28-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ప్రతి ఒక్కరి పాపాలను పీల్చేటువంటి ఫస్ట్ క్లాస్ బ్లాటింగ్ పేపర్ ఒక్క శివబాబా మాత్రమే, వారిని స్మృతి చేసినట్లయితే పాపాలు సమాప్తమైపోతాయి’’

ప్రశ్న:-
ఆత్మపై ఏర్పడిన అన్నింటికన్నా గాఢమైన మచ్చలు ఏమిటి, వాటిని తొలగించేందుకు ఎటువంటి కృషిని చేయాలి?

జవాబు:-
ఆత్మపై దేహాభిమానము యొక్క చాలా గాఢమైన మచ్చలు ఏర్పడ్డాయి, పదే-పదే ఎవరో ఒక దేహధారి నామ-రూపాలలో చిక్కుకుంటూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయకుండా దేహధారులను స్మృతి చేస్తూ ఉంటుంది. ఇతరుల మనసుకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ మచ్చలను తొలగించుకునేందుకు దేహీ-అభిమానులుగా అయ్యే కృషి చేయండి.

పాట:-
ముఖాన్ని చూసుకో ప్రాణీ...

ఓంశాంతి
అన్ని సెంటర్ల యొక్క మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు. ఎంత పుణ్యము చేసుకున్నాను మరియు ఎంత పాపాన్ని తొలగించుకున్నాను అని ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి. మొత్తం ప్రపంచము, సాధు-సన్యాసులు మొదలైనవారు - ఓ పతిత-పావనా అని పిలుస్తూ ఉంటారు. పతితుల నుండి పావనులుగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇకపోతే, అందరిలోనూ పాపాలు ఉన్నాయి. ఆత్మలలోనే పాపము ఉంటుందని మీకు తెలుసు. పుణ్యము కూడా ఆత్మలలోనే ఉంటుంది. ఆత్మయే పావనముగా, ఆత్మయే పతితముగా అవుతుంది. ఇక్కడ ఆత్మలందరూ పతితముగా ఉన్నారు. పాపాలనే మచ్చలు ఏర్పడి ఉన్నాయి, అందుకే పాపాత్మ అని అంటారు. ఇప్పుడు పాపాలు ఎలా తొలగుతాయి. ఎప్పుడైనా ఏదైనా వస్తువుపై ఇంకు లేక నూనె పడితే, దానిపై బ్లాటింగ్ పేపర్ పెడతారు, అది దానినంతటినీ పీల్చేస్తుంది. ఇప్పుడు మనుష్యులందరూ ఆ ఒక్కరినే స్మృతి చేస్తారు ఎందుకంటే వారే బ్లాటింగ్ పేపర్, పతిత-పావనుడు. ఆ ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ బ్లాటింగ్ పేపర్ గా లేరు. వారంతా జన్మజన్మలుగా గంగా స్నానాలు చేస్తూ ఇంకా పతితముగా అయిపోయారు. పతితులను పావనముగా చేసేది బ్లాటింగ్ పేపర్ అయిన శివబాబా ఒక్కరే. వారి రూపము కూడా చాలా చిన్నగా ఉండే ఒక బిందువు. వారు అందరి పాపాలను నశింపజేస్తారు. ఏ యుక్తి ద్వారా? కేవలం బ్లాటింగ్ పేపర్ నైన నన్ను స్మృతి చేయండి అని అంటారు. నేనైతే చైతన్యమైనవాడిని కదా. మీకు ఇంకే కష్టమూ ఇవ్వను. ఆత్మలైన మీరు కూడా బిందువు, తండ్రి కూడా బిందువు. బాబా అంటారు - కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి - స్మృతితో ఎన్ని పాపాలు తొలగిపోయాయి? మరియు నేను ఎన్ని పాపాలు చేసాను? ఇంకా ఎన్ని పాపాలు మిగిలి ఉన్నాయి? ఇది ఎలా తెలుస్తుంది? ఒక్క బ్లాటింగ్ పేపర్ ను మాత్రమే స్మృతి చేయండి అని ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేస్తూ ఉండండి. అందరికీ ఈ సలహానివ్వడమైతే మంచిది కదా. విచిత్రమేమిటంటే, ఎవరికైతే సలహానిస్తారో వారు తండ్రిని స్మృతి చేయడములో నిమగ్నమైపోతారు మరియు సలహానిచ్చేవారు స్వయము స్మృతి చేయరు, అందుకే పాపాలు కట్ అవ్వవు. పతిత-పావనుడు అని ఒక్కరినే అంటారు. అనేక పాపాలు అంటుకుని ఉన్నాయి. కామము యొక్క పాపము ఉంది. దేహాభిమానమైతే మొదటి నంబరు పాపము, ఇది అన్నింటికన్నా చెడ్డది. ఇప్పుడు తండ్రి అంటారు - దేహీ-అభిమానులుగా అవ్వండి, ఎంతగా నన్నొక్కరినే స్మృతి చేస్తారో, అంతగా మీలో ఏర్పడిన మాలిన్యము భస్మమైపోతుంది. స్మృతి చేయాలి. ఇతరులకు కూడా ఈ మార్గాన్ని తెలియజేయాలి. ఎంతగా ఇతరులకు అర్థం చేయిస్తారో, అంతగా మీకు కూడా మేలు జరుగుతుంది. ఈ వ్యాపారములోనే నిమగ్నమైపోండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పుణ్యాత్ములుగా అయిపోతారని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. మీ పని పతిత-పావనుడు ఒక్కరేనని ఇతరులకు కూడా తెలియజేయడము. జ్ఞాన నదులైన మీరు అనేకమంది ఉన్నా కానీ మీరు అందరికీ ఒక్కరినే స్మృతి చేయండి అని చెప్తారు. వారొక్కరే పతిత-పావనుడు. వారికి చాలా మహిమ ఉంది. జ్ఞానసాగరుడు కూడా వారే. ఆ ఒక్క తండ్రినే స్మృతి చేయడము, దేహీ-అభిమానులుగా అయి ఉండడము - ఇదొక్కటే కష్టమైన విషయము. తండ్రి కేవలం మీ కోసం మాత్రమే చెప్పరు, బాబా దృష్టిలో అన్ని సెంటర్లలోని పిల్లలు ఉన్నారు. తండ్రి అయితే పిల్లలందరినీ చూస్తారు కదా. కొన్ని చోట్ల మంచి సర్వీసబుల్ పిల్లలు ఉంటారు, అది శివబాబా పుష్పాల తోట కదా. ఎవరైతే మంచి పుష్పాల తోట వలె ఉన్నారో వారినే బాబా గుర్తు చేస్తారు. షావుకారు వ్యక్తికి 4-5 మంది పిల్లలుంటే, అందులో పెద్ద కొడుకును గుర్తు చేస్తారు. పుష్పాలలో వెరైటీ పుష్పాలుంటాయి కదా. బాబా కూడా తన పెద్ద తోటలను గుర్తు చేస్తుంటారు. శివబాబాను స్మృతి చేయండి అని ఎవరికైనా ఈ మార్గాన్ని తెలియజేయడము సహజము. వారే పతిత-పావనుడు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి అని స్వయం చెప్తారు. మొత్తం ప్రపంచమంతటికీ బాబా ఎంత ఫస్ట్ క్లాస్ బ్లాటింగ్ పేపర్. అందరూ వారిని స్మృతి చేస్తారు. శివబాబాను స్మృతి చేయండి అని ఎవరికైనా ఈ మార్గాన్ని తెలియజేయడము సహజము.

తండ్రి యుక్తిని తెలియజేసారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీపై ఏవైతే దేహాభిమానము యొక్క మచ్చలు ఏర్పడ్డాయో, అవి తొలగిపోతాయి. దేహీ-అభిమానులుగా అవ్వడములోనే శ్రమ ఉంది. బాబాకు ఎవరూ సత్యము చెప్పరు. కొంతమంది చార్టు వ్రాసి పంపిస్తారు, మళ్ళీ అలసిపోతారు. గమ్యము పెద్దది. మాయ నషాను పూర్తిగా తెంచేస్తుంది, ఇక అప్పుడు చార్టు వ్రాయడము కూడా మానేస్తారు. అర్ధకల్పము యొక్క దేహాభిమానము ఉంది, అది వదలదు. తండ్రి అంటారు, కేవలం ఈ వ్యాపారాన్నే చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేయండి మరియు ఇతరుల చేత చేయించండి. అంతే, ఇదే అన్నింటికన్నా ఉన్నతమైన వ్యాపారము. ఎవరైతే స్వయం స్మృతి చేయరో, వారు ఈ వ్యాపారాన్ని చేయనే చేయరు. తండ్రి స్మృతి - ఇది యోగాగ్ని, దీని ద్వారా పాపాలు భస్మమవుతాయి. అందుకే, పాపాలు ఎంతవరకు భస్మమయ్యాయి అని అడగడము జరుగుతుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తెలుసుకోగలరు. ఇతరులను కూడా వారి సేవ ద్వారా తెలుసుకోవచ్చు. తండ్రిని స్మృతి చేయండి, వారు పతిత-పావనుడు అని ఇతరులకు మార్గాన్ని తెలియజేస్తారు. ఇక్కడ ఇదైతే పతిత, తమోప్రధాన ప్రపంచము. ఆత్మలందరూ మరియు శరీరాలు తమోప్రధానముగా ఉన్నాయి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. అక్కడ ఆత్మలందరూ పవిత్రముగా ఉంటారు. ఎప్పుడైతే పవిత్రముగా అవుతారో, అప్పుడు ఇంటికి వెళ్ళగలరు, ఇతరులకు కూడా ఇదే మార్గాన్ని చూపించాలి. తండ్రి యుక్తి అయితే చాలా సహజమైనది తెలియజేస్తున్నారు. శివబాబాను స్మృతి చేయండి. ఈ బ్లాటింగ్ పేపర్ ను ఉపయోగించినట్లయితే అన్ని పాపాలు పీల్చుకోబడతాయి, మీ వికర్మలు వినాశనమవుతాయి. ముఖ్యమైన పెద్ద విషయము - పావనముగా అవ్వడము. మనుష్యులు పతితముగా అయ్యారు, అందుకే ఓ పతిత-పావనా రండి, వచ్చి అందరినీ పావనముగా తయారుచేసి మీతో పాటు తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. ఇది వ్రాసి ఉంది కూడా. ఆత్మలందరినీ పావనముగా తయారుచేసి తీసుకువెళ్తారు, అప్పుడిక ఏ పతిత ఆత్మ ఉండదు. మొట్టమొదట స్వర్గవాసులే వస్తారని కూడా అర్థం చేయించారు. తండ్రి ఏదైతే మెడిసిన్ ఇస్తారో, అది అందరి కోసము. ఎవరు కలిసినా సరే వారికి ఈ మెడిసిన్ నే ఇవ్వాలి. మీరు తండ్రి వద్దకు వెళ్ళాలనుకుంటారు - కానీ ఆత్మ పతితముగా ఉంది కనుక వెళ్ళలేరు, పావనముగా అవ్వండి, అప్పుడు వెళ్ళగలుగుతారు. ఓ ఆత్మలారా, నన్ను స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను, ఆ తర్వాత అక్కడ నుండి మిమ్మల్ని సుఖములోకి తీసుకువెళ్తాను, మళ్ళీ ఎప్పుడైతే ఇది పాత ప్రపంచముగా అవుతుందో, అప్పుడు మీరు దుఃఖాన్ని పొందుతారు. నేను ఎవరికీ దుఃఖము ఇవ్వను. నేను స్మృతి చేస్తున్నానా అని ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకోండి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది. ఇది ఎంత సహజమైన మెడిసిన్. ఇతర సాధు-సన్యాసులు మొదలైనవారికెవ్వరికీ ఈ మెడిసిన్ గురించి తెలియదు. దీని గురించి ఎక్కడా వ్రాసి లేదు. ఇది పూర్తిగా కొత్త విషయము. పాపాల ఖాతా శరీరానికి ఏమీ అంటుకుని లేదు. ఇంత చిన్న బిందువైన ఆత్మలోనే మొత్తము పాత్ర అంతా నిండి ఉంది. ఆత్మ పతితముగా అయినప్పుడు శరీరముపై కూడా దాని ప్రభావము పడుతుంది. ఆత్మ పావనముగా అయిపోతుంది - అప్పుడు శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. దుఃఖితముగా, సుఖముగా ఆత్మయే అవుతుంది. శరీరానికి దెబ్బ తగిలితే ఆత్మకు దుఃఖము ఫీల్ అవుతుంది. వీరు దుఃఖములో ఉన్న ఆత్మ, వీరు సుఖముగా ఉన్న ఆత్మ అని కూడా అంటూ ఉంటారు. ఇంత చిన్నని ఆత్మ ఎంతటి పాత్రను అభినయిస్తుంది, అద్భుతము కదా. తండ్రి అయితే సుఖాన్ని ఇచ్చేవారు, అందుకే వారిని స్మృతి చేస్తారు. దుఃఖాన్ని ఇచ్చేది రావణుడు. అన్నింటికన్నా మొదట దేహాభిమానము వస్తుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి, ఇందులో గొప్ప శ్రమ ఉంది. సత్యమైన హృదయముతో, ఏ యుక్తితోనైతే స్మృతి చేయాలో, అలా ఎవరో కష్టము మీద స్మృతి చేస్తారని బాబాకు తెలుసు. ఇక్కడ ఉంటూ కూడా చాలామంది మర్చిపోతారు. ఒకవేళ దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే ఏ పాపము చేయరు. చెడు వినకండి... అన్నది తండ్రి ఆజ్ఞ, ఇది కోతుల కోసమైతే కాదు. ఇది మనుష్యుల కోసమే. మనుష్యులు కోతుల వలె ఉన్నారు కావున కోతుల చిత్రాలను తయారుచేసారు. రోజంతా పరచింతనతో కూడిన విషయాలను మాట్లాడుకునేవారు చాలామంది ఉన్నారు. కనుక తండ్రి అర్థం చేయించవలసి ఉంటుంది. అన్ని సెంటర్లలోనూ, ఇతరులకు దుఃఖాన్ని మాత్రమే ఇస్తూ ఉండేవారు ఎవరో ఒకరు ఉంటారు. తండ్రి స్మృతిలో ఉండే మంచివారు కూడా కొంతమంది ఉంటారు. వారు మనసా, వాచా, కర్మణా ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదని భావిస్తారు. వాచా ద్వారానైనా సరే ఎవరికైనా దుఃఖము ఇచ్చినట్లయితే దుఃఖితులై మరణిస్తారు. తండ్రి అంటారు, పిల్లలైన మీరు అందరికీ సుఖము ఇవ్వాలి. దేహీ-అభిమానులుగా అవ్వండి అని అందరికీ చెప్పండి. తండ్రిని స్మృతి చేయండి, ఇకపోతే, ధనాన్ని ఇచ్చిపుచ్చుకునే విషయమేమీ లేదు. కేవలం ప్రియమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు భస్మమైపోతాయి, మీరు విశ్వానికి యజమానులుగా అయిపోతారు. భగవానువాచ - మన్మనాభవ, ఒక్క తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. పరస్పరములో ఇంకేమీ మాట్లాడుకోకండి, కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇతరుల కళ్యాణము చేయండి.

పిల్లలైన మీ అవస్థ ఎంత మధురముగా ఉండాలంటే, ఎవరైనా వచ్చి చూస్తే వారు - బాబా పిల్లలైతే బ్లాటింగ్ పేపర్లు అని అనాలి. ఇప్పుడింకా ఆ అవస్థ లేదు. బాబాను ఎవరైనా అడిగితే బాబా అంటారు - బ్లాటింగ్ పేపర్ ఏమిటి, ఇప్పుడు కనీసం పేపర్ గా కూడా లేరే. బాబా అన్ని సెంటర్ల పిల్లలకు అర్థం చేయిస్తారు. బొంబాయి, కలకత్తా, ఢిల్లీ... అన్ని చోట్ల పిల్లలైతే ఉన్నారు కదా. ఫలానావారు చాలా విసిగిస్తున్నారు అని రిపోర్టు వస్తూ ఉంటుంది. పుణ్యాత్ములుగా చేయడానికి బదులుగా ఇంకా పాపాత్ములుగా చేస్తూ ఉంటారు. బాబాను ఎవరైనా అడిగితే బాబా వెంటనే చెప్తారు. శివబాబాకైతే అంతా తెలుసు. వారి వద్ద అందరి లెక్కలు ఉన్నాయి. ఈ బాబా కూడా చెప్పగలరు. వీరు బాబా స్మృతిలో ఆనందముగా నిమగ్నమై ఉన్నారు, వీరి ముఖము దేవతల వలె సంతోషకరముగా ఉంది అని ముఖము ద్వారానే అంతా తెలిసిపోతుంది. ఆత్మ సంతోషముగా ఉన్నట్లయితే శరీరము కూడా చూడటానికి సంతోషకరముగా కనిపిస్తుంది. శరీరానికి దుఃఖము కలిగితే ఆత్మకు దుఃఖము అనుభవమవుతుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు వినాశనమవుతాయని శివబాబా అంటున్నారు - ఈ ఒక్క విషయాన్ని అందరికీ వినిపిస్తూ ఉండండి. వారు శ్రీకృష్ణ భగవానువాచ అని వ్రాశారు, శ్రీకృష్ణుడినైతే ఎంతోమంది గుర్తు చేస్తూ ఉంటారు కానీ పాపాలేమీ తొలగవు, ఇంకా పతితముగా అయిపోయారు. ఎవరిని స్మృతి చేయాలి, పరమాత్ముని రూపమేమిటి అనేది వారికి తెలియనే తెలియదు. ఒకవేళ వారిని సర్వవ్యాపి అని అన్నా కూడా, ఆత్మ ఎలాగైతే నక్షత్రము వంటిదో, అలాగే పరమాత్మ కూడా నక్షత్రము వంటివారే, ఎందుకంటే ఆత్మయే పరమాత్మ అని అంటున్నప్పుడు, ఈ లెక్కన చూసినా కూడా వారు బిందువే. ఒక చిన్న బిందువు శరీరములోకి ప్రవేశిస్తుంది. బిందువులందరికీ చెప్తున్నారు - పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి. వారు ఇంద్రియాల ద్వారా మాట్లాడుతారు. ఇంద్రియాలు లేకపోతే ఆత్మ శబ్దము చేయలేదు. ఆత్మ-పరమాత్మల రూపము ఒక్కటే కదా అని మీరు వారికి చెప్పవచ్చు. పరమాత్మను పెద్ద లింగమనో, లేదా వేరే ఏదో అని చెప్ప లేము. తండ్రి అంటారు, నేను కూడా ఇటువంటి బిందువునే, కానీ నేను పతిత-పావనుడిని మరియు ఆత్మలైన మీరందరూ పతితులు. ఇది ఎంత డైరెక్ట్ విషయము. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అయి తండ్రినైన నన్ను స్మృతి చేయండి, ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయండి. నేను రెండే మాటలు చెప్తున్నాను - మన్మనాభవ. ఆపై ఇవి కొమ్మలు-రెమ్మలు అని తర్వాత కొంచెము వివరముగా తెలియజేస్తాను. మొదట సతోప్రధానము, ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి... వస్తారు. పాపాత్ములుగా అవ్వడము వలన ఎన్ని మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలు ఎలా తొలగుతాయి. గంగా స్నానముతో పాపాలు తొలగుతాయని వారు భావిస్తారు. కానీ అది శరీరానికి స్నానము. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తేనే పావనముగా అవ్వగలదు. దీనిని స్మృతియాత్ర అని అంటారు. ఇది ఎంత సహజమైన విషయము, దీనిని తండ్రి ప్రతి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. గీతలో కూడా మన్మనాభవ అనే పదముపైనే ఎక్కువ ధ్యానమివ్వడము జరిగింది. వారసత్వమైతే తప్పకుండా లభిస్తుంది, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. తండ్రి అవినాశీ బ్లాటింగ్ పేపర్ కదా. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు, మళ్ళీ రావణుడు పతితముగా చేస్తాడు, మరి ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. స్మృతి చేయనివారు కూడా ఉంటారు, వారి పరిస్థితి ఏమవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, వేరే విషయాలన్నింటినీ వదిలేయండి. కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - దేహీ-అభిమానులుగా అవ్వండి, నన్నొక్కరినే స్మృతి చేయండి, అంతే. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని మీకు తెలుసు. ఆత్మయే సుఖ-దుఃఖాలను అనుభవిస్తుంది. ఎప్పుడూ ఇతరుల హృదయాన్ని దుఃఖపెట్టకండి. ఇతరులకు సుఖాన్ని ఇవ్వాలి, ఇదే మీ వ్యాపారము. ఇతరులకు దుఃఖాన్ని ఇస్తూ ఉండేవారు చాలామంది ఉంటారు. ఇతరుల దేహములో చిక్కుకుని ఉంటారు. మొత్తం రోజంతా ఇతరులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. మాయ కూడా చురుకైనది. బాబా పేర్లు తీసుకోరు, అందుకే బాబా అంటారు - పిల్లలూ, దేహీ-అభిమానీ భవ, జ్ఞానమైతే చాలా సహజము, స్మృతియే కష్టము. ఆ జ్ఞానాన్ని అయితే 15-20 సంవత్సరాలు చదువుకుంటారు, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఈ జ్ఞానమైతే చాలా సహజమైనది. డ్రామాను తెలుసుకోవడము ఒక కథ వంటిది. ఇతరులకు మురళీని వినిపించడము పెద్ద విషయమేమీ కాదు. స్మృతియే చాలా కష్టమైనది. బాబా ఇక డ్రామా అని అంటారు, అయినా కూడా పురుషార్థము చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే యోగాగ్నితో మీ పాపాలు భస్మమవుతాయి. మంచి-మంచి పిల్లలు ఇందులో ఫెయిల్ అయిపోతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పుడూ కూడా ఎవరి హృదయానికి దుఃఖము కలిగించకూడదు. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి మరియు అందరికీ స్మృతిని ఇప్పించాలి.

2. పాపాల మచ్చలను తొలగించుకునేందుకు దేహీ-అభిమానులుగా అయి అవినాశీ బ్లాటింగ్ పేపర్ అయిన తండ్రిని స్మృతి చేయాలి. ఎటువంటి మధురమైన అవస్థను తయారుచేసుకోవాలంటే, అందరి కళ్యాణము జరుగుతూ ఉండాలి.

వరదానము:-
మీ శ్రేష్ఠత ద్వారా నవీనతా జెండాను ఎగురవేసే శక్తి స్వరూప భవ

ఇప్పుడు సమయమనుసారముగా, సమీపత అనుసారముగా శక్తి రూపము యొక్క ప్రభావాన్ని ఇతరులపై కలిగించినప్పుడే అంతిమ ప్రత్యక్షతను సమీపముగా తీసుకురాగలుగుతారు. ఏ విధముగా మీ స్నేహాన్ని మరియు సహయోగాన్ని ప్రత్యక్షము చేశారో అదే విధముగా సేవ అనే అద్దములో శక్తి రూపాన్ని అనుభవము చేయించండి. ఎప్పుడైతే మీ శ్రేష్ఠత ద్వారా శక్తి రూపపు నవీనతా జెండాను ఎగురవేస్తారో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. మీ శక్తి స్వరూపము ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రిని సాక్షాత్కారము చేయించండి.

స్లోగన్:-
మనసు ద్వారా శక్తులను మరియు కర్మల ద్వారా గుణాలను దానము చేయటమే మహాదానము.

అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

తండ్రికి పిల్లలపై ఈ పూర్తి విశ్వాసము ఉంది - నా ఈ పిల్లలే విఘ్న వినాశక ఆత్మలు, పూజ్య ఆత్మలు, ఈ పిల్లలు తండ్రి కన్నా ముందున్నారు, ఈ పిల్లలు నిమిత్తముగా ఉన్నారు, వీరు సదా తండ్రిని కూడా నిశ్చింత చేసేవారు, సదా శుభవార్తను వినిపించేవారు, వీరిలోని ప్రతి ఒక్కరూ విశేషమైనవారే. స్వయముపై కూడా ఇటువంటి విశ్వాసము పెట్టుకుని ఇదే స్మృతి స్వరూపములో ఉన్నట్లయితే విజయులుగా అవుతారు.