29-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఎప్పుడైతే ఈ శరీరములోకి ఆత్మ ప్రవేశిస్తుందో అప్పుడే ఈ శరీరానికి విలువ ఉంటుంది, కానీ అలంకరణ అనేది శరీరానికి జరుగుతుంది, ఆత్మకు జరుగదు’’

ప్రశ్న:-
పిల్లలైన మీ కర్తవ్యము ఏమిటి? మీరు ఏ సేవను చేయాలి?

జవాబు:-
మీ కర్తవ్యము ఏమిటంటే - మీ తోటివారికి నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యే యుక్తిని తెలియజేయడము. మీరు ఇప్పుడు భారత్ యొక్క సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. మీకు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది కావున మీ బుద్ధి మరియు నడవడిక చాలా రిఫైన్ గా ఉండాలి. మీకు ఎవరిపైనా కొద్దిగా కూడా మోహము ఉండకూడదు.

పాట:-
నయనహీనునికి దారిని చూపించు ప్రభూ...

ఓంశాంతి
డబుల్ శాంతి. పిల్లలైన మీరు ఓం శాంతి అని బదులు చెప్పాలి. మన స్వధర్మము శాంతి. మీరు ఇప్పుడు శాంతి కోసం ఎక్కడకూ వెళ్ళరు. మనుష్యులు మనశ్శాంతి కొరకు సాధు-సన్యాసులు వద్దకు కూడా వెళ్తారు కదా. వాస్తవానికి మనసు, బుద్ధి అనేవి ఆత్మ యొక్క ఇంద్రియాలు. ఏ విధంగా ఈ శరీర ఇంద్రియాలు ఉన్నాయో, అలాగే మనసు, బుద్ధి మరియు చక్షువు ఉన్నాయి. ఆ చక్షువు అనేది ఈ నయనాల ఎలా అయితే ఉన్నాయో, అది అలా ఉండదు. ఓ ప్రభూ, నయనహీనునికి దారిని చూపించండి... అని అంటారు. వాస్తవానికి ప్రభు లేక ఈశ్వరుడు అని అన్నప్పుడు అందులో తండ్రి పట్ల కలిగేటువంటి ప్రేమ అనుభవమవ్వదు. తండ్రి నుండైతే పిల్లలకు వారసత్వము లభిస్తుంది. ఇక్కడైతే మీరు తండ్రి ఎదురుగా కూర్చున్నారు. మీరు చదువుకుంటారు కూడా. మిమ్మల్ని ఎవరు చదివిస్తారు? పరమాత్మ లేక ప్రభువు చదివిస్తారు అని మీరు అనరు. మీరు శివబాబా చదివిస్తారు అని అంటారు. బాబా అన్న పదమైతే చాలా సింపుల్. వాస్తవానికి వారు బాప్ దాదా. ఆత్మను ఆత్మ అనే అంటారు, అలాగే వారు పరమ ఆత్మ. వారు అంటారు, నేను ఉన్నతోన్నతమైన ఆత్మను అనగా పరమాత్మను, మీ తండ్రిని. డ్రామానుసారముగా పరమాత్మనైన నాకు శివ అన్న పేరు పెట్టడం జరిగింది. డ్రామాలో అందరికీ పేరు కూడా కావాలి కదా. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. భక్తి మార్గము వారు ఒక పేరే కాకుండా అనేక పేర్లు పెట్టేశారు మరియు అనేకానేక మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. కానీ వారైతే ఒక్కరే. సోమనాథ మందిరము ఎంత పెద్దది, ఎంతగా అలంకరిస్తారు. మహళ్ళు మొదలైనవాటిని కూడా ఎంతగా అలంకరిస్తారు. ఆత్మకు అయితే ఎటువంటి అలంకరణ లేదు, అలాగే పరమాత్మకు కూడా అలంకరణ లేదు. వారు ఒక బిందువు. అలంకరణ ఏదైతే ఉందో అదంతా శరీరాలదే. తండ్రి అంటారు, నాకు అలంకరణ లేదు, అలాగే ఆత్మలకు అలంకరణ లేదు. ఆత్మ ఒక బిందువే. ఇంత చిన్నని బిందువు అయితే ఎటువంటి పాత్రనూ అభినయించలేదు. ఆ చిన్నని ఆత్మ శరీరములో ప్రవేశిస్తే ఆ శరీరానికి ఎన్ని రకాల అలంకరణలు జరుగుతాయి. మనుష్యులకు ఎన్ని పేర్లు ఉన్నాయి. రాజు, రాణుల అలంకరణ ఎలా జరుగుతుంది! ఆత్మ అయితే సింపుల్ బిందువే. ఇప్పుడు పిల్లలైన మీరు ఇది కూడా అర్థం చేసుకున్నారు. ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. తండ్రి అంటారు, నాలో కూడా జ్ఞానము ఉంది కదా. శరీరములో అయితే జ్ఞానము ఉండదు. ఆత్మనైన నాలో జ్ఞానము ఉంది. మీకు అది వినిపించేందుకు నేను ఈ శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది. శరీరము లేకుండా మీరు వినలేరు. ఇప్పుడు నయనహీనునికి దారిని చూపించండి... అన్న పాటను తయారుచేశారు, ఇక్కడ శరీరానికి దారిని చూపిస్తారా? కాదు. ఆత్మకు చూపిస్తారు. ఆత్మయే పిలుస్తుంది. శరీరానికైతే రెండు నేత్రాలు ఉన్నాయి. మూడు నేత్రాలైతే ఉండవు. మూడవ నేత్రానికి గుర్తుగా ఇక్కడ మస్తకములో తిలకమును కూడా దిద్దుతారు. కొందరు కేవలం బిందువు వలె దిద్దుతారు, కొందరు ఒక రేఖను దిద్దుతారు. బిందువు అంటే ఆత్మ. ఆత్మకు జ్ఞానమనే మూడవ నేత్రము లభిస్తుంది. ఆత్మకు ఇంతకుముందు ఈ జ్ఞానమనే మూడవ నేత్రము లేదు. ఏ మనుష్యమాత్రులకూ ఈ జ్ఞానము లేదు, అందుకే జ్ఞాన నేత్రహీనులు అని అంటారు. ఇకపోతే ఈ కనులైతే అందరికీ ఉన్నాయి. మొత్తం ప్రపంచములో ఎవ్వరికీ ఈ మూడవ నేత్రము లేదు. మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు. భక్తి మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి ఎంత వ్యత్యాసము ఉందో మీకు తెలుసు. మీరు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను తెలుసుకుని చక్రవర్తీ రాజులుగా అవుతారు. ఐ.సి.యస్ వారు కూడా చాలా ఉన్నత పదవిని పొందుతారు కదా. ఇక్కడ ఎం.పి. మొదలైనవారిగా అయితే చదువు ద్వారా అవ్వరు. ఇక్కడైతే ఎన్నికలు జరుగుతాయి, ఓట్లు ఆధారముగా ఎం.పి. మొదలైనవారిగా అవుతారు. ఇప్పుడు ఆత్మలైన మీకు తండ్రి శ్రీమతము లభిస్తుంది. మేము ఆత్మకు మతమును ఇస్తాము అని ఇంకెవ్వరూ ఇలా అనరు. వారంతా దేహాభిమానులు. తండ్రియే వచ్చి దేహీ-అభిమానులుగా అవ్వడం నేర్పిస్తారు. అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. మనుష్యులు శరీరానికి ఎంతగా అలంకరణ చేసుకుంటారు. ఇక్కడైతే తండ్రి ఆత్మలనే చూస్తారు. శరీరము నశ్వరమైనది, పైసకు కొరగానిది. జంతువుల విషయములోనైతే కనీసం చర్మమైనా అమ్ముడుపోతుంది, కానీ మనుష్య శరీరమైతే ఎందుకూ పనికిరాదు. ఇప్పుడు తండ్రి వచ్చి విలువైనవారిగా తయారుచేస్తారు.

ఇప్పుడు మనమే దేవతలుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు కావున ఈ నషా ఎక్కి ఉండాలి. కానీ ఈ నషా కూడా నంబరువారు పురుషార్థానుసారముగానే ఉంటుంది. ధనము యొక్క నషా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు. మీ సంపాదన ఎంతగానో జరుగుతుంది. మీ మహిమ కూడా అనేక రకాలుగా ఉంటుంది. మీరు పుష్పాలతోటను తయారుచేస్తారు. సత్యయుగాన్ని పుష్పాలతోట అని అంటారు. దీని అంటు ఎప్పుడు కట్టబడుతుందో కూడా ఎవరికీ తెలియదు. మీకు తండ్రి అర్థం చేయిస్తారు. ఓ తోట యజమాని రండి అని పిలుస్తారు కూడా. వారిని తోటమాలి అని అనరు. సెంటర్లను సంబాళించే పిల్లలైన మీరే తోటమాలులు. తోటమాలులు అనేక రకాలవారు ఉంటారు. తోట యజమాని ఒక్కరే. మొఘల్ గార్డెన్ లోని తోటమాలికి జీతము కూడా ఎంతో ఎక్కువగానే లభిస్తూ ఉండవచ్చు. ఆ తోటను ఎంత సుందరముగా తయారుచేస్తారంటే దానిని చూసేందుకు అందరూ వస్తారు. మొఘలులు ఎంతో అభిరుచి కలవారిగా ఉంటారు. భార్య చనిపోతే తాజ్ మహల్ నిర్మించారు. వారి పేరు కొనసాగుతూ వస్తుంది. ఎంత మంచి-మంచి స్మృతిచిహ్నాలను నిర్మించారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మనుష్యుల మహిమ ఎంతగా జరుగుతుంది. మనుష్యులు మనుష్యులే కదా. యుద్ధాలలో అనేకానేకమంది మనుష్యులు మరణిస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు. కిరోసిన్, పెట్రోల్ పోసి తగులబెట్టేస్తారు. కొందరైతే అలాగే పడి ఉంటారు. పూడ్చిపెట్టరు కదా. అసలు గౌరవము లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు నారాయణీ నషా ఎంతగా ఎక్కాలి. ఇది విశ్వాధిపత్యము యొక్క నషా. సత్యనారాయణుని కథ ఉంది అంటే తప్పకుండా నారాయణునిగానే అవుతారు కదా. ఆత్మకు జ్ఞానమనే మూడవ నేత్రము లభిస్తుంది. దానిని ఇచ్చేవారు తండ్రి. మూడవ నేత్రము యొక్క కథ కూడా ఉంది. వీటన్నింటి అర్థాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. కథలను వినిపించేవారికి ఏమీ తెలియదు. అమరకథను కూడా వినిపిస్తారు. అమరనాథ్ కోసమని ఎంతో దూరదూరాల వరకూ వెళ్తారు. తండ్రి అయితే ఇక్కడకు వచ్చి వినిపిస్తారు. పైన అయితే వినిపించరు కదా. అక్కడ కూర్చుని పార్వతికి అమరకథనేమీ వినిపించరు కదా. ఈ కథలు మొదలైనవి ఏవైతే తయారుచేశారో ఇవి కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి, ఇవి మళ్ళీ జరుగుతాయి. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు భక్తి మరియు జ్ఞానానికి మధ్యన వ్యత్యాసాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. ఓ ప్రభూ, అంధులకు దారిని చూపించండి అని అంటారు కదా. భక్తి మార్గములో పిలుస్తారు. తండ్రి వచ్చి మూడవ నేత్రాన్ని ఇస్తారు, దాని గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. జ్ఞానమనే మూడవ నేత్రము లేకపోతే ఒంటి కన్నువారు లేక తక్కువ చూపు కలవారు అని అంటారు. కళ్ళు కూడా ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. కొందరికి చాలా శోభాయమానమైన కళ్ళు ఉంటాయి, దానికి వారికి ప్రైజ్ కూడా లభిస్తుంది. అప్పుడు మిస్ ఇండియా, మిస్ ఫలానా అన్న పేర్లు పెడతారు. పిల్లలైన మిమ్మల్ని ఇప్పుడు తండ్రి ఎలా ఉన్నవారి నుండి ఎలా తయారుచేస్తారు. అక్కడైతే ప్రకృతి సిద్ధమైన సౌందర్యము ఉంటుంది. శ్రీకృష్ణునికి ఇంత మహిమ ఎందుకు ఉంది? ఎందుకంటే అతడు అందరికన్నా ఎక్కువ సుందరముగా అవుతారు. కర్మాతీత అవస్థకు నంబర్ వన్ లో చేరుకుంటారు, అందుకే వారికి నంబర్ వన్ గా గాయనము ఉంది. ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి పదే పదే చెప్తున్నారు - పిల్లలూ, మన్మనాభవ. ఓ ఆత్మల్లారా, మీ తండ్రిని స్మృతి చేయండి. పిల్లల్లో కూడా నంబరువారుగా అయితే ఉంటారు కదా. ఒకవేళ లౌకిక తండ్రికి ఐదుగురు పిల్లలు ఉన్నారనుకోండి, అందులో ఎవరైతే చాలా తెలివైనవారిగా ఉంటారో వారిని నంబర్ వన్ లో ఉంచుతారు. వారు మాలలోని మణులే కదా. తర్వాత వీరు రెండవ నంబరు వారు, వీరు మూడవ నంబరు వారు అని అంటారు. ఎవరూ ఒకే విధముగా ఉండరు. తండ్రి ప్రేమ కూడా నంబరువారుగా ఉంటుంది. అది హద్దులోని విషయము, ఇది అనంతమైన విషయము.

ఏ పిల్లలకైతే జ్ఞానమనే మూడవ నేత్రము లభించిందో, వారి బుద్ధి మరియు నడవడిక మొదలైనవి చాలా రిఫైన్ గా ఉంటాయి. కింగ్ ఆఫ్ ఫ్లవర్ (పుష్పాలలో రాజు) ఉంటుంది కదా. అలా ఈ బ్రహ్మా, సరస్వతులు కింగ్ మరియు క్వీన్ ఫ్లవర్ వంటివారు. జ్ఞానము మరియు స్మృతి, రెండింటిలోనూ చురుకుగా ఉన్నారు. మనం దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ముఖ్యమైనవారిగా ఎనిమిది రత్నాలు తయారవుతారు. మొట్టమొదట పుష్పము ఉంటుంది, ఆ తర్వాత జంట పూసలుగా బ్రహ్మా-సరస్వతులు ఉంటారు. మాలను స్మరిస్తారు కదా. వాస్తవానికి మీ పూజ జరుగదు, స్మరణ జరుగుతుంది. మీపై పుష్పాలు అర్పించడం జరుగదు. ఎప్పుడైతే శరీరము కూడా పవిత్రముగా అవుతుందో అప్పుడే పుష్పాలు అర్పిస్తారు. ఇక్కడ ఎవరి శరీరమూ పవిత్రముగా లేదు. అందరూ విషము ద్వారా జన్మిస్తారు, అందుకే వికారులు అని అంటారు. ఈ లక్ష్మీ-నారాయణులను సంపూర్ణ నిర్వికారులు అనే అంటారు. వారికి కూడా పిల్లలైతే జన్మిస్తారు కదా. అలాగని ఏదో ట్యూబ్ నుండి పిల్లలు పుడతారని కాదు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు. పిల్లలైన మిమ్మల్ని ఇక్కడ ఏడు రోజులు భట్టీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. భట్టీలో ఇటుకలు కొన్ని పూర్తిగా కాలుతాయి, కొన్ని పచ్చిగానే ఉండిపోతాయి. భట్టీ ఉదాహరణను ఇస్తారు. ఇప్పుడు ఇటుకల భట్టి గురించి శాస్త్రాలలో ఏమైనా వర్ణించగలరా. అంతేకాక అందులో పిల్లి ఉదాహరణ కూడా ఉంది. గులేబకావళి కథలో కూడా పిల్లిని చూపించారు. అది దీపాన్ని ఆర్పివేసేది. మీ పరిస్థితి కూడా ఇలా అవుతుంది కదా. మాయా పిల్లి విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. మీ అవస్థనే పడేస్తుంది. దేహాభిమానము మొట్టమొదటిది, ఆ తర్వాత ఇతర వికారాలు వస్తాయి. మోహము కూడా ఎంతో ఉంటుంది. నేను భారత్ ను స్వర్గముగా తయారుచేసే ఆత్మిక సేవను చేస్తాను అని కూతురు అంటే, మోహానికి వశమై తల్లిదండ్రులు మేము అనుమతించము అని అంటారు. ఇది కూడా ఎంతటి మోహము. మీరు మోహపు పిల్లలుగా అవ్వకూడదు. మీ లక్ష్యమే ఇది. తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. కావున మీ కర్తవ్యము - మీ తోటివారి సేవను చేయడము, భారత్ సేవను చేయడము. మేము ఎలా ఉండేవారము కానీ ఎలా అయిపోయాము అన్నది మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ రాజులకే రాజులుగా అయ్యేందుకు పురుషార్థము చేయండి. మనం మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు. ఇందులో ఎటువంటి కష్టమైన విషయమూ లేదు. వినాశనము కొరకు కూడా డ్రామాలో యుక్తి రచింపబడింది. ఇంతకుముందు కూడా మిసైల్స్ ద్వారా యుద్ధము జరిగింది. ఎప్పుడైతే మీ పూర్తి తయారీ జరుగుతుందో, అందరూ పుష్పాలుగా తయారైపోతారో, అప్పుడు వినాశనము జరుగుతుంది. కొందరు పుష్పాలలో రాజులా ఉన్నారు, కొందరు గులాబీలా, కొందరు మల్లెల్లా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తాము జిల్లేడులా ఉన్నామా లేక పుష్పములా ఉన్నామా అన్నది తమను తాము బాగా అర్థం చేసుకోగలరు. జ్ఞాన ధారణ ఏ మాత్రమూ లేనివారు ఎందరో ఉన్నారు. నంబరువారుగా అయితే అవుతారు కదా. అయితే చాలా ఉన్నతోన్నతముగా అవుతారు లేకపోతే చాలా తక్కువగా అవుతారు. రాజధాని ఇక్కడే తయారవుతుంది. పాండవులు కరిగిపోయి మరణించారని శాస్త్రాలలో చూపించారు, మరి ఆ తర్వాత ఏమైంది అన్నది ఏమీ తెలియదు. కథలనైతే ఎన్నో తయారుచేశారు కానీ అటువంటి విషయమేదీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత స్వచ్ఛబుద్ధి కలవారిగా అవుతారు. బాబా మీకు ఎన్నో రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇది ఎంత సహజము. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. తండ్రి అంటారు, నేనే పతిత-పావనుడను. మీ ఆత్మ మరియు శరీరము, రెండూ పతితముగా ఉన్నాయి. ఇప్పుడు పావనముగా అవ్వాలి. ఆత్మ పవిత్రముగా అయితే శరీరము కూడా పవిత్రముగా అవుతుంది. ఇప్పుడు మీరు చాలా కష్టపడాలి. తండ్రి అంటారు - పిల్లలు చాలా బలహీనముగా ఉన్నారు, స్మృతిని మర్చిపోతున్నారు. బాబా స్వయం తమ అనుభవాన్ని తెలియజేస్తారు. భోజనము చేసేటప్పుడు - శివబాబా నాకు తినిపిస్తున్నారు అని స్మృతి చేస్తాను, మళ్ళీ మర్చిపోతాను, మళ్ళీ గుర్తుకువస్తుంది. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా ఉన్నారు. కొందరైతే బంధనముక్తులుగా ఉన్నా మళ్ళీ చిక్కుకుపోతారు. పిల్లలను దత్తత తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చే తండ్రి లభించారు. దీనికి మూడవ నేత్రము యొక్క కథ అన్న పేరును పెట్టారు అనగా మూడవ నేత్రము ప్రాప్తింపజేసే కథ. ఇప్పుడు మీరు నాస్తికుల నుండి అస్తికులుగా అవుతారు. తండ్రి బిందువని పిల్లలకు తెలుసు. వారు జ్ఞాన సాగరుడు. వాళ్ళు భగవంతుడిని నామ-రూపాలకు అతీతుడు అని అంటారు. అరే, జ్ఞాన సాగరుడు అంటే తప్పకుండా జ్ఞానాన్ని వినిపిస్తారు కదా. వారి రూపాన్ని కూడా లింగములా చూపిస్తారు, మరి అటువంటప్పుడు నామ-రూపాలకు అతీతుడు అని ఎలా అంటారు! వందల కొలది పేర్లు పెట్టారు. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానమంతా మంచి రీతిలో ఉండాలి. పరమాత్మ జ్ఞాన సాగరుడు అని అంటారు కూడా. మొత్తం అడవినంతా కలముగా చేసినా అది అంతమవ్వజాలదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు మనం తండ్రి ద్వారా ఎంతో విలువైనవారిగా అయ్యాము, మనమే దేవతలుగా అవ్వబోతున్నము - ఇదే నారాయణీ నషాలో ఉండాలి. బంధనముక్తులుగా అయి సేవను చేయాలి, బంధనాలలో చిక్కుకోకూడదు.

2. జ్ఞాన-యోగాలలో చురుకుగా అయి మాతా-పితల సమానముగా పుష్పాలలో రాజులా అవ్వాలి మరియు తమ తోటివారి సేవను కూడా చేయాలి.

వరదానము:-
తమ సర్వ ఖజానాలను ఇతర ఆత్మల సేవలో వినియోగించి సహయోగిగా అయ్యే సహజయోగీ భవ

సహజయోగిగా అయ్యేందుకు సాధనము ఏమిటంటే - సదా తమ సంకల్పము ద్వారా, వాణి ద్వారా మరియు ప్రతి కర్మ ద్వారా స్వయాన్ని విశ్వములోని సర్వ ఆత్మల పట్ల సేవాధారిగా భావించి సేవలోనే సర్వస్వాన్ని వినియోగించాలి. బ్రాహ్మణ జీవితములో శక్తులు, గుణాలు, జ్ఞానమనే ఖజానా మరియు శ్రేష్ఠ సంపాదన చేసుకునే సమయము అనే ఖజానా ఏవైతే తండ్రి ద్వారా ప్రాప్తించాయో వాటిని సేవలో వినియోగించండి అనగా సహయోగిగా అవ్వండి, అప్పుడు సహజయోగిగా తప్పకుండా అవుతారు. కానీ ఎవరైతే సంపన్నులో వారే సహయోగులుగా అవ్వగలరు. సహయోగిగా అవ్వటము అనగా మహాదానిగా అవ్వటము.

స్లోగన్:-
అనంతమైన వైరాగిగా అయినట్లయితే ఆకర్షణ యొక్క అన్ని సంస్కారాలు సహజముగానే సమాప్తమైపోతాయి.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి

ఏ విధంగా మీ స్థూల కార్యాల ప్రోగ్రామ్ ను దినచర్య అనుసారముగా సెట్ చేసుకుంటారో అలా మీ మనసా సమర్థ స్థితి యొక్క ప్రోగ్రామ్ ను సెట్ చేసుకున్నట్లయితే సంకల్ప శక్తి జమ అవుతూ ఉంటుంది. మీ మనసును సమర్థ సంకల్పాలలో బిజీగా పెట్టుకున్నట్లయితే మనసుకు అప్సెట్ (డిస్టర్బ్) అయ్యే సమయము కూడా లభించదు. మనసు సదా సెట్ అయ్యి ఉన్నట్లయితే అనగా ఏకాగ్రమై ఉన్నట్లయితే స్వతహాగనే మంచి వైబ్రేషన్లు వ్యాపిస్తాయి, సేవ జరుగుతుంది.