29-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ పాత ప్రపంచము పట్ల మరియు దేహధారుల పట్ల ఎప్పుడూ మనసు పెట్టుకోకండి, మనసు పెట్టుకున్నట్లయితే అదృష్టము పాడైపోతుంది’’

ప్రశ్న:-
పిల్లలకు తండ్రి ఈ నాటకము యొక్క ఏ గుహ్య రహస్యాన్ని వినిపించారు?

జవాబు:-
పిల్లలూ - ఇప్పుడు ఈ నాటకము సమాప్తమవ్వనున్నది, అందుకే ఆత్మలందరూ ఇక్కడ హాజరవ్వాల్సిందే. అన్ని ధర్మాల ఆత్మలు ఇప్పుడు ఇక్కడ హాజరవుతారు ఎందుకంటే సర్వుల తండ్రి ఇక్కడ హాజరై ఉన్నారు. అందరూ తండ్రి ఎదురుగా సలాం చేయడానికి రావాల్సిందే. అన్ని ధర్మాల ఆత్మలు మన్మనాభవ మంత్రాన్ని తీసుకుని వెళ్తారు. వారేమీ మధ్యాజీ భవ మంత్రాన్ని ధారణ చేసి చక్రవర్తులుగా అవ్వరు.

పాట:-
మనసు యొక్క ఆధారము తెగిపోకూడదు...

ఓంశాంతి
అన్ని సెంటర్ల పిల్లలు పాటను విన్నారు. మీరు ఈ రోజు వింటున్నారు, మిగిలిన పిల్లలు 2-4 రోజుల తర్వాత వింటారు. ఒకవేళ ఈ పాత ప్రపంచము, పాత శరీరము పట్ల మనసు పెట్టుకున్నట్లయితే అదృష్టము పాడైపోతుంది ఎందుకంటే ఈ శరీరము ఈ పాత ప్రపంచానికి సంబంధించినది. ఒకవేళ దేహాభిమానులుగా అయినట్లయితే ఈ తయారవుతున్న అదృష్టము పాడైపోతుంది. ఇప్పుడు మీరు దురదృష్టవంతుల నుండి అదృష్టవంతులుగా అవుతున్నారు, అందుకే ఎంత వీలైతే అంత అనంతమైన వారసత్వాన్ని ఇచ్చే తండ్రి ఒక్కరినే స్మృతి చేయండి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, ఈ పాత ప్రపంచములో ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ కొద్ది సమయములో మీరు పురుషార్థము చేసి సర్వగుణ సంపన్నులుగా తప్పకుండా అవ్వాలి. పవిత్రముగా ఉండేవారు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది పదే-పదే పడిపోతూ ఉంటారు. తండ్రి అంటారు - మీరు సేవలో తండ్రికి సహచరులుగా అవ్వాలి, ఇది చాలా పెద్ద సేవ, ఇంతటి ప్రపంచమంతటినీ పతితము నుండి పావనముగా తయారుచేయాలి. అలాగని అందరూ తండ్రికి సహాయము చేస్తారని కూడా కాదు. కల్పక్రితం ఎవరైతే సహాయము చేసారో, బ్రాహ్మణ కులభూషణులైన బి.కె.లుగా అయ్యారో, వారే తెలివైనవారిగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మా పేరైతే గాయనము చేయబడింది. బ్రహ్మా సంతానాన్ని తప్పకుండా బి.కె.లనే అంటారు. వారు తప్పకుండా ఒకప్పుడు ఇక్కడ ఉండేవారు. ఆదిదేవ్, ఆదిదేవీలను కూడా స్మృతి చేస్తారు. ఏదైతే గతంలో ఉండేదో, అది మళ్ళీ తప్పకుండా ఉండాలి. సత్యయుగము ఇంతకుముందు ఉండేదని మీకు తెలుసు. అందులో ఆది సనాతన దేవీ-దేవతల రాజ్యము ఉండేది, అది ఇప్పుడు లేదు. పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందిన దేవీ-దేవతలు రాజ్యము చేసేవారు, వారు ఇప్పుడు 84 జన్మల అంతిమములో ఉన్నారు. ఇప్పుడు వారు పవిత్రముగా కూడా లేరు, అలాగే ఇప్పుడు ఆ రాజ్యము కూడా లేదు, పతితులుగా అయిపోయారు. మళ్ళీ పావనముగా చేయడానికి తండ్రి వచ్చారు. తండ్రి అంటారు - పతితులతో బుద్ధియోగాన్ని జోడించకండి, ఒక్క తండ్రిని స్మృతి చేయండి.

మనము తండ్రి సలహాను అనుసరిస్తూ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. వారసత్వాన్ని ఎలా పొందాలి అనే యుక్తిని కూడా తెలియజేస్తారు. మనుష్యులైతే అనేక రకాల యుక్తులను రచిస్తారు. కొందరు సైన్స్ గర్వముతో ఉన్నారు, కొందరు డాక్టరీ గర్వముతో ఉన్నారు. మనుష్యుల గుండె పాడైపోతే వేరే ప్లాస్టిక్ గుండెను తయారుచేసి పెట్టగలమని వ్రాస్తారు. సహజమైనదానిని తొలగించి కృత్రిమమైనదానితో నడిపిస్తూ ఉంటారు. ఇది కూడా ఎంతటి నైపుణ్యము. ఇది అల్పకాలిక సుఖము కోసము ఉంది. ఒకవేళ రేపు మరణిస్తే, శరీరమే సమాప్తమైపోతుంది, ప్రాప్తి అయితే ఏమీ ఉండదు. అది అల్పకాలానికే లభించింది. సైన్స్ ద్వారా చాలా అద్భుతాలను చేసి చూపిస్తారు, అవి కూడా అల్పకాలికమైనవే. ఈ విషయమైతే పూర్తిగా అతీతమైనది. పావనాత్మ 84 జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు పతితముగా అయిపోయింది. ఆ పతితాత్మను మళ్ళీ పావనముగా చేయడమనేది, తండ్రి తప్ప వేరెవ్వరూ చేయలేరు. ఆ ఒక్కరికే గాయనము ఉంది. సర్వుల పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత, సర్వులపై దయా దృష్టిని ఉంచేవారు, సర్వోదయ లీడర్ వారే. మనుష్యులు తమను తాము సర్వోదయ లీడర్ అని పిలుచుకుంటారు, ఇప్పుడు సర్వ అనగా అందులో అందరూ వచ్చేస్తారు. సర్వులపై దయ చూపించేవారు ఒక్క తండ్రి మాత్రమేనని గాయనము చేయడము జరుగుతుంది. వారిని దయార్ద్ర హృదయుడు, బ్లిస్ ఫుల్ (ఆనంద సాగరుడు) అని అంటారు. ఇకపోతే మనుష్యులు సర్వులపై ఏమి దయ చూపించగలరు! తమపై తామే దయ చూపించుకోలేనప్పుడు, ఇక ఇతరులపై ఏమి చూపగలరు. వారు అల్పకాలానికి దయ చూపిస్తారు. ఎంత గొప్ప-గొప్ప పేర్లు పెట్టుకున్నారు.

ఇప్పుడు తండ్రి అంటారు - సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవ్వటానికి నేను మీకు ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తాను. యుక్తి చాలా సింపుల్ గా ఉంది - కేవలం నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే మీరు నన్నే మర్చిపోయారు. సత్యయుగములోనైతే మీరు సుఖముగా ఉంటారు, అందుకే నన్ను అసలు స్మృతి చేయరు. మీ 84 జన్మల చరిత్ర-భౌగోళికాలను మీకు వినిపించాను - మీరు అలా రాజ్యము చేసేవారు, సదా సుఖముగా ఉండేవారు, తర్వాత రోజు-రోజుకు దిగిపోతూ-దిగిపోతూ తమోప్రధానముగా, దుఃఖితులుగా, పతితులుగా అయిపోయారు. కల్ప-కల్పము ఎవరైతే వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారో, శ్రీమతమనుసారముగా నడుచుకుంటారో, అటువంటి పిల్లలైన మీకు, ఇప్పుడు తండ్రి మళ్ళీ కల్పక్రితం వలె వారసత్వాన్ని ఇస్తున్నారు. శ్రీమతము అంటేనే బాప్ దాదా మతము. వారి నుండి కాకుండా శ్రీమతము ఎక్కడ నుండి లభిస్తుంది. ఈ నైపుణ్యము ఎవరిలోనైనా ఉందా అన్నది మీరే ఆలోచించండి అని తండ్రి అంటారు. ఎవరిలోనూ లేదు. ఎవరినైనా విశ్వానికి యజమానులుగా చేసేటువంటి యుక్తిని తండ్రియే తెలియజేస్తారు. ఇది తప్ప వేరే ఉపాయమేమీ లేదని తండ్రి అంటారు. ఉన్నత పదవిని పొందేందుకు, పతిత-పావనుడైన తండ్రియే జ్ఞానాన్ని ఇస్తారు. అలాగని కేవలం సృష్టి చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు పవిత్రముగా అయిపోతారని కాదు. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి, ఈ యోగాగ్నితో మీ నిండుగా ఉన్న పాపాల కుండ అంతమైపోతుంది.

తండ్రి అంటారు - మీరే 84 జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ చాలా పతితముగా అయిపోయారు. ఈ రోజుల్లోనైతే స్వయాన్ని శివోహమ్, తతత్వమ్ అని చెప్పుకుంటారు లేదా మీరు పరమాత్ముని రూపాలు, ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చారు, శివబాబా స్మృతిని ఇప్పించవలసి ఉంటుందని మీకు తెలుసు. సర్వుల సద్గతిదాత ఒక్క పరమపిత పరమాత్మయే. శివుని మందిరాలు వేరుగా నిర్మించబడతాయి, శంకరుని రూపమే వేరు. దీనిని ప్రదర్శనీలో కూడా చూపించవలసి ఉంటుంది. శివుడు నిరాకారుడు, శంకరుడు ఆకారీ. శ్రీకృష్ణుడైతే సాకారములో ఉన్నారు, వారితో పాటు రాధను చూపించడము కరక్టే. వీరే మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారని నిరూపించబడుతుంది. శ్రీకృష్ణుడు గీతను వినిపించేందుకు ద్వాపరములో రారు. పతితులు కలియుగాంతములో ఉంటారు, పావనులు సత్యయుగములో ఉంటారు. కనుక భగవంతుడు తప్పకుండా సంగమములోనే వస్తారు. ఇది తండ్రికి మాత్రమే తెలుసు, వారే త్రికాలదర్శి. శ్రీకృష్ణుడిని త్రికాలదర్శి అని అనరు. అతను మూడు కాలాల జ్ఞానాన్ని వినిపించలేరు. అతనికి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము లేదు. అతడొక చిన్న బాలుడు, దైవీ రాకుమారీ-కుమారుల కాలేజ్ లో చదువుకోవడానికి వెళ్తారని అంటారు. ఇంతకుముందు ఇక్కడ కూడా రాకుమారీ-రాకుమారుల కాలేజ్ ఉండేది, ఇప్పుడు అన్నీ కలిసిపోయాయి. శ్రీకృష్ణుడు రాకుమారుడిగా ఉండేవారు, వేరే రాకుమారీ-రాకుమారులు కూడా ఉంటారు. వారందరూ కలిసి చదువుకుంటూ ఉండవచ్చు. అక్కడ నిర్వికారీ ప్రపంచము ఉంటుంది. ఒక్క శివబాబాయే సర్వుల సద్గతిదాత. మనుష్యులు సర్వుల సద్గతిదాతగా కాలేరు. తండ్రియే వచ్చి సర్వులకు ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. దేవతల రాజ్యములో వేరే ధర్మమేదీ ఉండేది కాదని అర్థం చేయించడము జరుగుతుంది. ఇతర ధర్మాల వారు రావడమే సగంలో వచ్చారు, కనుక సత్యయుగములో ఎలా ఉండగలరు. నివృత్తి మార్గానికి చెందినవారు హఠయోగులు. వారు రాజయోగాన్ని అర్థం చేసుకోలేరు. ఈ రాజయోగము ప్రవృత్తి మార్గము వారి కోసం ఉన్నది. భారత్ పవిత్ర ప్రవృత్తి మార్గములో ఉండేది, ఇప్పుడు కలియుగములో పతిత ప్రవృత్తి మార్గము వారిగా అయిపోయారు. భగవానువాచ - నన్నొక్కరినే స్మృతి చేయండి. పాత ప్రపంచముతో మరియు దేహ సంబంధాలతో మనసును జోడించినట్లయితే అదృష్టము పాడైపోతుంది. అనేకుల అదృష్టము పాడైపోతుంది. ఏదైనా తప్పుడు పని చేసినట్లయితే, చివరిలో అదంతా ఎదురుగా వస్తుంది, సాక్షాత్కారము జరుగుతుంది. కొంతమంది పిల్లలు చాలా దాచిపెడతారు, ఈ జన్మలో చేసిన పాప కర్మలను తండ్రికి వినిపించడంతో సగం శిక్ష నుండి విముక్తులవుతారు, కానీ సిగ్గు కారణముగా వినిపించరు. అశుద్ధమైన పనులైతే చాలామంది చేస్తారు. వాటి గురించి చెప్పడం వలన విముక్తులవుతారని బుద్ధిలో గుర్తుంటుంది. బాబా అవినాశీ సర్జన్. సిగ్గు కారణముగా సర్జన్ కు అనారోగ్యాన్ని తెలియజేయకపోతే ఎలా విముక్తులవుతారు. ఏదైనా వికర్మ చేసినట్లయితే, అది చెప్పడము వలన సగం క్షమించబడుతుంది. చెప్పకపోతే అది వృద్ధి చెందుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువగా అందులో చిక్కుకుపోతూ ఉంటారు. అప్పుడు అదృష్టము సమాప్తమై, దురదృష్టము వస్తుంది. తండ్రి అంటారు - దేహముతో కూడా సంబంధము పెట్టుకోకండి, సదా నన్నొక్కరినే స్మృతి చేస్తూ ఉండండి, అప్పుడు ఏ అశుద్ధమైన పని జరగదు. వీరు ధర్మరాజు కూడా, వీరి దగ్గర కూడా దాచిపెడుతూ ఉన్నట్లయితే, ఇక తర్వాత మీకు లభించేంతటి శిక్ష ఇంకెవ్వరికీ లభించదు. సమయము ఎంతగా సమీపముగా వస్తుందో, అంతగా అందరికీ సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడిది అందరి వినాశన సమయము, అందరూ పతితులుగా ఉన్నారు. పాపాలకు తప్పకుండా శిక్ష లభిస్తుంది. ఎలాగైతే ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుందో, అలా ఒక్క సెకండులో ఆ శిక్షలు ఎలా అనుభవమవుతాయంటే, ఎంతోకాలం నుండి శిక్షలను అనుభవిస్తూనే ఉన్నాను అన్నట్లు అనిపిస్తుంది. ఇది చాలా సూక్ష్మమైన మెషినరీ. ఇది అందరి వినాశన సమయము. శిక్షలనైతే తప్పకుండా అనుభవించాల్సిందే. తర్వాత ఆత్మలందరూ పవిత్రముగా అయి వెళ్తారు. తండ్రియే వచ్చి పతితాత్మలను పావనముగా చేస్తారు. తండ్రికి తప్ప వేరెవ్వరికీ ఆ శక్తి లేదు. 63 జన్మలుగా పాపాలు చేస్తూ-చేస్తూ, ఇప్పుడు మీ పాపాల కుండ నిండిపోయింది. మాయా గ్రహణము అందరికీ పట్టింది. మీకు పెద్ద గ్రహణము పట్టింది. మీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు, తర్వాత మీకు గ్రహణము పట్టింది, జ్ఞానము కూడా ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. మీరు భారత్ కు యజమానులుగా ఉండేవారని, తర్వాత మీరు 84 జన్మలను అనుభవించారని తండ్రి తెలియజేస్తారు. తప్పకుండా మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారని, తర్వాత పతితులైన కారణముగా హిందువులుగా చెప్పుకుంటున్నారని తండ్రి ఎంత డైరెక్టుగా చెప్తున్నారు. హిందూ ధర్మాన్ని అయితే ఎవరూ స్థాపన చేయనే లేదు. మఠాలను, వర్గాలను వంశమని అనరు, వంశము రాజులకు ఉంటుంది. లక్ష్మీ-నారాయణ ది ఫస్ట్, సెకెండ్, థర్డ్... ఇలా రాజ్యము నడుస్తుంది. పావనుల నుండి పతితులుగా అవ్వాల్సిందే, ఇది కూడా తప్పకుండా జరుగుతుంది. పతితులైన కారణముగా దేవీ-దేవతలుగా చెప్పుకోలేరు. మేము పూజ్య ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారమని మీరు అర్థం చేసుకున్నారు. తమ-తమ ధర్మాల చిత్రాలనే పూజిస్తారు. మేమే పూజ్య దేవీ-దేవతలుగా ఉండేవారమని, ఇప్పుడు పూజారులుగా అయ్యామని కేవలం ఈ విషయాన్ని మర్చిపోయారు. తండ్రి పూర్వము వారసత్వాన్ని ఇచ్చారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, తర్వాత పతితులుగా అవ్వడముతో తమ చిత్రాలనే కూర్చుని పూజించారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. భారత్ కోసం తప్ప ఇతరులెవ్వరి కోసం ఇలా అనరు. బాబా కూడా భారత్ లోనే వచ్చి, మళ్ళీ దేవతలుగా తయారుచేయడానికి జ్ఞానాన్ని ఇస్తారు. మిగిలినవారంతా లెక్కాచారాలను పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళిపోతారు. ఆత్మలందరూ ఓ గాడ్ ఫాదర్, అని తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఈ సమయములో మీకు ముగ్గురు తండ్రులు ఉన్నారు. ఒకరు శివబాబా, రెండు లౌకిక తండ్రి మరియు ఈ అలౌకిక తండ్రి ప్రజాపిత బ్రహ్మా. మిగిలినవారందరికీ ఇద్దరు తండ్రులు ఉంటారు, లౌకికము మరియు పారలౌకికము. సత్యయుగములో కేవలం ఒక్క లౌకిక తండ్రి మాత్రమే ఉంటారు. పారలౌకిక తండ్రి గురించి తెలియనే తెలియదు. అక్కడైతే సుఖమే ఉంటుంది, ఇక పారలౌకిక తండ్రిని ఎందుకు స్మృతి చేయాలి. దుఃఖములో అందరూ స్మరిస్తారు. ఇక్కడ మళ్ళీ మీకు ముగ్గురు తండ్రులు ఉంటారు, ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు, తర్వాత దేహాభిమానములోకి వచ్చేస్తారు. ఇక్కడ మీరు ఆత్మాభిమానులుగా కూడా ఉన్నారు, పరమాత్మాభిమానులుగా కూడా ఉన్నారు. మేమంతా తండ్రి సంతానమని, వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని శుద్ధ అభిమానము ఉంది. వారు తండ్రి, శిక్షకుడు, సద్గురువు. వారి ఈ మహిమను కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. వారే వచ్చి పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. సత్యయుగములో మీకు వారసత్వము ఉండేది, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుని దానిని పోగొట్టుకున్నారు. ఇప్పుడిది అర్థం చేయించడము ఎంత సహజము. తండ్రిని పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత అని అంటారు. ఈ ప్రపంచమే పతితుల ప్రపంచము. ఎవరైనా సద్గతిని ఎలా ఇవ్వగలరు. ఇకపోతే ఎవరైనా చాలా శాస్త్రాలు చదివి ఉంటే, అంతమతి సో గతి ఏర్పడుతుంది. అటువంటి వారికి చిన్నతనములోనే అవి కంఠస్థమైపోతాయి. కనుక తండ్రి పిల్లలైన మీకు ఎంత మంచి మధురాతి-మధురమైన మాటలను వినిపిస్తారు. పిల్లలూ, మీరు తమోప్రధానముగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రిని స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది. ఇప్పుడు నాటకము పూర్తవుతుంది, అందరూ హాజరవ్వాల్సిందే. క్రైస్టు మొదలైనవారందరి ఆత్మలు హాజరై ఉన్నాయి, వారు కూడా తండ్రి వద్దకు సలాం చేయడానికి వస్తారు కానీ చక్రవర్తి రాజులుగా అయితే అవ్వరు, కేవలం తండ్రిని స్మృతి చేస్తారు, మన్మనాభవ మంత్రాన్ని తీసుకుని వెళ్తారు. మీది మన్మనాభవ మరియు మధ్యాజీభవ అనే డబుల్ మంత్రము. తండ్రి ఎంత మంచి యుక్తిని తెలియజేస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత ప్రపంచములో ఉంటూ పురుషార్థము చేసి సర్వగుణ సంపన్నులుగా తప్పకుండా అవ్వాలి. ఈ పాత శరీరము పట్ల మరియు పాత ప్రపంచము పట్ల మనసు పెట్టుకోకూడదు. అదృష్టవంతులుగా అవ్వాలి.

2. ఆత్మాభిమానులుగా మరియు పరమాత్మ-అభిమానులుగా ఉండాలి. ఈ వినాశన సమయములో తండ్రి నుండి ఏదీ దాచిపెట్టకూడదు. అవినాశీ సర్జన్ నుండి సలహా తీసుకుంటూ ఉండాలి.

వరదానము:-
సాంగత్య దోషము నుండి దూరంగా ఉంటూ సదా తండ్రికి సమీపముగా ఉండే భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే పాస్ విత్ ఆనర్ భవ

ఒకవేళ తండ్రికి సమీపముగా ఉండటము ఇష్టమైతే, మరి ఎప్పటికీ ఎలాంటి సాంగత్య దోషము నుండైనా దూరంగా ఉండండి. ఎన్నో రకాల ఆకర్షణలు పరీక్షల రూపములో వస్తాయి కానీ ఆకర్షితులవ్వకండి. సాంగత్య దోషము చాలా రకాలుగా ఉంటుంది. వ్యర్థ సంకల్పాల సాంగత్యము, మాయా ఆకర్షణలతో కూడిన సంకల్పాల సాంగత్యము, సంబంధీకుల సాంగత్యము, వాణి యొక్క సాంగత్యము, అన్నదోషం యొక్క సాంగత్యము, కర్మల సాంగత్యము... ఈ సాంగత్య దోషాలన్నింటి నుండి స్వయాన్ని రక్షించుకునేవారే పాస్ విత్ ఆనర్ గా అవుతారు.

స్లోగన్:-
మీరు ఫరిశ్తాగా అయినట్లయితే పరిస్థితులలో తండ్రి స్వయంగా మీకు ఛత్రఛాయగా అవుతారు.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’

సదా ఏకరసముగా, అచంచలముగా-స్థిరముగా ఉండేందుకు మరియు ఇతరులను అలా తయారుచేసేందుకు విశేషమైన శక్తి ఈ డ్రామా పాయింటు. దీనిని శక్తి రూపములో ధారణ చేసేవారు ఎప్పుడూ ఓడిపోలేరు, కానీ ముందు డ్రామా అనే బిందువును పెట్టి వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి పరివర్తన చేయండి, ఆ తర్వాత మాయ ద్వారా వచ్చే అనేక రకాల విఘ్నాలను ఈశ్వరీయ తపన యొక్క ఆధారముతో సమాప్తము చేయండి.