30-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీదంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకుని
భవిష్యత్తును తయారుచేసుకోండి, ఎందుకంటే మృత్యువు తలపై ఉంది’’
ప్రశ్న:-
జ్ఞానాన్ని
వింటున్నా సరే పిల్లల్లో దాని ధారణ ఎందుకు జరగడము లేదు?
జవాబు:-
ఎందుకంటే
విచార సాగర మంథనము చేయడము రాదు. బుద్ధియోగము దేహము మరియు దేహ సంబంధాలలో వేలాడుతూ
ఉంది. ముందు బుద్ధి నుండి మోహము తొలగితే, ఎంతోకొంత ధారణ కూడా జరుగుతుంది. మోహమనేది
ఎటువంటిదంటే, అది పూర్తిగా కోతిలా చేసేస్తుంది, అందుకే తండ్రి పిల్లలకు మొట్టమొదటి
ప్రతిజ్ఞను గుర్తు చేయిస్తున్నారు - దేహ సహితముగా, దేహపు సర్వ సంబంధాలను మరవండి
మరియు నన్ను స్మృతి చేయండి.
పాట:-
భోళానాథుని
కన్నా అతీతమైనవారు...
ఓంశాంతి
తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, పాడైనదానిని బాగుచేసేవారు అని అనంతమైన
తండ్రినే అంటారని ఇప్పుడు పిల్లలకు బాగా తెలుసు. శ్రీకృష్ణుడు పాడైనదానిని బాగు
చేయలేరు. గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు, శివుడు. శివబాబా రచయిత మరియు
శ్రీకృష్ణుడు రచన. స్వర్గ వారసత్వాన్ని కేవలం స్వర్గ రచయిత మాత్రమే ఇవ్వగలరు. ఇదే
భారత్ యొక్క ముఖ్యమైన అతి పెద్ద పొరపాటు. శ్రీకృష్ణుడిని ఎవరూ ‘బాబా’ అని అనలేరు.
వారసత్వమనేది తండ్రి నుండే లభిస్తుంది మరియు అది భారత్ కే లభించింది. భారత్ లోనే
శ్రీకృష్ణుడు రాకుమారునిగా, రాధ రాకుమారిగా గాయనము చేయబడ్డారు. మహిమ ఉన్నతోన్నతమైన
తండ్రి ఒక్కరిదే. శ్రీకృష్ణుడు ఉన్నతోన్నతమైన రచన, వారు విశ్వానికి యజమాని. దానిని
సూర్యవంశము, దైవీ వంశము అని అంటారు. గీత ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క
శాస్త్రము. సత్యయుగములోనైతే ఎవరికీ జ్ఞానము వినిపించలేదు. సంగమములోనే తండ్రి
వినిపించారు. చిత్రాలతో కూడా ముందు ఈ విషయాన్ని నిరూపించాలి. ఇరువురి చిత్రాలను
చూపిస్తారు - గీతా భగవానుడు, వారు రచయిత, వారు పునర్జన్మ రహితుడు, అంతేకానీ
శ్రీకృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడు రచన. శివబాబాయే వజ్రతుల్యముగా తయారుచేస్తారని మీకు
తెలుసు. వజ్ర సమానము, గవ్వ సమానము అని కూడా అంటూ ఉంటారు. మీరు నన్ను స్మృతి చేయండి
మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి - ఇది తండ్రి ఆజ్ఞ అని పిల్లల బుద్ధిలో ఉండాలి.
వారు అనంతమైన తండ్రి. కృష్ణుడు విశ్వానికి రాజుగా అవుతారు కానీ ఎంతైనా వారు హద్దు
యొక్క యజమాని. శివబాబా అయితే రాజు అవ్వరు కదా. వాస్తవానికి గీతకు చాలా మహిమ ఉంది.
దానితో పాటు భారత్ కు కూడా మహిమ ఉంది. భారత్ అన్ని ధర్మాల వారికి గొప్ప తీర్థ
స్థానము. కేవలం కృష్ణుని పేరు వేసిన కారణముగా మహత్వమంతా పోయింది. ఈ కారణముగానే భారత్
గవ్వ సమానముగా అయిపోయింది. ఇలా జరగడము డ్రామానుసారముగానే జరుగుతుంది కానీ అప్రమత్తం
చేయవలసి ఉంటుంది. తండ్రి చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. రోజురోజుకు గుహ్యమైన
విషయాలను వినిపిస్తూ ఉంటారు కనుక పాత చిత్రాలను మార్చి వేరే చిత్రాలను
తయారుచేయించాల్సి ఉంటుంది. ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. శివబాబా మాకు
వారసత్వాన్ని ఇస్తున్నారని పిల్లలు మంచి రీతిలో బుద్ధిలో ఉంచుకోవాలి. నన్నొక్కరినే
స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని అంటారు. కృష్ణుడిని స్మృతి చేయడము వలన
వికర్మలు వినాశనము కావు. అతడు సర్వశక్తివంతుడైతే కాదు. సర్వశక్తివంతుడు తండ్రి,
వారసత్వాన్ని కూడా వారే ఇస్తారు. మనుష్యులు, కృష్ణుడినే స్మృతి చేస్తూ ఉంటారు. అచ్ఛా,
కృష్ణుడే చెప్పారనుకోండి, దేహ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అనే అతను
కూడా చెప్తారు. అప్పుడు ఆత్మ అయితే తండ్రిని స్మృతి చేస్తుంది కదా. కృష్ణుడైతే
ఆత్మలందరికీ తండ్రి కాదు. ఇవన్నీ విచార సాగర మంథనము చేసి బుద్ధిలో ధారణ చేయాలి.
కొంతమంది మోహములో చిక్కుకున్న కారణముగా ఇక ధారణ చేయలేరు. ఇతర సాంగత్యాలను తెంచి
మీతోనే సాంగత్యాన్ని జోడిస్తామని, నాకు ఒక్కరు తప్ప వేరెవ్వరూ లేరని మీరు పాడుతూ
వచ్చారు. కానీ మోహమనేది ఎలాంటిదంటే, అది పూర్తిగా కోతిలా చేస్తుంది. కోతిలో మోహము
మరియు లోభము చాలా ఉంటాయి. ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని, మీ వద్ద ఉన్నదంతా
ఈశ్వరీయ సేవలో వినియోగించి భవిష్యత్తును తయారుచేసుకోండి అని షావుకారులకు కూడా అర్థం
చేయించడము జరుగుతుంది. కానీ కోతుల వలె వేలాడుతూ ఉన్నారు, వదలరు. తండ్రి అంటారు -
దేహ సహితముగా, దేహ సంబంధాలేవైతే ఉన్నాయో, వాటి నుండి బుద్ధియోగాన్ని తొలగించండి.
తండ్రి శ్రీమతాన్ని అనుసరించండి. ఈ ధనము, సంతానము మొదలైనవన్నీ ఈశ్వరుడు ఇచ్చారని
మీరంటారు. ఇప్పుడు వారు స్వయంగా వచ్చారు. మీ ఈ ధన-సంపదలు మొదలైనవన్నీ
సమాప్తమవ్వనున్నాయని చెప్తారు. కొందరిది మట్టిలో పూడ్చుకుపోతుంది... భూకంపాలు
మొదలైనవి వస్తాయి. ఇదంతా సమాప్తమైపోతుంది. విమానాలు పడిపోయినప్పుడు లేదా నిప్పు
అంటుకున్నప్పుడు పోలీసులు వచ్చే లోపు, దొంగలు లోపలికి చొరబడతారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - పిల్లలూ, దేహధారుల పట్ల మోహాన్ని తొలగించుకోవాలి, మోహజీతులుగా
అవ్వాలి. దేహాభిమానమనేది అన్నింటికన్నా మొదటి నంబరు శత్రువు. దేవతలు దేహీ-అభిమానులు.
దేహాభిమానము రావడముతోనే వికారాల్లో చిక్కుకుంటారు. మీరు అర్ధకల్పము దేహాభిమానులుగా
ఉంటారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసము చేయాలి. మనుష్యమాత్రులెవరైతే
ఉన్నారో, వారెవ్వరికీ ఈ విషయాల గురించి తెలియదు, అలానే పరమాత్మ గురించి కూడా తెలియదు.
ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు, ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుంది, పాత్రను ఎలా
అభినయిస్తుంది, మేమే పాత్రధారులము - ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. అందుకే
అనాథలని అంటారు. ఆత్మ, ఆ జ్యోతిలో లీనమైపోతుందని వారంటారు. కానీ ఆత్మ అయితే అవినాశీ.
ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. ఆత్మ ఒక నక్షత్రమని అంటారు కానీ అర్థం
చేసుకోరు. ఆత్మయే పరమాత్మ అని అంటారు, తండ్రి గురించి అసలేమీ తెలియదు. భృకుటి మధ్యలో
ప్రకాశించే నక్షత్రమని ఆత్మ గురించి చెప్తారు. పరమాత్మ గురించి ఏమీ చెప్పరు. వారిని
పరమ-ఆత్మ అని అంటారు, వారు కూడా పరంధామములో ఉంటారు. వారు కూడా ఒక బిందువు. అయితే,
వారు పునర్జన్మ రహితుడు కానీ ఆత్మలు పునర్జన్మల్లోకి వస్తారు. జ్ఞాన సాగరుడు, ఆనంద
సాగరుడు, పవిత్రతా సాగరుడు అని పరమాత్మను గురించే అంటారు. దేవతలకు ఈ వారసత్వాన్ని
ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చారు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు... ఈ దేవతల
వంటి వారు ఇప్పుడు ఎవరూ లేరు. వారికి ఈ వారసత్వము ఎలా లభించింది అనేది ఎవరికీ
తెలియదు. తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు, వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. వారు ఈ
సమయములో వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు, అది తర్వాత కనుమరుగైపోతుంది. ఆ తర్వాత భక్తి
ఉంటుంది, దానిని జ్ఞానమని అనలేము. జ్ఞానముతో సద్గతి కలుగుతుంది. దుర్గతి
ఏర్పడినప్పుడు, సర్వుల సద్గతిదాత, జ్ఞానసాగరుడు వస్తారు. తండ్రియే వచ్చి జ్ఞాన
స్నానాన్ని చేయిస్తారు. అది నీటి స్నానము, దానితో సద్గతి కలగదు. ఇటువంటి చిన్న
విషయాలను కూడా ధారణ చేయాలి. ముఖ్యమైన మంచి-మంచి చిత్రాలు ఏవైతే ఉన్నాయో, వాటిని
ఎవరైనా మంచి రీతిలో అర్థం చేసుకోగలిగేలా, అవి పెద్దవిగా ఉండాలి. అక్షరాలు చాలా
బాగుండాలి. చిత్రాలను తయారుచేసేవారు ఈ విషయాలను బుద్ధిలో ఉంచుకోవాలి. ఎవరికైనా సరే
ఆహ్వానాన్ని ఇచ్చి పిలవాలి - మీరు వచ్చి పరమపిత పరమాత్ముని పరిచయాన్ని తెలుసుకోండి
మరియు భవిష్య 21 జన్మల కోసం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. సోదరీ-సోదరులారా,
పారలౌకిక తండ్రి నుండి అనంతమైన సుఖము యొక్క స్వరాజ్యము ఎలా లభిస్తుంది అనేది వచ్చి
తెలుసుకోండి, అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందడము నేర్చుకోండి, అని చెప్పండి.
ఇందులో భయపడాల్సిన విషయమేమీ లేదు. ఓ పతిత-పావనా రండి, అని పిలుస్తూ ఉంటారు.
కామము మహాశత్రువు అని తండ్రి కూడా అంటారు. పావన ప్రపంచములోకి వెళ్ళాలంటే పవిత్రముగా
తప్పకుండా అవ్వాలి. వికారాల ద్వారా జన్మ తీసుకునేవారిని పతితులని అంటారు. సత్య,
త్రేతాయుగాలలో విషము ఉండదు, దానిని సంపూర్ణ నిర్వికారీ ప్రపంచమని అంటారు. అక్కడ
వికారాలనేవి అసలు ఉండవు. మరి పిల్లలు ఎలా జన్మిస్తారని మీరెందుకు అడుగుతారు. మీరైతే
నిర్వికారులుగా అవ్వండి. పిల్లలు ఎలా జన్మించవలసి ఉంటే అలా జన్మిస్తారు. అసలు మీరు
దీని గురించి ఎందుకు అడుగుతారు? మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మజన్మల
వికర్మలు వినాశనమవుతాయి. ఇది పాపాత్ముల ప్రపంచము. అది పుణ్యాత్ముల ప్రపంచము. దీనిని
మంచి రీతిలో బుద్ధిలో కూర్చోబెట్టాలి. భక్తి ఫలాన్ని భగవంతుడు వచ్చి ఇస్తారు.
తండ్రియే సర్వులకు సద్గతినిచ్చి స్వర్గానికి యజమానులుగా చేస్తారు. తండ్రి అంటారు -
ఇప్పుడు పవిత్రముగా అవ్వండి, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇది మహామంత్రము. తండ్రి
నుండి తప్పకుండా వారసత్వము లభిస్తుంది. తండ్రి అంటారు - మీరు నన్ను స్మృతి
చేసినట్లయితే సతోప్రధానముగా అయిపోతారు. మెట్ల వరుస చిత్రము గురించి అర్థం చేయించాలి.
రోజురోజుకు ప్రతీదీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా
ధర్మ స్థాపన జరుగుతుంది అని ఇందులో స్పష్టముగా వ్రాయాలి. ఆది సనాతన దేవీ-దేవతా
ధర్మము ఉన్నప్పుడు వేరే ధర్మమేదీ ఉండేది కాదు. ఎవరైతే పవిత్రముగా అవుతారో, వారే
పవిత్ర ప్రపంచములోకి వస్తారు. మీలో ఎంత శక్తి నిండుతూ ఉంటుందో, అంత ముందుగా వస్తారు.
అందరూ కలిసి అయితే రారు. సత్య, త్రేతాయుగాలలో దేవీ-దేవతలు చాలా కొద్దిమందే ఉంటారని,
ఆ తర్వాత వృద్ధి జరుగుతుందని కూడా మీకు తెలుసు. ప్రజలలోనైతే ఎంతోమంది ఉంటారు. అర్థం
చేయించేవారు కూడా చాలా మంచివారు ఉండాలి. మీరు వచ్చి అనంతమైన తండ్రి నుండి
వారసత్వాన్ని తీసుకోండి, మీరు ఓ తండ్రి, అని ఎవరినైతే పిలుస్తారో, వాస్తవానికి వారి
పేరే శివ అని చెప్పండి. ఈశ్వరా లేక ప్రభూ, భగవంతుడా, అని అనడము వలన వారు తండ్రి అని,
వారి నుండి వారసత్వము లభించనున్నదని అర్థం చేసుకోరు. శివబాబా అని అనడంతో వారసత్వము
గుర్తుకువస్తుంది. వారిని శివ పరమాత్మాయ నమః అని అంటారు. మరి పరమాత్ముని పేరు
చెప్పండి. నామ-రూపాలకు అతీతమైనవారు ఎవరూ ఉండరు. వారి పేరు శివ. కేవలం శివాయ నమః అని
కూడా అనకూడదు, శివ పరమాత్మాయ నమః అని అనాలి. ప్రతి మాటను చాలా మంచి రీతిలో స్పష్టము
చేసి అర్థం చేయించవలసి ఉంటుంది. కేవలం శివాయ నమః అని అనడముతో కూడా తండ్రి అనే ఆనందము
కలగదు. మనుష్యులైతే అన్ని పేర్లు స్వయానికే పెట్టుకున్నారు. మనుష్యులను ఎప్పుడూ
భగవంతుడని అనరని మీకు తెలుసు. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా దేవతలని అంటారు. రచయిత
అయిన తండ్రి అయితే ఒక్క నిరాకారుడు మాత్రమే. ఏ విధముగా లౌకిక తండ్రి పిల్లలను
రచిస్తారు, వారసత్వాన్ని ఇస్తారు కదా, అదే విధముగా అనంతమైన తండ్రి కూడా వారసత్వాన్ని
ఇస్తారు, భారత్ ను విశ్వానికి యజమానిగా తయారుచేస్తారు. మొత్తం ప్రపంచమంతటికీ
పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. తమ ధర్మ స్థాపకులు కూడా ఈ సమయములో పతితులుగా
ఉన్నారని, శ్మశానగ్రస్థులుగా ఉన్నారని ఎవరికీ తెలియదు. ఇప్పుడిది అందరి వినాశన సమయము.
తండ్రియే వచ్చి అందరినీ మేలుకొలుపుతారు. వినాశన సమయములోనే ఆ ఖుదా, ఆ భగవంతుడు
వస్తారు. వారే జ్ఞానసాగరుడు. సాగరుని పిల్లలు భస్మీభూతులైపోయారని అనగా కామచితిపై
కూర్చుని నల్లగా, ఇనుపయుగము వారిగా అయిపోయారని వ్రాసి ఉంది. మళ్ళీ వారు సుందరముగా
ఎలా అవుతారు? స్మృతియాత్ర ద్వారా అవుతారని తండ్రి అంటారు. యోగము అనే పదాన్ని
ఉపయోగించినప్పుడు మనుష్యులు తికమకపడతారు. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే
అంతమతి సో గతి జరుగుతుంది (అంతిమ సమయములో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అటువంటి జన్మ
లభిస్తుంది). ఎంత సహజముగా అర్థం చేయిస్తారు, అయినా ఈ విషయాలు ఎందుకు బుద్ధిలో
కూర్చోవు? దేహాభిమానము చాలా ఉంది, అందుకే ధారణ జరగదు. బాబా చాలా మంచి యుక్తిని
తెలియజేస్తారు. ఏ అనంతమైన తండ్రినైతే స్మృతి చేస్తారో, వారు వచ్చి ఏమి చేసారు? భారత్
ను స్వర్గముగా తయారుచేసారు. హద్దు వారసత్వాన్ని అయితే జన్మజన్మలుగా తీసుకుంటూ
వచ్చారు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి 21 జన్మల కోసం అనంతమైన వారసత్వాన్ని
తీసుకోండి. సత్య, త్రేతాయుగాలలో దేవతలు రాజ్యము చేసేవారు. సూర్యవంశీయులే
చంద్రవంశీయులుగా, వారే తర్వాత వైశ్యవంశీయులుగా, వారే మళ్ళీ శూద్రవంశీయులుగా...
అవుతారు, ఇలా ‘వారే మళ్ళీ’ - అనే పదాలు వ్రాయడముతో వారే పునర్జన్మలు తీసుకుంటారని,
వర్ణాలలోకి వస్తారని నిరూపించబడుతుంది. తండ్రి అయితే అందరికీ అర్థం చేయిస్తారు, మీరు
సమ్ముఖముగా కూర్చున్నారు కనుక సంతోషపడతారు. కొందరికి భాగ్యములో లేకపోతే సేవ చేయరు.
సేవ చేసినట్లయితే వారి పేరు ప్రసిద్ధమవుతుంది. బాబా యొక్క కుమార్తెలు ఎంత చురుకుగా
ఉన్నారు, వారు అన్ని పనులు చేస్తారు, వారు మాకు స్వర్గ రాజ్యాధికారపు వారసత్వాన్ని
ఇస్తారు, ఈ సామాగ్రిని కూడా ఇస్తారని చెప్పుకుంటారు. ఈ చిత్రాలు అంధుల ఎదురుగా అద్దం
వంటివి, ఇందులో ఇంద్రజాలం విషయమేమీ లేదు. పవిత్రతే ముఖ్యమైన విషయము. ఇది అంతిమ జన్మ
అని అర్థం చేసుకుంటారు. స్వర్గములోకి వెళ్ళాలంటే పవిత్రముగా తప్పకుండా అవ్వాలి.
వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. పావనముగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. సన్యాసులు
పావనముగా అవ్వడానికి ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని,
నన్ను స్మృతి చేసినట్లయితే నావ తీరానికి చేరుతుందని తండ్రి అంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. వినాశనము కంటే ముందే మీదంతా సఫలం చేసుకోవాలి. ఇది వినాశన సమయము, అందుకే
పావనముగా తప్పకుండా అవ్వాలి.
2. దేహధారుల నుండి మోహాన్ని తొలగించి మోహజీతులుగా అవ్వాలి. మొదటి నంబరు శత్రువైన
దేహాభిమానముపై విజయము పొందాలి. ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి, తండ్రితో
బుద్ధియోగాన్ని జోడించాలి.
వరదానము:-
స్మృతి యొక్క మంత్రము ద్వారా సంకల్పాలు మరియు కర్మలలో అవినాశీ
సిద్ధిని ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ
పిల్లలైన మీరు ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క మెసెంజర్లు,
అందుకే ఎవరితోనైనా ఏదైనా చర్చించడములో మీ మనసును డిస్టర్బ్ చేసుకోకండి. స్మృతి
యొక్క మంత్రాన్ని ఉపయోగించండి. ఎలాగైతే ఎవరైనా వాణి ద్వారానైనా లేక ఇంకే రకంగానైనా
వశమవ్వకపోతే మంత్ర తంత్రాలను ఉపయోగిస్తారో, అలా మీ వద్ద ఆత్మిక దృష్టి అనే నేత్రము
మరియు మన్మనాభవ అనే మంత్రము ఉన్నాయి, వాటి ద్వారా మీ సంకల్పాల సిద్ధిని పొంది సిద్ధీ
స్వరూపులుగా అవ్వగలరు.
స్లోగన్:-
కర్మ కాన్షస్
గా (కర్మ స్మృతి) ఉండేందుకు బదులుగా సోల్ కాన్షస్ గా (ఆత్మాభిమాని) అవ్వండి.
అవ్యక్త ప్రేరణలు -
‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’
ఏకరసముగా ఉండటమంటే
అర్థం పురుషార్థపు వేగము సదా ఒకే విధముగా ఉండటమని కాదు. ఏకరసము అనగా సదా ఎగిరే కళ
యొక్క అనుభూతి ఉండాలి, సర్వ సంబంధాల అవినాశీ బంధము ఒక్కరితోనే జోడించబడి ఉండాలి.
ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న దృఢ సంకల్పము ఉండాలి, వారితో ఒక్క సంబంధము కూడా
తక్కువ ఉండకూడదు, సర్వ సంబంధాల బంధము ఒక్కరితో బంధించబడి ఉండాలి, అప్పుడు ఏకరస
స్థితి స్వతహాగా ఉంటుంది.