26-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు గ్యారంటీ ఇస్తారు - మేము మా
యోగబలముతో ఈ భారత్ ను స్వర్గముగా తయారుచేస్తాము, అక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యము
ఉంటాయి’’
ప్రశ్న:-
మాయ కలిగించే
ఏ విఘ్నము నుండి సురక్షితముగా ఉండేవారు చాలా మంచి అద్భుతాన్ని చేయగలరు?
జవాబు:-
మాయ కలిగించే
అన్నింటికంటే పెద్ద విఘ్నము - దేహాభిమానములోకి తీసుకువచ్చి ఇతరుల నామ-రూపాలలో
చిక్కుకునేలా చేయడము. ఏ పిల్లలైతే ఈ విఘ్నము నుండి సురక్షితముగా ఉంటారో, మాయ మోసము
నుండి రక్షించబడి ఉంటారో, వారు చాలా అద్భుతము చేసి చూపిస్తారు. వారి బుద్ధిలో సేవ
యొక్క కొత్త-కొత్త ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. సేవలో ఉన్నతి ఎప్పుడు జరుగుతుందంటే
దేహీ-అభిమానులుగా అయినప్పుడు.
ఓంశాంతి
తండ్రి ఆత్మిక పిల్లలకు శ్రీమతాన్ని ఇవ్వడానికి వచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారముగా
ఈ కొంచెం సమయములోనే మొత్తం కార్యమంతా జరగాల్సి ఉందని పిల్లలకు తెలుసు. మనము
రావణపురిని విష్ణుపురిగా చేస్తాము. ఇప్పుడు తండ్రి కూడా గుప్తముగా ఉన్నారు, చదువు
కూడా గుప్తముగా ఉంది. సెంటర్లు అయితే చాలా ఉన్నాయి. చిన్న-పెద్ద ఊళ్లలో సెంటర్లు
ఉన్నాయి మరియు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. రోజురోజుకు సంఖ్య ఇంకా పెరుగుతూ
ఉంటుంది. మేము ఈ భారత భూమిని స్వర్గముగా తయారుచేసి తీరుతామని లిటరేచర్ లో కూడా
వ్రాస్తారు. మీకు ఈ భారత భూమి చాలా ప్రియమైనది ఎందుకంటే ఈ భారత్ యే స్వర్గముగా
ఉండేదని మీకు తెలుసు. 5 వేల సంవత్సరాల క్రితం భారత్ అలా ఉండేది. భారత్ చాలా
వైభవోపేతముగా ఉండేది. బ్రహ్మా ముఖవంశావళి పిల్లలైన మీకు మాత్రమే ఈ జ్ఞానముంది. ఈ
భారత్ ను శ్రీమతమనుసారముగా స్వర్గముగా తయారుచేయాల్సి ఉంటుంది. అందరికీ మార్గము
తెలియజేయాలి, ఇక్కడ ఇంకే గొడవ లేదు. ఈ చిత్రాలను పత్రికలలో కూడా ముద్రించే విధముగా,
ఎటువంటి ప్రకటనలు ఇవ్వాలి అని పరస్పరములో కూర్చుని చర్చించుకోవాలి. పరస్పరములో దీని
గురించి సెమినార్ చేసుకోవాలి. మేము భారత్ ను ఎలా బాగు చేయాలి, ఈ అభిప్రాయ
బేధాలన్నింటినీ ఎలా సరి చేయాలి మరియు భారత్ లో సుఖ-శాంతులు ఎలా స్థాపనవుతాయి - అని
ఎలాగైతే ఆ గవర్నమెంట్ వారు పరస్పరములో కలుసుకుని చర్చించుకుంటారో, అలా మీది కూడా
ఆత్మిక పాండవ గవర్నమెంట్. ఇది పెద్ద ఈశ్వరీయ గవర్నమెంట్. పతిత-పావనుడైన తండ్రియే
పతిత పిల్లలను పావనముగా తయారుచేసి పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తారు. ఈ రహస్యము
పిల్లలైన మీకు తెలుసు. ముఖ్యమైనది భారత్ యొక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము. ఇది
రుద్ర జ్ఞాన యజ్ఞము. రుద్రుడు అని శివబాబాను అంటారు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి వచ్చి
మేలుకొలిపారు. మీరు మళ్ళీ ఇతరులను మేలుకొలపాలి. డ్రామా ప్లాన్ అనుసారముగా మీరు
మేలుకొలుపుతూ ఉంటారు. ఇప్పటివరకు ఎవరెవరు ఎటువంటి పురుషార్థము చేసారో, కల్పక్రితం
కూడా అంతే చేసారు. మీది ఆత్మిక యుద్ధము. ఒక్కోసారి మాయ తీవ్రత పెరుగుతుంది,
ఒక్కోసారి ఈశ్వరుని తీవ్రత పెరుగుతుంది. అప్పుడప్పుడు సేవ చాలా తీవ్రగతితో
జరుగుతుంది. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకు మాయ విఘ్నాలు కలుగుతాయి. మాయ పూర్తిగా
మూర్ఛితులుగా చేసేస్తుంది. ఇది యుద్ధ మైదానము కదా. మాయ రాముని సంతానాన్ని
మూర్ఛితులుగా చేసేస్తుంది. లవకుశల కథ కూడా ఉంది కదా. రామునికి ఇద్దరు పిల్లలను
చూపించారు. ఇక్కడైతే బాబాకు ఎంతోమంది పిల్లలున్నారు. ఈ సమయములో మనుష్యులందరూ
కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడానికి పరమపిత
పరమాత్మ వచ్చారని కూడా వారికి తెలియదు. తండ్రి భారత్ లోనే వస్తారు. ఈ విషయాన్ని
పూర్తిగా మర్చిపోయారు. భారతవాసులే స్వర్గానికి యజమానులుగా ఉండేవారు, ఇందులో ఎటువంటి
సందేహము లేదు. పరమపిత పరమాత్ముని జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. అందుకే శివ జయంతిని
భారత్ లోనే జరుపుకుంటారు. అంటే తప్పకుండా వారు వచ్చి ఏదో చేసి ఉంటారు. తప్పకుండా
తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేసి ఉంటారని బుద్ధి చెప్తుంది. ప్రేరణ ద్వారా స్థాపన
చేయరు. ఇక్కడైతే పిల్లలైన మీకు రాజయోగము నేర్పించడము జరుగుతుంది. స్మృతియాత్ర
నేర్పించడము జరుగుతుంది. ప్రేరణలో ఎటువంటి శబ్దము ఉండదు. శంకరుడు ప్రేరణ ద్వారా
వినాశనము చేస్తారని అనుకుంటారు కానీ ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. డ్రామాలో
వారి పాత్రయే మిసైల్స్ ను తయారుచేయడము అని మీరు అర్థం చేసుకున్నారు. వారు
వినాశనానికి నిమిత్తులై ఉన్నారు. ప్రేరణ అనేది శాస్త్రాలలోని పదము, ఇందులో ప్రేరణ
యొక్క విషయమేమీ లేదు. డ్రామానుసారముగా వినాశనమైతే జరగాల్సిందే. మహాభారత యుద్ధములో ఈ
మిసైల్స్ మొదలైనవి ఉపయోగించారని అంటూ ఉంటారు. ఏదైతే గడిచిపోయిందో, అది మళ్ళీ రిపీట్
అవ్వనున్నది. మేము యోగబలముతో స్వర్గ స్థాపన చేస్తాము, అక్కడ ఒకే ధర్మము ఉంటుంది -
అని మీరు గ్యారెంటీ ఇస్తారు. మరి మిగిలిన ధర్మాలన్నీ ఎక్కడ ఉంటాయి? తప్పకుండా
వినాశనమైపోతాయి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు
ద్వారా పాలన అని అంటూ ఉంటారు, ఇది కరక్టే. కానీ శంకరుడిని, శివునితో పాటు కలిపేసారు,
ఇది తప్పు. శివ-శంకర అని అంటారు ఎందుకంటే శంకరుడు ఏ పని చేయరు కనుక శివునితో
కలిపేసారు. కానీ శివబాబా అంటారు - నేనైతే చాలా పని చేయాల్సి ఉంటుంది. అందరినీ
పావనముగా చేయాల్సి ఉంటుంది. నేను ఈ బ్రహ్మా తనువులో ప్రవేశించి ఈ సాకారుని ద్వారా
స్థాపనా కార్యాన్ని చేయిస్తాను. శంకరునికైతే పాత్రేమీ లేదు. శివుడికి పూజ జరుగుతుంది.
శివుడే కళ్యాణకారి, జోలిని నింపేవారు. శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా. ఈ బ్రహ్మా
కూడా ప్రజాపితయే. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా అవుతారు, ఇవి
చాలా గుహ్యమైన విషయాలు. వీటి గురించి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తెలివైన
పిల్లల బుద్ధికి జ్ఞానము వెంటనే అర్ధమైపోతుంది. పతిత-పావనుడైన తండ్రి ఎప్పుడు
వస్తారు అనేది మనుష్యులకు ఏమీ తెలియదు! ఇప్పుడైతే ఇది కలియుగాంతము. ఒకవేళ
కలియుగాంతమునకు ఇంకా 40 వేల సంవత్సరాలు ఉందని అంటే, ఇప్పుడు ఇంకెంత పతితముగా అవుతారు?
ఇంకెంత దుఃఖాన్ని సహిస్తారు? కలియుగములో సుఖమైతే ఉండదు. ఏమీ తెలియని కారణముగా పాపం
ఘోర అంధకారములో ఉన్నారు.
సేవను ఎలా పెంచాలి అని పిల్లలైన మీరు పరస్పరములో చర్చించుకోవాలి. తండ్రి ప్లానులను
తెలియజేస్తూ ఉంటారు, తర్వాత పిల్లలు పరస్పరములో కలుసుకుని చర్చించుకోవాలి. చిత్రాలపై
బాగా అర్థం చేయించాలి. ఈ చిత్రాలు కూడా డ్రామా ప్లాన్ అనుసారముగా తయారవుతూ ఉన్నాయి.
ఏదైతే సమయము గడుస్తూ ఉంటుందో, దాని అనుసారముగా డ్రామా నడుస్తూ ఉంటుందని పిల్లలకు
తెలుసు. పిల్లల అవస్థలైతే అప్పుడప్పుడు పైకి, అప్పుడప్పుడు కిందికి అవుతూ ఉంటాయి,
ఇలా నడుస్తూ ఉంటుంది. బాబా కూడా సాక్షీగా అయి చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లలపై
గ్రహచారము కూర్చుంటుంది, అప్పుడు దానిని తొలగించేందుకు ప్రయత్నము చేయిస్తారు.
తండ్రిని స్మృతి చేయండి అని బాబా ఘడియ-ఘడియ చెప్తారు. కానీ పిల్లలు దేహాభిమానములోకి
వచ్చేస్తారు, అందుకే దెబ్బలు తింటూ ఉంటారు, ఇందులో దేహీ-అభిమానులుగా అవ్వాల్సి
ఉంటుంది. కానీ పిల్లల్లో దేహాభిమానము చాలా ఉంది. మీరు దేహీ-అభిమానులుగా అయినట్లయితే
తండ్రి స్మృతి ఉంటుంది మరియు సేవలో ఉన్నతి కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ఉన్నత
పదవి పొందేది ఉంటుందో, వారు సదా సేవలో నిమగ్నమై ఉంటారు. భాగ్యములో ఒకవేళ లేకపోతే ఇక
పురుషార్థము కూడా చేయరు. బాబా, మాకు ధారణ జరగడము లేదు, బుద్ధిలో కూర్చోవడము లేదని
స్వయముగా చెప్తూ ఉంటారు. ఒకవేళ ధారణ జరగకపోతే, సంతోషము కూడా ఉండదు. ఎవరికైతే ధారణ
జరుగుతుందో, వారికి సంతోషము కూడా ఉంటుంది. శివబాబా వచ్చి ఉన్నారని వారు అర్థం
చేసుకుంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు మంచి రీతిలో అర్థం చేసుకుని ఇతరులకు
కూడా అర్థం చేయించండి. కొంతమందైతే సేవలో నిమగ్నమైపోతారు, పురుషార్థము చేస్తూ ఉంటారు.
ఏ క్షణమైతే గడుస్తూ ఉంటుందో, అది డ్రామాలో నిశ్చితమై ఉందని, మళ్ళీ అలాగే రిపీట్
అవుతుందని పిల్లలైన మీకు తెలుసు. బయట భాషణ చేసే సమయములో అనేక రకాల మనుష్యులు
వస్తారని పిల్లలకే అర్థం చేయించడము జరుగుతుంది. అందరూ వేద-శాస్త్రాలు, గీత
మొదలైనవాటిపైనే భాషణ చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ ఈశ్వరుడు స్వయం గురించి
మరియు ఈ రచన ఆదిమధ్యాంతాల రహస్యము గురించి అర్థం చేయిస్తారని వారికి తెలియదు.
పరమాత్మ ఎవరు అనేది చిత్రాలలో ఎంత బాగా చూపించారు! ఈ విషయాలను ప్రొజెక్టర్ ద్వారా
అర్థం చేయించలేరు. ప్రదర్శనీలలో చిత్రాలు ఎదురుగా ఉంటాయి. మీరు వాటిపై అర్థం చేయించి
ఇలా అడగవచ్చు కూడా - ఇప్పుడు చెప్పండి, గీతా భగవానుడు ఎవరు? జ్ఞాన సాగరుడు ఎవరు?
పవిత్రతా, సుఖ-శాంతుల సాగరుడు ఎవరు? ముక్తిదాత మరియు మార్గదర్శకుడు ఎవరు?
శ్రీకృష్ణుని గురించి ఇలా అనలేరు. పరమాత్ముని మహిమ వేరు. ముందు వారి చేత వ్రాయించాలి
కూడా, ప్రశ్నావళి నింపించాలి, అందరి చేత సంతకాలు కూడా తీసుకోవాలి.
(హాల్లో పక్షులు కొట్లాడుకుంటున్నాయి) ఈ సమయములో మొత్తం ప్రపంచములో కొట్లాటలు-గొడవలే
ఉన్నాయి. అందరూ పరస్పరములో కొట్లాడుకుంటూ ఉంటారు. 5 వికారాలు కూడా మనుష్యుల్లోనివే
వర్ణించబడతాయి, ఇది జంతువుల విషయము కాదు. వికారీ ప్రపంచము మరియు నిర్వికారీ ప్రపంచము
అని మనుష్యులకు సంబంధించే అంటూ ఉంటారు. కలియుగములో ఆసురీ సాంప్రదాయము వారు ఉంటారు,
సత్యయుగములో దైవీ సాంప్రదాయము వారు ఉంటారు. మనుష్యులు ఎంత తమోప్రధాన బుద్ధి కలవారిగా
అయిపోయారంటే, మేమే ఆసురీ సాంప్రదాయము వారమని ఏ మాత్రం అర్థం చేసుకోరు. దేవతల ఎదురుగా
వెళ్ళి - మేమే నీచులము, పాపులము, నిర్గుణులమైన మాలో ఏ గుణము లేదు అని పాడుతారు కూడా.
మీరు వారికి నిరూపించి చెప్పవచ్చు. మెట్ల వరుస చిత్రములో ఈ విషయము చాలా స్పష్టముగా
ఉంది. ఎక్కే కళ ఎలా ఉంటుంది, తర్వాత దిగే కళ ఎలా ఉంటుంది అనేది చిత్రములో చూపించడము
జరిగింది. భారతవాసులకు ఈ మెట్ల వరుస చిత్రము ముఖ్యమైనది. ఇది అన్నింటికంటే మంచి
చిత్రము. ఈ చిత్రముపై చాలా బాగా అర్థం చేయించవచ్చు. 84 జన్మలను పూర్తి చేసుకుని
మళ్ళీ మొదటి నంబరు జన్మ తీసుకోవాలి. దిగే కళ నుండి ఎక్కే కళలోకి వెళ్ళాల్సి ఉంటుంది.
అందరికీ మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆలోచించకపోతే సేవ
ఎలా చేస్తారు. చిత్రాల ద్వారా అర్థం చేయించడము చాలా సులభముగా ఉంటుంది. సత్యయుగము
తర్వాత మెట్లు దిగాల్సిందే. ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్ అవుతున్నామని పిల్లలకు తెలుసు.
కానీ డైరెక్టుగా సత్యయుగములోకి వెళ్ళరు. ముందు శాంతిధామానికి వెళ్ళాలి. మనము
పాత్రధారులమని మీకు తెలుసు. ఇకపోతే, ఈ డ్రామాలో తమను తాము పాత్రధారులుగా భావించేవారు
మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. మేము పాత్రధారులము - అని చెప్పగలిగేవారు ప్రపంచములో
ఎవ్వరూ లేరు. మనుష్యులు ప్రతి ఒక్కరూ ఈ అనంతమైన డ్రామాలోని పాత్రధారులై ఉండి కూడా
వారికి ఈ డ్రామాలోని ముఖ్య పాత్రధారుల గురించి, డైరెక్టర్ గురించి మరియు డ్రామా
ఆదిమధ్యాంతాల గురించి తెలియదు అంటే వారు అవివేకులే అని మనము వ్రాస్తాము కూడా. ఇలా
వ్రాయడములో తప్పేమీ లేదు. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయకూడదు. సర్వీస్, సర్వీస్
మరియు సర్వీస్. పిల్లలపై ఒక్కోసారి గ్రహచారము కూడా కూర్చుంటుందని బాబాకు తెలుసు,
గ్రహచారము కూర్చున్నప్పుడు ఎంత నష్టము జరుగుతుంది అనేది బాబాకు తెలుసు. షావుకారులు
పేదవారిగా అవుతారు. కారణమైతే ఉంటుంది కదా. బాబా చాలామందికి అర్థం చేయిస్తూ ఉంటారు
కూడా - పిల్లలూ! నామ-రూపాలలో ఎప్పుడూ చిక్కుకోకండి లేదంటే మాయ ఎలాంటిదంటే ముక్కు
పట్టుకుని గోతులో పడేస్తుంది. మాయ చాలా మోసము చేస్తుంది. ప్రేయసీ-ప్రియులుగా ఇక్కడ
అవ్వకూడదు. కొందరు వికారాల కోసం ప్రేయసీ-ప్రియులుగా అవుతారు. మరి కొందరు కేవలం
రూపముపై బలిహారమవుతారు. సెంటర్లలో కూడా ఇలాంటి మాయా విఘ్నాలు ఎన్నో వస్తాయని మీకు
తెలుసు. పరస్పరము ఒకరి నామ-రూపాలలో ఒకరు చిక్కుకుంటారు. మాయ ఎంత శక్తివంతమైనదంటే ఒక
మాత మరొక మాత నామ-రూపాలలో, అలాగే కన్య మరొక కన్య నామ-రూపాలలో కూడా చిక్కుకుపోతారు.
పురుషార్థము చేస్తున్నా కూడా మాయ ఒక్కసారిగా పట్టేసుకుంటుంది. అందుకే తండ్రి
సావధానపరుస్తారు - పిల్లలూ, మాయ బంధించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు
చిక్కుకోకూడదు. దేహాభిమానములోకి రాకూడదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి
చేయాలి. మాయ మోసం నుండి స్వయాన్ని రక్షించుకుంటూ ఉండాలి. పిల్లలైన మిమ్మల్ని తండ్రి
పుష్పాలుగా తయారుచేయడానికి వచ్చారు. మీకు ఏ విషయములోనూ సంశయము రాకూడదు. ఒకవేళ మనసులో
సంశయము వస్తే, సేవను బాగా చేయలేరు. లోలోపల గుటకలు మింగుతూ ఉంటారు. ధైర్యము ఉంచాలి.
సమయము చాలా కొద్దిగా ఉంది. బాబా మురళిని వింటే ఉత్సాహములోకి వస్తారు. ఆత్మప్రకాష్
బచ్చా చాలా బాగా చిత్రాలపై అటెన్షన్ పెడుతున్నారు. బొంబాయి వారికి కూడా బుద్ధిలోకి
రావాలి. ముఖ్యమైన చిత్రాలను ముందు తయారుచేయాల్సి ఉంటుంది. చిత్రాలను పరిశీలిస్తూ
ఉండాలి. చిత్రాలలో ఉన్నతిని ఎలా తీసుకురావాలి అని బాబా డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు.
మెట్ల వరుస చిత్రాన్ని విమానాశ్రయములో పెట్టే విధముగా ఏదైనా యుక్తిని రచించండి. ఈ
చిత్రాన్ని చూసి అందరూ సంతోషిస్తారు. వీరికి మతాన్ని ఇచ్చేవారు ఎవరు అనేది చివరికి
అర్థం చేసుకుంటారు. పిల్లలకు చాలా నషా ఎక్కాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పిల్లలైన మీరు యుద్ధ మైదానములో ఉన్నారు, మాయా రావణుడితో మీ యుద్ధము జరుగుతుంది.
మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. పిల్లలు చాలా అప్రమత్తముగా ఉండాలి.
2. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతి కోసం ఆలోచించాలి. చిత్రాలపై ఎలా అర్థం చేయించాలి,
సేవను ఎలా పెంచాలి, మనుష్యులు సహజముగా అర్థం చేసుకునేలా చిత్రాలలో ఏమి ముద్రించాలి
అని ఆలోచిస్తూ ఉండాలి.
వరదానము:-
దేహాభిమానాన్ని త్యాగము చేయడము ద్వారా శ్రేష్ఠ భాగ్యాన్ని
తయారుచేసుకునే సర్వ సిద్ధి స్వరూప భవ
దేహాభిమానాన్ని త్యాగము చేయడము ద్వారా అనగా
దేహీ-అభిమానులుగా అవ్వడము ద్వారా తండ్రి నుండి సర్వ సంబంధాలు, సర్వ శక్తులు
అనుభవమవుతాయి, ఈ అనుభవమే సంగమయుగము యొక్క సర్వ శ్రేష్ఠ భాగ్యము. విధాత ద్వారా
లభించిన ఈ విధిని పాటించడముతో వృద్ధి కూడా జరుగుతుంది మరియు సర్వ సిద్ధులు కూడా
ప్రాప్తిస్తాయి. దేహధారులతో మీకున్న సంబంధము మరియు స్నేహము కోసం మీ కిరీటాన్ని,
సింహాసనాన్ని మరియు మీ అసలైన స్వరూపాన్ని, అన్నింటినీ వదిలేసారే, మరి తండ్రి
స్నేహములో దేహాభిమానాన్ని త్యాగము చేయలేరా! ఈ ఒక్క త్యాగము ద్వారా సర్వ భాగ్యాలు
ప్రాప్తిస్తాయి.
స్లోగన్:-
క్రోధ
ముక్తులుగా అవ్వాలంటే, స్వార్థానికి బదులుగా నిస్వార్థులుగా అవ్వండి, కోరికల
రూపాన్ని పరివర్తన చేయండి.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
పవిత్రత ద్వారా మేము
ప్రకృతిని కూడా పావనముగా చేస్తాము అని బాబాతోపాటు మీరందరూ కూడా బాధ్యతను
తీసుకున్నారు. కావున ఈ సంకల్పాన్ని పూర్తి చేయడానికి బాప్ దాదా ఏమి
కోరుకుంటున్నారంటే - విశ్వములోని ప్రతి బిడ్డ ముందుగా మోహముక్తులుగా అవ్వాలి,
సాధనాల నుండైనా లేక వ్యక్తుల నుండైనా మోహముక్తులుగా అవ్వాలి. సాధనాలను ఉపయోగించటము
వేరు, మోహము వేరు. బాప్ దాదా ప్రతి బిడ్డను ముందుగా మోహముక్తులుగా చెయ్యాలని
కోరుకుంటారు.