28-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - అందరికీ ఈ శుభ సందేశాన్ని వినిపించండి
- ఇప్పుడు మళ్ళీ విశ్వములో శాంతి స్థాపన జరుగుతోంది, ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా
ధర్మాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు’’
ప్రశ్న:-
పిల్లలైన మీకు స్మృతిలో ఉండండి అనే సూచనను పదే-పదే ఎందుకు ఇవ్వడం జరుగుతుంది?
జవాబు:-
ఎందుకంటే సదా
ఆరోగ్యవంతముగా మరియు సదా పావనముగా అయ్యేందుకు మార్గము స్మృతియే, అందుకే ఎప్పుడు
సమయము దొరికినా స్మృతిలో ఉండండి. ఉదయముదయమే స్నానము మొదలైనవి చేసి ఏకాంతములో
విహరించండి లేక ఒక చోట కూర్చోండి. ఇక్కడైతే అంతా సంపాదనయే సంపాదన. స్మృతి ద్వారానే
విశ్వానికి అధిపతులుగా అవుతారు.
ఓం శాంతి.
ఈ సమయములో అందరూ విశ్వములో శాంతిని కోరుకుంటున్నారని మధురమైన పిల్లలకు తెలుసు.
విశ్వములో శాంతి ఎలా ఏర్పడగలదు అన్న ఈ మాటలను వింటూ ఉంటారు. కానీ ఇప్పుడు అందరూ
కోరుకుంటున్న విశ్వములోని శాంతి ఎప్పుడు ఉండేది అన్నది ఎవ్వరికీ తెలియదు. ఈ
లక్ష్మీనారాయణుల రాజ్యము ఉన్నప్పుడు విశ్వములో శాంతి ఉండేదని పిల్లలైన మీకే తెలుసు.
ఇప్పటివరకు కూడా లక్ష్మీ-నారాయణుల మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. విశ్వములో శాంతి
5000 సంవత్సరాల క్రితం ఉండేదని, అది మళ్ళీ ఇప్పుడు స్థాపనవుతోందని మీరు ఎవరికైనా
తెలియజేయవచ్చు. దానిని ఎవరు స్థాపన చేస్తారు? అది మనుష్యులకు తెలియదు. పిల్లలైన మీకు
తండ్రి అర్థం చేయించారు, మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు ఇది వ్రాయవచ్చు.
కానీ ఈ విధంగా వ్రాసి ఎవరికైనా ఇచ్చేంతటి ధైర్యము ఇప్పటివరకు ఎవరికీ లేదు.
వార్తాపత్రికల్లో కూడా అందరి మాట వింటూనే ఉంటారు కదా, విశ్వములో శాంతి ఏర్పడాలి అని
అందరూ అంటారు. యుద్ధాలు మొదలైనవి జరిగినప్పుడు మనుష్యులు విశ్వములో శాంతి
ఏర్పడేందుకు యజ్ఞాన్ని రచిస్తారు. ఏ యజ్ఞాన్ని? రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. ఇప్పుడు
పిల్లలకు తెలుసు, ఏ తండ్రినైతే రుద్రుడు, శివుడు అని అంటారో వారు ఈ సమయములో జ్ఞాన
యజ్ఞాన్ని రచించారు. విశ్వములో శాంతి ఇప్పుడు స్థాపన అవుతోంది. సత్యయుగ కొత్త
ప్రపంచములో శాంతి ఉన్నప్పుడు తప్పకుండా రాజ్యము చేసేవారు కూడా ఉంటారు. విశ్వములో
శాంతి ఏర్పడాలి అని నిరాకారీ ప్రపంచము విషయములో అనరు. అక్కడ ఉండేదే శాంతి. విశ్వము
అనగా మనుష్యులు ఉండే స్థానము. నిరాకారీ ప్రపంచాన్ని విశ్వము అని అనరు. అది
శాంతిధామము. బాబా పదే-పదే అర్థం చేయిస్తూ ఉంటారు, అయినా కొందరు మర్చిపోతారు. కానీ
కొందరి బుద్ధిలో ఉంది, వారు అర్థం చేయించగలరు. విశ్వములో శాంతి ఎలా ఉండేది, అది
మళ్ళీ ఇప్పుడు ఎలా స్థాపన అవుతోంది అనేది ఎవరైనా అర్థం చేయించడం చాలా సహజము. భారత్
లో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క రాజ్యం ఉన్నప్పుడు ఒకే ధర్మము ఉండేది,
విశ్వములో శాంతి ఉండేది. ఇది చాలా సహజముగా అర్థం చేయించగలిగే మరియు వ్రాయగలిగే
విషయము. పెద్ద-పెద్ద మందిరాలను నిర్మించేవారికి కూడా మీరు ఈ విధంగా వ్రాయవచ్చు -
వీరి రాజ్యము ఉన్నప్పుడు నేటికి 5000 సంవత్సరాల క్రితం విశ్వములో శాంతి ఉండేది,
వారివే మీరు మందిరాలు నిర్మిస్తున్నారు. భారత్ లోనే వీరి రాజ్యము ఉండేది, ఆ సమయములో
ఇతర ధర్మమేదీ ఉండేది కాదు. ఇది సహజమైన విషయము మరియు అర్థం చేసుకోవలసిన విషయము.
డ్రామానుసారముగా మున్ముందు అన్నీ అర్థం చేసుకుంటారు. మీరు ఈ శుభవార్తను అందరికీ
విశ్వములో వినిపించవచ్చు, అలాగే మీరు దీనిని చాలా సుందరమైన కార్డుపై ముద్రించవచ్చు
కూడా. విశ్వములో శాంతి నేటికి 5000 సంవత్సరాల క్రితం ఉండేది, ఆ సమయములో కొత్త
ప్రపంచము, కొత్త భారత్ ఉండేది. అప్పుడు లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది. ఇప్పుడు
మళ్ళీ విశ్వములో శాంతి స్థాపన అవుతోంది. ఈ విషయాలను స్మరించడం ద్వారా కూడా పిల్లలైన
మీకు ఎంతో సంతోషము కలగాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మనం విశ్వాధిపతులుగా
అవ్వనున్నామని మీకు తెలుసు. మొత్తం ఆధారమంతా పిల్లలైన మీ పురుషార్థముపైనే ఉంది. బాబా
అర్థం చేయించారు, ఎంత సమయము దొరికితే అంత సమయము బాబా స్మృతిలో ఉండండి. ఉదయాన్నే
స్నానము చేసి ఏకాంతములో విహరించండి లేక కూర్చోండి. ఇక్కడైతే అంతా సంపాదనయే సంపాదన
చేసుకోవాలి. సదా ఆరోగ్యవంతముగా మరియు సదా పావనముగా అయ్యేందుకే స్మృతి ఉంది. ఇక్కడ
సన్యాసులు పవిత్రముగా ఉన్నా కానీ అనారోగ్యముగా అయితే తప్పకుండా అవుతారు. ఈ ప్రపంచమే
రోగీ ప్రపంచము, అది నిరోగీ ప్రపంచము. ఇది కూడా మీకు తెలుసు. స్వర్గములో అందరూ
నిరోగులుగా ఉంటారని ప్రపంచములోనివారికి ఎవరికేమి తెలుసు. స్వర్గము అని దేనినంటారో
ఎవరికీ తెలియదు. మీకు ఇప్పుడు తెలుసు. తండ్రి అంటారు, ఎవరు కలిసినా వారికి మీరు
అర్థం చేయించవచ్చు. ఉదాహరణకు ఎవరైనా తమను తాము రాజు, రాణులుగా పిలిపించుకుంటున్నారు
అనుకోండి. వాస్తవానికి ఇప్పుడు రాజు, రాణులుగా ఎవరూ లేరు. మీరు చెప్పండి - మీరు
ఇప్పుడు రాజు, రాణులు కారు. దీనిని బుద్ధి నుండి కూడా తొలగించవలసి ఉంటుంది. మహారాజా,
మహారాణులైన శ్రీ లక్ష్మీ-నారాయణుల రాజధాని అయితే ఇప్పుడు స్థాపన అవుతోంది. కావున
తప్పకుండా ఇక్కడ రాజు, రాణులు ఎవరూ ఉండకూడదు కదా. మేము రాజు, రాణులము అన్నది కూడా
మర్చిపోండి. సాధారణమైన మనుష్యుల వలె నడుచుకోండి. వీరి వద్ద కూడా ధనము, బంగారము
మొదలైనవైతే ఉంటాయి కదా. ఇప్పుడు నిబంధనలు పాస్ అవుతున్నాయి, అవన్నీ తీసేసుకుంటారు.
ఇక అప్పుడు సామాన్య మనుష్యుల వలె అయిపోతారు. ఈ యుక్తులను కూడా రచిస్తున్నారు.
కొందరిది ధూళిలో కలిసిపోతుందని, కొందరిది రాజులు తింటారని... గాయనము కూడా ఉంది కదా.
ఇప్పుడు రాజులు ఎవరిదీ తినరు. రాజులే లేరు. ప్రజలే ప్రజలది తింటూ ఉన్నారు. ఈ
రోజుల్లోని రాజ్యము చాలా విచిత్రమైనది. ఎప్పుడైతే పూర్తిగా రాజుల పేరు తొలగిపోతుందో,
అప్పుడు మళ్ళీ రాజధాని స్థాపన అవుతుంది. ఎక్కడైతే విశ్వములో శాంతి ఉంటుందో మేము
అక్కడకు వెళ్తున్నాము అని ఇప్పుడు మీకు తెలుసు. అది సుఖధామము, సతోప్రధాన ప్రపంచము.
మనం అక్కడకు వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నాము. కుమార్తెలు అథారిటీతో కూర్చుని
అర్థం చేయించాలి. కేవలం బాహ్యమైన కృత్రిమమైన ఆర్భాటము అవసరము లేదు. ఈ రోజుల్లోనైతే
అలాంటి కృత్రిమమైనవి కూడా ఎన్నో వెలువడ్డాయి కదా. ఇక్కడైతే పక్కా బ్రహ్మాకుమార,
కుమారీలు కావాలి.
బ్రాహ్మణులైన మీరు బ్రహ్మాబాబాతో కలిసి విశ్వములో శాంతి స్థాపనా కార్యాన్ని
చేస్తున్నారు. ఇటువంటి శాంతి స్థాపనను చేసే పిల్లలు చాలా శాంతచిత్తముగా మరియు చాలా
మధురముగా ఉండాలి, ఎందుకంటే విశ్వములో శాంతిని స్థాపన చేసేందుకు మేము నిమిత్తులుగా
అయ్యాము అని పిల్లలకు తెలుసు. కావున మొదట మనలో ఎంతో శాంతి కావాలి. మాటలు కూడా చాలా
మెల్లమెల్లగా, చాలా రాయల్టీగా మాట్లాడాలి. మీరు పూర్తిగా గుప్తముగా ఉన్నారు. మీ
బుద్ధిలో అవినాశీ జ్ఞాన రత్నాల ఖజానా నిండి ఉంది. తండ్రికి మీరు వారసులు కదా. ఎంతగా
తండ్రి వద్ద ఖజానా ఉందో, అంతగా మీరు కూడా పూర్తిగా నింపుకోవాలి. మొత్తం ఆస్తి అంతా
మీదే. కానీ అంతటి ధైర్యము లేకపోతే తీసుకోలేరు. తీసుకునేవారే ఉన్నత పదవిని పొందుతారు.
ఎవరికైనా అర్థం చేయించాలి అనే అభిరుచి ఎంతగానో ఉండాలి. మనం భారత్ ను మళ్ళీ
స్వర్గముగా తయారుచేయాలి. వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ వాటితోపాటు ఈ సేవను కూడా
చేయాలి. అందుకే బాబా త్వరత్వరగా చేయమంటారు. అయినా సరే, జరిగేది డ్రామానుసారముగానే
జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ సమయమనుసారముగానే నడుచుకుంటున్నారు. పిల్లల చేత కూడా
పురుషార్థము చేయిస్తున్నారు. పిల్లలకు నిశ్చయము ఉంది - ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే
ఉందని. ఇది మన అంతిమ జన్మ, తర్వాత మనం స్వర్గములో ఉంటాము. ఇది దుఃఖధామము, తర్వాత ఇది
సుఖధామముగా అయిపోతుంది. అలా అవ్వడానికి సమయమైతే పడుతుంది కదా. ఈ వినాశనము ఏమైనా
చిన్నదా. ఏదైనా కొత్త ఇల్లు తయారయ్యేటప్పుడు ఇక ఆ కొత్త ఇంటి స్మృతే కలుగుతూ ఉంటుంది.
అది హద్దులోని విషయము, అయితే అక్కడ సంబంధాలు మొదలైనవేవీ మారవు. ఇక్కడైతే పాత
ప్రపంచమే మారిపోనున్నది. అప్పుడు ఎవరైతే బాగా చదువుకుంటారో వారు రాజ్యకులములోకి
వస్తారు లేకపోతే ప్రజలలోకి వెళ్ళిపోతారు. పిల్లలకు ఎంతో సంతోషము ఉండాలి. బాబా అర్థం
చేయించారు, 50-60 జన్మలు మీరు సుఖాన్ని పొందుతారు. ద్వాపరములో కూడా మీ వద్ద ఎంతో
ధనము ఉంటుంది. దుఃఖమైతే తర్వాత కలుగుతుంది. రాజులు ఎప్పుడైతే పరస్పరం
కొట్లాడుకుంటారో, విభజనలు మొదలవుతాయో, అప్పుడు దుఃఖము ప్రారంభమవుతుంది. మొదటైతే
ధాన్యము మొదలైనవి కూడా ఎంతో చవకగా ఉండేవి. కరువులు మొదలైనవి కూడా తర్వాత మొదలవుతాయి.
మీ వద్ద ఎంతో ధనము ఉంటుంది. సతోప్రధానత నుండి తమోప్రధానతలోకి మెల్లమెల్లగా వస్తారు.
కావున పిల్లలైన మీకు లోలోపల ఎంతో సంతోషము ఉండాలి. స్వయములోనే సంతోషము లేకపోతే, శాంతి
లేకపోతే మరి వారు విశ్వములో శాంతిని ఎలా స్థాపన చేస్తారు! ఎంతోమంది బుద్ధిలో అశాంతి
ఉంటుంది. శాంతి వరదానాన్ని ఇచ్చేందుకు తండ్రి వస్తారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి
చేసినట్లయితే తమోప్రధానముగా అయిన కారణముగా ఆత్మ ఏదైతే అశాంతిగా అయిపోయిందో, అది
స్మృతి ద్వారా సతోప్రధానముగా శాంతిగా అయిపోతుంది. కానీ పిల్లలు స్మృతి విషయములో ఎంత
కృషి చేయాలో, అంత చేయలేకపోతున్నారు. స్మృతిలో ఉండని కారణముగానే మళ్ళీ మాయ తుఫానులు
వస్తాయి. స్మృతిలో ఉంటూ పూర్తిగా పావనముగా అవ్వకపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది.
పదవి కూడా భ్రష్టమవుతుంది. స్వర్గములోకి అయితే వెళ్తాము కదా అని భావించకూడదు. అరే,
దెబ్బలు తిని పైసకు విలువ చేసే సుఖాన్ని పొందడము, ఇదేమైనా మంచిదా. మనుష్యులు ఉన్నత
పదవిని పొందేందుకు ఎంత పురుషార్థము చేస్తారు. అంతేకానీ ఏది లభిస్తే అదే మంచిది అని
భావించడం కాదు. ఆ మాటకొస్తే పురుషార్థము చేయనివారు ఎవరూ ఉండరు. భిక్షము అడిగే
ఫకీరులు కూడా తమ వద్ద ధనము పోగు చేసుకుంటారు. అందరికీ ధనము యొక్క ఆకలి ఉంటుంది.
ధనముతో ప్రతి విషయములోనూ సుఖము కలుగుతుంది. మనం బాబా నుండి అపారమైన ధనాన్ని
తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. పురుషార్థము తక్కువగా చేస్తే ధనము కూడా తక్కువగా
లభిస్తుంది. తండ్రి ధనము ఇస్తారు కదా. ధనము ఉంటే అమెరికా మొదలైనవి చుట్టి రండి అని
అంటారు. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో మరియు సేవ చేస్తారో అంత సుఖాన్ని
పొందుతారు. తండ్రి ప్రతి విషయములోనూ పురుషార్థము చేయిస్తూ ఉన్నతముగా తయారుచేస్తారు.
పిల్లలు మా కులం పేరును ప్రసిద్ధము చేస్తారు అని భావిస్తారు. పిల్లలైన మీరు కూడా
ఈశ్వరీయ కులం పేరును, తండ్రి పేరును ప్రసిద్ధము చేయాలి. వీరు సత్యమైన తండ్రి,
సత్యమైన టీచర్, సద్గురువు. వీరు ఉన్నతోన్నతుడైన తండ్రి, ఉన్నతోన్నతుడైన సత్యమైన
సద్గురువు కూడా. గురువు ఒక్కరే ఉంటారు, ఇంకొకరు ఉండరని కూడా అర్థం చేయించబడింది.
సర్వుల సద్గతిదాత ఒక్కరే. ఇది కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీరు పారసబుద్ధి కలవారిగా
అవుతున్నారు. పారసపురిలోని పొరసనాథులుగా, రాజా-రాణులుగా అవుతారు. ఇది ఎంత సహజమైన
విషయము. భారత్ స్వర్ణిమయుగముగా ఉండేది. విశ్వములో శాంతి ఎలా ఉండేది అన్నది మీరు ఈ
లక్ష్మీ-నారాయణుల చిత్రము ద్వారా అర్థం చేయించవచ్చు. స్వర్గములో శాంతి ఉండేది,
ఇప్పుడు ఇది నరకము, ఇందులో అశాంతి ఉంది. స్వర్గములో ఈ లక్ష్మీ-నారాయణులు ఉంటారు కదా.
శ్రీకృష్ణుడిని లార్డ్ కృష్ణ అని కూడా అంటారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు అని కూడా
అంటారు. వాస్తవానికి లార్డ్ లు అయితే ఎందరో ఉన్నారు. ఎవరి వద్దనైతే ల్యాండ్ (భూమి)
ఎక్కువగా ఉంటుందో, వారిని ల్యాండ్ లార్డ్ అని అంటారు. శ్రీకృష్ణుడైతే విశ్వము యొక్క
యువరాజుగా ఉండేవారు, ఆ విశ్వములో శాంతి ఉండేది. రాధా-కృష్ణులే లక్ష్మీ-నారాయణులుగా
అవుతారన్నది కూడా ఎవరికీ తెలియదు.
మీ విషయములో మనుష్యులు ఎన్ని విషయాలు చెప్తూ ఉంటారు, ఎన్ని గొడవలు చేస్తూ ఉంటారు.
వీరైతే సోదరీ సోదరులుగా చేస్తారు అని అంటారు. ప్రజాపిత బ్రహ్మా యొక్క ముఖవంశావళి
బ్రాహ్మణులను గురించే బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని అంటారని అర్థం చేయించబడింది. ఆ
బ్రాహ్మణులు కూడా ముఖవంశావళి బ్రాహ్మణులకు నమస్కరిస్తారు ఎందుకంటే వీరు సత్యమైన
సోదరీ-సోదరులు, పవిత్రముగా ఉంటారు. మరి పవిత్రముగా ఉన్నావారికి ఎందుకు గౌరవం ఇవ్వరు!
కన్య పవిత్రముగా ఉంటుంది కావున ఆమె కాళ్ళ పైన కూడా పడతారు. బయటి అతిథులు వస్తే వారు
కూడా కన్యకు నమస్కరిస్తారు. ఈ సమయములో కన్యకు ఇంతటి గౌరవము ఎందుకు ఉంది? ఎందుకంటే
మీరు బ్రహ్మాకుమార-కుమారీలు కదా. మెజారిటీ కన్యలైన మీదే. శివశక్తి, పాండవ సైన్యము
అని అంటూ ఉంటారు. ఇందులో పురుషులు కూడా ఉన్నారు, మెజారిటీ మాతలది, కావుననే మహిమ
చేయబడతారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారు ఉన్నతముగా అవుతారు. ఇప్పుడు మీరు మొత్తం
విశ్వము యొక్క చరిత్ర, భౌగోళికాలను తెలుసుకున్నారు. చక్రము గురించి అర్థం చేయించడం
కూడా చాలా సహజము. భారత్ పారసపురిగా ఉండేది, ఇప్పుడు రాతిపురిగా ఉంది. కావున అందరూ
రాతినాథులే కదా. పిల్లలైన మీకు ఈ 84 జన్మల చక్రము గురించి కూడా తెలుసు. ఇప్పుడు
ఇంటికి వెళ్ళాలి, కావున తండ్రిని కూడా స్మృతి చేయాలి, తద్వారా పాపాలు అంతమవుతాయి.
కానీ పిల్లలు స్మృతి విషయములో ఎంతైతే కృషి చేయాలో అంత చేయలేకపోతున్నారు ఎందుకంటే
నిర్లక్ష్యము ఉంది. ఉదయము లేవరు, లేచినా ఆనందము రాదు. నిద్ర రావడం మొదలవుతుంది, ఇక
పడుకుండిపోతారు. హోప్ లెస్ అయిపోతారు (నిరాశ చెందుతారు). తండ్రి అంటారు - పిల్లలూ,
ఇది యుద్ధ మైదానము కదా, ఇందులో నిరాశ చెందకూడదు. స్మృతి బలముతోనే మాయపై విజయము
పొందాలి, ఇందులో కృషి చేయాలి. చాలా మంచి-మంచి పిల్లలు ఎవరైతే యథార్థ రీతిగా స్మృతి
చేయరో, వారు చార్ట్ పెట్టినట్లయితే లాభ-నష్టాల గురించి తెలిసిపోతుంది. ఈ చార్టు నా
అవస్థను అద్భుతముగా తయారుచేసింది అని అంటారు. ఇలా ఏ ఒక్కరో చార్ట్ పెడతారు. ఇది కూడా
ఎంతో శ్రమతో కూడుకున్నది. చాలా సెంటర్లలో అసత్యమైనవారు కూడా వెళ్ళి కూర్చుంటారు,
వికర్మలు చేస్తూ ఉంటారు. తండ్రి డైరెక్షన్లను అమలుపరచకపోతే చాలా నష్టపోతారు.
నిరాకారుడు చెప్తున్నారా లేక సాకారుడు చెప్తున్నారా అన్నది పిల్లలకు తెలియదు.
ఎల్లప్పుడూ శివబాబాయే డైరెక్షన్లు ఇస్తున్నారు అని భావించండి అని పిల్లలకు పదే-పదే
అర్థం చేయించబడుతుంది. అప్పుడు మీ బుద్ధి అక్కడ జోడించబడి ఉంటుంది.
ఈ రోజుల్లో నిశ్చితార్థము కోసం ఫొటోలు చూపిస్తారు. ఫలానావారి కోసం ఇటువంటి మంచి
కుటుంబమువారు కావాలి అని వార్తాపత్రికల్లో కూడా వేస్తారు. ప్రపంచము ఎటువంటి
పరిస్థితికి చేరుకుంది! ఇంకా ఎలా అవ్వనున్నది! అనేక రకాల అభిప్రాయాలున్నాయని
పిల్లలైన మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీది ఒకే మతము. మీది విశ్వములో శాంతి స్థాపన
చేసే మతము. మీరు శ్రీమతము ద్వారా విశ్వములో శాంతిని స్థాపన చేస్తారు కావున పిల్లలు
కూడా శాంతిలో ఉండవలసి ఉంటుంది. ఎవరు చేస్తారో వారు పొందుతారు, లేదంటే ఎంతో నష్టము
కలుగుతుంది. జన్మ-జన్మాంతరాల కొరకు నష్టము కలుగుతుంది. మీ నష్టాన్ని మరియు లాభాన్ని
చూసుకోండి అని పిల్లలకు చెప్తారు. మేము ఎవరికీ దుఃఖమును ఇవ్వలేదు కదా అని చార్టు
చూసుకోండి. తండ్రి అంటారు, మీ ఈ సమయములో ఒక్కొక్క క్షణము అత్యంత విలువైనది. శిక్షలు
అనుభవించి రొట్టెలు తినడం, అదేమంత పెద్ద విషయము! మీరు చాలా ధనవంతులుగా
అవ్వాలనుకుంటున్నారు కదా. మొట్టమొదట ఎవరైతే పూజ్యులుగా ఉంటారో, వారే పూజారులుగా
అవుతారు. ఎంతో ధనము ఉంది కావుననే సోమనాథ మందిరాన్ని తయారుచేసారు మరియు పూజించారు కదా!
ఇది కూడా లెక్క. చార్ట్ పెట్టినట్లయితే ఎంతో లాభము ఉంటుంది అని పిల్లలకు అర్థం
చేయించడం జరిగింది. నోట్ చేసుకోవాలి. అందరికీ సందేశము ఇస్తూ ఉండండి, మౌనముగా
కూర్చుండిపోకండి. ట్రైన్ లో కూడా మీరు అర్థం చేయించి లిటరేచర్ పంచండి. ఇది కోట్ల
ఆస్తి అని చెప్పండి. భారత్ లో లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు విశ్వములో శాంతి
ఉండేది. ఇప్పుడు తండ్రి మళ్ళీ ఆ రాజధానిని స్థాపన చేయడానికి వచ్చారు. మీరు తండ్రిని
స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు విశ్వములో శాంతి ఏర్పడుతుంది.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మనం విశ్వములో శాంతి స్థాపన చేయడానికి నిమిత్తమైన బ్రాహ్మణులము, మనం చాలా-చాలా
శాంతచిత్తముగా ఉండాలి, చాలా మెల్లగా మరియు రాయల్ గా మాట్లాడాలి.
2. నిర్లక్ష్యాన్ని వదిలి స్మృతి చేసే విషయములో కృషి చేయాలి. ఎప్పుడూ హోప్ లెస్
అవ్వకూడదు (నిరాశ చెందకూడదు).
వరదానము:-
పరీక్ష పేపరు గురించి గాభరా పడేందుకు బదులుగా ఫుల్ స్టాప్
పెట్టి ఫుల్ పాస్ అయ్యే సఫలతామూర్త భవ
ఎప్పుడైనా ఏదైనా పరీక్ష వచ్చినట్లయితే గాభరా పడకండి. ఇది
ఎందుకు వచ్చింది అని ప్రశ్నార్థకములోకి రాకండి. ఇలా ఆలోచించడములో సమయాన్ని వ్యర్థము
చెయ్యకండి. ప్రశ్నార్థకాన్ని సమాప్తము చెయ్యండి, ఫుల్ స్టాప్ పెట్టండి, అప్పుడే
క్లాసు మారుతుంది అనగా పరీక్ష పేపరులో పాస్ అవుతారు. ఫుల్ స్టాప్ పెట్టేవారు ఫుల్
పాస్ అవుతారు ఎందుకంటే ఫుల్ స్టాప్ అనేది బిందు స్థితి. చూస్తూ కూడా చూడకండి, వింటూ
కూడా వినకండి. తండ్రి వినిపించినదే వినండి, తండ్రి వేటినైతే ఇచ్చారో వాటినే చూడండి,
అప్పుడు ఫుల్ పాస్ అయిపోతారు మరియు పాస్ అయినదానికి గుర్తు ఏమిటంటే - సదా ఎక్కే కళను
అనుభవము చేస్తూ సఫలతా సితారలుగా అయిపోతారు.
స్లోగన్:-
స్వ
ఉన్నతిని చేసుకోవాలంటే క్వశ్చన్, కరెక్షన్ మరియు కొటేషన్ ను త్యాగము చేసి మీ
కనెక్షన్ ను సరిగ్గా ఉంచుకోండి.
అవ్యక్త సూచనలు -
సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి
అంతిమ సమయములో మీ
రక్షణ కొరకు మనసా శక్తియే సాధనముగా అవుతుంది. మనసా శక్తి ద్వారానే స్వయము యొక్క
అంతిమమును మనోహరముగా తయారుచేసుకునేందుకు నిమిత్తముగా అవ్వగలరు. ఆ సమయములో మనసా శక్తి
అనగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి, ఒక్కరితోనే లైన్ క్లియర్ గా ఉండాలి. అనంతమైన సేవ కొరకు,
స్వ రక్షణ కొరకు మనసా శక్తిని మరియు నిర్భయతా శక్తిని జమ చేసుకోండి.
| | |