28-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇది తికమక దారుల ఆట, మీరు పదే-పదే తండ్రిని మర్చిపోతారు, నిశ్చయబుద్ధి కలవారిగా అయినట్లయితే ఈ ఆటలో చిక్కుకోరు’’

ప్రశ్న:-
వినాశన సమయాన్ని చూస్తూ ఉండగా పిల్లలైన మీ కర్తవ్యమేమిటి?

జవాబు:-
మీ కర్తవ్యము - మీ చదువులో మంచి రీతిలో నిమగ్నమవ్వడము, ఇతర విషయాలలోకి వెళ్ళకూడదు. తండ్రి మిమ్మల్ని నయనాలపై కూర్చోబెట్టుకుని, కంఠహారముగా చేసుకుని తమతోపాటు తీసుకువెళ్తారు. మిగిలినవారందరూ అయితే తమ-తమ లెక్కాచారాలను సమాప్తము చేసుకుని వెళ్ళాల్సిందే. తండ్రి అందరినీ తమతోపాటు ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారు.

పాట:-
దూరదేశ నివాసి...

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ముఖ్యముగా భారత్ మరియు మిగిలిన ప్రపంచము, అందరూ విశ్వములో శాంతిని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇదైతే అర్థం చేసుకోవాలి - తప్పకుండా విశ్వానికి యజమాని అయినవారు మాత్రమే విశ్వములో శాంతిని స్థాపన చేస్తారు. మీరు వచ్చి విశ్వములో శాంతిని వ్యాపింపజేయండి అని గాడ్ ఫాదర్ నే పిలవాలి. ఎవరిని పిలవాలో కూడా పాపం వారికి తెలియదు. ఇది మొత్తము విశ్వానికి సంబంధించిన విషయము కదా. మొత్తము విశ్వములో శాంతిని కోరుకుంటారు. ఇప్పుడు శాంతి యొక్క ధామమైతే వేరుగా ఉంది, అక్కడ తండ్రి మరియు ఆత్మలైన మీరు ఉంటారు. ఇది కూడా అనంతమైన తండ్రే అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ ప్రపంచములోనైతే అనేకానేక మంది మనుష్యులు ఉన్నారు, అనేక ధర్మాలు ఉన్నాయి. ఏక ధర్మముగా అయినట్లయితే శాంతి ఏర్పడుతుందని అంటారు. కానీ అన్ని ధర్మాలు కలిసి ఒక్కటిగా అవ్వలేవు. త్రిమూర్తుల మహిమ కూడా ఉంది. త్రిమూర్తుల చిత్రాన్ని చాలామంది పెట్టుకుంటారు. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుందని కూడా తెలుసు. దేని స్థాపన? కేవలం శాంతి స్థాపన మాత్రమే జరగదు, శాంతి మరియు సుఖము యొక్క స్థాపన జరుగుతుంది. ఈ భారత్ లోనే 5 వేల సంవత్సరాల క్రితము వీరి రాజ్యము ఉన్నప్పుడు తప్పకుండా మిగతా జీవాత్మలందరూ, జీవమును (శరీరమును) వదిలి తమ ఇంటికి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు ఒకే ధర్మమును, ఒకే రాజ్యమును, ఒకే భాషను కోరుకుంటున్నారు. తండ్రి శాంతి, సుఖము, సంపదల స్థాపన చేస్తున్నారని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఒకే రాజ్యము అనేది కూడా తప్పకుండా ఇక్కడే ఉంటుంది కదా. ఒకే రాజ్యము యొక్క స్థాపన జరుగుతుంది - ఇది కొత్త విషయమేమీ కాదు. అనేక సార్లు ఒకే రాజ్యము స్థాపనయ్యింది. ఆ తర్వాత అనేక ధర్మాల వృద్ధి జరుగుతూ-జరుగుతూ వృక్షము పెద్దదైపోతుంది, మళ్ళీ తండ్రి రావలసి ఉంటుంది. ఆత్మయే వింటుంది, చదువుతుంది, ఆత్మలోనే సంస్కారాలు ఉన్నాయి. ఆత్మలమైన మనము భిన్న-భిన్న శరీరాలను ధారణ చేస్తాము. పిల్లలకు ఈ నిశ్చయబుద్ధి కలిగేందుకు కూడా చాలా శ్రమ కలుగుతుంది. బాబా, పదే-పదే మర్చిపోతున్నాము అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది తికమక దారుల ఆట. ఇందులో మీరు చిక్కుకున్నట్టు అయిపోయారు, మీరు మీ ఇంటికి మరియు రాజధానికి ఎలా వెళ్ళవచ్చు అనేది తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఆత్మ ఎంత రాతి బుద్ధి కలదిగా అయిపోతుంది. రాతిబుద్ధి మరియు పారసబుద్ధి గురించి భారత్ లోనే గాయనము ఉంది. రాతిబుద్ధి గల రాజులు మరియు పారసబుద్ధి గల రాజులు ఇక్కడే ఉన్నారు. పారసనాథుని మందిరము కూడా ఉంది. ఆత్మలమైన మనము పాత్రను అభినయించేందుకు ఎక్కడి నుండి వచ్చాము అనేది ఇప్పుడు మీకు తెలుసు, ఇంతకుముందు ఏమీ తెలియదు. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. ఈ ప్రపంచమంతా ముళ్ళ అడవే. పుష్పాలతోటకు నిప్పు అంటుకుందని ఎప్పుడూ విని ఉండరు. ఎప్పుడూ అడవికే నిప్పు అంటుకుంటుంది. ఇది కూడా అడవే, దీనికి తప్పకుండా నిప్పు అంటుకోనున్నది. అడవికి నిప్పు అంటుకోనున్నది. ఈ మొత్తం ప్రపంచాన్నే అడవి అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు. మీరు సమ్ముఖములో కూర్చొని ఉన్నారు. మీతోనే కూర్చొంటాను... అని పాడేవారు కదా, అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. భగవానువాచ ఉంది, కావున తప్పకుండా చదువుకుంటారు కదా. భగవానువాచ పిల్లలను ఉద్దేశ్యించే ఉంటుంది కదా. భగవంతుడు చదివిస్తారని మీకు తెలుసు. భగవంతుడు ఎవరు? నిరాకార శివుడినే భగవంతుడు అని అంటారు. భగవంతుడైన శివుని పూజ కూడా ఇక్కడే జరుగుతుంది. సత్యయుగములో పూజ మొదలైనవి జరగవు. అక్కడ స్మృతి కూడా చేయరు. భక్తులకు సత్యయుగ రాజధాని అనే ఫలము లభిస్తుంది. మేము అందరికంటే ఎక్కువ భక్తి చేసాము కావున మేమే మొట్టమొదట తండ్రి వద్దకు వచ్చాము, మళ్ళీ మేమే రాజధానిలోకి వస్తాము అని మీరు భావిస్తారు. కొత్త ప్రపంచములో ఉన్నతమైన పదవిని పొందేందుకు పిల్లలు పూర్తి పురుషార్థము చేయాలి. ఇప్పుడు మేము త్వరగా కొత్త ఇంటిలోకి వెళ్ళాలని పిల్లలకు మనసు కలుగుతుంది. ప్రారంభములోనే కొత్త ఇల్లు ఉంటుంది, ఆ తర్వాత పాతదిగా అవుతూ ఉంటుంది. ఇంటిలో పిల్లల వృద్ధి జరుగుతూ ఉంటుంది. కొడుకు, మనవలు, ముని మనవలు, వారంతా పాత ఇంటికి వస్తారు కదా, వచ్చినప్పుడు, ఇది మా తాత, ముత్తాతల ఇల్లు అని అంటారు. అలా వెనుక వచ్చేవారు కూడా చాలామంది ఉంటారు కదా. ఎంత తీవ్రముగా పురుషార్థము చేస్తారో, అంత ముందుగా కొత్త ఇంటిలోకి వస్తారు. పురుషార్థము యొక్క యుక్తిని తండ్రి చాలా సహజముగా అర్థం చేయిస్తారు. భక్తిలో కూడా పురుషార్థము చేస్తారు కదా. చాలా భక్తి చేసేవారి పేరు ప్రసిద్ధి చెందుతుంది. ఎంతోమంది భక్తుల స్టాంపులు కూడా తయారుచేస్తారు. జ్ఞాన మాల గురించైతే ఎవ్వరికీ తెలియదు. మొదట జ్ఞానము, ఆ తర్వాత భక్తి. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అర్ధ సమయము అనగా సత్య, త్రేతాయుగాలు జ్ఞానము. ఇప్పుడు పిల్లలైన మీరు నాలెడ్జ్ ఫుల్ గా అవుతూ ఉంటారు. టీచర్ సదా పూర్తి జ్ఞానము కలవారిగా ఉంటారు. విద్యార్థులు మార్కులను నంబరువారుగా పొందుతారు. వీరు అనంతమైన టీచర్, మీరు అనంతమైన విద్యార్థులు, విద్యార్థులైతే నంబరువారుగానే పాస్ అవుతారు. కల్పక్రితము ఎలా పాస్ అయ్యారో, అలానే అవుతారు. మీరే 84 జన్మలను తీసుకున్నారని తండ్రి అర్థం చేయిస్తారు. 84 జన్మలలో 84 మంది టీచర్లు ఉంటారు. పునర్జన్మలైతే తప్పకుండా తీసుకోవలసిందే. మొదట తప్పకుండా సతోప్రధాన ప్రపంచము ఉంటుంది, ఆ తర్వాత పాత తమోప్రధాన ప్రపంచము ఉంటుంది. మనుష్యులు కూడా తమోప్రధానముగానే ఉంటారు కదా. వృక్షము కూడా మొదట కొత్తదిగా, సతోప్రధానముగా ఉంటుంది. కొత్త ఆకులు చాలా బాగుంటాయి. ఇది అనంతమైన వృక్షము. అనేక ధర్మాలు ఉన్నాయి. మీ బుద్ధి ఇప్పుడు అనంతము వైపుకు వెళ్తుంది. ఇది ఎంత పెద్ద వృక్షము. మొట్టమొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉంటుంది. ఆ తర్వాత వెరైటీ ధర్మాలు వస్తాయి. మీరే 84 వెరైటీ జన్మలు తీసుకున్నారు. అవి కూడా అవినాశీ అయినవి. కల్ప-కల్పము మనము 84 జన్మల చక్రములో తిరుగుతూ ఉంటామని మీకు తెలుసు. 84 జన్మల చక్రములోకి మనమే వస్తాము. ఏ మనుష్యాత్మ కూడా 84 లక్షల జన్మలు తీసుకోదు. ఎన్నో వెరైటీల జంతువులు మొదలైనవి చాలా ఉంటాయి, వాటి జన్మలను ఎవ్వరూ లెక్కించలేరు. మనుష్యాత్మ 84 జన్మలను తీసుకుంది కావున ఈ పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ పూర్తిగా అలసిపోయినట్లు అయిపోయారు. దుఃఖితులుగా అయిపోయారు. మెట్లు దిగుతూ సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయిపోయారు. తండ్రి మళ్ళీ తమోప్రధానము నుండి సతోప్రధానముగా తయారుచేస్తారు. తండ్రి అంటారు, నేను తమోప్రధాన శరీరములోకి, తమోప్రధాన ప్రపంచములోకి వచ్చాను. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా తమోప్రధానముగా ఉంది. మొత్తము విశ్వములో శాంతి ఎలా ఏర్పడుతుంది అని మనుష్యులు అంటారు. విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేదో అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, మీ ఇంటిలోనైతే ఈ చిత్రాలను పెట్టుకున్నారు కదా. వీరి రాజ్యము ఉన్నప్పుడు, మొత్తం విశ్వములో శాంతి ఉండేది, దానిని స్వర్గము అని అంటారు. కొత్త ప్రపంచమునే హెవెన్, గోల్డెన్ ఏజ్ అని అంటారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తన అవ్వనున్నది. ఆ రాజధాని స్థాపనవుతూ ఉంది. విశ్వములో రాజ్యమైతే వీరిదే ఉండేది. లక్ష్మీ-నారాయణుల మందిరాలకు చాలామంది మనుష్యులు వెళ్తారు. వీరే భారత్ కు యజమానులుగా ఉండేవారని, వీరి రాజ్యములో తప్పకుండా సుఖ-శాంతులు ఉండేవని ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము - అప్పుడు వీరి రాజ్యము ఉండేది. అర్ధకల్పము తర్వాత దానిని పాత ప్రపంచమని అంటారు, అందుకే వ్యాపారస్థులు తమ ఖాతా పుస్తకాలపై స్వస్తిక్ గుర్తును పెట్టుకుంటారు. దీనికి కూడా అర్థముంది కదా. వారు దానిని గణేశ్ అని అంటారు. గణేశుడిని విఘ్న-వినాశక దేవతగా భావిస్తారు. స్వస్తిక్ లో పూర్తిగా నాలుగు సమ భాగాలు ఉంటాయి. ఇదంతా భక్తి మార్గము. ఇప్పుడు దీపావళిని జరుపుకుంటారు, వాస్తవానికి సత్యాతి-సత్యమైన దీపావళి స్మృతియాత్రయే, దీని ద్వారా ఆత్మ జ్యోతి 21 జన్మల కొరకు వెలుగుతుంది. చాలా సంపాదన జరుగుతుంది. పిల్లలైన మీకు చాలా సంతోషము కలగాలి. ఇప్పుడు కొత్త ప్రపంచము కొరకు మీ కొత్త ఖాతా ప్రారంభమవుతుంది. 21 జన్మల కొరకు ఖాతాను ఇప్పుడు జమా చేసుకోవాలి. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావిస్తూ వింటున్నారు కదా. ఆత్మగా భావిస్తూ విన్నట్లయితే సంతోషము కూడా కలుగుతుంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది భగవానువాచ కూడా కదా. భగవంతుడు అయితే ఒక్కరే. తప్పకుండా వారు వచ్చి శరీరము తీసుకొని ఉంటారు, అందుకే భగవానువాచ అని అనడము జరుగుతుంది. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. అందుకే మాకు తెలియదు-తెలియదు అని అంటూ వచ్చారు. వారే పరమపిత పరమాత్మ అని కూడా అంటారు, మళ్ళీ మాకేమీ తెలియదని అంటారు. శివబాబా అని కూడా అంటారు, బ్రహ్మాను కూడా బాబా (తండ్రి) అని అంటారు. విష్ణువును ఎప్పుడూ తండ్రి అని అనరు. ప్రజాపిత అంటే తండ్రియే కదా. మీరు బి.కె.లు. ప్రజాపిత అన్న పేరు లేకపోతే అర్థం చేసుకోరు. ఇంతమంది బి.కె.లు ఉన్నారంటే తప్పకుండా ప్రజాపితయే ఉంటారు, అందుకే ప్రజాపిత అన్న పదాన్ని తప్పకుండా వ్రాయండి. అప్పుడు ప్రజాపిత మా తండ్రే అని భావిస్తారు. కొత్త సృష్టి తప్పకుండా ప్రజాపిత ద్వారానే రచించబడుతుంది. ఆత్మలమైన మనము పరస్పరము సోదరులము, ఆ తర్వాత శరీరాన్ని ధరించి సోదరీ-సోదరులుగా అవుతాము. తండ్రి యొక్క పిల్లలుగా మనము అవినాశీ, ఆ తర్వాత సాకారములో మనము సోదరీ-సోదరులము. కావున వారి పేరు ప్రజాపిత బ్రహ్మా. కానీ మనము బ్రహ్మాను స్మృతి చేయము. లౌకిక తండ్రిని మరియు పారలౌకిక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. ప్రజాపిత బ్రహ్మాను ఎవ్వరూ స్మృతి చేయరు. దుఃఖములో తండ్రిని స్మరిస్తారు, బ్రహ్మాను కాదు. ఓ భగవంతుడా అని అంటారు. ఓ బ్రహ్మా అని అనరు. సుఖములో ఎవ్వరినీ స్మృతి చేయరు. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ సమయములో ముగ్గురు తండ్రులు ఉన్నారని మీకు తెలుసు. భక్తి మార్గములో లౌకిక మరియు పారలౌకిక తండ్రులను స్మృతి చేస్తారు. సత్యయుగములో కేవలం లౌకిక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. సంగమయుగములో ముగ్గురినీ స్మృతి చేస్తారు. లౌకిక తండ్రి కూడా ఉన్నారు కానీ వారు హద్దు తండ్రి అని తెలుసు. వారి నుండి హద్దు వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించారు, వారి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలైన మనకు అనంతమైన సుఖాన్ని ఇచ్చేందుకు బ్రహ్మా తనువులోకి వచ్చారు. వారికి చెందినవారిగా అవ్వడము వలన మనము అనంతమైన వారసత్వాన్ని పొందుతాము. ఇక్కడ మీకు బ్రహ్మా ద్వారా తాతగారి వారసత్వము లభిస్తున్నట్లు. వారంటున్నారు, వారసత్వాన్ని మీకు నేను ఇస్తాను. మిమ్మల్ని నేను చదివిస్తాను. జ్ఞానము నా వద్ద ఉంది, ఇకపోతే జ్ఞానము మనుష్యులలోనూ లేదు, దేవతలలోనూ లేదు. జ్ఞానము నాలో ఉంది. దానిని నేను పిల్లలైన మీకు ఇస్తాను. ఇది ఆత్మిక జ్ఞానము.

ఆత్మిక తండ్రి ద్వారా మనకు ఈ పదవి లభిస్తుందని మీకు తెలుసు. ఈ విధముగా విచార సాగర మంథనము చేయాలి. మనసును జయించిన వారిదే విజయము, మనసుతో ఓడిపోయినవారిది ఓటమి... అని గాయనముంది. వాస్తవానికి మాయపై విజయము అని అనాలి ఎందుకంటే మనసుపై విజయము పొందడము అనేది జరగదు. మనసుకు శాంతి ఎలా కలుగుతుంది అని మనుష్యులు అంటారు. తండ్రి అంటారు, మనసుకు శాంతి కావాలి అని ఆత్మ ఎలా అడుగుతుంది. వాస్తవానికి ఆత్మ శాంతిధామములో నివసించేటటువంటిది. ఆత్మ ఎప్పుడైతే శరీరములోకి వస్తుందో, అప్పుడు కర్మలు చేయడము ప్రారంభిస్తుంది. తండ్రి అంటారు, మీరు ఇప్పుడు స్వధర్మములో స్థితులవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ స్వధర్మము శాంతి, కావున శాంతిని ఎక్కడ వెతుకుతారు. దీని గురించే రాణి హారము యొక్క ఉదాహరణ కూడా ఉంది. సన్యాసులు ఈ ఉదాహరణను వినిపిస్తారు, మళ్ళీ స్వయము అడవులలోకి వెళ్ళి శాంతిని వెతుక్కుంటారు. తండ్రి అంటారు, ఆత్మ అయిన మీ ధర్మమే శాంతి. శాంతిధామము మీ ఇల్లు, అక్కడ నుండి పాత్రను అభినయించడానికి మీరు వస్తారు. శరీరము ద్వారా మళ్ళీ కర్మలు చేయాల్సి ఉంటుంది. శరీరము నుండి వేరైనప్పుడు పూర్తి నిశ్శబ్దత ఏర్పడుతుంది. ఆత్మ వెళ్ళి మరొక శరీరము తీసుకుంది, ఇక చింత ఎందుకు చేయాలి. ఆత్మ అయితే తిరిగి రాదు. కానీ మోహము సతాయిస్తుంది. అక్కడ మిమ్మల్ని మోహము సతాయించదు. అక్కడ 5 వికారాలు ఉండవు. రావణ రాజ్యమే ఉండదు. అది రామ రాజ్యము. సదా రావణ రాజ్యమే ఉంటే మనుష్యులు అలసిపోతారు. ఎప్పుడూ సుఖాన్ని చూడలేరు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు మరియు త్రికాలదర్శులుగా కూడా అయ్యారు. మనుష్యులకు తండ్రి గురించి తెలియదు కావున వారిని నాస్తికులు అని అంటారు.

ఈ శాస్త్రాలు మొదలైనవి ఏవైతే గతించిపోయాయో, ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గములో ఉన్నారు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎంత ప్రేమగా నయనాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తారు. కంఠహారముగా చేసుకుని అందరినీ తీసుకువెళ్తాను. అందరూ పిలుస్తారు కూడా. ఎవరైతే కామ చితిపై కూర్చుని నల్లగా అయిపోయారో, వారిని జ్ఞాన చితిపై కూర్చోబెట్టి, లెక్కాచారాలను సమాప్తము చేయించి తిరిగి తీసుకువెళ్తారు. ఇప్పుడు మీ పని చదువుకోవడము, ఇతర విషయాలలోకి ఎందుకు వెళ్ళాలి. ఎలా మరణిస్తారు, ఏమవుతుంది... ఈ విషయాలలోకి మనమెందుకు వెళ్ళాలి. ఇది వినాశన సమయము. అందరూ లెక్కాచారాలను సమాప్తము చేసుకుని తిరిగి వెళ్ళిపోతారు. ఈ అనంతమైన డ్రామా రహస్యము పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, ఇతరులెవ్వరికీ తెలియదు. మేము బాబా వద్దకు అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు కల్ప-కల్పము వస్తామని పిల్లలైన మీకు తెలుసు. మనము జీవాత్మలము. బాబా కూడా దేహములోకి వచ్చి ప్రవేశించారు. తండ్రి అంటారు, నేను సాధారణ తనువులోకి వస్తాను, నీకు నీ జన్మల గురించి తెలియదని కూర్చుని ఇతనికి కూడా అర్థం చేయిస్తాను. పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి, తండ్రిని స్మృతి చేయండి - ఇంకెవ్వరూ ఈ విధముగా చెప్పలేరు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతియాత్రలో ఉంటూ సత్యాతి-సత్యమైన దీపావళిని ప్రతిరోజూ జరుపుకోవాలి. తమ కొత్త ఖాతాను 21 జన్మల కొరకు జమ చేసుకోవాలి.

2. డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుని చదువు తప్ప ఇతర ఏ విషయాలలోకి వెళ్ళకూడదు. లెక్కాచారాలన్నింటినీ సమాప్తము చేసుకోవాలి.

వరదానము:-
ఆత్మికత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ ను సమాప్తము చేసుకునే సంతోషపు ఖజానాలతో సంపన్న భవ

ఆత్మికత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ ను సమాప్తము చేయండి, లేదంటే ఇతరుల అవగుణాలను వర్ణన చేస్తూ ఆ రోగాలకు సంబంధించిన క్రిములను వాయుమండలములో వ్యాపింపజేస్తూ ఉంటారు, దీని ద్వారా వాతావరణము శక్తిశాలిగా అవ్వదు. మీ వద్దకు అనేక భావాలతో అనేక ఆత్మలు వస్తారు కానీ మీ వైపు నుండి శుభ భావన యొక్క విషయాలనే వారు తీసుకువెళ్ళాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే - స్వయం వద్ద సంతోషపు విషయాల స్టాక్ జమ అయి ఉన్నప్పుడు. ఒకవేళ హృదయములో ఎవరి పట్లనైనా ఏవైనా వ్యర్థమైన విషయాలు ఉన్నట్లయితే, ఎక్కడైతే విషయాలు ఉంటాయో అక్కడ తండ్రి ఉండరు, పాపము ఉంటుంది.

స్లోగన్:-
స్మృతి రూపీ స్విచ్ ఆన్ అయి ఉన్నట్లయితే మూడ్ ఆఫ్ అవ్వలేదు.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

ఎవరు ఎంత బిజీగా ఉంటే, అంతగానే వారు మధ్యమధ్యలో ఈ అభ్యాసము చెయ్యటము తప్పనిసరి, తద్వారా సేవలో అప్పుడప్పుడు ఏదైతే అలసట కలుగుతుందో, పరస్పరములో ఏదైతే ఏదో ఒక అలజడి కలుగుతూ ఉంటుందో, అది జరగదు. ఒక్క సెకండులో అతీతముగా అయ్యే అభ్యాసము ఉన్నట్లయితే ఏదైనా విషయము జరిగినా కానీ ఒక్క సెకండులో తమ అభ్యాసముతో ఈ విషయాల నుండి దూరమైపోతారు. అనుకున్నారు, జరిగిపోయింది అన్నట్లుగా ఉంటుంది. యుద్ధము చేయవలసిన అవసరముండదు.