26-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - కర్మలు చేస్తూ స్వయాన్ని ప్రేయసిగా
భావిస్తూ ప్రియుడినైన నన్నొక్కరినే స్మృతి చేయండి, స్మృతితోనే మీరు పావనముగా తయారై
పావన ప్రపంచములోకి వెళ్తారు’’
ప్రశ్న:-
మహాభారత
యుద్ధము సమయములో పిల్లలైన మీకు తండ్రి నుండి ఏ ఆజ్ఞ లభించింది?
జవాబు:-
పిల్లలూ,
తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - దేహీ-అభిమానులుగా అవ్వండి. ఇప్పుడు తండ్రిని మరియు రాజధానిని
స్మృతి చేయండి అని అందరికీ సందేశాన్ని ఇవ్వండి. తమ నడవడికను సరిదిద్దుకోండి.
చాలా-చాలా మధురముగా అవ్వండి. ఎవరికీ దుఃఖము ఇవ్వకండి. స్మృతిలో ఉండే అలవాటు
చేసుకోండి మరియు స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. అడుగులు ముందుకు వేసే పురుషార్థము
చేయండి.
ఓంశాంతి
పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చున్నారు. అందరూ కూర్చుని, పిల్లలంతా తండ్రి స్మృతిలో
కూర్చున్నారు - అని చెప్పే సత్సంగము ఇంకేదీ లేదు. అటువంటి స్థానము ఇదొక్కటే.
ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటివరకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అని బాబా
డైరెక్షన్ ఇచ్చారని పిల్లలకు తెలుసు. ఓ పిల్లలూ, అని ఈ పారలౌకిక తండ్రి మాత్రమే
అంటారు. పిల్లలందరూ వింటున్నారు. బాబా కేవలం పిల్లలైన మీకు మాత్రమే కాదు, అందరికీ
చెప్తున్నారు - పిల్లలూ, తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే మీ జన్మజన్మల పాపాలు ఏవైతే
ఉన్నాయో, వేటి కారణముగానైతే తుప్పు పట్టి ఉందో, అదంతా తొలగిపోతుంది మరియు మీ ఆత్మ
సతోప్రధానముగా అయిపోతుంది. వాస్తవానికి మీ ఆత్మ సతోప్రధానముగానే ఉండేది, తర్వాత
పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ తమోప్రధానముగా అయిపోయింది. ఈ మహావాక్యాలను తండ్రి
తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. లౌకిక తండ్రికి మహా అయితే ఇద్దరు లేక నలుగురు
పిల్లలుంటారు. ఆ పిల్లలకు రామ-రామ అనండి లేక పతిత-పావన సీతా-రామ అనండి లేక
శ్రీకృష్ణుడిని స్మృతి చేయండి అని చెప్తారు. అంతేకానీ, ఓ పిల్లలూ, ఇప్పుడు
తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చెప్పరు. తండ్రి అయితే ఇంటిలోనే ఉంటారు, వారిని
స్మృతి చేసే విషయమే లేదు. ఈ అనంతమైన తండ్రి జీవాత్మలకు చెప్తున్నారు. ఆత్మలే తండ్రి
ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఆత్మల తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. 5 వేల సంవత్సరాల
తర్వాత ఆత్మలు మరియు పరమాత్మ కలుసుకుంటారు. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము వచ్చి
ఈ పాఠము చదివిస్తాను - ఓ పిల్లలూ, ఓ పతిత-పావనా రండి అని మీరు నన్ను స్మృతి చేస్తూ
వచ్చారు, నేను తప్పకుండా వస్తాను. లేదంటే ఎప్పటివరకని స్మృతి చేస్తూ ఉంటారు! ఒక
లిమిట్ అనేది తప్పకుండా ఉంటుంది కదా. కలియుగపు లిమిట్ ఎప్పుడు పూర్తవుతుంది అనేది
మనుష్యులకు తెలియదు. ఈ విషయము కూడా తండ్రియే తెలియజేయవలసి ఉంటుంది. ఓ పిల్లలూ, నన్ను
స్మృతి చేయండి అని తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. ముఖ్యమైన విషయము స్మృతి. రచన
యొక్క చక్రాన్ని స్మృతి చేయడమనేది పెద్ద విషయమేమీ కాదు. కేవలం తండ్రిని స్మృతి
చేయడములోనే శ్రమ అనిపిస్తుంది. తండ్రి అంటారు - అర్ధకల్పము భక్తి మార్గము,
అర్ధకల్పము జ్ఞాన మార్గము. జ్ఞానము యొక్క ప్రారబ్ధాన్ని మీరు అర్ధకల్పము పొందారు,
తర్వాత అర్ధకల్పము భక్తి యొక్క ప్రారబ్ధము ఉంటుంది. అది సుఖము యొక్క ప్రారబ్ధము, ఇది
దుఃఖము యొక్క ప్రారబ్ధము. సుఖ-దుఃఖాల ఈ ఆట తయారుచేయబడింది. కొత్త ప్రపంచములో సుఖము
ఉంటుంది, పాత ప్రపంచములో దుఃఖము ఉంటుంది. మనుష్యులకు ఈ విషయాల గురించి ఏమీ తెలియదు.
మా దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అంటారు కూడా. అర్ధకల్పము రావణ రాజ్యము
నడుస్తుంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ దుఃఖాన్ని తొలగించలేరు - అనే విషయము కూడా
ఎవరికీ తెలియదు. శారీరక వ్యాధులు మొదలైనవాటిని డాక్టర్లు నయము చేస్తారు, అది
అల్పకాలం కోసం మాత్రమే. ఇది సదా కోసం అనగా అర్ధకల్పము కోసం. కొత్త ప్రపంచాన్ని
స్వర్గమని అంటారు. అక్కడ తప్పకుండా అందరూ సుఖముగా ఉంటారు. మరి మిగిలిన ఇంతమంది
ఆత్మలంతా ఎక్కడ ఉంటారు? ఈ ఆలోచన ఎవరికీ రాదు. ఇది కొత్త చదువని, చదివించేవారు కూడా
కొత్తవారని మీకు తెలుసు. భగవానువాచ - నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను.
సత్యయుగములో ఒకే ధర్మముంటుంది అనేది వాస్తవము కావున తప్పకుండా మిగిలిన ధర్మాలన్నీ
వినాశనమవుతాయి. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము అని వేటినంటారు, అలాగే
సత్యయుగములో ఎవరు ఉంటారు - ఈ విషయాలు కూడా ఇప్పుడు మీకు తెలుసు. సత్యయుగములో ఒక్క
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క రాజ్యముండేది. అది నిన్నటి విషయమే. ఇది 5 వేల
సంవత్సరాల కథ. 5 వేల సంవత్సరాల క్రితం భారత్ లో ఈ దేవీ-దేవతల రాజ్యముండేదని తండ్రి
తెలియజేస్తారు. వారు 84 జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు పతితముగా అయ్యారు.
అందుకే, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేయండి అని ఇప్పుడు పిలుస్తున్నారు.
నిరాకారీ ప్రపంచములోనైతే అంతా పావనాత్మలే ఉంటారు. తర్వాత కిందకు వచ్చి పాత్రను
అభినయిస్తారు, అప్పుడు సతో, రజో, తమోలలోకి వస్తారు. సతోప్రధానులను నిర్వికారులని
అంటారు. తమోప్రధానులు తమను తాము వికారులుగా చెప్పుకుంటారు. ఈ దేవీ-దేవతలు
నిర్వికారులుగా ఉండేవారు, మేము వికారులము అని భావిస్తారు. అందుకే తండ్రి అంటారు -
దేవతల పూజారులు ఎవరైతే ఉంటారో, వారికి ఈ జ్ఞానము వెంటనే బుద్ధిలో కూర్చుంటుంది
ఎందుకంటే వారు దేవతా ధర్మానికి చెందినవారు. పూజ్యులుగా ఉన్న మనమే పూజారులుగా
అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. క్రిస్టియన్లు క్రైస్టును పూజిస్తారు ఎందుకంటే వారు
ఆ ధర్మానికి చెందినవారు. మీరు కూడా దేవతల పూజారులు కావున మీరు ఆ ధర్మానికి
చెందినవారే. దేవతలు నిర్వికారులుగా ఉండేవారు, ఇప్పుడు వారు వికారులుగా అయ్యారు.
వికారాల కోసమే ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి.
తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు
సదా సుఖమయముగా అవుతారు. ఇక్కడైతే సదా దుఃఖితులుగా ఉంటారు, అల్పకాలిక సుఖముంటుంది.
అక్కడైతే అందరూ సుఖమయముగా ఉంటారు కానీ ఎంతైనా, పదవులలో తేడా ఉంటుంది కదా. సుఖము
యొక్క రాజధాని కూడా ఉంటుంది, దుఃఖము యొక్క రాజధాని కూడా ఉంటుంది. తండ్రి ఎప్పుడైతే
వస్తారో, అప్పుడు వికారీ రాజుల రాజ్యాలు కూడా సమాప్తమైపోతాయి ఎందుకంటే ఇక్కడి
ప్రారబ్ధము సమాప్తమైపోతుంది. తండ్రి శ్రీమతమనుసారముగా నడుచుకోవాలని ఇప్పుడు
పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటారు - నేను ఎలాగైతే శాంతి సాగరుడినో, ప్రేమ
సాగరుడినో, మిమ్మల్ని కూడా అలానే తయారుచేస్తాను. ఈ మహిమ ఒక్క తండ్రిది మాత్రమే, ఇది
మనుష్యులెవ్వరి మహిమ కాదు. తండ్రి పవిత్రతా సాగరుడని పిల్లలైన మీకు తెలుసు.
ఆత్మలమైన మనము కూడా పరంధామములో ఉన్నప్పుడు పవిత్రముగా ఉండేవారము. ఈ ఈశ్వరీయ జ్ఞానము
పిల్లలైన మీ వద్ద మాత్రమే ఉంది. ఇది ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. ఈశ్వరుడు ఎలాగైతే
జ్ఞాన సాగరుడో, స్వర్గ వారసత్వాన్ని ఇస్తారో, అలా పిల్లలను కూడా తమ సమానముగా
తప్పకుండా తయారుచేస్తారు. ఇంతకుముందు మీకు తండ్రి పరిచయము లేదు. ఏ పరమాత్మునికైతే
ఇంతటి మహిమ ఉందో, వారు మమ్మల్ని అంత ఉన్నతముగా తయారుచేస్తారని ఇప్పుడు మీకు తెలుసు,
కావున స్వయాన్ని అంత ఉన్నతముగా తయారుచేసుకోవాల్సి ఉంటుంది. ఫలానావారిలో దేవతల వలె,
చాలా మంచి దైవీ గుణాలు ఉన్నాయి... అని అంటారు కదా. ఎవరి స్వభావమైతే శాంతిగా ఉంటుందో,
ఎవరైతే ఎవరినీ నిందించరో, వారిని మంచి వ్యక్తులని అంటారు. కానీ వారికి తండ్రి
గురించి, సృష్టి చక్రము గురించి తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని
అమరలోకానికి యజమానులుగా తయారుచేస్తారు. తండ్రి తప్ప కొత్త ప్రపంచానికి యజమానులుగా
ఇంకెవ్వరూ తయారుచేయలేరు. ఇది పాత ప్రపంచము, అది కొత్త ప్రపంచము. అక్కడ దేవీ-దేవతల
రాజధాని ఉంటుంది. కలియుగములో ఆ రాజధాని ఉండదు, అది కాకుండా వేరే రాజధానులు ఎన్నో
ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అనేక రాజధానులు వినాశనమై ఒకే రాజధాని స్థాపన అవ్వనున్నది.
ఎప్పుడైతే ఏ రాజధాని ఉండదో, అప్పుడు తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. అది కూడా తండ్రి
తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. పిల్లలైన మీకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి. తండ్రి ఏదైతే
చెప్తారో, అది తప్పకుండా చేస్తారు. ఒకటేమో, తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి
మరియు సేవ చేయండి, ఇతరులకు మార్గాన్ని తెలియజేయండి. దేవీ-దేవతా ధర్మము వారు ఎవరైతే
ఉంటారో, వారిపై తప్పకుండా ప్రభావము పడుతుంది. మనము ఒక్క తండ్రిని మాత్రమే మహిమ
చేస్తాము. తండ్రిలో గుణాలు ఉన్నాయి కనుక తండ్రే వచ్చి మనల్ని గుణవంతులుగా
తయారుచేస్తారు. తండ్రి అంటారు - పిల్లలూ, చాలా మధురముగా అవ్వండి, అందరికీ ప్రేమగా
కూర్చుని అర్థం చేయించండి. భగవానువాచ - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే నేను
మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. మీరు ఇప్పుడు తిరిగి ఇంటికి
వెళ్ళాలి. పాత ప్రపంచ మహావినాశనము ఎదురుగా నిలబడి ఉంది. ఇంతకుముందు కూడా మహాభారీ
మహాభారత యుద్ధము జరిగింది, భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు. ఇప్పుడు అనేక ధర్మాలు
ఉన్నాయి. సత్యయుగములో ఒకే ధర్మము ఉండేది, అది ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇప్పుడు
తండ్రి వచ్చి అనేక ధర్మాలను వినాశనము చేసి ఏక ధర్మ స్థాపనను చేస్తారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, అమరపురిలోకి వెళ్ళేందుకు నేను ఈ యజ్ఞాన్ని రచిస్తాను, మీకు అమరకథను
వినిపిస్తాను. అమరలోకములోకి వెళ్ళాలంటే తప్పకుండా మృత్యులోక వినాశనము జరుగుతుంది.
తండ్రి కొత్త ప్రపంచ రచయిత కనుక తండ్రి తప్పకుండా ఇక్కడికే రావాల్సి ఉంటుంది.
ఇప్పుడైతే వినాశ జ్వాల ఎదురుగా నిలబడి ఉంది. మీరు సత్యమే చెప్తున్నారు, నిజంగా ఇది
అదే మహాభారత యుద్ధమని తర్వాత అర్థం చేసుకుంటారు. ఈ మహాభారత యుద్ధము ప్రసిద్ధమైనది
కనుక తప్పకుండా ఈ సమయములో భగవంతుడు కూడా ఉంటారు. భగవంతుడు ఎలా వస్తారు అనేది మీరు
తెలియజేయగలరు. మాకైతే డైరెక్టుగా భగవంతుడే అర్థం చేయిస్తున్నారని మీరు అందరికీ
చెప్పండి. వారు, నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. సత్యయుగములోనైతే అందరూ
సతోప్రధానముగా ఉంటారు. ఇప్పుడు తమోప్రధానముగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా
అవ్వండి, అప్పుడు ముక్తి-జీవన్ముక్తులలోకి వెళ్తారు.
తండ్రి అంటారు - కేవలం నా స్మృతితోనే మీరు సతోప్రధానముగా అయి సతోప్రధాన ప్రపంచానికి
యజమానులుగా అవుతారు. మనము ఆత్మిక పండాలము, ‘మన్మనాభవ’ యొక్క యాత్రను చేస్తున్నాము.
తండ్రి వచ్చి బ్రాహ్మణ ధర్మాన్ని, సూర్యవంశీ, చంద్రవంశీ ధర్మాలను స్థాపన చేస్తారు.
తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయకపోతే జన్మజన్మల పాపాల భారము తొలగదు. ఇదే మీకు
అన్నింటికంటే పెద్ద చింత. ఓ ప్రేయసులారా, మీరు కర్మలు చేసుకుంటూ, వ్యాపార-వ్యవహారాలు
చేసుకుంటూ, ప్రియుడినైన నన్ను స్మృతి చేయండి. ప్రతి ఒక్కరూ తమను తాము పూర్తిగా
సంభాళించుకోవాలి. తండ్రిని స్మృతి చేయండి. ఎలాంటి పతిత కర్మలు చేయకండి. భారత్
స్వర్గముగా ఉండేదని, అక్కడ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని ఇంటింటికి తండ్రి
సందేశాన్ని ఇస్తూ ఉండండి. ఇప్పుడిది నరకము. నరకము యొక్క వినాశనము కోసం ఇది అదే
మహాభారత యుద్ధము. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి. ఇది తండ్రి ఆజ్ఞ, దీనిని
పాటించడము, పాటించకపోవడము అనేది మీ ఇష్టము. నేనైతే మీకు సందేశాన్ని వినిపించడానికి
వచ్చాను. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - అందరికీ సందేశాన్ని వినిపించండి. ఏ సేవ చేయాలి అని
బాబాను అడుగుతారు. బాబా అంటారు, సందేశాన్ని ఇస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేయండి,
రాజధానిని స్మృతి చేయండి. అప్పుడు అంతమతి సో గతి అవుతుంది (అంతిమ సమయములో ఎటువంటి
ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది). మందిరాలకు వెళ్ళండి, గీతా పాఠశాలలకు
వెళ్ళండి. మున్ముందు మిమ్మల్ని చాలామంది కలుస్తూ ఉంటారు. మీరు దేవీ-దేవతా ధర్మము
వారిని పైకి ఎత్తాలి.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - చాలా-చాలా మధురముగా అవ్వండి. చెడు నడవడిక ఉంటే పదవి
భ్రష్టమవుతుంది. ఎవరికీ దుఃఖము ఇవ్వకండి. సమయము చాలా కొద్దిగా ఉంది. ఎవరి నుండైతే
స్వర్గ రాజ్యము లభిస్తుందో, ఆ ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. ఎవరైనా మురళీ
వినిపించలేకపోతే (జ్ఞానము వినిపించలేకపోతే) మెట్ల వరస చిత్రము ముందు కూర్చుని కేవలం
ఇలా ఆలోచించండి - మేము ఈ విధముగా జన్మలు తీసుకుంటాము, ఈ విధముగా చక్రములో తిరుగుతూ
ఉంటాము... అలా చేస్తూ ఉంటే దానంతట అదే వాణి తెరుచుకుంటుంది. ఏ విషయమైతే లోపల ఉంటుందో,
అది బయటకు తప్పకుండా వస్తుంది. స్మృతి చేస్తే మనము పవిత్రముగా అవుతాము మరియు కొత్త
ప్రపంచములో రాజ్యము చేస్తాము. మనది ఇప్పుడు ఎక్కే కళ. కనుక లోపల సంతోషముండాలి. మనము
ముక్తిధామానికి వెళ్ళి తర్వాత జీవన్ముక్తిలోకి వస్తాము. ఇది చాలా గొప్ప సంపాదన.
వ్యాపార-వ్యవహారాలు చేసుకోండి, కేవలం బుద్ధి ద్వారా స్మృతి చేయండి. స్మృతి చేయడము
అలవాటు అయిపోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. నడవడిక బాగోకపోతే ధారణ జరగదు.
ఎవ్వరికీ అర్థం చేయించలేరు. అడుగులు ముందుకు వేసే పురుషార్థము చేయాలి. వెనుకకు
రాకూడదు. ప్రదర్శనీలో సేవ చేస్తే చాలా సంతోషము కలుగుతుంది. వారికి, నన్ను స్మృతి
చేయండి అని తండ్రి చెప్తున్నారని కేవలం ఈ విషయాన్ని తెలియజేయండి. దేహధారులను స్మృతి
చేసినట్లయితే వికర్మలు తయారవుతాయి. వారసత్వాన్ని ఇచ్చేవాడిని నేను. నేను అందరికీ
తండ్రిని. నేనే వచ్చి మిమ్మల్ని ముక్తి-జీవన్ముక్తులలోకి తీసుకువెళ్తాను.
ప్రదర్శనీలలో, మేళాలలో సేవ చేయడానికి చాలా అభిరుచి ఉండాలి. సేవ పట్ల అటెన్షన్
పెట్టాలి. పిల్లలు తమంతట తామే ఈ విషయాల గురించి ఆలోచించాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఒక్క తండ్రి పట్ల పూర్తి ప్రేమనుంచుకోవాలి. అందరికీ సత్యమైన మార్గాన్ని
తెలియజేయాలి. వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ తమను తాము పూర్తిగా
సంభాళించుకోవాలి. ఒక్కరి స్మృతిలోనే ఉండాలి.
2. సేవ చేయాలి అని చాలా-చాలా అభిరుచి ఉండాలి. తమ నడవడికను సరిదిద్దుకోవాలి,
స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి.
వరదానము:-
కృషి మరియు మహానతతో పాటు ఆత్మికతను అనుభవం చేయించే శక్తిశాలి
సేవాధారి భవ
ఏ ఆత్మలు మీ సంపర్కములోకి వచ్చినా కానీ వారికి ఆత్మిక
శక్తిని అనుభవం చేయించండి. ఎటువంటి స్థూలమైన మరియు సూక్ష్మమైన స్టేజ్ ను
తయారుచేసుకోండి అంటే, దానితో రాబోయే ఆత్మలు తమ స్వరూపాన్ని మరియు ఆత్మికతను అనుభవం
చేసుకోవాలి. ఇటువంటి శక్తిశాలి సేవను చేసేందుకు సేవాధారీ పిల్లలు - వ్యర్థ సంకల్పాలు,
వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మల అలజడి నుండి అతీతముగా ఏకాగ్రతలో అనగా ఆత్మికతలో ఉండే
వ్రతము చేపట్టాల్సి ఉంటుంది. ఈ వ్రతము ద్వారానే జ్ఞాన సూర్యుని చమత్కారాన్ని
చూపించగలరు.
స్లోగన్:-
బాబా మరియు
సర్వుల ఆశీర్వాదాల విమానములో ఎగిరేవారే ఎగిరే యోగులు.
అవ్యక్త ప్రేరణలు -
పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి
అతి పాపాత్ములపై, అతి
అపకారులపై, కొంగల వంటి వారిపై కూడా ద్వేషము ఉండకూడదు, అయిష్టము ఉండకూడదు, వారిని
నిరాదరించకూడదు. విశ్వ కళ్యాణకారి స్థితిలో స్థితులై దయార్ద్ర హృదయులై దయా భావనను
పెట్టుకుని సేవ యొక్క సంబంధముగా భావించి సేవ చేయండి, ఎంతగా హోప్ లెస్ కేస్ లాంటివారి
సేవ చేస్తారో, అంతగానే ప్రైజ్ కు అధికారులుగా అవుతారు మరియు ప్రసిద్ధి చెందిన విశ్వ
కళ్యాణకారులుగా మహిమ చేయబడతారు. పీస్ మేకర్ అనే ప్రైజ్ ను తీసుకుంటారు.