31-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ వంటి సౌభాగ్యశాలురు ఇంకెవ్వరూ లేరు, ఎందుకంటే ఏ తండ్రినైతే మొత్తం ప్రపంచమంతా పిలుస్తుందో, వారు మిమ్మల్ని చదివిస్తున్నారు, మీరు వారితో మాట్లాడుతారు’’

ప్రశ్న:-
ఏ పిల్లలకైతే విచార సాగర మంథనము చేయడము వస్తుందో, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-
వారి బుద్ధిలో రోజంతా - అందరికీ మార్గాన్ని ఎలా తెలియజేయాలి, ఎవరి కళ్యాణమునైనా ఎలా చేయాలి అన్న తపనే ఉంటుంది! వారు సేవ కోసం కొత్త-కొత్త ప్లాన్లు తయారుచేస్తూ ఉంటారు. వారి బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా మెదులుతూ ఉంటుంది. వారు తమ సమయాన్ని వృధా చేసుకోరు.

ఓంశాంతి
పిల్లల ఎదురుగా నిరాకారుడైన పరమపిత పరమాత్మ మాట్లాడుతున్నారు, ఇది పిల్లలకు మాత్రమే తెలుసు. భగవంతుడిని ఉన్నతమైనవారని అంటారు. వారి స్థానము ఉన్నతమైనది. వారి నివాస స్థానము ప్రసిద్ధమైనది. మేము మూలవతన నివాసులమని పిల్లలకు తెలుసు. మనుష్యులకు ఈ విషయాలన్నింటి గురించి తెలియదు. గాడ్ ఫాదర్ తెలియజేస్తారు. నిరాకారుడైన భగవంతుడు మాట్లాడుతున్నారని పిల్లలైన మీకు తప్ప ఇతర మనుష్యులెవ్వరికీ తెలియదు. వారు నిరాకారుడైన కారణముగా - భగవానువాచ ఎలా జరుగుతుంది అనేది ఎవ్వరి బుద్ధిలోకీ రాదు. ఈ విషయము తెలియని కారణముగా గీతలో శ్రీకృష్ణుని పేరును వేసేశారు. ఇప్పుడు బాబా పిల్లల ఎదురుగా మాట్లాడుతున్నారు. సమ్ముఖముగా లేకుండా వినలేరు. దూరము నుండి వింటారు కానీ నిశ్చయము ఏర్పడదు. వారు, ఇది భగవానువాచ అని వినడము వింటారు కానీ యథార్థముగా మీకు తెలుసు. భగవంతుడైతే శివబాబా. బాబా మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారని ప్రాక్టికల్ గా మీకు తెలుసు. మీ బుద్ధి వెంటనే పైకి వెళ్ళిపోతుంది. శివబాబా ఉన్నతోన్నతమైన స్థానములో నివసించేవారు. ఎవరైనా గొప్ప వ్యక్తి లేక రాణి మొదలైనవారు వస్తే, వారు ఫలానా స్థానములో ఉంటారు, ఈ సమయములో ఇక్కడకు వచ్చారు అని తెలుస్తుంది, అలా పిల్లలైన మీకు కూడా తెలుసు - బాబా మమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారు, మేము కూడా బాబాతో పాటు తిరిగి వెళ్తాము, మేము పరంధామ నివాసులము అని. మీకు ఇప్పుడు తండ్రి మరియు ఇల్లు గుర్తుకువస్తాయి. ఆ తండ్రియే సృష్టి రచయిత. తండ్రి వచ్చి పిల్లలైన మీకు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము యొక్క రహస్యాలను అర్థం చేయించారు. ఎవరి బుద్ధిలో ఉంటే, వారే అర్థం చేసుకుంటారు. తప్పకుండా మనము భవిష్య 21 జన్మల కోసం, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థము చేస్తున్నాము. పురుషార్థమైతే చేయాల్సిందే. పురుషార్థాన్ని ఎప్పుడూ వదలకూడదు. పరీక్షలు జరిగేంతవరకు మనము తప్పకుండా చదువుకోవాల్సిందేనని స్కూల్లో పిల్లలకు తెలుసు. మేము పెద్ద-పెద్ద పరీక్షలు పాస్ అవుతామని, ఒక కాలేజీని వదిలి రెండవ కాలేజీకి, మూడవ కాలేజీకి వెళ్తామని వారికి లక్ష్యము-ఉద్దేశ్యము ఉంటుంది. అంటే వారు చదువుతూ ఉండాలని అర్థం. పెద్ద వ్యక్తుల పిల్లలైతే, తప్పకుండా పెద్ద పరీక్షలు పాస్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. మనము చాలా పెద్ద తండ్రికి పిల్లలమని మీకు తెలుసు. మనము శివబాబాకు సంతానమని ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మీరు చాలా పెద్ద, ఉన్నతోన్నతమైన తండ్రికి పిల్లలు. చాలా పెద్ద చదువును చదువుకుంటారు. ఇది ఉన్నతోన్నతమైన చదువు అని మీకు తెలుసు. చదివించేవారు తండ్రి కనుక ఎంత ఉల్లాసముగా మరియు సంతోషముగా ఉండాలి. ఈ విషయాన్ని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మనము చాలా గొప్ప తండ్రికి పిల్లలము. చాలా గొప్ప సద్గురువు మతమనుసారముగా మనము నడుచుకుంటాము. టీచర్ మరియు గురువు యొక్క మతమనుసారముగా నడుచుకోవాల్సి ఉంటుంది కదా. వారిని ఫాలోవర్స్ (అనుచరులు) అని అంటారు. ఇక్కడ తండ్రి మతమనుసారముగా కూడా నడుచుకోవాలి, టీచర్ మతమనుసారముగా కూడా నడుచుకోవాలి, అలాగే గురువు మతమనుసారముగా కూడా నడుచుకోవాలి. వారు మనకు తండ్రి, టీచర్, సద్గురువు అని మీకు తెలుసు. వారి మతమనుసారముగా తప్పకుండా నడుచుకోవాలి. వారు ఒక్కరే - ఉన్నతోన్నతమైనవారు శివబాబా, వారు మాట్లాడుతారు.

బాబా పిల్లలను అడుగుతారు - శివబాబా మాట్లాడుతారా? అచ్ఛా, శంకరుడు మాట్లాడుతారా? బ్రహ్మా మాట్లాడుతారా? విష్ణువు మాట్లాడుతారా? (ఎవరో చెప్పారు - శివుడు మరియు బ్రహ్మా మాట్లాడుతారు, విష్ణువు మరియు శంకరుడు మాట్లాడరు అని). విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీ-నారాయణులు అని మీరు అంటారు కదా, మరి వారు మాట్లాడరా? మూగవారా? (జ్ఞానము మాట్లాడరు) నేను జ్ఞానము గురించి అడగడము లేదు, మాట్లాడటము గురించి అడుగుతున్నాను. విష్ణువు, లక్ష్మీ-నారాయణులు మాట్లాడుతారా? శంకరుడు మాట్లాడరు అంటే అది సరే. మిగిలిన ముగ్గురూ ఎందుకు మాట్లాడరు. విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీ-నారాయణులు, అంటే తప్పకుండా మాట్లాడుతారు కదా. శివబాబా నిరాకారుడు కదా, వారెలా మాట్లాడుతారని మనుష్యులు శివబాబా కోసం అనుకుంటూ ఉండవచ్చు. శివబాబా కూడా వీరిలోకి వచ్చి మాట్లాడుతారని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మా కూడా మాట్లాడాల్సి ఉంటుంది. దత్తత తీసుకోబడ్డారు కదా. సన్యాసులు కూడా సన్యాసము తీసుకున్న తర్వాత తమ పేరును మార్చుకుంటారు. మీరు కూడా సన్యసించారు కనుక మీ పేరు కూడా మారాలి. మొదటిలో బాబా పేర్లు పెట్టారు. కానీ ఎవరికైతే పేర్లు పెట్టారో, వారు కూడా చనిపోయారు - ఆశ్చర్యము కలిగేలా వింటారు, వినిపిస్తారు, పారిపోతారు, అందుకే ఎన్ని పేర్లు పెట్టాలి, ఎంతమందికని పెట్టాలి. ఈ రోజుల్లో మాయ కూడా చాలా చురుకుగా ఉంది. బుద్ధి చెప్తుంది - లక్ష్మీ-నారాయణుల రాజ్యమున్నప్పుడు దానిని విష్ణుపురి అని అనేవారు. ఈ లక్ష్యము-ఉద్దేశ్యము బుద్ధిలో ఉంది. విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులు రాజ్యము చేస్తారన్నప్పుడు, వారు ఎందుకు మాట్లాడరు! బాబా ఇక్కడి గురించి చెప్పడము లేదు. నిరాకారుడు ఎలా మాట్లాడుతారని మనుష్యులంటారు. వారికి, నిరాకారుడు ఎలా వస్తారు అనేది తెలియనే తెలియదు. వారిని పతిత-పావనుడు అని అంటారు. వారు జ్ఞానసాగరుడు కూడా, చైతన్యమైనవారు కూడా, ప్రేమసాగరుడు కూడా. ఇప్పుడు ప్రేమ అనేది ప్రేరణ ద్వారా కలగదు, వారు కూడా ఇతనిలోకి ప్రవేశించి పిల్లలను ప్రేమించగలరు కదా, అప్పుడే మేము పరమపిత పరమాత్ముని ఒడిలోకి వచ్చామని అంటారు. బాబా, ఇక మీతోనే తింటాము, మీ నుండే వింటాము... బుద్ధి వారి వైపుకు వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుడు బుద్ధిలోకి రారు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీ వంటి సౌభాగ్యశాలురు ఎవ్వరూ లేరు. మనము ఎంత ఉన్నతమైన పాత్రధారులము అనేది మీకు తెలుసు. ఇది ఆట కదా. ఇంతకుముందు, మీకేమీ తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి ప్రవేశించారు కనుక డ్రామా ప్లాన్ అనుసారముగా వారి ద్వారా వింటున్నారు.

తండ్రి అంటారు - మధురాతి-మధురమైన పిల్లలూ, బాబా నిరాకారుడని మీకు తెలుసు. వారు ఆత్మలైన మనకు తండ్రి. ఈ విషయాలు ఏ శాస్త్రాలు మొదలైనవాటిలో వ్రాసి లేవు. ఇప్పుడు మీ బుద్ధి విశాలముగా అయ్యింది. విద్యార్థులు చదువుకున్నప్పుడు వారి బుద్ధిలోకి మొత్తము చరిత్ర-భౌగోళికాలు వస్తాయి. కానీ, బాబా ఎక్కడున్నారు అనేది ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఈ విషయాన్ని యథార్థముగా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు మరియు ప్రాక్టికల్ గా ఆ సంతోషముంటుంది. బాబా పరంధామము నుండి వస్తారు, మనల్ని చదివిస్తారు. రోజంతా పరస్పరములో ఇదే ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉండాలి. ఈ జ్ఞానము తప్ప మిగిలినవన్నీ సర్వనాశనము చేసే విషయాలు. శరీర నిర్వహణార్థము మీరు వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి కూడా చేయాలి మరియు దానితో పాటు ఈ ఆత్మిక సేవను కూడా చేయాలి.

ఈ భారత్ ఒకప్పుడు స్వర్గముగా ఉండేదని, ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని మీకు తెలుసు. దేవతల చిత్రాలు ఏవైతే ఉన్నాయో, వాటి యథార్థ జ్ఞానము బుద్ధిలోకి వచ్చింది. నంబరువన్ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని తీసుకోండి, ఆలోచించండి - తప్పకుండా వీరు భారత్ లో రాజ్యము చేసేటప్పుడు ఒకే ధర్మముండేది. రాత్రి పూర్తి అయి పగలు ప్రారంభమైంది అనగా కలియుగము పూర్తి అయి సత్యయుగము ప్రారంభమైంది. కలియుగము రాత్రి. సత్యయుగము ఉదయము. వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారని విచార సాగర మంథనము చేయాలి. సాగరములో రాయి వేసినట్లయితే తరంగాలు ఉత్పన్నమవుతాయని అంటారు. అలాగే మీరు కూడా రాయి వేయండి, మనుష్యులకు అర్థం చేయించండి. ఆలోచించండి - భారత్ లో దేవీ-దేవతల రాజ్యముండేది కదా, వారే మళ్ళీ భక్తి మార్గములో మందిరాలను నిర్మించారు, తర్వాత వాటినే దోచుకున్నారు. ఇది నిన్నటి విషయమే. ఇప్పుడు భక్తి మార్గముంది కావున తప్పకుండా దీని తర్వాత జ్ఞాన మార్గముంటుంది. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. తండ్రి కూడా వచ్చి తమ జీవిత కథను తెలియజేస్తారు. ఇది మీకు ఎందుకు గుర్తు రావడము లేదు. బాబా వచ్చి మనకు ఈ పూర్తి జ్ఞానాన్ని వినిపిస్తారు, వివేకము కూడా కావాలి కదా. ఎవరికైనా సరే, ఇవే విషయాలను వినిపించండి. ఈ చిత్రము మీ లక్ష్యము-ఉద్దేశ్యము. ఈ లక్ష్మీ-నారాయణులు అందరికన్నా గొప్ప రాజు-రాణి. భారత్ స్వర్గముగా ఉండేది కదా. ఇది నిన్నటి విషయమే. తర్వాత వీరు ఈ రాజ్య సింహాసనాన్ని ఎలా పోగొట్టుకున్నారు. నా పిల్లలు కూడా ఇదంతా వింటారు కానీ బుద్ధిలో ఎప్పుడూ మెదలదు. బుద్ధిలో గుర్తు కూడా ఉండదు. ఒకవేళ గుర్తుంటే ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. వాస్తవానికి ఇది చాలా సహజము. మీరు ఇక్కడకు లక్ష్మీ-నారాయణుల వలె తయారయ్యేందుకు వస్తారు. ఇది 5000 సంవత్సరాల నాటి విషయమని అర్థం చేయించడము జరిగింది. ఇంతకంటే లాంగ్ లాంగ్ ఎగో (చాలా కాలం క్రితం) అనేది ఇంకేదీ ఉండదు. అన్నింటికన్నా పురాతనమైన భారత్ కథ ఇదే. వాస్తవానికి ఇదే సత్యాతి-సత్యమైన కథ అయి ఉండాలి. అన్నింటికన్నా పెద్ద కథ ఇదే. వీరి రాజ్యముండేది, ఇప్పుడు ఆ రాజ్యము లేదు. ఆ రాజ్యము గురించి కొద్దిగా కూడా ఎవరికీ తెలియదు. మీ బుద్ధిలో నంబరువారుగా మెదులుతూ ఉంటుంది. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి. అది కూడా పూర్తి రీతిలో ఎవ్వరూ స్మృతి చేయరు. తండ్రి బిందువు, నేను కూడా బిందువును, ఇది కూడా బుద్ధిలో నిలవదు. కొందరి బుద్ధిలోనైతే మంచి రీతిలో మెదులుతుంది. ఎవరికైనా కూర్చుని అర్థం చేయించేటప్పుడు 4-5 గంటలు కూడా పడుతుంది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఉదాహరణకు సత్యనారాయణ కథను కూర్చుని వింటారు కదా. ఎవరికైతే అభిరుచి ఉంటుందో, వారు 2-3 గంటలు కూర్చుని వింటారు. ఇక్కడ కూడా - ఎవరికైతే చాలా అభిరుచి ఉంటుందో, వారికి అసలు ఇంకేమీ తోచదు. కేవలం ఈ విషయాలను అర్థం చేసుకోవడములోనే ఆనందము కలుగుతుంది. ఈ విషయాలు బాగా అనిపిస్తాయి. వారు ఈ సేవలోనే నిమగ్నమవ్వాలని, ఇతర వ్యాపార-వ్యవహారాలు మొదలైనవన్నీ వదిలేయాలని భావిస్తారు. కానీ అలాగే ఎవ్వరూ కూర్చుని ఉండిపోకూడదు. పిల్లలైన మీరు ఈ సత్యనారాయణ కథను వింటున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఎంత మంచి విషయాలు తిరుగుతూ ఉంటాయి. మనము ఈ సామాగ్రిని డెలివరీ చేయడానికి ఎవర్రెడీగా ఉన్నాము, సామాగ్రి సదా రెడీగా ఉండాలి. మీరు ఈ చిత్రాన్ని కూడా చూపించి - ఈ లక్ష్మీ-నారాయణులకు ఈ రాజ్యము ఎలా లభించింది, వీరు ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఆ సమయములో సృష్టిలో ఎంతమంది మనుష్యులు ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు - ఇలా ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఏదో ఒక రాయి ఇలా వేస్తూ ఉంటే, విచార సాగర మంథనము జరగగలదు. మన ఈ కులానికి చెందినవారైతే వారికి వెంటనే అల చేరుకుంటుంది. మన కులానికి చెందినవారు కాకపోతే ఏమీ అర్థం చేసుకోరు, వెళ్ళిపోతారు. ఇది నాడిని చూసే విషయము. మీరు ఈ మధురాతి-మధురమైన జ్ఞానము తప్ప ఇంకేమీ మాట్లాడకూడదు. ఒకవేళ జ్ఞానము కాకుండా ఇంకేదైనా మాట్లాడినట్లయితే, అది అసురత్వానికి సంబంధించిందని, అందులో ఏ సారము లేదని భావించండి. మన వద్ద వినాలనే అభిరుచి ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఆసురీ విషయాలను ఎప్పుడూ వినకూడదు, కళ్యాణకారీ విషయాలనే వినండి, లేదంటే అనవసరముగా మిమ్మల్ని మీరు సర్వనాశనము చేసుకుంటారు. తండ్రి వచ్చి మీకు జ్ఞానాన్నే వినిపిస్తారు. సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు - ఇంకే మాటలు మాట్లాడకండి, ఇందులో చాలా సమయాన్ని వృధా చేసుకుంటారు. ఫలానావారు ఇలా ఉన్నారు, వారు ఇలా చేస్తారు... వీటిని ఆసురీ విషయాలని అంటారు. ప్రపంచములోనివారి విషయము వేరు, మీకైతే ఒక్కొక్క క్షణము చాలా విలువైనది. మీరు ఎప్పుడూ అలాంటి మాటలు వినకండి, మాట్లాడకండి. దాని కన్నా మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే, మీకు చాలా సంపాదన ఉంటుంది. అంతటా వెళ్ళి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఈ ఆత్మిక సేవనే చేస్తూ ఉండండి.

సత్యాతి-సత్యమై మహావీరులు మీరే. ఈ మార్గాన్ని ఎవరో ఒకరికి తెలియజేయాలని రోజంతా ఇదే తపన ఉండాలి. తండ్రి అంటారు - భగవంతుడినైన నన్ను స్మృతి చేస్తే రాజ్యాధికార వారసత్వము లభిస్తుంది. ఇది ఎంత సహజము. వెళ్ళి, ఈ విధముగా సేవ చేయాలి. పిల్లలు సేవ పట్ల చాలా అటెన్షన్ పెట్టాలి. స్వయం మరియు ఇతరుల కళ్యాణము చేయాలి. తండ్రి కూడా పిల్లలైన మీకు అర్థం చేయించడానికే వచ్చారు కదా. పిల్లలైన మీరు కూడా చదువుకునేందుకు మరియు చదివించేందుకు వచ్చారు. సమయాన్ని వృధా చేసుకునేందుకు లేక కేవలం రొట్టెలు కాల్చేందుకు రాలేదు. రోజంతా బుద్ధిలో సేవ గురించి ఆలోచిస్తూ ఉండాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విషయాలైతే మనకు అవసరం లేదో, వాటిని వినడములో మరియు మాట్లాడటములో తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఎంత వీలైతే అంత చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి.

2. మనల్ని చదివించేవారు ఎవరు అని సదా ఈ సంతోషములో మరియు ఉల్లాసములో ఉండాలి. పురుషార్థాన్ని ఎప్పుడూ వదలకూడదు. నోటి నుండి జ్ఞాన రత్నాలే వెలువడాలి.

వరదానము:-
తెలివైనవారిగా అయ్యి మూడు రకాల సేవలను కలిపి ఒకేసారి చేసే సఫలతామూర్త భవ

వర్తమాన సమయము అనుసారముగా మనసా, వాచా మరియు కర్మణా, ఈ మూడు రకాల సేవలు కలిపి ఒకేసారి జరగాలి. వాణి మరియు కర్మతో పాటు మనసా శుభ సంకల్పాలు మరియు శ్రేష్ఠ వృత్తి ద్వారా సేవ చేస్తూ ఉండండి, అప్పుడు ఫలము ఫలీభూతమవుతుంది ఎందుకంటే వాణిలో శక్తి ఎప్పుడు వస్తుందంటే, మనసు శక్తిశాలిగా ఉన్నప్పుడు, లేకపోతే మాట్లాడే పండితునిలా అవుతారు ఎందుకంటే చిలుక వలె చదివి రిపీట్ చేస్తూ ఉంటారు. జ్ఞానీ అంటే తెలివైనవారు అంటే మూడు రకాల సేవలను కలిపి ఒకేసారి చేస్తారు మరియు సఫలతా వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారు.

స్లోగన్:-
మీ ప్రతి మాట, కర్మ మరియు దృష్టితో ప్రతి ఆత్మకు శాంతిని, శక్తిని మరియు సంతోషాన్ని అనుభవం చేయించడమే మహాన్ ఆత్మల మహానత.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

ఏ విధముగా హోమియోపతి మెడిసిన్ లో చిన్న-చిన్న మాత్రలు ఎంత పెద్ద వ్యాధినైనా అంతం చేస్తాయో, అదే విధముగా మాస్టర్ సర్వశక్తివంతులైన మీరు మీ వృత్తి మరియు దృష్టి ద్వారా ఎవరిలోని కఠిన సంస్కారాలనే వ్యాధినైనా అంతం చేయగలరు. ఏ విధముగా ఆ మెడిసిన్ - వ్యాధిని ఎలా అంతం చేయాలి అని అనదో, అదే విధముగా పరోపకారి ఆత్మలైన మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి సర్వాత్మల పతిత సంకల్పాలను మరియు వృత్తులను భస్మము చేసే సేవ చేయండి, అపకారులకు కూడా ఉపకారము చేయండి.