండా మీరు
జీవన్ముక్తిని పొందుతారు. ఇందులో కేవలం శ్రమించాల్సి ఉంటుంది. భగవంతుడినైతే
భక్తులందరూ స్మృతి చేస్తారు కానీ భగవంతుడు ఎవరు అనేది తెలియదు. భగవంతుని గురించి
తెలియని కారణముగా అనేకులను భగవంతునిగా భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన
తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి.
అనంతమైన బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా చేయడానికి చదివిస్తున్నారని పిల్లలైన
మీకు అపారమైన సంతోషముండాలి. బాబా వచ్చి స్వర్గాన్ని స్థాపన చేయిస్తారు మరియు
నరకాన్ని వినాశనము చేయిస్తారు. అందుకే మహాభారత యుద్ధము కూడా ఉంది. ప్రతి 5000
సంవత్సరాల తర్వాత ఈ చక్రము తిరుగుతుంది. తండ్రి కూడా కల్ప-కల్పము, కల్పము యొక్క
సంగమయుగములో వస్తారు. గీతలో, వారు ప్రతి యుగములోనూ వస్తారని వ్రాశారు. అలాగైనా కూడా
5 యుగాలున్నాయి కనుక 5 సార్లు రావాలి, మరి అటువంటప్పుడు 24 అవతారాలు, ఫలానా అవతారము
అని ఎందుకు వ్రాశారు! మనుష్యులు ఎన్ని యజ్ఞ-తపాదులు, తీర్థ యాత్రలు మొదలైనవి
చేస్తారు. ఈ మార్గాలన్నీ భగవంతుడిని కలుసుకునేందుకేనని భావిస్తారు. కానీ భగవంతుని
వద్దకు ఎవరూ వెళ్ళలేరు. అర్ధకల్పము ఎంతగా కష్టపడ్డారు. జన్మజన్మలుగా ప్రదక్షిణలు
చేసాము, అది-ఇది చేసాము... అయినా తండ్రి లభించలేదు. ఇప్పుడు తండ్రి, పిల్లలైన మీకు
ఎంత సమీపముగా ఉన్నారు. వారు మీతో మాట్లాడుతున్నారు, మీకు అర్థం చేయిస్తున్నారు.
కల్ప-కల్పము మేము యథావిధిగా ఇలాగే కలుసుకుంటామని మీరు అర్థం చేసుకున్నారు. ఏదైతే
గతించిందో, అది కల్ప-కల్పము జరుగుతుంది. ఈ దాదాయే మళ్ళీ వజ్రాల వ్యాపారిగా ఉంటారు,
వీరిలోనే మళ్ళీ బాబా ప్రవేశిస్తారు, ఆ పిల్లలే మళ్ళీ వచ్చి తండ్రికి చెందినవారిగా
అవుతారు, మళ్ళీ స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. పిల్లలైన మీతో, బాబా యొక్క ఈ అనాది,
అవినాశీ పాత్ర కల్ప-కల్పము ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇది కళ్యాణకారి సంగమయుగము. ఇందులో ప్రతి విషయములోనూ కళ్యాణము ఉంది, సంపాదనే
సంపాదన ఉంది. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ 21 జన్మల కోసం జీవితాన్ని
అమరముగా చేసుకోవాలి.
2. ప్రవృత్తిలో ఉంటూ మనసు, బుద్ధి ద్వారా సరెండర్ అవ్వాలి. శ్రీమతమనుసారముగా
ఖర్చు చేయాలి, పూర్తిగా ట్రస్టీలుగా ఉండాలి.
వరదానము:-
సహయోగ శక్తితో అసహయోగులను సహయోగులుగా చేసే బాబా సమాన పరోపకారీ
భవ
సహయోగము చేసేవారికి సహయోగము చేయడమనేది మహావీరత ఏమీ కాదు,
కానీ ఎలాగైతే బాబా అపకారులకు ఉపకారము చేస్తారో, అలా పిల్లలైన మీరు కూడా బాబా
సమానముగా అవ్వండి. ఎవరు ఎంతగా అసహయోగులుగా ఉన్నా కానీ, మీరు మీ సహయోగ శక్తితో
అసహయోగులను సహయోగులుగా చేయండి. అంతేకానీ ఈ కారణము వలనే వీరు ముందుకు వెళ్ళడము లేదు
అని అనుకోకండి. బలహీనులను బలహీనులుగా భావించి వదిలేయకండి, కానీ వారికి శక్తిని ఇచ్చి
శక్తివంతులుగా చేయండి. ఈ విషయము పట్ల అటెన్షన్ పెట్టినట్లయితే, సేవ యొక్క ప్లాన్లు
అనే ఆభరణాలపై వజ్రాలు మెరుస్తాయి అనగా సహజముగా ప్రత్యక్షత జరుగుతుంది.
స్లోగన్:-
క్రోధానికి
కారణము స్వార్థము మరియు ఈర్ష్య - ఇదే చికాకుకు మూలం, ముందు దీనినే సమాప్తము చేయండి.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
పవిత్రత పునాది మరియు
పునాదికి బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చెయ్యటము అనేది సాధారణ విషయమే. కానీ ఇప్పుడు
ముందుకు వెళ్ళారు కనుక ఇప్పటికీ ఇంకా బాల్యపు స్థితిలోనే ఉండటము కాదు, ఇప్పుడిక
వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలి. నేను బ్రహ్మచారిగానే ఉన్నాను, పవిత్రత అయితే ఉంది
అని కేవలం ఇందులోనే సంతోషపడిపోకండి. ముఖ్యమైన పునాది ఏమిటంటే - మీ సంకల్పాలను
శుద్ధముగా చేయండి, జ్ఞాన స్వరూపముగా చేయండి, శక్తి స్వరూపముగా చేయండి.
సంపూర్ణతను ప్రాప్తి
చేసుకునేందుకు ప్రకాశమణి దాదీగారి గుప్త పురుషార్థము
(19వ పుణ్య స్మృతి
దివసము నిమిత్తముగా విశేష ధారణలు)
1. దాదీజీ అన్ని
బాధ్యతలను సంభాళిస్తూ ఈ లక్ష్యము పెట్టుకున్నారు - నేను సర్వ గుణ సంపన్నముగా, సర్వ
కళలలో సంపన్నముగా, నిర్వికారతలో కూడా సంపన్నముగా అయ్యి సంపూర్ణతా గమ్యాన్ని ప్రాప్తి
చేసుకోవలసిందే.
2. దాదీజీ
మనసా-వాచ-కర్మణాలలో డబుల్ అహింసకులుగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇచ్చారు మరియు
సుఖాన్ని తీసుకున్నారు. మనసుతో కూడా ఏ ఆత్మకు దుఃఖాన్ని ఇవ్వలేదు మరియు దుఃఖాన్ని
తీసుకోలేదు.
3. దాదీజీ సదా ఒక్క
బాబా ఆకర్షణలోనే ఉండేవారు, వారిని ఏ పాత వస్తువులు గాని, వ్యక్తులు గాని లేక తత్వాలు
గాని తమవైపుకు ఆకర్షితము చెయ్యలేదు. సదా ఒక్క బాబా స్మృతిలోనే ఉంటూ తమ సూక్ష్మ
వృత్తులను కూడా ఏకాగ్రము చేసారు.
4. సదా సాక్షీ స్థితి
అనే స్టేజ్ పై ఉంటూ సదా సహచరుని తోడును అనుభవము చేసారు. వారి దృష్టి, వృత్తిలో
ఆత్మికత మరియు అలౌకికత ఉండేవి. వారి సంస్కారాలలో ఎంతటి రాయల్టీ ఉండేదంటే వారికి దేని
వైపుకు దృష్టి వెళ్ళలేదు.
5. వారు ఎవరి
అవగుణాలను మనసులో పెట్టుకోలేదు. వారు ఎవరి అవగుణాలను నోట్ చేయలేదు. సదా పరచింతన,
పరదర్శన మరియు పరమతము నుండి ముక్తులుగా ఉంటూ స్వచింతనలో ఉండేవారు.
6. దాదీజీ బ్రహ్మాబాబా
సమానముగా సదా నిర్మానచిత్తులుగా ఉండేవారు. నిరాకారీ మరియు నిరహంకారీ స్థితిలో ఉండే
అభ్యాసము చేసారు. సదా స్వయాన్ని సేవాధారిగా భావించారు. ఎప్పుడూ తమ మహిమను
స్వీకరించలేదు. ఎవరైనా నిందించినా భయపడలేదు మరియు ఎవరైనా మహిమ చేసినా సంతోషపడలేదు.
ప్రతి విషయములోనూ తమ స్థితిని సమానముగా ఉంచుకున్నారు.
7. బాప్ దాదా నుండి
లభించిన దివ్య బుద్ధి అనే కానుకను చాలా భద్రముగా ఉంచుకున్నారు. సదా సమర్థ సంకల్పాలను
చేసారు. ప్రతి కర్మ శ్రీమతమనుసారముగా ఉండాలి, అందులో కొద్దిగా కూడా మన్మతము గాని,
పరమతము గాని మిక్స్ అవ్వకూడదు, ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ దివ్య బుద్ధి
ఆధారముగా ఉండాలి - ఈ లక్ష్యాన్నే పెట్టుకుని సంపూర్ణతను ప్రాప్తి చేసుకున్నారు.
8. సదా ఒకే బలము, ఒకే
విశ్వాసము, ఒక్కరితోనే సర్వ సంబంధాలు ఉండేవి, దేని వైపూ మోహము గాని, లోబడటము గాని
ఉండేవి కావు. సదా భాయి-భాయి వృత్తితోనే అందరినీ చూసారు మరియు దయా హృదయ గుణాన్ని
ధారణ చేసి బలహీన ఆత్మలలో బలాన్ని నింపారు. అపకారులకు కూడా ఉపకారము చేసారు.
9. చిన్న-పెద్ద ప్రతి
పరిస్థితినీ నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అన్న స్మృతితో దాటారు. ఏ దృశ్యాన్ని అయినా
చూసి ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నలలో చిక్కుకునేందుకు బదులుగా సదా సాక్షీ భావాన్ని
ధారణ చేసి సదా హర్షితముగా ఉండేవారు.
10. వారి ప్రతి మాటలో
రాయల్టీ కనిపించేది. ఏ మాట సాధారణ మాటగా మాట్లాడలేదు. ఏదైతే జరగబోతుందో, వారి నోటి
నుండి ఆ మాటే వచ్చేది. ఇటువంటి సిద్ధి స్వరూప ఆత్మ యొక్క సంకల్పాలు కూడా సిద్ధించిన
కారణముగా సహజముగానే సంపూర్ణతను ప్రాప్తి చేసుకున్నారు.
11. దాదీజీ సదా
ఆత్మవిశ్వాసముతో నిండుగా ఉన్న కారణముగా ఇదే స్మృతిలో ఉండేవారు - నేనైతే కల్ప-కల్పపు
విజయీ ఆత్మను. ఏ పాత సంస్కారాలకు, స్వభావానికి లేక ఏ లెక్కాచారానికి ఆధీనముగా
ఉండేవారు కాదు. ఆత్మ లైట్ యొక్క శరీరములో నివాసము చేస్తూ ఉంది అన్నట్లుగా అనుభవము
చేసారు.
12. దాదీజీ బుద్ధి
స్వచ్ఛముగా, శుభ్రముగా అద్దములా ఉండేది. వారు నిరంతరము తపస్వీమూర్తిగా ఉండేవారు.
వారికి సదా ఈ స్మృతే ఉండేది - ఈ తపస్య ద్వారానే విశ్వ కళ్యాణము జరుగుతుంది, సుఖమయ
ప్రపంచము వస్తుంది.
13. దాదీజీ అంతిమ
సమయాన్ని ఎదురుగా ఉంచుకుని సదా స్వచింతన చేసేవారు. స్వ ఉన్నతి కోసం ప్రతిరోజు
అమృతవేళ బాబాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణను చేసేవారు. బాబా మహావాక్యాలను చాలా
లోతుగా అధ్యయనము చేసారు. బాబాతోపాటు, బాబా మురళి పట్ల కూడా ఎడతెగని ప్రేమ ఉండేది.
14. దాదీజీ తమ
సంపూర్ణ స్థితిని తయారుచేసుకునేందుకు దేహ భానము నుండి అతీతముగా ఉండే అభ్యాసము చేసారు.
వారి బుద్ధిలో సదా ఇదే ఉండేది - నేను విశ్వ కళ్యాణానికి నిమిత్తము, నేను స్వ
స్థితిని ఉన్నతముగా, ఏకాగ్రచిత్తముగా, ఏకరసముగా మరియు సంకల్పాలకు అతీతముగా
నిస్సంకల్పముగా చేసుకోవాలి, అప్పుడు ఈ పాత ప్రపంచము నుండి ఎగిరిపోయి బాబా వద్ద
వతనములోకి వెళ్ళి కూర్చుంటాను అని.
15. నేను బాబా
స్మృతులలో ఉంటూ, అందరినీ సంతుష్టపరిచి అందరి ఆశీర్వాదాలను తీసుకోవాలి, ఏ ఆత్మా నాతో
డిస్టర్బ్ అయ్యి శాపనార్థాలు ఇవ్వకూడదు అని సదా ఇదే తపనలో ఉండేవారు. దీని పట్ల
పూర్తి అటెన్షన్ పెట్టి అందరి ఆశీర్వాదాలకు పాత్రులుగా అయ్యారు.
16. సదా ఒకే ఒక్క
లక్ష్యము ఎదురుగా ఉండేది - నేను సంపన్న ఫరిశ్తాగా మరియు కర్మాతీతముగా అవ్వాలి. ఈ
పాత తనువును వదిలి ఫరిశ్తాగా అయ్యి అవ్యక్తవతనవాసిగా అవ్వాలి. ఈ సేవలైతే
రాత్రింబవళ్ళు నడుస్తూనే ఉంటాయి, నేను సేవతోపాటుగా స్వయం పట్ల సూక్ష్మ అటెన్షన్ ను
పెట్టి పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి.
17. దాదీజీ సదా అన్ని
విఘ్నాలకు అతీతముగా నిర్విఘ్న అవస్థలో ఉండేవారు. వారు ఏకాంతములో కూర్చుని తమను తాము
సూక్ష్మ చెకింగ్ చేసుకుని, తమలోని లోటుపాట్లను, బలహీనతలను, ఆత్మ రూపీ వజ్రముపై ఉన్న
మచ్చలను సంపూర్ణముగా సమాప్తము చేసి అమూల్యమైన వజ్రముగా అయ్యారు.
18. స్వయాన్ని
సంపూర్ణ పావనముగా, లైట్-మైట్ తో సంపన్నముగా చేసుకునేందుకై ఆంతరిక వైరాగ్య వృత్తి
ద్వారా అన్ని విషయాల నుండి ఉపరామముగా ఉంటూ తమ సూక్ష్మ దృష్టిని-వృత్తిని సంపూర్ణ
పావనముగా చేసుకున్నారు. పాత సంస్కారాల ప్రకృతిని ఓడించి ప్రకృతీజీత్ గా అయ్యి బాబా
ఒడిలో ఇమిడిపోయారు.
19. నేను బాబాకు చెంది
ఉన్నాను, నేను బాబా సమానముగా సంపూర్ణముగా అవ్వాల్సిందే, అందుకే సూక్ష్మ
దేహాభిమానాన్ని, స్వయం యొక్క సంస్కారాలను, పేరు ప్రతిష్ఠల మహిమను, బుద్ధిని మరియు
అలవాట్లను సంపూర్ణ సమర్పణ చేసారు మరియు బాబా సమానముగా అయ్యి అవ్యక్తవతనవాసిగా
అయ్యారు. అచ్ఛా - ఓం శాంతి.