31-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఉదయముదయమే లేచి చాలా ప్రేమగా - బాబా, గుడ్ మార్నింగ్ అని చెప్పండి, ఈ స్మృతితోనే మీరు సతోప్రధానముగా అవుతారు’’

ప్రశ్న:-
యథార్థమైన స్మృతి ద్వారా తండ్రి నుండి కరెంటు తీసుకునేందుకు ముఖ్యముగా ఏ గుణాలు అవసరము?

జవాబు:-
చాలా ఓర్పుతో, వివేకముతో మరియు గంభీరతతో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ స్మృతి చేయడం ద్వారా తండ్రి నుండి కరెంటు లభిస్తుంది మరియు ఆత్మ సతోప్రధానముగా అవుతూ ఉంటుంది. మిమ్మల్ని ఇప్పుడు తండ్రి స్మృతి సతాయించాలి ఎందుకంటే తండ్రి నుండి చాలా భారీ వారసత్వము లభిస్తుంది, మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు, అన్ని దైవీ గుణాలు వచ్చేస్తాయి.

ఓం శాంతి.
తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, తతత్వమ్ అనగా ఆత్మలైన మీరు కూడా శాంత స్వరూపులు. ఆత్మలైన మీ అందరిదీ స్వధర్మమే శాంతి. శాంతిధామము నుండి మళ్ళీ ఇక్కడకు వచ్చి టాకీగా అవుతారు (వాచాలోకి వస్తారు). ఈ కర్మేంద్రియాలు మీకు పాత్రను అభినయించేందుకని లభిస్తాయి. ఆత్మ చిన్నగా-పెద్దగా అవ్వదు, శరీరము చిన్నగా-పెద్దగా అవుతుంది. తండ్రి అంటారు, నేనైతే శరీరధారిని కాను. నేను పిల్లలను సమ్ముఖముగా కలుసుకునేందుకు రావలసి ఉంటుంది. ఒక తండ్రి ఉన్నారనుకోండి, అతని ద్వారా బిడ్డ జన్మిస్తాడు, అప్పుడు ఆ బిడ్డ - నేను పరంధామము నుండి వచ్చి జన్మ తీసుకుని మాతా-పితలను కలుసుకునేందుకు వచ్చాను అని ఈ విధంగా అనడు. ఒకవేళ ఎవరి శరీరములోకైనా ఏదైనా కొత్త ఆత్మ వచ్చినట్లయితే లేదా ఏదైనా పాత ఆత్మ ఎవరి శరీరములోకైనా ప్రవేశించినట్లయితే - వారు నేను మాతా-పితలను కలుసుకునేందుకు వచ్చాను అని ఈ విధంగా అనరు. ఆ ఆత్మకు ఆటోమేటిక్ గా మాతా-పితలు లభిస్తారు. ఇక్కడ ఇది కొత్త విషయము. తండ్రి అంటారు, నేను పరంధామము నుండి వచ్చి పిల్లలైన మీ సమ్ముఖములో ఉన్నాను. మీకు జ్ఞానాన్ని ఇస్తాను ఎందుకంటే నేను జ్ఞాన సంపన్నుడిని, జ్ఞాన సాగరుడిని, నేను పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు, రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తాను.

పిల్లలైన మీరు ఇప్పుడు సంగమములో ఉన్నారు, ఆ తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళాలి, అందుకే పావనముగా అయితే తప్పకుండా అవ్వాలి. లోలోపల చాలా సంతోషము ఉండాలి. ఓహో! అనంతమైన తండ్రి చెప్తున్నారు, మధురాతి-మధురమైన పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానులుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు. తండ్రి పిల్లలను ఎంతగా ప్రేమిస్తారు. కేవలము టీచరు రూపములో చదివించి ఇంటికి వెళ్ళిపోతారని కాదు. వీరు తండ్రి కూడా, టీచరు కూడా. మిమ్మల్ని చదివిస్తారు. స్మృతియాత్ర కూడా నేర్పిస్తారు. కావున విశ్వానికి యజమానులుగా తయారుచేసే, పతితులను పావనముగా తయారుచేసే ఇటువంటి తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి. ఉదయముదయమే లేచి మొట్టమొదట శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి. పిల్లలు తమ మనసును ప్రశ్నించుకోవాలి - మేము ఉదయమే లేచి అనంతమైన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము! ఉదయమే లేచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి, జ్ఞాన చింతనలో ఉండాలి, అప్పుడు సంతోషపు పాదరసము ఎక్కుతుంది. ముఖ్యమైనది స్మృతియే, దీని ద్వారా భవిష్యత్తు కోసం చాలా భారీ సంపాదన జరుగుతుంది. కల్ప-కల్పాంతరాల కొరకు ఈ సంపాదన పనికొస్తుంది. మీరు చాలా ఓర్పుతో, గంభీరతతో మరియు వివేకముతో స్మృతి చెయ్యాలి. మేము బాబాను చాలా గుర్తు చేస్తాము అని పైపైన చేసే స్మృతి గురించి చెప్తుంటారు కానీ యథార్థముగా స్మృతి చెయ్యటములో శ్రమ ఉంది. ఎవరైతే తండ్రిని ఎక్కువ స్మృతి చేస్తారో వారికి కరెంట్ ఎక్కువ లభిస్తుంది ఎందుకంటే స్మృతితో స్మృతి కలుస్తుంది. యోగము మరియు జ్ఞానము అనేవి రెండు విషయాలు. యోగము చాలా భారీ సబ్జెక్టు. యోగము ద్వారానే ఆత్మ సతోప్రధానముగా అవుతుంది. స్మృతి లేకుండా సతోప్రధానముగా అవ్వటము అసంభవము. చాలా బాగా ప్రేమతో తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆటోమేటిక్ గా కరెంట్ లభిస్తుంది, ఆరోగ్యవంతులుగా అయిపోతారు. కరెంట్ తో ఆయుష్షు కూడా పెరుగుతుంది. పిల్లలు స్మృతి చేస్తే బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు.

శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు అన్నది మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి. శివబాబా పతిత-పావనుడు కూడా, సద్గతిదాత కూడా. సద్గతి అనగా స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు. బాబా ఎంతటి మధురమైనవారు. వారు కూర్చుని ఎంత ప్రేమగా పిల్లలను చదివిస్తారు. తండ్రి, దాదా ద్వారా మనల్ని చదివిస్తారు. బాబా పిల్లలను ఎంతగా ప్రేమిస్తారు, ఏ కష్టమూ ఇవ్వరు. కేవలము - నన్ను స్మృతి చెయ్యండి మరియు చక్రాన్ని స్మృతి చెయ్యండి అని అంటారు. తండ్రి స్మృతిలో హృదయము పూర్తిగా శీతలమైపోవాలి. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే సతాయించాలి ఎందుకంటే తండ్రి నుండి ఎంతటి భారీ వారసత్వము లభిస్తుంది. స్వయాన్ని చూసుకోవాలి - నాకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంది, నాలో ఎంతవరకు దైవీ గుణాలు ఉన్నాయి! ఎందుకంటే పిల్లలైన మీరు ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఎంతెంతగా యోగములో ఉంటారో అంతగా ముళ్ళ నుండి పుష్పాలుగా, సతోప్రధానులుగా అవుతూ ఉంటారు. ఎవరైతే చాలామందిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తారో వారినే సత్యమైన సుగంధభరితమైన పుష్పము అని అంటారు. వారెప్పుడూ ఎవ్వరికీ ముళ్ళు గుచ్చరు. క్రోధము కూడా పెద్ద ముల్లు. అది ఎంతోమందికి దుఃఖమును ఇస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ముళ్ళ ప్రపంచము నుండి తీరానికి చేరుకున్నారు, మీరు సంగమములో ఉన్నారు. ఏ విధంగా తోటమాలి పుష్పాలను వేరే పూలకుండీలోకి తీసి ఉంచుతారో, అదే విధంగానే పుష్పాలైన మిమ్మల్ని కూడా ఇప్పుడు సంగమయుగమనే పూలకుండీలో వేరుగా ఉంచడం జరిగింది. ఇక తర్వాత పుష్పాలైన మీరు స్వర్గములోకి వెళ్ళిపోతారు. కలియుగీ ముళ్ళు భస్మమైపోతాయి.

తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఎంతగా మీరు అనేకుల కళ్యాణము చేస్తారో అంతగా మీకే ప్రతిఫలము లభిస్తుంది. అనేకులకు మార్గము తెలియజేసినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. జ్ఞాన రత్నాలతో ఒడిని నింపుకుని మళ్ళీ దానము చెయ్యాలి. జ్ఞానసాగరుడు మీకు రత్నాలతో పళ్ళాలను నింపి-నింపి ఇస్తారు, ఎవరైతే వాటిని దానము చేస్తారో వారే అందరికీ ప్రియమనిపిస్తారు. పిల్లలకు లోలోపల ఎంత సంతోషము ఉండాలి. తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు అంటారు - మేము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము. పూర్తిగా అతుక్కుపోతారు. వారికి తండ్రి పట్ల చాలా ప్రేమ ఉంటుంది ఎందుకంటే ప్రాణాలను ఇచ్చేటువంటి తండ్రి లభించారని వారికి తెలుసు. జ్ఞానము యొక్క వరదానాన్ని ఎలా ఇస్తారంటే దానితో మనం ఎలా ఉన్నవారిమి ఎలా తయారవుతాము, దివాలాగా ఉన్నవారి నుండి సంపన్నులుగా అయిపోతాము. అంతగా భాండాగారాన్ని నింపుతారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా ప్రేమ ఉంటుంది, ఆకర్షణ కలుగుతుంది. సూది శుభ్రముగా ఉంటే అయస్కాంతము వైపుకు ఆకర్షితమవుతుంది కదా. తండ్రి స్మృతితో తుప్పు వదిలిపోతూ ఉంటుంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, నిర్లక్ష్యముతో పొరపాట్లు చెయ్యకండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి, లైట్ హౌస్ లుగా అవ్వండి. స్వదర్శన చక్రధారులుగా అయ్యే ప్రాక్టీస్ బాగా జరిగినట్లయితే ఇక మీరు జ్ఞాన సాగరుల వలె అయిపోతారు. ఉదాహరణకు స్టూడెంట్ చదువుకుని టీచర్ లా అయిపోతాడు కదా. మీ వ్యాపారమే ఇది. అందరినీ స్వదర్శన చక్రధారులుగా తయారుచెయ్యండి, అప్పుడే చక్రవర్తీ రాజా-రాణులుగా అవుతారు. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు లేకపోతే నాకు కూడా ప్రశాంతత లేనట్లు అనిపిస్తుంది. సమయము వచ్చినప్పుడు అవిశ్రాంతిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక నేను వెళ్ళాలి అన్నట్లు అనిపిస్తుంది. పిల్లలు చాలా పిలుస్తున్నారు, చాలా దుఃఖితులుగా ఉన్నారు అని అనిపిస్తుంది. దయ కలుగుతుంది, అందుకే నేను పిల్లలైన మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు వస్తాను. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుండి మీ అంతట మీరే సుఖధామానికి వెళ్ళిపోతారు. అక్కడ నేను మీకు సహచరునిగా అవ్వను. మీ అవస్థ అనుసారముగా మీ ఆత్మ వెళ్ళిపోతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి కరెంటును ఆటోమేటిక్ గా తీసుకునేందుకు చాలా ప్రేమతో తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈ స్మృతియే ఆరోగ్యవంతులుగా తయారుచేస్తుంది. కరెంట్ తీసుకోవటం ద్వారానే ఆయుష్షు పెరుగుతుంది. స్మృతి ద్వారానే తండ్రి నుండి సర్చ్ లైట్ లభిస్తుంది.

2. నిర్లక్ష్యముతో పొరపాట్లు చేయడాన్ని వదిలి స్వదర్శన చక్రధారులుగా, లైట్ హౌస్ లుగా అవ్వాలి, దీని ద్వారానే జ్ఞాన సాగరులుగా అయ్యి, చక్రవర్తీ రాజా, రాణులుగా అవుతారు.

వరదానము:-
అందరికీ శుభవార్తను వినిపించే సంతోషపు ఖజానాతో సంపన్న భండారా భవ

నేను సంతోషపు ఖజానాతో నిండుగా ఉన్న భండారాను అని సదా మీ ఈ స్వరూపాన్ని ఎదురుగా ఉంచుకోండి. లెక్కలేనన్ని మరియు అవినాశీ ఖజానాలు ఏవైతే లభించాయో, ఆ ఖజానాలను స్మృతిలోకి తీసుకురండి. ఖజానాలను స్మృతిలోకి తీసుకురావడం ద్వారా సంతోషము కలుగుతుంది మరియు ఎక్కడైతే సంతోషము ఉంటుందో అక్కడ సదా కాలము కొరకు దుఃఖాలు దూరమైపోతాయి. ఖజానాల స్మృతి ద్వారా ఆత్మ సమర్థముగా అవుతుంది, వ్యర్థము సమాప్తమైపోతుంది. నిండుగా ఉన్న ఆత్మ ఎప్పుడూ అలజడిలోకి రారు, ఆ ఆత్మ స్వయము కూడా సంతోషముగా ఉంటారు మరియు ఇతరులకు కూడా శుభవార్తను వినిపిస్తారు.

స్లోగన్:-
యోగ్యులుగా అవ్వాలంటే కర్మ మరియు యోగము యొక్క బ్యాలెన్స్ పెట్టుకోండి.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి

సేవలో నోటి ద్వారా సందేశాన్ని ఇవ్వటానికి సమయాన్ని కూడా వెచ్చిస్తారు, సంపదను కూడా వినియోగిస్తారు, అలజడిలోకి కూడా వస్తారు, అలసిపోతారు కూడా... కానీ శ్రేష్ఠ సంకల్పాలతో చేసే సేవలో ఇవన్నీ రక్షించబడతాయి. కనుక ఈ సంకల్ప శక్తిని పెంచుకోండి. దృఢతా సంపన్నమైన సంకల్పాలను చేసినట్లయితే ప్రత్యక్షత కూడా త్వరగా జరుగుతుంది.

డ్రామాకు సంబంధించిన కొన్ని గుహ్యమైన రహస్యాలు (సందేశీ పుత్రికల ద్వారా)

1. ఈ అనంతమైన ఫిల్మ్ (డ్రామా)లో ప్రతి ఒక్క మనుష్యాత్మలో వారి-వారి పొజిషన్ అనుసారముగా వారి పూర్తి జీవితము యొక్క జ్ఞానము లేక పాత్ర ముందే మర్జ్ రూపములో ఉంటుంది. ప్రతి జీవాత్మలో తన మొత్తం జీవితము యొక్క పరిచయము లోపల మర్జ్ అయి ఉన్న కారణముగా సమయము వచ్చినప్పుడు అది ఇమర్జ్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో తమ-తమ సంపూర్ణతా అవస్థ అనుసారముగా తమ పరిచయము లేదా పాత్ర ఏదైతే మర్జ్ అయి ఉందో, అదే సమయము వచ్చినప్పుడు ఇమర్జ్ అవుతుంది, తద్వారా మీలోని ప్రతి ఒక్కరూ అంతా తెలిసినవారిగా అయిపోతారు.

2. ఈ అనంతమైన ఫిల్మ్ లో ప్రతి క్షణము గతిస్తున్న పాత్ర కొత్తదైన కారణముగా మీకు అది ఎలా అనిపిస్తుందంటే, నేను ఇప్పుడిప్పుడే ఇక్కడకు వచ్చాను అన్నట్లుగా అనిపిస్తుంది. ప్రతి క్షణము యొక్క పాత్ర వేరుగా ఉంటుంది. వాస్తవానికి కల్ప క్రితపు ఘడియనే రిపీట్ అవుతుంది, కానీ మీరు ప్రాక్టికల్ జీవితములో ఉన్నప్పుడు ఆ సమయములో అది కొత్తదిగా అనుభవమవుతుంది. ఈ జ్ఞానముతోనే మీరు ముందుకు వెళ్తూ ఉండండి. నేనైతే జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకున్నాను కదా కావున ఇప్పుడు ఇక నేను వెళ్తాను అని ఈ విధంగా ఎవ్వరూ అనడానికి లేదు. ఎప్పటివరకైతే వినాశనము జరగదో, అప్పటివరకు మొత్తం పాత్ర మరియు మొత్తం జ్ఞానము కొత్తగానే అనిపిస్తుంది.

3. ఈ అనంతమైన డ్రామాలో భాగ్యము ఏదైతే తయారుచేయబడి ఉందో... అది నిశ్చయము ద్వారానే తయారుచేయబడింది. భాగ్యాన్ని కాలదన్నుకుంటారా లేక తయారుచేసుకుంటారా అన్నది స్వయముపైనే ఆధారపడి ఉంటుంది. స్వయానికి శత్రువునైనా మరియు స్వయానికి మిత్రుడినైనా నేనే. ఇప్పుడు మీరు చాలా రమణీకముగా మరియు మధురముగా తయారవ్వాలి మరియు తయారుచెయ్యాలి.

4. ఈ అనంతమైన ఫిల్మ్ లో ఈ విధంగా సహనము చేయడము కూడా మీకు క్రిత కల్పానికి సంబంధించిన ఒక మధురమైన స్వప్నము ఎందుకంటే వాస్తవానికి మీకు ఏమీ అవ్వదు. ఎవరెవరైతే మిమ్మల్ని విసిగించారో వారు కూడా ఏమంటారంటే - నేను వీరిని ఇంతగా విసిగించాను, దుఃఖమును ఇచ్చాను, కానీ వీరైతే డివైన్ యూనిటీ (దివ్యమైన ఐకమత్యము), సుప్రీమ్ యూనిటీ (సర్వశ్రేష్ఠమైన ఐకమత్యము) కలిగి ఉన్నారు, విజయీ పాండవులుగా ఉన్నారు. ఈ తయారుచేయబడి ఉన్న విధిని ఎవ్వరూ తప్పించలేరు.

5. ఈ అనంతమైన ఫిల్మ్ లో ఎటువంటి అద్భుతము ఉందో చూడండి - పాండవులైన మీరు ప్రత్యక్షముగా కూడా వచ్చారు మరియు మీ పాత చిత్రాలు మరియు చిహ్నాలు కూడా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. పాత కాగితాలను, పాత శాస్త్రాలను, గీతా పుస్తకము మొదలైనవాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు, వాటి పట్ల చాలా గౌరవము ఉంటుంది. ఇటువంటి పాత వస్తువులు ఉంటూ కూడా మళ్ళీ కొత్త వస్తువుల ఆవిష్కరణ జరుగుతుంది. పాత గీత ప్రత్యక్షముగా ఉన్నప్పటికీ, కొత్త గీత ఆవిష్కరించబడింది. ఎప్పుడైతే కొత్తది స్థాపన అవుతుందో, అప్పుడు పాతది అంతమవుతుంది. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా జ్ఞానాన్ని జీవితములో ప్రత్యక్షముగా ధారణ చేయడం ద్వారా దుర్గ, కాళి మొదలైనవారిగా అయ్యారు. ఇక తర్వాత పాత స్థూల జడ చిత్రాల వినాశనము జరుగుతుంది మరియు కొత్త చైతన్య స్వరూపము యొక్క స్థాపన జరుగుతుంది.

6. ఈ అనంతమైన ఫిల్మ్ ప్లాన్ అనుసారముగా సంగమము యొక్క మధురమైన సమయములో అనన్యులైన దైవీ పిల్లలైన మీరే వికారాలపై విజయాన్ని పొంది వైకుంఠమనే మధురమైన లాటరీని పొందుతారు. మీ ఈ మస్తకము ఎంత భాగ్యశాలి అయినది. ఈ సమయములో నరుడు మరియు నారి అయిన మీరు అవినాశీ జ్ఞానముతో పూజ్య యోగ్య దేవతా పదవిని ప్రాప్తి చేసుకుంటారు, ఇదే ఈ సంగమము యొక్క మనోహరమైన అద్భుతమైన సమయము యొక్క అద్భుతమైన పద్ధతి.

7. ఈశ్వరుడు సాక్షీగా అయి ఏం చూస్తూ ఉన్నారంటే - నేను ఏ పాత్రధారులనైతే అనేక ఆభరణాలు, నగలతో అలంకరించి ఈ సృష్టి రూపీ స్టేజ్ పైకి నాట్యము చేయడానికి పంపించానో వారు ఎలా పాత్రను అభినయిస్తున్నారు. నేను నా దైవీ సంతానానికి గోల్డెన్ మనీ మరియు సిల్వర్ మనీ ఇచ్చి చెప్పాను - ఈ ఆభరణాలను, నగలను ధరించి ప్రసన్నచిత్తులుగా ఉంటూ సాక్షీగా అయి పాత్రను కూడా అభినయించండి మరియు సాక్షీగా అయి ఈ ఆటను కూడా చూడండి, కానీ చిక్కుకోకండి. కానీ అర్ధకల్పము రాజ్య భాగ్యాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ అర్ధకల్పము తాము రచించుకున్న మాయలోనే చిక్కుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, ఈ మాయను విడిచిపెట్టండి. ఈ జ్ఞాన మార్గములో వికారీ కార్యాల నుండి పరివర్తన చెంది నిర్వికారీగా అవ్వడం వలన ఆదిమధ్యాంతాలు దుఃఖము నుండి విముక్తులై జన్మ-జన్మాంతరాల కోసం సుఖాన్ని ప్రాప్తి చేసుకుంటారు.

8. మీ కన్నా ఉన్నతమైన అవస్థ కలవారి ద్వారా ఒకవేళ ఏదైనా అటెన్షన్ లభించినట్లయితే దానిని రహస్యయుక్తముగా అర్థం చేసుకోవడములోనే కళ్యాణము ఉంది. దాని లోపల ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలి. అందులో తప్పకుండా ఏదో కళ్యాణము ఇమిడి ఉంది. ఈ పాయింటు ఏదైతే నాకు వీరి ద్వారా లభించిందో అది పూర్తిగా యథార్థము అని. దానిని ఎంతో సంతోషముగా స్వీకరించాలి, ఎందుకంటే ఒకవేళ నా ద్వారా ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే ఆ పాయింటు గుర్తుకురావడం వలన స్వయాన్ని కరెక్ట్ చేసుకుంటాను. అందుకే ఏ అటెన్షన్ ను అయినా కూడా ఎంతో విశాలమైన బుద్ధితో ధారణ చేసినట్లయితే మీరు ఉన్నతిని ప్రాప్తి చేసుకోగలరు.

9. ఇప్పుడు మీరు నిత్యం అంతర్ముఖులుగా అయి యోగములో ఉండాలి ఎందుకంటే అంతర్ముఖులుగా ఉండడం వలన స్వయాన్ని చూసుకోగలరు. కేవలము చూసుకోవడమే కాదు, పరివర్తన కూడా చేసుకోగలరు. ఇదే సర్వోత్తమ అవస్థ. ప్రతి ఒక్కరూ తమ స్థితి అనుసారముగానే పురుషార్థులుగా ఉన్నారు అని తెలిసినప్పుడు, ఇక ఏ పురుషార్థీ కోసము వాదన నడవకూడదు ఎందుకంటే వారు తమ స్థితి అనుసారముగా పురుషార్థులు, వారి స్థితిని చూస్తూ వారి నుండి గుణాలనే తీసుకోండి, ఒకవేళ వారి నుండి గుణాలను తీసుకోలేకపోతే వదిలేసేయండి.

10. మీరు సదా మీ సర్వోత్తమ లక్ష్యాన్ని ఎదురుగా చూస్తూ స్వయాన్నే చూసుకోండి. మీరు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పురుషార్థులు, మీరు మీపై దృష్టిని పెట్టుకుని ముందుకు పరిగెడుతూ ఉండండి. ఎవరు ఏమైనా చేస్తూ ఉండవచ్చు కానీ నేను నా స్వరూపములో స్థితి అయి ఉండాలి. ఇతరులెవ్వరినీ చూడకూడదు. నేను నా బుద్ధియోగ బలముతో వారి అవస్థను తెలుసుకోవాలి. అంతర్ముఖత యొక్క అవస్థతోనే మీరు అనేక పరీక్షలలో పాస్ అవ్వగలరు. అచ్ఛా. ఓం శాంతి.