27-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 14.03.2006


‘‘పరమాత్మ మిలనము యొక్క అనుభూతి కొరకు తప్పుడు రూపములోని ‘నేను అన్న భావన’ను కాల్చే హోలీని జరుపుకోండి, దృష్టి అనే పిచికారీ ద్వారా సర్వ ఆత్మలపై సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము అనే రంగును చిలకరించండి’’

ఈ రోజు హోలియెస్ట్ (అత్యంత పవిత్రమైన) తండ్రి తమ పవిత్రమైన పిల్లలతో మిలనము జరుపుకుంటున్నారు. నలువైపులా ఉన్న హోలీ (పవిత్రమైన) పిల్లలు దూరముగా కూర్చుని ఉన్నా కానీ సమీపముగా ఉన్నారు. బాప్ దాదా ఇటువంటి హోలీ అనగా మహా పవిత్రులైన పిల్లల మస్తకముపై మెరుస్తున్న భాగ్య సితారను చూస్తున్నారు. ఇటువంటి మహా పవిత్రులుగా మొత్తము కల్పములో మరెవ్వరూ అవ్వరు. ఈ సంగమయుగములో పవిత్రతా వ్రతమును తీసుకునే భాగ్యవంతులైన పిల్లలు భవిష్యత్తులో డబుల్ పవిత్రులుగా ఉంటారు, శరీరము కూడా పవిత్రముగా మరియు ఆత్మ కూడా పవిత్రముగా అవుతుంది. మొత్తము కల్పమంతా తిరిగి చూడండి, ఎంతమంది మహానాత్మలు వచ్చినా కానీ శరీరము కూడా పవిత్రముగా మరియు ఆత్మ కూడా పవిత్రముగా ఉండే ఇటువంటి పవిత్రులుగా ధర్మాత్మలూ అవ్వలేదు, మహాత్ములూ అవ్వలేదు. బాప్ దాదాకు పిల్లలైన మీ విషయములో గర్వంగా ఉంటుంది - వాహ్ నా మహా పవిత్రులైన పిల్లలూ వాహ్! డబుల్ పవిత్రులుగా, డబుల్ కిరీటధారులుగా కూడా ఎవ్వరూ అవ్వరు, డబుల్ కిరీటధారులుగా కూడా శ్రేష్ఠ ఆత్మలైన మీరే అవుతారు. మీ ఆ డబుల్ పవిత్రమైన, డబుల్ కిరీటధారీ స్వరూపము ఎదురుగా వస్తూ ఉంది కదా! అందుకే ఈ సంగమయుగములో పిల్లలైన మీ ప్రాక్టికల్ జీవితము ఏదైతే తయారైందో, ఆ జీవితములోని ఒకొక్క విశేషత యొక్క స్మృతిచిహ్నాన్నే ప్రపంచములోని వారు ఉత్సవము రూపములో జరుపుకుంటుంటారు.

ఈ రోజు కూడా మీరందరూ స్నేహమనే విమానములో హోలీని జరుపుకునేందుకు చేరుకున్నారు. హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా! మీరందరూ మీ జీవితములో పవిత్రత అనే హోలీని జరుపుకున్నారు. ప్రతి ఆధ్యాత్మిక రహస్యానికి ప్రపంచములోనివారు స్థూల రూపాన్ని ఇచ్చారు, ఎందుకంటే దేహ అభిమానము ఉంది కదా! మీరు ఆత్మ అభిమానులు, ఆధ్యాత్మిక జీవితము కలవారు మరియు వారు దేహ అభిమానము కలవారు, అందుకే అన్నిటికీ స్థూల రూపాన్ని చూపించారు. మీరు యోగాగ్ని ద్వారా మీ పాత స్వభావ-సంస్కారాలను భస్మము చేసారు, కాల్చేసారు మరియు ప్రపంచములోని వారు స్థూలమైన అగ్నిలో కాలుస్తారు. ఎందుకని? పాత సంస్కారాలను కాల్చకుండా పరమాత్మ సాంగత్యపు రంగూ అంటుకోదు, అలాగే పరమాత్మ మిలనపు అనుభవాన్ని పొందలేరు. మీ జీవితానికి ఎంతటి విలువ ఉందంటే మీ ఒక్కొక్క అడుగును వారు ఉత్సవము రూపములో జరుపుకుంటారు. ఎందుకని? మీరు మొత్తము సంగమయుగము అంతటినీ ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన జీవితముగా తయారుచేసుకున్నారు. మీ జీవితము యొక్క స్మృతిచిహ్నాన్ని వారు ఒక్క రోజు యొక్క ఉత్సవముగా జరుపుకుంటారు. మరి అందరిదీ ఇటువంటి సదా ఉత్సాహము, ఉల్లాసము, సంతోషము కల జీవితమే కదా! సదానా లేక అప్పుడప్పుడూనా? సదా ఉత్సాహము ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా?

మేము సదా ఉత్సాహములో ఉంటాము, సంతోషములో ఉంటాము, సంతోషము మా జీవితానికి విశేషముగా పరమాత్మ ఇచ్చిన కానుక, ఏం జరిగినా కానీ బ్రాహ్మణ జీవితములోని సంతోషము, ఉత్సాహము, ఉల్లాసము పోవు - అని ఇలా ఎవరైతే భావిస్తున్నారో, ఇలా ఎవరికైతే అనుభవమవుతుందో వారు చేతులెత్తండి. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి ముఖాన్ని సదా సంతోషమయముగా చూడాలనుకుంటున్నారు ఎందుకంటే మీ వంటి అదృష్టవంతులుగా మరెవ్వరూ అవ్వలేదు కూడా, అవ్వలేరు కూడా. భిన్న-భిన్న వర్గాలవారు కూర్చుని ఉన్నారు. మరి ఇటువంటి అనుభవీమూర్తులుగా అయ్యేందుకు స్వయము కొరకు ఏదైనా ప్లాన్ ను తయారుచేసారా?

ఈ రోజు ఫలానా, ఫలానా వర్గాలవారు వచ్చారని బాప్ దాదా సంతోషిస్తున్నారు, స్వాగతము. వచ్చినందుకు అభినందనలు. సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి, కానీ ముందుగా స్వయము కొరకు ప్లాన్ ఉండాలి. అన్ని వర్గాలవారు ప్లాన్లు ఒకరిని మించి మరొకరు తయారుచేస్తారు మరియు చాలా మంచి-మంచివి తయారుచేస్తారు అన్నది బాప్ దాదా చూసారు, కానీ వాటితో పాటు స్వ ఉన్నతి కొరకు ప్లాన్లు తయారుచెయ్యటము చాలా అవసరము. బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ప్రతి వర్గమువారు స్వ ఉన్నతి కొరకు ప్రాక్టికల్ ప్లాన్లు తయారుచెయ్యాలి మరియు నంబరు తీసుకోవాలి. సంగఠనలో అందరూ కలుసుకుంటారు కదా. విదేశాలవారు, ఈ దేశమువారు అందరూ మీటింగ్ పెట్టుకుంటారు, ప్లాన్లు తయారుచేస్తారు, ఆ విషయములో బాప్ దాదా సంతోషిస్తున్నారు, కానీ ఎలా అయితే ఉల్లాస-ఉత్సాహాలతో సంగఠిత రూపములో సేవా ప్లాన్లను తయారుచేస్తున్నారో, అలా అంతే ఉల్లాస-ఉత్సాహాలతో స్వ ఉన్నతిలో నంబరును ఇంకా ఎక్కువ అటెన్షన్ పెట్టి తీసుకోవాలి. ఈ నెలలో ఈ వర్గమువారు స్వ ఉన్నతి కొరకు చేసుకున్న ప్లాన్ ను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చారు అన్నదానిని బాప్ దాదా వినాలనుకుంటున్నారు. ఏయే వర్గాలవారైతే వచ్చారో, అన్ని వర్గాలవారు చేతులెత్తండి. అచ్ఛా, ఇంతమంది వచ్చారు, చాలామంది వచ్చారు. 5-6 వర్గాలవారు వచ్చారని విన్నాము. చాలా మంచిది. మంచిది వచ్చారు. ఇప్పుడు చివరి టర్న్ ఒక్కటి మిగిలి ఉంది. బాప్ దాదా అయితే హోంవర్క్ ను ముందే ఇచ్చేసారు. బాప్ దాదా అయితే ప్రతి రోజూ రిజల్టును చూస్తారు. బాప్ దాదా చివరి టర్న్ లో లెక్క తీసుకుంటారు అని మీరనుకుంటారు కానీ బాప్ దాదా ప్రతి రోజూ చూస్తారు, ఇప్పుడు కూడా ఇంకా 15 రోజులు ఉన్నాయి, ఈ 15 రోజులలో ప్రతి వర్గమువారికీ, ఇక్కడకు వచ్చినారికీ, ఇక్కడకు రాకపోయినా కానీ వర్గాలకు నిమిత్తమైన పిల్లలందరికీ బాప్ దాదా ఇదే సూచనను ఇస్తున్నారు - ప్రతి వర్గము వారు తమ స్వ ఉన్నతి కొరకు ఏదో ఒక ప్లాన్ ను తయారుచేయండి, విశేషముగా ఏదైనా ఒక శక్తి స్వరూపముగా అయ్యేందుకు లేక విశేషముగా ఏదైనా గుణము యొక్క గుణమూర్తులుగా అయ్యేందుకు లేక విశ్వ కళ్యాణము కొరకు ఏదో ఒక రకముగా లైట్-మైట్ ను ఇచ్చేందుకు ప్రతి వర్గము వారు పరస్పరములో నిర్ణయించుకోండి మరియు చెక్ చేసుకోండి - వర్గములో ఎవరైతే సభ్యులుగా అయ్యారో, సభ్యులుగా అయ్యి మంచి పని చేసారు, కానీ ప్రతి సభ్యుడు నంబర్ వన్ అవ్వాలి. ఫలానా వర్గములోని సభ్యుడు అని పేరు నమోదు కావటం కాదు, ఫలానా వర్గములో స్వ ఉన్నతి చేసుకునే సభ్యుడు అని అనాలి. ఇది వీలవుతుందా? వర్గానికి నిమిత్తమైన నిమిత్తులు లేచి నిలబడండి. విదేశాలలో కూడా నలుగురైదుగురు ఎవరైతే నిమిత్తంగా అయ్యారు, వారు కూడా లేచి నిలబడండి. బాప్ దాదాకు అయితే వీరందరూ చాలా శక్తిశాలీ మూర్తులుగా అనిపిస్తారు. చాలా మంచి మూర్తులు. ఈ 15 రోజులలో ఏదైనా చేసి చూపిస్తాము అని మీరందరూ భావిస్తున్నారా? చెప్పండి, వీలవుతుందా? (పూర్తిగా పురుషార్థము చేస్తాము). మిగతావారు చెప్పండి, వీలవుతుందా? (అడ్మినిస్ట్రేషన్ వింగ్ వారు ఎవరము కోప్పడము అని ప్లాన్ తయారుచేశారు) వారి గురించి ఎంక్వయిరీ కూడా చేస్తుంటారా? అక్కయ్యలు (టీచర్లు) - 15 రోజులలో ఎంక్వయిరీ చేసి రిజల్టును తెలుపగలము అన్న ధైర్యాన్ని పెడతారా. విదేశీయులైతే చేస్తామని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు. వీలవుతుందా? భారత్ వారు చెప్పండి, వీలవుతుందా? బాప్ దాదాకు అయితే మీ అందరి ముఖాలను చూస్తుంటే రిజల్టు బాగుంది అని అనిపిస్తుంది, కానీ ఒకవేళ ఈ 15 రోజులైనా కూడా అటెన్షన్ పెట్టే పురుషార్థము చేసినట్లయితే ఈ అభ్యాసము మున్ముందు కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఎటువంటి మీటింగ్ చెయ్యండంటే - ఏదైనా గుణము విషయములో, ఏదైనా శక్తి రూపము విషయములో లక్ష్యము తీసుకోవాలి, ఇందులో బాప్ దాదా నంబర్ ఇస్తారు. స్వసేవలో ఎవరెవరు నంబర్ వన్ వర్గమువారు అన్నదానిని బాప్ దాదా అయితే చూస్తుంటారు, ఎందుకంటే బాప్ దాదా చూసారు, ప్లాన్లు అయితే చాలా మంచి-మంచివి తయారుచేస్తుంటారు, కానీ సేవ మరియు స్వ ఉన్నతి, ఈ రెండు ఒకవేళ కలిసి-కలిసి లేనట్లయితే సేవా ప్లాన్లలో ఎంత సఫలత ఉండాలో అంత ఉండదు, అందుకే సమయము యొక్క సమీపతను ఎదురుగా చూస్తూ సేవను మరియు స్వ ఉన్నతిని కంబైండ్ గా పెట్టుకోండి, కేవలం స్వ ఉన్నతే ఉండకూడదు, సేవ కూడా ఉండాలి కానీ స్వ ఉన్నతి స్థితితో సేవలో సఫలత ఎక్కువగా కలుగుతుంది. సేవలో మరియు స్వ ఉన్నతిలో సఫలతకు గుర్తు ఏమిటంటే - రెండింటిలో స్వయానికి స్వయమూ సంతుష్టముగా ఉండాలి మరియు ఎవరి సేవనైతే చేస్తారో వారికి కూడా సేవ ద్వారా సంతుష్టతా అనుభవము కలగాలి. ఒకవేళ స్వయానికైనా లేక ఎవరి సేవకైతే నిమిత్తమవుతారో వారికైనా సంతుష్టతా అనుభవము కలగకపోతే సఫలత తక్కువ లభిస్తుంది, శ్రమ ఎక్కువ చెయ్యాల్సి వస్తుంది.

సేవలో మరియు స్వ ఉన్నతిలో సఫలతను సహజముగా ప్రాప్తి చేసుకునేందుకు బంగారు తాళము చెవి ఏదో మీ అందరికీ తెలుసా? అనుభవమైతే అందరికీ ఉంది. బంగారు తాళము చెవి ఏమిటంటే - నడవడిక, ముఖములో, సంబంధ-సంపర్కములో నిమిత్త భావము, నిర్మాన భావము, నిర్మల వాణి. ఉదాహరణకు బ్రహ్మాబాబా మరియు జగదంబను చూసారు కదా! ఇప్పుడు అక్కడక్కడ సేవ సఫలతలో పర్సెంటేజ్ వస్తుంది, దానికి కారణము ఏమిటి? ఏదైతే కోరుకుంటారో, ఎంతైతే చేస్తారో, ఎంతగానైతే ప్లాన్లు తయారుచేస్తారో, అందులో పర్సెంటేజ్ ఎందుకు వస్తుంది? బాప్ దాదా మెజారిటీలో ఈ కారణాన్ని చూసారు, అదేమిటంటే సఫలత తక్కువగా రావటానికి కారణము ఒక్కటే పదము, అది ఏమిటి? ‘‘నేను’’. నేను అన్న పదమును మూడు రకాలుగా ఉపయోగిస్తారు. దేహీ-అభిమానములో కూడా నేను ఆత్మను, అని ‘నేను’ అన్న పదము వస్తుంది. దేహ-అభిమానములో కూడా నేను ఏదైతే చెప్తానో, ఏదైతే చేస్తానో అదే కరెక్ట్, నేను తెలివైనవాడిని... ఇది హద్దు యొక్క నేను. ఇలా దేహ-అభిమానములో కూడా నేను అన్నది వస్తుంది. మూడవది, ఎప్పుడైనా ఎవరైనా నిరాశకు లోనైనా కూడా ‘నేను’ అన్నది వస్తుంది. నేను ఇది చెయ్యలేను, నాలో ధైర్యము లేదు, నేను ఇది వినలేను, నేను ఇది ఇముడ్చుకోలేను... మరి బాప్ దాదా ఈ మూడు రకాల నేను, నేను అన్న పాటను చాలానే వింటుంటారు. బ్రహ్మాబాబా, జగదంబ నంబరు తీసుకున్నారు కదా, దాని వెనుక ఉన్న విశేషత ఏమిటంటే - తప్పుడు రూపములోని ‘నేను అన్న భావము’ వారిలో ఉండేది కాదు, ఆ విషయములో వారు అవిద్యులుగా ఉన్నారు. బ్రహ్మాబాబా ఎప్పుడూ కూడా - నేను సలహా ఇస్తున్నాను, నేను కరెక్ట్ అని అనలేదు. బాబా, బాబా... బాబా చేయిస్తున్నారు, నేను చెయ్యటం లేదు. నేను మేధావిని కాను, పిల్లలే తెలివైనవారు అని అనేవారు. జగదంబ యొక్క స్లోగన్ గుర్తుందా? పాతవారికి గుర్తుండి ఉండవచ్చు. జగదంబ ఇదే అనేవారు - ‘‘ఏది జరుగుతున్నా అది ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు’’, నేను కాదు, నడిపించే బాబా నడిపిస్తున్నారు, చేయించే బాబా చేయిస్తున్నారు. కనుక ముందుగా అందరూ మీలో ఉన్న ఈ అభిమానము మరియు అవమానానికి చెందిన నేను అన్నదానిని సమాప్తము చేసి ముందుకు వెళ్ళండి. న్యాచురల్ గానే (సహజముగానే) ప్రతి విషయములోనూ బాబా, బాబా అని రావాలి. సహజముగా రావాలి ఎందుకంటే బాబా సమానముగా అవ్వాలన్న సంకల్పాన్ని అయితే అందరూ తప్పకుండా తీసుకున్నారు. కనుక సమానులుగా అయ్యేందుకు కేవలం ఈ ఒక్క ‘రాయల్ నేను’ అన్నదానిని కాల్చేయండి. అచ్ఛా, క్రోధము కూడా చెయ్యవద్దు. క్రోధము ఎందుకు వస్తుంది? ఎందుకంటే నేను అన్న భావము వస్తుంది.

హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా? మరి హోలీలో ముందుగా ఏం చేస్తారు? కాలుస్తారు. వాస్తవానికి అందరూ చాలా మంచివారు, చాలా యోగ్యులు, బాబా ఆశల దీపాలు, కేవలం ఈ కాస్త నేను అన్నదానిని కట్ చెయ్యండి. రెండు రకాల నేను అన్నదానిని కట్ చెయ్యండి, ఒక్క నేను అన్నదానిని ఉంచుకోండి. ఎందుకని? బాప్ దాదా చూస్తున్నారు, మీ అనేకమంది సోదరీ-సోదరులు, బ్రాహ్మణులు కాదు, అజ్ఞానీ ఆత్మలు, వారు తమ జీవితములో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు వారికి ధైర్యమనే రెక్కలను ఇవ్వవలసి ఉంటుంది. పూర్తిగా ఆధారము లేనివారిగా అయిపోయారు, ఏ ఆశా లేనివారిగా అయిపోయారు. కనుక ఓ దయా హృదయులు, కృప, దయను చూపించేవారు, విశ్వ ఆత్మలకు ఇష్టదేవులారా, మీ శుభ భావన, దయా భావన, ఆత్మ భావన ద్వారా వారి భావనను పూర్తి చెయ్యండి. దుఃఖము, అశాంతితో కూడుకున్న వారి వైబ్రేషన్లు మీ వద్దకు రావటం లేదా? మీరు నిమిత్త ఆత్మలు, పూర్వజులు, పూజ్యులు, వృక్షము యొక్క కాండమువంటివారు, పునాదివంటివారు. మా రక్షకులు ఎక్కడకు వెళ్ళారు, మా ఇష్టదేవులు ఎక్కడకు వెళ్ళారు అని అందరూ మిమ్మల్ని వెతుకుతున్నారు. బాబాకైతే వారి పిలుపులు చాలా వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్వ ఉన్నతి ద్వారా భిన్న-భిన్న శక్తుల సకాష్ ను ఇవ్వండి. ధైర్యమనే రెక్కలను ఇవ్వండి. మీ దృష్టి ద్వారా, దృష్టియే మీ పిచికారీ, కనుక మీ దృష్టి అనే పిచికారీ ద్వారా సుఖమనే రంగును వెయ్యండి, శాంతి రంగును వెయ్యండి, ప్రేమ రంగును వెయ్యండి, ఆనందమనే రంగును వెయ్యండి. మీరైతే పరమాత్మ సాంగత్యపు రంగులోకి వచ్చారు, ఇతర ఆత్మలకు కూడా కాస్త ఆధ్యాత్మిక రంగును అనుభవము చేయించండి. పరమాత్మ మిలనాన్ని, మంగళ మిలనాన్ని అనుభవము చేయించండి. భ్రమిస్తున్న ఆత్మలకు ఆశ్రయము యొక్క మార్గాన్ని తెలియపరచండి.

కనుక స్వ ఉన్నతి కొరకు ప్లాన్లు తయారుచేసుకుంటారు కదా. ఇందులో స్వయం యొక్క చెకర్లుగా అయ్యి చెక్ చేసుకోండి - ఈ రాయల్ నేను అనేది అయితే రావటం లేదు కదా, ఎందుకంటే ఈ రోజు హోలీని జరుపుకునేందుకు వచ్చారు. కనుక బాప్ దాదా ఇదే సంకల్పాన్ని ఇస్తున్నారు - ఈ రోజు దేహ-అభిమానము మరియు అవమానముకు చెందిన నేను అనేది ఏదైతే వస్తుందో, నిరాశతో కూడుకున్న నేను అనేది ఏదైతే వస్తుందో, దానిని కాల్చే వెళ్ళాలి, మీతోపాటు తీసుకువెళ్ళకూడదు. దేనినైనా కాలుస్తారు కదా! అగ్నితో కాలుస్తారా? జ్వాలాముఖి యోగాగ్నిని వెలిగించండి. వెలిగించటం వస్తుందా? జ్వాలాముఖి యోగము, ఇది వస్తుందా లేక సాధారణ యోగము వస్తుందా? జ్వాలాముఖీగా అవ్వండి. లైట్-మైట్ హౌస్. మరి ఇది ఇష్టమేనా? అటెన్షన్ ప్లీజ్, నేను అన్నదానిని కాల్చేయండి.

బాప్ దాదా నేను-నేను అన్న ఈ పాటను విన్నప్పుడు స్విచ్ ను ఆపేస్తారు. వాహ్, వాహ్ అన్న పాటలు వచ్చినప్పుడు సౌండ్ ను పెంచుతారు, ఎందుకంటే నేను-నేను అన్నదానిలో పెనుగులాట చాలా ఉంటుంది. ఇది కాదు, అది కాదు, ఇలా కాదు, అలా కాదు అని ప్రతి విషయములోనూ పెనుగులాట సృష్టిస్తారు. పెనుగులాట కారణముగా ఒత్తిడి మొదలవుతుంది. బాప్ దాదాకు లగావ్, తనావ్, స్వభావ్ (ఆకర్షణ, ఒత్తిడి, స్వభావము) అనగా నెగెటివ్ స్వభావము మంచిగా అనిపించవు. వాస్తవానికి స్వభావము అన్న పదము చాలా మంచిది. స్వ భావము అనగా స్వయము యొక్క భావము. కానీ దానిని తప్పుగా మార్చేశారు. విషయాలలోనూ పెనుగులాట సృష్టించకండి, అలాగే మీ వైపుకు ఎవరినీ లాగకండి. అది కూడా చాలా టెన్షన్ ను సృష్టిస్తుంది. ఎవరు ఎంత చెప్పినా కానీ మీ వైపుకు మాత్రం లాగకండి. విషయాన్ని సాగదీయకండి, మీ వైపుకు ఎవరినీ లాగకండి, పెనుగులాట సమాప్తమైపోవాలి. బాబా, బాబా మరియు బాబా. ఇష్టమే కదా! కనుక నేను అన్న విషయములో తప్పుడు భావమును ఇక్కడ వదిలేసి వెళ్ళండి. మీతోపాటు తీసుకువెళ్ళకండి, ట్రైన్ లో బరువైపోతుంది. నేను బాబా వాడిని, బాబా నావారు అన్న మీ పాట ఉంది కదా. అవును కదా! ఒక్క నేను అన్నదానిని ఉంచుకోండి, రెండు నేను అన్నవాటిని సమాప్తము చెయ్యండి. మరి హోలీని జరుపుకున్నారా, సంకల్పములో కాల్చేశారా? ఇప్పుడు సంకల్పము చేస్తారు. సంకల్పము చేశారా? చేతులెత్తండి. చేశారా లేక కొంచెం, కొంచెం ఉండిపోతుందా? కొంచెం, కొంచెం ఉండటానికి అనుమితినివ్వాలా? కొంచెం, కొంచెం ఉండడానికి అనుమతి కావాలి అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. కొంచెం అయితే ఉంటుంది కదా, ఉండదా? మీరైతే ఎంతో సాహసవంతులు. అభినందనలు. సంతోషములో నాట్యము చెయ్యండి, పాడండి, అంతేకానీ ఒత్తిడిలో కాదు, పెనుగులాటలో కాదు. అచ్ఛా!

ఇప్పుడు ఒక్క క్షణములో మీ మనసులో నుండి అన్ని సంకల్పాలను సమాప్తము చేసి ఒక్క క్షణములో బాబాతోపాటు పరంధామములో ఉన్నతోన్నతమైన స్థానములో, ఉన్నతోన్నతమైన బాబాతోపాటు ఉన్నతమైన స్థితిలో కూర్చోండి, మరియు బాబా సమానముగా మాస్టర్ సర్వ శక్తివంతులై విశ్వములోని ఆత్మలకు శక్తుల కిరణాలను ఇవ్వండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న అతి పవిత్రమైన, అతి ఉన్నతమైన పిల్లలకు, విశ్వ కళ్యాణకారీ విశేష ఆత్మలందరికీ, పూర్వజులు మరియు పూజ్యులైన ఆత్మలందరికీ, బాబా హృదయ సింహాసనాధికారీ పిల్లలందరికీ బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు, హృదయపూర్వకమైన ప్రేమ మరియు నమస్తే.

దూరదూరాల నుండి ఉత్తరాలు, కార్డులు, ఈ-మెయిల్స్, కంప్యూటర్ ద్వారా సందేశాలు బాప్ దాదాకు లభించాయి మరియు బాప్ దాదా ఆ పిల్లలను సమ్ముఖములో చూస్తూ పదమాల రెట్లు ప్రియస్మృతులను ఇస్తున్నారు.

వరదానము:-
తమ పూర్వజ స్వరూపపు స్మృతి ద్వారా సర్వ ఆత్మలను శక్తిశాలిగా తయారుచేసే ఆధార, ఉద్ధారమూర్త భవ

ఈ సృష్టి రూపీ వృక్షము యొక్క మూల కాండము, సర్వులకు పూర్వజులు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే మీరే. ప్రతి కర్మకు ఆధారము, కుల మర్యాదలకు ఆధారము, ఆచార-వ్యవహారాలకు ఆధారము - పూర్వజులైన మీరే. మీరే సర్వ ఆత్మలకు ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులు. కాండమైన మీ ద్వారానే సర్వ ఆత్మలకు శ్రేష్ఠ సంకల్పాల శక్తి మరియు సర్వశక్తుల ప్రాప్తి లభిస్తాయి. మిమ్మల్ని అందరూ ఫాలో చేస్తున్నారు. అందుకే ఇంత పెద్ద బాధ్యతగా భావిస్తూ ప్రతి సంకల్పము మరియు కర్మ చెయ్యండి, ఎందుకంటే పూర్వజ ఆత్మలైన మీ ఆధారము పైనే సృష్టి యొక్క సమయము మరియు స్థితి ఆధారపడి ఉన్నాయి.

స్లోగన్:-
ఎవరైతే సర్వ శక్తుల రూపీ కిరణాలను నలువైపులా వ్యాపింపజేస్తారో వారే మాస్టర్ జ్ఞాన-సూర్యులు.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి

మూడు పదాల కారణముగా కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తక్కువైపోతాయి. ఆ మూడు పదాలు ఏమిటంటే - 1. వై (ఎందుకు). 2. వాట్ (ఏమిటి) 3. వాంట్ (కావాలి) ఈ మూడు పదాలను సమాప్తము చేసి కేవలం ఒకే పదాన్ని ఉపయోగించండి. ‘‘వాహ్’’. అప్పుడు కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది, ఇక సంకల్ప శక్తి ద్వారా అనంతమైన సేవకు నిమిత్తులుగా అవ్వగలుగుతారు.