29-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పిల్లలైన మిమ్మల్ని తమతో పాటు
తీసుకువెళ్ళేందుకు అనంతమైన తండ్రి వచ్చారు, అందుకే ఇప్పుడు తండ్రికి చెందినవారిగా
అయ్యి వారి శ్రీమతముపై నడవండి’’
ప్రశ్న:-
తండ్రి తమ
పిల్లల అదృష్టాన్ని ఉన్నతముగా తయారుచేయడానికి ఏ శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు?
జవాబు:-
మధురమైన
పిల్లలూ, మృత్యువు కన్నా ముందే ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండే పురుషార్థము చేయండి,
దీనితోనే మీ సంపాదన జరుగుతుంది. నాకు బిడ్డగా అయి, పొరపాటున కూడా ఏ పాప కర్మ
చేయకూడదు. మాయా తుఫానులు ఎన్ని వచ్చినా కానీ పతితముగా ఎప్పుడూ అవ్వకండి.
ఓంశాంతి
శివ భగవానువాచ.
శివబాబా మనకు అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీరు భావిస్తారు. మీరు సంగమయుగానికి
చెందినవారు. మీరు శివబాబా సమ్ముఖములో కూర్చుని ఉన్నారు. ఆ కలియుగీ మనుష్యులు శివబాబా
యొక్క స్థూలమైన మందిరాలలోకి వెళ్ళి కూర్చుంటారు. తేడా అర్థమవుతుంది కదా. బుద్ధి
తాళాన్ని కొంచెమైనా తెరవండి. మనము చైతన్యమైన శివబాబా వద్ద కూర్చున్నామని మీకు తెలుసు.
బాబా మనతో సమ్ముఖముగా మాట్లాడుతున్నారు. శివబాబా బ్రహ్మా ద్వారా రాజయోగాన్ని
నేర్పిస్తున్నారు, ఇంకొకవైపు చూస్తే మనుష్యులు శివబాబాకు పూజలు చేస్తున్నారు. వారిని
వెతికేందుకు అమరనాథ్ కు, కాశీకి వెళ్తున్నారు. మరి మీరు, మేము శివబాబా వద్ద
కూర్చున్నాము అన్న విషయాన్ని పదే-పదే ఎందుకు మర్చిపోతారు, వారినే పరమపిత పరమాత్మ
అంటారు. వారికి ఎంత మహిమ ఉంది. వారిని మీరు ‘బాబా-బాబా’ అని పిలుస్తారు. మనము
శివబాబా మతముపై నడుస్తూ విశ్వానికి యజమానులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటున్నామని
మీకు తెలుసు. వారు మందిరాలు, తీర్థాలు మొదలైనవాటి వద్ద ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు
మరియు మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంత తేడా ఉందో చూడండి. మీతో పోలిస్తే వారు
ఎంత వివేకహీనులుగా ఉన్నారు. శివబాబా అంటున్నారు - నేను మీ ఒబీడియెంట్ సర్వెంట్ (విధేయత
కల సేవకుడిని). నేను మీకు వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. వారు గాడ్ ఫాదర్ ను
పిలుస్తూ ఉంటారు. ఇక్కడైతే మీరు గాడ్ ఫాదర్ కు సమ్ముఖములో కూర్చున్నారు. ఇక్కడ
బుద్ధిలో కూర్చుంటుంది కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు మర్చిపోతారు! ఇక్కడ
మీ కోసం ఇది పగలు, అక్కడ వారి కోసం అది రాత్రి. వారు ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు మరియు
మీరు సమ్ముఖములో కూర్చుని ఉన్నారు, మీరు అంటారు - మీతోనే కూర్చుంటాము, మీతోనే
వింటాము... కానీ ఇంటికి వెళ్ళి మర్చిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది. శివబాబాకు
పిల్లలుగా అయి పూజారుల నుండి పూజ్యులుగా అయ్యే పురుషార్థము కూడా చేస్తారు, మళ్ళీ
బయటకు వెళ్ళి పూజారులుగా అయిపోతారు. శివబాబా యొక్క స్థూలమైన మందిరాలకు వెళ్తూ ఉంటారు.
ఇక్కడైతే తండ్రి అర్థం
చేయిస్తున్నారు - పిల్లలూ, శ్రీమతముపై నడుస్తేనే మీరు శ్రేష్ఠముగా అవుతారు.
ముఖ్యమైనది పవిత్రత. అక్కడ జడమైన చిత్రాల ఎదురుగా వెళ్ళి కాశీలోని కత్తుల బావిలో
దూకుతారు. ఇక్కడైతే చైతన్యములో కూర్చుని ఉన్నారు. ఇక్కడ కత్తుల బావిలో దూకే విషయమేమీ
లేదు. ఇక్కడ జీవిస్తూ మరణించాలి. తండ్రి చెప్తున్నారు - శ్రీమతముపై నడవండి. ఇక్కడ
నుండి బయటకు వెళ్ళగానే తండ్రిని మర్చిపోతారు. ఇక ఎప్పుడూ ఉత్తరము కూడా వ్రాయరు.
కొందరు ఎలా ఉన్నారంటే - వారు బాబాను ఎప్పుడూ చూడలేదు కానీ తపిస్తూ-తపిస్తూ ఉత్తరాలు
వ్రాస్తూ ఉంటారు మరియు ఎవరైతే సమ్ముఖములో కలిసి వెళ్తారో వారు పూర్తిగా మర్చిపోతారు.
మీరైతే శివబాబాపై బలిహారమవ్వాలి కదా. భక్తి మార్గములో శివబాబాను కలుసుకునేందుకు
కాశీలోని కత్తుల బావిలోకి దూకేవారు కానీ వారు కలుసుకోలేరు. ఇప్పుడు తండ్రి
చైతన్యములోకి వచ్చి చెప్తున్నారు - పిల్లలూ, నా వారిగా అవ్వండి, నేను మిమ్మల్ని
తీసుకువెళ్ళేందుకు వచ్చాను, పవిత్రముగా అవ్వకుండానైతే వెళ్ళలేరు, పవిత్రముగా
తయారుచేయడానికి నేనే రావాల్సి ఉంటుంది. సర్వుల సద్గతిదాత అయిన తండ్రి మీ వద్ద
కూర్చుని ఉన్నారు. మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, గీతా భగవానుడు నేర్పించినది
ఇదే. వారు శ్రీకృష్ణుడిని భగవంతుడు అని అన్నారు. గీతా భగవానుడు శివబాబా అని మీకు
తెలుసు. మీరు ఉత్తరాలు కూడా - ‘శివబాబా కేరాఫ్ బ్రహ్మా’ అని వ్రాస్తారు. తండ్రి మీకు
సమ్ముఖములో కూర్చుని అర్థం చేయిస్తారు. అయినా - ఓహో! శివబాబా మమ్మల్ని ఒడిలోకి
తీసుకున్నారు, దత్త పుత్రునిగా చేసుకున్నారు అనే నషా ఎక్కదు. కానీ అందరినీ ఇక్కడ
ఉంచరు కదా. వేలాదిమంది పిల్లలున్నారు. అందరినీ ఇక్కడ ఎలా ఉంచుతారు, అంత చోటు
ఎక్కడుంది! తండ్రి అంటారు - మీరు ఉండటము మీ ఇళ్ళలోనే ఉండాలి. తండ్రిని స్మృతి చేయాలి.
అందరికంటే మధురమైన అనంతమైన తండ్రికి మీరు పిల్లలుగా అయ్యారు.
తండ్రి అర్థం
చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు కామ చితిపై కూర్చుని కాలి మరణించారు, ఇప్పుడు మీరు
జ్ఞాన చితిపై కూర్చుని దేవతలుగా అవ్వండి. దేవతలకు పూజలు కూడా చేస్తారు కానీ ఏమీ
అర్థం చేసుకోరు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉందని అంటారు. ఇప్పుడు మీరు చైతన్యముగా
శివబాబా వద్ద కూర్చుని ఉన్నారు. శివబాబా బ్రహ్మా ద్వారా విష్ణుపురిని స్థాపన
చేస్తారని అంటూ ఉంటారు కూడా. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఎలాంటి పాప
కర్మలు చేయకండి, దేహాభిమానములోకి రాకండి, మీరు నడుస్తూ-తిరుగుతూ ప్రియతముడిని స్మృతి
చేయాలి. ఎవరినైతే మీరు అర్ధకల్పము నుండి స్మృతి చేశారో, వారు ఇప్పుడు మీ సేవలో
ఉపస్థితులై ఉన్నారు. వారు ఆత్మిక సోషల్ వర్కర్ (సమాజ సేవకుడు). మీకు ఆత్మిక సేవను
నేర్పిస్తారు. సమాజ సేవ యొక్క హెడ్స్ కూడా ఉంటారు కదా. ఇది ఆత్మిక సమాజ సేవ. వారు
మానవ సమాజానికి భౌతిక సేవలు చేసేవారు. ఇప్పుడు చూడండి - గో హత్యను ఆపండి అని
వారంటారు. మీరు ఈ విధముగా వ్రాయవచ్చు - పరస్పరములో ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని
ఉపయోగించడము అన్నింటికంటే పెద్ద హత్య, ముందు దీనిని ఆపండి. దీని గురించే భగవంతుడు -
కామము మహాశత్రువు, ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది అని చెప్పారు. మీరు గీతా
భగవానుడిని మర్చిపోయారు. బాబాకు అయితే ఆశ్చర్యమనిపిస్తుంది. ఒక వైపు అమరనాథ్ వద్ద,
పర్వతాల వద్ద ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు, అక్కడ పార్వతికి అమరకథను వినిపించారని
అనుకుంటారు. ఇప్పుడు ఒక్క పార్వతికి కథను వినిపించడము వలన ఏమవుతుంది! తండ్రి అర్థం
చేయిస్తున్నారు, మీరంతా పార్వతులు. అందరికీ అమరకథను వినిపిస్తున్నారు. తండ్రి అంటారు
- పిల్లలూ, 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు మృత్యులోకములోకి వచ్చి
చేరుకున్నారు. అచ్ఛా, లక్ష్మీ-నారాయణులు ఎక్కడికి వెళ్ళారు, వారు తిరిగి వెళ్ళారా
లేక జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందా? సూర్యవంశీ రాజు-రాణులు, ప్రజలు అందరూ ఎక్కడికి
వెళ్ళారు? తప్పకుండా సతోప్రధానము నుండి 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ తమోప్రధానముగా
అయి ఉంటారు. అర్థమవుతుంది కదా! ఇక్కడ బ్రహ్మా ద్వారా శివబాబా కూర్చుని అర్థం
చేయిస్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు నేను మీ అదృష్టాన్ని తయారుచేయడానికి వచ్చాను, మరి
మీరు అదృష్టానికి అడ్డుగీత ఎందుకు గీసుకుంటారు! ఎంతోకొంత అర్థం చేసుకోండి. నేను
మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చాను. మీరు నా మతముపై నడవరా!
ఇంటికి వెళ్ళగానే స్మృతిని ఎందుకు మర్చిపోతారు! తండ్రి పదే-పదే అర్థం చేయిస్తున్నారు
- పిల్లలూ, ఇప్పుడు మీరు సంగమయుగానికి చెందినవారు, వారు కలియుగానికి చెందినవారు.
మీరు పూజ్యులు, వారు పూజారులు. మీరు భ్రమించడము ఇప్పుడు సమాప్తమైంది. వారు మిమ్మల్ని
నాస్తికులుగా భావిస్తారు కానీ మీరు వారిని నాస్తికులని అంటారు. మీరు భక్తి చేయరు
కనుక మీరు నాస్తికులని వారు అంటారు. మీరు అంటారు - మీకు తండ్రి గురించి తెలియదు
కనుక మీరు నాస్తికులు. మీరు అంటారు - మేము ఆస్తికులము, మేము తండ్రి గురించి
తెలుసుకుని వారసత్వాన్ని తీసుకుంటాము. మీకు తెలియదు కనుక మీరు ఎదురుదెబ్బలు తింటూ
ఉంటారు. కుంభమేళాకు కూడా ఎంతమంది వెళ్తారు, దాన-పుణ్యాలు చేస్తారు. ఇప్పుడు తండ్రి
అంటారు - ఈ విషయాలన్నింటినీ విడిచిపెట్టండి. మీకు జ్ఞానసాగరుడు లభించారు,
ఇంకెక్కడికి వెళ్తారు. వీరు జ్ఞాన నదులు. జ్ఞాన సాగరుని వద్ద జ్ఞాన స్నానము
చేయించేందుకు మిమ్మల్ని తీసుకువస్తారు. ఎంత మంచి-మంచి పిల్లలు తండ్రి వద్దకు వచ్చి,
మళ్ళీ వెళ్ళి అశుద్ధముగా అవుతారు. కొందరైతే తండ్రి మతముపై నడుస్తారు. బాబా, వినాశీ
ధనాన్ని ఎలా సఫలం చేయాలి అని అడుగుతారు! అప్పుడు వారికి అర్థం చేయించడము జరుగుతుంది
- మునిగిపోయిన నావ నుండి ఎంత తీయగలిగితే అంత మంచిది. భారత్ యొక్క సేవ కోసం
వినియోగించి దానిని సఫలం చేయండి, ఏదైనా సెంటర్ ను తెరవండి. ఈ చిత్రాలు కూడా ఎన్ని
తయారవుతూ ఉంటాయి. బాబా వద్ద ఎలాంటి పిల్లలు ఉన్నారంటే వారు అంటారు - బాబా,
అవసరమైనప్పుడు నన్ను గుర్తు చేయండి, నేను సహాయము చేయడానికి హాజరై ఉన్నాను, యజ్ఞానికి
సంబంధించిన మంచి-మంచి పనుల కోసం అవసరమైతే నన్ను గుర్తు చేయండి. బాబా అంటారు - నేను
ఎవ్వరినీ గుర్తు చేయను, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. నేనైతే దాతను. నేనైతే
భారత్ ను స్వర్గముగా తయారుచేసేందుకే వచ్చాను, మీరు కూడా స్వర్గములోకి వెళ్తారు. ఎంత
చేస్తే అంత పొందుతారు. కానీ జన్మజన్మల పాపాల భారము తలపై ఉంది, దానిని తొలగించుకోవాలి.
లేకపోతే దానికి చాలా శిక్షలుంటాయి. స్వర్గములోకైతే వెళ్తారు కానీ శిక్షలు మిగిలిపోతే
పదవిని పొందలేరు. చక్రవర్తులకే చక్రవర్తి అయినవారి యొక్క హుండీ నిండుగా ఉంటుందని
గాయనము ఉంది. వీరికి (బ్రహ్మాకు) ఏ చింత లేదు. బాబా అంటారు, హుండీ దానంతట అదే
నిండుతుంది.
పిల్లలైన మీరు
శ్రీమతముపై నడవాలి, అందులోనే కళ్యాణముంది. అకళ్యాణము అని ఎప్పుడూ భావించకండి.
ఉదాహరణకు ఢిల్లీకి వెళ్తూ, దారిలో కాలు విరిగిపోతే, అందులో కూడా కళ్యాణముందని
భావించండి. ఆత్మ అయితే విరిగిపోలేదు కదా. కాలు విరిగింది, పర్వాలేదు. నేనైతే ఆత్మ
అయిన మీతో మాట్లాడతాను. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది రావణ రాజ్యము, అందుకే
కాలుస్తారు. మనము ఎలా ఉండేవారము, బాబా ఎలా ఉన్న మనల్ని ఎలా తయారుచేసారు.
ప్రపంచములోని పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి! ఇప్పుడు తండ్రి మిమ్మల్ని స్వర్గానికి
యజమానులుగా తయారుచేస్తారు కనుక వారి మతముపై నడవాలి. ఎలాంటి పాప కర్మలు చేయకూడదు.
గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా అవ్వండి. కేవలం ఈ సత్యనారాయణ కథను వింటూ ఉండండి.
ఈ కథ ఎంత పెద్దది. మొత్తం సాగరాన్ని సిరాగా చేసినా సరే ఇది సమాప్తమవ్వదు. కనుక
తండ్రి మతముపై నడవాలి కదా. మనము భగవంతుని శ్రీమతము అనుసారముగా రాజ్యము పొందుతామని,
మనుష్యుల నుండి దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది.
అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది, యాక్సిడెంటులో మరణిస్తారు. తండ్రి అంటారు
- మరణించే కన్నా ముందే బాగా పురుషార్థము చేయండి. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ మీ
సంపాదన చేసుకోండి. అనంతమైన తండ్రికి చెందినవారిగా అయి, మళ్ళీ పాపం చేస్తే ఒకటికి
వంద రెట్లు అవుతుంది. అప్పుడు, మనుష్యులు ఏమనుకుంటారో అని సిగ్గుగా కూడా
అనిపిస్తుంది. శివబాబా అంటారు - నేను ధర్మరాజు ద్వారా చాలా కఠినమైన శిక్షలు
ఇప్పిస్తాను. అప్పుడు, ఆ సమయములో వీరు నా బిడ్డ అని అనరు కదా. ఇందులో చాలా
నియమాలున్నాయి. జడ్జి కొడుకు పాపం చేస్తే, అతనేమీ చేయలేరు కదా. శిక్ష
అనుభవించాల్సిందే. తండ్రి రోజూ అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, పాప కర్మలు అస్సలు
చేయకండి. అన్నింటికన్నా పెద్దది వికారాల పాపము. తుఫానులు చాలా వస్తాయి, బయట చాలా
మాలిన్యముంది. ఇక అడగకండి. ఇది వేశ్యాలయము. ఒకవేళ మీరు ఎవరైనా గొప్ప వ్యక్తికి అర్థం
చేయించి, వారు విద్యార్థిగా అయితే - వీరిపై బ్రహ్మాకుమారీల గారడి జరిగిందని అంటారు.
గొప్పగొప్పవారు వచ్చి, మీరు నిజంగా సత్యమే చెప్తున్నారు, గీతా భగవానుడు తప్పకుండా ఆ
శివుడే కానీ శ్రీకృష్ణుడు కాదు అని వ్రాస్తారు కూడా. అచ్ఛా, మళ్ళీ తమ ఇంటికి
వెళ్ళిన తర్వాత సమాప్తము. చాలా శ్రమించాల్సి ఉంటుంది.
తండ్రి అర్థం
చేయిస్తున్నారు - మధురాతి-మధురమైన పిల్లలూ, మర్చిపోకండి. మాయ చాలా శక్తివంతమైనది.
బాబా స్మృతి పాదరసము వంటిది, వెంటనే మర్చిపోతారు. తండ్రి అంటారు - గృహస్థ
వ్యవహారములో ఉండండి, కానీ కేవలం పవిత్రముగా అవ్వండి. పురుషార్థమైతే చేయాలి కదా.
తండ్రి అయితే ఒక్కొక్క బిడ్డకు చాలా ప్రేమగా చెప్తున్నారు - ఇప్పుడు నా బిడ్డగా అయి
ఎలాంటి పాప కర్మలు చేయకండి. తండ్రినైతే తెలుసుకున్నారు కదా. సృష్టి చక్రము యొక్క
రహస్యము కూడా బుద్ధిలో ఉంది. విద్వాంసులు, పండితులు, ఆచార్యులు మొదలైనవారు తమను తాము
శివోహమ్ (నేనే శివుడిని) అని చెప్పుకుంటూ, పూజలు చేయించుకుంటారు. చాలా వరకు
సన్యాసులు హరిద్వార్ కు వెళ్ళి ఉంటారు. రోజంతా - ‘శివకాశి విశ్వనాథ గంగ’ అని అంటూ
ఉంటారు. తండ్రి కూర్చుని ఎంత చక్కగా అర్థం చేయిస్తున్నారు. అకాలమూర్త్ అని మహిమ
చేస్తారు కూడా. అకాల సింహాసనము అంటే అది కూర్చునే ఆసనమేమీ కాదు. అకాలమూర్తి అయిన
తండ్రికి ఈ రథమే ఆ సింహాసనము. ఎలాగైతే మీకు ఈ రథముందో, అలా బాబా కూడా - నేను ఈ
రథాన్ని తీసుకున్నాను అని అంటారు. భృకుటిలో ఒకవైపు శిష్యుడు, మరోవైపు గురువు
కూర్చుని ఉన్నారు. తప్పకుండా ఇతని పక్కనే వచ్చి కూర్చుంటాను కదా. నేను కూడా
బిందువును. నేనేమీ అంత పెద్దగా లేను.
మధురాతి-మధురమైన పిల్లలూ, ఇది మీ సత్యాతి-సత్యమైన, చైతన్యమైన స్మృతియాత్ర. బాప్ దాదా,
ఇరువురూ కలిసి ఉన్నారు. బాప్ దాదా యొక్క అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు.
టెలిగ్రామ్ లో - ‘బాప్ దాదా’ అని సంతకము చేస్తారు. ఎవరూ అర్థం చేసుకోలేరు. అరే,
శివబాబా మీ బాబా (తండ్రి). ప్రజాపిత బ్రహ్మా దాదా (అన్నయ్య) కదా. అంటే బాప్ దాదా
అయినట్లు కదా. ఇప్పుడు తండ్రి అంటారు - నేను వీరి ద్వారా మీకు వారసత్వాన్ని
ఇవ్వడానికి వచ్చాను. శివబాబా కూడా మీకు చెందినవారే. ప్రజాపిత బ్రహ్మా కూడా అందరికీ
తండ్రి అయినట్లు. వారసత్వము శివబాబా నుండి లభిస్తుంది. కనుక సంతకము అలాగే చేస్తారు
కదా. బాప్ దాదా అని అంటారు. శివబాబా అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. అయినా
బుద్ధిలో కూర్చోదు. ప్రదర్శనీలకు వేలాదిమంది వస్తారు. వారిలో 8-10 మంది అర్థం
చేసుకునేందుకు వస్తారు. వారిలో కూడా నెమ్మది-నెమ్మదిగా ఒకరో, ఇద్దరో మిగులుతారు.
కోట్లలో ఏ ఒక్కరో అని అంటూ ఉంటారు. మరి కోట్లలో ఏ ఒక్కరో వెలువడడానికి ఎన్ని
ప్రదర్శనీలు చేయాల్సి ఉంటుంది. కొందరు 4-5 సంవత్సరాలు వచ్చి మళ్ళీ మాయమైపోతారు.
తండ్రిని వదిలి పారిపోతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శివబాబాపై పూర్తిగా బలిహారమవ్వాలి అనగా జీవిస్తూ మరణించాలి. శ్రీమతముపై నడవాలి.
2. శివబాబాకు పిల్లలుగా అయ్యారు కనుక ఏ పాప కర్మలు చేయకూడదు. పవిత్రముగా అయి తమ
కళ్యాణము చేసుకోవాలి.
వరదానము:-
జ్ఞానములోని గుహ్యమైన విషయాలను విని వాటిని స్వరూపములోకి
తీసుకువచ్చే జ్ఞాన స్వరూప ఆత్మా భవ
జ్ఞాన స్వరూప ఆత్మలు ప్రతి విషయము యొక్క స్వరూపాన్ని
అనుభవం చేస్తారు. వినడము బాగా అనిపిస్తుంది, గుహ్యముగా కూడా అనిపిస్తుంది కానీ
వినడముతో పాటు ఇముడ్చుకోవాలి అనగా స్వరూపముగా అవ్వాలి - ఈ అభ్యాసము కూడా ఉండాలి.
నేను ఆత్మను, నిరాకారిని - ఇది పదే-పదే వింటూ ఉంటారు కానీ నిరాకారి స్థితి యొక్క
అనుభవీలుగా అయి వినండి. ఎటువంటి పాయింటో, అటువంటి అనుభవముండాలి. దీనితో శుద్ధ
సంకల్పాల ఖజానా జమా అవుతూ ఉంటుంది మరియు బుద్ధి ఇందులోనే బిజీగా ఉంటుంది, అప్పుడు
వ్యర్థ సంకల్పాల నుండి సహజముగా పక్కకు వెళ్ళిపోతారు.
స్లోగన్:-
జ్ఞానము మరియు
అనుభవము అనే డబల్ అథారిటీ కలవారే మస్త్ ఫకీర్లు, రమతా యోగులు.
అవ్యక్త ప్రేరణలు -
పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి
ఏ విషయములోనైనా ఫీల్
అవ్వటము అంటే అది ఫెయిల్ అవ్వటానికి గుర్తు. ఎవరు ఎంతటి అపకారులైనా కానీ మీ దృష్టి
మరియు వృత్తి ఉపకారముతో కూడినదిగా ఉండాలి. ఎంతటి అధికారులో, అంతటి నిరహంకారులుగా
ఉండాలి. జ్ఞానములోకి వచ్చిన తర్వాత ఏదైతే స్వాభిమానము వస్తుందో, దానిని కూడా త్యాగము
చేయాలి. ఇంతటి త్యాగముతో కూడిన వృత్తి మరియు దృష్టి ఉన్నట్లయితే స్మృతిలో బాప్ దాదా
ఉంటారు మరియు నోటి నుండి కూడా ఇవే మాటలు వెలువడతాయి.