26-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు వరల్డ్ సర్వెంట్ (విశ్వ
సేవకులు), మీకు ఏ విషయములోనూ దేహాభిమానము రాకూడదు’’
ప్రశ్న:-
ఏ ఒక్క
అలవాటు ఈశ్వరీయ నియమాలకు విరుద్ధమైనది, దాని వలన చాలా నష్టము కలుగుతుంది?
జవాబు:-
ఏవైనా సినిమా
కథలను వినడము లేక చదవడము, నవలలు చదవడము... ఈ అలవాట్లు పూర్తిగా నియమ విరుద్ధమైనవి,
దీని వలన చాలా నష్టము కలుగుతుంది. పిల్లలూ, మీరు ఇటువంటి పుస్తకాలేవీ చదవకూడదు అని
బాబా నిషేధిస్తారు. ఒకవేళ ఎవరైనా బి.కె.లు ఇటువంటి పుస్తకాలు చదువుతున్నట్లయితే మీరు
పరస్పరములో సావధానపరచుకోండి.
పాట:-
ముఖాన్ని
చూసుకో ప్రాణీ...
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి చెప్తున్నారు - మేము స్మృతియాత్ర
ద్వారా తమోప్రధానము నుండి సతోప్రధానము వైపుకు ఎంతగా ముందుకు వెళ్తున్నాము అని
స్వయాన్ని చెక్ చేసుకోండి ఎందుకంటే ఎంతెంతగా స్మృతి చేస్తారో, అంతగా పాపాలు కట్
అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పదాలు శాస్త్రాలు మొదలైనవాటిలో ఎక్కడైనా వ్రాయబడి ఉన్నాయా?
ఎందుకంటే ఎవరెవరైతే ధర్మ స్థాపన చేశారో, వారు ఏదైతే అర్థం చేయించారో, అది వారి
శాస్త్రముగా తయారుచేయబడింది, తర్వాత వాటిని కూర్చొని చదువుకుంటారు. ఆ పుస్తకాలను
పూజిస్తారు. దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి
అని వ్రాసి ఉంది కావున, మరి ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము. తండ్రి స్మృతిని
ఇప్పిస్తున్నారు - పిల్లలైన మీరు మొట్టమొదట అశరీరిగా వచ్చారు, అక్కడైతే పవిత్రముగానే
ఉంటారు. ముక్తి-జీవన్ముక్తులలోకి పతిత ఆత్మలెవ్వరూ వెళ్ళలేరు. అది నిరాకారీ,
నిర్వికారీ ప్రపంచము. దీనిని సాకారీ, వికారీ ప్రపంచమని అంటారు. సత్యయుగములో మళ్ళీ
ఇదే నిర్వికారీ ప్రపంచముగా అవుతుంది. సత్యయుగములో ఉండే దేవతలకైతే చాలా మహిమ ఉంది.
ఇప్పుడు పిల్లలకు ఏమని అర్థం చేయించడము జరుగుతుందంటే - మీరు మంచి రీతిలో ధారణ చేసి
ఇతరులకు అర్థం చేయించండి. ఆత్మలైన మీరు ఎక్కడ నుండైతే వచ్చారో, అక్కడ నుండి
పవిత్రముగానే వచ్చారు. ఇక్కడకు వచ్చి మళ్ళీ అపవిత్రముగా కూడా తప్పకుండా అవ్వాలి.
సత్యయుగాన్ని నిర్వికారీ ప్రపంచమని, కలియుగాన్ని వికారీ ప్రపంచమని అంటారు. మమ్మల్ని
పావనముగా, నిర్వికారులుగా చేయడానికి మీరు వికారీ ప్రపంచములోకి, వికారీ శరీరములోకి
రండి అని ఇప్పుడు మీరు పతిత-పావనుడైన తండ్రిని తలచుకుంటారు. దాదాను ఎందుకు
కూర్చోబెట్టారు అని బ్రహ్మా చిత్రము గురించే తికమకపడతారు అని తండ్రి స్వయంగా
కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వీరు భగీరథుడు అని అర్థం చేయించాలి. శివ భగవానువాచ
- నేను ఈ రథాన్ని తీసుకున్నాను ఎందుకంటే నాకు ప్రకృతి యొక్క ఆధారము తప్పకుండా కావాలి.
లేకపోతే నేను మిమ్మల్ని పతితము నుండి పావనముగా ఎలా తయారుచేస్తాను. ప్రతిరోజూ
చదివించడము కూడా తప్పనిసరి. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు చెప్తున్నారు, స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి. ఆత్మలందరూ తమ తండ్రిని స్మృతి చేయాలి.
శ్రీకృష్ణుడిని ఆత్మలందరి తండ్రి అని అనరు. వారికి వారిదంటూ శరీరముంది. ఈ తండ్రి
చాలా సహజముగా అర్థం చేయిస్తున్నారు - మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు ఇలా
చెప్పండి - మీరు అశరీరిగా వచ్చారు, ఇప్పుడు అశరీరిగా అయి వెళ్ళాలి అని తండ్రి
చెప్తున్నారు. అక్కడ నుండి పవిత్ర ఆత్మయే వస్తుంది. ఒకవేళ రేపు ఎవరైనా వచ్చినా కూడా,
వారు పవిత్రముగా ఉంటారు కావున వారి మహిమ తప్పకుండా జరుగుతుంది. సన్యాసులు, గృహస్థులు
మొదలైనవారు ఎవరైతే ప్రసిద్ధి చెందుతారో, తప్పకుండా వారికి ఇది మొదటి జన్మ కదా. వారు
ధర్మ స్థాపన చేయడానికి రావలసే ఉంటుంది. ఉదాహరణకు బాబా గురునానక్ కోసం అర్థం
చేయిస్తారు. ఇప్పుడు గురు అనే పదము కూడా ఉపయోగించవలసి ఉంటుంది ఎందుకంటే నానక్ అనే
పేరు అయితే చాలామందికి ఉంటుంది కదా. ఎప్పుడైనా ఎవరినైనా మహిమ చేసేటప్పుడు, అర్థ
సహితముగా పదాలను ఉపయోగించడము జరుగుతుంది. అలా చేయకపోతే బాగుండదు. వాస్తవానికి ఒక్కరు
తప్ప ఇంకెవ్వరూ గురువు కాదని పిల్లలకు అర్థం చేయించారు. సద్గురు అకాల్... అని ఎవరి
పేరునైతే గాయనము చేస్తారో, వారు అకాలమూర్తులు అనగా వారిని మృత్యువు కబళించదు, వారు
ఆత్మ, అందుకే ఈ కథలు మొదలైనవి కూర్చుని తయారుచేశారు. సినిమా కథల పుస్తకాలు, నవలలు
మొదలైనవి కూడా చాలామంది చదువుతారు. బాబా పిల్లలను అప్రమత్తము చేస్తున్నారు. మీరు
ఎప్పుడూ కూడా నవలలు మొదలైనవేవీ చదవకూడదు. కొంతమందికి అలవాటు ఉంటుంది. ఇక్కడైతే మీరు
సౌభాగ్యశాలులుగా అవుతారు. కొంతమంది బి.కె.లు కూడా నవలలు చదువుతారు, అందుకే బాబా
పిల్లలందరికీ చెప్తున్నారు, ఎప్పుడైనా ఎవరైనా నవలలు చదవడము చూసినట్లయితే వెంటనే
తీసుకుని చింపేయండి, ఇందులో భయపడకూడదు. మమ్మల్ని ఎవరైనా శపిస్తారేమో లేదా మాపై
కోప్పడతారేమో అని అనుకోకండి, అలాంటి విషయాలేవీ ఉండవు. మీ పని - ఒకరినొకరు
సావధానపరచుకోవడము. సినిమా కథలను వినడము లేదా చదవడము నియమ విరుద్ధము. నియమ
విరుద్ధమైన నడవడిక ఏదైనా ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలి. లేకపోతే ఎలా బాగుపడతారు?
స్వయాన్ని నష్టపరచుకుంటూ ఉంటారు. స్వయములోనే యోగబలము లేకపోతే ఇక్కడ కూర్చొని ఏం
నేర్పిస్తారు. బాబా అంగీకరించరు. ఒకవేళ అటువంటి పనులు చేస్తే, మనసు లోలోపల తప్పకుండా
తింటూ ఉంటుంది, స్వయము నష్టపోతారు, అందుకే ఎవరిలోనైనా ఏదైనా అవగుణము చూసినట్లయితే
వ్రాయాలి. ఎటువంటి నియమ విరుద్ధమైన నడవడిక నడుచుకోవడము లేదు కదా? ఎందుకంటే
బ్రాహ్మణులు ఈ సమయములో సర్వెంట్లు కదా. బాబా కూడా - పిల్లలూ, నమస్తే అని అంటారు.
అర్థ సహితముగా అర్థం చేయిస్తారు. కుమార్తెలు ఎవరైతే చదివిస్తారో, వారిలో దేహాభిమానము
రాకూడదు. టీచర్ కూడా విద్యార్థులకు సర్వెంట్ గా ఉంటారు కదా. గవర్నర్ మొదలైనవారు కూడా
లెటర్ వ్రాస్తారు, నేను విధేయత గల సేవాధారిని అని వ్రాసి కింద సంతకము చేస్తారు. దాని
ఎదురుగా పేరు వ్రాస్తారు. మిగిలినది క్లర్క్ తన చేతితో వ్రాస్తారు. ఎప్పుడూ వారి
గొప్పతనము గురించి వ్రాయరు. ఈ రోజుల్లో గురువులైతే తమంతట తామే తమకు శ్రీ-శ్రీ అని
వ్రాసుకుంటారు. ఇక్కడ కూడా కొంతమంది - శ్రీ ఫలానా అని వ్రాసుకుంటారు. వాస్తవానికి
అలా కూడా వ్రాయకూడదు. అలానే, స్త్రీలు శ్రీమతి అని వ్రాయకూడదు. శ్రీమతము ఎప్పుడు
లభిస్తుందంటే, శ్రీ-శ్రీ స్వయముగా వచ్చి మతము ఇచ్చినప్పుడు. తప్పకుండా దేవతలు ఎవరిదో
మతము ద్వారానే దేవతలుగా అయ్యారు కదా అని మీరు అర్థం చేయించవచ్చు. వీరు ఇంత ఉన్నతముగా,
విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు అనేది భారత్ లో ఎవ్వరికీ తెలియదు. మీకైతే ఈ నషా
ఎక్కాలి. లక్ష్యము-ఉద్దేశ్యము ఉన్న ఈ చిత్రము సదా హృదయముపై తగిలించి ఉండాలి.
ఎవరికైనా ఇలా చెప్పండి - మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, దానితో మేము విశ్వానికి
మహారాజుగా అవుతాము, తండ్రి ఈ రాజ్యాన్ని స్థాపన చేయడానికి వచ్చారు. ఈ పాత ప్రపంచము
యొక్క వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. చిన్న-చిన్న కుమార్తెలు చిలుక పలుకుల భాషలో
ఎవరికైనా అర్థం చేయించవచ్చు. పెద్ద-పెద్ద కాన్ఫరెన్స్ లు మొదలైనవి జరిగినప్పుడు,
వాటికి మిమ్మల్ని పిలుస్తారు. మీరు ఈ చిత్రాలను తీసుకువెళ్ళండి మరియు అక్కడ కూర్చొని
అర్థం చేయించండి. భారత్ లో మళ్ళీ వీరి రాజ్యము స్థాపనవుతుంది. మీరు ఎక్కడైనా పెద్ద
సభలో అర్థం చేయించవచ్చు. రోజంతా సేవ యొక్క నషాయే ఉండాలి. భారత్ లో వీరి రాజ్యము
స్థాపన అవుతోంది. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. శివ భగవానువాచ - ఓ
పిల్లలూ, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. అప్పుడు మీరు 21
తరాల కొరకు ఈ విధముగా తయారవుతారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇప్పుడైతే అందరివీ
ఆసురీ గుణాలే. శ్రేష్ఠముగా తయారుచేసేవారు అయితే ఒక్క శ్రీ శ్రీ శివబాబా మాత్రమే. ఆ
ఉన్నతోన్నతమైన తండ్రియే మనల్ని చదివిస్తున్నారు. శివ భగవానువాచ, మన్మనాభవ. భగీరథుడు
అయితే ప్రసిద్ధి చెందినవారు. భగీరథుడినే బ్రహ్మా అని అంటారు, వారిని మహావీర్ అని
కూడా అంటారు. ఇక్కడ దిల్వాడా మందిరములో కూర్చుని ఉన్నారు కదా. ఈ మందిరాన్ని
నిర్మించిన జైనులు మొదలైనవారెవరికీ ఈ విషయము తెలియదు. చిన్న-చిన్న కుమార్తెలైన మీరు
వెళ్ళి వారినెవరినైనా కలవచ్చు. ఇప్పుడు మీరు చాలా శ్రేష్ఠముగా తయారవుతున్నారు. ఇది
భారత్ యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము కదా. ఎంత నషా ఎక్కాలి. ఇక్కడ బాబా మంచి రీతిలో నషా
ఎక్కిస్తారు. మేము లక్ష్మీ-నారాయణులుగా అవుతాము అని అందరూ అంటారు. సీతా-రాములుగా
అయ్యేందుకు ఎవ్వరూ చెయ్యి ఎత్తరు. ఇప్పుడు మీరు అహింసకులు, క్షత్రియులు. అహింసక
క్షత్రియులైన మీ గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు.
గీతలో కూడా మన్మనాభవ అనే పదము ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది అర్థం
చేసుకోవలసిన విషయము కదా, ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి కూర్చుని పిల్లలకు
శిక్షణను ఇస్తున్నారు - పిల్లలూ, ఆత్మాభిమానులుగా అవ్వండి. మీ ఈ అలవాటు తర్వాత 21
జన్మలు కొనసాగుతుంది. మీకు 21 జన్మల కొరకు శిక్షణ లభిస్తుంది.
బాబా పదే-పదే ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ కూర్చోండి. తండ్రి అయిన పరమాత్మ కూర్చుని ఆత్మలైన మనకు అర్థం
చేయిస్తున్నారు - మీరు పదే-పదే దేహాభిమానములోకి వచ్చేస్తుంటారు, అప్పుడు
ఇళ్ళు-వాకిళ్ళు మొదలైనవి గుర్తుకొస్తాయి. ఇలా జరుగుతుంటుంది. భక్తి మార్గములో కూడా
భక్తి చేస్తూ-చేస్తూ బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోతుంది. కేవలం నవవిధ భక్తి చేసేవారే
ఏకరసముగా కూర్చోగలరు, దానినే తీవ్ర భక్తి అని అంటారు. వారు పూర్తిగా లవలీనమైపోతారు.
మీరు స్మృతిలో కూర్చొన్నప్పుడు అప్పుడప్పుడు పూర్తిగా అశరీరిగా అయిపోతారు. ఎవరైతే
మంచి పిల్లలు ఉంటారో, వారే ఇటువంటి అవస్థలో కూర్చొంటారు. దేహ భానము తొలగిపోతుంది.
అశరీరిగా అయి ఆ ఆనందములో కూర్చుండిపోతారు. ఇది అలవాటైపోతుంది. సన్యాసులు అంటే తత్వ
జ్ఞానులు లేక బ్రహ్మ జ్ఞానులు. వారు - మేము లీనమైపోతాము, ఈ పాత శరీరాన్ని వదిలి
బ్రహ్మ తత్వములో లీనమైపోతాము అని అంటారు. అందరికీ తమ-తమ ధర్మము ఉంటుంది కదా. ఇతర
ధర్మాలను ఎవ్వరూ అంగీకరించరు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమువారు కూడా తమోప్రధానముగా
అయిపోయారు. గీతా భగవానుడు ఎప్పుడు వచ్చారు? గీతా యుగము ఎప్పుడు ఉండేది? ఇది ఎవ్వరికీ
తెలియదు. మీకు తెలుసు, ఈ సంగమయుగములోనే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు,
తమోప్రధానము నుండి సతోప్రధానముగా తయారుచేస్తారు. ఇది భారత్ యొక్క విషయమే. తప్పకుండా
అనేక ధర్మాలు కూడా ఉండేవి. ఏక ధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనము అని గాయనము కూడా
ఉంది. సత్యయుగములో ఒకే ధర్మము ఉండేది. ఇప్పుడు కలియుగములో అనేక ధర్మాలు ఉన్నాయి.
మళ్ళీ ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. ఒకే ధర్మము ఉండేది, అది ఇప్పుడు లేదు.
మిగిలినవన్నీ నిలిచి ఉన్నాయి. మర్రి వృక్షము ఉదాహరణ పూర్తిగా సరైనది. దానికి పునాది
ఉండదు, మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంటుంది. అలాగే, ఇందులో కూడా దేవీ-దేవతా ధర్మము
లేదు. కాండమైన ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఇప్పుడు కనుమరుగైపోయింది. దానిని తండ్రి
మళ్ళీ స్థాపన చేస్తారు. మిగిలిన ఈ ధర్మాలన్నీ వెనుక వచ్చాయి, చక్రము మళ్ళీ తప్పకుండా
రిపీట్ అవ్వాలి అనగా పాత ప్రపంచము నుండి మళ్ళీ కొత్త ప్రపంచముగా తయారవ్వనున్నది.
కొత్త ప్రపంచములో వీరి రాజ్యము ఉండేది. మీ వద్ద పెద్ద చిత్రాలు కూడా ఉన్నాయి,
చిన్నవి కూడా ఉన్నాయి. పెద్ద వస్తువు అయితే దానిని చూసి మీరేమి పట్టుకున్నారు అని
అడుగుతారు. మీరు ఏమని చెప్పండి అంటే - మనుష్యులు బికారుల నుండి రాకుమారులుగా అయ్యే
చిత్రాన్ని మేము పట్టుకున్నాము. మనసులో చాలా ఉత్సాహము, చాలా సంతోషము ఉండాలి.
ఆత్మలమైన మనము భగవంతుని పిల్లలము. ఆత్మలను భగవంతుడు చదివిస్తున్నారు. బాబా మనల్ని
నయనాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తారు. ఈ ఛీ-ఛీ ప్రపంచములోనైతే మనము ఉండేదే లేదు.
మున్ముందు దుఃఖములో రక్షణ కొరకు ఎంతగానో అలమటిస్తారు, ఇక అడగకండి. కోట్లాదిమంది
మనుష్యులు మరణిస్తారు. ఇదైతే పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ కళ్ళతో మనము ఏదైతే
చూస్తున్నామో, ఇదేదీ ఉండవు. ఇక్కడ మనుష్యులు ముళ్ళ వలె ఉన్నారు. సత్యయుగము పుష్పాల
తోట. ఇక తర్వాత మన నయనాలు శీతలముగా అయిపోతాయి. పుష్పాల తోటలోకి వెళ్ళడముతోనే నయనాలు
చల్లగా, శీతలముగా అవుతాయి కదా. మీరు ఇప్పుడు పదమాపదమ భాగ్యశాలులుగా అవుతున్నారు.
బ్రాహ్మణులుగా ఎవరైతే అవుతారో, వారి పాదాలలో పదమాలు ఉంటాయి. పిల్లలైన మీరు అర్థం
చేయించాలి - మేము ఈ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము, అందుకే బాబా బ్యాడ్జి
తయారుచేయించారు అని. తెల్ల చీర ధరించి, బ్యాడ్జి పెట్టుకుంటే, దీనితో స్వతహాగానే
సేవ జరుగుతూ ఉంటుంది. ఆత్మ పరమాత్మ బహుకాలము వేరుగా ఉన్నారు... అని మనుష్యులు
పాడుతారు, కానీ బహుకాలము యొక్క అర్థాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. బహుకాలము తర్వాత
అనగా 5 వేల సంవత్సరాల తర్వాత పిల్లలైన మీరు తండ్రిని కలుసుకుంటారని తండ్రి మీకు
చెప్పారు. ఇది కూడా మీకు తెలుసు, ఈ సృష్టిలో అందరికన్నా ప్రసిద్ధి చెందినవారు ఈ
రాధా-కృష్ణులు. వీరు సత్యయుగము యొక్క మొదటి రాకుమార, రాకుమారీలు. వీరు ఎక్కడి నుండి
వచ్చారు అనేది ఎప్పుడూ ఎవ్వరి ఆలోచనలో కూడా రాదు. సత్యయుగము కంటే ముందు తప్పకుండా
కలియుగము ఉంటుంది. విశ్వానికి యజమానులుగా అయ్యే విధముగా వారు ఏ కర్మలు చేసారు.
భారతవాసులెవ్వరూ వీరిని విశ్వానికి యజమానులుగా భావించరు. వీరి రాజ్యము ఉన్నప్పుడు
భారత్ లో వేరే ధర్మమేదీ ఉండేది కాదు. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని
పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. మన లక్ష్యము-ఉద్దేశ్యము ఇదే. మందిరాలలో వారి చిత్రాలు
మొదలైనవి ఉన్నాయి. కానీ ఈ సమయములో ఈ స్థాపన జరుగుతోందని వారికి తెలియదు. మీలో కూడా
నంబరువారుగా అర్థం చేసుకుంటారు. కొంతమంది అయితే పూర్తిగా మర్చిపోతారు. నడవడిక
పూర్వము ఏ విధముగా ఉండేదో, అలాగే అయిపోతుంది. ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకుంటారు,
ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే సమాప్తమైపోతుంది. సేవ పట్ల అభిరుచి ఉండాలి. అందరికీ ఈ
సందేశాన్ని ఇచ్చే యుక్తిని రచించాలి, కృషి చేయాలి. నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు
తొలగిపోతాయని శివబాబా చెప్తున్నారు అని నషాతో చెప్పాలి. మనము ఒక్క శివబాబాను తప్ప
ఇతరులెవ్వరినీ స్మృతి చేయము. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. లక్ష్యము-ఉద్దేశ్యము యొక్క చిత్రాన్ని సదా మీతోపాటు ఉంచుకోవాలి. ఇప్పుడు మేము
శ్రీమతము ఆధారముగా విశ్వానికి యజమానులుగా అవుతున్నాము అన్న నషా ఉండాలి. మనము ఎటువంటి
పుష్పాలతోటలోకి వెళ్తామంటే, అక్కడ మన నయనాలు శీతలమైపోతాయి.
2. సేవ పట్ల చాలా-చాలా అభిరుచి ఉంచుకోవాలి. పెద్ద మనసుతో మరియు ఉల్లాసముతో
పెద్ద-పెద్ద చిత్రాలతో సేవ చేయాలి. బికారుల నుండి రాకుమారులుగా తయారుచేయాలి.
వరదానము:-
కర్మల గతిని తెలుసుకుని గతి, సద్గతుల నిర్ణయాన్ని తీసుకునే
మాస్టర్ దుఃఖహర్త, సుఖకర్త భవ
ఇప్పటివరకు కూడా మీ జీవిత గాథను చూడడములోనే మరియు
వినిపించడములోనే బిజీగా ఉండకండి. ప్రతి ఒక్కరి కర్మల గతిని తెలుసుకుని గతి,
సద్గతులను అందించాలనే నిర్ణయము తీసుకోండి, మాస్టర్ దుఃఖహర్త, సుఖకర్త పాత్రను
అభినయించండి. మీ రచన యొక్క దుఃఖ-అశాంతుల సమస్యను సమాప్తము చేయండి. వారికి
మహాదానాన్ని మరియు వరదానాన్ని ఇవ్వండి. మీరు స్వయము సౌకర్యాలను తీసుకోకండి, ఇప్పుడు
దాతగా అయి ఇవ్వండి. ఒకవేళ మీకు లభించే సౌకర్యాల ఆధారముగా స్వయము యొక్క ఉన్నతి
జరిగినా లేక సేవలో అల్పకాలికమైన సఫలత ప్రాప్తించినా, ఈ రోజు మహానులుగా ఉంటారు కానీ
రేపు మహానత యొక్క దాహము కల ఆత్మగా అయిపోతారు.
స్లోగన్:-
అనుభూతి
కలగకపోవడము అనేది యుద్ధము యొక్క స్థితి, యోగీగా అవ్వండి, అంతేకానీ యోధునిగా కాదు.
అవ్యక్త సూచనలు -
అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి
బ్రహ్మాబాబా అవ్యక్తమై
విదేహీ స్థితి ద్వారా కర్మాతీతులుగా అయ్యారు, మీరు అవ్యక్త బ్రహ్మా యొక్క విశేష
పాలనకు పాత్రులు, అందుకే అవ్యక్త పాలనకు రెస్పాన్స్ గా విదేహీగా అవ్వండి. సేవ మరియు
స్థితి యొక్క బ్యాలెన్స్ పెట్టుకోండి. విదేహీ అనగా దేహము నుండి అతీతము. స్వభావము,
సంస్కారాలు, బలహీనతలు, ఇవన్నీ దేహానికి చెందినవి, దేహము నుండి అతీతమైనట్లయితే ఈ
అన్నింటి నుండి అతీతమైపోతారు, అందుకే ఈ డ్రిల్ చాలా సహయోగాన్ని ఇస్తుంది, దీని కోసం
కంట్రోలింగ్ పవర్ కావాలి.
| | | |