‘‘ఇంటి యొక్క గేటును తెరిచేందుకు అనంతమైన వైరాగ్య
వృత్తి ద్వారా దేహ-అభిమానపు ‘నేను’ అన్నదానిని త్యాగము చేయండి,
జన్మ దినము నాడు దృఢత ద్వారా చెప్పటము మరియు చెయ్యటమును
ఒక్కటిగా చేసి సఫలతామూర్తులుగా అవ్వండి’’
ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూసి
హర్షితులవుతున్నారు. నలువైపుల నుండి వాహ్ బాబా వాహ్ అన్న ఈ
హృదయ ధ్వనియే వస్తూ ఉంది! మరియు బాబా హృదయము నుండి వాహ్ పిల్లలూ
వాహ్ అన్న ఈ ధ్వనియే వస్తుంది! ఈ రోజు అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో
దివ్య జన్మ యొక్క సంతోషాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజు
సంతోషాన్ని జరుపుకుంటున్నారు కూడా మరియు తోడుగా బాబా కూడా
పిల్లల సంతోషాన్ని జరుపుతున్నారు. ఈ రోజు తండ్రి మరియు పిల్లలు,
ఇరువురి జన్మదినము, ఇది విచిత్ర జయంతి యొక్క రోజు. కనుక మీరందరూ
అభినందనలను ఇస్తున్నారు కూడా మరియు తీసుకుంటున్నారు కూడా
ఎందుకంటే బాబా జన్మను తీసుకున్నదే యజ్ఞాన్ని రచించడము కోసం. మరి
యజ్ఞములో బ్రాహ్మణ పిల్లలే కావాలి. తండ్రి మరియు పిల్లల జయంతి
కలిసిన జయంతి ఈ ఒక్క జయంతియే, అందుకే ఈ శివ జయంతిని వజ్రతుల్య
జయంతి అని అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత స్నేహముతో
అభినందనలను ఇచ్చేందుకు వచ్చారు అన్నదానిని బాబా చూస్తున్నారు
మరియు బాబా కూడా అభినందనలను ఇచ్చేందుకు వచ్చారు. ఈ జయంతి అతి
స్నేహము గల జయంతి. స్నేహీ పిల్లలు, స్నేహీ తండ్రి మరియు స్నేహ
జయంతి.
బాప్ దాదా వద్దకు నలువైపులా గల దేశ, విదేశాలలోని పిల్లలందరి
స్నేహము చేరుకుంటూ ఉంది. బాబా ఒక్కొక్క స్నేహీ బిడ్డకు పదమాల
రెట్లు స్నేహముతో నిండిన అభినందనలను ఇస్తున్నారు. ఈ స్నేహము
ప్రతి బిడ్డను సహజ కర్మయోగిగా చేస్తుంది. ఈ స్నేహము సదా సహజముగా
చేసేటువంటిది, శక్తిశాలిగా చేసేటువంటిది. ఇది బాప్ దాదా ఒక్కరి
జన్మదినమే కాదు ఎందుకంటే బాబా సదా పిల్లలతో పాటు కలిసి ఉండేవారు.
కలిసి ఉంటారు, కలిసి వెళ్తారు, కలిసి రాజ్యము చేస్తారు. మీ
అందరిదీ ఇదే ప్రతిజ్ఞ కదా! కలిసి ఉండాలి, కలిసి ఎగరాలి మరియు
కలిసి రాజ్యము చేయాలి!
బాప్ దాదాకు ఈ రోజు మీ భక్తులు కూడా విశేషముగా
గుర్తుకువస్తున్నారు ఎందుకంటే మీరు ఏదైతే చేశారో దానిని మీ
భక్తులు చాలా బాగా కాపీ చేసారు ఎందుకంటే ద్వాపరములో పరంధామము
నుండి మొట్టమొదటగా వచ్చారు, మొదటి జన్మ సదా సతోప్రధానముగా
ఉంటుంది, అందుకే వారు కాపీ కూడా చాలా బాగా చేసారు. ఈ రోజున
పిల్లలతో పాటు మీ భక్తులు కూడా గుర్తుకువస్తున్నారు.
వతనములోనైతే ఈ రోజు అమృతవేళ నుండి చాలామంది పిల్లల ప్రకాశము
ఉంది. నేను బాప్ దాదాకు నా అభినందనలను ఇస్తాను అని ప్రతి బిడ్డ
భావించారు మరియు బాప్ దాదా కూడా ప్రతి బిడ్డ యొక్క అభినందనలను
చాలా స్నేహముతో స్వీకరించారు. వతనములో ఈ రోజు ఈ మేళా జరిగింది.
ఒకవైపు పిల్లలైన మీరు ఉన్నారు, మరొకవైపు అడ్వాన్స్ పార్టీలోకి
వెళ్ళి ఉన్న మీ సహచరులు వచ్చి ఉన్నారు. మీ దాదీలు మరియు అనన్య
సోదరుల లిస్ట్ చాలా పెద్దగా ఉండటాన్ని బాప్ దాదా చూసారు.
ఒక్కొక్క దాదీ బాప్ దాదాకు కూడా అభినందనలను తెలిపారు,
దానితోపాటు భాగ్యశాలి పిల్లలైన మీకు కూడా అభినందనలను తెలిపారు.
వతనములో ఈ రోజు అభినందనల మేళా జరిగింది. అడ్వాన్స్ పార్టీకి
చెందిన విశేషమైన దాదీలు మరియు సోదరులు విశేషముగా నిమిత్తమై
తోడుగా ఉండే ఆత్మలైన మీ అందరినీ గుర్తు చేస్తూ చాలా
హృదయపూర్వకముగా అభినందనలను ఇస్తూ ఉన్నారు. మీ అందరికీ బాప్ దాదా
అందరి తరఫు నుండి కూడా అభినందనలను ఇస్తున్నారు. స్వీకరించారా?
ఇప్పుడు విశేషముగా అందరు సోదరీ-సోదరులదీ ఒకటే మాట ఉంది,
అదేమిటంటే - ఇప్పుడు ఇంటి గేటును ఎప్పుడు తెరుస్తారు! విశేషముగా
దీదీ, దాదీలు ఇలా చెప్పారు - ఇంటికి వెళ్ళేందుకు ఏ తారీఖును
ఫిక్స్ చేసారు అని మా సఖులను, సోదరులను మా వైపు నుండి అడగండి.
అందరూ కలిసే వెళ్తారు కదా! విడివిడిగా అయితే వెళ్ళరు కదా?
ద్వారాన్ని తెరిచేందుకు అందరూ కలిసి హాజరవుతారు. వారు డేట్
అడుగుతూ ఉన్నారు. బాప్ దాదా నవ్వారు ఎందుకంటే ఇప్పుడు గేటును
తెరిచేందుకు పిల్లలందరికీ అనంతమైన వైరాగ్య వృత్తి అవసరము అని
బాబా కూడా కోరుకుంటున్నారు. గేటును తెరిచేందుకు ఇదే తాళంచెవి.
బాప్ దాదా అయితే సదా ఇలా అంటూ ఉంటారు - అనంతమైన వైరాగిగా అయ్యి
వ్యర్థ సంకల్పాలు మరియు వ్యర్థ సమయము, రెండింటినీ కలిపి అతి
త్వరగా త్యాగము చేయాలి అనగా అనంతమైన వైరాగిగా అవ్వాలి ఎందుకంటే
అన్నింటికన్నా పెద్ద విఘ్నము దేహ-అభిమానము అన్నది బాప్ దాదా
చూసారు. ఈ దేహ-అభిమానాన్ని త్యాగము చెయ్యటము, నడుస్తూ-తిరుగుతూ
దేహీ-అభిమానులుగా అవ్వటము, ఇదే అనంతమైన వైరాగ్యము.
నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా అని అయితే అందరూ అంటారు.
ఎప్పుడైతే హృదయము నుండి ‘నా’ అని అంటారో, ఈ దేహ-అభిమానము ఏదైతే
‘నేను’ అనే రూపములో వస్తుందో, బాబా ఎప్పుడూ చెప్తుంటారు - ఈ
‘నేను’ అన్న భానము ఏదైతే వస్తూ ఉంటుందో, నేను ఏదైతే చేస్తానో,
నేను ఏదైతే చెప్తానో అదే కరక్ట్ అనుకుంటారు. ఒక ‘నేను’ అనేది
సాధారణమైనది, నేను ఆత్మను మరియు ఇది నా శరీరము. మరొకటి
సూక్ష్మమైన నేను, వినిపించాము కదా, నేను ఇది చేసాను, నేను ఇది
చెయ్యగలను, నేనే కరక్ట్... ఈ సూక్ష్మమైన నేను అన్నదానిని
సమాప్తము చేయాలి. దేహ-అభిమానము ఈ రూపములో వస్తుంది. ఈ రోజున ఈ
సూక్ష్మమైన నేను అన్నదానిని, దాని వలన ఒక్కోసారి తండ్రి నింపిన
విశేషతలను కూడా తమవిగా భావించి ‘నేను’ అన్న భానమును ఉంచుతారు,
ఆ సూక్ష్మమైన నేను అనేదానిని సమాప్తము చేయండి. చూడండి,
స్మృతిచిహ్నాలను ఏదైతే తయారుచేస్తారో అందులో కూడా బలిని
ఇచ్చేటప్పుడు స్వయాన్ని బలి ఇచ్చుకోరు, దేనిని బలి ఇస్తారు?
మేకను. మేకను ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే మేక మే, మే అనే
అంటుంది. భక్తులు కాపీ అయితే చాలా బాగా చేసారు. ఈ రోజున ఈ
దేహ-అభిమానపు నేను అన్నదానిని పురుషార్థము చేసి సమాప్తము
చెయ్యగలరా? తండ్రి పుట్టినరోజున వచ్చారు కనుక ఏదైనా కానుకనైతే
ఇస్తారు కదా! బాబాకు వేరే ఏ కానుక అవసరము లేదు, ఈ సూక్ష్మమైన
నాది అనే భావాన్ని, ఈ జన్మదినము నాడు బాబాకు కానుకగా ఇవ్వండి
అని బాబా అంటారు. ఇవ్వగలరా? ఇస్తారా? ఉందా ధైర్యము? ధైర్యము
ఉందా? చేతులెత్తండి. చేతులెత్తి అయితే సంతోషపరిచారు.
చేతులెత్తారు అంటే కానుకను ఇచ్చేసారు కదా! ఇచ్చేసిన కానుకను
ఎవరైనా తిరిగి తీసుకుంటారా? కొంతమంది పిల్లలు అంటారు - బాబా,
మేము కోరుకోము కానీ అది వచ్చేస్తుంది. కారణము ఏమిటి? ఒకవేళ
కారణాన్ని అడిగినట్లయితే చాలా మంచి జవాబు ఇస్తారు. ఏమంటారంటే -
తెలుసు కూడా, ఒప్పుకుంటాము కూడా, కానీ ఏం చేయాలి, అది తిరిగి
వచ్చేస్తుంది. ఆలోచించండి! ఒకవేళ ఇచ్చేసిన వస్తువు తిరిగి మీ
వద్దకు వస్తే దానిని మీ వద్ద ఉంచుకుంటారా? ఒకవేళ మీరు
హృదయపూర్వకముగా ఇచ్చారనుకోండి, అది ఒకవేళ తిరిగి వచ్చినా,
దానిని మీ వద్ద ఉంచుకుంటారా? కారణము ఏమిటి? బాబాపై ప్రేమ ఉంది
కదా, ప్రేమ ఉన్న కారణముగా బాబా ఏదైతే చెప్తారో అది చెయ్యాలని
అనుకుంటారు, బాబా వద్దకు కూడా ఈ రిజల్టు వస్తుంది కానీ ఏమిటంటే,
దృఢత తక్కువగా ఉంది, దృఢతను ఉపయోగించండి. సంకల్పము చేస్తారు
కానీ ఒకటేమో సంకల్పము చెయ్యటము, మరొకటి దృఢ సంకల్పము చెయ్యటము.
కావున పదే-పదే చేసిన సంకల్పములో దృఢతను తీసుకురావటము, ఈ
అటెన్షన్ తక్కువగా ఉంది. దృఢత సఫలతకు తాళంచెవి. మరి ఈ రోజు ఏం
చేస్తారు? సంకల్పము చేస్తారా లేక దృఢ సంకల్పము చేస్తారా? ఒకవేళ
మీది దృఢ సంకల్పము అయినట్లయితే దానికి గుర్తు ఏమిటంటే, దృఢత
సఫలతకు తాళంచెవి. తాళంచెవిని ఉపయోగించడములో లోపము ఉండిపోతుంది,
అందుకే సంపూర్ణ సఫలత లభించదు.
ఈ రోజు బాప్ దాదాతో పాటు పిల్లల పుట్టినరోజు కూడా, బాబా
పుట్టినరోజు కూడా. మరి ఇది విశేషమైన రోజు కదా! మొత్తము
కల్పమంతటిలో తండ్రి, పిల్లలు ఒకే సమయములో జన్మించటము, ఈ
పుట్టినరోజు విశేషత ఇదే. ఈ రోజు బాబా ఇదే కోరుకుంటున్నారు -
ప్రతి బిడ్డ ఈ రోజు తమ హృదయములో దృఢతను తీసుకువచ్చి ఈ దృఢ
సంకల్పము చేయాలి, అదేమిటంటే - మేము సంకల్పాలను మరియు సమయాన్ని
వ్యర్థముగా పోగొట్టకూడదు. ఎందుకంటే ఒకవేళ మొత్తము రోజంతటినీ
అటెన్షన్ తో చెక్ చేసుకున్నట్లయితే మధ్యమధ్యలో సమయము మరియు
సంకల్పాలు వ్యర్థముగా పోతుంటాయి. బాప్ దాదా అయితే అందరి
రిజిస్టర్ ను చూస్తారు కదా! వాటిని రక్షించటము అనగా సమాప్తి
సమయాన్ని సమీపముగా తీసుకురావటము. సిద్ధముగా ఉన్నారా? లేక
ఇప్పటికీ కూడా - అది వచ్చేస్తుంది, ఏం చేయాలి అని అంటారా?
వ్యర్థము యొక్క పని రావటము, మీ పని ఏమిటి? కూర్చోబెట్టడమా?
కూర్చోబెడుతున్నారు కావుననే అది కూడా ఇంటిని తయారుచేసుకుంది.
దృఢత లేదు అని అది కూడా అర్థం చేసుకుంది. అందుకే నేటి ఈ స్నేహము
యొక్క రోజున అందరి హృదయాలలో ఇప్పుడు ఏముంది? అమృతవేళ నుండి
మొదలుకుని ఈ రోజు హృదయములో పదే-పదే ఏం వస్తుంది? నా బాబా, నా
బాబా, నా బాబా. బాబా హృదయములో కూడా నా పిల్లలు, నా పిల్లలు, నా
పిల్లలు... అని ఉంది. మెజారిటీ బాబా స్మృతిలో ఉన్నారు. ఈ రోజు
యొక్క ప్రభావము ఉంది అన్నదానిని బాప్ దాదా నోట్ చేసారు. స్నేహము
యొక్క రోజు అయిన కారణముగా పదే-పదే అందరికీ నా బాబా, నా బాబా
అన్నది చాలా సమయము గుర్తు ఉంది. అంతేనా! ఇందులో చేతులెత్తండి.
ఇది ఈ రోజు విషయము. నా బాబా అన్నది గుర్తు ఉందా? మరేదైనా గుర్తు
ఉందా? లేదు కదా? అలా అలా చేతులెత్తుతున్నారు. చాలా మంచిది.
ప్రతి రోజూ పదే-పదే చెక్ చేసుకోండి, సంగమయుగములోని ప్రతి రోజు
బాబా యొక్క స్నేహపు రోజు. ఈ రోజు విశేషమైన రోజు అయిన కారణముగా
ఎక్కువ స్మృతి ఉంది కదా! అలాగే సదా అమృతవేళ ఇది స్మృతిలో
ఉంచుకోండి - ఈ సంగమములోని ఒక్కొక్క రోజు ఎంత గొప్పది! ఒక్క
చిన్నని జన్మలో 21 జన్మల ప్రాప్తి గ్యారంటీ. మరి ఒక్కొక్క
రోజుకు ఎంతటి మహత్వము ఉన్నట్లు! 21 జన్మలు ఎక్కడ మరియు ఈ
చిన్నని ఒక్క జన్మ ఎక్కడ.
బాప్ దాదా ఈ రోజు పిల్లలైన మీ వద్ద నుండి పుట్టినరోజుకు ఈ
కానుకను కోరుకుంటున్నారు. కానుకను ఇస్తారా? ఇస్తారా?
చేతులెత్తండి. దృఢ నిశ్చయము అనే చేతిని ఎత్తండి. చూస్తాములే,
చేస్తాములే అని కాదు. చెయ్యాల్సిందే. ఏమైనా కానీ త్యాగమంటే
త్యాగమే. ఇది త్యాగము కాదు కానీ భాగ్యము. మరి ఈ రోజున ఒకవేళ
సరిగ్గా చేతులెత్తినట్లయితే ఇది మహత్వపూర్ణమైన రోజు అయినట్లు
కదా! ఇప్పటినుండి మీ ముఖముపై వ్యర్థము యొక్క సమాప్తి మరియు సదా
స్మృతి స్వరూపము యొక్క ప్రకాశము ముఖము మరియు నడవడికలో రావాలి.
మాయ యొక్క పదాలు ఉన్నాయి కదా - ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎలా...
ఇవి సమాప్తమైపోవాలి, అప్పుడు ముఖము మరియు నడవడిక సేవ చేస్తాయి.
ఇప్పుడు ఎక్కువ ప్రభావము భాషణలది ఉంది. భాషణలు చాలా బాగా
చేస్తున్నందుకు బాప్ దాదాకు సంతోషము ఉంది కానీ రోజురోజుకు ఏ
విధముగా ఇప్పుడు ఈ భాషణల ద్వారా, వాణి ద్వారా సేవ యొక్క
ఉల్లాస-ఉత్సాహాలను చాలా బాగా ఉంచారో మరియు సఫలతను కూడా పొందారో,
అలాగే ఇప్పుడు సమయమనుసారముగా ఎక్కువ సేవ మీ ముఖము మరియు నడవడిక
ద్వారా జరుగుతుంది. దాని అభ్యాసము, ఏ విధముగా భాషణల అభ్యాసాన్ని
చేస్తూ-చేస్తూ తెలివైనవారిగా అయిపోయారు కదా! అలా ఇప్పుడు ముఖము
మరియు నడవడిక ద్వారా ఎవరికైనా కూడా సంతోషము యొక్క వరదానాన్ని
ఇవ్వండి. ఈ అభ్యాసము చేయండి. ఎందుకంటే సమయము తక్కువగా
లభిస్తుంది కావున సమయానికి మరియు సంకల్పాలకు మహత్వాన్ని ఇస్తూ
ముందుకు వెళ్తూ ఉండండి. అంతా అకస్మాత్తుగానే అయ్యేది ఉంది.
పుట్టినరోజు అయితే గుర్తు ఉంటుంది కదా! పుట్టినరోజు రావాలి,
రావాలి అని ఎంత సమయము గుర్తు వచ్చింది? బాప్ దాదా రావాలి,
రావాలి, కలవాలి, దీనిని ఎంత సమయము నుండి గుర్తు ఉంచుకున్నారు?
ఇప్పుడు ఈ సంకల్పాన్ని చేయండి, దృఢతతో వ్యర్థ సమయాన్ని మరియు
వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేయాలి. నా బాబా, నా బాబా అనేదానిని
మనసులో ఉంచుకుంటూ, చెప్పటము వేరే సంగతి, కానీ హృదయములో
ఇముడ్చుకోవటము, హృదయానికి చెందిన విషయాన్ని ఎప్పుడూ మర్చిపోరు.
నోటి నుండి వచ్చే విషయము మర్చిపోవచ్చు కానీ హృదయానికి చెందిన
విషయము, అది మంచిదైనా, వ్యర్థమైనదైనా, రెండింటినీ మర్చిపోరు. ఈ
రోజు బాప్ దాదాకు కానుకనైతే ఇచ్చారు కదా! రెండేసి చేతులెత్తండి.
అరే, వాహ్! ఈ ఫోటోను తియ్యండి. బాప్ దాదా కేవలం చేతులను చూడరు,
బాప్ దాదా మీ హృదయాలను చూస్తున్నారు.
ఈ రోజు యొక్క కానుకను మీకు కూడా ఇచ్చుకున్నారు మరియు బాబాకు
కూడా ఇచ్చారు. ఒకవేళ మీ వ్యర్థ సమయము మరియు సంకల్పాలు
రక్షింపబడినట్లయితే మీ రోజు ఎలా గడుస్తుంది? సదా అదృష్టవంతులు
మరియు ఆనందము కలవారిగా అయిపోతారు. ఇప్పుడు అమృతవేళ బాప్ దాదాతో
మిలనము జరుపుకున్న తర్వాత ఈ సంకల్పాన్ని ప్రతిరోజు స్మృతిలోకి
తెచ్చుకోండి మరియు మొత్తము రోజంతటిలో మధ్యమధ్యలో చెక్ చేసుకోండి.
బాప్ దాదా టైమ్ ను ఫిక్స్ చెయ్యరు కానీ మీరు మీ టైమ్ ను ఫిక్స్
చేసుకోండి. మధ్యమధ్యలో చెక్ చేసుకోండి, పుట్టినరోజు నాడు బాప్
దాదా ముందు ఏ ప్రతిజ్ఞనైతే చేశారో ఆ ప్రతిజ్ఞను
నిలబెట్టుకుంటున్నారా? దీనిని మీకు మీరే చెక్ చేసుకోండి.
కోరుకోవటమైతే అందరూ కోరుకుంటారు. బాప్ దాదా ఈ రోజు అందరి
ముఖాలలో చూస్తున్నారు, కోరుకుంటున్నారు, ఆ, చేస్తాము, చేస్తాము,
చేస్తాము అని అనుకుంటున్నారు, కానీ ఈ వ్యర్థము వచ్చేస్తుంది కదా,
అది బాబాతో చేసిన ప్రతిజ్ఞను కూడా మరపింపజేస్తుంది. కనుక
వ్యర్థము సమాప్తము. ఇప్పుడు కూడా ఒక్క క్షణము శక్తిశాలి ఆత్మగా
అయ్యి సంకల్పము చేయండి - వ్యర్థాన్ని సమాప్తము చెయ్యవలసిందే. (బాప్
దాదా డ్రిల్ చేయించారు) అచ్ఛా!
బాప్ దాదా ఒక్క బిడ్డను కూడా తమ సమానముగా తయారుచేయకుండా
ఉండలేరు. ప్రేమ ఉంది కదా! చూడండి, ప్రేమకు గుర్తు ఈ రోజు. బాబా
మరియు పిల్లల జన్మ ఒకే రోజు ఉండటము, మొత్తము కల్పములో బాబా
మరియు పిల్లల ఇటువంటి రోజు మరొకటి ఉండదు. బాబాకు ఒక్కొక్క
బిడ్డ పట్ల హృదయపూర్వక ప్రేమ ఉంది - నా బిడ్డ, పరమాత్ముని
బిడ్డ, ఏ సంకల్పము చేసినా ఆ సంకల్పము సఫలమవ్వాలి. ఒక్కొక్క
సంకల్పములో శక్తి ఉండాలి, చెప్పటము మరియు చెయ్యటము ఒక్కటిగా
ఉండాలి. చెప్పారు అంటే జరగటమే. శుద్ధ సంకల్పము ఉండాలి. అప్పుడు
వ్యర్థము స్వతహాగానే సమాప్తమైపోతుంది ఎందుకంటే అడ్వాన్స్
పార్టీవారు డేట్ కోరుకుంటున్నారు. మీ పెద్ద-పెద్ద దాదీలు,
పెద్ద-పెద్ద సోదరులు, వారందరి పట్ల ప్రేమ అయితే ఉంది కదా!
దాదీని, దీదీని, చంద్రమణి దాదీని ఎంత గుర్తు చేసుకుంటారు? అందరి
పేర్లు తీసుకుంటూ వెళ్ళండి. అందరినీ గుర్తు చేసుకుంటారు. మరి
వారు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసి చెప్పండి కదా. మరి ఈ రోజు
ఏ సంకల్పము ఉంది? చెప్పటము మరియు చెయ్యటము ఒక్కటిగా ఉండాలి.
సరేనా! ఈ రోజు నలువైపులా ఉన్న పిల్లలకు బాప్ దాదా పుట్టినరోజు
కానుకగా ఇదే ఇస్తున్నారు - ‘‘చెప్పటము మరియు చెయ్యటము’’ దీనిని
ఒక్కటి చేయండి. దృఢత అనే కానుకను ఈ రోజు సందర్భముగా బాప్ దాదా
ప్రతి బిడ్డకు ఇస్తున్నారు. శుభకార్యాన్ని దృఢతతో సఫలం చేయండి.
ఇకపోతే, ఈ రోజు మొదటిసారిగా ఎవరైతే వచ్చారో వారు లేవండి.
చేతులు ఊపండి. పిల్లలు వచ్చేశారు, నా బాబా అన్నది
తెలుసుకున్నారు, ఇందుకు బాప్ దాదా వచ్చిన పిల్లలకు చాలా-చాలా
అభినందనలను ఇస్తున్నారు. బాప్ దాదాకు సంతోషముగా ఉంది, ఎంతైనా
అలజడి ఏదైతే జరిగేది ఉందో దానికంటే ముందే చేరుకున్నారు, అందుకు
అభినందనలు. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డ ఈ సంకల్పము చేయండి, దృఢ
సంకల్పము చేయండి, సాధారణ సంకల్పము కాదు, దృఢ సంకల్పము చేయండి -
తీవ్ర పురుషార్థిగా అవ్వాల్సిందే. తీవ్ర పురుషార్థీ, అంతేకానీ
సాధారణ పురుషార్థీ కాదు. అప్పుడు రాబోయే మీ రాజ్యములో
వచ్చేస్తారు. అందుకే సాధారణ సంకల్పము చేసే సమయము పూర్తయిపోయింది.
ఇప్పుడిది తీవ్ర పురుషార్థము చేసే సమయము, ఛాన్స్ ఉంది, ఛాన్స్
తీసుకునే ఛాన్సలర్లుగా అయిపోయారు. బాప్ దాదా ప్రతి బిడ్డను చూసి
సంతోషిస్తున్నారు మరియు ప్రతి బిడ్డకు ఇలా చెప్తున్నారు -
తీవ్ర పురుషార్థము చేసినట్లయితే కలిసి వెళ్తారు, కలిసి ఉంటారు.
అభినందనలు, అభినందనలు, అభినందనలు.
ఒక్కరు కూడా వెనుక ఉండిపోకూడదని బాప్ దాదా మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నారు. కలిసి వెళ్ళాలి. వెనుక-వెనుక వచ్చేవారు మంచిగా
అనిపించరు. కలిసి ఉండాలి, చెయ్యి ఉండాలి. ఇంటికి వెళ్ళాలి కదా.
రిటర్న్ జర్నీ. దాని కోసం బ్రహ్మాబాబా ఏ విధముగా ఫరిశ్తా
అయ్యారో, అలా ఫాలో ఫాదర్. సాకారములో ఉంటూ ఫరిశ్తా, ఎవరిని
చూసినా ఫరిశ్తాయే ఫరిశ్తా. అప్పుడు గేట్ తెరుచుకుంటుంది. అచ్ఛా!
సదా అదృష్టవంతులుగా, ఆనంద స్వరూపులుగా ఉన్నందుకు పిల్లలందరికీ
ప్రియస్మృతులు.