29-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 25.10.2009


‘‘సర్వ ఖజానాలతో సంపన్నముగా ఉన్న మీ ముఖము మరియు నడవడికతో అలౌకికతను సాక్షాత్కారము చేయించండి’’

ఈ రోజు సర్వ ఖజానాల దాత ఖజానాలకు యజమానులైన తమ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సర్వ ఖజానాలతో సంపన్నముగా ఉన్నారు, ఎందుకంటే బాబా పిల్లలందరికీ ఒకే విధముగా, ఒకే సమయములో సర్వ ఖజానాలను ఇచ్చారు. బాప్ దాదా తమ బాలక్ సో మాలిక్ (బాలకుల నుండి యజమానులుగా అయ్యే) పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. పిల్లలు పిలిచారు కావున బాబా తమ పిల్లల స్నేహములో చేరుకున్నారు. ఖజానాలైతే చాలా ఉన్నాయి. అన్నింటికన్నా మొదటి ఖజానా జ్ఞాన ధనము, ఈ జ్ఞాన ధనముతో సుసంపన్నులుగా అయిపోయారు, మహాదానులుగా అయి ఇతరులకు కూడా పంచుతూ ఉంటారు. ఈ జ్ఞాన ఖజానా ద్వారా రకరకాల బంధనాలలో చిక్కుకుని ఉన్న ఆత్మ ఆ బంధనాలన్నిటి నుండి విముక్తి అయిపోయింది. బంధనయుక్తుల నుండి బంధనముక్తులుగా అయిపోయారు. దీనితోపాటు యోగము అనగా స్మృతి యొక్క ఖజానా, దీని ద్వారా అనేక శక్తులను ప్రాప్తి చేసుకున్నారు. అలాగే ధారణ ద్వారా సర్వ గుణాల అనుభూతి అనగా ఖజానా లభించింది. ధారణ శక్తితో పాటు సర్వుల స్నేహ శక్తి, సర్వులకు ప్రియముగా మరియు అతీతముగా ఉండే శక్తి యొక్క ఖజానాను ప్రాప్తి చేసుకున్నారు, సర్వుల స్నేహము అనే ఖజానాను అనుభవము చేసారు. అంతేకాక సర్వ బ్రాహ్మణుల సంబంధము ద్వారా అపారమైన సంతోషము యొక్క ఖజానాను అనుభవము చేసారు. కానీ సర్వ ఖజానాలతో పాటు విశేషమైన ఖజానా ఏమిటంటే, సంగమ సమయము యొక్క ఖజానా. ఏ ఆత్మకైతే సమయపు ఖజానా పట్ల మహత్వము ఉంటుందో ఆ ఆత్మ సదా అనేక ప్రాప్తులకు యజమానిగా అవుతుంది ఎందుకంటే సంగమయుగ సమయము చాలా చిన్ననిది కానీ ఈ సమయములో లభించే ప్రాప్తులు ఎక్కువ. అన్నింటికన్నా ఎక్కువగా సంగమయుగపు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన ప్రాప్తి ఏమిటంటే - స్వయంగా భగవంతుడు తండ్రి రూపములో, శిక్షకుని రూపములో, సద్గురువు రూపములో ప్రాప్తిస్తారు. సంగమయుగములో ఈ చిన్నని జన్మలో 21 జన్మల ప్రాప్తి, అందులో తనువు, మనసు, ధనము, జనము సర్వ ప్రాప్తులు ఉన్నాయి మరియు 21 జన్మలు ఫుల్ గ్యారంటీ, సగము కాదు, ముప్పావు కాదు, పూర్తి 21 జన్మల గ్యారంటీ ఉంటుంది. కావున అన్నింటికన్నా ఎక్కువ మహత్వము ఉన్నది సంగమయుగ సమయానికి, ఒక్కొక్క క్షణము అనేక సంవత్సరాలతో సమానము. మరి చెప్పండి, సర్వ ఖజానాలతో సంపన్నముగా ఉన్నారు కదా? సంపన్నముగా ఉన్నారా? అందుకే బాప్ దాదా సదా సమయము గురించి స్మృతిని ఇప్పిస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు - ఒకటి-రెండు నిమిషాలు ఒకవేళ వేరే ఏదైనా ఆలోచిస్తే రెండు నిమిషాలే కదా అని అనుకుంటారు. కానీ ఈ సమయానికి ఉన్న మహత్వము అనుసారముగా అది 2 నిమిషాలు కాదు, 2 నెలలు కూడా కాదు, 2 సంవత్సరాలతో సమానము. సంగమ సమయానికి అంతటి మహత్వము ఉంది. సర్వ శక్తులు, సర్వ గుణాలు, పరమాత్మ ప్రేమ, బ్రాహ్మణ పరివారపు ప్రేమ మరియు కల్పక్రితము యొక్క ఈశ్వరీయ హక్కు, ఈ సర్వ ప్రాప్తులు ఈ చిన్నని యుగములోనే ఉన్నాయి, మరే యుగములోనూ ఈ సర్వ ప్రాప్తులు లేవు. రాజ్య భాగ్యము ఉంటుంది, మీ అందరి రాజ్యము ఉంటుంది, సుఖ-శాంతులు అన్నీ ఉంటాయి, కానీ పరమాత్మ మిలనము, అతీంద్రియ సుఖము, సర్వ బ్రాహ్మణ పరివారము యొక్క ప్రేమ, ఆది మధ్యాంతాల జ్ఞానము, వీటన్నింటి భాగ్యము ఇప్పుడు సంగమములోనే లభించింది, ప్రతి కల్పము లభిస్తూ ఉంటుంది.

బాప్ దాదా ప్రతి బిడ్డ ముఖము ద్వారా ఖజానాలు ఎంత జమ అయి ఉన్నాయి అన్నది చూస్తుంటారు. ఖజానాలైతే లభించాయి కానీ ప్రతి ఒక్కరూ జమ ఖాతాను ఎంత పెంచుకున్నారు, అది ప్రతి ఒక్కరి ముఖము ద్వారా మరియు నడవడిక ద్వారా కనిపిస్తుంది మరియు మీ అందరికీ కూడా - నేను ఎంత జమ చేసుకున్నాను అన్నది మీది మీకు తెలుసు! ఇప్పుడు బాప్ దాదా హృదయములో ఇదే ఆశ ఉంది, అదేమిటంటే - ఖజానాలైతే లభించాయి, కానీ ఇప్పుడు ఇది కేవలం వర్ణించే సమయము కాదు, కానీ మీ ముఖము మరియు నడవడిక ద్వారా వీరు విశేషమైన ఆత్మలు, అతీతమైనవారు మరియు పరమాత్మునికి ప్రియమైనవారు అన్నది ప్రత్యక్షముగా అనుభవము చేయించాలి, ఎందుకంటే మున్ముందు సమయము పరివర్తన అయినప్పుడు మీ సేవ కేవలం వర్ణన చేయడము ద్వారా కాదు, సమయము నాజూకు అయినప్పుడు అంత సమయాన్ని ఎవ్వరూ కేటాయించలేకపోతారు. ఆ సమయములో ఖజానాలతో సంపన్నముగా ఉన్న మీ ముఖము ద్వారా మరియు నడవడిక ద్వారా మీలోని అలౌకికత దూరము నుండే సాక్షాత్కారమవుతుంది. ఇప్పుడు మీరు మీ ఇటువంటి పురుషార్థాన్ని ప్రత్యక్షము చేయండి. బ్రహ్మాబాబాను చూసారు కదా, సంగఠన మధ్యలో ఉన్నా కానీ దూరము నుండే ఆ వ్యక్తిత్వము, మెరుపు అనుభవమయ్యాయి. అలా ఇప్పుడు డబుల్ విదేశీయులు విశేషముగా డబుల్ పురుషార్థము చేయండి. బాప్ దాదా వీరిని డబుల్ పురుషార్థీ అని అంటారు, బాప్ దాదా ఈ రోజు నిమిత్తమైన డబుల్ విదేశీయులను చూసి సంతోషిస్తున్నారు. వృద్ధి కోసం పురుషార్థాన్ని బాగా చేస్తున్నారు. నిమిత్తమైన ఆత్మల ద్వారా పాలన కూడా అందరికీ చాలా బాగా లభిస్తూ ఉంది మరియు బాప్ దాదాకు డబుల్ విదేశీయులందరిలోని ఒక విషయము చాలా బాగా అనిపిస్తుంది, అదేమిటంటే, ప్రతి సంవత్సరము మీరందరూ సంగఠనలో ఒకరినొకరు కలుసుకునేందుకు విశేషముగా మధుబన్ కు వస్తారు ఎందుకంటే మధుబన్ యొక్క వాయుమండలము రిఫ్రెష్మెంట్ కోసం చాలా సహయోగమిస్తుంది మరియు ఇక్కడైతే ఒకటే బాధ్యత ఉంటుంది, అదేమిటంటే - స్వ పరివర్తన కోసం, మనసా సేవ కోసం, అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడం కోసం కూడా మంచి అవకాశము లభిస్తుంది. బాప్ దాదా ఇందుకు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇప్పుడు మీ-మీ స్థానాలకు వెళ్ళి ఏదైనా అద్భుతము చేసి చూపించండి. బాబాకు ఇష్టమనిపించే ఏదైనా ప్రత్యేకమైన అనుభవాన్ని ప్రాక్టికల్ గా అనుభవము చేయించండి, దీని ద్వారా మధుబన్ లో లభించే రిఫ్రెష్మెంట్ ను అక్కడ కూడా అనుభవము చేస్తూ ఉంటారు. ఈ రోజు విశేషముగా డబుల్ పురుషార్థీ గ్రూప్ యొక్క మిలనము ఉంది మరియు చూడండి, మీ అందరి పట్ల ఇండియాలోని పిల్లలకు ఎంత ప్రేమ అంటే వారు మొదటి ఛాన్స్ మీకే ఇస్తారు. కావున మొదటి ఛాన్స్ లభించినందుకు ప్రతిఫలముగా మొదటి నంబరును తీసుకోవాలి. బాగా అనిపిస్తుంది. బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, డబుల్ విదేశీయులు లేక డబుల్ పురుషార్థీ పిల్లలు బాబా యొక్క ఒక విశేషమైన టైటిల్ ను ప్రత్యక్షము చేసారు. విదేశాలలోని మెజారిటీ ప్రదేశాల నుండి బాబా పిల్లలను వెలికితీసి వారి అదృష్టము యొక్క చిత్రాన్ని కూడా తయారుచేసారు. అందుకే తపనతో ఏదైతే నలువైపులా కృషి చేస్తున్నారో, దాని ద్వారా బాబా యొక్క విశ్వ కళ్యాణకారి కర్తవ్యాన్ని ప్రసిద్ధము చేసారు, అందుకే బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ - వాహ్ పిల్లలూ వాహ్ అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎలా అయితే భారత్ లో మూలమూలలలో సందేశాన్ని అందించే సేవ జరుగుతూ ఉంటుందో, అలా అక్కడ కూడా మిగిలి ఉన్న దేశాలలో సందేశాన్ని ఇవ్వాలి అన్న ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి ఎందుకంటే సమయముపై ఎటువంటి భరోసా లేదు. అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు అని బాప్ దాదా ముందు నుండే చెప్పి ఉన్నారు. అందుకే సందేశాన్ని ఇచ్చే విషయములో మరియు తమ ఉన్నతికి సంబంధించిన విషయములో ‘ఇప్పుడిప్పుడే’ అని అనండి, ‘అప్పుడప్పుడు’ అని అనవద్దు. వాస్తవానికి బ్రాహ్మణుల డిక్షనరీలో ‘అప్పుడప్పుడు’ అన్న మాట శోభించదు అని బాప్ దాదా చెప్పారు. ‘ఇప్పుడిప్పుడే’. సంకల్పము చేసారంటే చెయ్యాల్సిందే. చూద్దాములే, చేద్దాములే, ఈ లే-లే అన్న మాటే వద్దు. అందుకే మీ మమ్మా కూడా ఇదే లక్ష్యాన్ని పెట్టుకున్నారు మరియు అందరికీ గుర్తు చేయించారు - ‘‘ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు.’’

మరి డబుల్ పురుషార్థీ పిల్లలు ఇప్పుడిప్పుడే చేసేవారా లేక అప్పుడప్పుడా? ఇప్పుడిప్పుడే చేసి చూపించేవారము అని అనేవారు చేతులెత్తండి. చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందే. చేస్తాములే కాదు, చెయ్యాల్సిందే. గుర్తుంచుకోండి, మీ అంతట మీరే మీ చార్టు పెట్టుకోండి. అంతేకాక బాప్ దాదా ముందే చెప్పి ఉన్నారు - ప్రతి రోజు రాత్రి బాప్ దాదాకు మీ రోజంతటి చార్టును వినిపించిన తర్వాత మీ బుద్ధిని ఖాళీ చేసుకుని పడుకోవడము వలన మీకు నిద్ర కూడా చక్కగా పడుతుంది మరియు రోజంతటి స్థితిగతులను వినిపించడము వలన మరుసటి రోజు - మేము బాబాకు మా గురించి నిన్న వినిపించాము కదా అని గుర్తుకువస్తుంది, ఆ స్మృతి సహయోగము ఇస్తుంది. అప్పుడిక ధర్మరాజుపురిలోకి వెళ్ళాల్సిన అవసరము రాదు. బాబాకు ఇచ్చేసారు కదా మరియు పరివర్తన చేసేసారు, కావున ధర్మరాజుపురి నుండి రక్షింపబడతారు. ఇప్పుడు రాబోయే సంవత్సరములో, దానిని ఎవ్వరూ చూడలేదు అనుకోండి, కానీ ఇప్పుడు లక్ష్యమైతే పెట్టుకోండి, ఒక సంవత్సరము అన్న మాట పక్కన పెట్టండి, కానీ ఎంత తక్కువ సమయములో వీలైతే అంత తక్కువ సమయములో బాబా మనసులోని ఆశ ఏదైతే ఉందో - ముఖము కనిపించాలి, నడవడిక కనిపించాలి అని, దానిని వీలైనంత త్వరగా ప్రాక్టికల్ లో చేసి చూపించండి. ధైర్యముందా, ఉంటే చేతులెత్తండి. ధైర్యముందా? ధైర్యముందా? అచ్ఛా, అభినందనలు. బాప్ దాదా అయితే ప్రతి బిడ్డలోనూ నిశ్చయము మరియు ధైర్యముతో కూడిన ఉల్లాస-ఉత్సాహాలను ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. కానీ వెళ్తూ-వెళ్తూ విమానములో కాస్త తగ్గనివ్వకండి, పెంచుతూ ఉండండి. బాప్ దాదా ఏదైతే దృఢ సంకల్పము యొక్క తాళంచెవిని ఇచ్చారో, దానిని సదా భద్రంగా ఉంచుకోండి. చెయ్యాల్సిందే, ఇప్పుడిప్పుడే, చేస్తాములే-చేస్తాములే కాదు. ఆ సమయము ఇప్పుడు పోయింది. అయిపోతుందిలే కాదు, అవ్వాల్సిందే. బాప్ దాదా ఏదైతే డబుల్ పురుషార్థీ అన్న టైటిల్ ను ఇచ్చారో, దానిని సదా గుర్తుంచుకోండి.

ఇకపోతే బాప్ దాదా రిజల్టు విన్నారు, బాప్ దాదా ఏదైతే సేవా ప్లాన్ ఇచ్చారో, అది భారత్ కూడా తక్కువేమీ చెయ్యలేదు మరియు విదేశాలలో కూడా తక్కువేమీ చెయ్యలేదు. ఈ వరదానాన్ని మెజారిటీ స్థానాలు ఉల్లాస-ఉత్సాహాలతో చేసారు మరియు వేర్వేరు స్థానాల నుండి రిజల్టు కూడా వస్తూ ఉంది. ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చినందుకు బాప్ దాదా భారత్ యొక్క పిల్లలకు, విదేశాల పిల్లలకు పదమాల, పదమాల రెట్లు అభినందనలు ఇస్తున్నారు.

ఇప్పుడు ఈ సంవత్సరములో విశేషముగా ఏ విషయాన్ని ప్రాక్టికల్ గా చేయాలి, అది వినిపించాము కదా, అదేమిటంటే - ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూసినా కానీ వారికి మీ ముఖములో మెరుపు కనిపించాలి. ప్రత్యక్షతకు నిమిత్తముగా అవ్వాలి. బాబాను ప్రత్యక్షము చెయ్యాలంటే ఏం చేయాలి? సదా చిరునవ్వు చిందించే ముఖము ఉండాలి, ఏదో చింతనలోనో, అలజడిలోనో ఉండకూడదు. బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - ఇప్పుడు రెండు పదాలను గుర్తుంచుకోండి - మాయకు గెట్ అవుట్ అని సైగ చేయండి మరియు స్వయాన్ని గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు అనుభవము చేయండి. ఈ ప్రపంచము మీది కాదు, ఇది గెస్ట్ హౌస్, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంటి దృశ్యాలు మనసులో, బుద్ధిలో కనిపించాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇక ఇల్లు వచ్చేసినట్లే. మీ పాట ఒకటి ఉంది కదా - అబ్ ఘర్ చల్నా హై (ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి). ఇప్పుడు ఈ అల ప్రతి స్థానములోనూ ఉండాలి, భారత్ లో కావచ్చు, విదేశాలలో కావచ్చు, ఇప్పుడు ఈ అనుభవాన్ని ప్రత్యక్షము చేసి చూపించండి. అనంతమైన వైరాగ్యము, గెస్ట్ హౌస్ పట్ల మనసు ఉండదు. వెళ్ళాలి, వెళ్ళాలి అనే గుర్తుంటుంది. ఈ అనంతమైన వైరాగ్యము మనసులోని ఏ విధమైన సంకల్పాలనైనా, పరస్పర సంగఠనలో వచ్చే మాయా విఘ్నాలనైనా పూర్తిగా సమాప్తము చేసేస్తుంది. ఈ మాయా తుఫానులు మీ కొరకు తోఫాగా (కానుకగా) అవుతాయి. ఈ చిన్న-చిన్న పరీక్షలు ఏవైతే వస్తాయో, అవి పరీక్షలుగా అనిపించవు కానీ అనుభవాన్ని పెంచే ఒక లిఫ్టులా అనుభవమవుతాయి. గిఫ్ట్ మరియు లిఫ్ట్. అర్థమయ్యిందా. ఇప్పుడు అనంతమైన వైరాగిగా అవ్వాలి అన్న లక్ష్యము పెట్టుకోండి, మరియు ధైర్యము మరియు ఉల్లాస-ఉత్సాహాల రెక్కలతో ఎగురుతూ ఉండండి మరియు ఎగిరేలా చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇది ఎగిరే సమయము. మీ రెక్కలను సదా చెక్ చేసుకుంటూ ఉండండి, అవి బలహీనముగా అవ్వడము లేదు కదా!

బాప్ దాదా డబుల్ విదేశీయుల విస్తారాన్ని చూసి సంతోషిస్తున్నారు, ఇప్పుడు ఏం చూడాలని కోరుకుంటున్నారు? పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానముగా సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వాలి. సర్వ ఖజానాలలో సంపన్నముగా అవ్వాలి మరియు ప్రతి శ్రీమతము ఏదైతే లభిస్తుందో, అందులో సంపూర్ణము అవ్వాలి. ఇష్టమేనా? ఇష్టమైతే చప్పట్లు కొట్టండి. అచ్ఛా! ఈ చప్పట్లను ప్రతి రోజూ గుర్తు తెచ్చుకోండి. మీకు మీరే మనసులో మోగించుకోండి. బయటకు కాదు, మనసులో, ఇదే హోమ్ వర్క్, అచ్ఛా!

90 దేశాల నుండి 2300 మంది సోదరీ-సోదరులు వచ్చారు:- (5 ఖండాలకు చెందిన సోదరీ, సోదరులను వేర్వేరు గ్రూపులుగా నిలబెట్టించడము జరిగింది) 1 - అమెరికా, కెనడా మరియు కరేబియన్ సోదరీ-సోదరులు. 2 - ఆస్ట్రేలియా, ఆసియా, న్యూజిలాండ్, ఫిజి. 3 - యూరప్, యు.కె., మిడిల్ ఈస్ట్. 4 - ఆఫ్రికా, సౌథ్ ఆఫ్రికా, మారిషస్. 5 - రష్యా, సి.ఐ.యస్., బాల్టిక్ కంట్రీస్.

అందరూ ముందుకు వెళ్ళాలి అన్న సంకల్పము కూడా చేసారు మరియు పరస్పరము ఆత్మిక సంభాషణ కూడా చేసుకున్నారు. బాప్ దాదా వద్దకు సమాచారము వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవర్రెడీ గ్రూపును తయారుచేయండి. ఏయే దేశాలైతే వచ్చాయో ఆ దేశాలకు బాప్ దాదా ప్రైజ్ ఇస్తారు. ఏ ప్రైజ్ ఇస్తారు అన్నది అప్పుడు చూద్దాము. కానీ బాప్ దాదా ప్రతి ఏరియాలో ఉన్న డబుల్ పురుషార్థీ పిల్లల గ్రూప్ కు ఇదే చెప్తున్నారు - ఏ గ్రూప్ అయితే నంబర్ వన్ లోకి వెళ్తుందో వారికి ప్రైజ్ ఇస్తాము. ఒక దేశములోని ఒక్కొక్క పట్టణములో ఎన్ని సెంటర్లు అయితే ఉన్నాయో, ఉదాహరణకు అమెరికా ఉంది, అమెరికా కనెక్షన్ లో ఏయే దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ పరస్పరములో చర్చించుకుని ప్రోగ్రామ్ తయారుచేయండి, అదేమిటంటే - ఇక్కడ అందరమూ నిర్విఘ్నముగా ఉంటాము, ఎవర్రెడీగా ఉంటాము, మాయాజీతులుగా ఉంటాము, స్నేహీగా మరియు సేవలో సహయోగిగా ఉంటాము. ఇందులో ఎవరైతే నంబర్ వన్ గా నిలుస్తారో వారికి బాప్ దాదా ప్రైజ్ ఇస్తారు. పోనీ, ఒకరికి కాకపోతే ముగ్గురికి ఇస్తాము. ఒకటి, రెండు, మూడు. మూడు ప్రైజ్ లు. వాస్తవానికి ఒక్కరికే ప్రైజ్ ఇస్తారు కానీ డబుల్ పురుషార్థీలు కదా, అందుకే ముగ్గురికి అవకాశాన్ని ఇస్తాము. ఇష్టమేనా? ఇష్టమైతే చేయి ఊపండి. ఇష్టమేనా? ఎంత సమయము కావాలి? ఇది టీచర్లు చెప్పండి. ప్రైజ్ తీసుకోవడానికి ఎంత సమయము కావాలి? చెప్పండి. (ఫిబ్రవరి వరకు కావాలి అని అందరూ చెప్పారు) అన్ని దేశాల టీచర్లు చేతులెత్తండి. సరేనా? తయారైపోతారు కదా! అప్పుడు బాప్ దాదా ప్రైజ్ ఇస్తారు. చాలా మంచిది. దీని కోసం చప్పట్లు కొట్టండి. అచ్ఛా! భారత్ కు కూడా టర్న్ వస్తుంది. ఇప్పుడైతే ఇది మీ టర్న్. బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. వాహ్ తీవ్ర పురుషార్థీ పిల్లలు వాహ్! అచ్ఛా!

నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థీలు, ధైర్యము మరియు ఉల్లాస-ఉత్సాహాలతో ఎగిరేవారు, నడిచేవారు కాదు, ఎగిరేవారు, నలువైపులా ఉన్న బాబా సమానముగా సంపన్నముగా మరియు సంపూర్ణముగా అయ్యే బాప్ దాదా హృదయ సింహాసనాధికారులు, సదా బాబా యొక్క కంబైన్డ్ రూపాన్ని అనుభవము చేసే మరియు సహయోగాన్ని తీసుకునే బాబా యొక్క అతి ప్రియమైన, స్నేహీ పిల్లలైన ప్రతి ఒక్కరికీ బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో:- బాబాతో పాటు మీ అందరి సహయోగము కూడా ఉంది కదా! పిల్లలు మరియు బాబా, ఇద్దరి సహయోగముతో యజ్ఞము నడిచింది, నడుస్తూ ఉంటుంది. మీరు కూడా నిమిత్తమే కదా. సాకారములో ఒకరు చెప్పారు, మరొకరు చేసారు. ఒకరికొకరు సహయోగులుగా అయి ఎగురుతూ ఉన్నారు. ఎగురుతూ ఉండటాన్ని చూసి బాబా సంతోషిస్తున్నారు. (గుల్జార్ దాదీజీ యొక్క అద్భుతము అని జానకి దాదీజీ అన్నారు) వారైతే తోడుగా ఉండనే ఉన్నారు. నిమిత్తమైన మీరందరూ సదా ఒకటిగా కనిపించాలి అన్నదే బాప్ దాదా యొక్క శుభ ఆశ. వేర్వేరుగా కాదు, ఒక్కటిగా కనిపించాలి. ఒకరు చెప్పారు, మరొకరు సలహా ఇచ్చారు మరియు అంతే ఒకటైపోయారు. అందుకే కదా యజ్ఞము నడుస్తుంది. మీ అందరి ఐక్యతతోనే నడుస్తుంది. బయటకు కనిపించకపోయినా కానీ సంకల్పాలలో, ఆలోచనలలో ఒకటిగా ఉంటూ మరింత ముందుకు తీసుకువెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు మీ అందరిపైనా దృష్టి ఉంది. అచ్ఛా!

వరదానము:-
మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా శుద్ధ వాయుమండలాన్ని తయారుచేసే సదా శక్తిశాలీ ఆత్మా భవ

ఎవరైతే సదా తమ శ్రేష్ఠ వృత్తిలో స్థితులై ఉంటారో వారు ఎటువంటి వాయుమండలములోనైనా, వైబ్రేషన్లలోనైనా అలజడికి లోనవ్వరు. వృత్తి ద్వారానే వాయుమండలము తయారవుతుంది, ఒకవేళ మీ వృత్తి శ్రేష్ఠమైనదైనట్లయితే వాయుమండలము శుద్ధముగా అవుతుంది. కొంతమంది ఏమని వర్ణిస్తారంటే - ఏం చేయాలి, వాయుమండలమే అలా ఉంది, వాయుమండలము కారణముగా నా వృత్తి చంచలమయ్యింది అని అంటుంటారు, అంటే ఆ సమయములో శక్తిశాలి ఆత్మకు బదులుగా బలహీన ఆత్మగా అయిపోతున్నారు. కానీ వ్రతము (ప్రతిజ్ఞ) యొక్క స్మృతితో వృత్తిని శ్రేష్ఠముగా తయారుచేసుకున్నట్లయితే శక్తిశాలిగా అయిపోతారు.

స్లోగన్:-
గుణమూర్తులుగా అయ్యి సర్వులను గుణమూర్తులుగా తయారుచేయటమే మహాదానిగా అవ్వటము.

అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

పరస్పరములో ఒకరిపై ఒకరికి సత్యమైన స్నేహము ఉండాలి, స్నేహీ ఆత్మ పట్ల ఎప్పుడూ అనుమానము ఉత్పన్నమవ్వదు. వారి స్నేహపూర్వకమైన మాటలు సాధారణముగా ఉన్నా కూడా అవి సాధారణముగా అనిపించవు. వారి తేలికపాటి మాటలు కూడా ఎలా అనిపిస్తాయంటే - తప్పకుండా వీరు ఏదో అర్థముతో అనుంటారు అని అనిపిస్తుంది. అవి అర్థం లేనివిగా, వ్యర్థమైనవిగా అనిపించవు. ఎక్కడైతే స్నేహము ఉంటుందో, అక్కడ నమ్మకము తప్పకుండా ఉంటుంది. కావున బ్రాహ్మణ పరివారములో ఒకరి పట్ల మరొకరు స్నేహాన్ని మరియు నమ్మకాన్ని ఉంచుకుని సంపూర్ణ నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వండి, అప్పుడు బ్రహ్మాబాబా ఆశలను పూర్తి చెయ్యగలరు.