28-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి సమానముగా లవ్లీగా (ప్రియముగా)
తయారయ్యేందుకు స్వయాన్ని ఆత్మగా, బిందువుగా భావిస్తూ బిందువైన తండ్రిని స్మృతి
చేయండి’’
ప్రశ్న:-
స్మృతిలో ఉండే గుప్తమైన, తీవ్రమైన కృషిని పిల్లలు ప్రతి ఒక్కరు చేయాలి - ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే
స్మృతి చేయకుండా ఆత్మ, పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వలేదు. గుప్తమైన స్మృతిలో ఉంటూ,
దేహీ-అభిమానులుగా అయినప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. ధర్మరాజు శిక్షల నుండి
రక్షింపబడేందుకు సాధనము కూడా స్మృతియే. మాయా తుఫానులు స్మృతిలోనే విఘ్నాలను
కలిగిస్తాయి, అందుకే స్మృతి యొక్క గుప్తమైన కృషి చేయండి, అప్పుడే లక్ష్మీ-నారాయణుల
వలె లవ్లీగా (ప్రియముగా) అవ్వగలరు.
పాట:-
ఓం నమః శివాయ...
ఓంశాంతి
ఈ మహిమ అందరి తండ్రిది. భగవంతుడిని అనగా తండ్రిని స్మృతి చేయడము జరుగుతుంది, వారిని
తల్లి-తండ్రి అని అంటారు కదా. వారిని గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. మనుష్యులందరినీ
గాడ్ ఫాదర్ అంటారని కాదు. బాబా అని వారిని (లౌకిక తండ్రిని) కూడా అంటారు. లౌకిక
తండ్రి అని ఎవరినైతే అంటారో, వారు కూడా మళ్ళీ పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు.
వాస్తవానికి స్మృతి చేసేది ఆత్మ. ఆత్మయే లౌకిక తండ్రిని కూడా స్మృతి చేస్తుంది. కానీ
ఆత్మకు తన రూపము, కర్తవ్యము గురించి తెలియదు. ఆత్మకు స్వయము గురించే తెలియనప్పుడు
ఇక గాడ్ ఫాదర్ గురించి ఎలా తెలుసుకుంటుంది. తమ లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ
తెలుసు, వారి నుండి వారసత్వము లభిస్తుంది, లేదంటే స్మృతి ఎందుకు చేస్తారు. పారలౌకిక
తండ్రి నుండి తప్పకుండా వారసత్వము లభిస్తూ ఉండవచ్చు. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు.
వారిని దయ, క్షమ చూపమని కోరుకుంటారు ఎందుకంటే పాపాలు చేస్తూ ఉంటారు. ఇది కూడా
డ్రామాలో నిశ్చితమై ఉంది. కానీ ఆత్మను గురించి తెలుసుకోవడము మరియు పరమాత్మను గురించి
తెలుసుకోవడము అనేది కష్టమైన సబ్జెక్ట్. సహజాతి సహజము మరియు కష్టాతి కష్టము.
వాస్తవానికి సైన్స్ మొదలైనవి ఎంతగా నేర్చుకుని చంద్రుని వరకు వెళ్ళినా సరే, ఈ
జ్ఞానము ముందు అది తుచ్ఛమైనది. స్వయాన్ని మరియు తండ్రిని తెలుసుకోవడము చాలా కష్టము.
ఏయే పిల్లలైతే స్వయాన్ని బ్రహ్మాకుమార-కుమారీలుగా చెప్పుకుంటారో, వారు కూడా
స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోవాలి. ఆత్మనైన నేను బిందువును, నా తండ్రి కూడా
బిందువే - ఇది మర్చిపోతారు. ఇది కష్టమైన సబ్జెక్ట్. నేను ఆత్మను అన్నది మర్చిపోతే
తండ్రిని స్మృతి చేయడము కూడా మర్చిపోతారు. దేహీ-అభిమానులుగా అయ్యే అభ్యాసము లేదు.
ఆత్మ బిందువు, ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. ఆత్మనైన నేను రకరకాల
శరీరాలను తీసుకుని పాత్రను అభినయిస్తున్నాను అన్నది పదే-పదే మర్చిపోతారు. ఇదే అర్థం
చేసుకోవలసిన ముఖ్యమైన విషయము. ఆత్మ మరియు పరమాత్మలను గురించి అర్థం చేసుకోవడము తప్ప
మిగిలిన జ్ఞానమంతా అందరి బుద్ధిలోకి వస్తుంది. మనము 84 జన్మలు తీసుకుంటాము,
సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా... అవుతాము. ఈ చక్రమైతే చాలా సహజమైనది, దీనిని
అర్థం చేసుకుంటారు. కానీ స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని తండ్రిని స్మృతి
చేయడములో ఉన్నంత లాభము కేవలం చక్రాన్ని తెలుసుకోవడములో లేదు. ఆత్మనైన నేను
నక్షత్రాన్ని. తండ్రి కూడా నక్షత్రము వంటివారు, వారిది అతి సూక్ష్మమైన రూపము. వారే
సద్గతిదాత. వారిని స్మృతి చేయడము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ పద్ధతిలో ఎవరూ
నిరంతరము స్మృతి చేయరు. దేహీ-అభిమానులుగా అవ్వరు. నేను ఆత్మను అన్నది పదే-పదే గుర్తు
చేసుకోవాలి. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అన్నది తండ్రి ఆజ్ఞ.
నేను బిందువును. ఇక్కడకు వచ్చి పాత్రధారిగా అయ్యాను. నాలో 5 వికారాల తుప్పు పట్టి
ఉంది. ఇనుపయుగములో ఉన్నాను. ఇప్పుడు బంగారుయుగములోకి వెళ్ళాలి, అందుకే తండ్రిని ఎంతో
ప్రేమగా స్మృతి చేయాలి. ఈ విధముగా తండ్రిని స్మృతి చేస్తే అప్పుడు తుప్పు వదులుతుంది.
ఇందులోనే శ్రమ ఉంది. తాము చేసిన సేవ గురించి చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ
రోజు ఈ సేవ చేశాను, చాలా ప్రభావితమయ్యారు అని చెప్తారు, కానీ ఆత్మ మరియు పరమాత్మల
జ్ఞానము విషయములో వారు ఏ మాత్రము ప్రభావితమవ్వలేదని శివబాబాకు అర్థమవుతుంది. భారత్
స్వర్గముగా మరియు నరకముగా ఎలా అవుతుంది, 84 జన్మలను ఎలా తీసుకుంటారు, సతో రజో
తమోలలోకి ఎలా వస్తారు అని కేవలం ఇది విని ప్రభావితులవుతారు. పరమాత్మ నిరాకారుడని
కూడా అర్థం చేసుకుంటారు, కానీ నేను ఆత్మను, నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది, తండ్రి
కూడా బిందువు, వారిలో పూర్తి జ్ఞానముంది, వారిని స్మృతి చేయాలి అన్న ఈ విషయాలను ఎవరూ
అర్థం చేసుకోరు. ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోరు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాల
జ్ఞానాన్ని తండ్రియే ఇస్తారు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాల సబ్జెక్ట్ ఉండాలని గవర్నమెంట్
వారు కూడా కోరుకుంటున్నారు. ఇవి వాటి కన్నా సూక్ష్మమైన విషయాలు - ఆత్మ ఏమిటి, ఆత్మలో
84 జన్మల పాత్ర ఎలా ఉంది, అది కూడా అవినాశీగా ఎలా ఉంది. ఇలా స్మృతి చేయడము ద్వారా,
స్వయాన్ని బిందువుగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము ద్వారా వికర్మలు వినాశనమవుతాయి
- ఇటువంటి యోగములో ఎవరూ తత్పరులై ఉండరు. ఈ స్మృతిలో ఉన్నట్లయితే చాలా లవ్లీగా (ప్రియముగా)
అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు ఎంత లవ్లీగా (ప్రియముగా) ఉన్నారో చూడండి. ఇక్కడున్న
మనుష్యులు ఎలా ఉన్నారో చూడండి. మాలో ఏ గుణాలు లేవు, మేము దిగజారిపోయినవారము, మీరు
స్వచ్ఛమైనవారు అని స్వయమే అంటారు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని
తండ్రిని స్మృతి చేస్తారో, అప్పుడు సఫలత లభిస్తుంది, లేదంటే సఫలత చాలా తక్కువగా
లభిస్తుంది. మాలో చాలా మంచి జ్ఞానముందని, ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి మాకు
తెలుసు అని భావిస్తారు. కానీ యోగము చార్టు గురించి చెప్పరు. ఈ అవస్థలో ఉండేవారు అనగా
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసేవారు ఎవరో అరుదుగా ఉంటారు.
చాలామందికి అభ్యాసము లేదు. పిల్లలు కేవలం జ్ఞానము యొక్క చక్రాన్ని బుద్ధిలో
తిప్పుతున్నారని బాబాకు అర్థమవుతుంది. ఇకపోతే - నేను ఆత్మను, నేను బాబాతో యోగము
జోడించాలి, దీని ద్వారా ఇనుపయుగము నుండి బయటకు వచ్చి బంగారుయుగములోకి వెళ్తాను,
ఆత్మనైన నేను తండ్రిని తెలుసుకోవాలి, వారి స్మృతిలోనే ఉండాలి - ఈ అభ్యాసము
చాలామందికి తక్కువగా ఉంది. చాలామంది వస్తారు కూడా. బాగుంది-బాగుంది అని కూడా అంటారు.
కానీ లోపల ఎంత తుప్పు పట్టి ఉంది అన్నది వారికి తెలియదు. సుందరము నుండి శ్యామముగా
అయిపోయారు. మళ్ళీ సుందరముగా ఎలా అవ్వాలి? ఇది ఎవ్వరికీ తెలియదు. కేవలం
చరిత్ర-భౌగోళికాలను తెలుసుకోవడము కాదు. పావనముగా ఎలా తయారవ్వాలి? శిక్షలు
అనుభవించకుండా ఉండేందుకు ఉపాయము - కేవలం స్మృతిలో ఉండటము. యోగము సరిగ్గా లేకపోతే
ధర్మరాజు శిక్షలను అనుభవిస్తారు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, దీనిని ఎవరూ
తెలుసుకోలేరు. జ్ఞానములో తమకు అంతా తెలుసని భావిస్తారు, ఇందులో అనుమానమేమీ లేదు.
ముఖ్యమైన విషయము యోగము. యోగములో చాలామంది అపరిపక్వముగా ఉన్నారు, అందుకే తండ్రి
అంటారు - జాగ్రత్తగా ఉండండి, కేవలం పండితులుగా అవ్వకండి. నేను ఆత్మను, నేను తండ్రిని
స్మృతి చేయాలి. తండ్రి ఆజ్ఞను ఇచ్చారు - మన్మనాభవ. ఇది మహామంత్రము. స్వయాన్ని
నక్షత్రముగా భావిస్తూ తండ్రిని కూడా నక్షత్రముగా భావించండి, అప్పుడు తండ్రిని స్మృతి
చేయండి. తండ్రి యొక్క పెద్ద రూపమేమీ మీ ముందుకు రాదు. దేహీ-అభిమానులుగా అవ్వడములోనే
శ్రమ ఉంది. విశ్వానికి మహారాజు-మహారాణిగా ఒక జంట అవుతారు, వారికి లక్షలాది మంది
ప్రజలు తయారవుతారు. ప్రజలైతే చాలామంది ఉన్నారు కదా. చరిత్ర-భౌగోళికాలను తెలుసుకోవడము
సహజమే కానీ ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారో, అప్పుడే
పావనముగా అవుతారు. ఈ అభ్యాసము చాలా కష్టమైనది. స్మృతి చేయడానికి కూర్చున్నప్పుడు
చాలా తుఫానులు విఘ్నాలను కలిగిస్తాయి. ఎవరైనా ఒక అరగంట ఏకరసముగా కూర్చోవాలన్నా చాలా
కష్టము. పదే-పదే మర్చిపోతుంటారు. ఇందులో సత్యాతి-సత్యమైన గుప్తమైన శ్రమ ఉంది. చక్రము
యొక్క రహస్యాన్ని తెలుసుకోవడము సహజమే. ఇకపోతే దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి
చేయడమనేది అరుదుగా ఎవరో అర్థం చేసుకుని ఆ పని చేస్తారు. తండ్రి స్మృతి ద్వారానే మీరు
పావనముగా అవుతారు. నిరోగీ శరీరము, దీర్ఘ ఆయుష్షు లభిస్తుంది. కేవలం ప్రపంచ
చరిత్ర-భౌగోళికాలను అర్థం చేయించినంత మాత్రాన మాలలోని మణులుగా అవ్వలేరు. స్మృతి
ద్వారా మణులుగా అవుతారు. ఈ శ్రమను ఎవరూ చేయలేకపోతున్నారు. మేము స్మృతిలో ఉండటము
లేదని స్వయము కూడా అర్థం చేసుకుంటారు. మంచి-మంచి మహారథులు ఈ విషయములో ఢీలాగా ఉన్నారు.
ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించడము రావటమే లేదు. అయినా ఇది కష్టమైన విషయము. వారు
కల్పము ఆయువును పొడిగించేసారు. మీరు 5 వేల సంవత్సరాలని ఋజువు చేస్తారు. కానీ
ఆత్మ-పరమాత్మల రహస్యాలేవీ తెలియదు, స్మృతియే చేయరు కావున అవస్థ కింద-మీద అవుతూ
ఉంటుంది. దేహాభిమానము చాలా ఉంది. దేహీ-అభిమానులుగా అయినప్పుడే మాలలోని మణులుగా
అవ్వగలరు. అంతేకానీ, మేము ప్రపంచ చరిత్ర-భౌగోళికాలను అర్థం చేయిస్తాము, అందుకే మేము
మాలలో దగ్గరగా వెళ్ళగలమని కాదు. ఆత్మ ఎంతో చిన్ననిది, అందులో 84 జన్మల పాత్ర నిండి
ఉంది. ముందుగా ఈ విషయాన్ని బుద్ధిలోకి తీసుకురావాలి, తర్వాత చక్రాన్ని స్మృతి చేయాలి.
ముఖ్యమైన విషయము యోగము. యోగీ అవస్థ ఉండాలి. పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవ్వాలి.
యోగముతోనే ఆత్మ పవిత్రముగా అవుతుంది. యోగబలము కలవారే ధర్మరాజు శిక్షల నుండి
రక్షించబడగలరు. ఈ కృషిని కష్టము మీద ఎవరో చేస్తారు. మాయా తుఫానులు కూడా చాలా వస్తాయి.
ఇది చాలా తీవ్రమైన, గుప్తమైన కృషి. లక్ష్మీ-నారాయణులుగా అవ్వడము పిన్నమ్మ ఇంటికి
వెళ్ళినంత సులువేమీ కాదు. ఇది అభ్యాసమైనట్లయితే ఇక నడుస్తూ-తిరుగుతూ తండ్రి స్మృతి
కలుగుతూ ఉంటుంది, దీనినే యోగమని అంటారు. ఇకపోతే జ్ఞానపు విషయాలనైతే చిన్న-చిన్న
పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. చిత్రాలలో యుగాలు మొదలైనవి అన్నీ చూపించడము
జరిగింది. ఇది సాధారణమైన విషయము. ఏదైనా కార్యాన్ని ప్రారంభించినప్పుడు స్వస్తికను
దిద్దుతారు. ఇది సత్య, త్రేతా మొదలైన యుగాలకు గుర్తు... ఇకపోతే పైన చిన్నని
సంగమయుగము ఉంది. ముందు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ
ఉన్నట్లయితే, అప్పుడే ఆ శాంతి వ్యాపించగలదు. యోగము ద్వారా వికర్మలు వినాశనమవుతాయి.
మొత్తము ప్రపంచమంతా ఆత్మ-పరమాత్మల గురించి మర్చిపోయింది, కొందరు పరమాత్మ వేలాది
సూర్యుల కన్నా తేజోమయుడు అని అంటారు కానీ అదెలా సాధ్యము. ఎందుకంటే ఆత్మయే పరమాత్మ
అని అన్నప్పుడు, ఇక ఇరువురూ ఒకటే అయినట్లు కదా. చిన్న, పెద్ద అన్న తేడా ఏమీ ఉండదు.
దీని గురించి కూడా అర్థం చేయించాలి. ఆత్మ రూపము బిందువు. ఆత్మనే పరమాత్మ అయినప్పుడు
పరమాత్మ కూడా బిందువైనట్లే కదా. ఇందులో తేడా ఏమీ ఉండదు. అందరూ పరమాత్మ అయినట్లయితే
అందరూ రచయితలే అవుతారు. సర్వుల సద్గతి చేసేవారైతే ఒక్క తండ్రియే కదా. ఇకపోతే, ప్రతి
ఒక్కరికీ తమ-తమ పాత్ర లభించి ఉంది. దీనిని బుద్ధిలో కూర్చోబెట్టుకోవాలి, ఇది అర్థం
చేసుకోవలసిన విషయము. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే తుప్పు వదిలిపోతుంది.
ఇందులో శ్రమ ఉంది. అర్ధకల్పము నుండి దేహాభిమానులుగా ఉన్నారు. సత్యయుగములో
దేహీ-అభిమానులుగా ఉన్నా కానీ తండ్రి గురించి తెలియదు. జ్ఞానము గురించి తెలియదు. ఈ
సమయములో మీకు ఏదైతే జ్ఞానము లభిస్తుందో, అది మాయమైపోతుంది. అక్కడ కేవలం ఆత్మనైన నేను
ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను అన్నది తెలుస్తుంది. పాత్రను అభినయిస్తారు.
ఇందులో చింతించే విషయమేముంది, ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయించాలి, ఏడిస్తే
ఏమవుతుంది? ఇది అర్థం చేయించడము జరుగుతుంది, ఒకవేళ కొంత అర్థం చేసుకున్నా శాంతి
లభిస్తుంది. స్వయము అర్థం చేసుకున్నట్లయితే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఏడిస్తే
తిరిగి వస్తారా ఏమిటి అని వృద్ధులు అర్థం చేయిస్తారు కూడా. శరీరాన్ని వదిలి ఆత్మ
వెళ్ళిపోయింది, ఇందులో ఏడ్చే విషయమేముంది. అజ్ఞాన కాలములో కూడా ఇలాగే భావిస్తారు.
కానీ ఆత్మ మరియు పరమాత్మ ఏమిటి అన్నది వారికి తెలియదు. ఆత్మలో మాలిన్యము చేరుకుంది,
కానీ వారు ఆత్మ నిర్లేపి అని భావిస్తారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. చాలామంది
పిల్లలు స్మృతిలో ఉండరని బాబాకు తెలుసు. కేవలం అర్థం చేయించడం వలన ఏమవుతుంది. చాలా
ప్రభావితులయ్యారు అని అంటారు, కానీ దాని ద్వారా వారి కళ్యాణమేమీ జరగలేదు.
ఆత్మ-పరమాత్మల పరిచయము లభించినప్పుడే, మేము వారి పిల్లలమని అర్థమవుతుంది. తండ్రియే
పతిత-పావనుడు. వారు వచ్చి మనల్ని దుఃఖము నుండి విడిపిస్తారు. వారు కూడా బిందువే.
కావున తండ్రిని నిరంతరము స్మృతి చేయాలి. ఇకపోతే చరిత్ర-భౌగోళికాలను తెలుసుకోవడము
పెద్ద విషయమేమీ కాదు. అర్థం చేసుకునేందుకు వస్తారు కానీ నేను ఆత్మను అనే స్థితిలో
తత్పరులై ఉండాలి, ఇందులోనే శ్రమ ఉంది. ఆత్మ-పరమాత్మల విషయము గురించి మీకు కూడా
తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. సృష్టి చక్రమైతే సహజమే. ఎంత వీలైతే అంత
లేస్తూ-కూర్చుంటూ దేహీ-అభిమానులుగా అయ్యే కృషి చేయాలి. దేహీ-అభిమానులు చాలా శాంతిగా
ఉంటారు, నేను సైలెన్స్ లోకి వెళ్ళాలి, నిరాకారీ ప్రపంచములోకి వెళ్ళి విరాజమానమవ్వాలి,
నా పాత్ర ఇప్పుడు పూర్తి అయింది అని భావిస్తారు. తండ్రి రూపాన్ని చిన్న బిందువుగా
భావిస్తారు. వారు పెద్ద లింగమేమీ కాదు. బాబా చాలా చిన్నగా ఉంటారు. వారే నాలెడ్జ్
ఫుల్, సర్వుల సద్గతిదాత. ఆత్మనైన నేను కూడా నాలెడ్జ్ ఫుల్ గా అవుతున్నాను. ఇటువంటి
చింతన ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు ఉన్నత పదవిని పొందగలరు. మొత్తము ప్రపంచములో
ఎవ్వరికీ ఆత్మ మరియు పరమాత్మల గురించి తెలియదు.
బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. సన్యాసులకు కూడా తెలియదు, వారు వచ్చి
అర్థం చేసుకోరు కూడా. వారందరూ తమ-తమ ధర్మాలలోనే వస్తారు. లెక్కాచారాలను సమాప్తము
చేసుకుని వెళ్ళిపోతారు. మీరే ఈ కృషి చేసినట్లయితే తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది.
ఇప్పుడు మళ్ళీ దేహీ-అభిమానులుగా అవ్వాలి. మనసు ఆత్మలో ఉంది కదా. ఆత్మయే మనసును
తండ్రితో జోడించాలి. మనసు శరీరములో లేదు. శరీరానికైతే అన్ని స్థూలమైన ఇంద్రియాలు
ఉన్నాయి. మనసును జోడించడమనేది ఆత్మ కర్తవ్యము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి
అయిన పరమాత్మతో మనసును జోడించాలి. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఆత్మ ఎంత చిన్ననిది,
సూక్ష్మమైనది, కానీ ఎంతటి పాత్రను అభినయిస్తుంది. ఇది సృష్టి అద్భుతము. ఇంత చిన్నని
ఆత్మలో ఎంతటి అవినాశీ పాత్ర నిండి ఉంది. అది ఎప్పటికీ నశించదు. ఆత్మ చాలా
సూక్ష్మమైనది. మీరు ప్రయత్నించినా సరే పెద్ద వస్తువులే గుర్తుకువస్తాయి. ఆత్మనైన
నేను చిన్నని నక్షత్రాన్ని, తండ్రి రూపము కూడా చిన్ననిది. పిల్లలైన మీరు మొట్టమొదట
ఈ కృషి చేయాలి. ఇంత చిన్నని ఆత్మయే ఈ సమయములో పతితముగా అయింది. ఇది ఆత్మను పావనముగా
చేసుకునేందుకు మొట్టమొదటి ఉపాయము. చదువు చదువుకోవాలి. ఇకపోతే ఆటపాటలు వేరే విషయము.
ఆడుకోవడము కూడా ఒక కళయే. చదువు ద్వారా పదవి లభిస్తుంది. ఆటపాటల ద్వారా పదవి లభించదు.
ఆటలు మొదలైనవాటి డిపార్టుమెంటు వేరుగా ఉంటుంది. దానికి జ్ఞానము మరియు యోగముతో
సంబంధము లేదు. భోగ్ పెట్టడము మొదలైనవి కూడా ఆటనే. ముఖ్యమైనది స్మృతి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ధర్మరాజు శిక్షల నుండి రక్షింపబడేందుకు స్మృతి యొక్క గుప్తమైన కృషి చేయాలి.
పావనముగా అయ్యే ఉపాయము - స్వయాన్ని ఆత్మగా, బిందువుగా భావిస్తూ బిందువైన తండ్రిని
స్మృతి చేయడము.
2. జ్ఞానములో ‘నాకు అంతా తెలుసు’ అని అనుకోకూడదు, ఏకరస అవస్థను తయారుచేసుకునే
అభ్యాసము చేయాలి. తండ్రి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నారో, దానిని పాటించాలి.
వరదానము:-
ప్రతి కర్మను చేస్తూ కమల ఆసనముపై విరాజమానమై ఉండే సహజ మరియు
నిరంతర యోగీ భవ
నిరంతరము యోగయుక్తముగా ఉండేందుకు కమలపుష్ప ఆసనముపై సదా
విరాజమానమై ఉండండి, కానీ ఎవరైతే లైట్ గా ఉంటారో, వారే కమల ఆసనముపై స్థితులై ఉండగలరు.
ఏ విధమైన భారము అనగా బంధనము ఉండకూడదు. మనసులోని సంకల్పాల భారము, సంస్కారాల భారము,
ప్రాపంచిక వినాశీ వస్తువుల ఆకర్షణ వలన కలిగే భారము, లౌకిక సంబంధీకుల మమకారము వలన
కలిగే భారము - ఎప్పుడైతే ఈ భారాలన్నీ సమాప్తమవుతాయో, అప్పుడు కమల ఆసనముపై
విరాజమానమయ్యే నిరంతర యోగులుగా అవ్వగలరు.
స్లోగన్:-
సహనశీలతా గుణాన్ని ధారణ చేసినట్లయితే అసత్యత యొక్క ఆధారాన్ని తీసుకోవలసిన అవసరముండదు.
అవ్యక్త ప్రేరణలు -
‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’
ఎవరి సంస్కారాలైతే
సరళముగా, మధురముగా ఉంటాయో, ఆ సంస్కారాలు స్వరూపములో కనిపిస్తాయి. ఎప్పుడైతే
సంస్కారాలు బాప్ దాదా సమానముగా అవుతాయో, అప్పుడు బాప్ దాదా స్వరూపము అందరికీ
కనిపిస్తుంది. బాప్ దాదా ఎలా ఉంటారో, అవే గుణాలు, అదే కర్తవ్యము, అవే మాటలు, అవే
సంకల్పాలు అనుభవమవుతాయి. వీరు వారి లాగానే అనిపిస్తున్నారు అని అప్పుడు అందరి నోటి
నుండి వెలువడుతుంది.
| | | |