29-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అనంతమైన తండ్రి ఈ అనంతమైన సభలోకి పేద పిల్లలను దత్తత తీసుకునేందుకు వచ్చారు, వారికి దేవతల సభలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు’’

ప్రశ్న:-
పిల్లలు ఏ రోజును చాలా వైభవముగా జరుపుకోవాలి?

జవాబు:-
ఏ రోజున మరజీవా జన్మ జరిగిందో, తండ్రి పట్ల నిశ్చయము ఏర్పడిందో... ఆ రోజును చాలా వైభవముగా జరుపుకోవాలి. ఆ రోజే మీకు జన్మాష్టమి వంటిది. ఒకవేళ మీ మరజీవా జన్మను జరుపుకున్నట్లయితే, మేము పాత ప్రపంచము నుండి పక్కకు వచ్చేసామని, మేము బాబాకు చెందినవారిగా అయ్యామని అనగా వారసత్వానికి అధికారులుగా అయ్యామని బుద్ధిలో గుర్తుంటుంది.

పాట:-
సభలో దీపము వెలిగింది...

ఓంశాంతి
పాటలు, కవితలు, భజనలు, వేద-శాస్త్రాలు, ఉపనిషత్తులు, దేవతల మహిమ మొదలైనవి భారతవాసీ పిల్లలైన మీరు చాలానే వింటూ వచ్చారు. ఇప్పుడు మీకు ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనే అవగాహన లభించింది. గతాన్ని గురించి కూడా పిల్లలు తెలుసుకున్నారు. వర్తమాన ప్రపంచము ఎలా ఉంది అనేది కూడా మీరు చూస్తున్నారు. దానిని ప్రాక్టికల్ గా అనుభవం కూడా చేసారు. ఇకపోతే, ఏదైతే జరగబోతుందో, దానిని ఇంతవరకు ప్రాక్టికల్ గా అనుభవం చేయలేదు. ఏదైతే గతంలో జరిగిందో, దానిని అనుభవం చేసారు. ఈ విషయాలను తండ్రియే అర్థం చేయించారు, తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఎంతోమంది మనుష్యులున్నారు కానీ వారికేమీ తెలియదు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి ఏమీ తెలియదు. ఇప్పుడిది కలియుగాంతము, ఇది కూడా మనుష్యులకు తెలియదు. అవును, మున్ముందు అంతిమము గురించి తెలుసుకుంటారు. మూలాన్ని తెలుసుకుంటారు, అంతేకానీ మొత్తం జ్ఞానాన్ని తెలుసుకోరు. చదువుకునే విద్యార్థులు మాత్రమే తెలుసుకోగలరు. ఇది మనుష్యుల నుండి రాజులకే రాజులుగా అవ్వడము. అది కూడా ఆసురీ రాజులుగా కాదు, ఆసురీ రాజుల చేత పూజించబడే దైవీ రాజులుగా అవ్వడము. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. విద్వాంసులు, ఆచార్యులు మొదలైనవారికి కొంచెం కూడా తెలియదు. ఏ భగవంతుడినైతే జ్యోతి అని పిలుస్తారో, వారి గురించి తెలియదు. పాటలు పాడేవారికి కూడా ఏమీ తెలియదు. వారు కేవలం మహిమను పాడుతూ ఉంటారు. భగవంతుడు కూడా ఏదో ఒక సమయములో ఈ ప్రపంచమనే సభలోకి వచ్చారు. సభ అనగా చాలామంది కలుసుకునే స్థానము. సభలో ఆహార-పానీయాలు, మద్యం మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు ఈ సభలో మీకు తండ్రి నుండి అవినాశీ జ్ఞాన రత్నాల ఖజానా లభిస్తుంది లేదా తండ్రి నుండి మనకు వైకుంఠము యొక్క రాజ్యాధికారము లభిస్తుందని అనవచ్చు. ఈ మొత్తం సభలో కేవలం పిల్లలకు మాత్రమే తండ్రి గురించి తెలుసు, వారు మనకు కానుకను ఇచ్చేందుకు వచ్చారని తెలుసు. ఈ సభలో తండ్రి ఏమి ఇస్తారు, ఆ సభలలో మనుష్యులు ఒకరికొకరు ఏమి ఇచ్చుకుంటారు - ఈ రెండింటికి మధ్యన రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి హల్వా తినిపిస్తారు మరియు వారు చాలా చవకైన శెనగలను తినిపిస్తారు. హల్వా మరియు శెనగలు, ఈ రెండింటికి ఎంత తేడా ఉంది. ఒకరికొకరు శెనగలు తినిపించుకుంటూ ఉంటారు. ఎవరైనా సంపాదించకపోతే, వారిని - ఇతడు శెనగలు నములుతున్నాడని అంటారు.

అనంతమైన తండ్రి మనకు స్వర్గ రాజ్యము యొక్క వరదానాన్ని ఇస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. శివబాబా ఈ సభలోకి వస్తారు కదా. శివజయంతిని కూడా జరుపుకుంటారు కదా. కానీ వారు వచ్చి ఏం చేస్తారు - ఇది ఎవరికీ తెలియదు. వారు తండ్రి. తండ్రి తప్పకుండా ఏదో ఒకటి తినిపిస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. మాతా-పితలు జీవన పాలననైతే చేస్తారు కదా. ఆ మాతా-పితలు వచ్చి జీవితాన్ని సంభాళిస్తారని, దత్తత తీసుకుంటారని మీకు కూడా తెలుసు. పిల్లలు స్వయంగా అంటారు - బాబా, మేము మీకు పది రోజుల పిల్లలము అనగా పది రోజుల నుండి మీ వారిగా అయ్యాము. కావున మీరు వారి నుండి స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు హక్కుదారులుగా అయ్యారని, వారు దత్తత తీసుకున్నారని అర్థం చేసుకోవాలి. జీవించి ఉండగానే ఎవరి వద్దకైనా దత్తతలో వెళ్తే, అక్కడ అంధవిశ్వాసముతో వెళ్ళరు కదా. తల్లిదండ్రులు కూడా పిల్లలను దత్తతలో ఇస్తారు. మా పిల్లలు వారి వద్ద ఇంకా ఎక్కువ సుఖముగా ఉంటారు, వారు మరింత ప్రేమగా సంభాళిస్తారని భావిస్తారు. మీరు కూడా లౌకిక తండ్రికి పిల్లలు, ఇక్కడ అనంతమైన తండ్రి ద్వారా దత్తత తీసుకోబడతారు. అనంతమైన తండ్రి ఎంత అభిరుచితో దత్తత తీసుకుంటారు. బాబా, మేము మీ వారిగా అయిపోయాము అని పిల్లలు కూడా వ్రాస్తారు. ఈ మాటను కేవలం దూరం నుండే అనరు. ప్రాక్టికల్ గా దత్తత తీసుకోవడము జరిగినప్పుడు ఉత్సవము కూడా జరుపుకుంటారు. జన్మదినాన్ని జరుపుకుంటారు కదా. అలా ఇక్కడ కూడా పిల్లలుగా అవుతారు. మేము మీ వారము అని అంటారు. మరి 6-7 రోజుల తర్వాత నామకరణ వేడుకను కూడా జరుపుకోవాలి కదా. కానీ అలా ఎవరూ జరుపుకోరు. తమ జన్మాష్టమిని చాలా వైభవముగా జరుపుకోవాలి. కానీ అలా జరుపుకోవటమే లేదు. మేము జయంతిని జరుపుకోవాలి అనే జ్ఞానము కూడా లేదు. 12 నెలల తర్వాత జరుపుకుంటారు. అరే, మొదటిలో జరుపుకోనప్పుడు, 12 నెలల తర్వాత అయినా ఎందుకు జరుపుకుంటారు. జ్ఞానమే లేదు కనుక నిశ్చయము కూడా ఉండదు. ఒకసారి జన్మదినాన్ని జరుపుకున్నారంటే, పక్కా అయిపోయినట్లు. ఒకవేళ జన్మదినాన్ని జరుపుకున్నా పారిపోయినట్లయితే, వారు మరణించారని భావించడం జరుగుతుంది. కొంతమంది జన్మదినాన్ని కూడా చాలా వైభవముగా జరుపుకుంటారు. ఒకవేళ ఎవరైనా పేదవారైతే, బెల్లం-శెనగలను కూడా పంచవచ్చు, ఎక్కువేమీ అవసరం లేదు. పిల్లలకు పూర్తిగా అర్థం కాదు, అందుకే సంతోషముండదు. జన్మదినాన్ని జరుపుకున్నట్లయితే ఆ స్మృతి కూడా పక్కాగా ఉంటుంది. కానీ అటువంటి బుద్ధి లేదు. ఈ రోజు తండ్రి మళ్ళీ అర్థం చేయిస్తున్నారు - ఎవరెవరైతే కొత్తగా పిల్లలుగా అయ్యారో, వారికి నిశ్చయము ఏర్పడితే జన్మదినాన్ని జరుపుకోవాలి. ఫలానా రోజు మాకు నిశ్చయము ఏర్పడింది, ఆ రోజు నుండి మా జన్మాష్టమి ప్రారంభమవుతుంది. పిల్లలు తండ్రిని మరియు వారసత్వాన్ని పూర్తిగా స్మృతి చేయాలి. నేను ఫలానావారి బిడ్డను అని బిడ్డ ఎప్పుడూ మర్చిపోడు. కానీ ఇక్కడ, బాబా, మీరు మాకు గుర్తు రావడము లేదు అని అంటారు. అజ్ఞాన కాలములో ఎప్పుడూ ఈ విధముగా అనరు. గుర్తుకు రాకపోవడమనే ప్రశ్నే తలెత్తదు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, తండ్రి అయితే అందరినీ స్మృతి చేస్తారు. నా పిల్లలందరూ కామ చితిపై కాలిపోయి భస్మమైపోయారు. ఈ విధముగా ఇంకే గురువు లేక మహాత్మ మొదలైనవారు అనరు. మీరంతా నా పిల్లలే అన్నది భగవానువాచ. భగవంతునికైతే అందరూ పిల్లలే కదా. ఆత్మలందరూ తండ్రి అయిన పరమాత్మకు పిల్లలు. తండ్రి కూడా శరీరములోకి వచ్చినప్పుడు - ఈ ఆత్మలందరూ నా పిల్లలు అని అంటారు. కామ చితి పైకి ఎక్కి భస్మీభూతులై తమోప్రధానముగా అయిపోయారు. భారతవాసులు ఎంతగా ఇనుపయుగము వారిగా అయిపోయారు. కామ చితిపై కూర్చుని అందరూ నల్లగా అయిపోయారు. ఎవరైతే నంబర్ వన్ పూజ్యులుగా, సుందరముగా ఉండేవారో, వారే ఇప్పుడు పూజారులుగా, నల్లగా అయిపోయారు. సుందరముగా ఉన్నవారు శ్యామముగా అయిపోయారు. కామ చితి పైకి ఎక్కడము అనగా పాము పైకి ఎక్కడమే. ఎవరినైనా కాటు వేసేందుకు వైకుంఠములో పాములు మొదలైనవేవీ ఉండవు. అక్కడ ఇలాంటి విషయాలు ఉండవు.

తండ్రి అంటారు - 5 వికారాలు ప్రవేశించడముతో మీరు అడవి ముళ్ళ వలె అయిపోయారు. బాబా, ఇది ముళ్ళ అడవి అని మేము ఒప్పుకుంటాము అని అంటారు. ఒకరినొకరు కాటు వేసుకుని అందరూ భస్మీభూతులైపోయారు. భగవానువాచ - జ్ఞానసాగరుడినైన నా పిల్లలు, ఎవరినైతే నేను కల్పక్రితం కూడా వచ్చి స్వచ్ఛముగా తయారుచేసానో, వారు ఇప్పుడు పతితముగా, నల్లగా అయిపోయారు. తాము తెల్లగా ఉన్నవారి నుండి నల్లగా ఎలా అయ్యారు అనేది పిల్లలకు తెలుసు. మొత్తం 84 జన్మల చరిత్ర-భౌగోళికాలు సార రూపములో బుద్ధిలో ఉన్నాయి. కొంతమందికి 5-6 సంవత్సరాల వయసు నుండి తమ జీవిత చరిత్ర గురించి నంబరువారు బుద్ధి అనుసారముగా తెలుసునని ఈ సమయములో మీకు తెలుసు. మేము ఏమేమి చెడు పనులు చేసాము - అని ప్రతి ఒక్కరికీ తమ గత చరిత్ర గురించి కూడా తెలుసు. మేము ఏమేమి చేసాము అని పెద్ద-పెద్ద విషయాలను గురించి చెప్పగలుగుతారు. పూర్వ జన్మను గురించైతే అసలు చెప్పలేరు. జన్మజన్మల చరిత్రను గురించి ఎవరూ చెప్పలేరు. ఇకపోతే, ఎవరైతే పూర్తి 84 జన్మలను తీసుకున్నారో, వారికి తండ్రి కూర్చుని, 84 జన్మలను ఎలా తీసుకున్నారు అనేది అర్థం చేయిస్తారు, వారికే ఈ విషయాలు స్మృతిలోకి వస్తాయి. ఇంటికి వెళ్ళేందుకు నేను మీకు మతాన్ని ఇస్తాను. అందుకే తండ్రి అంటారు - ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారి కోసముంది. ఒకవేళ ఇల్లు అయిన ముక్తిధామానికి వెళ్ళాలనుకుంటే తండ్రి మాత్రమే తీసుకువెళ్ళగలరు. తండ్రి లేకుండా ఎవరూ తమ ఇంటికి వెళ్ళలేరు. తండ్రిని స్మృతి చేసి అక్కడికి (శాంతిధామానికి) చేరగలిగే యుక్తి ఎవరి వద్ద లేదు. పునర్జన్మలనైతే అందరూ తీసుకోవాల్సిందే. తండ్రి తప్ప ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు. మోక్షము గురించైతే ఎప్పుడూ ఆలోచించకూడదు ఎందుకంటే అది లభించదు. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా, దీని నుండి ఎవరూ బయటకు రాలేరు. అందరికీ ఒక్క తండ్రియే లిబరేటర్ (ముక్తిప్రదాత) మరియు గైడ్ (మార్గదర్శకుడు). వారే వచ్చి ఈ యుక్తిని తెలియజేస్తారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. లేకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. పురుషార్థము చేయడము లేదు అంటే వారు ఇక్కడికి సంబంధించినవారు కాదు అని అనుకోవడము జరుగుతుంది. ముక్తి-జీవన్ముక్తుల మార్గము పిల్లలైన మీకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ప్రతి ఒక్కరి అర్థం చేయించే వేగము ఎవరిది వారిదే. ఈ సమయములో పతిత ప్రపంచము ఉందని మీరు కూడా చెప్పవచ్చు. ఎంతగా కొట్లాటలు మొదలైనవి జరుగుతుంటాయి. సత్యయుగములో ఇవేవీ ఉండవు. ఇప్పుడిది కలియుగము. ఈ విషయాన్ని మనుష్యులందరూ ఒప్పుకుంటారు. సత్యయుగము, త్రేతాయుగము... బంగారు యుగము, వెండి యుగము... ఇతర భాషలలో కూడా తప్పకుండా ఏవో పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీషు అయితే అందరికీ తెలుసు. ఇంగ్లీషు నుండి హిందీకి డిక్షనరీ కూడా ఉంటుంది. బ్రిటీషు వారు చాలా కాలం రాజ్యము చేసి వెళ్ళారు కనుక వారి ఇంగ్లీషును ఉపయోగిస్తారు.

మాలో ఏ గుణాలు లేవు అని ఈ సమయములో మనుష్యులు అంగీకరిస్తారు. బాబా, మీరు వచ్చి దయ చూపించండి, మమ్మల్ని మళ్ళీ పవిత్రముగా తయారుచేయండి, మేము పతితముగా ఉన్నామని అంటారు. పతితాత్మలు ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అందరూ సతో, రజో, తమోలలోకి రావాల్సిందే. ఇప్పుడు తండ్రి ఈ పతిత సభలోకి వస్తారు, ఇది ఎంత పెద్ద సభ. నేను దేవతల సభలోకి ఎప్పుడూ రానే రాను. ఎక్కడైతే 36 రకాల సంపన్న భోజనము లభిస్తుందో, అక్కడకు నేను అసలు రానే రాను. ఎక్కడైతే పిల్లలకు రోటీ కూడా లభించదో, వారి వద్దకు వచ్చి, వారిని దత్తత తీసుకుని, పిల్లలుగా చేసుకుని వారసత్వాన్ని ఇస్తాను. షావుకారులను దత్తత తీసుకోను, వారు తమ నషాలోనే నిమగ్నమై ఉంటారు. మాకైతే స్వర్గము ఇక్కడే ఉందని వారు స్వయం అంటారు, మళ్ళీ ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. అంటే తప్పకుండా ఇది నరకమైనట్లే కదా. మీరు ఎందుకు అర్థం చేయించరు. ఇప్పుడు వార్తాపత్రికలలో కూడా ఇంకా ఎవరూ యుక్తియుక్తముగా వ్రాయలేదు. మన చేత డ్రామా పురుషార్థము చేయిస్తుందని పిల్లలకు కూడా తెలుసు. మనము ఏ పురుషార్థమైతే చేస్తున్నామో, అది డ్రామాలో నిశ్చితమై ఉంది. పురుషార్థము చేయడము కూడా తప్పనిసరి. డ్రామా అని అంటూ కూర్చుండిపోకూడదు. ప్రతి విషయములోనూ తప్పకుండా పురుషార్థము చేయాల్సిందే. మీరు కర్మయోగులు, రాజయోగులు కదా. వారు కర్మ సన్యాసులు, హఠయోగులు. మీరు అన్నీ చేస్తారు. ఇంటిలో ఉంటూ పిల్లలను సంభాళిస్తారు. కానీ ఆ సన్యాసులైతే పారిపోతారు, వారికి అవి నచ్చవు. కానీ భారత్ లో వారి పవిత్రత కూడా కావాలి కదా. ఎంతైనా అది మంచిదే. ఇప్పుడైతే పవిత్రముగా కూడా ఉండటం లేదు. పవిత్రముగా ఉన్నంత మాత్రాన వారు పవిత్ర ప్రపంచములోకి వెళ్ళగలరు అనేమీ కాదు. తండ్రి తప్ప ఎవరూ తీసుకువెళ్ళలేరు. శాంతిధామము మన ఇల్లు అని ఇప్పుడు మీకు తెలుసు. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి? చాలా పాపాలు చేసారు. ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇలా అంటూ ఎవరి గౌరవాన్ని పోగొడుతున్నారు? శివబాబా గౌరవాన్ని పోగొడుతున్నారు. కుక్కలో, పిల్లిలో, కణ-కణములో పరమాత్మ ఉన్నారని అంటారు. ఇప్పుడు నేను ఎవరికి రిపోర్టు చేయాలి! తండ్రి అంటారు - నేనే సమర్థుడను. నాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ఇది అందరికీ వినాశన సమయము. అందరూ శిక్షలు మొదలైనవి అనుభవించి తిరిగి వెళ్ళిపోతారు. డ్రామా రచనయే ఈ విధముగా ఉంది. శిక్షలు తప్పకుండా అనుభవించాల్సిందే. అవి సాక్షాత్కారమవుతాయి కూడా. గర్భ జైలులో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి - నీవు ఈ-ఈ పనులు చేసావు కనుక వాటికి ఇప్పుడు శిక్ష లభిస్తుందని సాక్షాత్కారమవుతుంది. అప్పుడిక ఈ జైలు నుండి బయటకు తీయండి, నేను మళ్ళీ ఇటువంటి పాపాలు చేయను అని అంటారు. తండ్రి ఇక్కడ సమ్ముఖముగా వచ్చి ఈ విషయాలన్నింటినీ మీకు అర్థం చేయిస్తారు. గర్భములో శిక్షలు అనుభవిస్తారు. అది కూడా జైలే, దుఃఖము అనుభవమవుతుంది. అక్కడ సత్యయుగములో శిక్షలు అనుభవించేందుకు రెండు రకాల జైళ్ళు ఉండవు.

ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది. మీ ఈ మాటలను చాలామంది అంగీకరిస్తారు. భగవంతుడు అన్న పేరైతే ఉంది కానీ కేవలం శ్రీకృష్ణుని పేరు వ్రాసి పొరపాటు చేసారు. ఇప్పుడు తండ్రి కూడా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరు ఏదైతే వింటారో, దానిని విని వార్తాపత్రికలలో ముద్రించండి. శివబాబా ఈ సమయములో అందరికీ చెప్తున్నారు - మీరు 84 జన్మలను అనుభవించి తమోప్రధానముగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నేను సలహా ఇస్తున్నాను - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, తర్వాత మీరు ముక్తి-జీవన్ముక్తి ధామాలకు వెళ్ళిపోతారు. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది. అచ్ఛా, పిల్లలూ, మీకు ఎంత అర్థం చేయించాను, ఇంకెంతని అర్థం చేయించాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రతి విషయము కోసం పురుషార్థము తప్పకుండా చేయాలి. డ్రామా అని అంటూ కూర్చుండిపోకూడదు. కర్మయోగులుగా, రాజయోగులుగా అవ్వాలి. కర్మ సన్యాసులుగా, హఠయోగులుగా అవ్వకూడదు.

2. శిక్షలు అనుభవించకుండా తండ్రితో పాటు ఇంటికి వెళ్ళేందుకు స్మృతిలో ఉంటూ ఆత్మను సతోప్రధానముగా తయారుచేసుకోవాలి. నల్లగా ఉన్నవారి నుండి తెల్లగా అవ్వాలి.

వరదానము:-
సర్వ రూపాల ద్వారా, సర్వ సంబంధాల ద్వారా తమదంతా తండ్రి ముందు అర్పణ చేసే సత్యమైన స్నేహీ భవ

ఎవరి పట్లనైనా అతి స్నేహముంటే, ఆ స్నేహము కోసం అందరినీ పక్కన పెట్టి, అంతా వారి ముందు అర్పణ చేస్తారు. తండ్రికి పిల్లల పట్ల స్నేహముంది, అందుకే సదా కాలికమైన సుఖాల ప్రాప్తిని స్నేహీ పిల్లలకు కలిగిస్తారు. మిగిలిన వారందరినీ ముక్తిధామములో కూర్చోబెడతారు. అటువంటి పిల్లల స్నేహానికి ఋజువు ఏమిటంటే, వారు సర్వ రూపాలు, సర్వ సంబంధాల ద్వారా తమదంతా తండ్రి ముందు అర్పణ చేస్తారు. ఎక్కడైతే స్నేహముందో, అక్కడ యోగముంది మరియు యోగముంటే సహయోగముంటుంది. ఒక్క ఖజానాను కూడా మన్మతముతో వ్యర్థముగా పోగొట్టలేరు.

స్లోగన్:-
సాకార కర్మలో బ్రహ్మాబాబాను మరియు అశరీరిగా అవ్వడములో నిరాకార బాబాను ఫాలో చేయండి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

పిల్లలైన మీ వద్ద అనుభూతుల ఖజానా సంపన్నముగా ఉంది, కనుక మీరు సంపన్న మూర్తులైన మాస్టర్ దాతలుగా అయ్యి అందరికీ అనుభూతిని చేయిస్తూ వెళ్ళండి. దాత అనగా సేవాధారి. దాత ఇవ్వకుండా ఉండలేరు. వారు తమ దయార్ద్ర హృదయ గుణము ద్వారా కొందరికి ధైర్యాన్ని ఇస్తారు, కొందరు నిర్బల ఆత్మలకు బలాన్ని ఇస్తారు. వారు మాస్టర్ సుఖదాతలుగా ఉంటారు.