30-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 13.04.2011


‘‘జ్వాలాముఖి అగ్ని స్వరూప యోగ శక్తితో సంస్కారాల అంతిమ సంస్కారము చేయండి, మీ నడవడిక, ముఖము, దృష్టి, వృత్తి మరియు సంకల్పాలతో తండ్రిని ప్రత్యక్షము చేయండి’’

ఈ రోజు పిల్లల ప్రేమ, ప్రేమ సాగరుడిని కూడా తమ వద్దకు పిలుచుకుంది. పిల్లలకు తండ్రి పట్ల హృదయపూర్వక ప్రేమ ఉండటాన్ని చూసి బాప్ దాదాకు చాలా సంతోషముగా ఉంది. మంచిది. సదా ఈ ప్రేమ యొక్క ఆధారముతోనే బాబా సమానముగా తప్పకుండా అయిపోతారు. మామూలుగా కూడా బాప్ దాదా ప్రేమ సబ్జెక్టులో పిల్లలను ముందుంచారు. ఈ రోజు పిల్లలు తమ ప్రేమ అనే బంధముతో బంధించి ప్రేమ సాగరుడిని మధుబన్ కు విశేషముగా పిలిచారు. ఇటువంటి ప్రేమ సదా ఇమర్జ్ అయి ఉండాలి. హృదయాభిరాముడైన బాబా వద్దకు కూడా పిల్లల ప్రేమ సదా చేరుకుంటూనే ఉంటుంది. కానీ అది నంబరువారుగా తప్పకుండా ఉంటుంది. బాబా ఏమని ఆశిస్తున్నారంటే ప్రేమకు గుర్తుగా సదా ప్రతి ఒక్కరి హృదయములో హృదయాభిరాముడు తోడుగా ఉండాలి, పిల్లలెవ్వరూ ఒంటరిగా ఉండకూడదు, కంబైన్డుగా ఉండాలి. కనుక చెక్ చేసుకోండి - సదా కంబైన్డుగా ఉంటున్నారా లేక అప్పుడప్పుడూ ఒంటరిగా కూడా అవుతూ ఉంటారా? ఒంటరిగా అయితే మాయ తన అవకాశాన్ని తీసుకుంటుంది. అందుకే బాప్ దాదా సదా ఏమని చెప్తూ ఉంటారంటే - హృదయాభిరాముడిని సదా హృదయములో ఇముడ్చుకోండి. దీనినే సత్యమైన మరియు సదా యొక్క ప్రేమ అని అంటారు. మరి అప్పుడప్పుడూ ఒంటరిగా అవుతూ ఉంటారా లేక సదా తోడుగా ఉంటున్నారా? ప్రతి బిడ్డ చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? విశేషముగా మధుబన్ నివాసుల నషా ఏమని ఉంటుందంటే - కలిసి ఉన్నాము, కలిసి వెళ్తాము, కలిసి రాజ్యము చేస్తాము. అలాగే విశేషముగా చాలా చాలా మధురమైన నిమిత్త పిల్లలు కూర్చుని ఉన్నారు, వారైతే బాబాతో మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞను చేసారు మరియు మెజారిటీ పిల్లలు సదా ప్రాక్టికల్ గా కంబైన్డు రూపములో ఉంటున్నారు కానీ నంబరువారుగా ఉన్నారు. బాబా ఏమి ఆశిస్తున్నారంటే, ప్రతి బిడ్డ, మహారథి, నిమిత్త పిల్లలైతే ఇతరులకు కూడా తమ ముఖము ద్వారా బాబా యొక్క సాక్షాత్కారాన్ని చేయించేవారు. వారి ముఖము మరియు నడవడిక ద్వారా బాబా యొక్క ప్రకాశమయ ముఖము మరియు బాబా యొక్క అతీతమైన మరియు ప్రియమైన నడవడిక సాక్షాత్కారమవుతూ ఉంటుంది.

బ్రహ్మాబాబాను చూసారు కదా, బ్రహ్మాబాబా అంతిమము వరకు శ్రీమతమనుసారముగా ప్రతి మురళిలో ఎన్నిసార్లు బాబా-బాబా అనేవారు, లెక్క పెట్టండి. ప్రతి మురళిలో బాబా-బాబా అని ఎన్ని సార్లు అనేవారు. వారు తమ ముఖముతో, మూర్తితో, వచనాలతో, విశేషముగా నయనాలు మరియు మస్తకముతో బాబాను ప్రత్యక్షము చేసారు. బ్రహ్మాబాబాను చూసినప్పుడు ఏమి అనుభవమయ్యేది, పిల్లలైన మీరైతే అనుభవీలు కదా. బాప్ దాదా కనిపించేవారు. కేవలం బాబా అన్న మాటను ఎవరూ అనేవారు కాదు, సదా ప్రతి ఒక్కరి నోటి నుండి బాప్ దాదా, బాప్ దాదా అని వచ్చేది, ఇద్దరినీ కలిపి పిలిచేవారు మరియు అనుభవము కూడా అయ్యేది. ఇలా ఫాలో ఫాదర్ చేయండి. మీ ముఖము ద్వారా, మాటల ద్వారా, నడవడిక ద్వారా, దృష్టి ద్వారా చూసేవారికి బాబా స్మృతి స్వతహాగా కలగాలి. ఇప్పుడు బాబా చూసారు, మెజారిటీ పిల్లలందరికీ ఇదే సంకల్పము ఉంది - మేము మా ముఖము, మాట మరియు కర్మ ద్వారా బాబాను ప్రత్యక్షము చేయాలి. అందుకు ఫాలో ఫాదర్ చేయండి. బ్రహ్మాబాబా తమ నడవడిక, ముఖము, దృష్టి, వృత్తి, సంకల్పాలతో సదా బాబాను ప్రత్యక్షము చేసారు, మీ అందరికీ అనుభవమే కదా! మీరు బ్రహ్మాబాబాను మాత్రమే చూసేవారు కాదు, బాప్ దాదాను చూసేవారు. దానికి కారణమేమిటి? బ్రహ్మాబాబా సదా తమ నయనాలలో, మస్తకములో బాబాను ఇముడ్చుకున్నారు. కావున విశేషముగా మీ నయనాలు, ముఖము, నడవడికలో బాప్ దాదా ఇమిడి ఉన్నట్లుగా ప్రత్యక్షము చేయాలి. ప్రతి మాటలో నేర్పించేవారు అనుభవమవ్వాలి. వీరేదైతే మాట్లాడుతున్నారో, వీరికి నేర్పించేది, వీరిలో శక్తిని నింపేది సర్వశక్తివంతుడైన తండ్రి, భగవంతుడు, వీరు భగవంతుని సంతానము, భగవంతుని విద్యార్థులు, అంతేకానీ వీరు భగవంతుడిని ఫాలో చేసే ఫాలోవర్స్ కాదు, వీరు ప్రతి అడుగులోనూ పదమాలను పొందేవారు అని అనిపించాలి. ఇప్పుడు సమయము కూడా మీకు సహయోగిగా అవ్వడానికి సిద్ధముగా ఉంది. పరిస్థితులు మారుతున్నాయి. వద్దనుకున్నా కూడా పరిస్థితులు భగవంతుడి స్మృతిని కలిగిస్తున్నాయి. కావున, ఒకటి సమయము, రెండు నిమిత్తమైన మీరు, రెండు గ్రూపుల విశేషత ఉంది. ఒకరు విశేషముగా నిమిత్తమైయున్న మధుబన్ నివాసులు, రెండు, రెడీగా తయారైన ఉన్న నిమిత్త గ్రూప్ మీటింగుకు వచ్చారు.

బాప్ దాదా ఏమి చూసారంటే, మేము బాబాను ప్రత్యక్షము చేయవలసిందే అన్న ఉల్లాస-ఉత్సాహాలు ఇక్కడకు వచ్చిన మెజారిటీ పిల్లల్లో కనిపించాయి. అది ముఖము ద్వారా కావచ్చు, గుణము ద్వారా కావచ్చు, వాణి ద్వారా కావచ్చు, సంబంధ సంపర్కములో ఉన్నవారి ద్వారా అయినా కావచ్చు. ఈ రోజుల్లో మీ మనసులో ఆత్మల పట్ల కళ్యాణ భావన ఉన్న కారణముగా ఆత్మలు మీ కనెక్షన్లోకి వస్తున్నారు మరియు రావాలని కూడా అనుకుంటున్నారు. బాప్ దాదా ఏదైతే మనసా సేవ కార్యాన్ని ఇచ్చారో, అందులో కూడా ఏమి చూడటము జరిగిందంటే, ఏ పిల్లలైతే యోగయుక్తముగా అయ్యి మనసా సేవను అభ్యాసము చేస్తారో, ఇప్పుడు ఆ వైబ్రేషన్లు నలువైపులా ఎవరో ఒకరికి చేరుకుంటున్నాయి. మాకు ఎక్కడి నుండో ప్రకాశ కిరణాలు, సుఖ-శాంతుల అలలు వస్తున్నాయి అని అనుకుంటున్నారు, కానీ ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది వారికి ఇంకా స్పష్టమవ్వలేదు. వస్తున్నాయి కానీ భారత్ లో ఉన్న బాప్ దాదా యొక్క సంతానము నుండి వస్తున్నాయి అన్నది ఇంకా స్పష్టమవ్వలేదు. తెలిస్తే మీ వద్దకు పరుగెడతారు. ఇప్పుడు మరింత శక్తిశాలి కిరణాలను అటువంటి ఆత్మలపైకి వ్యాపింపజేయండి, అప్పుడు వారికి స్పష్టమవుతుంది. చేరుకుంటున్నాయి, ఇప్పుడు మొదలయ్యాయి, కానీ కొద్దికొద్దిగా కొంతమంది ఇచ్చే కిరణాలే చేరుకుంటున్నాయి, ఇప్పుడు వీటిని మరింత శక్తిశాలిగా చేయండి. దీనిలో విఘ్నముగా అయ్యేది, వారి వరకు చేరుకోవడములో కారణముగా నిలిచేది ఏమిటి? మీరు యోగము చేస్తారు, అమృతవేళ కూర్చుంటారు, కానీ జ్వాలాముఖి యోగములో లోటు ఉంది. దీని కారణముగా, ఒకటేమో - ఏ భక్తులకైతే లేక ఏ ఆత్మలకైతే మీరు కిరణాలను పంపిస్తున్నారో, అవి అంత స్పష్టముగా ఉండటము లేదు మరియు రెండు - జ్వాలాముఖి అగ్ని స్వరూప యోగ శక్తి లేని కారణముగా లేక దాని లోటు ఉన్న కారణముగా సంస్కారాలు ఏవైతే మధ్యమధ్యలో విఘ్నాలు కలిగిస్తున్నాయో, ఆ సంస్కారాలు కూడా సమాప్తమవ్వడము లేదు. సంస్కార పరివర్తన జరగాలని పురుషార్థము చేస్తున్నారు కానీ అవి మరణిస్తున్నాయి కానీ కాలడము లేదు. రావణుడిని కేవలం హతమార్చడము జరగదు కదా, హతమార్చిన తర్వాత కాలుస్తారు కూడా, ఎందుకంటే హతమార్చిన తర్వాత శరీరమైతే ఉండిపోతుంది కదా! అదే విధముగా మీరు అమృతవేళ స్మృతిలో అయితే కూర్చుంటారు కానీ యోగము అగ్ని రూపములో, జ్వాలా రూపములో తక్కువగా ఉంది. మిలనము జరుపుకుంటారు, ఆత్మిక సంభాషణ చేస్తారు, మీ జీవితములోని విషయాలు కూడా మాట్లాడుతారు. కానీ నిరంతరము యోగము అగ్ని రూపములో ఉండాలి. సంస్కారాలను తప్పకుండా హతమారుస్తున్నారు, అవి మరణిస్తున్నాయి కూడా, కానీ మధ్యమధ్యలో లేచి కూర్చుంటున్నాయి. కాలిపోతే నామ-రూపాలు సమాప్తమైపోతాయి. ఇప్పుడు పిల్లలందరూ ఆత్మిక సంభాషణలో కూడా ఏమంటూ ఉంటారంటే, ఎంత కోరుకుంటున్నామో అంత ఉండటము లేదు అని.

బాప్ దాదా ఈ రోజు ఈ సూచనను ఇస్తున్నారు ఎందుకంటే స్పెషల్ మహావీర్ పిల్లలు మీటింగ్ కోసం వచ్చారు. మధుబన్ నివాసులు అనగా ఏమిటి? మధుబన్ లో ఏముంది, మధుబన్ అనగా బాబా. మధుబన్ అనగానే అందరికీ ఏమి గుర్తుకువస్తుంది? మధుబన్ యొక్క బాబా. మరి మధుబన్ వారు విశేషముగా ఈ విషయములో అటెన్షన్ ఉంచవలసి ఉంటుంది. మధుబన్ అనగానే మధుబన్ యొక్క బాబా గుర్తుకువస్తారా! మధుబన్ లో ఉండేవారిని ఏ దృష్టితో చూస్తారు? మధుబన్ వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. కింద ఉన్నవారు, పైన ఉన్నవారు, అందరూ చేతులెత్తండి, ఈ రోజు సభలో అందరికన్నా ఎక్కువగా మధుబన్ నివాసులు ఉన్నారు. మధుబన్ నివాసులు ఈ అద్భుతాన్ని తప్పకుండా చూపిస్తారని బాప్ దాదాకు సంతోషముగా ఉంది - ప్రతి మధుబన్ నివాసి యొక్క ముఖము ద్వారా మరియు నడవడిక ద్వారా బాబా, బాబా అన్నదే కనిపించాలి. మాటల ద్వారా బాబా కనిపించాలి ఎందుకంటే మధుబన్ లో చేసే యజ్ఞసేవకు ఫలము మరియు బలము చాలా లభిస్తాయి. తీసుకునేవారు తీసుకుంటారు, కానీ లభిస్తుంది. సంస్కారాలను చూడటములో మరియు సంస్కారాలను కలుపుకుపోవడములో సదా అటెన్షన్ పెట్టాల్సిన అవసరముంది. బాప్ దాదాకు ప్రతి మధుబన్ నివాసి పట్ల విశేషమైన ప్రేమ ఉంది, ఎందుకని? బాబా స్థాపించిన యజ్ఞ సేవలో స్వయాన్ని సమర్పించుకున్నారు. మధుబన్ నివాసులకు, ఒకటి, తమ పురుషార్థము యొక్క ఫలము లభిస్తుంది మరియు రెండు, మధుబన్ కు వచ్చే బ్రాహ్మణులు కావచ్చు, కొత్త ఆత్మలు కావచ్చు, వారి సేవ యజ్ఞ సేవ, అది సాధారణ సేవ కాదు, యజ్ఞ సేవకు ఎక్స్ ట్రా పుణ్యము కూడా లభిస్తుంది. ఒకవేళ ఏ మధుబన్ నివాసి అయినా బాప్ దాదా ఇచ్చిన శ్రీమతమనుసారముగా అమృతవేళ నుండి రాత్రి వరకు శ్రీమతమనుసారముగా నడుచుకుంటే, వారికి సేవకు ఎక్స్ ట్రా పుణ్యము లభిస్తుంది. మధుబన్ వారికి తెలిసినా తెలియకపోయినా, నిర్లక్ష్యముగా ఉన్నా కానీ మధుబన్ సేవకు పుణ్యము తప్పకుండా లభిస్తుంది. మధుబన్ నివాసిగా అవ్వడము సాధారణ విషయము కాదు. ఎవరు ఎటువంటి పని చేస్తున్నా కానీ, శుభ్రము చేసే కార్యాన్ని చేయిస్తున్నా సరే, ఇటువంటి సాధారణ కర్మకు కూడా పుణ్యము చాలానే ఉంటుంది ఎందుకంటే బాబా రచించిన యజ్ఞము ఇది. ఈ యజ్ఞము నుండే, మధుబన్ నుండే అందరికీ పరమాత్మ ప్రేమ ప్రాపిస్తుంది. అందుకే మధుబన్ లో తప్ప బాబా మరెక్కడా రారు. బాబా రావడము, కలవడము, కలిపించడము వంటి పాత్ర ఈ మధుబన్ కు ఫిక్స్ అయిపోయింది. కావున మధుబన్ నివాసులు ప్రతి ఒక్కరూ తమ పుణ్య ఖాతాను తెలుసుకోండి, గుర్తించండి మరియు ఆ మహాన్ ప్రాప్తి స్వరూపులుగా అవ్వండి. ఏది ఏమైనా, పెద్దవారి వరకు చేర్చడము మీ పని. చేర్చారు అంటే మనసు నుండి తీసివేసినట్లు, మీ బాధ్యత పూర్తి అయిపోయింది. అప్పటికీ ఏమీ సక్రమముగా జరగట్లేదు అని మీకనిపిస్తే అందులో మీకు పాపము ఏమీ ఉండదు. ఎవరు బాధ్యులో వారికి పాపము అంటుకుంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి. విషయాన్ని వారికి చేర్చడము మీ పని, కానీ ఏమి జరిగింది, ఏమి జరగలేదు, ఇది ఎందుకు జరగలేదు, అది ఎందుకు జరగలేదు అన్నది మీకు అవసరము లేదు. ఇలా ఆలోచిస్తే మరింత వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి. మీ బాధ్యత మీరు చేయండి, విషయాన్ని చేర్చండి. కానీ చేర్చిన తర్వాత, చేర్చడము కూడా పద్ధతి అనుసారముగా చేయాలి. మీరు మధుబన్ నివాసి బ్రాహ్మణులు, ఉన్నతమైనవారు, మీ హోదాను తెలుసుకుని ఇటువంటి కర్తవ్యాలను చేయండి. మీరు చేసే కర్తవ్యాలను విని అందరూ నేర్చుకునే విధముగా మీ కర్తవ్యాలు ఉండాలి. మధుబన్ నివాసుల పట్ల అందరికీ భావన ఉంది. ఇటువంటి భావన కలిగినవారికి భావన యొక్క ఫలాన్ని చూపించండి. మధుబన్ వారి గురించి బాప్ దాదాకు తెలుసు, కొంతమంది పిల్లలు చాలా మర్యాదాపూర్వకముగా ఉంటారు, స్వపురుషార్థులు, బాబాకు స్నేహీగా అయ్యి సహయోగాన్ని ఇచ్చే పిల్లలు కూడా ఉన్నారు. కానీ బాప్ దాదా ఇదే ఆశిస్తున్నారు, మధుబన్ నివాసుల పట్ల బాప్ దాదా ఏమి ఆశిస్తున్నారు? బాబా సంతానమైన ప్రతి మధుబన్ నివాసి యజ్ఞ స్నేహీగా, సహయోగిగా అయ్యి తమ నడవడిక ద్వారా అందరికీ బాబా పరిచయాన్ని ఇచ్చి మధుబన్ నివాసుల భాగ్యము ఎంత గొప్పది అని తమ భాగ్యాన్ని ప్రసిద్ధి చేయండి ఎందుకంటే మీరు యజ్ఞ నివాసులు కదా. పరమాత్మ ముందుగా ఏమి రచించారు? యజ్ఞాన్ని రచించారు. యజ్ఞ భూమికి నిమిత్తము ఈ మధుబన్. మధుబన్ మహిమ తెలుసు కదా. మధుబన్ మహిమ గురించి తెలిసినవారు చేతులెత్తండి. బాప్ దాదా ఇక్కడ చూస్తారు (ఎదురుగా ఉన్న టి.వి.లో చూస్తారు). అచ్ఛా, చాలా మంచిది.

ఏ పిల్లలైతే నిమిత్తమై ఉన్నారో, బాప్ దాదా వారిని చూసి సంతోషిస్తున్నారు. అందరూ అటెన్షన్ ఇస్తూ ఉంటారు కానీ మరింత అటెన్షన్ ను ఇస్తూ అందరినీ సంతుష్టపరచండి. విశ్వానికి సంతుష్టతా కిరణాలు చేరాలి, ఈ కార్యాన్ని కూడా నిమిత్తమైనవారు చేయాలి. ఎందుకంటే ఎవరైతే నిమిత్తులో, వారు మీ-మీ హ్యాండ్స్ యొక్క సంస్కార పరివర్తన చేయడములో కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది. సేవ చేయిస్తారు, ఉండటానికి, తినడానికి మెజారిటీ సెంటర్లు ఏర్పాట్లు కూడా చేస్తాయి కానీ వారిలో శక్తిని ఎలా నింపండి అంటే బాబా నుండి శక్తిని తీసుకుని మీ సేవాస్థానములోని వాయుమండలాన్ని ఎలా తయారుచెయ్యండి అంటే ఎవరు వచ్చినా వారిని ముందుగా వాయుమండలము ఆకర్షించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఏమి ఆశిస్తున్నారంటే, రాగానే ఏదైనా అనుభవమవ్వాలి, చూడగానే ఏదైనా అనుభవమవ్వాలి అని. వినడము ద్వారా అనుభవమవుతుంది, యోగము యొక్క అనుభవము ఉంటుంది కానీ వాయుమండలము యొక్క అనుభవము కూడా జరగాలి. ఈ అటెన్షన్ ను నిమిత్తముగా ఉన్న ఆత్మలు ఉంచాలి, ఇది వారి విశేష సేవ. స్వయము ఒకవేళ యోగయుక్తులుగా అయ్యి వాయుమండలములో మంచి స్థితిలో ఉన్నట్లయితే దాని ప్రభావము సేవాస్థానముపై ఆటోమేటిక్ గా పడుతుంది. ఎలా అయితే బాప్ దాదా మరియు నిమిత్తమైన పెద్దవారి వాయుమండలము, వైబ్రేషన్ల ప్రభావము పడుతుంది కదా. బాప్ దాదా యొక్క వాయుమండలము మారుతుంది కదా. కావున పిల్లలు ప్రతి ఒక్కరూ వాయుమండలాన్ని తయారుచేయడము పట్ల అటెన్షన్ పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు సెంటర్ల వాయుమండలము మారితేనే ప్రపంచము యొక్క వాయుమండలము మారుతుంది. మీ సేవాస్థానమే నిమిత్తమవుతుంది. పురుషార్థము ఉంది, లక్ష్యము ఉంది కానీ ఈ లక్ష్యాన్ని మరింత పవర్ఫుల్ చేయండి. ఎవరిని చూసినా, మనుష్యులు ఈ రోజుల్లో ముఖము ద్వారా, వైబ్రేషన్ల ద్వారా అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే వారి బుద్ధిలో ఆసురీ శక్తి యొక్క ప్రభావము కూడా ఉంది, జ్ఞానము యొక్క ప్రభావము కూడా ఉంది. అందుకే ఎవరెవరైతే మీటింగ్ కు వచ్చారో, మీలోని ప్రతి ఒక్కరూ బాధ్యులే. లేకపోతే మీటింగులో పేరు ఎందుకు వేసారు! ధైర్యముంది కదా, అందుకే మీ పేరు ఇందులో ఉంది. మీ కర్తవ్యన్ని ప్రత్యక్షము చేయండి. చేయాలనుకుంటారు కూడా, బాప్ దాదాకు తెలుసు. చేయడానికి ప్రయత్నము కూడా చేస్తున్నారు కానీ ప్రయత్నాన్ని కొద్దిగా పెంచండి. అర్థమైందా.

ఇప్పుడు బాప్ దాదా అందరి రిజల్టును చూడాలనుకుంటున్నారు. మధుబన్ వారు కావచ్చు, మీటింగ్ వారు కావచ్చు, ఇరువురి రిజల్టును చూడాలనుకుంటున్నారు. జగదంబ యొక్క విశేష పురుషార్థము ఏమిటంటే - బాబా చెప్పడము మరియు జగదంబ చెయ్యడము. మీ దీదీ - ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని ఇదే అంటూ ఉండేవారు. మీ దాదీకి - ఇప్పుడు కర్మాతీతముగా అవ్వాలి అన్న ఈ సంకల్పమే ఉండేది. కర్మాతీతముగా అయ్యేందుకు క్లాసు చేయించాలి, కర్మాతీతముగా అయ్యేందుకు ఉత్సాహాన్ని ఇప్పించాలి అన్న సంకల్పము ఉండేది. మీ పాండవులు ఎవరైతే వెళ్ళిపోయారో, వారికి కూడా మనసులో ఇదే సంకల్పము ఉండేది, పాండవులను విజయులు అని అంటారు. విజయీ పాండవులు అన్న గాయనము ఏదైతే ఉందో, పాండవులు అనగానే ఏమి గుర్తుకువస్తుంది? విజయము. ఇదే పాండవుల లక్ష్యముగా ఉండినది మరియు ఇప్పటికీ ఉంది. అక్షోణి సైన్యము ఉన్నప్పటికీ పాండవులు అనగానే విజయము గుర్తుకువస్తుంది. పాండవులు ఐదుగురే కానీ విజయులు. ఎటువంటి వాయుమండలము ఉన్నప్పటికీ, అక్షోణి సైన్యము యొక్క వాయుమండలము ఉన్నా గాని పాండవులు పాండవపతి యొక్క శ్రీమతముతో విజయులుగా అయ్యారు మరియు విజయము యొక్క పేరును ప్రసిద్ధి చేసారు. ఇప్పుడు ఆ పాండవులే విజయులుగా అయ్యి ఇతరులకు కూడా విజయాన్ని ఇప్పించేవారు. పాండవులను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు, ఏ విషయములో సంతోషిస్తున్నారు? శక్తులకు తోడుగా నిలిచినందుకు. శక్తులకు సహయోగాన్ని ఇచ్చి ముందుకు నడిపించడములో తోడుగా ఉన్నారు. ఎలా అయితే బాబా శక్తులకు శివశక్తులు అన్న మంత్రాన్ని ఇచ్చి కంబైన్డుగా చేసారో, అలాగే పాండవులు కూడా తమలో ఏవైతే విశేషతలు ఉన్నాయో ఆ విశేషతలతో శక్తులకు సహయోగాన్ని ఇచ్చి శక్తులను ముందుంచే మంచివారు, మరియు సదా మరింత మంచిగా అయ్యి ముందుకు వెళ్ళేవారు.

బాప్ దాదా ఈ రోజు మీ స్నేహాన్ని చూసి మీ అందరికీ స్నేహ హారాన్ని వేస్తున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరికీ స్నేహ సహయోగముల హారాన్ని వేయండి. బాహువుల హారము కాదు, మనసు ద్వారా సహయోగము అనే హారాన్ని వేయండి. బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నారు, పిల్లలు ప్రతి ఒక్కరి జేబులో సహయోగము అనే నోట్ ఉండాలి. పొరపాట్లను నోట్ చేయకండి, సహయోగమనే నోట్లతో జేబు నిండి ఉండాలి. ఎక్కడ చూసినా, సహయోగము అవసరమైనప్పుడల్లా సహయోగపు నోట్లు ఇవ్వండి. జేబులో ఉన్నాయా? సహయోగపు నోట్లు ఉన్నాయా? నిండుగా ఉన్నాయా, జేబు నిండుగా ఉందా? ఖాళీగా అయితే లేదు కదా? మీరు సహయోగపు నోటును ఇవ్వండి మరియు వారు మీకు ఆశీర్వాదాల హారాన్ని వేస్తారు.

అడ్వాన్స్ పార్టీలోని మీ విశేష ఆత్మలు మరియు సూక్ష్మవతన నివాసి అయిన బాబా వేచి ఉన్నారు. మీకు వారి సంకల్పాలు చేరుతున్నాయా? వారు డేట్ అడుగుతున్నారు. మీ పెద్ద-పెద్ద దాదీలు మరియు దాదాలు డేట్ కోసం వేచి ఉన్నారు. మరి వారికి డేట్ ఇస్తారా! ఇస్తారా? మొదటి లైన్ వారు చెప్పండి, డేట్ ఇస్తారా? లేక వెయిట్ అండ్ సీ (వేచి చూడండి) అంటారా. ప్రతి ఒక్కరూ ఇందులో ఏమి చేయాలి? ప్రతి ఒక్కరూ తమలో ఉండిపోయిన సంస్కారాల యొక్క అంతిమ సంస్కారము చేయండి. అప్పుడు సమయము సమీపముగా వచ్చేస్తుంది. సమయాన్ని సమీపముగా తీసుకురావడానికి ఇదే పద్ధతి. విఘ్నాలు వేసేది మీలో మిగిలి ఉన్న సంస్కారాలే. మరి ఇప్పుడిక రాబోయే సీజన్ ప్రారంభమవ్వడానికి చాలా రోజులు ఉన్నాయి. రోజూ ఏదో ఒక సంస్కారానికి అంతిమ సంస్కారము చేయండి. ఒక్కొక్క సంస్కారాన్ని అంతిమ సంస్కారము చేస్తూ వెళ్ళండి, ఇన్ని రోజులు ఉన్నాయి. సంస్కారాల అంతిమ సంస్కారము జరిగిపోయింది అని వచ్చే సీజన్లో బాప్ దాదా వచ్చినప్పుడు మేము చేతులెత్తుతాము అని ఎవరు చెప్తారు? వారు చేతులెత్తండి. అయిపోయిందా? చేతులైతే ఎత్తుతున్నారు. బాప్ దాదా అడ్వాన్సులో చాలా చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నారు. అచ్ఛా.

వరదానము:-
సోమరితనము యొక్క రకరకాల రూపాలను సమాప్తము చేసి సదా ఉత్సాహములో ఉండే తీవ్ర పురుషార్థీ భవ

వర్తమాన సమయములో మాయ దాడి సోమరితనము రూపములో రకరకాలుగా జరుగుతుంది. ఈ సోమరితనము కూడా విశేషమైన వికారము, దీనిని సమాప్తము చేసేందుకు సదా ఉత్సాహములో ఉండండి. ఎప్పుడైతే సంపాదించాలనే ఉత్సాహము ఉంటుందో, అప్పుడు సోమరితనము సమాప్తమైపోతుంది, అందుకే ఎప్పుడూ కూడా ఉత్సాహాన్ని తగ్గించుకోకండి. ఆలోచిస్తాము, చేస్తాము, చేసేస్తాములే, అయిపోతుందిలే... ఈ మాటలన్నీ సోమరితనానికి గుర్తు. ఇటువంటి సోమరితనముతో కూడిన నిర్బల సంకల్పాలను సమాప్తము చేసి, ఏది చేయాలో, ఎంత చేయాలో, ఇప్పుడే చేయాలి అని ఆలోచించండి - అప్పుడు తీవ్ర పురుషార్థులు అని అంటారు.

స్లోగన్:-
సత్యమైన సేవాధారులు అనగా ఎవరి ఆలోచనలు మరియు మాటలు సమానముగా ఉంటాయో, వారు.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

పవిత్రత అనే దీపము ఎల్లప్పుడూ శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా వెలుగుతూ ఉండాలి, కొంచెము కూడా కదలకూడదు, అచలముగా ఉండాలి. ఎంతటి అచలమైన పవిత్రతా దీపముగా ఉంటారో, అంతగానే సహజముగా అందరూ బాబాను గుర్తించగలరు మరియు పవిత్రతకు జయజయకారాలు జరుగుతాయి. పవిత్రతా పర్సనాలిటీని సదా ఇమర్జ్ రూపములో స్మృతిలో ఉంచుకోండి. స్మృతియే సమర్థతకు ఆధారము మరియు ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడకు మాయ రాలేదు. సమర్థ ఆత్మల వద్దకు మాయ రావటమనేది అసంభవము.