31-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మన్మనాభవ డ్రిల్ ను సదా చేస్తూ
ఉన్నట్లయితే 21 జన్మల కొరకు ఆరోగ్యవంతులుగా (నిరోగులుగా) అవుతారు’’
ప్రశ్న:-
సద్గురువు
యొక్క ఏ శ్రీమతాన్ని పాలన చేయడములోనే గుప్తమైన శ్రమ ఉంది?
జవాబు:-
సద్గురువు
యొక్క శ్రీమతము ఏమిటంటే - మధురమైన పిల్లలూ, ఈ దేహాన్ని కూడా మర్చిపోయి నన్ను స్మృతి
చేయండి. స్వయాన్ని కేవలం ఆత్మగా భావించండి. దేహీ-అభిమానులుగా ఉండే పురుషార్థము
చేయండి. అందరికీ ఇదే సందేశాన్ని ఇవ్వండి - అశరీరిగా అవ్వండి, దేహ సహితముగా దేహము
యొక్క అన్ని ధర్మాలను మర్చిపోండి, అప్పుడు మీరు పావనముగా అవుతారు. ఈ శ్రీమతాన్ని
పాలన చేయడములో పిల్లలు గుప్తమైన శ్రమను చేయవలసి ఉంటుంది. అదృష్టవంతులైన పిల్లలే ఈ
గుప్తమైన శ్రమను చేయగలరు.
ఓంశాంతి
తమ సోదరులు మరియు సోదరీలకు డ్రిల్ నేర్పించేందుకని పిల్లలు కూర్చుని ఉన్నారు. ఇది ఏ
డ్రిల్? ఇందులో పిల్లలు ఏమీ మాట్లాడాల్సిన అవసరము ఉండదు. ఎవరైతే దైహిక డ్రిల్స్
మొదలైనవి చేస్తారో, వాటిలో మాట్లాడవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్నది సుప్రీమ్ టీచర్, వీరు
గీతా భగవానుడు కూడా, వీరు కూర్చుని పిల్లలకు యోగము యొక్క డ్రిల్ ను కూడా
నేర్పిస్తారు. ఈ డ్రిల్ కూడా గుప్తమైనది. విద్యార్థులు ఆరోగ్యముగా ఉండాలని డ్రిల్
నేర్పించడము జరుగుతుంది. ఈ మన్మనాభవ డ్రిల్ ద్వారా 21 జన్మల కోసం చాలా
ఆరోగ్యవంతులుగా ఉంటామని, ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వమని పిల్లలైన మీకు తెలుసు. ఇది
ఎంత మంచి ఆత్మిక డ్రిల్. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మన్మనాభవ, ఇందులో
మాట్లాడవలసిన అవసరము కూడా లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి - అని అర్థం
చేయించడము జరుగుతుంది. దేహీ-అభిమాని భవ. భవ అంటే అర్థం - మీరు తండ్రిని స్మృతి
చేసినట్లయితే ఎవర్ హెల్దీగా (సదా ఆరోగ్యవంతులుగా) అయిపోతారు. కల్పక్రితం కూడా మనము
ఈ ఆత్మిక డ్రిల్ ద్వారా ఎవర్ హెల్దీగా అయ్యాము. ఆత్మిక డ్రిల్ ను ఆత్మిక తండ్రి
అయిన పరమపిత పరమాత్మ శివుడే నేర్పిస్తారు. భగవంతుడు అని వారినే అంటారు, వారికే పూజ
కూడా జరుగుతుంది. శివాయ నమః అని కూడా అంటారు కదా. బ్రహ్మా దేవతాయ నమః, శివ
పరమాత్మాయ నమః అని అంటారు. ఈ డ్రిల్ ను దేహధారీ మనుష్యులెవరూ నేర్పించరు. మీరు
బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలుగా పిలవబడతారు, అలాగని ఈ డ్రిల్ మీకు బ్రహ్మా
నేర్పించారని కాదు. ఉత్తరముపై కూడా శివబాబా, కేర్ ఆఫ్ బ్రహ్మా అని వ్రాస్తారు. వారు
గుప్తముగా ఉన్నారని అర్థం. కానీ బ్రహ్మా ప్రజాపిత అని మనుష్యులకు ఎలా తెలుస్తుంది.
ప్రపంచములోని వారంతా వారి (బ్రహ్మా) పిల్లలు. వారు ప్రజాపిత కదా. డ్రిల్
నేర్పించేవారైతే నిరాకార తండ్రి. వారు గుప్తముగా ఉన్నారు. గుప్తముగా ఉన్న కారణముగా
మనుష్యులకు అర్థం చేసుకోవడానికి కూడా కష్టమవుతుంది. బ్రహ్మాను అయితే భగవంతుడని అనరు.
ఇక్కడ బ్రహ్మాకుమారులు, కుమారీలు అనే పేరును చూపిస్తున్నారంటే వీరు బ్రహ్మాకు
సంతానమని అర్థం. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు వారికి - ఈ కొత్త ప్రపంచాన్ని
రచించేవారు బ్రహ్మా కాదు, నిరాకారుడైన తండ్రి అని అర్థం చేయించాలి. వారు బ్రహ్మా
ద్వారా రచనను రచిస్తారు. పారలౌకిక పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా రచిస్తారు అంటే
సుప్రీమ్ సోల్ యొక్క రచన అయినట్లు. పిల్లలైన మీరు ఉత్తరముపై శివబాబా, కేర్ ఆఫ్
బ్రహ్మా అని వ్రాస్తారు, ఇది కూడా స్మృతి చేయడానికి యుక్తి. శివబాబా బ్రహ్మా ద్వారా
నేర్పిస్తారు. వారు మన్మనాభవ అని మాత్రమే చెప్తారు, ఇంకే కష్టము ఇవ్వడము జరగదు. మీరు
మీ ఉన్నతిని కోరుకుంటే మరియు సత్యఖండానికి యజమానులుగా అవ్వాలనుకుంటే, సత్య ఖండాన్ని
స్థాపించేవారైతే ఆ సత్యమైన తండ్రి ఒక్కరే, వారిని స్మృతి చేయండి అని మాత్రమే
చెప్పడము జరుగుతుంది. నన్ను స్మృతి చేస్తే పాపాల నుండి ముక్తులుగా అవుతారని అనంతమైన
తండ్రియే వచ్చి పిల్లలకు చెప్తున్నారు. పరమపిత పరమాత్మను తప్ప శ్రీకృష్ణుడిని
పతిత-పావనుడని అనరు. ఈ విషయములో ఇంకెవరి పేరును తీసుకోరు. వారిని గాడ్ ఫాదర్ అనే
అంటారు. అందరూ వారిని ఫాదర్ అని పిలిచినప్పుడు, వారిని సర్వవ్యాపి అని ఎలా అనగలరు.
వారు విముక్తులుగా చేసేందుకే వస్తారని అంటారు. ఈ విషయము మనుష్యులకు తెలియదు. కల్పము
ఆయువును తప్పుగా వ్రాసేసారు. ఇప్పుడు పిల్లలు ఈ డ్రిల్ చేయాలి. జ్ఞానమైతే లభించి
ఉంది. మీరు కూర్చున్నప్పుడు, స్వయాన్ని దేహీగా భావిస్తూ తండ్రిని స్మృతి
చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. టీచర్ గద్దెపై ఎదురుగా కూర్చుంటే బాగా
అనిపిస్తుంది. నియమమేమిటంటే, డ్రిల్ చేయించేందుకు టీచర్ తప్పకుండా కావాలి. కొందరు
పెద్ద టీచర్లు ఉంటారు, కొందరు చిన్న టీచర్లు ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని
పరీక్షించాల్సిన అవసరము లేదు, ఎందుకంటే - అతి ప్రియమైన తండ్రిని మీరు ఎంత సమయము
స్మృతి చేస్తున్నారనేది మీకే స్వయం తెలుసు. బ్రహ్మా అతి ప్రియమైనవారేమీ కాదు. సదా
పావనమైనవారే అతి ప్రియమైనవారు. అందరికన్నా ప్రియమైనవారు ఎవరు అనేది పిల్లలైన మీకు
తెలుసు. ఓ దుఃఖహర్త-సుఖకర్త, అని మనుష్యులు పరమాత్మనే స్మృతి చేస్తారు. వారిని
ముక్తిప్రదాత అని కూడా అంటారు అనగా దుఃఖాల నుండి విముక్తులుగా చేసేవారు. పిల్లలు తమ
పురుషార్థము చేసుకోవాలి. డ్రామా ప్లాన్ అనుసారముగా ఈ ప్రపంచము తప్పకుండా పావనముగా
అవ్వాల్సిందే మరియు పావన ప్రపంచము తయారవ్వాలంటే నిప్పు అంటుకోవాల్సిందే. నిప్పు ఎలా
అంటుకుంటుందనేది కూడా మీకు తెలుసు. వినాశనమవ్వకుండా ఈ ప్రపంచము పావనముగా తయారవ్వలేదు.
ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. రుద్రుడు అన్నా, శివుడు అన్నా, తేడా ఏమీ లేదు. కానీ శివ అనే
పేరు ముఖ్యమైనది. ఇకపోతే తమ-తమ భాషలలో అనేక పేర్లు పెట్టేసారు. అసలు పేరు శివ.
శివజయంతిని కూడా జరుపుకుంటారు. భారత్ లోనే శివజయంతి ప్రసిద్ధమైనది. అనంతమైన తండ్రి
యొక్క శివజయంతి కావున వారు తప్పకుండా వస్తారు. శివబాబా పేరు ప్రసిద్ధమైనది. వారు
బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపనను చేయించేవారు. ఆ ఉన్నతోన్నతమైన తండ్రిని స్మృతి
చేయాల్సి ఉంటుంది. బ్రహ్మా ఉన్నతోన్నతమైనవారు కాదు. వాస్తవానికి బ్రహ్మా
ఉన్నతోన్నతముగా తయారవుతారు. తర్వాత కిందకు కూడా దిగుతారు. బి.కె.లైన మీరు కూడా కింద
ఉండేవారు, ఇప్పుడు ఉన్నతముగా తయారవుతున్నారు. ఒక్కసారిగా మీరు ఉన్నతమైన తండ్రి
ఇంటికి వెళ్ళిపోతారు. మీరు ఈ సమయములో త్రికాలదర్శులుగా అవుతున్నారు. మనమే స్వదర్శన
చక్రధారులము - అని మీకు స్వయంగా తెలుసు. మనము బ్రహ్మాండము మరియు సృష్టి
ఆదిమధ్యాంతాల గురించి తెలిసినవారము. బ్రహ్మాండము అనగా ఉన్నతమైన స్థానము, అక్కడ
ఆత్మలన్నీ నివసిస్తాయి. మూలవతనములో ఆత్మలుంటాయని అర్థం చేయించేవారు ప్రపంచములో
ఇంకెవ్వరూ లేరు. విశ్వము మరియు బ్రహ్మాండము వేర్వేరు. ఆత్మలు నిర్వాణధామములో ఉంటారు,
దానిని శాంతిధామమని అంటారు. అది అందరికీ ప్రియమనిపిస్తుంది. దాని అసలు పేరు
నిర్వాణధామము లేక శాంతిధామము. ఆత్మ యొక్క స్వరూపము - శాంతి. ఒకటి శాంతిధామము,
తర్వాత మూవీధామము మరియు ఇది టాకీధామము. మూవీధామములో ఎక్కువ సమయము ఉండరు.
శాంతిధామములోనైతే చాలామంది ఉండాల్సి ఉంటుంది, ఇంకే స్థానము లేదు. ఆత్మ తన తండ్రిని
మరియు ఇంటిని స్మృతి చేసినప్పుడు పైన స్మృతి చేస్తుంది. మధ్యలో ఉన్న ధామము గురించైతే
మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మనుష్యులకైతే ఇంత జ్ఞానము లేదు.
బ్రహ్మా-విష్ణు-శంకరులు సూక్ష్మవతనములో ఉంటారని మాత్రమే అంటారు. ఇకపోతే, వారి
కర్తవ్యము గురించి తెలియదు. వారు 84 జన్మలను తీసుకుంటారు. బ్రహ్మా విష్ణువుగా
అవుతారు, విష్ణువు బ్రహ్మాగా అవుతారు. ఇది లీప్ యుగము. ఇది కొంత సమయమే ఉంటుంది.
ఎలాగైతే పురుషోత్తమ మాసమని అంటారో, అలా ఇది మీకు వజ్ర సమానముగా ఉత్తమముగా తయారయ్యే
ఉన్నతమైన జన్మ. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వడము అన్నింటికన్నా ఉత్తమమైనది.
బ్రాహ్మణులుగా అయితే తాతగారి వారసత్వము తీసుకునేందుకు హక్కుదారులుగా అవుతారు.
తండ్రి పిల్లలకు చెప్తున్నారు - పిల్లలూ, సదా మన్మనాభవ. తండ్రి సందేశాన్ని అందరికీ
ఇస్తూ ఉండండి. తండ్రిని సందేశకుడు అని అంటారు, ఇంకెవ్వరూ సందేశకులు కారు.
మిగిలినవారు వచ్చి తమ ధర్మాలను స్థాపన చేస్తారు. సందేశకుడు ఒక్కరు మాత్రమే, వారే
వచ్చి మీకు పవిత్రముగా తయారవ్వాలనే సందేశాన్ని ఇస్తారు. మిగిలినవారు ధర్మ స్థాపన
చేయడానికి వస్తారు. వారెవ్వరూ తిరిగి తీసుకువెళ్ళే మార్గదర్శకులు కారు. సద్గతినిచ్చే
సద్గురువు వారు ఒక్కరే. సత్యము వినిపించేవారు, సత్యమైన మార్గాన్ని తెలియజేసేవారు
ఒక్క పరమపిత పరమాత్మ శివుడే. పిల్లలు చాలా గుప్తమైన శ్రమను చేయాలి. మేము ఈ దేహాన్ని
మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి - అని ఇప్పుడు మీకు తెలుసు. శరీరాన్ని వదిలేసారంటే
ప్రపంచాన్ని అంతా వదిలేస్తారు. ఆత్మ ఒంటరిగా అయిపోతుంది. తండ్రి అంటారు -
దేహీ-అభిమానులుగా అయినట్లయితే ఇక మిత్ర-సంబంధీకులెవరూ గుర్తుకు రారు. నేను ఆత్మను,
నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతాను. మీరు తండ్రి వద్దకు ఎలా వెళ్ళవచ్చు అనే విషయములో
తండ్రి సలహాను ఇస్తారు. ఈ బాబా కూడా ప్రసిద్ధమైనవారే. వీరి ద్వారా తండ్రి
ఆత్మలందరికీ మార్గదర్శకునిగా అయి దోమల గుంపు వలె తిరిగి తీసుకువెళ్తారు. ఈ యథార్థ
జ్ఞానము కేవలం పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది. మిమ్మల్ని పాండవ సైన్యము అని కూడా
అంటారు. పాండవపతి స్వయముగా సాక్షాత్తు పరమపిత పరమాత్మ, వారు కల్పక్రితం వలె
పిల్లలైన మీకు డ్రిల్ నేర్పిస్తున్నారు. వినాశనము జరిగినప్పుడు ఆత్మలన్నీ శరీరాలను
వదిలి వెళ్ళిపోతాయి. సత్యయుగములో కొద్దిమంది ఆత్మలు ఉన్నప్పుడు ఒకే రాజ్యముంటుంది.
ఇప్పుడు అనేక రాజ్యాలు ఉన్నాయి, మళ్ళీ తప్పకుండా ఒకే రాజ్యముంటుంది. ఈ జ్ఞానాన్ని
రోజంతా బుద్ధిలో స్మరణ చేయాలి. పిల్లలు ప్రదర్శనీలలో కూడా అర్థం చేయించాలి. కొత్త
ఢిల్లీ ఉన్నప్పుడు కొత్త భారత్ ఉండేది. ఒకే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది. ఆది
సనాతన ధర్మము హిందూ ధర్మమేమీ కాదు. మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఇది
ఇతర ధర్మాలవారు ఒప్పుకోరు. ఎవరైతే ముందు వస్తారో, వారే 84 జన్మలను తీసుకుంటారు. ఇవి
చాలా సులువుగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు నాటకము పూర్తవుతుంది అని
పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పాత్రధారులందరూ వచ్చేశారు. 84 జన్మలను పూర్తి
చేసుకున్నారు, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే మీరు చాలా అలసిపోయారు కదా.
భక్తి మార్గమంటేనే అలసిపోయే మార్గము. తండ్రి అంటారు - ఇప్పుడు నన్ను స్మృతి చేయండి,
ఇతరులకు కూడా ఈ సందేశాన్ని ఇవ్వండి - దేహ సహితముగా దేహపు ధర్మాలన్నింటినీ వదిలి
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. అశరీరిగా అయినట్లయితే పావనముగా
అవుతారు ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది.
ఇక్కడకు కూడా పిల్లలు తండ్రి సమ్ముఖములో రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. తండ్రి
పిల్లలకు సమ్ముఖముగా అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, దేహాభిమానాన్ని వదిలి
నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. మీరు ఒక్క
తండ్రిని స్మృతి చేసి పవిత్రముగా అయినట్లయితే, పవిత్ర ప్రపంచానికి యజమానులుగా
అవుతారు. ఒకవేళ శ్రమ చేయకపోతే ఫలం కూడా లభించదు. అప్పుడు శిక్షలు అనుభవించాల్సి
ఉంటుంది. తండ్రి అంటారు - మీ సంపాదనను జమ చేసుకుంటూ ఉండండి మరియు ఇతరులకు కూడా
ఆహ్వానము అందించండి. తండ్రిని కలుసుకునే మార్గాన్ని కూడా తెలియజేయండి. పిల్లలైన మీరు
కూడా కళ్యాణకారులుగా అవ్వాలి. మీ మిత్ర-సంబంధీకుల కళ్యాణము కూడా చేయాలి. ఇక్కడ
మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేయడము జరుగుతుంది. మహామంత్రాన్ని ఇస్తారు.
ప్రాచీన యోగాన్ని తండ్రియే వచ్చి నేర్పించారు, దీని గురించే - యోగాగ్నితో పాపాలు
దగ్ధమవుతాయి అని అంటూ ఉంటారు. కల్పక్రితం కూడా ఇదే సూచన లభించింది. తండ్రి సూచనను
ఇస్తున్నారు - మీరు మీ గృహస్థ వ్యవహారములో ఉండండి కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
నన్ను స్మృతి చేయండి. నేను మీ శరణులోకి వచ్చాను అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా
దుఃఖితులు అయినట్లయితే, ఎక్కువ శక్తి కలవారి వద్దకు వెళ్ళి శరణు తీసుకోవడమనేది కూడా
జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అది ప్రాక్టికల్ గా జరుగుతుంది. చాలా దుఃఖము కలుగుతుంటే, ఇక
సహనము చేయలేకపోతే, గత్యంతరము లేదనిపిస్తే, అప్పుడిక పరుగెత్తుకుని వచ్చి తండ్రి శరణు
తీసుకుంటారు. సద్గతినైతే తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. పాత ప్రపంచము
వినాశనమవ్వనున్నదని పిల్లలకు తెలుసు. ఏర్పాట్లు జరుగుతున్నాయి - ఇటువైపు మీ స్థాపనకు
సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి, అటువైపు వినాశనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
స్థాపన జరిగిందంటే వినాశనము కూడా తప్పకుండా జరుగుతుంది. బాబా స్థాపన చేయించేందుకు
వచ్చారు, వారి ద్వారా వారసత్వము కూడా తప్పకుండా లభిస్తుందని మీకు తెలుసు. అంతేకానీ
ప్రేరణతో పనేమీ జరగదు. మీ ప్రేరణతో మేము చదువుకుంటామని టీచర్ తో ఏమైనా అంటారా.
ప్రేరణతోనే ఒకవేళ అంతా జరిగితే, ఇక శివజయంతిని ఎందుకు జరుపుకుంటారు? ప్రేరణతో
చేసినట్లయితే ఇక వారి పేరు మీద శివ జయంతిని జరుపుకోవలసిన అవసరము ఉండదు. జయంతి అయితే
ఆత్మలందరికీ ఉంటుంది. ఆత్మలందరూ శరీరములోకి వస్తారు. ఆత్మ మరియు శరీరము కలిసినప్పుడు
పాత్రను అభినయిస్తారు. ఆత్మ స్వధర్మము శాంతి, ఆత్మలోనే జ్ఞానము ధారణ అవుతుంది.
ఆత్మయే మంచి-చెడు సంస్కారాలను తీసుకువెళ్తుంది. తండ్రి అయితే స్వర్గ రచయిత. అక్కడైతే
పవిత్రతయే ఉంటుంది. అపవిత్రత యొక్క నామ-రూపాలు ఉండవు. ఇది విషయ సాగరము. ఎంత
స్పష్టముగా అర్థం చేయించడం జరుగుతుంది, అయినా కానీ ఎవరి బుద్ధిలోనూ కూర్చోవటము లేదు,
కానీ మీరు ఎవరి పైనా దోషము వేయరు. డ్రామా బంధనములో అందరూ బంధించబడి ఉన్నారు.
మీరు మెట్ల వరుసలో పై నుండి కిందకు దిగుతూ వచ్చారని అర్థం చేసుకుంటారు.
డ్రామానుసారముగా మనము దిగాల్సిందే, ఇప్పుడిక ఎక్కడానికి పురుషార్థము చేయాలి అని
తండ్రి అంటారు. కానీ ఎవరి అదృష్టములోనైతే లేదో, వారు డ్రామానుసారముగా కిందకు
దిగాల్సిందేనని అంటారు. ఎవరైతే ఇలా అంటారో, వారి అదృష్టములో లేదని అర్థమవుతుంది.
2-4 సంవత్సరాలు నడుస్తూ-నడుస్తూ కూడా కింద పడిపోతారు. మేము చాలా పెద్ద పొరపాటు
చేసాము, పెద్ద దెబ్బ తిన్నామని రియలైజ్ అవుతారు కూడా. ఇది కూడా అర్ధకల్పము యొక్క
రోగము, ఇది చిన్న విషయమేమీ కాదు. అర్ధకల్పము బట్టి రోగగ్రస్తులుగా ఉన్నారు. భోగులుగా
అవ్వడముతో రోగులుగా అయిపోతారు. కావున తండ్రి వచ్చి పురుషార్థము చేయిస్తారు.
శ్రీకృష్ణుడిని యోగేశ్వరుడని అంటారు. ఈ సమయములో మీరు సత్యాతి-సత్యమైన యోగులు.
యోగేశ్వరుడు మీకు యోగాన్ని నేర్పిస్తారు. మీరు జ్ఞాన-జ్ఞానేశ్వరులు కూడా, తర్వాత
రాజ-రాజేశ్వరులుగా అవుతారు. జ్ఞానముతో మీరు ధనవంతులుగా అవుతారు, యోగముతో నిరోగులుగా,
సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. అర్ధకల్పము కోసం మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి కావున దీని
కోసం ఎంత పురుషార్థము చేయాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పావనముగా అయ్యేందుకు అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి. ఒక్క తండ్రిని స్మృతి
చేయండి, దేహ సహితముగా అన్నింటినీ మర్చిపోండి అనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి.
2. యోగేశ్వరుడైన తండ్రి నుండి యోగము నేర్చుకుని సత్యాతి-సత్యమైన యోగులుగా అవ్వాలి.
జ్ఞానము ద్వారా ధనవంతులుగా, యోగము ద్వారా నిరోగులుగా, సదా ఆరోగ్యవంతులుగా అవ్వాలి.
వరదానము:-
నిమిత్తముగా ఉన్న ఆత్మల ద్వారా కర్మయోగులుగా అయ్యే వరదానాన్ని
ప్రాప్తి చేసుకునే మాస్టర్ వరదాత భవ
ఎప్పుడైనా ఏదైనా వస్తువును సాకారములో చూస్తే, దానిని
త్వరగా గ్రహించగలరు, అందుకే నిమిత్తముగా ఉన్న శ్రేష్ఠ ఆత్మల సేవ, త్యాగము, స్నేహము,
అందరికీ సహయోగము ఇచ్చే ప్రాక్టికల్ కర్మలను చూసి ఏ ప్రేరణ అయితే లభిస్తుందో, అదే
వరదానముగా అవుతుంది. ఎప్పుడైతే నిమిత్తముగా ఉన్న ఆత్మలను, కర్మలు చేస్తూ ఈ గుణాలను
ధారణ చేయడము చూస్తారో, అప్పుడు సహజముగా కర్మయోగులుగా అయ్యే వరదానము లభిస్తుంది.
ఎవరైతే ఇటువంటి వరదానాలను ప్రాప్తి చేసుకుంటూ ఉంటారో, వారు స్వయము కూడా మాస్టర్
వరదాతలుగా అవుతారు.
స్లోగన్:-
పేరు ఆధారముగా
సేవ చేయడము అనగా ఉన్నత పదవిలో తమ పేరును వెనుకకు చేసుకోవడము.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
పవిత్రతకు గుర్తు -
స్వచ్ఛత, సత్యత. ఒకవేళ మొత్తము రోజంతటిలో లేవటములో కానీ, కూర్చోవటములో కానీ,
మాట్లాడటములో కానీ, సేవ చేయటములో కానీ, స్థూల సేవ చేసినా లేక సూక్ష్మ సేవ చేసినా
కానీ ఒకవేళ విధిపూర్వకముగా చేయకపోతే, విధిలో కూడా ఒకవేళ ఏ కొంచెము తేడా ఉన్నా, అది
కూడా స్వచ్ఛత అనగా పవిత్రత కాదు. ఎవరికైనా దుఃఖమివ్వటాన్ని లేక పాప కర్మలు చేయటాన్ని
మాత్రమే అపవిత్రత అని అనరు కానీ స్వయములో సత్యతను, స్వచ్ఛతను విధిపూర్వకముగా అనుభవము
చేస్తున్నారంటే అప్పుడు పవిత్రముగా ఉన్నారని అర్థం.