ఓంశాంతి
అన్ని సెంటర్లలోని మధురాతి మధురమైన పిల్లలందరూ పాటను విన్నారు. అనంతమైన తండ్రి నుండి
మళ్ళీ 5 వేల సంవత్సరాల క్రితం వలె మనము విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నామని
అందరికీ తెలుసు. కల్ప-కల్పము మనము తీసుకుంటూ వచ్చాము. రాజ్యాధికారాన్ని తీసుకుంటాము,
మళ్ళీ పోగొట్టుకుంటాము. ఇప్పుడు మనము అనంతమైన తండ్రి ఒడిలోకి వచ్చాము మరియు వారికి
సంతానముగా అయ్యామని పిల్లలకు తెలుసు, నిజంగానే మీరు వారి పిల్లలు. ఇంటిలో కూర్చుని
ఉంటూ పురుషార్థము చేస్తారు. అనంతమైన తండ్రి నుండి ఉన్నత పదవిని పొందేందుకని చదువు
కొనసాగుతూ ఉంది. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత అయిన శివబాబాయే మన
తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అని మీకు తెలుసు. వారి నుండి మనము
వారసత్వాన్ని తీసుకుంటాము కనుక ఉన్నత పదవిని పొందేందుకు ఎంత పురుషార్థము చేయాలి.
అజ్ఞానకాలములో కూడా స్కూల్లో చదువుకునేటప్పుడు, తమ చదువు అనుసారముగా, నంబరువారు
మార్కులతో పాస్ అవుతారు. అక్కడ ఎవ్వరూ - మాయ మాకు విఘ్నాలను కలిగిస్తుందని లేక
తుఫానులు వస్తున్నాయని అనరు. సరిగ్గా చదువుకోరు లేదా చెడు సాంగత్యములో చిక్కుకుంటారు
లేదా ఆటపాటల్లో నిమగ్నమైపోతారు, అందుకే చదవరు, ఫెయిల్ అయిపోతారు. అంతేకానీ, వాటిని
మాయా తుఫానులు అని అనరు. నడవడిక సరిగ్గా లేకపోతే టీచర్ కూడా - వీరి నడవడిక బాగోలేదు
అని సర్టిఫికెట్ ఇస్తారు. చెడు సాంగత్యము వలన పాడైపోయారు, ఇందులో మాయా రావణుడిని
దోషిగా చేసే విషయమేమీ లేదు. ప్రముఖులైన మంచి వ్యక్తుల పిల్లల్లో, కొంతమంది మంచి
ఉన్నతిని పొందుతారు, కొంతమంది మద్యం మొదలైనవి తాగడము మొదలుపెడతారు, అశుద్ధత వైపుకు
వెళ్ళిపోతారు, అప్పుడు ఆ తండ్రి కూడా వారిని కుపుత్రులైపోయారని అంటారు. ఆ
చదువులోనైతే అనేక సబ్జెక్టులు ఉంటాయి, ఇక్కడైతే ఒకే రకమైన చదువు ఉంది. అక్కడ
మనుష్యులు చదివిస్తారు, ఇక్కడ మనల్ని భగవంతుడు చదివిస్తున్నారని, మనము మంచి రీతిలో
చదువుకున్నట్లయితే విశ్వానికి యజమానులుగా అవ్వగలమని పిల్లలకు తెలుసు. పిల్లలైతే
చాలామంది ఉన్నారు - కొంతమంది సాంగత్య దోషములోకి వచ్చి చదవలేకపోతారు. దీనిని మయా
తుఫాను అని ఎందుకు అనాలి. ఎవరైనా సాంగత్య దోషములోకి వచ్చి చదవకపోతే, ఇందులో మాయ
అయినా, టీచర్ అయినా లేక తండ్రి అయినా ఏం చేస్తారు! చదవలేకపోతే తమ ఇంటికి
వెళ్ళిపోతారు. డ్రామానుసారముగా మొదట భట్టీలోకి రావలసే వచ్చింది, వచ్చి శరణు
తీసుకున్నారు. కొంతమందిని పతి కొట్టారు, విసిగించారు, మరికొంతమందికి వైరాగ్యము
కలిగింది, ఇక ఇంటిలో ఉండలేకపోయారు. కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ వెళ్ళిపోయారు,
వారు చదవలేకపోయారు, ఇక వెళ్ళి ఉద్యోగము మొదలైనవాటిలో నిమగ్నమైపోయారు లేక వివాహము
చేసుకున్నారు. మాయా తుఫానుల వలన చదవలేకపోతున్నాము అని అనడము ఒక సాకు వంటిది.
సాంగత్య దోషము కారణముగా ఈ పరిస్థితి ఏర్పడిందని మరియు మాలో వికారాలు చాలా ఎక్కువగా
ఉన్నాయని వారు అర్థం చేసుకోరు. మాయా తుఫానులు వచ్చాయి, అందుకే పడిపోయాము అని ఇలా
ఎందుకు అంటారు, ఇది మీపైనే ఆధారపడి ఉంది.
తండ్రి, టీచర్, సద్గురువు ద్వారా ఏ శిక్షణ అయితే లభిస్తుందో, దానిపై నడుచుకోవాలి.
అలా నడుచుకోవడము లేదంటే ఏదైనా చెడు సాంగత్యము ఉన్నట్లు లేదా కామము యొక్క నషా
ఉన్నట్లు లేదా దేహాభిమానపు నషా ఉన్నట్లు. మేము అనంతమైన తండ్రి నుండి విశ్వ
రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు చదువుకుంటున్నామని అన్ని సెంటర్ల వారికి తెలుసు.
నిశ్చయము లేకపోతే అసలు ఎందుకు కూర్చున్నారు, ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయి. కానీ
అక్కడైతే ఏ ప్రాప్తి లేదు, లక్ష్యము-ఉద్దేశ్యము లేదు. అవన్నీ చిన్న-చిన్న
మఠాలు-మార్గాలు, కొమ్మలు-రెమ్మలు వంటివి. వృక్షము వృద్ధి చెందాల్సిందే. ఇక్కడైతే, ఈ
కనెక్షన్ అంతా ఉంది. మధురమైన దైవీ వృక్షానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారు మళ్ళీ
ఇక్కడికి వచ్చేస్తారు. అందరికన్నా మధురమైనవారు ఎవరు? ఎవరైతే సత్యయుగ మహారాజా,
మహారాణిగా అవుతారో వారు. మొదటి నంబరులోకి వచ్చేవారు ఎవరైతే ఉంటారో, వారు తప్పకుండా
చదువును బాగా చదువుకుని ఉంటారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారే
సూర్యవంశములోకి వెళ్ళారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ, సమర్పిత జీవితాన్ని గడుపుతూ,
చాలా సేవ చేస్తున్నవారు కూడా ఉన్నారు. తేడా ఉంది కదా. ఇక్కడ ఉన్నా కానీ ఎవరైనా
చదివించలేకపోతే, వేరే సేవలలో నిమగ్నమైపోతారు, వారు చివరిలో చిన్న రాజ్య పదవిని
పొందుతారు. బయట గృహస్థ వ్యవహారములో ఉండేవారు, చదవడములో మరియు చదివించడములో చాలా
చురుకుగా అయిపోవడాన్ని చూస్తారు. అందరూ గృహస్థులు కారు. కన్యను లేక కుమార్ ను
గృహస్థులని అనరు మరియు ఎవరైతే వానప్రస్థులుగా ఉన్నారో, వారు 60 సంవత్సరాల తర్వాత,
ఉన్నదంతా పిల్లలకు ఇచ్చేసి, వారు స్వయం ఎవరైనా సాధువులు మొదలైనవారి సాంగత్యములోకి
వెళ్ళి ఉంటారు. ఈ రోజుల్లోనైతే తమోప్రధానముగా ఉన్నారు కావున మరణించేంత వరకు కూడా
వ్యాపారాలు మొదలైనవాటిని వదిలిపెట్టరు. ఇంతకుముందు 60 సంవత్సరాలకు వానప్రస్థ
అవస్థలోకి వెళ్ళిపోయేవారు, బనారస్ కు వెళ్ళి ఉండేవారు. ఎవరూ తిరిగి వెళ్ళలేరని,
సద్గతిని పొందలేరని పిల్లలు అర్థం చేసుకున్నారు.
తండ్రియే ముక్తి-జీవన్ముక్తిదాత. అలాగని అందరూ జీవన్ముక్తిని పొందరు. కొంతమంది
ముక్తిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతోంది, ఇక
ఎవరు ఎంత పురుషార్థము చేస్తే అంత పొందుతారు. అందులో కూడా కుమారీలకు మంచి అవకాశముంది,
వారు పారలౌకిక తండ్రికి వారసులుగా అయిపోతారు. ఇక్కడైతే పిల్లలందరూ తండ్రి నుండి
వారసత్వాన్ని తీసుకునేందుకు హక్కుదారులు. అక్కడైతే కూతురులకు వారసత్వము లభించదు.
కొడుకులకు లోభము ఉంటుంది. ఈ వారసత్వము కూడా లభిస్తుంది కనుక దీనిని కూడా తీసుకుందాము,
దీనిని ఎందుకు వదిలిపెట్టాలని భావించేవారు కూడా ఉంటారు. రెండు వైపులా చదువుకుంటారు.
ఈ విధముగా రకరకాల వారు ఉన్నారు. ఎవరైతే బాగా చదువుకుంటారో, వారు ఉన్నత పదవిని
పొందుతారని, ప్రజలలో చాలా షావుకారులుగా అవుతారని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇక్కడ
ఉండేవారు అక్కడ కూడా లోపలే ఉండవలసి ఉంటుంది, దాస-దాసీలుగా అవుతారు. ఇక తర్వాత త్రేతా
అంతిమములో మహా అయితే 3-4-5 జన్మలు రాజ్య పదవి లభిస్తుంది. దీని కంటే సత్యయుగము నుండి
మొదలుకుని షావుకారుతనము నిలిచి ఉండేటటువంటి షావుకారులుగా అవ్వడము మంచిది కదా.
గృహస్థ వ్యవహారములో ఉంటూ షావుకారు పదవిని ఎందుకు తీసుకోకూడదు. మేము రాజ్య పదవిని
పొందాలని ప్రయత్నము చేస్తారు. కానీ ఒకవేళ జారి పడితే, ప్రజలలో మంచి పదవిని పొందే
పురుషార్థము చేయాలి. అది కూడా ఉన్నత పదవైనట్లే కదా. ఇక్కడ ఉండేవారి కంటే బయట
ఉండేవారు చాలా ఉన్నత పదవిని పొందగలరు. మొత్తం ఆధారమంతా పురుషార్థముపైనే ఉంది.
పురుషార్థము ఎప్పుడూ దాగి ఉండదు. ప్రజలలో ఎవరైతే గొప్ప-గొప్ప షావుకారులుగా అవుతారో,
వారు కూడా దాగి ఉండరు. బయట ఉండేవారికి తక్కువ పదవి లభిస్తుందని కాదు. చివరిలో
రాజ్యపదవిని పొందడము మంచిదా లేక ప్రారంభము నుండి మొదలుకుని ప్రజలలో ఉన్నత పదవిని
పొందడము మంచిదా? గృహస్థ వ్యవహారములో ఉండేవారికి అంతగా మాయా తుఫానులు రావు, ఇక్కడ
ఉన్నవారికి చాలా తుఫాన్లు వస్తాయి. ధైర్యము చేస్తారు, మేము శివబాబా శరణులో
కూర్చున్నామని భావిస్తారు కానీ సాంగత్య దోషము కారణముగా చదువుకోరు. చివరిలో అంతా
తెలిసిపోతుంది. ఎవరు ఏ పదవిని పొందుతారు అనేది సాక్షాత్కారమవుతుంది. నంబరువారుగా
చదువుకుంటారు కదా. కొంతమందైతే వారికి వారే సెంటర్లను నడిపిస్తారు. కొన్నిచోట్ల అయితే
సెంటర్లు నడిపేవారికన్నా చదువుకునేవారు చురుకుగా వెళ్ళిపోతారు. అంతా పురుషార్థముపై
ఆధారపడి ఉంటుంది. అంతేకానీ, మాయా తుఫాన్లు వస్తాయని కాదు, అలా కాదు. మీ నడవడిక
బాగోలేదు, శ్రీమతముపై నడవటము లేదు. లౌకికములో కూడా ఇలాగే ఉంటుంది. టీచర్ లేక
తల్లి-తండ్రుల మతముపై నడవరు. మీరు ఎటువంటి తండ్రికి పిల్లలుగా అయ్యారంటే, వారికి
తండ్రి అనేవారు ఎవరూ లేరు. అక్కడైతే బయటకు ఎక్కువగా వెళ్ళవలసి ఉంటుంది. కొంతమంది
పిల్లలు సాంగత్య దోషములో చిక్కుకోవటము వలన ఫెయిల్ అయిపోతారు. మాయా తుఫాన్లు వస్తాయని
ఎందుకంటారు. అది తమ మూర్ఖత్వము. వాస్తవానికి డైరెక్షన్లపై నడుచుకోరు. అటువంటి
నడవడిక వలన ఫెయిల్ అయిపోతారు. చాలామందిలో లోభము ఉంటుంది, కొంతమందిలో క్రోధము,
కొంతమందిలో దొంగతనము చేసే అలవాటు ఉంటుంది. ఫలానావారు ఇటువంటి నడవడిక కారణముగా
వెళ్ళిపోయారని చివరిలో తెలిసిపోతుంది. శూద్రకులానికి చెందినవారిగా అయ్యారని అర్థం
చేసుకోవడము జరుగుతుంది. అటువంటివారిని ఇక బ్రాహ్మణులని అనరు. వారు వెళ్ళి శూద్రులుగా
అయిపోయారు. చదువును వదిలేశారు. కొద్దిగా జ్ఞానము విన్నా సరే ప్రజల్లోకి వచ్చేస్తారు.
ఇది పెద్ద వృక్షము. ఎక్కడెక్కడి నుండో వెలువడి వస్తారు. దేవీ-దేవతా ధర్మము వారు ఇతర
ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయి ఉంటారు, వారు వెలువడి వస్తారు. చాలామంది వస్తారు,
అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. ఇతర ధర్మాల వారు కూడా ముక్తి యొక్క వారసత్వాన్ని అయితే
తీసుకోగలరు కదా. ఇక్కడకు ఎవరైనా రావచ్చు. వాళ్ళ వంశములో ఉన్నత పదవిని పొందవలసి ఉంటే
వారు కూడా వచ్చి లక్ష్యాన్ని తీసుకునివెళ్తారు. వాళ్ళు కూడా వచ్చి లక్ష్యాన్ని
తీసుకుని వెళ్ళినట్లుగా బాబా మీకు సాక్షాత్కారము చేయించారు. ఇక్కడ ఉంటేనే
లక్ష్యాన్ని పొందగలరని కాదు. ఏ ధర్మము వారైనా వచ్చి లక్ష్యాన్ని తీసుకోవచ్చు. అయితే
వారికి లభించే లక్ష్యము ఏమిటంటే - తండ్రిని స్మృతి చేయండి, శాంతిధామాన్ని స్మృతి
చేయండి, అప్పుడు మీ ధర్మములో మీరు ఉన్నత పదవిని పొందుతారు. వారికి జీవన్ముక్తి అయితే
లభించేది లేదు, వారు అక్కడికి రారు కూడా. వారికి దానిపై మనసు ఉండదు. ఎవరైతే ఇక్కడికి
చెందినవారో, వారికి మాత్రమే సత్యముగా మనసు కలుగుతుంది. చివరిలో ఆత్మలు తమ తండ్రిని
అయితే తెలుసుకోవాలి. చాలా సెంటర్లలో చదువుపై అటెన్షన్ లేనివారు కూడా ఉన్నారు,
అటువంటివారు ఉన్నత పదవిని పొందలేరని అర్థం చేసుకోవడము జరుగుతుంది.
నిశ్చయమున్నట్లయితే తీరిక లేదని అనలేరు. కానీ భాగ్యములో లేకపోతే - తీరిక లేదు, ఫలానా
పని ఉందని అంటారు. భాగ్యములో ఉన్నట్లయితే రాత్రింబవళ్ళు పురుషార్థము చేయడములో
నిమగ్నమైపోతారు. నడుస్తూ-నడుస్తూ సాంగత్యము వలన కూడా పాడైపోతారు, దానిని గ్రహచారమని
కూడా అనవచ్చు. బృహస్పతి దశ మారి మంగళ దశ ఏర్పడుతుంది, బహుశా మున్ముందు అది
తొలగిపోవచ్చు. కొంతమంది కోసం బాబా ఏమంటారంటే - వారిపై రాహుదశ కూర్చుని ఉంది, వారు
భగవంతుడు చెప్పేది కూడా వినరు, వారు బ్రహ్మా చెప్తున్నారని అనుకుంటారు. డైరెక్షన్లు
ఇస్తున్నది ఎవరు అనేది పిల్లలకు అర్థం కాదు. దేహాభిమానము ఉన్న కారణముగా సాకారుడు
చెప్తున్నారని భావిస్తారు. దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే, శివబాబా ఏమి చెప్పినా అది
మనము చేయాలి అని అనుకుంటారు. బాధ్యత శివబాబాపై ఉంది. శివబాబా యొక్క మతముపైనైతే
నడుచుకోవాలి కదా. దేహాభిమానములోకి రావడముతో శివబాబాను మర్చిపోతారు, అప్పుడిక శివబాబా
బాధ్యులు కారు. వారి ఆర్డరునైతే శిరసా వహించాలి. కానీ ఎవరు చెప్తున్నారు అనేది అర్థం
చేసుకోరు. అయినా, మీకు వేరే వారెవ్వరూ ఆర్డరు చేయరు, నేను మీకు శ్రీమతాన్ని
ఇస్తున్నాను అని కేవలం తండ్రి అంటారు. ఒకటేమో, నన్ను స్మృతి చేయండి మరియు ఏ
జ్ఞానాన్ని అయితే నేను వినిపిస్తానో, దానిని ధారణ చేయండి మరియు చేయించండి, కేవలం ఈ
వ్యాపారమే చేయండి. సరే బాబా, మీ ఆజ్ఞానుసారముగానే నడుచుకుంటాను. రాజుల ఎదురుగా
నిలబడి ఉన్నవారు, ‘మీ ఆజ్ఞ’ అని అంటారు. ఆ రాజులు ఆజ్ఞాపించేవారు. ఇది శివబాబా ఆజ్ఞ.
‘‘మీ ఆజ్ఞ శివబాబా’’ అని పదే-పదే అంటూ ఉండాలి. అప్పుడు మీకు సంతోషము కూడా ఉంటుంది.
శివబాబా ఆజ్ఞాపిస్తున్నారని భావిస్తారు. శివబాబా స్మృతి ఉన్నట్లయితే బుద్ధితాళము
తెరుచుకుంటుంది. శివబాబా అంటారు - ఈ అభ్యాసము అలవాటైపోవాలి, అప్పుడు నావ తీరానికి
చేరుతుంది. కానీ ఇదే కష్టమైనది. పదే-పదే మర్చిపోతారు. మాయ మరపింపజేస్తుందని ఎందుకు
అనాలి, మనము మర్చిపోతాము, అందుకే తప్పుడు కర్మలు జరుగుతూ ఉంటాయి.
చాలామంది కుమార్తెలు ఉన్నారు, జ్ఞానాన్ని అయితే చాలా బాగా వినిపిస్తారు కానీ
వికర్మలు వినాశనము అయ్యే యోగము లేదు. ఇటువంటి మంచి-మంచి పిల్లలు చాలామంది ఉన్నారు,
యోగము అస్సలు లేదు. యోగములో ఉండటము లేదని నడవడిక ద్వారా అర్థమవుతుంది, మరి పాపాలు
మిగిలిపోతాయి కావున వాటిని అనుభవించవలసి ఉంటుంది. ఇందులో తుఫానుల విషయమేమీ లేదు. ఇది
నా పొరపాటు, నేను శ్రీమతముపై నడుచుకోవడము లేదు అని అర్థం చేసుకోండి. ఇక్కడికి మీరు
రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చారు. ప్రజాయోగము నేర్పించరు. తల్లి-తండ్రి అయితే
ఎలాగూ ఉన్నారు, వారిని ఫాలో చేసినట్లయితే మీరు కూడా సింహాసనాధికారులుగా అవుతారు.
వీరిదైతే నిశ్చితమై ఉంది కదా - వీరు శ్రీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, కావున
తల్లి-తండ్రిని ఫాలో చేయండి. ఇతర ధర్మాల వారు తల్లి-తండ్రిని ఫాలో చేయరు, వారు
తండ్రిని మాత్రమే నమ్ముతారు. ఇక్కడైతే ఇరువురూ ఉన్నారు. గాడ్ అయితే క్రియేటర్. తల్లి
గురించిన రహస్యము గుప్తమైనది. తల్లి-తండ్రి చదివిస్తూ ఉంటారు. ఇలా చేయకండి, ఇది
చేయండి అని అర్థం చేయిస్తారు. టీచర్ ఏ శిక్ష ఇచ్చినా సరే, స్కూల్లో అందరి మధ్యన
ఇస్తారు కదా. అప్పుడు నా పరువు తీసేస్తున్నారని పిల్లలు అనరు. తండ్రి 5-6 మంది
పిల్లల ఎదురుగా చెంపదెబ్బ కొడతారు. అప్పుడు 5-6 మంది ఎదురుగా ఎందుకు కొట్టారని
పిల్లలు అడగరు. లేదు. ఇక్కడైతే పిల్లలకు శిక్షణ ఇవ్వడము జరుగుతుంది, అయినా ఒకవేళ
నడుచుకోలేకపోతే - అచ్ఛా, గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా పురుషార్థము చేయండి. ఒకవేళ
ఇక్కడ కూర్చుని డిస్సర్వీస్ చేస్తే, ఏదో కొద్దిగా చేసుకున్నది కూడా సమాప్తమైపోతుంది.
చదవాలనిపించకపోతే వదిలేయండి. ఇక నేను నడుచుకోలేను అని చెప్పండి. నిందించడము ఎందుకు
చేయాలి. ఎంతోమంది పిల్లలు ఉన్నారు. కొంతమంది చదువుకుంటారు, కొంతమంది వదిలేస్తారు.
ప్రతి ఒక్కరూ తమ చదువులో ఆనందముగా నిమగ్నమై ఉండాలి.
తండ్రి అంటారు - ఇతరుల నుండి సేవ తీసుకోకండి, ఎటువంటి అహంకారము రాకూడదు. ఇతరుల
నుండి సేవ తీసుకోవడము - ఇది కూడా దేహ అహంకారము. బాబా అయితే అర్థం చేయించవలసి ఉంటుంది
కదా. లేకపోతే న్యాయసభ కూర్చున్నప్పుడు - మాకు నియమాలు, చట్టాలు తెలియవు అని అంటారు.
అందుకే తండ్రి ముందే అర్థం చేయిస్తున్నారు, ఆ తర్వాత సాక్షాత్కారము చేయించి శిక్షలు
వేస్తారు. ఋజువు లేకుండా శిక్షలు లభించవు. అచ్ఛా, కల్పక్రితము వలె బాబా అయితే ఎంతో
అర్థం చేయిస్తారు. ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూడడము జరుగుతుంది. కొంతమంది సేవ చేసి
తమ జీవితాన్ని వజ్రము వలె తయారుచేసుకుంటారు, కొంతమంది తమ భాగ్యానికి అడ్డు గీత
గీసుకుంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.