27-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
15.12.2011
‘‘సదా నషాలో ఉంటూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి,
తీవ్ర పురుషార్థము ద్వారా సంపన్నముగా మరియు సమానముగా అయ్యి
కలిసి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోండి’’
ఈ రోజు బాప్ దాదా నిశ్చింత చక్రవర్తుల సభను చూస్తున్నారు. ఈ
సభ ఈ సమయములోనే ఏర్పాటు అవుతుంది ఎందుకంటే పిల్లలందరూ తమ చింతను
బాబాకు ఇచ్చి బాబా నుండి నషాను తీసుకున్నారు. ఈ సభ ఇప్పుడే
ఏర్పాటు అవుతుంది. మీలోని ప్రతి ఒక్కరూ కూడా ఉదయము లేచినప్పటి
నుండి కర్మలు చేస్తూ కూడా నిశ్చింతులుగా మరియు చక్రవర్తులుగా
అయి నడుచుకుంటున్నారు కదా! ఈ నిశ్చింత జీవితము ఎంత ప్రియముగా
అనిపిస్తుంది. నిశ్చింతతకు గుర్తులు ఏమి కనిపిస్తాయి? ప్రతి
ఒక్కరి మస్తకములో లైట్, ఆత్మ మెరుస్తూ కనిపిస్తుంది. ఇటువంటి
నిశ్చింత జీవితము ఎలా తయారైంది? బాబా పిల్లలందరి జీవితాల నుండి
చింతను తీసుకుని నషాను ఇచ్చారు. ఎవరి జీవితములోనైతే నషా కాకుండా
చింత కనిపిస్తుందో, వారి మస్తకములో లైట్ మెరుస్తూ కనిపించదు.
వారి మస్తకములో భారపు రేఖలు కనిపిస్తాయి. మరి చెప్పండి, మీకు
ఏది ఇష్టము? లైట్ ఇష్టమా లేక భారము ఇష్టమా? ఒకవేళ ఏదైనా భారము
వచ్చినా కానీ భారము అంటే చింత, ఆ చింతను బాబాకు ఇచ్చి నషాను
తీసుకోవచ్చు. మీ అందరికీ నిశ్చింత జీవితము ఇష్టమే కదా! చూసేవారు
కూడా నిశ్చింత జీవితాన్ని ఇష్టపడతారు.
బాప్ దాదా ఈ రోజు నలువైపులా ఉన్న పిల్లలను, సమ్ముఖములో ఉన్నా
లేక మరింకెక్కడైనా కూర్చున్నా కానీ, పిల్లల మస్తకము మధ్యలో
మెరుస్తున్న లైట్ నే చూస్తున్నారు. మరి సదా నిశ్చింతగా
ఉంటున్నారా లేక ఎప్పుడైనా ఏదైనా చింత కూడా వస్తుందా? ఉందా ఏదైనా
చింత? బాబా ప్రకృతీజీతులుగా, వికారీజీతులుగా తయారుచేసినప్పుడు
ఇక చింత ఎలా రాగలదు? నిశ్చింతులుగా అయ్యారా, అయితే చేతులెత్తండి.
సదా కోసం అయ్యారా? సదా కోసం అయ్యారా లేక అప్పుడప్పుడూనా?
అప్పుడప్పుడు అనేవారు కూడా ఉన్నారా? చేతులైతే ఎత్తడము లేదు,
బాప్ దాదా కూడా చూడాలనుకోవడము లేదు. బాప్ దాదా ప్రతి బిడ్డను
నిశ్చింత చక్రవర్తులుగా చూడాలని కోరుకుంటున్నారు. ఒకవేళ
అప్పుడప్పుడు అనేవారు కూడా ఉన్నట్లయితే దానికి చాలా సహజమైన విధి
ఏమిటంటే - ఏ మాత్రం చింత వచ్చినా సరే, నాది అన్నదానిని నీది
లోకి మార్చేయండి. ఇది హద్దు యొక్క నాది అన్న భావనను, నాదిని
నీదిలోకి మార్చేందుకు చాలా సహజమైన విధి. మీరు మేరా బాబా (నా
బాబా) అనైతే అంటారు కదా, కనుక ఇప్పుడు ఇక నాది అన్నది ఏముంది?
హద్దు యొక్క ‘నాది’ అన్నదైతే సమాప్తమయ్యింది కదా! ‘నా బాబా’ గా
మారిపోయింది. నా బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా అని అందరూ
హృదయపూర్వకముగా అంటారు కదా! మరి ‘నాది’ అన్నదానిని ‘నీది’ లోకి
ఇమడ్చడము కష్టమా? తేడా ఏమిటి? ‘నా’ మరియు ‘నీ’, ఇంత చిన్న తేడా
మాత్రమే ఉంది. అంతా నీదే అని సంకల్పము చేసినప్పుడు, ఇక నాది
అనేది ఏముంది? నా బాబా.
బాప్ దాదా ఏమి చూసారంటే మెజారిటీ పిల్లలు హద్దు యొక్క
‘నాది’ అన్నదానిని ‘నీది’ లోకి మార్చారు. అందుకని ఎలా అయ్యారు?
నిశ్చింత చక్రవర్తులు. ఈ రోజు బాప్ దాదా పిల్లలను నిశ్చింత
చక్రవర్తుల స్వరూపములో చూస్తున్నారు. చూడండి, భక్తి మార్గములో
కూడా మీ చిత్రాలను తయారుచేసినప్పుడు డబుల్ కిరీటాన్ని
చూపిస్తారు. ఒకటేమో ప్రకాశ కిరీటము, అది ఉండనే ఉంది ఎందుకంటే
నిశ్చింత ఆత్మకు గుర్తు ఏమిటంటే, మస్తకములో లైట్ మెరుస్తూ
ఉంటుంది మరియు రెండవ కిరీటము, వికారాలపై విజయులుగా అయ్యారు,
అందుకే కిరీటాన్ని చూపించారు, అందుకే ఈ అటెన్షన్ ను పెట్టండి -
బాప్ దాదా చింతను తీసుకుని నషాను ఇచ్చారు కనుక ఎలా అయ్యారు?
నిశ్చింత చక్రవర్తులు. చక్రవర్తిగా అయ్యారు కనుక సింహాసనము కూడా
కావాలి కదా! అందుకే బాప్ దాదా మూడు సింహాసనాలకు యజమానులుగా
చేసారు. ఆ మూడు సింహాసనాలు ఏమిటో తెలుసా? ఒకటి, భృకుటి
సింహాసనము. ఇదైతే అందరికీ ఉండనే ఉంది. రెండవ సింహాసనము, బాప్
దాదా హృదయ సింహాసనము మరియు మూడవది, విశ్వ సింహాసనము, రాజ్య
సింహాసనము. మీ అందరికి ఈ మూడు సింహాసనాలు ప్రాప్తించాయి కదా!
అన్నిటికన్నా శ్రేష్ఠమైనది బాప్ దాదా హృదయ సింహాసనము. మరి చెక్
చేసుకోండి, సింహాసనముపై ఉంటున్నారా? ఎందుకంటే బాప్ దాదా హృదయ
సింహాసనముపై ఎవరు కూర్చుంటారు? ఎవరైతే సదా స్వయము కూడా బాప్
దాదాను తమ హృదయ సింహాసనముపై కూర్చోబెట్టుకున్నారో, ఎవరైతే సదా
శ్రేష్ఠ స్థితిలో మాస్టర్ సర్వశక్తివంతులై ఉన్నారో వారు. కనుక
చెక్ చేసుకోండి, సదా సింహాసనాధికారులుగా ఉంటున్నారా? లేక
అప్పుడప్పుడూ మట్టిలోకి కూడా వచ్చేస్తుంటారా? ఈ దేహభానము మట్టి
వంటిది. చాలా సమయము మట్టిలోనే ఉన్నారు కనుక అప్పుడప్పుడూ
మట్టిలోకి వెళ్ళిపోవడము లేదు కదా?
బాప్ దాదా పిల్లలందరికీ సమయము యొక్క సూచనను ఇస్తున్నారు.
అకస్మాత్తు యొక్క పాఠాన్ని పక్కా చేస్తున్నారు. దాని కోసం ఈ
సంగమ సమయము పట్ల చాలా చాలా మహత్వాన్ని ఉంచవలసి ఉంటుంది ఎందుకంటే
ఈ ఒక్క జన్మలో అనేక జన్మల ప్రారబ్ధాన్ని తయారుచేసుకోవాలి,
అందుకే బాప్ దాదా సూచనను ఇచ్చారు, సంగమ సమయములో రెండు విషయాల
పట్ల నిత్యము అటెన్షన్ పెట్టాలి. ఆ రెండు విషయాలైతే గుర్తు ఉండి
ఉండవచ్చు - సమయము మరియు సంకల్పాలు. అందరూ సంకల్పము ద్వారా బాప్
దాదాకు వ్యర్థ సంకల్పాలను ఇచ్చేయాలని ధైర్యాన్ని ఉంచారు. మరి
చెక్ చేసుకోండి, ఆ ధైర్యము సదా నిలిచి ఉంటుందా? ఎందుకంటే
పిల్లలు ఒక్కసారి ధైర్యము పెడితే బాబా వేయి సార్లు సహాయము
అందిస్తారు. మరిప్పుడు ఏమనుకుంటున్నారు? ధైర్యము ఉంచి వ్యర్థ
సంకల్పాల గురించి బాబా ఎదురుగా ఏ సంకల్పమైతే చేసారో, అది నిలిచి
ఉందా? ఎందుకంటే ఈ వ్యర్థ సంకల్పాలలో చాలా సమయము పోతుంది.
ప్రస్తుత సమయమనుసారముగా మీ కార్యము విశ్వాత్మలకు సందేశాన్ని
అందించడము. కావున వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేయాలి, అప్పుడే
దుఃఖము, అశాంతిలో ఉన్న ఆత్మలకు సుఖ-శాంతుల అనుభవాన్ని
చేయించగలరు. బాప్ దాదాకు దుఃఖములో ఉన్న ఆత్మలను చూసి దయ
కలుగుతుంది. మీకు కూడా మీ సోదర-సోదరీల దుఃఖాన్ని చూసి దయ
కలుగుతుంది కదా!
బాప్ దాదా ఏమి చూసారంటే, వర్తమాన సమయములో అందరికీ ఎంతో
అభిరుచి ఉంది. ప్లాన్ ను కూడా తయారుచేసారు, ప్రాక్టికల్ గా
చేసారు కూడా. అన్ని ప్రోగ్రాములను చాలా బాగా చేసారు, ఇందుకు
అభినందనలను కూడా తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడు సమయమనుసారముగా
త్వరత్వరగా వారిని వారసులుగా తయారుచేయండి, వారు ఎంతోకొంత
వారసత్వానికి అధికారులుగా అవ్వాలి. బాగుంది, బాగుంది అని చాలా
అంటారు. బాప్ దాదా కూడా పిల్లలు చేసిన సేవకు ఈ రిజల్టునైతే
చూసారు మరియు బాబా పిల్లల విషయములో సంతోషముగా కూడా ఉన్నారు.
హృదయపూర్వకముగా చేస్తున్నారు. అంతేకాక ఇప్పుడు సమయమనుసారముగా
ఎంతో అభిరుచితో కూడా వింటున్నారు. ఈ మార్పు అయితే వచ్చింది.
బాగుంది, బాగుంది అనైతే వారికి అనిపిస్తుంది కానీ మంచిగా వారిని
తయారుచేసి ఎంతోకొంత వారసత్వానికి అధికారులుగా చేయండి. దీని కోసం
బాప్ దాదా ఇంతకుముందు కూడా సూచనను ఇచ్చి ఉన్నారు - ఇప్పుడు
సమయమనుసారముగా తీవ్ర పురుషార్థులుగా అయ్యే అవసరముంది. తీవ్ర
పురుషార్థులుగా అయ్యేందుకు ముఖ్యమైన పురుషార్థము ఏమిటంటే -
సెకెండులో బిందువు పెట్టడము. సెకెండు మరియు బిందువు, రెండూ
సమానము. ఇప్పుడు బాప్ దాదా పిల్లల యొక్క నిశ్చింత చక్రవర్తి
రూపాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఈ రూపాన్నే సదా అనుభవము చేయండి.
ఎప్పుడు ఏమి వచ్చినా, ‘నాది’ అన్నదానిని ‘నీది’ లోకి ఇముడ్చి
వేయండి.
ఈ రోజు బాప్ దాదా చూసారు, ఈ రోజు గురువారము కనుక చాలామంది
పిల్లలు బాప్ దాదా వద్దకు చేరుకున్నారు. బాప్ దాదా
ఏమంటున్నారంటే, వారములో రెండు రోజులు విశేషమైనవి. ఒకటి,
గురువారము, రెండు, ఆదివారము, సండే. గురువారము రోజు గురువు
యొక్క రోజు. గురువు నుండి ఏమి లభిస్తుంది? వరదానాలు. కావున
గురువారము విశేషముగా వరదానాల రోజు, గురువారాన్ని ఈ విధముగా
జరుపుకోండి. ఏదో ఒక విశేష వరదానాన్ని అమృతవేళ నుండి మీ బుద్ధిలో
ఇమర్జ్ చేసి పెట్టుకోండి. వరదానాలైతే అనేకమున్నాయి కానీ
విశేషముగా ఒక్క వరదానాన్ని మీ కోసం బుద్ధిలో పెట్టుకుని చెక్
చేసుకోండి - ఈ వరదానీ రోజున వరదాన స్వరూపముగా అయి, వరదానాన్ని
రిపీట్ చెయ్యడము కాదు కానీ వరదాన స్వరూపముగా అవ్వాలి మరియు చెక్
చేసుకుంటూ ఉండండి, ఈ రోజు ఎంత సమయము వరదాన స్వరూపముగా ఉన్నాను?
ఆదివారము విశేషముగా ప్రపంచములో సెలవు రోజు. కావున ఆదివారాన్ని
జరుపుకోండి, మీ జీవితములో సంకల్పమాత్రముగానైనా ఏ బలహీనత అయినా
ఉంటే, స్వప్నమాత్రముగానైనా ఏదైనా బలహీనత ఉంటే, వాటికి
సెలవివ్వండి. ఎలాగైతే లోకులు ఈ రెండు రోజులను బాగా గడుపుతారో,
అలాగే మీరు కూడా ఈ రెండు రోజులలో విశేషముగా ఈ లక్ష్యాన్ని మరియు
లక్షణాలను, కేవలం లక్ష్యమే కాదు, కానీ లక్ష్యముతో పాటు లక్షణాల
పట్ల కూడా అటెన్షన్ పెట్టండి. బాప్ దాదా పిల్లలందరికీ తమతోపాటు
తీసుకువెళ్తానని మాట ఇచ్చారు. మరి కలిసి వెళ్ళేందుకు ఏ
ఏర్పాట్లు చేసుకోవాలి? బాబా అయితే క్షణములో అశరీరిగా అయిపోతారు,
కానీ కలిసి వెళ్తాము అని మీరు ఏదైతే మాట ఇచ్చారో, బాబా కూడా
మాటిచ్చారు, మరి చెక్ చేసుకోండి, దాని కోసం కావలసిన ఏర్పాట్లు
ఉన్నాయా? క్షణములో బిందువు పెట్టి సంపన్నముగా మరియు సంపూర్ణముగా
అయి వెళ్ళిపోవాలి. ఇటువంటి ఏర్పాటు ఉందా? కలిసి అయితే వెళ్ళాలి
కదా! వెళ్ళాలా? తల ఊపండి. వెళ్ళాలా, మంచిది. పక్కానా? చేతిలో
చేయి వేయడమంటే దాని అర్థం సమానముగా అవ్వడము. కావున చెక్
చేసుకోండి, సమయమైతే అకస్మాత్తుగా రానున్నది. మరి కలిసి
వెళ్ళేంత తయారీ ఉందా?
బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా! కావున బాబా ఒక్కరిని కూడా
కలిసి వెళ్ళకుండా వెనుక వదిలి వెళ్ళాలని అనుకోవడం లేదు. కలిసే
ఉన్నాము, కలిసే ఉంటాము, కలిసే వెళ్తాము మరియు కలిసే రాజధానిలో
రాజ్య వంశములోకి వస్తాము. సమ్మతమే కదా! సమ్మతమేనా? ఏర్పాట్లు
ఉన్నాయా? సమ్మతమేనా అన్నదానిలోనైతే చేతులెత్తుతారు. ఈ విషయములో
చేతులు ఎత్తకండి కానీ ఏర్పాట్లు ఉన్నాయా అన్నదానిలో
చేతులెత్తండి. చేతులు బాగా పైకి ఎత్తండి. అచ్ఛా. రేపే వినాశనము
జరిగినా కానీ తయారుగా ఉన్నారా? కానీ మీరు చేయాల్సిన సేవను
సమాప్తము చేసారా? సేవ ఇంకా మిగిలి ఉందా లేక సేవ సమాప్తమైపోయిందా?
సందేశము అందరికీ చేరుకుందా? కేవలం మీ కాలనీలోనే చూసుకోండి. బాబా
వచ్చేసారు, వారసత్వము తీసుకోవాలంటే తీసుకోండి అన్న సందేశాన్ని
మీరు ప్రతి ఒక్కరికీ ఇచ్చారా? ఇప్పుడు ప్లాన్ ను
తయారుచేస్తున్నారు. ప్రతి ఇంటికి సందేశాన్ని ఇవ్వాలన్న ప్లాన్
ను తయారుచేస్తున్నారు అన్నది బాప్ దాదా విన్నారు. మంచిది,
సందేశమైతే ఇవ్వవలసిందే, లేకపోతే ఫిర్యాదు వస్తుంది. ప్రోగ్రామ్
తయారుచేసారు కదా! లేవండి, బాబాకు ప్లాన్ వినిపించారు కదా!
లేవండి. (మీడియా వారిని లేపారు) మంచిది. ఫిర్యాదును పూర్తి
చేయండి ఎందుకంటే అకస్మాత్తుగానే జరగనున్నది. పరస్పరములో
కలుసుకుని ఈ ప్లాన్ నే ప్రాక్టికల్లోకి తీసుకురండి. పరస్పరము
త్వరగా చర్చించుకోండి. సమయము ఎక్కువ పడితే ఉత్సాహము కూడా
కొద్దిగా తగ్గుతుంది. బాప్ దాదాకు అయితే ప్రతి ఇంటిలోనూ ఈ
ఫిర్యాదు సమాప్తమవ్వడము ఇష్టము. మాకైతే తెలియలేదు, బాబా వచ్చారు
మరియు వెళ్ళిపోయారు కూడా, మేము వంచితమైపోయాము అన్న ఫిర్యాదు
ఉండిపోకూడదు! అందరికీ ఉత్సాహము ఉంది కదా! అందరికీ ఉత్సాహము ఉందా?
సేవ చేసి ఫిర్యాదును సమాప్తము చేయాలి. ఉత్సాహము ఉంటే బాప్ దాదా
సహయోగము కూడా ఉంటుంది. అచ్ఛా!
బాప్ దాదా మనసులోని ఆశ ఏమిటి అనేది అందరికీ తెలుసు. సమానము
మరియు సంపూర్ణము, ఈ రెండు పదాలను సదా చెక్ చేసుకోండి. మరి బాబా
యొక్క ఈ ఆశను పూర్తి చేసారా? ఎందుకంటే బాప్ దాదా ప్రతి బిడ్డను
బాబా యొక్క ఆశల సితారగా భావిస్తారు. ప్రతి బిడ్డకు బాబా పట్ల
ప్రేమ ఉంది, ఇది బాప్ దాదాకు తెలుసు. మీ అందరినీ మధుబన్ కు
తీసుకువచ్చేది ఏమిటి? ప్రేమ అనే ట్రైన్ లో వస్తారు. ప్రేమ అనే
విమానములో వస్తారు. బాబా కూడా ప్రేమ అనే సబ్జెక్టులో పిల్లలతో
సంతోషముగా ఉన్నారు. కానీ బాబా కోరుకుంటున్న రెండు పదాలు -
సమానము మరియు సంపూర్ణము, ఇది కూడా నెరవేర్చాల్సిందే. ఈ రోజు
బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలను హృదయముతో, స్నేహముతో చూస్తూ
ఒక్కొక్క బిడ్డకు హృదయపూర్వక ప్రేమకు అభినందనలను
తెలియజేస్తున్నారు. అచ్ఛా!
టీచర్లు చాలామంది వచ్చారు:-
టీచర్లనైతే బాప్ దాదా సదా గుర్తు చేసుకుంటూనే ఉంటారు, ప్రేమ
చేస్తారు, ఎందుకంటే ప్రతి సోదర-సోదరిని ముందుకు
తీసుకువెళ్ళేందుకు టీచర్లు నిమిత్తమవుతారు. టీచర్లను బాప్ దాదా
గురుభాయి అని అంటారు. గురుభాయి అంటే అర్థం సమానము అని, ఎందుకంటే
ఎలా అయితే సదా సేవలో బిజీగా ఉండటమనేది బాబా కర్తవ్యమో, అలాగే
యోగ్యులైన టీచర్లు బాబా సమానముగా సదా సేవాధారిగా మరియు సదా
సఫలతా స్వరూపులుగా అయ్యి సఫల స్వరూపులుగా చేసేవారు. బాప్ దాదాకు
టీచర్ల పట్ల సదా మనసులో ప్రేమ ఉంటుంది. ఎందుకని? టీచర్ అనగా సదా
సేవాధారి, సదా బాబా సమానముగా తయారుచేసేవారు మరియు
కొత్త-కొత్తవారికి బాబా పరిచయాన్ని ఇచ్చి అనుభవజ్ఞులుగా చేసి
బాబా వారసత్వానికి అధికారులుగా చేసేవారు. కావున బాప్ దాదా
టీచర్లను చూసి సంతోషిస్తున్నారు మరియు టీచర్ అంటే ఈ
హృదయపూర్వకమైన ప్రేమను, బాబా ప్రేమను విద్యార్థిలో కూడా నింపి
వారిని కూడా బాబా వారసత్వానికి పూర్తి అధికారులుగా చేసేవారు.
బాబాకు ప్రతి ఒక్క టీచరు పట్ల ఏమి ఆశ ఉంటుందంటే, ప్రతి టీచరు
బాబా ఆశలేవైతే ఉన్నాయో, బాబా ఏదైతే కోరుకుంటున్నారో, వాటిని
ప్రత్యక్షముగా చేసేవారు మరియు చేయించేవారు, అందుకే ఒక్కొక్క
టీచరుకు బాప్ దాదా పదమాల రెట్లు అభినందనలు తెలియజేస్తున్నారు.
అభినందనలు తెలియజేస్తున్నారు. అచ్ఛా!
డబుల్ విదేశీ సోదర-సోదరీలతో:-
డబుల్ విదేశీయులు కూడా సేవలో భారత్ లోని
ఆత్మల కన్నా తక్కువేమీ కాదు అన్నది బాప్ దాదా చూసారు. ప్రతి
ఒక్కరూ తమ-తమ స్థానములో సేవా వృద్ధిని కూడా చేస్తున్నారు మరియు
స్వయాన్ని కూడా మంచి ఉల్లాస-ఉత్సాహాలతో నడిపిస్తున్నారు, దీనికి
బాప్ దాదా సంతోషిస్తున్నారు. డబుల్ విదేశీయులలోని సంస్కారము
ఏమిటంటే - ఏది చేసినా ఉల్లాస-ఉత్సాహాలతో చేసి పూర్తి చేస్తారు
మరియు పురుషార్థము వైపు కూడా అటెన్షన్ ఉంటుంది. మరి అందరూ
చేతులెత్తండి, అందరూ తీవ్ర పురుషార్థులేనా? తీవ్ర
పురుషార్థులేనా? అచ్ఛా! అందరి తరఫు నుండి కూడా చాలా, చాలా
అభినందనలు, ఎందుకని? తీవ్ర పురుషార్థీ అంటే బాప్ దాదా ఆశలను
పూర్తిగా ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేవారు. కావున బాప్ దాదా
తీవ్ర పురుషార్థము కోసం అభినందనలు తెలియజేస్తున్నారు. తీవ్ర
పురుషార్థులుగా ఉన్నారు మరియు సదా తీవ్ర పురుషార్థులుగా అయ్యి
ఇతరులను కూడా తీవ్ర పురుషార్థులుగా తయారుచేస్తారు. ఇలా మొత్తం
విదేశాల వారందరూ తీవ్ర పురుషార్థుల లిస్టులోకి వచ్చేయాలి.
ఇటువంటి రికార్డు కొంత ఉంది, మరికొంత చూపించాలి. బాప్ దాదా
పురుషార్థానికి అభినందనలు తెలియజేస్తున్నారు. మురళి పట్ల కూడా
అటెన్షన్ ఉంది, మురళి పట్ల ఉన్న స్నేహము బాప్ దాదాకు మంచిగా
అనిపిస్తుంది. మధుబన్ పట్ల కూడా ప్రేమ ఉంది, మురళి పట్ల కూడా
ప్రేమ ఉంది, పరివారము పట్ల కూడా ప్రేమ ఉంది మరియు నా బాబా పట్ల
కూడా ప్రేమ ఉంది. ఇప్పుడు సూక్ష్మ పురుషార్థము వైపు కూడా
అటెన్షన్ మంచిగా ఉంది. బాప్ దాదా ఏమి చూసారంటే, జనక్ బచ్చీకి
కూడా చాలా అటెన్షన్ ఉంది. ఇక్కడ ఉన్నప్పటికీ ప్రతి క్లాసు
ముందుగా విదేశాలకు చేరుకుంటుంది. కావున పాలన కూడా మంచిగా
లభిస్తుంది. ఇది కూడా మీ లక్. లక్కియెస్ట్ (అదృష్టవంతులు)గా
మరియు స్వీటెస్ట్ (మధురమైనవారు)గా, రెండూ విధాలుగానూ ఉన్నారు.
అచ్ఛా!
మొదటిసారి వచ్చినవారితో:-
వీరు చాలామంది ఉన్నారు. చేయి ఊపండి.
అందరూ మీ మధుబన్ ఇంటికి చేరుకున్నారు, ఇందుకు బాప్ దాదా
ఒక్కొక్క బిడ్డకు అభినందనలు తెలియజేస్తున్నారు, ఎందుకంటే చివరి
సమయము కంటే ముందే చేరుకున్నారు. లాస్ట్ సో ఫాస్ట్ గా
వెళ్ళేందుకు అవకాశము ఉంది. బాప్ దాదా పిల్లలను చూసి
సంతోషిస్తున్నారు. వచ్చారు, మంచిది, వెల్కమ్. ఇక ముందు కోసం
ఇప్పుడు తీవ్ర పురుషార్థము చేసి ఇంకా, ఇంకా ముందుకు వెళ్ళేందుకు
దృఢ సంకల్పము చేయండి. దృఢత సఫలతకు తాళంచెవి. ఈ రోజు ఏ పిల్లలైతే
వచ్చారో, బాప్ దాదా వారికి విశేషముగా దృఢత అనే తాళంచెవిని
కానుకగా ఇస్తున్నారు. దృఢతను ఎప్పుడూ తగ్గనివ్వకండి. దృఢత
మిమ్మల్ని సదా సహజముగా ముందుకు తీసుకువెళ్తుంది. బాప్ దాదా
సంతోషిస్తున్నారు, మంచిది, వెల్కమ్. మీ వారసత్వాన్ని పొందడానికి
వచ్చారు, ఇందుకు చాలా చాలా అభినందనలు. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ బ్రాహ్మణులకు బాప్ దాదా హృదయపూర్వక ప్రేమను
మరియు సదా ముందుకు వెళ్ళేందుకు శ్రేష్ఠ సంకల్పాన్ని ఇస్తున్నారు.
ఒక్కొక్క బిడ్డను బాబా చూస్తున్నారు కూడా మరియు చూస్తూ-చూస్తూ
హృదయములో ఇముడ్చుకుంటున్నారు. దగ్గరగా ఉన్నవారైతే బాప్ దాదాను
ఎదురుగా చూస్తున్నారు మరియు మీరందరూ సాధనాల ద్వారా ఎదురుగానే
చూస్తున్నారు. బాప్ దాదా కూడా మీ అందరినీ ఎక్కడ కూర్చున్నా కానీ
సమ్ముఖములో కూర్చున్నట్లుగానే చూస్తున్నారు మరియు ఒక్కొక్కరికీ
హృదయపూర్వక ప్రేమను ఇస్తున్నారు. ముందుకు వెళ్తూ ఉండండి, తీవ్ర
పురుషార్థము చేసి ఇంకా, ఇంకా ముందుకు వెళ్తూ ఉండండి. అచ్ఛా!
సమ్ముఖముగా కూర్చుని ఉన్నవారికి కూడా బాప్ దాదా యొక్క
ప్రియస్మృతులు మరియు సదా ముందుకు వెళ్తూ ఉండేందుకు అభినందనలు,
అభినందనలు, అభినందనలు. అచ్ఛా!
వరదానము:-
ప్రతి శిక్షణను స్వరూపములోకి తీసుకువచ్చి
ఋజువును ఇచ్చే సుపుత్ర మరియు సాక్షాత్కార మూర్త భవ
ఏ పిల్లలైతే శిక్షణలను కేవలం శిక్షణ
రూపములో బుద్ధిలో పెట్టుకోకుండా, వాటిని స్వరూపములోకి
తీసుకువస్తారో, వారు జ్ఞాన స్వరూప, ప్రేమ స్వరూప, ఆనంద స్వరూప
స్థితిలో స్థితులై ఉంటారు. ఎవరైతే ప్రతి పాయింటును స్వరూపములోకి
తీసుకువస్తారో, వారే పాయింట్ రూపములో స్థితులవ్వగలరు. పాయింటును
మననము చేయడము మరియు వర్ణన చేయడము సహజమే, కానీ స్వరూపముగా అయి
ఇతర ఆత్మలకు కూడా స్వరూపాన్ని అనుభవం చేయించడము, ఇదే ఋజువును
ఇవ్వడము అనగా సుపుత్రులుగా మరియు సాక్షాత్కార మూర్తులుగా
అవ్వడము.
స్లోగన్:-
ఏకాగ్రతా శక్తిని పెంచుకున్నట్లయితే మనసు-బుద్ధి భ్రమించడము
ఆగిపోతుంది.
అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము
చేయండి
నిర్బల ఆత్మలెవరైనా మీ ముందుకు వచ్చినట్లయితే ఆ నిర్బలులకు
బలాన్ని ఇవ్వండి. సర్వ శక్తుల వారసత్వము ఏదైతే ప్రాప్తి
చేసుకున్నారో, అది వారికి ఇవ్వండి, సర్వాత్మలకు బాబా ఖజానాను
ఇచ్చే దాతగా అవ్వండి, తమ శక్తుల ద్వారా దాహముతో ఉన్న మరియు
తపిస్తున్న ఆత్మలకు ప్రాణదానాన్ని ఇవ్వండి, వరదాతగా అయ్యి
ప్రాప్తించిన వరదానాల ద్వారా వారిని కూడా బాబా సమీప సంబంధములోకి
తీసుకురండి, ఇక్కడి దాతాతనపు సంస్కారాల ద్వారా భవిష్యత్తులో 21
జన్మల వరకు రాజ్య పదవి ప్రాప్తిస్తుంది.
|
|
|
|