ఓంశాంతి
పిల్లలు పాటను విన్నారు. ఎవరైతే తయారుచేసారో, వారికి పాపం మాత గురించి అసలు తెలియనే
తెలియదు. జగదంబ అన్న పేరునైతే విన్నారు. కానీ వారెవరు, ఏమి చేసి వెళ్ళారు అనేది
పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. జగదంబ ఉన్నట్లయితే తప్పకుండా తండ్రి కూడా
ఉన్నట్లే. కుమార్తెలు కూడా ఉన్నారు మరియు కుమారులు కూడా ఉన్నారు. ఎవరైతే జగదంబ
వద్దకు వెళ్తూ ఉంటారో, వారి బుద్ధిలో ఈ వివేకము లేదు, వారు కేవలం విగ్రహ పూజారులు.
దేవీ ముందుకు వెళ్ళి భిక్షము అడుగుతారు. ఇప్పుడిది రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర
జ్ఞాన యజ్ఞము. దీని రచయిత మాత-పిత, తతత్వమ్, అనగా మీరు కూడా యజ్ఞము యొక్క రచయితలే.
పిల్లలైన మీరంతా ఈ యజ్ఞాన్ని బాగా సంభాళించాలి. యజ్ఞమంటే చాలా గౌరవము ఉండాలి.
యజ్ఞాన్ని పూర్తిగా సంభాళించడము జరుగుతుంది. ఇది హెడ్ ఆఫీస్, వేరే శాఖలు కూడా
ఉన్నాయి. మమ్మా, బాబా మరియు పిల్లలైన మీరు ఈ యజ్ఞము ద్వారా మీ భవిష్యత్తును వజ్ర
సమానముగా తయారుచేసుకుంటున్నారు. కావున ఇటువంటి యజ్ఞాన్ని ఎంతగా సంభాళించాలి మరియు
దీని పట్ల ఎంత గౌరవాన్ని ఉంచాలి, దీని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలి. ఇది మన మమ్మా
అయిన జగదంబ యొక్క యజ్ఞము. మమ్మా, బాబాల యజ్ఞము అంటే మన యజ్ఞమే. యజ్ఞములోకి వచ్చి
చాలా మంది పిల్లలు తమ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునెలాగా యజ్ఞాన్ని వృద్ధి
చేయవలసి ఉంటుంది. ఒకవేళ వారసత్వాన్ని స్వయము తీసుకోలేకపోయినా, స్వయానికి తీరిక
లేకపోయినా, పోనీ, ఇతరులకు ఆహ్వానాన్ని ఇవ్వాలి. దీని పేరే రాజస్వ అశ్వమేధ జ్ఞాన
యజ్ఞము, దీని ద్వారా స్వరాజ్యము లభిస్తుంది. ఈ యజ్ఞములో పాత శరీరాన్ని కూడా స్వాహా
చేయవలసి ఉంటుంది. బాబా చెందినవారిగా అయిపోవాలి. యజ్ఞము అంటే ఇల్లు అనేమీ కాదు, ఇది
అనంతమైన విషయము. ఈ యజ్ఞములో మొత్తము విశ్వమంతా స్వాహా అవ్వనున్నది. మున్ముందు ఈ
యజ్ఞాన్ని ఎంతగా గౌరవించబోతున్నారో మీరు చూడండి. ఇక్కడ చాలామందికి గౌరవము లేదు.
ఇక్కడ ఉన్నవారు అందరూ యజ్ఞము యొక్క పిల్లలు. పిల్లలు జన్మిస్తూ ఉంటారు. ఈ యజ్ఞము
పట్ల ఎంత గౌరవము ఉంచాలి. కానీ చాలామందికి యజ్ఞమంటే విలువే లేదు. ఇది ఎంత పెద్ద
యజ్ఞమంటే, దీని ద్వారా మనుష్యులు గవ్వ నుండి వజ్ర సమానముగా, భ్రష్టాచారుల నుండి
శ్రేష్ఠాచారులుగా అవుతారు. అందుకే బాబా అంటారు, యజ్ఞాన్ని రచిస్తూ ఉండండి, ఒక్కరు
శ్రేష్ఠాచారిగా అయినా సరే అహో సౌభాగ్యము. ఇన్ని లక్షల మందిరాలు మొదలైనవి ఉన్నాయి,
అక్కడ ఎవరూ శ్రేష్ఠాచారులుగా అవ్వరు. ఇక్కడైతే కేవలం 3 అడుగుల భూమి కావాలి. ఎవరైనా
వస్తే వారి జీవితము పూర్తిగా మారిపోవాలి. యజ్ఞము పట్ల ఎంత గౌరవము ఉండాలి. బాబా, మేము
మా ఇంటిలో తెరవవచ్చా అని బాబాకు చాలామంది వ్రాస్తూ ఉంటారు. అచ్ఛా పిల్లలూ, యజ్ఞ
భూమిని తయారుచేయండి, మంచిదే, ఎవరో ఒకరి కళ్యాణము జరుగుతుంది. ఈ యజ్ఞానికి చాలా
గొప్ప మహిమ ఉంది. ఇది యజ్ఞ భూమి, ఇక్కడ కుమార్తెలు ఇతరుల కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు.
ఇటువంటి యజ్ఞాన్ని చాలా గౌరవించాలి. కానీ జ్ఞానము పూర్తిగా లేని కారణముగా దీని పట్ల
అంత గౌరవము ఉండటము లేదు. యజ్ఞములో విఘ్నాలను కలిగించేవారు చాలామంది ఉన్నారు. ఇది
శివబాబా యజ్ఞము. తల్లి-తండ్రి కలిసి ఉన్నారు. ఈ మమ్మా-బాబాల నుండైతే ఏమీ లభించదు.
అనంతమైన తండ్రి నుండే అంతా లభిస్తుంది. వారు ఒక్కరే. మమ్మా-బాబా అని శరీరధారులను
అనడము జరుగుతుంది. నిరాకారునికైతే శరీరమే లేదు. తండ్రి అంటారు, సాకారునికి కూడా
దాసులుగా అవ్వకండి, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ బాబా కూడా నన్ను స్మృతి చేస్తారు.
రాముడు, కృష్ణుడు, బ్రహ్మా మొదలైనవారంతా వారినే స్మృతి చేస్తారని చిత్రాలలో
చూపిస్తారు. కానీ అలా కాదు. అక్కడైతే ఎవరూ స్మృతి చేయరు. వారికి ప్రారబ్ధము
లభించేసింది. వారికి స్మృతి చేయవలసిన అవసరమేముంది. మనము పతితముగా అయ్యాము, మనమే
పావనముగా అయ్యేందుకు స్మృతి చేయాలి. మహిమ వారొక్కరిదే. వారి వలన వీరికి గౌరవముంది.
మీరు ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. దేహధారుల ద్వారా శివబాబా పరిచయము లభిస్తుంది కానీ
స్మృతి శివబాబానే చేయాలి. బాబా కూడా దేహధారియే, పరిచయాన్ని అంతా ఇస్తారు. కానీ
మేమైతే డైరెక్టుగా శివబాబా ప్రేరణ ద్వారా జ్ఞానాన్ని తీసుకోగలము అని అనేటువంటి
తెలివితక్కువ పిల్లలు చాలామంది ఉన్నారు. ఒకవేళ అలా జరిగితే, ఇక వారికి ఈ రథములోకి
రావలసిన అవసరమేమి వచ్చింది. ఈ సాకారునితో మాకు పనేముంది అని భావించేవారు కూడా
ఉన్నారు. తండ్రి అంటారు - మన్మనాభవ, వారిని (శివబాబాను) స్మృతి చేయండి, కానీ ఈ మాటను
ఇతని (బ్రహ్మాబాబా) ద్వారానే చెప్తారు కదా. కావున నంబరువారుగా గౌరవము ఉంచవలసి
ఉంటుంది. ఎవరైతే నంబరువారుగా సింహాసనముపై కూర్చోబోతున్నారో, వారే గౌరవాన్ని ఇస్తారు.
రాజ్య సింహాసనముపై మొట్టమొదట మమ్మా-బాబా కూర్చుంటారు. కావున వారిని ఫాలో చేయాలి.
చాలామంది ప్రజలను తయారుచేయవలసి ఉంటుంది. పదవి కూడా చాలా ఉన్నతమైనది. భయపడవలసిన
విషయమేమీ లేదు. ఏరోప్లేన్ లో ఎవరైనా కొత్తవారు ఎక్కితే భయపడతారు. కానీ కొంతమందిని
చూడండి, చంద్రునిపైకి కూడా వెళ్తూ ఉంటారు, అంటే ఇది ప్రాక్టీస్ కు సంబంధించిన విషయము
కదా. కానీ దాని వలన లాభమేమీ లేదని మీకు తెలుసు. చంద్రునిపై కూడా రాజధానిని
తయారుచేస్తామని వారు భావిస్తారు. కానీ అలా ఏమీ జరిగేది లేదు. ఇది డౌన్ ఫాల్ (పతనము)
కదా. డౌన్ ఫాల్ అండ్ రైజ్ (పతనము మరియు ఉన్నతి) గురించి కూడా పిల్లలు అర్థం
చేసుకుంటారు. చిత్రాలు కూడా ఉన్నాయి, ఈ లక్ష్మీ-నారాయణులు రాజ్యము చేసేవారు.
భారత్ ఈ రోజు ఎంత నిరుపేదగా ఉందో చూడండి. ఇది యథార్థమైన విషయము. ఈ మాటను వారు
స్వయమే రాశారు కావున ఇక్కడ మెట్ల వరుస చిత్రములో చూపించాలి. అక్కడ వజ్రాల మహళ్ళు
మెరుస్తాయి, ఇక్కడేమో గవ్వలను చూపించాలి. పూర్వము గవ్వలు వాడుకలో ఉండేవి. గురుద్వార్
లలో గవ్వలను సమర్పించేవారు. ఇప్పుడైతే ఎవరూ పైసలను కూడా సమర్పించకపోవచ్చు. మెట్ల
వరుస చిత్రము చాలా బాగుంటుంది, ఇందులో చాలా వ్రాయవచ్చు. మమ్మా-బాబాలతో పాటు పిల్లల
చిత్రాలు కూడా ఉండాలి మరియు పై భాగములో ఆత్మల వృక్షము కూడా ఉండాలి. కొత్త-కొత్త
చిత్రాలు తయారవుతూ ఉంటాయి. పతనము ఎలా జరుగుతుంది, మళ్ళీ ఉన్నతి ఎలా జరుగుతుంది
అన్నది అర్థం చేయించడము కూడా సహజమవుతుంది. మనము నిరాకారీ ప్రపంచములోకి వెళ్ళి మళ్ళీ
సాకారీ ప్రపంచములోకి వస్తాము, ఇది అర్థం చేయించడము చాలా సహజము. ఒకవేళ అర్థం
చేసుకోకపోతే, వారి అదృష్టములో లేదని అనుకోవడము జరుగుతుంది. డ్రామాను సాక్షీగా అయి
చూడటము జరుగుతుంది. పిల్లలకు యజ్ఞము పట్ల చాలా గౌరవముండాలి. యజ్ఞములోని ఒక్క పైసను
కూడా అడగకుండా తీసుకోవడము లేదా మాతా-పితల అనుమతి లేకుండా ఎవరికైనా ఇవ్వడము, ఇది
మహాపాపము. మీరైతే పిల్లలు, మీకు ఏ సమయములోనైనా, ఏ వస్తువైనా లభించగలదు. అటువంటప్పుడు
ఎక్కువ ఎందుకు తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత లభించదేమో అని అనుకుని లోపల
పెట్టుకుంటే మనసు తింటూ ఉంటుంది, ఎందుకంటే అది నియమవిరుద్ధమైన పని కదా. వస్తువులైతే
మీకు ఎప్పుడైనా లభిస్తాయి. అంతిమ సమయములో అకస్మాత్తుగా ఎవరైనా మరణించవచ్చు అని
తండ్రి చెప్పారు. కావున ఏవైతే పాపాలు చేసి ఉంటారో, ఆ చెత్త అంతా అంతిమ సమయములో
ఎదురుగా వస్తుంది, అందుకే బాబా సదా అర్థం చేయిస్తూ ఉంటారు, లోలోపల ఎటువంటి సందిగ్ధత
ఉండకూడదు. మనసు స్వచ్ఛముగా ఉన్నట్లయితే అంతిమ సమయములో ఇంకేదీ మీ ముందుకు రాదు.
యజ్ఞము నుండైతే మీకు అంతా లభిస్తూ ఉంటుంది. చాలా ధనమున్న పిల్లలు చాలామంది ఉన్నారు.
ఎప్పుడు అవసరమైతే అప్పుడు అడుగుతాములే అని వారికి చెప్పడము జరుగుతుంది. వారంటారు,
బాబా, ఎప్పుడు అవసరమొచ్చినా మేము కూర్చుని ఉన్నాము. అయితే, వారు పవిత్రముగా ఉండరు,
ఆహార-పానీయాల పథ్యాన్ని కూడా పాటించరు. కానీ ఈ ప్రతిజ్ఞను మాత్రము చేస్తారు - బాబా,
మా వద్ద చాలా ధనము పడి ఉంది, అది ఊరికే అలా వ్యర్థమైపోతుంది, దానిని మధ్యలో ఎవరైనా
తినేస్తారు, అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు అడగండి. బాబా అంటారు, నేను కూడా ఏమి
చేస్తాను. ఇల్లు కట్టవలసి వస్తే దానంతట అదే వచ్చేస్తుంది. చాలామంది పిల్లలు తమ-తమ
ఇళ్ళల్లో కూర్చుని ఉన్నారు. అయితే, అటువంటి పిల్లలు కూడా ఉన్నతమైన పదవిని పొందుతారు.
ప్రజలలో కూడా తక్కువ పదవులేమీ ఉండవు. రాజుల కన్నా కూడా చాలామంది షావుకారులు చాలా
ధనవంతులుగా ఉంటారు, అందుకే లోలోపల ఇటువంటి ఆలోచనలేమీ చేయకూడదు. బాబా, మీరేమి
తినిపిస్తే అది... అని మీరు ప్రతిజ్ఞ చేసారు. అయినా సరే దానిపై నడుచుకోకపోతే దుర్గతి
కలుగుతుంది. తండ్రి సద్గతిని ఇవ్వడానికి వచ్చారు. ఒకవేళ ఉన్నత పదవిని పొందకపోతే
దుర్గతి అనే అంటారు కదా. అక్కడ కూడా చాలామంది షావుకారులు ఉంటారు, కొందరు తక్కువ పదవి
కలవారు, కొందరు ఉన్నత పదవి కలవారు ఉంటారు కదా. పిల్లలు శ్రీమతమనుసారముగా పురుషార్థము
చేయాలి. స్వయము యొక్క మతముపై నడిచినట్లయితే స్వయాన్ని మోసము చేసుకుంటారు. ఇది
శివబాబా ద్వారా రచించబడిన జ్ఞాన యజ్ఞము. దీని పేరే రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర
జ్ఞాన యజ్ఞము. శివబాబా వచ్చి స్వరాజ్యాన్ని ఇస్తారు. ఎవరి భాగ్యములోనైతే లేదో, ఎవరి
పేరైతే ప్రఖ్యాతమయ్యేది లేదో, వారి నోటి నుండి మంచి-మంచి పాయింట్లు వెలువడవు. ఒకవేళ
ఎవరైనా ఎవ్వరికీ అర్థం చేయించటము లేదు అంటే, వారి పేరు ప్రఖ్యాతమయ్యేందుకు ఇంకా
సమయముందని అంటారు. అందుకే అర్థం చేయించేటప్పుడు ముఖ్యమైన పాయింట్లను మర్చిపోతూ
ఉంటారు. ఈ రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞము స్వరాజ్యాన్ని పొందేందుకు ఉంది
అని కూడా అర్థం చేయించాలి. ఇది బోర్డుపై కూడా వ్రాయవచ్చు. ఈ యజ్ఞములో పాత ప్రపంచమంతా
స్వాహా అయిపోతుంది, దీని కోసమే ఈ మహాభారత యుద్ధము నిలబడి ఉంది. వినాశనానికి ముందే ఈ
స్వరాజ్య పదవిని తీసుకోవాలనుకుంటే వచ్చి తీసుకోండి. బోర్డుపైనైతే చాలా వ్రాయవచ్చు.
లక్ష్యము-ఉద్దేశ్యము గురించి కూడా అందులో ఉండాలి. స్వరాజ్య పదవి లభిస్తుందని కింద
వ్రాయాలి. ఎంత వీలైతే అంత, ఎవరికైనా చదవగానే అర్థమయ్యే విధముగా స్పష్టముగా వ్రాసి
ఉండాలి. ఇలాంటి-ఇలాంటి బోర్డులను తయారుచేయండని బాబా డైరెక్షన్లు ఇస్తారు. ఈ మాట
తప్పకుండా వ్రాయండి. మున్ముందు ఈ యజ్ఞము యొక్క ప్రభావము బాగా వెలువడుతుంది.
తుఫానులైతే చాలా వస్తాయి. సత్యము యొక్క నావ కదులుతుంది, ఊగిసలాడుతుంది కానీ మునగదు
అని అంటారు. క్షీరసాగరము వైపుకు వెళ్ళాలంటే విషయసాగరము వైపు మనసు ఉండకూడదు. ఎవరైతే
జ్ఞానము తీసుకోరో, వారి వెనుక పడి మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. వివరణ అయితే
చాలా-చాలా సహజముగా ఉంది.
మీరే పూజ్య దేవీ-దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. తండ్రి అంటారు,
నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది, మీ పాపాలు భస్మమైపోతాయి,
ఇంకే ఉపాయమూ లేదు. ఇదే సత్యాతి-సత్యమైన ఉపాయము. కానీ యోగములో ఉండరు. దేహాభిమానము
చాలా ఉంది. దేహాభిమానము ఎప్పుడైతే తొలగుతుందో, అప్పుడు యోగములో ఉండగలరు, అప్పుడు
కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. చివరిలో ఏ వస్తువు గుర్తు రాకూడదు. కొంతమంది పిల్లలకు
కొన్ని వస్తువుల పట్ల ఎంత మోహము ఏర్పడుతుందంటే, ఇక అడగకండి. వారు శివబాబాను ఎప్పుడూ
స్మృతి చేయరు. ఇటువంటి తండ్రిని ప్రత్యేకముగా స్మృతి చేయాలి. చేతులు పని వైపు, మనసు
ప్రియుని వైపు ఉండాలి. ఇలా అరుదుగా ఎవరికో గుర్తుంటుంది. నడవడిక ద్వారానే
తెలిసిపోతుంది. యజ్ఞమంటే గౌరవముండదు. ఈ యజ్ఞాన్ని చాలా సంభాళించాలి. యజ్ఞాన్ని
సంభాళించారంటే బాబాను సంతోషపెట్టినట్లే. ప్రతి విషయములోనూ జాగ్రత్తగా ఉండాలి.
పేదవారిది ఒక్కొక్క పైసా ఈ యజ్ఞములోకి వస్తుంది, దీని ద్వారా వారు పదమపతులుగా
అవుతారు. ఏ మాతల వద్దనైతే ఏమీ లేదో, వారు ఒకటి, రెండు రూపాయలను, ఎనిమిది అణాలను
యజ్ఞములో ఇస్తారు, వారు పదమపతులుగా అయిపోతారు, ఎందుకంటే వారు ఎంతో భావనతో, సంతోషముతో
తీసుకువస్తారు. తండ్రి అంటారు, నేను పేదల పెన్నిధిని, పిల్లలైన మీ కోసమే వచ్చాను.
బాబా, ఈ ఇంటికి ఒక ఇటుకను పెట్టండి అని కొందరు 8 అణాలను తీసుకువస్తారు. ఒక్కోసారి
రెండు పిడికెళ్ళ బియ్యాన్ని కూడా తీసుకువస్తారు. వారికైతే ఎంతో లభిస్తుంది.
ఒక్కొక్క గింజ బంగారు నాణెము సమానముగా అయిపోతుంది. అలాగని మీరు కూర్చుని పేదవారికి
దానమివ్వాలని కాదు. పేదవారికైతే ఆ ప్రపంచములోనివారు దానమిస్తారు. ఆ మాటకొస్తే
ప్రపంచములో ఎంతోమంది పేదవారు ఉన్నారు. అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే తలనొప్పి
పెట్టేస్తారు. మేము యజ్ఞములో సమర్పణ అవుతామని చాలామంది అంటారు. కానీ జాగ్రత్తగా
తీసుకోవలసి ఉంటుంది. యజ్ఞములోకి వచ్చి గందరగోళము చేసేటట్లుగా ఉండకూడదు. యజ్ఞములోనైతే
చాలా పుణ్యాత్ములుగా అవ్వాలి. చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏ ఈశ్వరీయ యజ్ఞము
నుండైతే మనము మన శరీర నిర్వహణను చేసుకుంటున్నామో, ఆ యజ్ఞము పట్ల గౌరవము ఉండాలి.
యజ్ఞము యొక్క ధనాన్ని ఎవరికైనా ఇవ్వడము మహాపాపము. ఈ ధనమంతా గవ్వ నుండి వజ్ర సమానముగా
తయారయ్యే వారి కోసమే ఉంది, ఈశ్వరీయ సేవలో ఉన్నవారి కోసమే ఉంది. ఇకపోతే పేదలు
మొదలైనవారికి ఇవ్వడము వంటి దానపుణ్యాలనైతే జన్మ-జన్మలుగా చేస్తూ వచ్చారు.
దిగుతూ-దిగుతూ పాపాత్ములుగానే అవుతూ వచ్చారు.
పిల్లలైన మీరు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చేందుకు చిన్న-చిన్న గ్రామాలలో కూడా
ప్రదర్శనీలను చేస్తూ ఉండండి. ఒక పేద బిడ్డ వెలువడినా సరే మంచిదే, ఇందులో ఖర్చేమీ
లేదు. లక్ష్మీ-నారాయణులు ఈ రాజ్యాన్ని పొందారు, వారేమి ఖర్చు చేశారు. ఏమీ లేదు.
విశ్వ రాజ్యాధికారాన్ని పొందేందుకు వారు ఏ ఖర్చు చేయలేదు. ఆ మనుష్యులు పరస్పరములో
ఎంతగా కొట్లాడుకుంటూ ఉంటారు. పేలుడు పదార్థాలు మొదలైనవాటి కోసం ఎంత ఖర్చు చేస్తూ
ఉంటారు. ఇక్కడైతే ఖర్చు యొక్క విషయమేమీ లేదు. పైసా ఖర్చు లేకుండా క్షణములో విశ్వ
రాజ్యాధికారాన్ని తీసుకోండి. అల్ఫ్ ను (భగవంతుడిని) స్మృతి చేయండి, బే (రాజ్యాధికార
వారసత్వము) ఉండనే ఉంది. తండ్రి అంటారు, ఎంత వీలైతే అంత సత్యమైన హృదయముతో సత్యమైన
స్వామిని రాజీ చేసినట్లయితే, సత్య ఖండానికి యజమానులుగా అవుతారు. అక్కడ అసత్యము నడవదు.
స్మృతి చేయాలి. మేమైతే ఎలాగూ పిల్లలమే కదా అని భావించకండి. స్మృతి చేయడములో చాలా
శ్రమ ఉంది. ఏదైనా వికర్మ చేసినట్లయితే చాలా నష్టపోతారు. బుద్ధి స్థిరముగా ఉండదు.
బాబా అయితే అనుభవజ్ఞులు కదా. బాబా చెప్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు తమకు అంతా
తెలుసని భావిస్తారు, కానీ ఇందులో చాలా శ్రమ ఉందని బాబా అంటారు. మాయ చాలా విఘ్నాలను
కలిగిస్తుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.